18 ఏళ్లు దాటితే సైన్యంలోకి.. కువైట్‌ కీలక నిర్ణయం | Kuwaiti law requires men over 18 to serve in the military | Sakshi
Sakshi News home page

18 ఏళ్లు దాటితే సైన్యంలోకి.. కువైట్‌ కీలక నిర్ణయం

Feb 24 2026 5:51 PM | Updated on Feb 24 2026 6:00 PM

Kuwaiti law requires men over 18 to serve in the military

కువైట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు  ఆ దేశ మిలటరీలో సేవ చేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. 2012 జనవరి 1 తర్వాత జన్నించిన వారికి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది.

2015లో వచ్చిన సైనిక చట్ట సవరణలో కువైట్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు దేశ మిలటరీలో పనిచేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. అయితే కుటుంబంలో ఒకే కుమారుడు ఉంటే సైన్యంలో కాకుండా ఇతర ప్రభుత్వ రంగాలలో విధులు నిర్వహించవచ్చని తెలిపింది. కొత్తగా చేసిన సైనిక చట్ట సవరణలో రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది.

సైనిక సేవ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నాలుగు విభాగాల్లో మోహరిస్తున్నట్లు తెలిపింది. కువైట్ సాయుధ దళాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ నేషనల్ గార్డ్‌, కువైట్ అగ్నిమాపక దళాలలో యువత సేవలందించాలని పేర్కొంది.2015 చట్టంలోని లోపాలను అధిగమించడానికే ఈ నిబంధనలు తీసుకవచ్చినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.

 ఇజ్రాయెల్ , దక్షిణ కొరియా, సింగపూర్ ,స్విట్జర్లాండ్  ఫిన్లాండ్ తో పాటు మరికొన్ని దేశాల్లో 18 ఏళ్లు దాటిన యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి మరికొన్ని దేశాల్లో మహిళలు సైతం సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement