యుద్ధనౌకలో టాయిలెట్‌ కష్టాలు | Toilet Trouble In US Largest Warship | Sakshi
Sakshi News home page

యుద్ధనౌకలో టాయిలెట్‌ కష్టాలు

Feb 25 2026 6:19 AM | Updated on Feb 25 2026 6:19 AM

Toilet Trouble In US Largest Warship

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ విమాన వాహననౌకలో పనిచేయని టాయిలెట్లు

5,000 నావికులను పట్టిపీడిస్తున్న కొత్త సమస్య 

రోజూ రిపేర్లతోనే గడిపేస్తున్న మెయింటెనెన్స్‌ సిబ్బంది 

8 నెలలుగా సముద్రంలోనే ఉండటంతో 

మానసికంగా కుంగిపోయిన సెయిలర్లు

వాషింగ్టన్‌: యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధవిమాన వాహననౌక. అమెరికా అమ్ములపొదిలోని శక్తివంతమైన సముద్ర ఆయుధంగా దీనికి పేరుంది. గత 8 నెలలుగా సముద్రజలాల్లో విధుల్లో పాల్గొంటూ వెనెజువెలాలో మదురోపై మెరుపుదాడి చేసిన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ బాధ్యతలను నిర్వర్తించిన ఘనత జెరాల్డ్‌ యుద్ధనౌకదే. వెనెజువెలా మొదలు ఇరాన్‌ దాకా పలు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ నౌక ఇప్పుడు సొంత సిబ్బందికీ సమస్యలు తెచి్చపెడుతోంది. 8 నెలలుగా సముద్రంలో ఎలాంటి పూర్తిస్థాయి మెయింటెన్స్‌లేకపోవడంతో ఇందులోని టాయిలెట్, మురుగునీటి పారుదల వ్యవస్థలు దాదాపు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో నౌకలోని 650 టాయిలెట్లు పనిచేయకుండా పోయాయి.

ఫ్లష్‌ విధానంలో పనిచేసే అధునాతన టాయిలెట్లు తరచూ మొరాయిస్తుండటంతో నిర్వహణ సిబ్బంది రోజుకు దాదాపు 19 గంటలు వీటిని మరమత్తుచేయడంలో మునిగిపోతున్నారు. దీంతో నౌకలోని దాదాపు 5,000 మంది సిబ్బంది కాలకృత్యాల కోసం క్యూ వరసల్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. యుద్ధరంగంలో శత్రువుకు ఎదురు నిలబడాల్సిన సెయిలర్లు ఇలా టాయిలెట్ల వద్ద నిలబడి తమ వంతు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందులో విధులు నిర్వర్తించలేక తిరుగుపయనమైన కొందరు నావికులను ఇంటర్వ్యూచేసి ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంస్థ ఒక సమగ్ర కథనాన్ని వెలువర్చింది. అణువిద్యుత్‌తో పనిచేసే ఈ యుద్ధనౌక అమెరికా విదేశాల్లో సముద్రజలాల వేదికగా జరిపే దాడులకు గుండెకాయగా ఉంటోంది.  

బ్లాకేజీలు.. లీకేజీలు.. 
గత షెడ్యూల్‌కు మించి ఏకంగా ఎనిమిది నెలలుగా నౌకాశ్రయానికి రాకుండా అంతర్జాతీయ సముద్రజలాల్లోనే ఉండిపోవడంతో మెయింటెన్స్‌ అనేది లేకుండా పోయింది. దీంతో నౌకలోని మురుగునీటి పారుదల వ్యవస్థ దాదాపు విఫలమైంది. నౌకలోని అత్యధిక స్థలాన్ని యుద్ధ ఆయుధాలు, అనుబంధ వ్యవస్థల కోసం కేటాయించి టాయిలెట్లను ఇరుకైన ప్రాంతాల్లో చిన్నగా నిర్మించారు. ఇది కూడా సీవేజ్‌ వ్యవస్థ వైఫల్యానికి మరో కారణమని చెబుతున్నారు. ఇది నావికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని, పలువురు ఉద్యోగాలకు రాజీనామా చేసి అమెరికాకు తిరిగొచ్చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొండిగా మరి కొన్ని నెలలపాటు నౌకను సముద్రంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ఇంకా మొదలుకాలేదు. యుద్ధం ఆరంభమైతే ఈ నౌక నుంచే ఎఫ్‌–18 యుద్ధవిమానాలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

కీలకమైన మిషన్‌ కావడంతో నౌకను ఇప్పట్లో వెనక్కి తీసుకొచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. దీంతో ఇంకెంతకాలం నౌకలో ఉండిపోవాలనే బాధ నావికుల్లో గూడుకట్టుకుపోయిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. పశ్చిమాసియాలో పాగా వేసిన యుద్దనౌకలోని టాయిలెట్‌ వ్యవస్థను సరిచేసేందుకు సాంకేతిక నిపుణులు రోజుకు 19 గంటలు నిరాటంకంగా పనిచేయాల్సివస్తోంది. కొన్ని చోట్ల బ్లాకేజీలు ఉంటే మరికొన్ని చోట్ల లీకేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. టీ–షర్ట్‌లు మొదలు నాలుగు అడుగుల తాడుసహా ప్రతిదానితో లీకేజీలను అడ్డుకోవడానికి ప్రయతి్నస్తున్నారు.  

గతంలోనూ ఇదే తీరు
నౌకలో టాయిలెట్‌ సమస్య గతంలోనూ వెలుగుచూసింది. గత ఏడాది మార్చిలో నాలుగు రోజుల వ్యవధిలోనే 205 టాయిలెట్లు పనిచేయకుండా చేతులెత్తేశాయి. వాక్యుమ్‌ ఆధారిత వ్యవస్థపై ఈ టాయిలెట్లు పనిచేస్తున్నాయి. అంటే ఒక వాల్‌్వలో ఏదైనా సమస్య వస్తే దానితో అనుసంధానమైన టాయిలెట్లు అన్నీ పనిచేయకుండా పోతాయి. దీంతో సమస్య శృంఖల చర్యల పెరుగుతూపోయి మరింత పెద్దదవుతుంది. వాల్‌్వలోపల కాల్షియం పేరుకుపోవడంతో ఈ సమస్య దాపురించిందని టెక్నీíÙయన్లు చెప్పారు. సన్నటి పైపులు ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. సమస్యకు చెక్‌పెట్టేందుకు ప్రతిసారి యాసిడ్‌ ద్రావకాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది.

ప్రతిసారీ యాసిడ్‌ కోసం ఏకంగా రూ.3.63 కోట్లు ఖర్చుచేస్తున్నారు. సెయిలర్లలో అత్యధికులు 20 ఏళ్లలోపు వాళ్లే. శాంతికాలంలో ఇలాంటి యుద్దనౌకలో గరిష్టంగా ఐదారు నెలలకుమించి సముద్రజలాల్లో ఉండవు. కానీ ఇప్పుడు ఎలాంటి యుద్ధం లేకపోయినా ఎనిమిది నెలలుగా పశి్చమాసియా సముద్రజలాల్లో కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో నావికుల మనోధైర్యం దెబ్బతింటోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చివరకు బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోతున్నామని పలువురు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.

ఇంత జరుగుతున్నా ట్రంప్‌ మాత్రం తనదైన శైలిలో స్పందించినట్లు తెలుస్తోంది. ‘‘ఇంతకంటే పెద్ద సమస్యలు దేశానికి ఉన్నాయి. వాటి సంగతి చూడాలి’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ నౌకను ఏకంగా రూ.1.18 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ నౌకతోపాటు మరో యుద్ధవిమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌నూ అమెరికా రంగంలోకి దింపింది. వీటితోపాటు తొమ్మిది డి్రస్టాయర్‌ నౌకలు, మూడు లిట్లోరల్‌ యుద్ధనౌకలు పశి్చమాసియాలో మొహరించాయి. ఇన్నేసి నౌకలను అమెరికా పశి్చమాసియాలో మొహరించడం అత్యంత అరుదైన విషయమని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement