breaking news
Ajit Pawar
-
అజిత్ పవార్ ప్రమాదం వెనుక టీడీపీ!
-
ఒక్కరోజే 75 ఫైల్స్ క్లియర్.. అజిత్ మృతి రోజున ఏం జరిగింది?
ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్ పవార్ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్ పవార్ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్‌తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్ పవార్ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
అజిత్ పవార్ విమాన ఘటన.. మళ్లీ తెరపైకి ‘టేబుల్‌టాప్ రన్‌వే’
ఒక్క చిన్న పొరపాటు… పెద్ద ప్రమాదానికి దారి.” అనే మాట నిజంగానే విమాన ప్రయాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగిన బారామతిలో టేబుల్‌టాప్ రన్‌వే ఉంది. కొండలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన ప్రదేశంలో నిర్మించే రన్‌వేలను టేబుల్‌టాప్ రన్వేలు అంటారు. ఇవి సాధారణ రన్‌వేల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టంగా మారుతుంది.మంగళూరు ఎయిర్పోర్ట్ కూడా టేబుల్‌టాప్ రన్‌వేతోనే ఉంది. 2010లో అక్కడ ఒక విమానం రన్‌వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2020లో కోజికోడ్‌లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వే దాటి 35 అడుగుల లోతులో పడిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ఘటనలో 21 మంది మరణించారు. ఈ సంఘటనలు టేబుల్‌టాప్ రన్‌వేల ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.ఇక భూటాన్‌లోని పారో ఎయిర్పోర్ట్ చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. దీనిని ప్రపంచంలోనే అత్యంత డైంజరస్ ఎయిర్ పోర్ట్ గా భావిస్తారు. ఇక్కడ ల్యాండ్ కావాలంటే పైలట్లు పర్వతాల మధ్య నుంచి పదునైన కోణాల్లో విమానం నడపాలి. అందుకే అన్ని విమానాలకు అనుమతి ఉండదు. అలాగే నేపాల్‌లోని టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 527 మీటర్ల చిన్న రన్‌వే మాత్రమే ఉంది. రెండు వైపులా కొండలు ఉండటంతో ల్యాండింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది.ఇలాంటివి ప్రపంచంలో ఇంకా కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ అంటే పైలట్లకు పెద్ద సవాలు. అనుభవం ఉన్న పైలట్లు కూడా ప్రతిసారీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా పైలట్ల చాకచక్యంతోనే చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి. కానీ పర్వతాలు, సముద్రాలు లేదా చిన్న రన్వేలు ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అలాంటి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రతి ల్యాండింగ్ ఒక పరీక్షలాంటిదే. -
అజిత్ పవార్ సతీమణి తొలిప్రసంగం.. ఏమన్నారంటే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో ఆమె సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె తొలిప్రసంగం చేశారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సునేత్రా పవార్ మాట్లాడుతూ" దాదా అకాల మరణం నాకు వ్యక్తిగతంగా దుఃఖాన్ని కలిగించడమే కాకుండా మహారాష్ట్ర మెుత్తాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన నాకిచ్చిన కర్తవ్యనిష్ఠ, పోరాటంలో బలం, ప్రజల పట్ల నిజాయితీగల నిబద్ధతే నాకు నిజమైన పునాదులు" అని ఆమె అన్నారు. తన దుఃఖాన్ని దిగమింగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడమే తన లక్షంగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.రైతులు, మహిళలు, యువత, కార్మికుల కోసం దాదా ఎంతో సేవ చేశారని తాను కూడా ఆ పరంపరను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఇంతటి కష్ట సమయంలో మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతు తన అసలైన బలం అని తెలిపింద ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, మహాత్మా పూలే, అంబేద్కర్ భావజాలాల పట్ల విధేయతతో ఉంటానని సనేత్ర పవార్ తెలిపింది.అయితే ఇటీవల బారమతికి ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా అజిత్ పవార్ పయణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్‌తో పాటు అందులో పయణిస్తున్న వారందరూ మృతిచెందారు. -
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగాసునేత్ర ప్రమాణం
ముంబై/బారామతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ముంబైలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డుకెక్కారు. అంతకుముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఉదయం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) శాసనసభాపక్షం సమావేశమైంది. సునేత్ర పవార్‌ను తమ నేతగా ఎన్నుకుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. సునేత్ర ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, ఛగన్ భుజబల్ తదితరులు హాజరయ్యారు. సునేత్ర చిన్నకుమారుడు జయ్ పవార్, ఆయన భార్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ‘అజిత్ దాదా అమర్ రహే’అంటూ నినాదాలు చేశారు. సునేత్ర పవార్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సునేత్ర పవార్‌కు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆమె భర్త నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సునేత్ర ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఛత్రపతి శివాజీ, సాహూ, ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలే తనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ అభినందనలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సునేత్ర పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్టుచేశారు. దివంగత నేత అజిత్ పవార్ ఆశయాలను సునేత్ర నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఆ సంగతి నాకు తెలియదు: శరద్ పవార్ సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సంగతి తనకు ముందుగా తెలియదని ఎన్సీపీ(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం గురించి ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. ఎన్సీపీ(అజిత్ పవార్)లో అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం బారామతిలో మీడియాతో మాట్లాడారు. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని అజిత్ పవార్ కోరుకున్నట్లు తెలిపారు. విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాలని అజిత్ పవార్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు పార్టీలు కలిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారని స్పష్టంచేశారు. అది సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. -
ఆ విషయం సునేత్ర కూడా చెప్పలేదు: శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. పేపర్లో ఓ వార్త చూశా. అందులో ప్రఫుల్ పటేల్, సునీల్ టాటాకరే.. ఇలా ఇతరుల పేర్లే కనిపించాయి. ఆమె డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడుతోందనే విషయం నాకు తెలియదు. ఆమె నాతో కూడా ఆ మాట చెప్పలేదు. బీజేపీ కూటమితోనే కొనసాగాలని ఆమె భావిస్తుందని మేం అనుకోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనిపై నేను, మా వర్గం ఎలాంటి చర్చా జరపలేదు. బహుశా ఆమె పార్టీనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొచ్చు.రెండు వర్గాల విలీనంపై స్పందిస్తూ.. గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు నడుస్తున్నాయన్నారు. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్‌లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. జనవరి 17న విలీనంపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నాం. విలీనం సమయంలోనే ఇది ఊహించని పరిణామం అని అజిత్ పవార్ మృతిని ఉద్దేశించి అన్నారు. అయితే.. ఆయన(అజిత్ పవార్) కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 2023 జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) వర్గం రెండుగా చీలింది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలలో.. 40 మందితో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరారు. ఆ తర్వాత అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీ గుర్తింపు దక్కింది. దీంతో శరద్ పవార్ తన వర్గానికి ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ కూటమి అని పేరు పెట్టారు. 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. పవర్ షేరింగ్‌లో భాగంగా.. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే.. జనవరి 28వ తేదీన తన నియోజకవర్గం బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో అజిత్ పవార్(66) మరణించారు. దీంతో ఈమధ్యలో జరిగిన ఎన్సీపీ వర్గ విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో.. ఆయన వర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము గౌరవిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఎన్సీపీ వర్గం ఆమెను శనివారం లెజిస్టేచర్ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆపై ఇవాళ సాయంత్రం ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది. మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోవింద్‌బాగ్‌లో పవార్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్ తనయుడు రోహిత్ పవార్ హాజరయ్యారు. అయితే ఇది కుటుంబ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం అనే ప్రచారం జరుగుతునప్పటికీ.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళే ఈ భేటీ జరగడం రాజకీయ చర్చా అనే అనుమానాలకు తావిస్తోంది. -
మహారాష్ట్ర రాజకీయం.. అజిత్ కుమారుడికి బంపరాఫర్!
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్ కుమారుడు పార్థ్ పవార్‌కు బంపరాఫర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్ పవార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.సునేత్ర రికార్డుమహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. -
మహా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్
ముంబై: మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె శనివారమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త స్థానంలో సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం. శనివారం ఉదయం ముంబైలో తమ పార్టీ సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సునేత్ర పవార్‌కు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యరి్థగా పోటీ చేశారు. కానీ, ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అనంతరం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలు కాదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉభయ ఎన్సీపీలు ఏకం కాబోతున్నాయని, దీనిపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. -
Sunetra Pawar: డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది. -
దివంగత అజిత్ పవార్ కోసం ఎన్సీపీ కార్యకర్త ఏం చేశాడంటే!
విమాన ప్రమాదంలో పవార్ ఆకస్మిక మరణం తర్వాత బారామతికి వచ్చిన విలాస్ ఝోడపే గురువారం బారామతిలోని నీరా నది ఒడ్డున తన తలనీలాలు సమర్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.పలు నివేదికల ప్రకారం నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాకు చెందిన పార్టీ కార్యకర్త, అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు తన జుట్టు కత్తిరించుకోనని ప్రతిజ్ఞ చేశారు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగింది. నాయకుడిపై తనకున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన ఏడాదికి పైగా జుట్టు కత్తిరించుకోలేదు. కానీ దాదా అకాల మరణంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.ఝోడపే నాగ్‌పూర్‌లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల సమయంలో అజిత్ పవార్‌ను కలిశారు. ఆ సీనియర్ నాయకుడు అతని పొడవాటి జుట్టును గమనించి, నాయకులకు ఇలాంటి రాజకీయ బలం, మద్దతు అవసరమని చెప్పారు. అలాగే ప్రజా సేవ,పార్టీ సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పవార్ అతన్ని ప్రోత్సహించేవారు.Ajit Pawar’s Demise Leaves Umred’s Vilas Zhodape HeartbrokenAjit Pawar’s untimely demise has come as a severe shock to Vilas Zhodape of Umred, who dedicated his life to public service under Dada’s guidance. He had taken a vow not to cut his hair until Ajit Pawar became Chief… pic.twitter.com/qTQYqIYibQ— Pune Mirror (@ThePuneMirror) January 30, 2026 జనవరి 28వ తేదీ ఉదయం పవార్‌ను కలవడానికి ఝోడపే ముంబైకి చేరుకున్నారు, అదే సమయంలో ఘోర విమాన ప్రమాదం వార్త వెలువడింది. పవార్ అకాల మరణంతో ఆ ప్రతిజ్ఞ నెరవేరలేదు.ఇంతలోనే అజిత్ పవార్ ఆకస్మికమరణం ఆయనను కలిచి వేసింది తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతను వెంటనే బారామతికి బయలుదేరాడు. నాగ్‌పూర్‌లోని తన భార్యకు, ఇద్దరు పిల్లలకు సమాచారం ఇచ్చి వారిని కూడా రమ్మని చెప్పాడు. అలా ఆ కుటుంబం పవార్ అంత్యక్రియలకు హాజరైంది.తలనీలాలుఅంత్యక్రియల తర్వాత, ఝోడపే నీరా నది వద్ద తలనీలాలు సమర్పించి, దీన్ని పవార్ స్మృతికి అంకితం చేశారు. స్థానికులతో మాట్లాడుతూ, తాను ఎవరి కోసం ఈ ప్రతిజ్ఞ చేశానో ఆ వ్యక్తి ఇప్పుడు మనతో లేరు. ఇక్కడ నా తలనీలాలు సమర్పించడం ద్వారా, నేను ఈ త్యాగాన్ని అజిత్ దాదా వారసత్వానికి అర్పిస్తున్నాను అంటూ భవోద్వాగానికి లోనయ్యాడు.అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్, సుమిత్కపూర్, కెప్టెన్ సాహిల్ మదన్, కోపైలట్, శంభవి పాఠక్‌తో సహా మరో నలుగురు కూడా మరణించారు.ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలాఅజిత్ పవార్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ప్రకటించిన ముఖ్యమంత్రి మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అధికార లాంఛనాలతో డిప్యూటీ సీఎం అంత్యక్రియలను నిర్వహించారు. పవార్‌కు తుది నివాళులర్పిందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రజలు . సీనియర్ నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు దివంగత అజిత్ పవార్ అస్థికలను సోన్‌గావ్‌లో కర్హా మరియు నీరా నదుల సంగమంలో నిమజ్జనం చేశారు. కుమారులు పార్థ్ పవార్ ,జయ పవార్ ఈ క్రతువులను నిర్వహించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.#WATCH | Baramati | Maharashtra Deputy CM late Ajit Pawar's ashes were immersed in Songaon at the confluence (sangam) of the Karha and Nira rivers. Parth Pawar and Jay Pawar, sons of Maharashtra Deputy CM late Ajit Pawar, performed rituals. Sunetra Pawar, wife of Maharashtra… pic.twitter.com/SBrcUyWiST— ANI (@ANI) January 30, 2026 -
మహారాష్ట్రలో ట్విస్ట్.. బీజేపీకి ఎన్సీపీ కొత్త డిమాండ్
ముంబై: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, దివంగత అజిత్ పవర్ భార్య సునేత్రకు తక్షణం మహారాష్ట్ర కేబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఎన్సీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీలతో ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించాలని ఆ పార్టీ ముఖ్యలు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.విలీనంపై మొదలైన గుసగుసలు బాబాయితో విబేధించి ఎన్సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ లేకపోవడంతో ఇకపై పవార్ సారథ్యంలోని పార్టీని శరద్‌పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనంచేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అజిత్ వర్గం నేతలు ఇందుకు మొగ్గుచూపుతున్నారు. ‘‘ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుక నడవాలని నేతలంతా భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ)తో మా పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోంది. ఇకమీదటా శాశ్వతంగా కలిసే ఉంటాయి’’ అని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నరహరి జిర్వాల్ అన్నారు.‘‘పవార్ల కుటుంబాలు ఒక్కటవ్వాలి. ఎన్సీపీ(ఎస్పీ), ఎన్సీపీలు కలిసిపోవడమే ఉత్తమం’’అని ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, ప్రమోద్ హిందూరావ్ అభిప్రాయపడ్డారు. అయితే సునేత్రకు పార్టీ పట్టంకట్టే అంశం ఇంత త్వరగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత, ఆహార, పౌరసరఫరాల మంత్రి ఛగన్ భుజ్‌బల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ సమ్మతితోనే పార్టీల విలీనం సాధ్యమని ఎన్సీపీ(ఎప్పీ) నేత ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. -
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు
-
పెద్దాయన చక్రం తిప్పుతారా?
విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో గురువారం అధికార లాంఛనాలతో ముగిశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రితేశ్ దేశ్‌ముఖ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు సజల నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మరాఠా రాజకీయాల్లో అజిత్ పవార్ శకం శాశ్వతంగా ముగిసిసోయింది.విలీనానికి బ్రేక్అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీలో రెండు గ్రూపుల పునరేకీకరణకు బ్రేక్ పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబాయ్- అబ్బాయ్ వర్గాలు కలిసిపోతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ పోరుతో ఈ రెండు గ్రూపులు చేతులు కలిపాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. తన నాయకత్వంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ) కలిసికట్టుగా పోటీ చేస్తాయని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ కుటుంబం మళ్లీ ఏకమైందని అన్నారు.పింప్రి- చించ్వాడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 84 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించింది. ఎన్సీపీ ద్యయం 37 స్థానాలకే పరిమితమైంది. శివసేన 7, ఇతరులు 5 చోట్ల గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ 77, ఎన్సీపీ 35 స్థానాలు విజయం సాధించాయి. ఎన్సీపీలోని రెండు గ్రూపులు చేతులు కలిపినా పింప్రి- చించ్వాడ్లో కమలం పార్టీని ఓడించలేకపోయాయి. అయితే పవార్ కుటుంబం (Pawar Pariwar) మళ్లీ ఏకం కావడం ఎన్సీపీ మద్దతుదారుల్లో ఉత్సాహం నింపింది. మళ్లీ రెండు గ్రూపులు కలిసిపోతాయన్న ఆశాభావం వ్యక్తమైంది. అనూహ్యంగా అజిత్ పవార్ మరణించడంతో ప్రస్తుతానికి దీనికి బ్రేక్ పడిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.''ఎన్సీపీలోని రెండు గ్రూపుల పునరేకీకరణకు సంబంధించిన చర్చలు పవార్ కుటుంబ సభ్యులకే పరిమితం. ఇరు వర్గాల సీనియర్ నాయకులతో కలిసి పునరేకీకరణకు అవసరమైన ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. అజిత్ పవార్ అకాల మరణంతో పునరేకీకరణ ప్రక్రియ కొద్దిరోజులు ఆగిపోతుంది. ఎన్సీపీకి కొత్త అధినేత వచ్చాక మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కే అవకాశముంద''ని అజిత్ పవార్ సన్నిహితుడొకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో అన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అజిత్ సతీమణి సునేత్రకు (Sunetra Pawar) పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది.పట్టుసాధిస్తారా?రాజకీయాల్లో మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఎన్సీపీ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పార్టీ అధినేత ఎంపికలో 'పెద్దాయన' కీలకపాత్ర పోషించే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆయన ఎవరివైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి నెలకొంది. తన కుమార్తె సుప్రియ సూలేను (Supriya Sule) తెరపైకి తెస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీలో రెండు వర్గాలను ఏకం చేసేందుకు ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. అలాగే రెండు కుటుంబాల మధ్య గ్యాప్‌ను తగ్గించడంలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీ మాత్రం అజిత్ రాజకీయ వారసురాలిగా ఆయన సతీమణి సునేత్రను ఎంపిక చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్దాయన మళ్లీ పార్టీపై పట్టుసాధిస్తారా, లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.చదవండి: ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్! -
విమాన ప్రమాదం ఎలా జరిగిందో చూడండి..
-
అధికారిక లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు
-
ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్!
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు ఎవరికి?.. పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణంతో ఎన్సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. అజిత్ వర్గం ఎన్సీపీ చీలకుండా.. బీజేపీ పక్కా వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పార్టీ బాధ్యతల విషయంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.ఇక, మహారాష్ట్రలో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే.. శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి ఎన్సీపీ పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి.ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్వాడ్లో ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా, రెండు వర్గాల మధ్య ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సూలే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు.అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్‌లో పార్థ్ పవార్‌కు మంచి గుర్తింపు ఉంది.ధనంజయ్ ముండేఅజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ఎన్సీపీ వ్యవస్థాపక నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఒకరు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.బీజేపీ వ్యూహమేంటి?మరోవైపు.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. భవిష్యత్‌లో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశం ఉందని.. వారిలో కొందరు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీనిని ఊహించిన బీజేపీ.. అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కుచెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాబినెట్లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బీజేపీ ఇప్పటికీ షిండే సేనతో సంప్రదించాల్సి ఉంటుంది. -
అజిత్ పవార్ అంత్యక్రియలు.. ప్రత్యక్ష ప్రసారం
-
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ముంబై: ఎన్సీపీ నేత, దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే, మహారాష్ట్రకు చెందిన నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అజిత్ పవార్ మృతికి మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతకు ముందు.. అజిత్ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కట్టారు. ఆపై కటేవాడిలో కాసేపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర నడిచింది. దారి పొడవునా అల్విదా అజిత్ దాదా నినాదాలు హోరెత్తాయి. హఠాన్మరణంమహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన సొంత నియోజక వర్గం బారామతిలో జరగబోయే ప్రచార సభలకు బుధవారం ఉదయం అజిత్ పవార్ చార్టెడ్ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే ల్యాండింగ్ చివరి నిమిషంలో విమానం అదుపు తప్పి సమీపంలోని గోజుబావి గ్రామ సమీంలోని గుట్టల్లో కూలిపోయింది.బండ రాయిని విమానం బలంగా ఢీ కొట్టి రెండు ముక్కులై.. పేలి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పైలెట్లు, ఫ్లైట్ అటెండెంట్ మొత్తం ఐదుగురు మరణించారు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. అయితే చేతి వాచీ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అజిత్ పవార్‌తో పాటు ప్రమాదంలో మరణించిన మిగతా వాళ్ల మృతదేహాలకు ఈ ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. దీంతో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బంధువులు మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించారు.ఈ ఘటనపై ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau.. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఘటనా స్థలం నుంచి పలు ఆధారాలు సేకరించింది. బ్లాక్ బాక్స్‌ను రికవరీ చేసుకుని డీ కోడింగ్ చేసుకునే పనిలో ఉంది. నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇచ్చింది. -
అల్విదా..‘దాదా’
సాక్షి ముంబై: శరద్ పవార్ సోదరుడి కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడిన అజిత్ పవార్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే తనదైన ముద్ర వేసుకున్నారు. 1982లో కోఆపరేటీవ్ చక్కెర ఫ్యాక్టరీ బోర్డుతో కార్యదర్శిగా, కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే మహావికాస్ ఆఘాడిలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన అజిత్ 2023లో శరద్‌పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీ, శివసేన (శిందే)ల మహాయుతి కూటమిలో చేరారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకముందే బుధవారం తన స్వంత నియోజకవర్గం బారామతి వద్ద జరిగిన విమానప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన జీవితంలోని విశేషాల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాల వివరాలివీ.. బాల్యం.. రాష్ట్ర ప్రజలంతా దాదా (అన్నా)గా ముద్దుగా పిలుచుకునే అజిత్ పవార్ 1959, జులై 22న అహిల్యనగర్ (అహ్మద్‌నగర్) దేవలాలి ప్రవరాలో జని్మంచారు. ఎన్సీపీ (ఎస్పీ)అ«ధ్యక్షుడు శరద్ పవార్ అన్న, అజిత్ పవార్ తండ్రి అనంత్‌రావ్ పవార్ సినిమా రంగంలో పనిచేసేవారు. పవార్ తాత గోవింద్‌రావ్ పవార్ బారామతి సహకారి వ్యాపారం, ఆయన అమ్మమ్మ, తాతలు వ్యవసాయం చేసేవారు. ఇక అజిత్ పవార్ అన్న శ్రీనివాస్ పవార్ అగ్రికల్చర్, అటోమొబైల్ రంగంలో ఉన్నారు. పెరిగి పెద్దయ్యాక తాను తీసుకునే అనేక కీలక నిర్ణయాల్లో అన్న శ్రీనివాస్ సలహా తీసుకునేవారు అజిత్ పవార్. విద్యాభ్యాసం అజిత్ పవార్ బారామతిలోని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం కొల్హాపూర్‌లోని శివాజీ విద్యాపీఠం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత మాజీ మంత్రి పద్మసింహ్ పాటిల్ చెల్లెలు సునేత్ర పవార్‌ను వివాహం చేసుకున్నారు. అజిత్ పవార్, సునేత్ర పవార్ దంపతులకు జయ్ పవార్, పార్థ్ పవార్ అనే ఇద్దరు కుమారులున్నారు. 1982లో రాజకీయ రంగ ప్రవేశం.. 1982లో సహకార చక్కె కర్మాగారం బోర్డు ఎన్నికల ద్వారా అజిత్ పవార్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే అంతకన్నా ముందు అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించినట్టు ఓ ఛానెల్ ఇంటర్యూలో ఆయన స్వయంగా పేర్కొన్నారు. సహకార చక్కెర కార్మగారం బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన 1991లో పుణే జిల్లా సహకారి బ్యాంకు (పిడిసి) అధ్యక్షునిగా సుమారు 16 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. 1991లో బారామతి ఎంపీగా ఎన్నిక.. 1991లో మొట్టమొదటిసారిగా ఆయన బారామతి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే తన బాబాయి శరద్ పవార్ కోసం అజిత్ పవార్ తన పార్లమెంటు నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. దీంతో ఎంపీగా ఎన్నికైన శరద్ పవార్ దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ. నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి... 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్‌పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన 1995, 1999, 2004, 2009, 2014, 2019, 2023 వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా రికార్డు.. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరు సార్లు చేపట్టారు. ఇలా అత్యధికంగా ఉపముఖ్యమంత్రి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2010 నవంబరు 11వ తేదీన మొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత 2012, సెపె్టంబరు 25న ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో పృ«థ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం మూడు నెలల కాలవ్యవధిలోనే చవాన్ నేతృత్వంలో మళ్లీ 2012, డిసెంబరు ఏడో తేదీన రెండవసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ప్రభుత్వం గడువు ముగిసేవరకు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగారు. అలాగే 2019 నవంబరు 23వ తేదీన మూడోసారి ఆయన చేసిన ప్రమాణ స్వీకారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ప్రమాణ స్వీకారం మూడు రోజుల్లోనే బెడిసి కొట్టింది. ఆ తరువాత ఆయన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో 2019, డిసెంబరు 30న నాలుగోసారి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక అయిదవ సారి 2023 జులైలో, ఆరవసారి 2024, డిసెంబరు అయిదవ తేదీన ఉపముఖ్యమంత్రి పదవులు స్వీకరించారు. పనితీరు..సమయ పాలనతో ప్రత్యేక గుర్తింపు అజిత్ పవార్ పనితీరు, సమయపాలనతోపాటు నిర్మొహమాట వైఖరి ఇతర రాజకీయ నేతలకు ఆయన్ను భిన్నంగా నిలిపింది. సాధారణ కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయం తీసుకోవడం, అది పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోకపోవడం ఆయనకు అలవాటు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి మృతి చెందే రోజు వరకూ ఈ అలవాటును వీడలేదు అజిత్ పవార్. -
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు! శరద్ పవార్ ఏమన్నారంటే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాన్మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా విపక్ష నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసింది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ రాజకీయ శ్రేణులను కోరారాయన.అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్న శరద్ పవార్.. ఓ సమర్థుడైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేం.. కానీ, ప్రతిదీ మన చేతుల్లో లేదు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులోకి రాజకీయాలు తీసుకురావద్దు. ఇది పూర్తిగా ప్రమాదమే. ఈ ఘటన నాతోపాటు రాష్ట్రం మొత్తానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దు అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరోవైపు..తన సోదరుడి అకాల మరణంతో తీవ్ర షాక్‌కు గురయ్యానని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్‌తో కలిసి మృతదేహాన్ని తరలించిన బారామతి ఆసుపత్రికి సుప్రియ కూడా వెళ్లారు.చివరి ట్వీట్ చెబుతోందిగా..అధికార మహాయుతి కూటమిలో తన ఎన్సీపీ వర్గంలో భాగమైన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎం హోదాలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలతో తిరిగి చిన్నాన్న శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నాడని.. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం పలు అనుమానాలు రేకెత్తిస్తోందని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని మమతా బెనర్జీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సారథి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రకటనలు చేశారు. అయితే..అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన వేళ చివరిసారిగా ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ.. రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు. దీంతో.. ఆ అనుమానాలకు చెక్ పడినట్లైంది. आपल्या विश्वासू राज्य सरकारनं आजच्या मंत्रिमंडळाच्या बैठकीत घेतलेले काही महत्त्वपूर्ण निर्णय :✅ औद्योगिक प्रशिक्षण संस्थामध्ये 'पीएम सेतू' योजना राबविण्यात येणार. होतकरू युवकांना दिलासा. पहिल्या टप्प्यात नागपूर, छत्रपती संभाजीनगर आणि पुणे जिल्ह्यातील औद्योगिक प्रशिक्षण…— Ajit Pawar (@AjitPawarSpeaks) January 27, 2026 -
నెరవేరని ‘సీఎం’ కల
అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో శిఖర సమానుడైన చిన్నాన్న శరద్ పవార్ నీడను దాటుకుని అంచెలంచెలుగా ఎదిగిన నేత. నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పు తూ వచ్చారు. ఆయన రాజకీయ అడుగు లన్నీ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతూ వచ్చాయి. కానీ రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రి కాగలిగినా, ‘సీఎం’ కల మాత్రం నెరవేరకుండానే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన బారామతి గడ్డ మీదే తుది శ్వాస విడిచారు. కష్టించే స్వభావం అజిత్ సొంతం. ముఖ్యంగా సమయ పాలనకు పెట్టింది పేరు. ఆయన తండ్రి అనంత్‌రావ్ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌కు అన్న. 22 ఏళ్ల వయసులో చక్కెర సహకార బోర్డు సభ్యునిగా 1982లో అజిత్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కొంతకాలానికే చిన్నాన్న శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఏకంగా 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్‌ను వీడి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించాక ఆ పార్టీలో అజిత్ కీలక నేతగా ఎదిగారు. సీఎం కావాలన్న తన అభిలాషను ఎప్పుడూ దాచు కోలేదు. పలుమార్లు ఎన్సీపీకి మెజార్టీ అసెంబ్లీ స్థానాలు దక్కినా కాంగ్రెస్‌కు సీఎం పదవి అప్పగించడాన్ని పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించారు. 2019లోనే చిన్నాన్నతో విభేదించి బీజేపీతో చేతులు కలిపినా ఫడ్నవీస్ సారథ్యంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొద్ది గంటల్లోనే కూలిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరారు. 2022లో మరోసారి శరద్ పవార్‌పై తిరగుబావుటా ఎగరేయడమే గాక ఎన్సీపీని రెండుగా చీల్చారు. బీజేపీతో చేతులు కలిపి అధికార మహాయుతి సంకీర్ణంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. -
విమాన ప్రమాదంలో... అజిత్ పవార్ దుర్మరణం
బారామతి/ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా లోని పవార్ స్వస్థలమైన బారామతిలో బుధవారం ఉదయం విమానాశ్రయంలో దిగేందుకు కొద్ది క్షణాల ముందు రన్‌వేకు కేవలం 100 అడుగుల దూరంలో ఈ దారుణం జరిగింది. రన్‌వే కన్పించకపోవడంతో మరో రౌండ్ చుట్టి తిరిగి వచ్చే క్రమంలో విమానం అదుపు తప్పింది. క్షణాల వ్యవధిలోనే శరవేగంగా కింద పడిపోయింది. నేలను ఢీకొట్టగానే మంటలు చెలరేగి పేలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు ముక్కలైంది. దాంతో పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్ కెపె్టన్ సుమిత్ కపూర్, కో పైలట్ కెపె్టన్ శాంభవీ పాఠక్, పవార్ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ ఉన్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే అజిత్‌తో పాటు అందరూ ప్రాణాలు కోల్పోయారు. అజిత్‌ను ఆయన కళ్లద్దాలు, చేతి వాచీ సాయంతో గుర్తించారు. ఆయనతో పాటు మిగతా నలుగురి మృతదేహాలను బారామతి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే అజిత్ కుటుంబీకులతో పాటు ఆయన పార్టీ ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వారి శోకంతో ఆ పరిసరాల్లో విషాదం నెలకొంది. మహారాష్ట్ర అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని పలువురు నేతలు తదితరులు ది్రగ్భాంతి వెలిబుచ్చారు. పారీ్టలకు అతీతంగా సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ఒక గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ అంత్యక్రియలు ఆయన రాజకీయ కర్మభూమి అయిన బారామతిలో గురువారం ఉదయం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొనే అవకాశముంది. మహా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 దాకా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన బారామతి చేరు కుని అజిత్ కుటుంబీకులను ఓదార్చారు. ‘‘జరిగింది నమ్మశక్యం కాని ఘోరం. మంచి మిత్రున్ని కోల్పోయాను’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ మృతితో తాను పెద్దన్నయ్యను కోల్పోయానంటూ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటన్నారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలు. వారికి కుమారులు పార్్థ, జై ఉన్నారు. 66 ఏళ్ల అజిత్ మృతితో మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహా యుతి అధికార కూటమిలో భారీ శూన్యమే ఏర్పడింది. అంతేగాక ఆయన సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.ఆ చివరి క్షణాలు... జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పుణెలో నాలుగు ప్రచార ర్యాలీల్లో పాల్గొనే నిమిత్తం అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి విమానంలో బారామతి బయల్దేరారు. అది వీఎస్ఆర్ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 9 సీట్ల సామర్థ్యమున్న చిన్న లియర్‌జెట్–45 మోడల్ విమానం. ప్రమాదం జరిగిన తీరును పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ‘‘విమానం ఉదయం 8.10 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరింది. 8.18కి విమానం బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలోకి వచి్చంది. గాలి తీవ్రత ఏమీ లేదని, 3 కి.మీ. దాకా స్పష్టమైన విజిబిలిటీ ఉందని పైలట్‌కు ఏటీసీ సిబ్బంది తెలిపారు. 8.40కల్లా విమానం బారామతి విమానాశ్రయాన్ని సమీపించి లాండింగ్‌కు సిద్ధమైంది. బారామతి విమానాశ్రయం ‘అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్’. ఇలాంటి విమానాశ్రయాల్లో ఏటీసీ టవర్ ఉండదు. దాంతో దృశ్యమానత తదితరాల ఆధారంగా పైలట్లే తమ విచక్షణ మేరకు లాండింగ్ చేస్తారు. వారికి ఎయిర్ ట్రాఫిక్ సమాచారాన్ని అందజేయడంలో స్థానిక విమానయాన శిక్షణ సంస్థల పైలట్లు, ఇన్స్ట్రక్టర్లు సాయపడుతూ ఉంటారు. 8.40 గంటలకు రన్‌వే 11పై విమానం లాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది. గాలి వేగం, దృశ్యమానత (విజిబిలిటీ) ఎలా ఉన్నాయని ఏటీసీ ఆరా తీయగా రన్‌వే కన్పించడం లేదని పైలట్ చెప్పారు. లాండింగ్ ప్రయత్నం మానుకుని ‘గో అరౌండ్’ప్రక్రియను అనుసరించి విమానం గాల్లోనే మరో రౌండ్ తిరిగింది. ఆ తర్వాత కూడా రన్‌వే కన్పించడం లేదని పైలట్ తెలిపారు. అది కన్పించాక కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత కొద్ది సెకన్లకే రన్‌వే కని్పస్తున్నట్టు చెప్పారు. దాంతో ఉదయం 8.43 గంటలకు రన్‌వే 11పై లాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది. కానీ ఏటీసీ లాండింగ్ సందేశానికి విమాన సిబ్బంది నుంచి ‘రీడ్‌బ్యాక్’ఏమీ రాలేదు. ఏటీసీ సందేశాన్ని పైలట్/కో పైలట్ తిరిగి విన్పించడమే రీడ్‌బ్యాక్. తర్వాత కాసేపటికే, అంటే 8.44 గంటలకు విమానం రన్‌వే కొసకు ఎడమవైపున కుప్పకూలి మంటల్లో చిక్కింది. దాంతో హుటాహుటిన ఎమర్జెన్సీ సరీ్వసులను ఘటనా స్థలికి తరలించారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. అజిత్‌తో పాటు విమానంలోని వారంతా దుర్మరణం పాలయ్యారు’’అని ప్రకటన పేర్కొంది. విమానం నేరుగా నేలపై బండరాయిని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. అందుకే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సమాచారం. ప్రమాదానికి ముందు ఆపదలో ఉన్నట్టు తెలిపే ‘మే డే’కాల్ ఏదీ పైలట్ నుంచి రాలేదని డీజీసీఏ స్పష్టం చేసింది.అటూ ఇటూ ఊగింది ప్రత్యక్ష సాక్షులు విమానం కుప్పకూలేందుకు కొద్దిసేపటి ముందు అదుపు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విమానాశ్రయాన్ని సమీపించి కిందిదాకా వచ్చిన అనంతరం లాండ్ అవడానికి బదులుగా విమానం మరోసారి రౌండ్ కొట్టిందని ఒక మహిళ తెలిపారు. ‘‘ఆ వెంటనే విమానం అటూ ఇటూ ఊగుతూ వేగంగా కిందివైపు దూసుకొచి్చంది. అదే ఊపులో నేలను తాకి పేలిపోయింది’’అని ఆమె చెప్పుకొచ్చారు. పేలుడు శబ్దాలు సుదూరాల దాకా విని్పంచాయన్నారు. పేలుడు తీవ్రతకు విమాన శకలాలు గాల్లో సుదూరాల దాకా ఎగిరి సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద పడ్డట్టు మరికొందరు తెలిపారు. విమానం కుప్పకూలాక వరుసగా నాలుగైదు పేలుళ్లు విన్పించినట్టు వివరించారు. తర్వాత కాసేపటికి దగ్గరికి వెళ్లి మృతులను గుర్తించి అంబులెన్సుల్లోకి చేర్చినట్టు వారు చెప్పారు. తర్వాత కాసేపటికే అగి్నమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అజిత్‌తో పాటు విమానంలోని ఐదుగురినీ వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పీ సందీప్‌సింగ్ గిల్ చెప్పారు. -
విమాన ప్రమాదంలో కుట్ర? శరద్ పవార్ ఏమన్నారంటే
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించాయి. తాజాగా దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయకూడదన్నారు.ఈ రోజు జరిగిన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం మహాయుతి కూటమి నుండి అజిత్ పవార్ ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. కనుక ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ విమాన ప్రమాదంపై అనుమానం చేసింది. పారదర్శకమైన విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.శరద్ పవార్ మాట్లాడుతూ.. "ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్రలేదు. ఇదిపూర్తిగా ప్రమాదం అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడు నేడు మనల్ని విడిచిపెట్టి వెళ్లారు. అంతా మనచేతుల్లో లేదు. నేను నిస్సహాయంగా భావిస్తున్నాను. కొన్ని సంఘటనల వెనుక రాజకీయాలుండవు." అని శరద్ పవార్ అన్నారు. కాగా 2023లో ఎన్సీపీ నుంచి బయిటకి వచ్చి బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. -
‘పప్పా.. నేను అజిత్ పవార్‌తో వెళ్తున్నాను’.. పింకీ మాలి చివరి మాటలు ఇవే..!
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు ముందు విమాన సిబ్బంది పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ..ప్రయాణానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ, ‘పప్పా, నేను అజిత్ పవార్‌తో బారామతి వెళ్తున్నాను. ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాందేడ్‌కి వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం’ అని చెప్పింది. ఆ మాటలు ఆమె తండ్రికి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.పింకీ మాలీ మరణంపై ఆమె తండ్రి శివకుమార్ మాలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కూతురు ఫోన్ చేస్తే మాట్లాడాను. చివరిగా.. ‘రేపు నీ పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని అన్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాలేదు. తన కూతురు ఇక లేరని తెలుసుకున్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.ఆయన మాట్లాడుతూ..‘నేను ఆమెతో రేపు మాట్లాడతానని అనుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. నా కూతురు నాకు దూరమైపోయింది. ఆమె ఇటీవల అజిత్ పవార్‌తో అనేక ప్రయాణాల్లో పాల్గొనేది. నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. నాకు టెక్నికల్ విషయాలపై అవగాహన లేదు. నేను పూర్తిగా కుంగిపోయాను. నాకు కావలసింది ఒక్కటే. నా కూతురి భౌతిక కాయం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయడానికి మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మాటలు ఒక తండ్రి హృదయవేదనను, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పింకీ మాలి చివరి మాటలు ఇప్పుడు వారి కుటుంబానికి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయాయి. -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. ఏ క్షణం.. ఏం జరిగింది?
ఢిల్లీ: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి పైలెట్ తప్పిదమే కారణమనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వని పైలట్లు.. రన్ వే సరిగ్గా కనిపించక అంచనా తప్పినట్లు సమాచారం. తొలి ప్రయత్నంలో పైలట్లు ల్యాండ్ చేయలేకపోయారు. రెండో ప్రయత్నంలో 8:44కు విమానం ప్రమాదానికి గురైంది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఇచ్చిన సూచనలకు పైలట్ ఇచ్చే సమాధానమే రీడ్‌బ్యాక్..విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం సిద్ధమవగా.. మొదట రన్‌వే కనిపించడం లేదని చెప్పిన పైలట్లు.. కొన్ని సెకన్ల తర్వాత రన్‌వే కనిపిస్తోందని తెలిపారు. ఉదయం 8:43 గంటల సమయంలో విమానానికి రన్‌వే 11పై ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. అయితే, సాధారణంగా పైలట్లు ఇచ్చే తిరుగు సమాధానం (Readback) ఈసారి రాలేదు. సరిగ్గా నిమిషం తర్వాత, రన్‌వే వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం ఏటీసీ గుర్తించింది. అయితే.. ఈ దుర్ఘటనలో విమానం ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పైలట్ రీడ్‌బ్యాక్ చేయకపోవడం ప్రమాదానికి దారి తీసినట్లు కేంద్రం పేర్కొంది. ఏ క్షణం.. ఏం జరిగింది?👉ఉదయం 8:18 నిమిషాలకు తొలిసారిగా బారామతి ఎయిర్ ఫీల్డ్‌ను కాంటాక్ట్ చేసిన విమానం👉30 నిమిషాల తర్వాత పూణే ఎయిర్ కంట్రోల్ నుంచి బారామతికి కంట్రోల్లోకి విమానం👉విజిబులిటీ, గాలి వేగం గురించి అడిగిన పైలట్లు.. 3000 మీటర్ల విజిబిలిటీ, సాధారణ గాలి వేగం👉రన్ వే 11 పై ల్యాండింగ్ కోసం ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్👉ఫస్ట్ అప్రోచ్‌లో రన్ వే కనిపించకపోవడంతో గో అరౌండ్‌కు వెళ్లిన విమానం👉గో అరౌండ్ తర్వాత.. విమానం పొజిషన్ గురించి అడిగిన పైలెట్.. మరోసారి ఫైనల్ అప్రోచ్‌కు సిద్ధమైన ఎయిర్ క్రాఫ్ట్ 👉రన్ వే కనిపిస్తుందా? అని అడిగిన ఏటిసీ..👉ప్రస్తుతం కనిపించడం లేదు.. కనిపించిన తర్వాత కాల్ చేస్తామన్న పైలెట్👉కొన్ని సెకన్ల తర్వాత రన్ వే కనిపిస్తుందని వెల్లడించిన పైలెట్ 👉ఉదయం 8:43 నిమిషాలకు రన్ వే లెవెన్‌పై ల్యాండింగ్ క్లియరెన్స్.. అయితే కీలకమైన "రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్" సమాధానం ఇవ్వని పైలట్👉ఉదయం 8:44 నిమిషాలకు రన్‌వే పక్కన భారీ ఎత్తున మంటలు.. క్రాష్ అయిన విమానం👉రన్ వే 11కు ఎడమ వైపున విమాన శకలాలు -
సర్వస్వం త్యాగం : అజిత్ పవార్ చివరి పోస్ట్ వైరల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎన్సీపీనేత అజిత్ పవార్ అకాలమరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. బుధవారం తెల్లవారుజామున బారామతిలో విమానం ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. అయితే విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు చేసిన దేశభక్తి, త్యాగం అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న అజిత్ పవార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు లాలాలజపతి రాయ్ జయంతి సందర్భంగా తన చివరి ఫేస్బుక్ పోస్ట్‌లో ఆయనకు నివాళులు అర్పించారు. లజపత్ రాయ్ దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేశారని, ఆయన దేశభక్తి తరతరాలకు స్ఫూర్తి నిస్తుందని పవార్ రాశారు. అలాగే పవార్ మంగళవారం రాత్రి ఎక్స్ (గతంలో ట్విటర్)లో సీఎంఓ మహరాష్ట్ర ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఒక ఫోటోతో పాటు క్యాబినెట్ సమావేశం, కీలక ప్రభుత్వ నిర్ణయాల గురించి చర్చించామని తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు.🔸 CM Devendra Fadnavis chaired a meeting of the Cabinet Committee on Infrastructure. DCM Ajit Pawar, Minister Chandrashekhar Bawankule, and concerned officials were present. 🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या अध्यक्षतेखाली मंत्रिमंडळ पायाभूत सुविधा समितीची बैठक. यावेळी… pic.twitter.com/WzYkVZocYf— CMO Maharashtra (@CMOMaharashtra) January 27, 2026 ;ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగులపై వేటుఅజిత్ పవార్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు రాష్ట్రానికి అత్యంత కష్టమైన రోజు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానని, పవార్ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ నివాళులర్పించారు. రాష్ట్రంలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను బుధవారం సెలవు దినాన్ని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి బారామతికి వెళ్లారు. అక్కడ పవార్ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను కలిసి తమ సంతాపాన్ని ప్రకటించారు. (Ajit Pawar jet crash : హాట్ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు ) కాగా రాబోయే జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వెడుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, బారామతిలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, రన్‌వే సమీపంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. Governor Acharya Devvrat, CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde, met Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati.Ajit Pawar died in a crash landing of a charter plane in Baramati this morning. pic.twitter.com/HEOwpsVfKr— ANI (@ANI) January 28, 2026ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు -
నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాలమరణంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ తరుణంలో ఈ విషాదం మహారాష్ట్రకు తీరని లోటని ఎక్స్‌లో నివాళి అర్పించారు. అజిత్ పవార్ చాలా నిష్కపటమైన వ్యక్తి అని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడం ఆయన నైజం కాదని థాకరే అన్నారు. అంతేకాదు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషాద సమయంలో తన కుటుంబం, పవార్ కుటుంబం దుఃఖంలో పాలుపంచుకుటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తరపున అజిత్ పవార్‌కి హృదయపూర్వక నివాళులంటూ ట్వీట్ చేశారు. "నా స్నేహితుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. మహారాష్ట్ర రాజకీయాలు ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయాయి. అజిత్ పవార్, నేను దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా పరిచయం చాలాకాలం తర్వాత ఏర్పడింది. అపారమైన అభిరుచి, బలంతో, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయ రంగంలో గొప్ప పురోగతి సాధించారు. ఆయన పవార్ సాహెబ్ స్ఫూర్తితోఎదిగిన నాయకుడైనప్పటికీ, తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుని,. మహారాష్ట్ర నలుమూలలా తనదైన ముద్ర వేసుకున్నారు’’ అని ట్వీట్ చేశారు."1990వ దశకంలో మహారాష్ట్రలో పట్టణీకరణ ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాలు పాక్షిక పట్టణీకరణ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి, అయినప్పటికీ అక్కడి రాజకీయాల తీరు గ్రామీణంగానే ఉంది, అయితే వారి సమస్యల స్వభావం కొంతవరకు పట్టణంగా మారడం ప్రారంభమైంది. ఈ రకమైన రాజకీయాలపై అజిత్ పవార్‌కు పూర్తి అవగాహన, నేర్పుగా నిర్వహించే నైపుణ్యం కూడా ఉంది. దీనికి పింప్రి చించ్వాడ్ , బారామతి దానికి రెండు అద్భుతమైన ఉదాహరణలు. అది పింప్రి చించ్వాడ్ అయినా లేదా బారామతి అయినా, అజిత్ దాదా ఈ ప్రాంతాలను తన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించే విధంగా మార్చారు అంటూ థాకరే ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలుపరిపాలనపై అజిత్ పవార్‌కు కచ్చితమైన పట్టు ఉందని, నిలిచిపోయిన ఫైళ్లను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని ఎంఎన్ఎస్ అధినేత అన్నారు. అధికారంలో ఉన్నవారికి అతీతంగా పనిచేయాల్సిన ఈ యుగంలో, మహారాష్ట్ర అటువంటి నాయకుడిని కోల్పోవడం అత్యంత విషాదకరం అని ఆయన నివాళి అర్పించారు. ఆయన కల్మషం లేని వ్యక్తి. ఆయనలో కుల పక్షపాతం ఏమాత్రం లేదు, ఆయన రాజకీయాల్లో కులానికి అస్సలు చోటు లేదు. నేటి రాజకీయాల్లో, కులంతో సంబంధం లేకుండా వ్యవహరించే ధైర్యం చూపే నాయకులు తగ్గిపోతున్న తరుణంలో నిస్సందేహంగా అజిత్ పవార్ వారిలో అగ్రగామిగా ఉన్నారు. రాజకీయాల్లో నిష్కపటత్వానికి, నిజాయితీకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విరోధం అనేది రాజకీయపరమైందే త ప్ప వ్యక్తిగతమైనది కాదు. అందుకే మహారాష్ట్రలో ఒకరిపై ఒకరు చేసుకునే తీవ్ర విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకునే నాయకులు తగ్గిపోతున్నారు. ఉదార స్వభావం గల ప్రత్యర్థులు రాజకీయాల నుండి వరుసగా వైదొలగడం మహారాష్ట్ర ఉన్నత రాజకీయ సంప్రదాయానికి తీరని లోటనిపేర్కొన్నారు.ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
అజిత్ పవార్ విమాన ప్రమాద సీసీటీవీ దృశ్యాలు
-
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కారణం ఏంటంటే?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రయాణిస్తున్న విమానం బుధవారం ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్, విదీప్ జాదవ్,పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్‌లు ప్రాణాలు కోల్పోయారుఅయితే, ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలెట్ల గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ మంగళవారం ఉదయం ముంబై నుంచి లియర్‌జెట్ 45 విమానంలో బయలు దేరారు. అయితే, ఈ విమానం, బరామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. విమాన ప్రమాదంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, అలాగే పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ శంభవి పాఠక్ అక్కడికక్కడే మరణించారు.కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయనకు బిజినెస్ ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది. శంభవి పాఠక్ కూడా శిక్షణ పొందిన కమర్షియల్ పైలట్. గతంలో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ఇద్దరూ వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు పనిచేస్తున్నారు.విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందో, సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బరామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బారామతి రన్‌వేకు 100 అడుగుల దూరంలో కుప్పకూలి.. మంటల్లో చిక్కుకున్న దృశ్యాల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఉదయం (బుధవారం, జనవరి 28) 8:46: గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు,ఆపై దట్టమైన పొగ వెలువడటం వీడియోలో కనిపించింది.విఎస్ఆర్ (VSR) సంస్థకు చెందిన లియర్ జెట్ 45 (Learjet 45).. ఉదయం 8:10 గంటలకు ముంబై నుండి బయలుదేరింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ (66)తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాడార్ సమాచారం ప్రకారం.. విమానం ఉదయం 8:45 గంటలకు రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. విమానం కూలిపోయే ముందు రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. సంకేతాలు నిలిచిపోయే సమయానికి విమానం 1016 మీటర్ల (సుమారు ఒక కిలోమీటర్) ఎత్తులో, గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటనవిమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. పైలట్ నుంచి మేడే కాల్ రాలేదన్న ఆ శాఖ.. బారామతి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చాకే ల్యాండింగ్‌కు యత్నించారని పేర్కొంది. రన్ వే నెంబర్ 11పై ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. 8.44 గంటలకు పొగల, మంటల కనిపించాయని ఏటీసీ చెబుతోంది. రన్ వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారని.. తొలి ప్రయత్నంలో రన్ వే కనిపించకపోవడంతో కాసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. రెండో ప్రయత్నంలో ల్యాండ్ అయ్యేందుకు యత్నించి విఫలయినట్లు ఏటీసీ తెలిపింది.ఇవాళ అజిత్ పవార్.. తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. అజిత్ పవార్‌తో పాటు ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్ మరణించారు.CCTV footage of the collision impact of the chartered aircraft, carrying Maharashtra deputy CM Ajit Pawar and 4 others, which crash landed. pic.twitter.com/vf9X7TGffJ— Believer (@PredatorVolk) January 28, 2026 -
అజిత్ పవార్ విషాదం : హాట్ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) ఘోరమైన విమాన ప్రమాదంలో మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రతింతిని రేపింది. అజిత్‌తో పాటు ఈ విమానంలోమరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఎవరు వీరిద్దరూ అనే చర్య నెట్టింట్ తీవ్ర చర్చకు దారి తీసింది.ఢిల్లీకి చెందిన చార్టర్ సంస్థ VSR నడుపుతున్న చార్టర్డ్ లియర్‌జెట్ 45 పూణే జిల్లాలోని బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తన వ్యక్తిగత భద్రతా అధికారి విదిత్ జాదవ్, అటెండెంట్ పింకి మాలితో కలిసి ప్రయాణిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్ , కెప్టెన్ శాంభవి పాఠక్ సహా విమానంలో ఉన్న అందరూ మరణించారు. దీంతో శాంభవి , సుమిత్ కుమార్ అకాల మరణంపై సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. Captain Shambhavi Pathak was flying the plane that crashed in Baramati, resulting in the tragic loss of all five individuals on board, including Maharashtra Deputy Chief Minister Ajit Pawar.Her career was defined by a steady climb through the ranks of Indian aviation, from a… pic.twitter.com/ei9Hu8TAFe— Aarti (@aartic02) January 28, 2026కెప్టెన్ శాంభవి పాఠక్ ఆర్మీ అధికారి కుమార్తె కెప్టెన్ శాంభవి పాఠక్ పైలట్-ఇన్-కమాండ్‌గా పనిచేస్తున్నారు. లియర్‌జెట్ 45 పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ శాంభవి పాఠక్ ఎయిర్ ఫోర్స్ బాల భారతి స్కూల్లో చదువుకున్నారు. తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి, ఏరోన్యూటిక్స్/ఏవియేషన్/ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ పొందారు.కెప్టెన్ సుమిత్ కపూర్ కెప్టెన్ సుమిత్ కపూర్ పైలట్-ఇన్-కమాండ్‌గా కూడా పనిచేస్తున్నారు , టేకాఫ్ , ల్యాండింగ్‌తో సహా క్లిష్టమైన దశలలో విమాన సిబ్బందిని నడిపించే బాధ్యతలను చాలా విజయవంతంగా చేపట్టారు.ఇదీ చదవండి: అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలుమరోవైపు అనుభవం లేని పైలట్ వల్లే ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించాయి. ఈ వందతులను ఏవియేషన్ అధికారులు ఖండించారు. ఇద్దరూ అనుభవజ్ఞులేనని స్పష్టం చేశారు. విఎస్ఆర్ ఏవియేషన్ ఉన్నతాధికారి వికె సింగ్ మాట్లాడుతూ, ఇద్దరు పైలట్లు ఢిల్లీలో ఉన్నారని, వీరికి విమాన ప్రయాణ గంటల్లో విస్తృతమైన అనుభవం ఉందని చెప్పారు. కెప్టెన్ కపూర్‌కు 16,000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని, కో-పైలట్‌కు సుమారు 1,500 గంటల అనుభవం ఉందని సింగ్ తెలిపారు. సహారా, జెట్‌లైన్, జెట్ ఎయిర్వేస్లో పనిచేశాడు. ఈ రకమైన విమానంతో చాలా అనుభవం ఉందని సింగ్ అన్నారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!ఇద్దరూ కుటుంబ సభ్యుల్లాంటివారుపైలట్లతో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇద్దరూ తనకు చాలా సన్నిహితులని సింగ్ అన్నారు. కెప్టెన్ సుమిత్ కపూర్ తనకు చాలా ప్రియమైన స్నేహితుడని అతని కుమారుడు కూడా తమతో పాటు పైలట్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. కెప్టెన్ శాంభవి నా బిడ్డ లాంటిది. వారిద్దరూ చాలా మంచి మనుషులు, చాలా మంచి పైలట్లు అంటూ వారి మృతికి సంతాపం తెలిపారు.మరోవైపు 66 ఏళ్ల అజిత్ పవార్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాజకీయ సమావేశాలకు హాజరయ్యేందుకు వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చేతి గడియారం ఆధారంగా అజిత్ పవార్ మృతదేహాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది,వాతావరణ పరిస్థితులు, దృశ్యమానత, విమాన కార్యకలాపాలు, సాంకేతిక డేటాపై దృష్టి సారించింది.ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యాప్తు చేపట్టనుంది. దర్యాప్తు జరిపిస్తాండిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదంపై పారదర్శకంగా, జవాబుదారీగా విచారణ జరిపిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు వెల్లడించారు.అజిత్ దాదామనతో లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని మహారాష్ట్రకు తీరని లోటు. ఆయన లాంటి నాయకులను ఇక దొరకరంటూ కేంద్రమంత్రి సంతాపం వెలిబుచ్చారు. ఈ ఘటనలో మరణించిన మిగిలిన నలుగురి కుటుంబాలకు కూడా తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
అజిత్ పవార్ సున్నితమైన.. మనసున్న నేత
-
విమాన ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
బారామతి: ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో విమానంలో ఉన్న అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు సజీవ దహనమయ్యారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇది ఘోర ప్రమాదమని చెబుతున్నారు. విమానం కూలిన వెంటనే నాలుగైదు పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడలేకపోయినట్టు చెప్పారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళ్లెదుటే అజిత్ పవార్ సహా ఐదుగురు మంటల్లో కాలిపోవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.''విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాను. చాలా బాధాకరమైన ఘటన. విమానం కిందకు దిగేటప్పుడు అది కూలిపోతున్నట్టుగా అనిపించింది. క్షణాల్లో నా కళ్లెదుటే అది కుప్ప కూలింది. వెంటనే మేమంతా అక్కడికి పరుగెత్తికెళ్లాం. విమానంలో మళ్లీ 4-5 పేలుళ్లు సంభవించాయి. దీంతో చాలా మంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ఉన్న వారికి కాపాడాలని అనుకున్నాం. కానీ భారీగా మంటలు వ్యాపించడంతో సహాయం చేయలేకపోయాం. అజిత్ పవార్ విమానంలోనే ఉన్నారని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ వేదనను మాటల్లో వర్ణించలేన''ని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో చెప్పారు. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, మహారాష్ట్ర రాజకీయ నేతలు బారామతికి తరలివెళ్లారు. కాగా, అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు రికార్డైన సీసీ కెమెరా ఫుటేజి వైరల్‌గా మారింది. విమాన ప్రమాదం.. ఘటనా స్థలంలో పరిస్థితి ఇలా.. -
అజిత్ పవార్ మరణంపై అనుమానాలు.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్‌జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్‌పవార్‌తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. ఆయన బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు. Deeply shocked and stunned by the suddden demise of Ajit Pawar! The Deputy Chief Minister of Maharashtra and his co-passengers have died in a disastrous plane crash at Baramati today morning, and I am feeling a deep sense of loss.My condolences to his family including his uncle…— Mamata Banerjee (@MamataOfficial) January 28, 2026అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ బుధవారం డిమాండ్ చేశారు ఆయన మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా అజిత్ పవార్ మామ, శరద్ పవార్ సహా ఆయన కుటుంబానికి, పార్టీ శ్రేణులకు సంతాపాన్ని ప్రకటించారు. అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బాధాకరమన్న కాంగ్రెస్ గౌరవ్ గోగోయ్.. ఘటనపై అనుమానాలు నెలకొన్నాయని.. పారదర్శకమైన దర్యాప్తుతో వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యే(గోషామహల్) రాజాసింగ్ సైతం అజిత్ పవార్ మరణంపై స్పందించారు. అజిత్ పవార్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడెన్ గా ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి విమాన ప్రమాదం వెనక ఎమైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు సహజం. గత కొంతకాలంగా ఆయన అధికార నుంచి బయటకు పోతారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుట్రలు కూడా జరుగు తున్నాయని ప్రచారం జరుగుతోంది. విమాన బ్లాక్ బాక్స్‌ను విశ్లేషిస్తే..కుట్ర ఉందా లేదా తేలొచ్చు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. పవార్ అస్తమయంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు. -
అజిత్ పవార్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
Plane Crash: ఒక్కసారిగా నేలను తాకి రెండు ముక్కలుగా..
-
అజిత్ పవార్ మృతిపై ప్రముఖుల రియాక్షన్
-
అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
అజిత్ దాదా.. ఆనాడు మరణం గురించి సరదాగా..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (ఎన్సీపీ), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే కార్యకర్తలు, అభిమానులు ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు నాలుగు దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా బోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తున్నాయి.అయితే గతంలోనూ అజిత్ పవార్‌కు ఓ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలాకాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారాయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య, తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన గురించి సరదాగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు.అసలేం జరిగిందంటే.. ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం కోసం ఆయన వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్‌లో అజిత్ పవార్‌తోపాటు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్‌లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్‌ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.. .. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ అన్నారు. 2023 జనవరి 16న మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. -
అజిత్ పవార్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు. Deeply shocked to learn of the untimely demise of Maharashtra Deputy CM Ajit Pawar Ji. My thoughts and prayers are with his family and the families of the six individuals who lost their lives in this tragic accident. Om Shanti! pic.twitter.com/Q17GelyFQl— YS Jagan Mohan Reddy (@ysjagan) January 28, 2026 -
దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషాదాలు
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఘటన మరోసారి రాజకీయ నేతల హెలికాఫ్టర్.. విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో కూడా పలువురు ప్రముఖ నేతలు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని విషాదంలో ముంచారు. ఆ ఘటనలను ఓసారి గుర్తు చేసుకుంటే.. 2001లో.. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావ్ సింధియా విమాన ప్రమాదంలో మరణించారు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మాధవరావ్.. 9సార్లు లోక్‌సభకు ఎంపీగా పని చేశారు. రైల్వే, పర్యాటకం, మానవ వనరుల అభివృద్ధి, సివిల్ ఏవియేషన్ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ఘజియాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాధవరావ్తో పాటు పలువురు అనుచరులు మరణించారు.జీఎంసీ బాలయోగి.. దేశ తొలి దళిత లోక్‌సభ స్పీకర్. 2002లో స్పీకర్‌గా ఉన్న టైంలో ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. మార్చి 3వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో బాలయోగితో పాటు ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశాన్ని షాక్‌కు గురి చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎంగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరిన గంట సేపటికి నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్సార్ సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన ఆయన ప్రయానిస్తున్న హెలికాఫ్టర్ తవాంగ్ జిల్లా అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దోర్జీ ఖాండుతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2025 జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది మరణించిన సంగతి తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. బల్వంత్రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించారు. 1965లో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై పాకిస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ కచ్ వద్ద దాడి జరిపింది. దేశంలో ఇప్పటిదాకా.. యుద్ధంలో మరణించిన ఒకే ఒక్క సీఎంగా బల్వంత్రాయ్ మెహతా నిలిచారు. అణు శాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా.. 1965లో ఆల్ప్స్ పర్వతాల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించారు. కేంద్ర మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం 1973లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో మరణించారు. నటుడు ఇందర్ థాకూర్ 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో 1994లో జరిగిన ప్రమాదంలో పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాథ్ మరణించారు 1997లో కేంద్ర రక్షణ మంత్రి(సహాయ) ఎన్వీఎన్ సోము అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుఅరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి దేరా నాతుంగ్ 2001లో తవాంగ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుమేఘాలయా ఎమ్మెల్యే సైప్రియన్ సంగ్మా 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారుచైల్డ్ ఆర్టిస్ట్ తరుణీ సచ్ దేవ్.. నేపాల్‌లో 2012లో జరిగిన ప్రమాదంలో మరణించారుపైన చెప్పుకునే జాబితానే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, హర్యానా మంత్రి ఓం ప్రకాశ్ జిందాల్ కూడా యూపీ షాహరన్‌పూర్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో మంత్రి సురేందర్ సింగ్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా డిసెంబర్ 08, 2021లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి మధులిక, మరో 12 మంది మరణించారు. 2004, ఏప్రిల్ 17న సినీ నటి సౌందర్య తన సోదరి అమర్నాథ్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ (1980) ఢిల్లీలో ఈ తరహా ప్రమాదంలోనే కన్నుమూయగా.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లు కూడా విమాన ప్రమాదాల్లోనే మరణించారన్న ప్రచారం ఉన్నది తెలిసిందే. -
#AjitPawarPlaneCrash : బారామతి ఘోర విమాన ప్రమాద దృశ్యాలు
-
44 ఏళ్ల రాజకీయం.. డిప్యూటీ సీఎం పవార్ ప్రస్థానం ఇలా..
ముంబై: మహారాష్ట్రలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బారామతిలో విమాన ప్రమాదం కారణంగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో, విమానంలో ప్రయాణించిన అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది. దీంతో, అజిత్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.రాజకీయ ప్రస్థానం.. అజిత్ పవార్ స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కటేవాడి. అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‌కు సోదరుడు. పవార్ పదో తరగతి వరకు డియోలాలిలో విద్యాభ్యాసం చేశాడు. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబై వచ్చారు. తన విద్యను పూర్తి చేసిన తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు. అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Plane Crash: డిప్యూటీ సీఎం మృతి
-
పవార్ ఇంట తీవ్ర విషాదం.. అజిత్ పవార్ ఈ చిత్రాలు చూశారా?
-
అజిత్ పవార్ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అకాల మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు అజిత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ..‘అజిత్ పవార్ ప్రజల నేతగా, కింద స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలనా వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు, పేదలు-అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకితభావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు చేశారు. Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R— Narendra Modi (@narendramodi) January 28, 2026కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కొరకు పని చేశారని అన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) విమానం ప్రమాదంలో కన్నుమూశారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఉన్న ఐదుగురూ మరణించినట్లు సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ బారామతి రీజియన్లలో ఆయన నాలుగైదు సభల్లో పాల్గొనాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయం 8.45 గంటల సమయంలో విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన సిబ్బంది, విమాన సిబ్బంది ఉన్నారు. మృతులను డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్‌గా ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానం.. బంబార్డియర్ లీర్జెట్ 45(కెనడా) రకం విమానం. ప్రమాదంలో విమానం రెండు ముక్కలై.. పూర్తిగా కాలిపోలిపోయింది. #UPDATE | Five people on board the Mumbai to Baramati charter plane, which crash landed, have died: DGCA (Directorate General of Civil Aviation) pic.twitter.com/ftrUPnqjZT— ANI (@ANI) January 28, 2026ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అజిత్ పవార్ సహా అందరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అజిత్‌పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతికి బయల్దేరారు. అటు ఢిల్లీలో ఉన్న పవార్ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు చేరుకుంటున్నారు. అజిత్ పవార్ హఠాన్మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్‌షిండే తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లోఅజిత్ పవార్ (Ajit Pawar) పూర్తి పేరు అజిత్ అనంతరావ్ పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి అనంతరావ్ కుమారుడే ఈయన. స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కతేవాడి. 1959 జులై 22న జన్మించారీయన. పుట్టింది మాత్రం అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబైవచ్చారు. ఆ తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు. శరద్ పవార్ అడుగుజాడల్లో పయనిస్తూ.. అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో, అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. 1991లో బారామతి నుంచి ఎంపీ నెగ్గిన అజిత్‌పవార్.. ఆ తర్వాత అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎన్సీపీ తరఫున ఎమ్మెల్యేగా, మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ వేరు వర్గంతో మహాయుతి కూటమితో జత కట్టారు. అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఘనత కూడా అజిత్ పవార్‌దే. -
‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో జరగబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీసీ) ఆయన బాబాయి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ (ఎస్పీ )వర్గం పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) స్వయంగా ప్రకటించారు.‘రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ఆదివారం పింప్రి-చించ్వాడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు వర్గాల మధ్య ఐక్యతను ఆయన తెలియజేస్తూ.. ‘కుటుంబం (పరివార్) మళ్లీ ఒక్కటైంది’ అని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే సమయంలో, కలిసి పోటీ చేయాలని రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయని అజిత్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధిని గుర్తుచేస్తూ..స్థానిక నేతలతో ఈ పొత్తు, సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అజిత్ పవార్ తెలిపారు. పింప్రి-చించ్వాడ్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, తాము తెచ్చిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా హింజేవాడిలో నిర్మించిన ఐటీ హబ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు ఆయన చేశారు. 1992 నుండి 2017 మధ్యకాలంలో కార్పొరేషన్లో తన పదవీ కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.‘వారు కలవడం కొత్తేమీ కాదు’పవార్ కుటుంబం తిరిగి ఏకమవడంపై పలువురు నేతలు స్పందించారు. వారిలో కొందరు శరద్ పవార్ (Shaead Pawar) త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అజిత్ పవార్.. శరద్ పవార్ ఆదేశాల మేరకే బీజేపీలో చేరారు. వారు తిరిగి కలవడం కొత్తేమీ కాదు. వారు ఏకం కావడం మాకు సంతోషంగా ఉంది. శరద్ పవార్ కూడా త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశిస్తున్నాను’ అని బీజేపీ మహిళా నేత నవనీత్ రాణా అన్నారు. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత జీషన్ సిద్ధిఖీ కూడా ఈ కలయికను స్వాగతిస్తూ ‘రెండు కుటుంబాలు కలవడం మంచి విషయమే. దీనివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మేము దీనిని స్వాగతిస్తున్నాం. ఇకపై రెండు పార్టీలు కలిసి పోరాడతాయి’ అని అన్నారు.‘ఇంటి పేరు ఇక్కడ పనిచేయదు’అయితే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం.. పవార్ల పొత్తును విమర్శిస్తూ.. ‘వారు కలిసిపోవచ్చు, కానీ ప్రజలు ఇంటి పేరును చూసి ఓట్లు వేయరు. మహారాష్ట్రలో ఇంటి పేరు రాజకీయాలు పనిచేయవు," అని పేర్కొంది. శివసేన మహిళా నేత షైనా ఎన్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ అన్నదమ్ములైనా కలిసిపోవచ్చు. ఇంటి పేరు రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. వారు అధికారం కోసమే కలిసి వస్తున్నారు. అయితే ప్రజలు కేవలం పనిని మాత్రమే చూస్తారు. పేరును కాదు. పవార్లు కలిసి వస్తున్నారని అంతా చర్చించుకోవచ్చు. దీనివల్ల వారికి ఓట్లు రావు. ప్రజలు పేరు ఆధారంగా ఓట్లు వేయరు’ అని ఆమె అన్నారు.29 మున్సిపల్ కార్పొరేషన్లకు..పింప్రి-చించ్వాడ్, పుణె సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మర్నాడు జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు డిసెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. 2023లో ఎన్సీపీ చీలిక తర్వాత, అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం రాష్ట్ర స్థాయిలో బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా చేరింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం తిరిగి ఇరు పార్టీలు జట్టు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే! -
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్‌తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది. -
మహా పొలిటికల్ డ్రామా.. ‘రమ్మీ మంత్రి’ రాజీనామా!
మహారాష్ట్రలో రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ సీనియర్ నేత మాణిక్‌రావ్ కోకాటే.. క్రీడా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభలోనే ఆన్లైన్ రమ్మీ ఆడి.. రమ్మీ మినిస్టర్‌గా ఈయన పేరు పొందిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖకు మార్చడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. మూడు దశాబ్దాల నాటి హౌసింగ్ స్కాం కేసులో నాసిక్ సెషన్స్ కోర్టు బుధవారం మాణిక్‌రావ్ కొకాటే(Manikrao Kokate)ను దోషిగా తేల్చి.. శిక్షను ఖరారు చేసింది. దీంతో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. కోకాటే రాజీనామా లేఖ ఇంకా సీఎం పేషీకి చేరలేదు. దీంతో.. ప్రస్తుతానికి ఆయన పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు.కేసు ఏంటంటే.. 1995లో హౌజింగ్ సొసైటీలకు సంబంధించి ఆర్థిక బలహీన వర్గాల (EWS) కోసం కేటాయించిన 10% కోటాను దుర్వినియోగం చేశారని మాణిక్‌రావ్, ఆయన సోదరుడు విజయ్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో.. ఛీటింగ్, ఫోర్జరీలకు పాల్పడడ్డారని తేలడంతో ఇద్దరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 సెక్షన్ 8 ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులకు(ఎమ్మెల్యే/ఎంపీ) రెండేళ్లు.. అంత కంటే ఎక్కువ శిక్ష పడితే తక్షణమే సభ్యత్వం రద్దు అవుతుంది. ఒకవేళ పైకోర్టులు వాటిపై స్టే విధిస్తే వాళ్లకు ఊరట దక్కుతుంది. దీంతో.. బుధవారం నాడే బాంబే హైకోర్టులో నాసిక్ కోర్టు తీర్పును కోకాటే బ్రదర్స్ సవాల్ చేశారు. అత్యవసర విచారణను శుక్రవారం జరుపుతామని కోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అనారోగ్యం పేరిట ముంబైలోని లీలావతి కొకాటే చేరడంతో అరెస్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది. అత్యవసర భేటీ, ఆపై.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్పీపీ చీఫ్ అజిత్ పవార్.. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. శివసేన, బీజేపీ ఒత్తిళ్ల మేరకు కొకాటేను తొలగించాల్సిందేనని ఫడ్నవిస్ పవార్‌కు స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నేతలతో అజిత్ పవార్ చర్చలు జరిపారు. అనంతరం.. కొకాటే తన రాజీనామా ప్రకటన చేశారు. కొకాటే రాజీనామాతో క్రీడా శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వద్దకు వెళ్లింది.మరోవైపు.. ఈ పరిణామంపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం భగ్గుమంటోంది. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో.. రాహుల్ గాంధీ, సునీల్ కేదార్(మహారాష్ట్ర మాజీ మంత్రి) కేసుల్లో తీర్పు వెలువడిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ జరిగిందని, కోకాటే విషయంలో ఆలస్యం ఎందుకు? అని ప్రశ్నించారు..అటు హస్తినలో.. కొకాడే రాజీనామా వ్యవహారం అటు ఢిల్లీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత ధనంజయ్ ముండే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తనది రాజకీయ భేటీ కాదని ముండే ఆ తర్వాత మీడియాకు స్పష్టత ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యే..ఈ ఏడాది జులైలో. అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ మాణిక్‌రావ్ కోకాటేపై కెమెరా కంటికి చిక్కారు. దీంతో.. రైతుల ఆత్మహత్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని వ్యవసాయ శాఖ నుంచి తొలగించి.. క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఇప్పటి దాకా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025 -
మహారాష్ట్ర పాలి‘ట్రిక్స్’.. అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు
పుణె: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే లేకుండా చేస్తాం, ఓటేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమంటూ వారిని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. శుక్రవారం బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–ఎన్సీపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉండటం గమనార్హం. ‘మా ఎన్సీపీ అభ్యర్థులు 18 మందిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే ఉండదు. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే, నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తా. మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులివ్వను. మీ వద్ద ఓట్లుంటే, నా దగ్గర నిధులున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. Baramati, Maharashtra: Deputy CM Ajit Pawar says, "Give me victory for all 18 Mahayuti candidates in the Malegaon Nagar Panchayat, and I will fulfill every promise and demand I have made to you. But if you cut votes, then I will also cut. You have the votes, and I have the funds,… pic.twitter.com/AiFyTgc0A6— IANS (@ians_india) November 22, 2025మరోవైపు.. అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలషేబ్ బిటి) నాయకుడు అంబదాస్ దన్వే స్పందిస్తూ..‘నిధులు అజిత్ పవార్ ఇంటి నుండి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఇవ్వబడతాయి. పవార్ వంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? అని ప్రశ్నలు సంధించారు. ఇక, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం. -
కుమారుడిపై కుంభకోణం కేసు.. అజిత్ పవార్ రియాక్షన్
ముంబై: ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడి సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సంబంధిత తహశీల్దార్‌పై సస్పెండ్ వేటు వేసిన ప్రభుత్వం, తాజాగా రూ.300 కోట్ల విలువైన ఆ భూ విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని అజిత్ పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు.అంతకుముందు, ఆయన సీఎం ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ సమావేశమయ్యారు. ‘పుణె నగరంలోని మౌజె ముంధ్వా ప్రాంతంలో ఉన్న ఆ 40 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తి. దానిని విక్రయించరాదు. ఈ విషయం తన కుమారుడు పార్థ పవార్‌కు, అతడి వ్యాపార భాగస్వామి దిగ్విజయ్ పాటిల్‌కు తెలియదు. భూ విక్రయం, రిజిస్ట్రేషన్ వెనుక ఎవరున్నారనేది దర్యాప్తులోనే తేలుతుంది. ఆ భూమిని పార్థకు చెందిన సంస్థకు విక్రయించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయలేదు’అని అజిత్ పవార్ వివరించారు. భూ రిజిస్ట్షేషన్ కోసం రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లిన ముగ్గురిలో తన కుమారుడు లేడన్నారు.Modi has surrounded himself with masters of corruption and nepotism.Modi survives by Vote Chori and thrives by the loot it gives in power. https://t.co/nw6KTwpWXW pic.twitter.com/qsOTmjS0o5— Srivatsa (@srivatsayb) November 7, 2025కేవలం భూ ఒప్పందం మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన.. భూ బదిలీ, చెల్లింపులు చేయలేదని చెప్పారు. ఈ సేల్‌డీల్‌ను రద్దు చేయాలంటూ సంబంధిత అధికారులకు తిరిగి పత్రాలను పంపించారని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారంపై అదనపు ప్రధాన కార్యదర్శి వికాస్ ఖర్గే సారథ్యంలోని బృందం దర్యాప్తు చేపట్టనుందని డిప్యూటీ సీఎం తెలిపారు.ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ఈ బృందం అంచనా వేసి నెలరోజుల్లో నివేదిక అందిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ భూమి మార్కెట్ విలువ రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులకు కేటాయించిన ఆ భూమిని ప్రభుత్వం కొట్టేసిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కనుసన్నల్లోనే జరిగిందని ఉద్యమ కారుడు అన్నా హజారే తప్పుబట్టారు. మరోవైపు.. పూణే భూ ఒప్పందంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. కానీ డబ్బు మార్పిడి ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే, రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. రెండు పార్టీలు ఇప్పుడు రిజిస్ట్రీని రద్దు చేయాలని దరఖాస్తు దాఖలు చేశాయి. అయితే, రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి వారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారికి నోటీసు జారీ చేయబడింది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. అవకతవకలపై దర్యాప్తు జరుగుతోంది. బాధ్యులపై చర్చలు కచ్చితంగా ఉంటాయి. మొత్తం విచారణ ఒక నెలలోపు పూర్తవుతుంది. దీనిలో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.Nagpur | On the Pune land deal involving the son of Maharashtra Deputy CM Ajit Pawar, Maharashtra CM Devendra Fadnavis says, "There was an agreement between the parties, but the exchange of money was still pending. However, the registry had already been completed. Both parties… pic.twitter.com/JMggDoKP5Y— ANI (@ANI) November 7, 2025ఇది కూడా చదవండి: రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు -
రూ.1800 కోట్ల భూమి 300 కోట్లకే : భగ్గుమన్న భూ కుంభకోణం ఆరోపణలు
పుణే: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డాడంటూ ఆరోపణము భగ్గుమన్నాయి. ఈ కుంభకోణంలో అజిత్ పవార్ కుమారుడి హస్త ఉందన్న ఆరోపణల నేపత్యంలమహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది.1800 క కోట్ల రూపాయల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించారన్న కేసులో ఒక రెవెన్యూ అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ కమిటీకి అదనపు చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) వికాస్ ఖర్గే సారథ్యం వహించనున్నా రు. కమిటీ తుది నివేదిక ఎనిమిది రోజుల్లోగా వచ్చే అవకాశం ఉంది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించిన తర్వాత, పార్థ్ పవార్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ కుంభకోణంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన విషయమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పుణేకు చెందిన తహసీల్దార్ సూర్యకాంత్ యెవా లెను సస్పెండ్ చేశారు. బీజేపీ, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష మహాయుతి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుణేలోని ముంధ్వారాలో ఉన్న 40 ఎకరాల ప్రభు త్వ భూమిని రూ.300 కోట్ల కు పార్థసారథి భాగ స్వామిగా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే రూ. 21 కోట్ల స్టాంప్ డ్యూటీని కేవలం రూ. 500 కు తగ్గించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ డీల్ విలువ రూ. 300 కోట్లు అయినప్పటికీ, పన్నులతో సహా మొత్తం చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 21 కోట్లు ఉండాలని అదికారులు తెలిపారు. -
చెట్లకు సెల్ఫోన్లు కడుతున్నారు.. ఎందుకంటే?
ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింతగా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్.. ఆ ఊర్లో చెట్లకు సెల్ఫోన్లు కడతారు. ఇలా ఎందుకు చేస్తారని ఆశ్చర్యపోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే నమ్ముతారా? అవును ఇది అక్షరాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి.అరగంట నడిచి కొండపైకి ఎక్కుతారు. తర్వాత సెల్ఫోన్లను చెట్లకు కట్టేసి దానికి వచ్చే ఓటీపీ కోసం ఎండలో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మహిళలకు ఈ తంతు నిత్యకృత్యంగా మారింది. సెల్ఫోన్లో వచ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మరాఠా మహిళలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లబ్ధిదారులు రెండు నెలల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో మహిళలు కేవైసీ పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్ (Cell Phone Signal) లేక కష్టాలు పడాల్సివస్తోంది. రోజంతా కష్టపడినా వంద మందిలో నలుగురైదురికి మాత్రమే కేవైసీ పూర్తవుతోంది.మహిళల అవస్థలుఖార్డే ఖుర్ద్ గ్రామ మహిళలకు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సహాయం చేస్తోంది. దగ్గరలోని కొండగుట్టపై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండపైకి చేరుకోవడానికి మహిళలు అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన మహిళలకు మాత్రమే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇబ్బందులు ఉన్నాయి.. కానీఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మరో మాటకు తావులేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కేవైసీ నమోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.బలహీనంగా కనెక్టివిటీప్రభుత్వం విధించిన గడువు నవంబర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్వర్క్ సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.చదవండి: ఖరీదైన స్టంట్.. ట్విస్ట్ అదిరింది! సమస్యను పరిష్కారిస్తాంలడ్కీ బహిన్ యోజన కింద మహిళలకు సెప్టెంబర్‌లో ఆర్థిక సహాయం చేశామని, లబ్ధిదారులు మరో రెండు నెలల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాలని మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవల ప్రకటించారు. ఇంటెర్నెట్, ఆధార్ సమస్యలతో కేవైసీ ఆలస్యమవుతోందని మహిళలు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
మహిళా IPSతో వాగ్వాదం వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
-
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్‌గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్‌గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్‌కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్‌తో డిప్యూటీ సీఎం వాగ్వాదం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. సోలాపూర్‌లో కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో, ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే.. సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్సీపీ నాయకుడు ఒకరు.. ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్‌ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, అజిత్ పవార్ వాయిస్‌ను ఆమె గుర్తించలేదు. దీంతో, ఆగ్రహానికి లోనైన అజిత్.. ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను.. నన్ను గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?. నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. అనంతరం, తనకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్ చేయడంతో అజిత్‌ను చూసి మాట్లాడారు.करमाळ्याच्या पोलिस उपअधिक्षक अंजली कृष्णा यांना उपमुख्यमंत्री अजित पवारांना फोनवरुन ओळखता आले नाही. त्यानंतर रागावलेल्या अजित पवारांनी अंजली कृष्णा यांना खडेबोल सुनावत थेट व्हिडीओ काॅलच केला.#ajitpawar #AnjaliKrishna pic.twitter.com/ag2DNuf3do— Ankita Shantinath Khane (@KhaneAnkita) September 2, 2025అయితే, ఆమె సమాధానం పవార్‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఈ సందర్బంగా అజిత్..‘నేను మీపై చర్య తీసుకుంటాను. నేనే మీతో మాట్లాడుతున్నాను అంటే మీకు సరదాగా ఉందా?. మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.మరోవైపు.. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రభుత్వం, అజిత్ పవార్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో, రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తత్కరే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా సునీల్ తత్కరే స్పందిస్తూ..‘అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా సదరు అధికారిని మందలించి ఉండవచ్చు. ఆమె చర్యను పూర్తిగా ఆపాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. పవార్ ఎప్పుడూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు అని చెప్పుకొచ్చారు. -
రమ్మీ ఎఫెక్ట్.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ
సీరియస్‌గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్‌గా ఫోన్ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్‌రావ్ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్ పోలియోలు అప్పగించింది. మాణిక్‌రావ్ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్సీపీ(పవార్ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్‌కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు. -
ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ కునాల్‌కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు.. శివసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కమెడియన్ కమ్రాపై కేసు నమోదు చేశారు. క్రమాపై వ్యాఖ్యలను సీఎం ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తప్పుబట్టారు.ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘కునాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏకానాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలకు గాను కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందే. నేను కామెడీకి వ్యతిరేకంగా కాదు.. కానీ, కామెడీ పేరుతో ఒకరిని అగౌరవ పరచడం సరికాదు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా అని మీరు ఇతరుల స్వేచ్చను భంగపరచకూడదు. దానికి పరిమితులు ఉన్నాయి. అలా మాట్లాడి మీ తప్పును మీరు సమర్థించుకోలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ..‘రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలి. చట్టం పరిధి దాటి వ్యవహరించకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.This part was so hilarious 😂#kunalkamra @kunalkamra88 pic.twitter.com/zJ74DODgoO— ɱąŋʑʂ ☘️🍉 (@TheManzs007) March 23, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. ‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో, కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. హోటల్లోని ఫర్నీచర్‌ు ధ్వంసం చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. Kunal Kamra's Joke On Eknath Shinde । FIR Lodge Against Kamra । #kunalkamra #eknathshinde #gaddar #Trending #Mumbai pic.twitter.com/U8RfKqSwbQ— Magadh Talks (@MagadhTalks) March 24, 2025 -
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూపూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు. ప్లాట్‌ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
కూటమికి ఏక్నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ముంబై : ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యిందో లేదో .. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కూటమి చీలిపోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకీ మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.మహాయుతి కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు,ఎంపీలకు వై కేటగిరీ భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. భద్రత తగ్గింపులో కూటమిలో ఎన్సీపీ అజిత్ కుమార్ వర్గం కంటే.. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నేతలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఎమ్మెల్యేలకు , 11 లోక్‌సభ ఎంపీలకు ‘వై’ కేటగిరి భద్రతను అందించింది. తాజాగా, ఆ భద్రతను తొలగించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భద్రతా సమీక్షా కమిటీ జరిగింది. భద్రతా కమిటీ సమీక్షల ఆధారంగా.. ప్రజాప్రతినిధులకు వైకేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన జోక్యం లేదని స్పష్టం చేశారు.అయినప్పటికీ మహాయుతి కూటమిలో మనస్పర్ధలు ఉన్నాయని, సీఎం దేవేంద్రఫడ్నవీస్ షిండేని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల అయితే, దావోస్ పర్యటనకు ముందు సీఎం ఫడ్నవీస్ ఎన్సీపీ,బీజేపీకి చెందిన నేతల్ని రాయ్‌గఢ్ రాయ్‌గఢ్, నాసిక్‌లకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. అందులో శివసేన నేతలు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ల నియామకానికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల వేళ..షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.మహాయుతి కూటమి లుకలుకలపై శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి కూటమి ప్రేమికుల దినం జరుపుకుంటోంది అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. -
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్‌కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు. -
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. మంత్రులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్!
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తగా మంత్రివర్గంలో చేరిన కేబినెట్ సభ్యులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 39 మంది సభ్యులు పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వన్నట్లు తెలిపారు. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించింది. కొత్తగా మంత్రివర్గంలోని చేరిన 39 మంది ఆదివారం రాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 39 మందిలో 16 మంది కొత్త వారు కాగా, 10 మంది మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు రెండు, మూడు రోజుల్లో శాఖ కేటాయింపు ఉంటుందని తెలిపారు. అయితే, కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రుల పనితీరుపై సమీక్షలు జరుపుతామని, కూటమిలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన(ఏక్‌నాథ్‌షిండే)తో కేబినెట్ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. Devendra Fadnavis's HUGE statement on ministers🔥Fadnavis⚡️: We are going to audit the performance of all the ministers.If it is found in the audit that any minister is not doing the right work then that minister will be reconsidered ↩️pic.twitter.com/qAS0TpKe3u— Political Views (@PoliticalViewsO) December 15, 2024కేబినెట్ విస్తరణ అనంతరం మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై మహాయుతి కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తయారు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేపీ మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారనే దానిపై ఫడ్నవీస్ స్పష్టత ఇవ్వలేదు. కానీ డిప్యూటీ సీఎం, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తన పార్టీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. పనితీరు ఆధారంగా వారి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్ల సమయంలో మంత్రుల పనితీరు బాగుంటే కొనసాగుతారని, లేదంటే భర్తీ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో కేబినెట్ విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 11,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 9 మంత్రి పదవులు దక్కాయి. -
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్..?
-
చంద్రబాబుకు క్లీన్చిట్ ఎలా ఇస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్చిట్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్ కేసుల్లో చంద్రబాబు, అజిత్ పవార్లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్చిట్ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్ పేరును క్లియర్ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు. -
అజిత్ పవార్ కు భారీ ఊరట..
-
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ -ఉపముఖ్యమంత్రులుగా షిండే, పవార్
-
మహారాష్ట్రలో ట్విస్ట్.. శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యల అర్థమేంటి?
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన నేతలకు కీలక శాఖలు వచ్చే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే భరత్.. షిండేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.ఇక, గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, బీజేపీ హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను..
ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్ పవార్) నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో గురువారం సాయంత్రం అశేష జనవాహిని సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుతి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో నవంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగకపోవడం, కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగింది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య, గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు. ఫడ్నవీస్‌పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024హాజరైన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి.నడ్డా, రాజ్‌నాథ్æ, గడ్కరీ, శివరాజ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), పుష్కర్‌సింగ్ ధామీ(ఉత్తరాఖండ్), నాయబ్‌సింగ్ సైనీ(హరియాణా), భూపేంద్ర పటేల్(గుజరాత్), ప్రమోద్ సావంత్(గోవా), హిమంతబిశ్వ శర్మ(అస్సాం), విష్ణుదేవ్ సాయి(ఛత్తీస్‌గఢ్), భజన్‌లాల్ శర్మ(రాజస్తాన్), మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్), మోహన్‌చరణ్ మాఝీ(ఒడిశా), పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్), మాణిక్ సాహా(త్రిపుర), నితీశ్ కుమార్(బిహార్), కాన్రాడ్ సంగ్మా(మేఘాలయా), నిఫియూ రియో(నాగాలాండ్), ప్రేమ్‌సింగ్ తమాంగ్(సిక్కిం), ఎన్.రంగస్వామి(పుదుచ్చేరి), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, బాలీవుడ్ సినీ ప్రముఖులు షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, క్రికెట్ దిగ్గజం టెండూల్కర్‌తోపాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహా్వనించినప్పటికీ హాజరు కాలేదు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. #WATCH | PM Narendra Modi congratulates Shiv Sena chief Eknath Shinde on taking oath as Maharashtra Deputy CM(Source: DD News) pic.twitter.com/dHQEzx4KFM— ANI (@ANI) December 5, 2024స్థిరమైన ప్రభుత్వం అందిస్తాంరాబోయే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నేతృత్వంలో రాజకీయాల్లో ఇకపై స్పష్టమైన మార్పును చూస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు. ఈ నెల 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, 9న స్పీకర్‌ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. #WATCH | PM Modi congratulates Devendra Fadnavis on taking oath as Maharashtra CM pic.twitter.com/LNVURj7pBQ— ANI (@ANI) December 5, 2024బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేశారు. అధికార బాధ్యతలు చేపట్టారు. ఓ రోగికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఫడ్నవీస్ సీఎం హోదాలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. #WATCH | Maharashtra CM-designate Devendra Fadnvais arrives at Shree Mumbadevi Temple in Mumbai, ahead of his swearing-in ceremony later today. pic.twitter.com/Rt2HsJjeDd— ANI (@ANI) December 5, 2024షిండే రాజకీయ ప్రసంగం ప్రమాణ స్వీకార వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సంప్రదాయ విరుద్ధం. కానీ, షిండే మాత్రం ఆ సంప్రదాయాన్ని లెక్కచేయలేదు. గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించగానే, ఫార్మాట్లోని ‘నేను’ అని చదివి వెంటనే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మోదీ, బాల్ ఠాక్రే, రాష్ట్ర ప్రజలను పొగడడం ప్రారంభించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని షిండేను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన ఫార్మాట్ ప్రకారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. -
ఫలించిన బీజేపీ ప్లాన్.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఈ కార్యక్రమానికి.. -
Maha Yuti: మీడియా ముందే సెటైర్లు.. ఇంతలోనే సర్దుకుపోయారా?!
ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది. సీఎం పదవికి నేనే సిపారసు చేశాప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. బాంబు పేల్చిన షిండేఅనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.అజిత్ పవార్‌పై షిండే సెటైర్లు షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే.. అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. #WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco— ANI (@ANI) December 4, 2024 -
‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. మంత్రి పదవుల కోసం కొత్త ఫార్ములా!
ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా.. మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది. మహాయుతి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం.. 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. మూడు పార్టీల నుంచి ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో(132) బీజేపీ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9-10 పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. కీలక శాఖలు బీజేపీకే దక్కే చాన్స్ ఉంది. దీంతో, శివసేన, ఎన్సీపీలకు ఏయే శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
‘మహా’ కేబినెట్.. షిండే, అజిత్ పవార్ వాటాకు ఎన్ని మంత్రి పదవులంటే?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది. శివసేన(57): ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బుధవారమైనా తేలుస్తారా?ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారంమహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
Maharashtra: సీఎం పదవి బీజేపీకే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు. 5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే. కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.సేనలో అసంతృప్తి! తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!
ముంబై: మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు.. మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.Baby , don't say may be...Is Murlidhar Mool going to be new CM of maharashtra ...? pic.twitter.com/RDneu9aQC5— amit (@GandhiSoul2) November 30, 2024మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్ పవార్-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
‘మహా’ సీఎంకు లైన్ క్లియర్.. మిగిలింది అధికారిక ప్రకటనే!
ఢిల్లీ: మహాయుతి కూటమి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ దాదాపు వీడిపోయింది. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని.. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా చేతుల్లోనే తుది నిర్ణయం ఉందని ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీంతో తొలి నుంచి రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్‌కు దాదాపు లైన్ క్లియర్ అయ్యింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇక మిగిలింది అధికార ప్రకటనే!. రేపు(గురువారం) ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. దీనికి ఫడ్నవిస్, షిండే, అజిత్ పవార్లకు ఆహ్వానం అందింది. కుదిరితే ఈ భేటీ అనంతరం లేకుంటే సాయంత్రం మహారాష్ట్ర సీఎంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇదీ చదవండి: మోదీ చెప్పాల్సింది చెప్పా.. నిర్ణయం ఆయనదే!షిండే ఫిట్టింగ్తోనే..నవంబర్ 23వ తేదీన వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. 288 స్థానాలకుగానూ.. 237 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ 132, షిండే శివసేన 57, ఎన్సీపీ(అజిత్ పవార్) 41, ఇతరులు 7 సీట్లు ఉన్నాయి. ఫలితాలు వెలువడిన టైంలో.. ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆ వెంటనే షిండే, అజిత్ పవార్లు తామూ రేసులో ఉన్నామంటూ ముందుకొచ్చారు. సంఖ్యా బలానికి, సీఎం పదవికి సంబంధం లేదని, ఎవరు సీఎం అవుతారనేది చర్చించాకే ప్రకటిస్తామని ఏక్నాథ్ షిండే సైతం అన్నారు. దీంతో అసెంబ్లీ గడువు ముగిసినా.. సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈలోపు ఢిల్లీ పెద్దలు మూడు పార్టీల నేలతో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ అంగీకారం తెలిపి.. ఫడ్నవిస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే షిండే మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. ఫడ్నవిస్‌ను బీజేపీ సీఎంగా ఎంచుకోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. అందుకు తగ్గట్లే.. ఆయన వర్గీయులు కూడా షిండేనే సీఎంగా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు. ఈలోపే బీజేపీ అగ్రనేతల సంప్రదింపులతో షిండే మెత్తబడ్డారు. ఫలితంగానే.. బీజేపీ సీఎం పదవి తీసుకుంటే తనకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పడంతో ఫడ్నవిస్‌కు లైన్ క్లియర్ అయినట్లైంది. -
‘మహా’ సీఎం పదవి.. ఫడ్నవీస్ ఆసక్తికర కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి మహారాష్ట్రలో 288 స్థానాల్లో ఏకంగా 233 చోట్ల విజయాన్ని అందుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మహా సీఎం ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే తామే సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అనేది త్వరలోనే చెబుతామని చెప్పారాయన.తాజాగా సీఎం పదవిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మహాయుతిలోని మూడు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై సమాధానం చెబుతాం. మూడు పార్టీలు నేతలు కలిసి సీఎంను ఎంపిక జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తొందరపాటు ఏమీ లేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం పదవి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత సీఎంను ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.మరోవైపు.. మహాయుతి కూటమి నేతలు ముఖ్యమంత్రి పదవితో సహా మంత్రి పదవులపై కూడా ఫోకస్ పెట్టారు. మూడు పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారు. దీనిపై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్రలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో మంత్రి పదవుల్లో సగం వరకు కాషాయ పార్టీకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పదవులను శివసేన, ఎన్సీపీ పంచుకునే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు? అనేది తేలకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీటుపై పోటీ నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమిలో సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. -
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్ .. కౌన్ బనేగా సీఎం
ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి సీఎం అవడం లాంఛనమేనని, సోమవారం నూతన సర్కారు కొలువుదీరుతుందనివార్తలొచ్చాయి. కానీ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని కూటమి భాగస్వామి శివసేన (షిండే) పట్టుబడుతోంది. బిహార్ మోడల్‌ను మహారాష్ట్రలో కూడా బీజేపీ అమలు చేయాలని శివసేన (షిండే) అధికార ప్రతినిధి నరేశ్ మస్కే సోమవారం డిమాండ్ చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లున్నా సంకీర్ణంలోని మైనారిటీ భాగస్వామి జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ను సీఎం చేశారని గుర్తు చేశారు. ‘‘సీఎంగా మహాయుతి కూటమిని షిండే ముందుండి నడిపి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. కనుక ఆయన్నే కొనసాగించడం సబబు’’ అన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. కూటమిలోని మూడో పార్టీ ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అందుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. దాంతో సీఎంపై పీటముడి వీడక కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు కొలిక్కి రావడం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేత అమిత్ షా సమావేశమవుతారంటూ తొలుత వార్తలొచ్చాయి. దాంతో రాత్రికల్లా సస్పెన్స్ వీడుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. దాంతోప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫడ్నవీసే సీఎం అవడం ఖాయమని, అజిత్‌తో పాటు షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. షిండే సేనకు 12, పవార్ ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. ఫడ్నవీస్ తొలిసారి 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2019లో మళ్లీ సీఎం అయినా అజిత్ పవార్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం 80 గంటల్లోనే పడిపోయింది. ‘మంగళవారం డెడ్‌లైన్’ అవాస్తవం మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగుస్తున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనను అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘మంగళవారం డెడ్‌లైన్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘం శనివారమే గవర్నర్‌కు గెజిట్ కాపీ సమరి్పంచింది. కనుక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 73వ సెక్షన్ ప్రకారం కొత్త అసెంబ్లీ ఇప్పటికే పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టే లెక్క. రాష్ట్రపతి పాలన వచ్చేందుకు అవకాశమే లేదు’’ అని అసెంబ్లీ అధికారి ఒకరు వివరించారు. -
మరికొద్ది గంటలే.. షిండే వెనక్కి తగ్గకుంటే.. 2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ..సీఎం పదవికి, సంఖ్యా బలానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు. కూర్చొని చర్చించి సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. అదే టైంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి ఛాయిస్‌గా బీజేపీ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు.. మొదట సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన అజిత్ పవార్.. ఇప్పుడు బీజేపీకే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..మహా సీఎం పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఫడ్నవిస్-షిండే-అజిత్ పవార్లు ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుత సీఎం షిండే రేపు రాజీనామా చేస్తారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన ప్రకటించింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నేతగా షిండేను ఎన్నుకుంది కూడా. అయితే..మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. పరిస్థితుల దృష్ట్యా కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది. 2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 33 రోజుల పాటు ఆ టైంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇక.. 2014లోనూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ). మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, తదనంతరం సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇంతకు ముందులా లేదుగా.. ..మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లను బీజేపీ దక్కించుకుంది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని.. బీజేపీ కూటమిగా(161 సీట్లతో) సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం డిమాండ్ చేశారాయన. కుదరకపోవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆపై కలిసొచ్చిన అవకాశం అందిపుచ్చుకుని కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఇక..2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి.. బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. ఆ టైంలోనూ ఫడ్నవిస్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మరోవైపు.. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఫడ్నవిస్ సీఎంగా ఉండి.. షిండే, పవార్లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగడమే సబబని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు షిండే అంగీకరిస్తారో లేదో? అనేది ఈ రాత్రికల్లా తేలిపోవాల్సి ఉంది. లేకుంటే.. రాష్ట్రపతి పాలన తప్పదు!. -
షిండేనే మహారాష్ట్ర సీఎం.. తెరపైకి బీహార్ మోడల్!
ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్‌కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ. బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు. బీహార్ మోడల్ ఏంటంటే..2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్‌ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది. -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
‘మహా’ సీఎంపై పీటముడి!
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే చెప్పారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్ నిలిచారు. -
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
బారామతిలో అజిత్‌పవార్‌కు భారీ మెజారిటీ
పుణె:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(అజిత్‌పవార్) చీఫ్ అజిత్‌పవార్ భారీ విజయం నమోదు చేసుకున్నారు. శనివారం(నవంబర్23) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ ఏకంగా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఈ ఎన్నికలో ఆయన లక్షా81వేల ఓట్లు సాధించారు. అజిత్ పవార్ తన సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యోగేంద్రపైనే గెలుపొందారు. యోగేంద్ర ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పార్టీని విజయతీరాల వైపు నడిపించడంతో పాటు అజిత్‌పవార్ స్వయంగా ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. కాగా, ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ ఎంపీగా పోటీచేశారు. ఇక్కడ ఈమె శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం గమనార్హం. -
శరద్ పవార్ శకం ముగిసినట్లే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) ఘోర పరాజయం పాలైంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఆ పార్టీ పొత్తులో భాగంగా 86 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 10 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ చీలిక వర్గం ఎన్సీపీ(అజిత్‌పవార్) 59 స్థానాల్లో పోటీచేసింది. 41 స్థానాల్లో విజయం సాధించింది. శరద్ పవార్‌కు కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థిగా పోటీ చేసిన శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఓడిపోయాడు. ఐదు నెలల క్రితం ఇదే బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఆమె ఓడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేసిన శరద్ పవార్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇకపై ఎన్నికలకు దూరంశరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గత ఏడాది జూలైలో ఎన్సీపీని చీల్చారు. బీజేపీ–శివసేన(షిండే) కూటమితో చేతులు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. అసలైన ఎన్సీపీ తమదేనంటూ శరద్ పవార్ చేసిన పోరాటం ఫలించలేదు. పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కే కేటాయించింది. కుట్రదారులను ఓడించాలంటూ శరద్ పవార్ చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ప్రజలు మన్నించలేదు. 57 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనుంది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో శరద్ పవార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ‘ఇండియా’కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్)ని తమ కూటమిలోకి తీసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకు గాను ఎంవీఏ ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తగిన ప్రభావం చూపలేక చతికిలపడింది. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన శరద్ పవార్ చాణక్యం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకున్న శరద్ పవార్ ఈసారి 10 సీట్లకే పరిమితమయ్యారు. సోనియాతో విభేదించి కాంగ్రెస్‌తో పొత్తు 1940 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బారామతిలో జని్మంచిన శదర్ పవార్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ శిష్యుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1967లో 27 ఏళ్ల వయసులోనే తొలిసారి బారామతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి జనతా పారీ్టతో పొత్తు పెట్టుకున్నారు. పవార్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 1986లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి, రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీలకమైన రక్షణ, వ్యవసాయ శాఖలు ఆయన లభించాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ విదేశీయురాలు అని విమర్శిస్తూ 1999లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ)ని స్థాపించారు. తర్వాత అదే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి కొనసాగింది. తాజా ఎన్నికల్లో శరద్ పవార్ దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ శకం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎక్కువ సీట్లు వచ్చినవాళ్లే సీఎం కావాలనేం లేదు: షిండే
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మహాయుతి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వన్‌సైడెడ్ కావడంతో.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపైకి అందరి దృష్టి మళ్లింది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతలోపే సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే చర్చ మొదలైంది.మహారాష్ట్రలో షిండే వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమికి సంబంధించిన మూడు పార్టీల నుంచి.. ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా? ఇవేవీ కాకుంటే.. ‘మహా’కు సీఎం కావాలన్న అజిత్ పవార్ ఆశయం నెరవేరుతుందా? అనే చర్చ నడుస్తోంది. అయితే..మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మరోవైపు.. షిండే ఫిటింగ్ మొదలైంది. గెలుపు సంబురాల్లో మీడియాతో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడారు. అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం అన్నారు. అలాగే.. కూర్చుని మాట్లాడుకుని సీఎంను నిర్ణయిస్తామని అన్నారాయన. మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపులో శివసేన పాత్రే సింహభాగం ఉందని, తన తండ్రే సీఎం కావాలని అంటున్నాడు. అదే టైంలో.. అజిత్ పవార్ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని అంటోంది. ప్రజలు అజిత్ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనేది హైడ్రామాను తలపించే అవకాశమూ లేకపోలేదు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
మహారాష్ట్ర అధికార కూటమిలో చీలిక..
-
మహా ప్రభుత్వంలో విభేదాలు.. అజిత్ పవార్ Vs ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు భయపడుతున్నాయి. ఇటీవల హర్యానా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదం చేశారు.ఈ నినాదాన్ని మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి అన్వయించడాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఘండ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమో కానీ..మహారాష్ట్రలో పనిచేయదని వ్యాఖ్యానించారు.దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్ధం చేసుకోవాలని సూచించారు. అజిత్ పవార్ దశాబ్దాలుగా లౌకిక, హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతోనే ఉన్నారు. సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారిలో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడమే లౌకికవాదమని భావించే వ్యక్తులతో ఆయన కొనసాగుతూ వచ్చారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికినాయనకు కొంత సమయం పడుతుంది’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.గతంలో మాతో కలిసున్నవారు (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) దీనిని అర్ధం చేసుకోలేరని విమర్శించారు. ‘ఈ వ్యక్తులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేరు లేదా ఈ నినాదం అర్థం చేసుకోలేరు లేదా మాట్లాడేటప్పుడు వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు’ అని మండిపడ్డారు. మరోవైపు ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ బీజేపీ నాయకులు పంకజా ముంబే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదాన్ని విభేదించారు. దీంతో మోదీ ఈ నినాదాన్ని ‘ఏక్ హై తో సేఫ్ హై’గా మార్చారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో గురువారం నాటి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చశనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఎన్సీపీ’ గుర్తు వివాదం..సుప్రీంకోర్టులో ‘ట్రంప్’ ప్రస్తావన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ అసలు గుర్తు గడియారంతో అజిత్‌పవార్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ గుర్తుపై కోర్టులో వివాదం నడుస్తోందని ప్రచారంలో స్పష్టంగా పేర్కొన్నాలని ఎన్నికల ప్రచారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే పార్టీ ప్రచార ప్రకటనల్లో అజిత్‌పవార్ ఈ నిబంధనను సరిగా పాటించడం లేదని శరద్‌పవార్‌వర్గం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 13)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన సుప్రీం కోర్టులో వచ్చింది. అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ పత్రికల్లో ఇచ్చిన ప్రచార ప్రకటనలు చూపిస్తూ శరద్‌పవార్ వర్గం న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి వాదిస్తున్నారు. అయితే ఆ పేపర్లలో అజిత్ పవార్ పార్టీ ప్రకటనలకు కాస్త పైనే ట్రంప్ ఫొటో ఉంది. దీనిని గమనించిన జడ్జి జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాది సింఘ్వీకి సరదాగా ఈ విషయం చెప్పారు. ట్రంప్ ఫొట కూడా ప్రకటనలకు దగ్గరగా ఉందన్నారు. దీనికి స్పందించిన సింఘ్వీ ట్రంప్ ఎలాంటి పిటిషన్ వేయలేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ పరిణామంతో సుప్రీంకోర్టులో సరదా వాతావరణం నెలకొంది. తర్వాత కేసులో వాదనలు కొనసాగాయి. ఇదీ చదవండి: అజిత్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చివాట్లు -
ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై సుప్రీంకోర్టు మండిపడింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అజిత్ పవార్ ఫోటోలను, వీడియోలను.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉపయోగించకూడదని హెచ్చరించింది.‘మీ సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం బుధవారం చీవాట్లు పెట్టింది. శరద్ పవార్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉపయోగించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సర్క్యులర్ జారీ చేయాలని అజిత్ పవార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. కాగా అజిత్ పవార్ వర్గానికి పార్టీ చిహ్నమైన గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ సందర్భంగా శరద్ పవార్‌కు చెందిన వీడియోలను అజిత్ పవార్ వర్గం ప్రచారం చేస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. అయితే అజిత్ పవార్ వర్గం తరపు నసీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. అదిపాత వీడియో అని తెలిపారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.‘ఈ వీడియో పాతది అయినా కాకపోయినా, శరద్ పవార్‌తో మీకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీరు మీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రత్యేకమైన, భిన్నమైన రాజకీయ పార్టీగా మీ సొంత గుర్తింపును కనుగొనండి అని తెలిపారు. -
Rayani Dairy: అజిత్ పవార్ (డిప్యూటీ సీఎం)రాయని డైరీ
ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్‌జీ అంటే నాకు గౌరవం. సాధారణ గౌరవం కాదు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మీద, నా సహ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉన్న గౌరవంతో సమానమైన గౌరవం. ‘‘అదంతా నాటకం, గౌరవం కాదు’’ అని శరద్‌జీ అనుకుంటున్నా కూడా... నేనా యన్ని గౌరవించటం మానను. మనిషి ఎదుటా మానను, మనిషి చాటునా మానను.భుజాలపై ఎప్పటికీ అలా ఉంచేసుకుం టారని స్టేజీ పైకి వెళ్లి శాలువాను కప్పి వస్తామా ఎవరికైనా? గౌరవమూ అంతే! మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటున్నారా, లేదా అని మనం వెళ్లి అస్తమానం తొంగి చూస్తుండ కూడదు. అసలు చూసేందుకు వెళ్లనే కూడదు. గౌరవించాలి, వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేసి వేరే పనిలో పడిపోవాలి. అయితే గౌరవనీయులు కొన్నిసార్లు తిన్నగా ఉండరు. మనల్నీ తిన్నగా ఉండ నివ్వరు. శరద్‌జీ పై నాకున్న గౌరవాన్ని నేను కాపాడుకోవలసిన పరిస్థితులను శరద్‌జీ ఈమధ్య నాకు తరచుగా కల్పిస్తున్నారు!సంతోషమే. ఆయనేం చేసినా ఆయనపై నా గౌరవం ఎక్కడికీ పోదు. కానీ నన్నుపంపించేందుకే ఆయన తన ఎన్నికలప్రచారంలోని అమూల్యమైన సమయాన్నంతా వినియోగిస్తున్నారు. ‘బారామతి’లో నాకు పోటీగా నా తమ్ముడి కొడుకు యోగేంద్ర పవార్‌ను దింపారు. ‘‘బాహుబలీ! నీదే ఇకపైబారామతి’’ అని ఆశీర్వదించారు. యోగేంద్ర నా తమ్ముడి కొడుకైతే, నేను శరద్జీతమ్ముడి కొడుకుని. ఇద్దరు ‘తమ్ముడికొడుకుల’ మధ్య పోటీకి బారామతే దొరికిందా శరద్జీకి? ‘‘ఇక చాలు. ముప్పై ఏళ్లు నేను బారామతి ఎమ్మెల్యేగా ఉన్నాను. ముప్పై ఏళ్లు అజిత్ బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడిక మూడో తరం రావాలి, యోగేంద్ర రాబోయే ముప్పై ఏళ్లు బారామతి ఎమ్మెల్యేగా ఉండాలి’’ అని సభల్లో హోరెత్తిస్తున్నారు శరద్‌జీ!ఇక చాలా!! ఎవరికి చాలు? వరుసలో కూర్చొని భోజనం చేస్తున్నవారు తాముతింటూ, ‘‘వాళ్లకు ఇక చాలు’’ అని పక్క వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పినట్లుంది శరద్‌జీ నా మాటెత్తి ‘‘ఇక చాలు’’ అనటం!ఇలాంటప్పుడే, శరద్‌జీ పైన నాకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ రావటం నాకు కష్టమైపోతుంటుంది. ‘‘పాత తరం ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి, కొత్త తరం రావాలి...’’ అంటు న్నారు శరద్‌జీ! ఏదీ, పాత తరం ఎక్కడఆగింది? 83 ఏళ్లు వచ్చినా ఇంకా ర్యాలీలు తీస్తూనే ఉంది. మరో రెండేళ్లు రాజ్యసభఎంపీగా కూడా ఉంటుంది. పాత తరం ఎప్పటికీ ఆగిపోదని, పార్టీ అధ్యక్షుడిగాఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలంఉండిపోతుందని తేలిపోయాకే కదా నేనుకొత్త దారి వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చేశాక కూడా నేను శరద్జీని గౌరవించటం మానలేదు. నవంబర్ 20న పోలింగ్. ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన ఎన్సీపీ నాది. శివసేన నుంచి బయటికి వచ్చిన శివసేన ఏక్నాథ్ షిందేది. ఎన్సీపీ–శివసేన–బీజేపీ కలిసిన మా ‘మహాయుతి’కి; శరద్‌జీ ఎన్సీపీ–ఉద్ధవ్ ఠాక్రే శివసేన–కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ ఆఘాడీ’ కి మధ్య 288 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఇది. కానీ శరద్‌జీ అలా అనుకుంటున్నట్లు లేరు! ఇదంతా బారామతి కోసం జరగబోతున్న మహా సంగ్రామం అని, వాళ్లు మొత్తం అన్ని చోట్లా గెలిచినా, బారామతిలో నేను ఒక్కడినీ ఓడిపోకపోతే వాళ్లదసలు గెలుపే అవదని ఆయన భావిస్తున్నట్లుంది! ఆయన భావన ఎలాంటిదైనా ఆయనపై నా గౌరవ భావన మాత్రం చెక్కు చెదిరేది కాదు.-మాధవ్ శింగరాజు -
సీఎం యోగి వ్యాఖ్యలను ఖండించిన అజిత్ పవార్
ముంబై: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఖండించారు. యోగి పేరు ప్రస్తావించడకుండా.. బయట వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తారని, మహారాష్ట్ర ఎప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.‘మహారాష్ట్రను ఇతర రాష్ట్రాలతో ఎవరూ పోల్చకూడదు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. బయటి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేస్తున్నారు, కానీ మహారాష్ట్ర ఎప్పుడూ మత విభజనను అంగీకరించలేదు. షాహు (మహారాజ్), జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లౌకిక భావజాలాన్ని రాష్ట్రం అనుసరిస్తోంది’ అని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన పార్టీ అభ్యర్థి నవాబ్ మాలిక్ తరపున తాను ప్రచారం చేస్తానని అజిత్ పవార్ తెలిపారు. మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. మన్ఖుర్డ్-శివాజీనగర్ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే శివసేన కూడా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టింది.ఇద్దరూ మహాయుతి అభ్యర్థులు కాగా, బీజేపీ మాత్రం షిండే అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. మాలిక్‌కు ప్రచారం చేయడం లేదని స్పష్టం చేసింది.కాగా అజిత్ పవార్ ఎన్సీపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే యోగి వ్యాఖ్యలపై అజిత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కూటమిలో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. -
మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికార కూటమి ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించడానికి కొల్హాపూర్‌లో నిర్వహించిన మహాయుతి ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించిన పది హామీల్లో ఈ హామీలు ఉన్నాయి. వరి రైతులకు హెక్టారుకు రూ. 25,000 బోనస్, వ్యవసాయ రుణాల మాఫీ, లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక ప్రయోజనాన్ని రూ.1,500 నుండి రూ.2,100కి పెంపు. 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి హామీలు ఇచ్చారు.राष्ट्रवादी काँग्रेस पार्टी घोषणापत्र प्रकाशनाचे थेट प्रक्षेपण https://t.co/aOTUc1UcyS— Ajit Pawar (@AjitPawarSpeaks) November 6, 2024 బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. ‘లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది’ అని అన్నారు. -
‘అలా చేయటం.. నన్ను ఎంతో బాధపెట్టింది’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను అనుకరించటం చాలా బాధపెట్టిందని ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవర్ అన్నారు. శరద్ పవార్ అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ అలా చేయడం సరికాదని అన్నారు. తన తల్లి పేరు ప్రస్తావనతో భావోద్వేగానికి గురయ్యానని, అది సహజంగానే జరిగిందని చెప్పారు.‘‘నేనెప్పుడూ శరద్ పవార్‌ని దేవుడిగా భావించే వ్యక్తిని. కానీ ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని అనుకరించారు. శరద్ పవార్ అనుభవజ్ఞులైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు. అదే పని.. బారామతి అభ్యర్థి యోగేంద్ర పవార్ లేదా ఇతరులు ఎవరైనా చేసి ఉంటే ఫర్వాలేదు. మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. నేను కన్నీళ్లు పెట్టుకున్నా. అది చాలా సహజమైంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. నేను నా రుమాలు తీయలేదు. కానీ ఆయన అలా చేశారు. ఇంత కాలం ఆయన రాజ్ ఠాక్రేను మాత్రమే అనుకరిస్తారని అనుకున్నా. కానీ నిన్న(మంగళవారం) శరద్ పవార్ నన్ను కూడా అనుకరించారు. ఆయన అలా చేయటం నిజంగా చాలా బాధ పెట్టింది’ అని అన్నారు.చదవండి: ‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’ -
Maharashtra: ఎన్సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్‌పై బీజేపీ మండిపాటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరైన నవాబ్ మాలిక్ అభ్యర్థిత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలకు మన్‌ఖుర్ద్ శివాజీ నగర స్థానానికి ఆఖరి నిమిషంలో ఆయన రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ సభ్యుడిగా చేశారు. చివరికి ఎన్సీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నుంచే పోటీలోకి దిగుతున్నారు. కాగా మాలిక్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.తాజాగా నవాబ్ మాలిక్ రెండు నామినేషన్లు వేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అశిష్ షెలార్ మాట్లాడుతూ.. కూటమిలోని అన్నిపార్టీలు తమ సొంత అభ్యర్థిని నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. ‘ఎన్సీపీకి సంబంధించి నవాబ్ మాలిక్ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించే ఇక్కడ సమస్య. బీజేపీ వైఖరిని దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పదే పదే స్పష్టం చేశారు, నేను మళ్ళీ చెబుతున్నాను. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదు. మేము అతని కోసం ప్రచారం చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే దావూద్ సంబంధిత కేసులతో సంబంధం ఉన్న ఎవరికీ మేము ప్రచారం చేయము’. అని పేర్కొన్నారు.వాస్తవానికి నవాబ్ మాలిక్ అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటు తన కుమార్తె సనా మాలిక్‌కు న్సీపీ కేటాయించింది. దీంతో నవాబ్ మాలిక్ మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే నవాబ్ మాలిక్‌కు నామినేషన్ ఇవ్వవద్దని అజిత్ పవార్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
నటి భర్త కంటే బెటర్: ప్రత్యర్థిపై నవాబ్ మాలిక్ కుమార్తె
ముంబై: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ నేత( అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరిన నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌తో ఆమె తలపడనున్నారు. ఈ సందర్భంగా సనా మాలిక్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఫహద్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు. తాను నవాబ్ మాలిక్ కుమార్తె అయినందుకు గర్వపడుతున్నానని, నవాబ్ మాలిక్ కూతురు అనుశక్తి నగర్ కూతురిగా మారగలదని తెలిపారు. ఇది ఓ నటి భర్త కావడం కంటే మేలే అంటూ విమర్శలు గుప్పించారు.అనుశక్తి నగర్‌లోని ప్రజల కోసం తాను కష్టపడి పనిచేశానని, నామినేషను దాఖలు చేసే సమయంలో స్థానికులు తన వెంట రావడం వారి మద్దతుకు నిదర్శనమని సనా మాలిక్ అన్నారు. ఫహద్ అహ్మద్ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆమె అన్నారు.‘ ఇది రాజకీయం. ఎవరూ శత్రువులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం అహ్మద్ నా ప్రత్యర్థి. నేను ఫహద్ గురించి మాట్లాడను, కానీ ఇక్కడి ప్రజలకు నన్ను నవాబ్ మాలిక్ కూతురిగా మాత్రమే తెలుసునని నేను చెబుతాను, కానీ నేను వారి ఇళ్లకు వెళ్లినప్పుడు, వారితో టీ తాగేటప్పుడు, మా మాటలు వినండి, వారు నన్ను తెలుసుకుంటారు. సమస్యలు" అని సనా మాలిక్ అన్నారు.కాగా సనా మాలిక్ తండ్రి నవాబ్ మాలిక్, అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి ఆయన పోటీ చేయున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో..ఫిబ్రవరి 2022లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
ఎన్సీపీలో చేరిన బాబా సిద్దిఖీ కుమారుడు
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్ పవార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా జీషన్ మాట్లాడుతూ.. ఇది తనకు, తన కుటుంబానికి ఉద్వేగభరితమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో తనును నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన వాంద్రే ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే నామినేషన్ వేసి ప్రజలందరి ప్రేమ, మద్దతుతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.కాగా 2019 ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్ నుంచి గెలుపొందిన 32 ఏళ్ల జీషన్ సిద్దిఖీ.. గత ఆగస్టులో మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాంద్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వ్యక్తం చేస్తూ జీషన్.. ఎన్సీపీలో చేరారు. -
‘గడియారం’ అజిత్ పవార్ వర్గానికే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్‌కు ఎంతో అనుబంధం ఉంది. గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది. -
మరో సంచలనం : అజిత్ పవార్‌పై శరద్ పవార్ మనవడు పోటీ
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. Pune | On Baramati candidate selection, Maharashtra State President of the NCP (Sharadchandra Pawar faction), Jayant Patil says, "Baramati candidate selection is based on the demand from the local people of Baramati...I had the interaction with them...They have suggested he is… pic.twitter.com/Fi2mClnFrr— ANI (@ANI) October 24, 2024లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్‌పై తన మనవడు శరద్‌పవార్‌ను పోటీకి దించడం సంచలనంగా మారింది. -
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్ పవార్ ఎన్సీపీకి భారీ షాక్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధాంచాలంటూ శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని సుప్రీం ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని సున్నిహితంగా హెచ్చరించింది. అంతేగాక అజిత్ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, శరద్ పవార్ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.కాగా 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చీలికత ర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా, ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. శరద్ చంద్ర పవార్ వర్గానికి.. ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ఈసీ ఖరారు చేసింది. -
బారామతి బరిలో అజిత్
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. 45 మందితో శివసేనజాబితా విడుదల మంగళవారం అర్ధరాత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. శివసేన(యూబీటీ) తొలిజాబితా ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్. -
బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ).. అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటించగాగా.. పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట ఉన్న బారామతి స్థానం నుంచి పోటీ చేయనున్నారు.ఎన్సీపీకి చెందిన 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థులుగా తొలి జాబితాలో పేర్కొన్నారు. యెవ్లా స్థానం నుంచి ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్, నవాపూర్ సీటు నుంచి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు గవిత్ కుమారుడు భరత్ గవిత్ బరిలోకి దిగుతున్నారు. కాగా, ఎన్సీపీకి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను దిండోరి నుంచి, గతంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అర్జుని-మోర్గావ్ నుంచి, అంబేగాన్ నుంచి దిలీప్ వైస్-పాటిల్, పార్లీ నుంచి ధనంజయ్ ముండే, కాగల్ నుంచి హసన్ ముష్రిఫ్ పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్పురి)లను కూడా ఎన్సీపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ. శివసేన(ఏక్నాథ్ షిండే)తో కలిసి ఎన్సీపీ(మహాయుతి కూటమి) పోటీ చేస్తుంది. ఇప్పటికే ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు -
‘ఢిల్లీకి వెళ్లడం ఇష్టంలేని అజిత్ దాదా మాత్రమే తెలుసు’
ముంబై: తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి పర్యటించటంపై ఎన్సీపీ( ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడని తన సోదరుడు గుర్తుకువస్తున్నారని అన్నారు. నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. అజిత్ పవార్ తరచూ ఢిల్లీకి వెళ్లటంపై మీడియా అడిగిన ప్రశ్నకు సుప్రియా సూలే స్పందించారు.‘‘ఢిల్లీకి వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడని అజిత్ దాదా మాత్రమే నాకు గుర్తున్నారు. కొన్ని నెలలు నేను ఆయనతో టచ్‌లో లేను. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. ఆయన ఢిల్లీకి ఎందుకు వచ్చారో నేను సమాధానం చెప్పలేను’’ అని అన్నారు.మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం దాదాపు ఖరారు చేసినట్లు అజిత్ పవార్ మంగళవారం తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుత కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బీజేపీ 152-155 సీట్లు, శివసేన (షిండే) 78-80 సీట్లు, ఎన్సీపీ( అజిత్ పవార్)కు 52 నుంచి 54 సీట్లలో పోటీచేసేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. శివసేన( షిండే) 45 మందితో మంగళవారం తొలి జాబితా విడుదల చేసింది. -
అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్
ముంబై: అందమైన అమ్మాయిలు ఎవరూ రైతు బిడ్డని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన అజిల్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో భుయార్ మాట్లాడుతూ.. ఉద్యోగం ఉన్న అబ్బాయిలనే అందమైన అమ్మాయిలు ఎంచుకుంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. కొందరు అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ.. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉంది అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సూచించారు.ఇది కూడా చదవండి: వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే? -
గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్ పవార్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్ పవార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.ఇక.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్ పవార్ దాఖలుచేసిన పిటిషన్ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
అజిత్‌పవార్‌పై సుప్రియాసూలే ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: ఎన్సీపీ పగ్గాలు తన కజిన్ అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని, ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ సుప్రియాసూలే అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సూలే ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీవీడి వెళ్లారు. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేశారు. ఇది వారసత్వ సమస్య కానేకాదు. ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు. ఇది కేలం కూటమి సమస్య. ఆయన బీజేపీ, శివసేన కూటమితో వెళ్లాలనుకున్నందున వెళ్లిపోయారు’అని సూలే వివరించారు. ఈ విషయంలో అజిత్ పవార్‌తో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సూలే సవాల్ విసిరారు. కాగా, శరద్‌పవార్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్ పవార్ కైవశం చేసుకున్నారు. -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. -
‘బాబోయ్ వాంతులు’.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు!
వీళ్ల పక్కన కూర్చోవాలంటేనే నాకు వాంతి వచ్చినట్లే అనిపిస్తుందంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందోనని అధికార మహాయుతి కూటమి నేతలకు భయం పట్టకుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంత్రి తానాజీ సావంత్ ఎన్సీపీ (అజిత్‌పవార్), కాంగ్రెస్ పట్ల తనకున్న అయిష్టత గురించి బహిర్గతం చేశారు. ‘‘నేను హార్డ్‌కోర్ శివసైనికుడిని. నా జీవితంలో కాంగ్రెస్, ఎన్సీపీతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. విద్యార్థి దశ నుంచి ఆ రెండు పార్టీలకు నేనెప్పుడూ దూరమే. కానీ రాజకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ నేతలతో కలిసి కేబినెట్ సమావేశంలో కూర్చోక తప్పడం లేదు. కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’’ అని మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వ్యాఖ్యానించారు.STORY | Sit next to NCP ministers at cabinet meetings but it’s nauseating: Shiv Sena’s Tanaji SawantREAD: https://t.co/fMan6gEu4UVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/YQIlgm72Hf— Press Trust of India (@PTI_News) August 30, 2024 ధర్మాన్ని కాపాడేందుకే మౌనంమరోవైపు తానాజీ సావంత్ కామెంట్స్‌పై ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ ఓకింత అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.బీజేపీకి అజిత్ పవార్ అవసరం తీరినట్లుందితానాజీ సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గం నేతలతో పాటు ఎన్సీపీ (శరద పవార్) వర్గం నేతలు సైతం స్పందిస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ..తానాజీ వ్యాఖ్యలు మహాయుతి సంకీర్ణానికి ఇకపై అజిత్ పవార్ ఎన్సీపీ అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్ఎస్ఎస్లో కూడా అజిత్ పవార్‌తో పొత్తుపై ఆందోళనలు తలెత్తాయని, ఇప్పుడు సావంత్ ప్రకటనతో ఆందోళనలు బహిర్గతం అయ్యాయని సూచించారు. బీజేపీ అజిత్ పవార్‌ను మహాయుతి నుండి బయటకు పంపే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు బాగలేవని చెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిఅజిత్ పవార్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్సీపీతో పొత్తుపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్సీపీ (ఎస్పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్‌సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ పవార్ అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని రాజీ చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మరి ఈ వరుస పరిణామాలపై మహాయుతి కూటిమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.తానాజీ సావంత్ వ్యాఖ్యలతో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమి నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బంధాలు, బిజినెస్ ఒకటి కాదు.. అజిత్ పవార్‌కు సోదరి కౌంటర్
ఎన్సీపీ(శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే.. తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వానికి తమ ప్రియమైన సోదరీమణులను గుర్తుకు రాలేదు కానీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ వారి ప్రేమ పొంగిపొర్లుతుందని సెటైర్లు వేశారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సోలే మీద పోటీకి తన భార్య సునేత్ర పవార్‌ను నిలబెట్టినందుకు బాధపడుతున్నట్లు అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సుప్రియా తన సోదరుడికి కౌంటర్ ఇచ్చింది.ఆమె మాట్లాడుతూ.. బంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన సోదరులు గుర్తించలేకపోతున్నారు. ఎవరూ కూడా బంధాల మధ్యలోకి డబ్బును తీసుకురాకూడదు. అదే విధంగా వ్యాపారంలోకి సంబంధాలను లాగకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది.’ అని అన్నారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల నిజమైన ప్రేమ లేదని, ఎన్నికల లబ్ధి కోసం సంక్షేమ పథకాలను సాధనాలుగా వాడుకుంటుందని విమర్శించారు.‘ఈ ప్రభుత్వం ఏం చేసిన ఓట్ల కోసమే. మంచిఉద్దేశ్యంతో ఏం చేయదు. ఇదీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవ్వరూ అభిమానం చూపలేదు. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ నని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ‘లడ్కీ బహిన్’ స్కీమ్‌ను ఉద్ధేశించి చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు -
బారామతి అసెంబ్లీ బరిలో అజిత్ పవార్ కుమారుడు?
ముంబై: మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో వేగం పెరుగుతోంది. కీలకమైన బారామతి అసెంబ్లీ స్థానంలో తన కుమారుడు పోటీ చేయటంపై ఎన్సీపీ (అజిత్ పవార్) చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తను కుమారుడు జయ్ పవార్.. బారామతి నుంచి బరిలో దింపే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేను. నేను ఇప్పటికే ఏడెనిమిదిసార్లు పోటీ చేశాను. జయ్ పవార్ బారామతి బరిలో దించాలని ప్రజలు, పార్టీ మద్దతుదారులు కోరుకుంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు చర్చిస్తుంది. పార్లమెంటరీ బోర్డు అనుమతి ఇస్తే.. జయ్‌ను బారామతి బరిలో దింపటానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.అదే విధంగా తనకు,ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మధ్య విభేదాల గురించి మీడియాలో వచ్చిన కథనాలను తొలగించాలని మీడియాను కోరారు. తాము ఇద్దరం కలిసి విజయవంతంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇటీవల బారామతి లోక్‌సభ స్థానంలో సుప్రియా సూలేపై తన భార్య సునేత్రను పోటీకి దింపడం పొరపాటు అని అజిత్ పవార్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పదించాలని విలేకర్లు కోరగా.. ఈ విషయం గురించి తాను ఇప్పటికే మాట్లాడానని అన్నారు. ‘నేను ఒకరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఈ విషయంపై చర్చ చేయాల్సిన అవసరం లేదు’అని అన్నారు.మరోవైపు.. అజిత్ పవార్ పోటీచేయబోనని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత సునీల్ తట్కరే స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అజిత్ పవార్ చెప్పలేదని అన్నారు. ‘అజిత్ పవార్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పలేదు. ఆయన కొన్ని ప్రణాళికలు కలిగి ఉండవచ్చు. మేము వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు. అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్థ్ పవార్ భారీ మెజార్టీతో ఓడిపోయారు. -
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
మహారాష్ట్ర బీజేపీ కూటమిలో మొదలైన సీట్ల పంచాయితీ!
ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా.. బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల విభజనపై కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతున్నట్లు వస్తున్న వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
నాకు 80 నుంచి 90 అసెంబ్లీ సీట్లు కావాల్సిందే.. అమిత్‌షాతో అజిత్ పవార్
ముంబై : తర్వలో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి భాగస్వామ్యాల మధ్య సీట్ల పంపకంపై చర్చలు షురూ అయ్యాయి. చర్చల్లో భాగంగా బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తన వర్గానికి (నేషనలిస్ట్ కాంగ్రెస్ట్ పార్టీ అజిత్ పవార్ వర్గం) 80-90 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.అంతేకాదు లోక్‌సభ ఎన్నికల తరహాలో చివరి నిమిషం వరకు చేసినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో చేయొద్దని వీలైనంత త్వరగా సీట్ల పంపిణీ ఖరారు చేయాలని అజిత్ పవార్ తేల్చి చెప్పినట్లు పలు జాతీయమీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సీట్ల కేటాయింపులో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయడంపై అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్ర,మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర (ఖండేష్) ప్రాంతం నుంచి కాంగ్రెస్‌పై 20 స్థానాల్లో పోటీ చేయాలని, మైనారిటీ వర్గాల ప్రాబల్యం ఉన్న ముంబైలోని 4–5 స్థానాల్లో కాంగ్రెస్‌పై పోటీ చేసేందుకు అజిత్ పవార్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుండగా, బీజేపీ 160 నుంచి 170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. మహరాష్ట్రాలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు మహాయుతి కూటమిలోని మూడు ప్రధాన భాగస్వామ్యాలు ఒకదానికొకటి సీట్లను ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి మరి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ 28 స్థానాలకు గాను 2019లో గెలిచిన 23 స్థానాల్లో కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలవగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం రాయగఢ్‌లో ఒక్క సీటును, శరద్ పవార్ వర్గం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని ఆర్ఎస్ఎస్ అనుసంధాన వారపత్రిక ‘వివేక్’ ఆరోపించింది. దీంతో పాటు అజిత్ పవార్‌ను టార్గెట్ చేస్తూ పూణేకు చెందిన 28 మంది ఎన్సీపీ నాయకులు, పింప్రి-చించ్వాడ్ యూనిట్ నగర అధ్యక్షుడితో సహా ,ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)లో చేరడానికి పార్టీని వీడారని తెలిపింది. ఇలా అజిత్ పవార్ గురించి కథనాలు వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలో అజిత్ పవార్.. అమిత్ షాతో భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది. -
అజిత్‌కు శరద్ పవార్ మరో ఛాన్స్.. వ్యాఖ్యల అర్థం అదేనా?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ పలువురు అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆ పార్టీకి గుడ్‌చెప్పి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్) వర్గంలో చేరారు. అయితే ఈ క్రమంలో అజిత్ పవార్ సైతం శరద్ పవార్ వర్గంలో చేరుతారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. అయితే అజిత్ పవార్.. తమ వర్గంలోకి తిరిగి రావాలని ఆసక్తి చూపిస్తే చేర్చుకోవటంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు శరద్ పవార్. అజిత్ పవార్‌ను తమ వర్గంలో చేర్చుకునే విషయం తన చేతిలో లేదని, అటువంటి విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.‘ప్రతి ఒక్కరికి తమ పార్టీలో స్థానం ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇతర పార్టీలు నేతలను చేర్చుకోవటంలో నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. నాతోపాటు పార్టీ నేతలందరీని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.ఇక.. అజిత్ పవర్ వర్గానికి చెందిన పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ భోసలే, స్టూడెంట్ వింగ్ చీఫ్ యష్ సానేతోపాటు, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ బుధవారం ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) వర్గంలో చేరారు. వీరంతా తమ పార్టీలో తిరిగి చేరటాన్ని శరద్ పవార్ స్వాగతించారు.కాగా, శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మరోమూడు నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ మారిన నేతల నిర్ణయంతో అజిత్ పవార్ (ఎన్సీపీ) పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో పలువురు నేతల చేరికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పందిచారు. ‘ప్రతిపక్షాలు సైతం శరద్ పవార్‌పై నమ్మకంతో తమ వర్గంలో చేరటానికి ఆసక్తి చూపుతున్నాయి. అందుకే పలువురు నేతలు తమ పార్టీలో చేరారు’ అని ఆమె అన్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది.ఇక.. గతేడాది 8 మంది రెబెల్ ఎమ్మెల్యేతో అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెచ్చి.. శివసేన (షిండే)వర్గం-బీజేపీ కూటమిలో ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. -
అజిత్ పవార్‌కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్‌కు టచ్‌లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్ పవార్ వర్గంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు గట్టి షాక్ తగిలింది. అజిత్ పవార్‌కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్ పవార్‌తో జతకట్టనున్నారు.పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్ పవార్‌కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.అజిత్ పవార్ వర్గంలో అలజడిపింప్రి చించ్వాడ్కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్ పవార్ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్‌ను కాదని శరద్ పవార్‌తో టచ్‌లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్ అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.షాక్‌లోకి అజిత్ పవార్ వర్గంఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్‌కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలుకాగా, ఈ ఏడాది నవంబర్‌లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్ పవార్ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. -
మహారాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు?
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్న క్రమంలో బీజేపీ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులుపై మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న పీయూష్ గోయల్ కొన్ని రోజులుగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర బీజేపీ న్యాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (శివసేన (షిండే వర్గం)-బీజేపీ-ఎన్సీపీ( అజిత్ వర్గం) సంకీర్ణం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆచరించే వ్యూహాలపై కోర్ కమిటీ భేటీలో చర్చించాం’ అని అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రతో పేలవ ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ-9, ఎన్సీపీ (అజిత్ వర్గం)-1, శివసేన (షిండే వర్గం)-7 సీట్లతో మొత్త 17 స్థానాలకే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాలకు 41 సీట్లు గెలుచకున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ తన డిప్యూటీ సీఎం పదివికిఈ రాజీనామా చేయాలని భావించగా.. బీజేపీ అగ్రనేతల సూచన మేరకు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి బీజేపీ చీఫ్‌ను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్థానంలో రావు సాహెబ్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వ్యాప్తిచెందాయి. ‘మహాయుతి కూటమి పార్టీలతో కలిసి.. అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం బ్లూప్రింట్ తయారు చేయటంపై చర్చించాం’డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై పార్టీనేతల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
‘బీజేపీ ఆఫర్ చేస్తే.. కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తా’
ముంబై: కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అన్నారు. ఆమె ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్ రాజ్య సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రఫూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్ మినిస్టర్‌గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన సహాయ మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర ఎన్సీపీ అభ్యరి్థగా గురువారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మంత్రి ఛగన్ భుజ్‌బల్, లోక్‌సభకు ఎన్నికైన సునీల్ తాట్కరే వెంటరాగా విధాన్ భవన్లో ఆమె నామినేషన్ సమరి్పంచారు. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దేశం దృష్టిని ఆకర్షించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో సునేత్ర ఓటమి పాలైన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్, ఉదయన్‌రాజే భోంస్లే (ఇద్దరూ బీజేపీ) ఇటీవలే లోక్‌సభకు ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అస్సాం, బిహార్లలో రెండేసి, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపురలలో ఒకటి చొప్పున రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. ఆయా చోట సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
శరద్ పవార్‌కు ధన్యవాదాలు: అజిత్ పవార్
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్‌కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
శరద్ పవార్‌తో టచ్‌లో.. అజిత్ పవార్ వర్గం 15 మంది ఎమ్మెల్యేలు
ముంబై: మహరాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన) బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.ఈ క్రమంలో తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ పేరు చెప్పకుండానే పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పేర్కొన్నారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.దీంతో ఆ నేతలు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలేన న్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక చోటనే గెలిచింది. అంతేగాక అజిత్ సతీమణి సైతం ఓటమి చెందింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో లక్ష యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాగా, మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు. -
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశారు.మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు. మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్‌కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్‌సభ పోలింగ్‌కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్‌న్సీపీ (శరద్ పవార్) ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
అజిత్ పవార్, బీజేపీ నేతలపై.. ఎన్నికల సంఘానికి శరద్ పవార్ ఫిర్యాదు
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్-ఎన్సీపీ వర్గం) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే నిధుల్ని విడుదల చేస్తామంటూ ఓటర్లకు హామీ ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించింది. అజిత్ పవార్, మంగేష్ చవాన్, చంద్రకాంత్ పాటిల్‌లు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 పదేపదే ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము అని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పేర్కొంది. తమ అభ్యర్థిని ఎన్నుకుంటేనే తమ అధికారిక పదవులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక నిధులను పంపిణీ చేస్తామని నేతలు పదేపదే వాగ్దానం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మహరాష్ట్ర అధికార పార్టీ ప్రాథమికంగా లంచం,అవినీతి పద్ధతుల్ని అవలంభిస్తోందని ఆరోపిస్తోంది. సదరు నేతలపై తక్షణమే చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక కలెక్టర్, డిప్యూటీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. మన ప్రజాస్వామ్య దేశంలో న్యాయబద్ధత, న్యాయం, చట్టబద్ధమైన పాలనను అందించేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తెలిపింది. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్‌సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్‌ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్‌దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్‌దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
మామ శరద్ పవర్ మాట.. బోరుమని ఏడ్చిన కోడలు
ముంబై: మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో వదిన (సునేత్ర), మరదలు (సుప్రియా సూలే) మధ్య పోటీ నెలకొంది. కొద్ది రోజుల క్రితం ‘పవార్ కార్డ్’ ఉపయోగించి తన సతీమణి, లోక్‌సభ అభ్యర్ధి సునేత్రా పవార్‌ను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే అజిత్ పవార్ వ్యాఖ్యల్ని శరద్ పవార్ ఖండించారు. సునేత్ర పవార్ బయటి వ్యక్తి అని శరద్ పవార్ అన్నారు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధులు ఇదే అంశంపై సునేత్రా పవార్‌ను ప్రశ్నించారు. శరద్ పవార్ మిమ్మల్ని ‘బయటి పవార్’ అని అనడంపై సునేత్ర పవార్ కన్నీటి పర్యంతమయ్యారు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Pune: NCP candidate from Baramati, Sunetra Pawar gets emotional when asked about Sharad Pawar's remark calling her 'outsider Pawar' Sunetra Pawar is the wife of Maharashtra Deputy CM Ajit Pawar and is contesting LS elections against NCP-SCP MP Supriya Sule from… pic.twitter.com/sJauAJa2fg — ANI (@ANI) April 13, 2024 -
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అవుట్
ముంబై: హారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను లోక్‌సభ ఎన్నికలకు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి బీజేపీ తొలగించింది. తమ పార్టీకి చెందిన నేతలు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని, ఇతర పార్టీ నేతలు అవకాశం లేదంటూ మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాసిన లేఖ కారణంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. శివసేన, మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇతర పార్టీల నేతలు ఉన్నారు. శివసేన లిస్ట్‌లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా.. రాష్ట్ర బీజేపీ జాబితాలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఉన్నారు. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాశారు. అదే పార్టీకి చెందిన వాళ్లే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని చెబుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950ని ఉదహరించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ సవరించిన జాబితాను బీజేపీ భారత ఎన్నికల సంఘానికి సమర్పించింది. చదవండి: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు! -
వదిన-మరదళ్ల సమరం : ‘బారామతి నేను.. నేను బారామతి’ని
ముంబై : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. వారిలో సుప్రియా సూలే తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న శరద్ పవర్ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే.. భార్య సునేత్ర పవార్ తరుపున అజిత్ పవార్ ప్రచారంతో ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ ఈ తరుణంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. అంతేకాదు తాను బారామతిలో పుట్టి పెరిగానని, దాని మట్టితో కనెక్ట్ అయ్యానని అన్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ అని పేర్కొన్నారు. శరద్ పవార్ అంతం కోసం ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్ని ‘ప్రతీకార పోరాటం’గా మార్చారంటూ సుప్రియా సూలే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై మండిపడ్డారు. పాటిల్ గత వారం బారామతికి వచ్చి ఈ యుద్ధం శరద్ పవార్‌ను అంతం చేయడం కోసమే అని వ్యాఖ్యానించారు. అభివృద్ది గురించి మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఇలా మాట్లాడితే ఎలా? ఈ తరహా వ్యాఖ్యలతో పాటిల్ వ్యక్తిగత ఎన్నికలుగా మార్చారని చెప్పుకొచ్చారు. బారామతి మట్టికి రుణపడి ఉంటాం. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి సీటుతో తనకు ఉన్న అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు సులే మాట్లాడుతూ.. ‘బారామతి నేను, నేను బారామతిని.నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ రోజు నేను, నా కుటుంబం అంతా బారామతి మట్టికి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. నా అనుకున్న వాళ్లు దూరమైతే అజిత్ పవార్ అభ్యర్ధిగా బరిలో దిగడంపై.. మన అనుకున్నవాళ్లు దూరమైనప్పుడు బాధగానే ఉంటుంది. నాక్కూడా అలాగే ఉంది. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస్తాను. కానీ నేను చేస్తున్న ఈ రాజకీయాలు మాత్రం కుటుంబం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమేనంటూ ఎన్నికల ప్రచారంలో వడివడిగా అడుగులు ముందుకు వేశారు. -
బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!
ముంబై: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆరు సీట్లను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి. కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీసీ కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్సీపీ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
అమిత్ షా ఎంట్రీతో ‘మహా’ పంచాయితీ కొలిక్కి
సాక్షి, ముంబై : ఇకపై బలాబలాలు నిరూపించుకోవడాల్లేవ్..ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాల్లో గెలవడమే తరువాయి అంటూ మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం) కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు సీట్ల పంపకంలో నాన్చుతూ వస్తున్న అంశాన్ని ట్రబుల్ షూటర్ అమిత్ షా యూటర్న్ తిప్పారు. చర్చలు సఫలం కావడంతో కూటమిలో ఇతర భాగస్వాములు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. రోజుల తరబడి సాగిన చర్చల తర్వాత, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం పురోగతి సాధించింది. ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మహరాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. తమకు క్షేత్రస్థాలు బలం ఎక్కువగా ఉందంటూ ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం 11 స్థానాలు, శివసేన-ఏక్ నాథ్ షిండే వర్గం 22 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టాయి. అయితే షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్‌పవార్‌కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ నేతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకంపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలో దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు. తాజాగా, ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం బారామతి, రాయ్‌గఢ్, షిరూర్, పర్భాని.. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అంగీకరించింది. ఇక శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక? ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాలపై మహాయుతి కూటమి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవర్..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్ ఎన్సీపీ అధినేత శరద్‌పవర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం)ల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్ పవర్ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు. 2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్‌సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! బాబాయితో మనస్పర్థలు ఎందుకు? అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్ శరద్ పవార్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్ పవర్ రాజకీయం మొత్తం మారిపోయింది. అంతా తానై శరద్ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్ పవార్ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది. బాబాయ్‌పై తిరుగుబాటు అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవర్


