మోదీ నిర్ణయం తప్పే.. టారిఫ్‌ల రద్దుపై కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు | US Supreme Court Ruling On Tariffs, Congress Slams Modi Government For Hasty Trade Deal With America | Sakshi
Sakshi News home page

మోదీ నిర్ణయం తప్పే.. టారిఫ్‌ల రద్దుపై కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 21 2026 9:28 AM | Updated on Feb 21 2026 11:18 AM

Congress Leaders Reaction On US Tariff Issue

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు యూఎస్‌ సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్‌.. పలు దేశాలపై విధించిన అధిక టారిఫ్‌లను తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. ఈ క్రమంలో ఇటీవల భారత్‌, అమెరికా చేసుక్ను వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడుతున్నారు. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాగా, అమెరికా విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత భారత​్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికాతో ఏకపక్ష, భారత వ్యతిరేక వాణిజ్య ఒప్పందం చేసేందుకు కేంద్రం తొందరపడిందని ఆరోపించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్‌ నేతలు సోషల్‌ మీడియా వేదికగా మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలు కూడా చేశారు.

మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?: సుర్జేవాలా
అమెరికాతో కుదిరిన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత రణదీప్​ సుర్జేవాల్ అన్నారు. అమెరికా కొత్తగా ప్రతిపాదించిన సుంకాల స్థిరత్వం, భారత్‌పై వాటి వర్తింపును ప్రశ్నించారు. 1977లో అమల్లోకి వచ్చిన ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి టారిఫ్‌లు విధించే అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122, 1962 ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232, 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌లు భారత్‌కు వర్తించవని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సుంకాలు భారత్‌పై చట్టబద్ధంగా అమలవుతాయా? అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం నిలబడుతుందా? రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ఇంధన, డేటా నిపుణులు, ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ఈ ఒప్పందం నుంచి బయటకు రావడానికి మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?' అని ప్రశ్నించారు.

 

సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్, 1974) ప్రకారం 150 రోజులపాటు మాత్రమే 10శాతం టారిఫ్ విధించవచ్చని సుర్జేవాలా తెలిపారు. తరువాత అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరమని, ఇది తాత్కాలిక చర్య మాత్రమే అని అన్నారు. ఇక సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్, 1962) జాతీయ భద్రతా కారణాలతో మాత్రమే టారిఫ్ విధించాలని పేర్కొన్నారు. 270 రోజుల్లో అమెరికా వాణిజ్య శాఖ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. భారత ఎగుమతులు జాతీయ భద్రతకు ముప్పు కాదని వివరించారు. అలాగే సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్, 1974) సంబంధిత దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరించిందని దర్యాప్తు ద్వారా నిరూపించాలని చెప్పారు. భారత్‌పై అలాంటి దర్యాప్తు జరగలేదని ఆయన వివరించారు. ఇప్పుడు జాతీయ ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం సిద్ధమా? అంటూ ప్రశ్నలు సంధించారు.

మోదీ రాజీ పడ్డారు: పవన్‌ ఖేడా
మరో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా సోషల్‌ మీడియా వేదికగా..‘అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేసింది. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌కు అర్థరాత్రి కాల్ ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ప్రకటనలే కారణమా? జెఫ్రీ ఎఫ్‌స్టీన్స్‌ ఫైళ్ల ప్రభావమా? గౌతమ్ అదానీకి సంబంధించిన అమెరికా క్రిమినల్ కేసా? లేక ఇవన్నీ కారణాలా? ఈ రోజు కాంగ్రెస్ వాదన నిజమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారు' అని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement