భార్య ఎఫైర్‌.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే.. | Brazil Tragedy, Man Ends Two Children Lives And Ends His Life After Discovering Wife Alleged Affair, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్య ఎఫైర్‌.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..

Feb 14 2026 5:40 PM | Updated on Feb 14 2026 5:56 PM

Tragedy In Itumbiara

బ్రెజిల్‌లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్‌ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.

ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్‌ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్‌ను రాశారు. 

చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement