ఉండి టీడీపీలో వర్గపోరు.. వెంకటేశ్వర రాజు ఇల్లు, ఆఫీసు కూల్చివేత | Internal Issues In Kutami, TDP Leader Venkateshwar Raju House And Office Demolish At Undi Constituency | Sakshi
Sakshi News home page

ఉండి టీడీపీలో వర్గపోరు.. వెంకటేశ్వర రాజు ఇల్లు, ఆఫీసు కూల్చివేత

Feb 21 2026 10:37 AM | Updated on Feb 21 2026 12:03 PM

TDP Leader Venkateshwar Raju House Demolish At Undi Constituency

సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దౌర్జన్య కాండపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తురి వెంకటేశ్వర రాజు (బొడ్డియ్య రాజు) ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల మేరకు.. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలో వెంకటేశ్వర రాజు పార్టీ ఆఫీసు, ఇంటిని సర్వే చేసి కూల్చేస్తామంటూ నిన్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే ఆయన ఇల్లు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పోలీసులతో మొహరించి జేసీబీలతో అధికారులు కూల్చేశారు. అయితే, పొత్తూరి వెంకటేశ్వర రాజుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో భీమవరం నీలాద్రి ఆస్పత్రిలో చేరారు. దీంతో, పోలీసులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement