చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష

US Man Sentenced For 100 Years Over Indian Origin Girls Death - Sakshi

ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్‌ గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్‌ నుంచి బుల్లెట్‌ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే...ష్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్‌ లీ స్మిత్‌ అనే వ్యక్తి సూపర్‌ 8 లగర్జీ హోట్‌లోని పార్కింగ్‌ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్‌ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్‌ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్‌ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్‌ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది.

దీంతో స్మిత్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్‌ని విమల​, స్నేహల్‌ పటేల్‌ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్‌ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తమ కూతరు మాయా పటేల్‌, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో  కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్‌ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది.

అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్‌కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. 

(చదవండి: క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top