అజిత్‌ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు’ | Rammohan Naidu Should Resign: Rohit Pawar | Sakshi
Sakshi News home page

అజిత్‌ విమాన ప్రమాదం: ‘వారంతా కుమ్మక్కయ్యారు’

Feb 21 2026 11:31 AM | Updated on Feb 21 2026 12:41 PM

Rammohan Naidu Should Resign: Rohit Pawar

ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెంటనే రాజీనామా చేయాలని  ఎన్సీపీ (శరద్‌పవార్‌) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అజిత్‌ పవార్‌కు మోదీ, అమిత్‌ షా న్యాయం చేయాలన్నారు. విమానంలో పెట్రోల్‌ క్యాన్లు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. దీని వల్లే విమానం మంటల్లో చిక్కుకుందన్నారు.

‘‘విమానంలో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్‌ నింపారు. కుట్రపూరితంగానే ఎక్కువ ఫ్యూయల్‌ నింపినట్లు మాకు అనుమానం. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి’’ అని రోహిత్‌  పవార్‌ పేర్కొన్నారు.

వీఎస్‌ఆర్‌ ట్రావెల్స్‌ వెనుక ఎవరున్నారో బయటకురావాలి. వీఎస్‌ఆర్‌ కంపెనీ మేనేజర్‌ వీకే సింగ్‌ను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?. పైలెట్‌ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు మాకు తెలుస్తోంది. డీజీసీఏలోని కొంతమంది ఉన్నతాధికారులు వీఎస్‌ఆర్‌ ట్రావెల్స్‌తో కుమ్మక్కయ్యారు. బ్లాక్‌ బాక్స్‌ కాలిపోయిందని చెప్పడం కూడా  పూర్తి అబద్ధం. రామ్మోహన్‌నాయుడు పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేస్తారు’’ అంటూ రోహిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

‘‘అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్ కుట్ర ఉంది. వీఎస్‌ఆర్ కంపెనీ వెనుక డీజీ సీఏ పెద్ద అధికారి హస్తం ఉంది. కేంద్ర విమానయాన  శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వీఎస్‌ఆర్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. వీఎస్ఆర్ కంపెనీను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. టీడీపీ మంత్రి నుంచి రాజీనామా తీసుకోవాలి. ఈ కేసులో నిజం బయట పెట్టేందుకు మోదీ, అమిత్ షా జోక్యం చేసుకోవాలి.

..అవసరానికి మించి ఇంధనం ఇందులో నింపారు. విమానంలో పెట్రోల్ క్యాన్స్ పెట్టారు. వీఎస్‌ఆర్ కంపెనీకి రామ్మోహన్‌నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో శ్వేత సింగ్ దర్యాప్తును తప్పు దోవ పట్టిస్తున్నారు. బ్లాక్ బాక్స్ సీవీఆర్ పూర్తిగా తగలబడిందని చెప్పడం అబద్ధం. రామ్మోహన్‌నాయుడు ఈ పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. వీఎస్‌ఆర్‌ ఓనర్ వీకే సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

వీఎస్‌ఆర్‌ కంపెనీ నిర్వహణలో అనేక అవకతవకలు ఉన్నాయి. వీఎస్‌ఆర్‌ కంపెనీలో మహిళా పైలెట్లపై వేధింపులు జరిగాయి. అనేక అవకతవకలు జరుగుతున్నా డీజీసీఏ పట్టించుకోలేదు. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా వీఎస్‌ఆర్‌ ఆపరేషన్స్ మాత్రం యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిజాలను సమాధి చేసేందుకు బ్లాక్ బాక్స్ తగలబడిందని చెపుతున్నారు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ.. 2025​కు 500 కోట్లకు చేరింది. కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్‌ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోహిత్ సింగ్‌కు డీజీసీఏ ఎందుకు మద్దతు ఇస్తుంది’’ అంటూ రోహిత్‌ పవార్‌ నిలదీశారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement