మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిని నిలువరించిన పోలీసు ఆఫీసర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. అయితే పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయన చేసిన పని నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోలీసు అధికారి ప్రస్తుతం సోషల్‌మీడియాలో హీరోగా నిలిచారు.
ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తన విధుల్లో భాగంగా అడ్డుకున్నారో పోలీసు అధికారి. అయితే "నేను కొంచెం తాగి ఉన్నాను. నా భార్య గర్భవతి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రాత్రి 10:30 అయింది.. ఇంకో రెండు కి.మీ దూరంలోనే ఆసుపత్రి. సార్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి " అని ఆ వ్యక్తి పోలీసు అధికారిని వేడుకున్నాడు.
ఈ సమయంలో పోలీసు అధికారి స్పందించిన తీరు విశేషంగా నిలిచింది. కారులో ఉన్న మహిళ పరిస్థితిని గమనించి, భర్తను బయటకు రమ్మని చెప్పి, కారు స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. భర్తను కారు వెనుక కూర్చోమని మర్యాదగా చెప్పారు. “మీ భద్రత కోసమే ఇక్కడ ఉన్నాము. మిమ్మల్ని ఆసుపత్రికి సురక్షితంగా తీసుకెళ్లడం మా విధి” అని గర్భిణీకి ధైర్యం చెప్పి ముంబై పోలీసు అధికారి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేకాదు ఈ దృశ్యాలను వీడియో తీస్తోంటే.. ఈ విధంగా కూడా పోలీసులు సహాయం చేస్తారని ప్రజలకు తెలియజేసేలా చిత్రీకరణ కొనసాగించమని కోరడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
He creates such videos on Instagram, his video has gone viral before also. pic.twitter.com/rklSuh9iFk
— Dinesh Choudhary (@DineshJaiHind7) January 1, 2026
నెటిజన్లు ప్రశంసలు
పోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “బిగ్ సెల్యూట్” అంటూ కామెంట్ చేశారు. మరోవైపు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, అందులోనూ ప్రసవానికి దగ్గరపడ్డపుడు తాగడం అవసరమా అని కొంత మంది ఆగ్రహించారు. కొన్ని మంచు ప్రాంతాల్లో పరిమితులతో, మద్యపానాన్ని శాశ్వతంగా నిషేధించాలి అంటూ వ్యాఖ్యానించారు.


