పుణె: ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే లేకుండా చేస్తాం, ఓటేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమంటూ వారిని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. శుక్రవారం బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ–ఎన్‌సీపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా ఉండటం గమనార్హం. ‘మా ఎన్‌సీపీ అభ్యర్థులు 18 మందిని ఎన్నుకుంటే నిధుల కొరత అనేదే ఉండదు. మొత్తం పద్దెనిమిది మందినీ ఎన్నుకుంటే, నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తా. మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులివ్వను. మీ వద్ద ఓట్లుంటే, నా దగ్గర నిధులున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Baramati, Maharashtra: Deputy CM Ajit Pawar says, "Give me victory for all 18 Mahayuti candidates in the Malegaon Nagar Panchayat, and I will fulfill every promise and demand I have made to you. But if you cut votes, then I will also cut. You have the votes, and I have the funds,… pic.twitter.com/AiFyTgc0A6
— IANS (@ians_india) November 22, 2025
మరోవైపు.. అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలషేబ్ బిటి) నాయకుడు అంబదాస్ దన్వే స్పందిస్తూ..‘నిధులు అజిత్ పవార్ ఇంటి నుండి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుండి ఇవ్వబడతాయి. పవార్ వంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏమి చేస్తోంది? అని ప్రశ్నలు సంధించారు. ఇక, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.


