అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్‌కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి.
🇺🇸🇮🇷 NEW:
According to Axios, one option under consideration by President Donald Trump involves a potential targeted strike on Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei and his son, described as a limited military option.
Source: Axios pic.twitter.com/5GJKpAtNVn— WAR (@warsurv) February 21, 2026
ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీ గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు.. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇక, ఓ వైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది.


