టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారంటూ సాగుతున్న ప్రచారం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రతిపక్ష సాయుధ ముఠా ‘పీపుల్స్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్’ (ఎంఈకే) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సోమవారం నాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయం ‘మొతాహరి కాంప్లెక్స్’పై తమ సభ్యులు సాయుధ దాడికి పాల్పడ్డారని ఆ సంస్థ వెల్లడించింది.
సుమారు 100 మంది ఫైటర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని, ఈ భీకర పోరులో ఇరాన్ ప్రభుత్వ బలగాలకు భారీ ప్రాణనష్టం వాటిల్లడంతో పాటు, తమ వైపు కూడా ప్రాణనష్టం సంభవించిందని ఎంఈఎక్స్ పేర్కొంది. మరోవైపు ఈ దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో మొతాహరి కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా అంబులెన్సులు మోహరించాయని, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లు సైబర్ దాడికి గురై, ఖమేనీకి వ్యతిరేకంగా సందేశాలు ప్రసారమయ్యాయనే ప్రచారం జరుగుతోంది.
🟥#فوری
شهادت و دستگیری ۱۰۰ مجاهد
ستاد فرماندهی #مجاهدین در داخل کشور اعلام کرد از بامداد روز دوشنبه ۴ اسفند تا بعدازظهر دوشنبه در سلسلهای از درگیریها با نیروهای رژیم که از بیتالعنکبوت #خامنهای در هنگام اذان صبح آغاز شد، بیش از ۱۰۰ مجاهد شهید یا دستگیر شدهاند.
تلفات دشمن… pic.twitter.com/Y2vvjofKTh— سازمان مجاهدین خلق ایران (@PMOIRAN) February 23, 2026
అయితే ఈ వాదనలపై అటు ఇరాన్ అధికారిక మీడియా గానీ, ఇటు అంతర్జాతీయ స్వతంత్ర సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఖమేనీ ఆరోగ్య పరిస్థితి, మృతిపై వస్తున్న వార్తలను ధ్రువీకరించే ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ అధికార యంత్రాంగంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఎంఈకే చరిత్రను పరిశీలిస్తే గతంలోనూ ఇలాంటి సంచలన ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
BBC Persia: The People's Mujahedin of Iran has claimed that on Monday, they carried out an armed attack on Khamenei's residence. The atmosphere around there today was described as tense by many eyewitnesses, but it wasn't clear why. pic.twitter.com/3SkMA6n43G
— World Source News (@Worldsource24) February 24, 2026
1965లో స్థాపితమైన ఈ సంస్థ 1979 విప్లవంలో పాల్గొన్నప్పటికీ, తదనంతరం ప్రస్తుత నాయకత్వంతో విభేదించి, ప్రవాసంలో ఉంటూ పోరాటం కొనసాగిస్తోంది. ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెంటగాన్ అధికారులు సమర్పించిన సైనిక ప్రణాళికల్లో ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకునే ‘అస్సాసినేషన్’ (హత్య) ప్లాన్ కూడా ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు యుద్ధ మేఘాలకు దారితీస్తాయేమోనన్న అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: శశికళ సంచలన ప్రకటన


