breaking news
Tragedy
-
తిరుపతిలో విషాదం.. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన జరిగింది. మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్ రాజ్ (36), నరేష్(21)గా గుర్తించారు.సెల్ ఫోన్ పడిపోయిందని దుప్పట్లు కట్టుకొని బావిలోకి దిగిన భీమ్ రాజ్, అతడు రాకపోయేసరికి కాపాడే ప్రయత్నంలో నరేష్ బావిలోకి దిగి మృతి చెందారు. విష వాయువులు పీల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ రాజు ఆసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కూప్పకూలారు. తక్షణమే స్పందించిన మంత్రి శ్రీహరి.. ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మరణించారు. -
ఢిల్లీ ట్రాజెడీ : మళ్లీ వార్తల్లో ఐఏఎస్ సంజీవ్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్‌పై మరోసారి తీవ్ర ఉచ్చు బిగుస్తోంది. గతంలో తన పెంపుడు కుక్కతో త్యాగరాజ్ స్టేడియంలో చక్కర్లు కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అధికారి, తాజాగా ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంతో మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో ఆయనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో ఆదివారం (సెప్టెంబర్ 6, 2026) మధ్యాహ్నం ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన బేస్మెంట్లో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఢిల్లీ పోలీసులు, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని రక్షించాయి. ప్రమాదానికి కారణమైన హాస్టల్ యాజమాని హరిరాంబ్ బన్సల్‌ను రాజస్థాన్‌లో అరెస్టు చేశారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమంటూ డిమాండ్లు వ్యక్తమవుతుండటంతో, ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజే (సోమవారం) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగి ఐదుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.స్పందించిన ఎంబీసీ కమిషనర్ ఈ ప్రమాదంపై ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ స్పందిస్తూ.. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఆగస్టులో అదే ప్రాంతంలోని 3-4 భవనాలను కూల్చివేయాలని మేము ఆదేశాలు జారీ చేశాము. గత మూడు నెలల్లో 960 భవనాలను కూల్చివేశాము. 407 భవనాలను సీల్ చేశాం. మరో 1,500 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కూలిపోయిన 14వ నంబరు ఆస్తికి సంబంధించి, గతంలో కేవలం గ్రౌండ్+1 యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉందని, ఎలాంటి భవన ప్రణాళికకు ఆమోదం లేదని అధికారులు తేల్చారు.విద్యార్థి సంఘాల ఆందోళనసత్యనికేతన్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ.. నగరంలో ఐదు అంతస్తులు ఉన్న అన్ని భవనాలను వెంటనే సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీజీలు, నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు లేదా వాణిజ్య సంస్థలను ప్రారంభించే ముందు పాత భవనాల యజమానులు తప్పనిసరిగా స్ట్రక్చరల్ ఆడిట్ నివేదికలను సమర్పించేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. మరోవైపు, పౌర సంస్థల వైఫల్యానికి నిరసనగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 150 నుంచి 200 మంది కార్యకర్తలు ఎంసీడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలోనూ వివాదాలకే కేంద్రబిందువు1994 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గతంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణ అథ్లెట్లను బయటకు పంపివేసి, తన భార్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాతో కలిసి తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకువెళ్లిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.మేము ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ తీసుకునేవాళ్ళం. కానీ ఆ అధికారి తన కుక్కను నడపడానికి వీలుగా మమ్మల్ని సాయంత్రం 7 గంటలకే మైదానం విడిచి వెళ్ళమని చెబుతున్నారు’ అని మే 26, 2022 నాటి కథనంలో కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలను ఖిర్వార్ అప్పట్లో ఖండించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆయనను లడఖ్‌కు బదిలీ చేసింది. ఆ తర్వాత కాలంలో మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చిన ఆయన, ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఎంసీడీ కమిషనర్ బాధ్యతలను చేపట్టారు. అయితే, ఇప్పుడు ప్రాణనష్టం సంభవించిన సత్య నికేతన్ భవనం కూలిన దుర్ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో,సంజీవ్ ఖిర్వార్ చుట్టూ వివాదాల ఉచ్చు మరింత బిగుసుకుంది. 👉ఇదీ చదవండి : ‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’ -
నేపాల్: జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు
కాఠ్మాండు: నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలకు సోమవారానికి 13 రోజులు పూర్తయ్యాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ భీకర వరదల్లో ఇప్పటివరకు 1,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరావడం లేదు. శిథిలాలు, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోమవారం నేపాల్ వ్యాప్తంగా జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేశారు. వరదల కారణంగా వేలాది కుటుంబాల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.విపత్తు జరిగిన ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం నేపాల్ సైనిక సిబ్బంది సహా వివిధ బృందాలు శోధిస్తున్నాయి. తమ ఆత్మీయుల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.ఆగస్టు 26న వచ్చిన ఆకస్మిక వరదలు భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,340కిపైగా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు సుమారు 5,000 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం శోధన కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ వివిధ వర్గాల ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి -
శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!
ఖాట్మండు: నేపాల్‌లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన వరద బీభత్సం వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొట్టుకుపోయిన, శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం బంధువులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆస్పత్రులు, శవాగారాలు, సహాయక శిబిరాల చుట్టూ కన్నీటితో తిరుగుతున్నారు.చేతిలో ఆప్తుల ఫొటోలు పట్టుకుని మార్చురీల్లోని గుర్తుతెలియని మృతదేహాలను పరిశీలిస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రసువాలోని అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల ప్రవీణ్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అతని సోదరుడు రామ్ బుధా ఖాట్మండు నుంచి హకుబేసికి చేరుకుని, ప్రాజెక్టు సొరంగంలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఛాతీ లోతు వరకు బురద పేరుకుపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జుమ్లాలోని తమ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తోచక రామ్ కన్నీటిపర్యంతమయ్యాడు.నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాటికి 788 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 2,502 మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో జలవిద్యుత్ ప్రాజెక్టుల కార్మికులు, ఇంజనీర్లు 933 మంది ఉండగా, 592 మంది విదేశీయులు, వారితో ఉన్న 127 మంది నేపాలీలు ఉన్నారు. రక్షణ దళాలకు చెందిన 45 మంది సైనికులు, 25 మంది నేపాల్ పోలీసులు, 12 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా జాడలేకుండా పోయారు.రసువా సరిహద్దు ప్రాంతమైన తిమురేలో పనిచేస్తున్న భర్త సునీల్ ఆచూకీ కోసం దాంగ్ ప్రాంతానికి చెందిన సరితా చౌదరి పోఖ్రా చేరుకుంది. వరద వచ్చే ముందు రోజు ఫోన్ చేసి, దసరా పండుగకు ఇంటికి వస్తానని చెప్పాడని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె రోదిస్తూ తెలిపింది. పోఖ్రా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో భద్రపరిచిన 102 గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలను పరిశీలించేందుకు రోజుకు వెయ్యి మందికి పైగా బంధువులు వస్తున్నట్లు కాస్కీ పోలీసులు తెలిపారు.రౌతహత్‌కు చెందిన 60 ఏళ్ల బిర్సిమాయ భరత్‌పూర్‌లోని శవాగారాల్లో తన కుమారుడు షేర్ బహదూర్ కోసం వెతుకుతోంది. నువాకోట్, గైండాకోట్, పోఖరా నగరాల్లోని ఆస్పత్రులను గాలించినా తన సోదరుడు రామేశ్వర్ జాడ దొరకలేదని నవరాజ్ లామా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కనీసం ఆచూకీ లేదా మృతదేహం దొరికే వరకు మా ఆశ చావదు’ అని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అప్పులు చేసి మరీ ఇక్కడికి తరలివచ్చి, వెతుకులాట కొనసాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వం స్పందించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియను ఒకే చోట సులభతరం చేయాలని, గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య -
బెడిసికొట్టిన వితంతు వదినతో ప్రేమ.. యువకుడు ఆత్మహత్య
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర పరిధిలోని నగలా చంద్రభాన్ గ్రామంలో విషాద చోటుచేసుకుంది. విధవరాలైన వదినతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న 18 ఏళ్ల గౌరవ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు అతడు తన మొబైల్లో ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అందులో తన వదిన, ఆమె బాబాయి, ఒక పొరుగింటి వ్యక్తి తనను మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరించారని తీవ్ర ఆరోపణలు చేశాడు.పోలీసుల కథనం ప్రకారం.. గౌరవ్ సోదరుడు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనంతరం గౌరవ్‌కు, అతని విధవరాలైన వదినకు మధ్య ప్రేమ సంబంధం మొదలైంది. ఈ విషయం తెలిసిన సదరు మహిళ పుట్టింటి వారు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లిపోయి, వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఆ మహిళ బాబాయి, మరొక పొరుగింటి వ్యక్తి గౌరవ్‌ను పిలిపించి వదినకు దూరంగా ఉండాలని హెచ్చరించారని, ప్రాణాలతో వదలబోమని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వీరి బెదిరింపులు, మానసిక ఒత్తిడి కారణంగా గౌరవ్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు.ఈ క్రమంలో గౌరవ్ తన గదిలోకి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి వదిన, ఆమె బాబాయి, పొరుగింటి వ్యక్తే కారణమని పేర్కొన్నాడు. ఆ తర్వాత చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గది తలుపులు తెరచి చూడగా గౌరవ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న హైవే పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ వీడియోను దర్యాప్తులో కీలకంగా పరిగణిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం? -
నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం
-
విశాఖలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భర్త ప్రవీణ్, భార్య అహల్య, ఇద్దరు చిన్నారులు హితిక్స, హన్విగా గుర్తించారు. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఘటన జరిగింది. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ప్రవీణ్.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా భార్యాపిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్‌లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్‌లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్‌లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్‌లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్‌లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్‌ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్‌లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్‌లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్‌లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్‌లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్‌ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్‌కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్‌లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
శ్రీశైలంలో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి,మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.సత్రంలోని 11వ నంబర్ గదిని తీసుకున్న కుటుంబం.. మూడు రోజులుగా బయటకు రాలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతి చెంది ఉన్నారు. ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తింంచారు. -
ఐఫోన్ ఈఎంఐ మరణాల కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు గుట్టు విప్పిన పోలీసులు
ముంబై: ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మృతుడు కునాల్ పిన్ని పల్లవి పాటిల్ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఫోన్ ఈఎంఐ వ్యవహారం లేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తీస్గావ్లో ఆగస్టు 21న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కునాల్ చంద్‌గుడే ఈఎంఐ పద్ధతిలో యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించలేక కుటుంబ సభ్యుల సహాయం కోరాడు. ఈ చిన్న విషయమే కుటుంబంలో వివాదానికి దారితీసింది.ఆవేశంతో ఖావడ్యా కొండపైకి వెళ్లిన కునాల్, తాను కొండపై నుంచి దూకేస్తానని బెదిరించాడు. కొండ అంచున ఉన్న కునాల్‌ను కాపాడేందుకు తండ్రి మురళీధర్ ప్రయత్నించగా.. ఇద్దరూ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 400 నుంచి 500 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. భర్త, కుమారుడు కళ్లెదుటే లోయలో పడిపోవడాన్ని తట్టుకోలేక తల్లి సంగీత కూడా అదే కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.ఐఫోన్ ప్రచారంపై పిన్ని ఆవేదన కుటుంబ సభ్యుల అస్థికలను ఇంటికి తీసుకొచ్చే సమయంలో పల్లవి పాటిల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘ఐఫోన్ ఈఎంఐ చెల్లించలేకనే వారు ప్రాణాలు తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవం. మా కుటుంబం గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేసి మమ్మల్ని మరింత వేదనకు గురిచేయవద్దు. వృద్ధులైన మా తల్లిదండ్రులకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు తెలిస్తే తట్టుకోలేరు’ అంటూ ఆమె కన్నీటిపర్యమంత అయ్యారు.భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమా?మరోవైపు,ఐఫోన్ ఈఎంఐ కట్టలేకే కునాల్ ప్రాణాలు తీసుకున్నారనే అంశంలో వాస్తవం లేదని పోలీసులు సైతం గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని సేకరించారు. ఆ ఆధారాల్లో కునాల్ తండ్రి మురళీధర్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, సంగీత గృహిణి. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో పెద్ద కుమారుడిని కోల్పోవడం వల్ల వీరి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు విడివిడిగా ఉంటున్నారు. గత మూడు నెలలుగా దూరంగా ఉన్న మురళీధర్.. ఘటనకు రెండు రోజుల ముందే ఇంటికి రావడంతో గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీతకు సంబంధించిన ఒక పాత వీడియో పోలీసులకు లభించింది. ‘ఆస్తి కోసం నాకు, నా కొడుక్కి దక్కాల్సిన హక్కును నిరాకరించారు. నా సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేశారు. దీనికి కారణమైనవారు రాబోయే ఏడు తరాలు మూల్యం చెల్లించుకుంటారు’ అంటూ ఆ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలోని అంతరార్థంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కునాల్ తల్లి సంగీత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే.. ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. (👉ఇదీ చదవండి: నీ తల్లికోసమైనా బ్రతకాల్సింది కదరా!) -
UP: విషదం.. పిల్లలపై కూలిన ఇంటి పైకప్పు.. బాలుడి మరణం
-
ఎమ్మెల్యే పీఏ కుమార్తె అనుమానాస్పద మృతి
పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అజిత్ దశావతారే కుమార్తె ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. శనివారం రోజున సదరు బాలిక తన తల్లితో చిన్న విషయమై వాగ్వాదానికి దిగింది. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం బారామతి పరిధిలోని రూయ్ గ్రామం సాయినగర్ ప్రాంతంలో ఆమె నివాసానికి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం బారామతి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్ -
వినాయక ఆగమన్‌లో విషాదం.. ఇద్దరు మృతి!
ముంబై: మహానగరం ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వినాయక విగ్రహ ఆగమన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ విగ్రహం రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.#WATCH | Mumbai, Maharashtra | Two dead and five injured after a massive Ganesh Idol of Bhuleshwar Cha Raja fell during its arrival procession at the Balaram Merchant Road in the Bhuleshwar area. The names of the deceased are Sanket Nevshe, 33 years, and Brijesh Hemant Joshi,… pic.twitter.com/QMOC0Y1oLr— ANI (@ANI) August 22, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 9:51 గంటల సమయంలో భులేశ్వర్లోని జై అంబే చౌక్, కబూతర్‌ఖానా సమీపంలో విగ్రహాన్ని తీసుకొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే బీఎంసీ సిబ్బంది, ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతులను సంకేత్ నేవ్శే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిలో ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘భులేశ్వర్‌చా రాజా’ వేడుకల కోసం భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: పర్షియన్ గల్ఫ్‌లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం -
నిశ్చితార్థమైన జంట అనుమానాస్పద మృతి
కాసరగోడ్/ఎర్నాకులం: నిశ్చితార్థం అయిన ఒక జంట గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు. కాసరగోడ్ జిల్లా పూచ్చక్కాడ్ ప్రాంతానికి చెందిన పి. అనుశ్రీ (25), ఇరిట్టీ అంబలత్తట్టకు చెందిన వి. అమల్ (26)లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఉద్యోగులు. అనుశ్రీ కర్ణాటకలో విధులు నిర్వహిస్తుండగా, అమల్ ఎర్నాకులంలో పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం అనుశ్రీ నివాసంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డిసెంబర్ 26న వీరి వివాహం జరగాల్సి ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుశ్రీ మంగళవారం రాత్రి వరకు బ్యాంకు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె సోదరి ఫోన్ చేసినప్పుడు అమల్‌తో ఫోన్లో మాట్లాడుతున్నానని అనుశ్రీ తెలిపింది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చేసిన ఫోన్ కాల్స్‌కు ఆమె స్పందించకపోవడంతో , అనుమానం వచ్చి ఆమె ఇంటి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అనుశ్రీ విగతజీవిగా పడి ఉంది. హున్సూర్ పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం బుధవారం సాయంత్రం ఆమె భౌతికకాయాన్ని పూచ్చక్కాడ్ లోని ఇంటికి చేరలించారు. కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.మరోవైపు ఎర్నాకులం ఎంజీ రోడ్డు ఎస్బీఐ శాఖలో పనిచేస్తున్న అమల్ అదే ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. అనుశ్రీ మృతి చెందిన విషయం తెలుసుకున్న అమల్, బుధవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో ఎర్నాకులం నార్త్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. ఆ తర్వాత తన స్నేహితులకు తన లొకేషన్‌ను షేర్ చేశారు. ఎంతకీ ఆయన ఫోన్ స్పందించకపోవడంతో స్నేహితులు లాడ్జికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, అమల్ విగత జీవిగా కనిపించారు. త్వరలో వివాహం జరగాల్సిన జంట ఇలా మృత్యువాత పడటంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం అలముకుంది.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ఏనుగు, దాని పిల్ల మృతి -
కూలిన కొండ.. శిథిలాల కింద ప్రాణాల కోసం వేట!
ముంబైలో భారీ వర్షాల వేళ మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని చిరాగ్ నగర్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు ప్రాణాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో కుర్లా పశ్చిమ ప్రాంతంలోని గౌసియా చాల్, చిరాగ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని మట్టి ఒక్కసారిగా కూలిపడి సమీపంలోని రెండు మూడు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలతో గాలింపుప్రమాదం జరిగిన వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, ముంబై పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాల ద్వారా శిథిలాల లోపల కదలికలు, మనుషుల ఉనికి వంటి సంకేతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించడంతోపాటు.. లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంపై అత్యంత జాగ్రత్తగా గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కుర్లాలోని భాభా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి మేయర్.. సహాయక చర్యల పరిశీలనముంబై మేయర్ రీతూ తావ్డే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. ముంబైలో వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం అందిన తర్వాత మృతుల సంఖ్య, చిక్కుకున్న వారి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సౌదీలో అగ్నిప్రమాదం.. 16 మంది బంగ్లాదేశీయులు సజీవదహనం
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 మంది బంగ్లాదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రియాద్‌లోని మూసా సానియా ప్రాంతంలో ఉన్న ఒక సోఫా ఫ్యాక్టరీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 16 మంది బంగ్లాదేశీ జాతీయులు సజీవదహనమయ్యారు.ఈ దుర్ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతులను గుర్తించే ప్రక్రియతో పాటు, చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి వారు సౌదీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. మృతదేహాలను త్వరలోనే స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. -
బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
రియో డి జెనెరో: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ తెలిపింది. మృతులలో ఒక పైలట్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నారు. వీరు నగరంలోని విస్టా చినెసా సమీపంలో గల టిజుకా నేషనల్ పార్కు వద్ద విహారయాత్ర చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం వచ్చిన ఈ కుటుంబంలోని ఆరుగురిలో, హెలికాప్టర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ముగ్గురు మాత్రమే ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై రియో డి జెనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటక ఆకర్షణగా మారిన హెలికాప్టర్ విహారయాత్రల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కొత్త భద్రతా ప్రమాణాలను అమలు చేసే వరకు ఈ విమాన సేవలను ఒకటి లేదా రెండు వారాల పాటు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు ఆయన తెలిపారు. గతంలో జూన్ 14న రిక్రియో డోస్ బాండీరాంటెస్ శివారులో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్! -
మ్యాచ్ మధ్యలో పిడుగు ఫుట్ బాల్ ప్లేయర్ మృతి
-
అస్సాం: వరదలకు 95 మంది బలి, 1.6 లక్షల మంది అతలాకుతలం
శివసాగర్: అస్సాంలో భారీ వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరద ఉద్ధృతి తీవ్రరూపం దాల్చడంతో మృతుల సంఖ్య 95కి చేరింది. సుమారు 1.6 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. 563 గ్రామాలు నీటమునిగాయి. శివసాగర్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఒక్క శివసాగర్లోనే 57 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. గోలఘాట్‌లో 34 వేల మంది, జోర్హాట్లో 25 వేల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్రంలోని 14 జిల్లాలకు యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. గౌహతిలోనూ పలు ప్రాంతాలు నీటమునిగాయి. రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల కోసం 45 శిబిరాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 12,300 మందికి పైగా అక్కడ తలదాచుకున్నారు.మరోవైపు 32 వేల మందికి పైగా బాధితులకు బియ్యం, ఉప్పు, పప్పులు వంటి నిత్యావసరాలను అందించేందుకు 59 పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. అస్సాం వరద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అస్సాంలో పర్యటించి, సీఎం హిమంత బిస్వా శర్మతో కలిసి వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించారు. నష్టం తీవ్రంగా ఉన్నందున పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నడ్డా తెలిపారు. ఆస్తి నష్టానికి సంబంధించి ఆర్థిక సహాయం, పరిహారం అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ఇది కూడా చదవండి: ‘మెటా’పై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు -
పెరూ: కూలిన విమానం.. 13 మంది దుర్మరణం
నాజ్కా లైన్స్: పెరూలోని ప్రసిద్ధ నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. విదేశీ పర్యాటకులతో వెళ్తున్న ఒక సైట్‌సీయింగ్ విమానం నాజ్కా నగరం వెలుపల కూలిందని అధికారులు తెలిపారు. పెరూలోని పురాతన నాజ్కా లైన్స్‌ను విహంగ వీక్షణం చేసేందుకు ఈ విమానం బయలుదేరిందని నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించింది.శతాబ్దాల కిందట స్థానిక దేశీయ గిరిజన సంఘాలు పెరూ ఎడారిలో భారీ భౌగోళిక చిత్రాలను (జియోగ్లిప్స్) చెక్కాయి. జంతువులు, రేఖాగణిత నమూనాలను తలపించే ఈ భారీ ఆకృతులను విమానంలో నుంచి లేదా పరిశీలనా టవర్ల నుంచి స్పష్టంగా వీక్షించవచ్చు. సమీపంలోని ఇకా నగరంలో బయలుదేరిన ఈ విమానాన్ని పెరూ విమానయాన సంస్థ ‘ఏరోడియానా’ నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.గత 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాల ద్వారా నాజ్కా లైన్స్‌పై సైట్‌సీయింగ్ విమానాలను నడుపుతున్నట్లు ఆ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. ప్రమాద సమయంలో విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు పెరూ వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతులలో ఏడుగురు ఇటలీ, ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పానిష్ పర్యాటకులు ఉన్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ‘అజెన్సియా ఆండినా’ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పెరూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే.. -
’నా భర్తను ఒక్కసారి తీసుకురండి’
కడప అర్బన్: కుటుంబంతో సంతోషంగా గడపాలన్న కలలు... పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న ఆశలు...ఎన్నో ఏళ్ల కష్టానికి గుర్తింపుగా వచ్చిన విదేశీ పర్యటన... కానీ ఆ యాత్రే ఆయన జీవితానికి చివరి ప్రయాణంగా మారింది. కడపలోని అరవింద్ నగర్‌కు చెందిన ప్రముఖ మొబైల్ వ్యాపారి, లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబం, బంధువులు, వ్యాపార వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గత 20 ఏళ్లుగా లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న శ్రీధర్, కంపెనీ నిర్దేశించిన వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి గుర్తింపుగా ‘లావా’సెల్‌ఫోన్ కంపెనీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వంద మందికి పైగా డిస్ట్రిబ్యూటర్ కు వియత్నాం పర్యటనను బహుమతిగా ఇచ్చి తీసుకుని వెళ్లారు. అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులను రెండు బోట్లలో సముద్ర విహారానికి తీసుకెళ్లారు. ఒక్కో బోటులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడటంతో శ్రీధర్ ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర విషాదంలో భార్య, కుటుంబసభ్యులు శ్రీధర్‌కు భార్య ధనలక్ష్మి, కుమారుడు సత్య కౌశిక్, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. సత్య కౌశిక్ బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం, కిరణ్మయి కోయంబత్తూరులో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు శ్రమించిన తండ్రి ఇక లేడనే వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ’నక్షత్ర మొబైల్’యజమాని ఇక లేరు... కడప పాత బస్టాండ్ సమీపంలో ’నక్షత్ర మొబైల్ షాప్’నిర్వహిస్తున్న శ్రీధర్ వ్యాపారంలో నిజాయితీ, సౌమ్య స్వభావంతో ఎంతోమందికి సన్నిహితుడిగా పేరొందారు. ఆయన మృతి వార్త తెలిసి వ్యాపార వర్గాలు, స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ’నా భర్తను ఒక్కసారి తీసుకురండి’ విదేశీ పర్యటనకు ఆనందంగా వెళ్లిన భర్త ఇక శవంగా వస్తున్నాడనే వార్తను జీర్ణించుకోలేక ధనలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలమైన కడపకు తరలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో..! వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు కడప ఆర్డీవో మురళి శనివారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన పట్ల జిల్లా యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని ఆర్డీవో తెలిపారు. శ్రీధర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. శ్రీధర్ వాణిజ్య భాగస్వామ్య కంపెనీ యాజమాన్య ప్రతినిధితో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి, న్యాయం జరిగేలా కృషిచేస్తామని తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘పాక్’లో కూలిన ట్యూషన్ సెంటర్ పైకప్పు.. 14 మంది మృతి!
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాహ్లా జిల్లా పరిధిలోని ఈద్గా బస్తీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక నివాస భవనం పైకప్పు కూలిపోయింది. అక్కడ ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడు నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు క్లాసులో ఉన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు, స్థానికులు శిథిలాల నుండి 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనంపై కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, నాణ్యతా లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ విషాద ఘటనపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను, జిల్లా అధికారులను ఆదేశించారు. -
21 గంటల ప్రయత్నం వృథా.. బోరుబావి ఘటన విషాదాంతం!
అంబాలా: హర్యానాలోని అంబాలా జిల్లా ధనౌరా గ్రామంలో మంగళవారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తన తండ్రి మంజిత్‌తో కలిసి పొలంలో ఉన్న తాతకు భోజనం అందించడానికి వెళ్లిన నాలుగేళ్ల బాలుడు నిర్వైర్ సింగ్, అక్కడ ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడు ఆ బావి వద్ద ఆడుకుంటూ లోపలికి తొంగి చూస్తున్న సమయంలో, చుట్టూ ఉన్న తడి మట్టి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. Ambala, Haryana: Four-year-old Nirbhay, who had fallen into a borewell in Dhanaura village, Ambala, was finally rescued at around 3:30 am after a prolonged rescue operation and was immediately rushed to Ambala City Civil Hospital. However, doctors declared the child dead. The… pic.twitter.com/EVqv3ZWgKi— IANS (@ians_india) June 30, 2026తొమ్మిది అంగుళాల వ్యాసం కలిగిన ఆ ఇరుకైన బోరుబావి నుండి బాలుడిని రక్షించడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. పలువురు అధికారులు, హర్యానా క్యాబినెట్ మంత్రి అనిల్ విజ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు 21 గంటల పాటు రాత్రంతా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది, బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు బాలుడిని బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్‌లో అంబాలా కాంటోన్మెంట్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ ప్రమాదంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్, బోర్బావిని మూసివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రైతులు తమ పొలాల్లో ఉపయోగించని లేదా వదిలివేసిన బోరుబావులను సీల్ చేయాలని ఆయన ఆదేశించారు.ఇది కూడా చదవండి: రాజస్థాన్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం -
పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రకృతి కన్నెర్ర జేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం బీభత్సం సృష్టించగా.. వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ముర్షిదాబాద్-మాల్దా సరిహద్దులోని ఒక ఫెర్రీ ఘాట్ వద్ద ప్రయాణికులు ఆశ్రయం పొందుతున్న సమయంలో పిడుగు పడటంతో ఒకే చోట నలుగురు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది.ఫెర్రీ ఘాట్ వద్ద ఊహించని ఘోరకలిముర్షిదాబాద్లోని ధులియాన్ నుండి మాల్దాలోని శోవాపూర్ వైపు 25 నుండి 30 మంది ప్రయాణికులతో వెళ్లిన ఒక పడవ భాగీరథి నదిని దాటి ఒడ్డుకు చేరింది. అప్పటికే తుఫాను తీవ్రం కావడంతో, ప్రయాణికులు నది ఒడ్డున ఉన్న ఒక పూరిపాక కింద తలదాచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంపై పిడుగు పడటంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మాల్దా జిల్లాకు చెందిన అసదుల్లా షేక్ (80), అన్సార్ షేక్ (45), కొచ్చి షేక్ (25) మరియు సోరాపూర్కు చెందిన ఏక్రాముల్ షేక్ (80)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.పొలాల్లో పనిచేస్తుండగా కాటేసిన మృత్యువుమాల్దా జిల్లాలోని బైష్నాబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్పూర్ గ్రామంలో జనపనార పొలంలో పనిచేస్తున్న సలేక్ మియా (35), జహంగీర్ మియా (29) అనే ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. అలాగే, కూచ్ బెహార్ జిల్లాలో పశువులను ఇంటికి తోలుకువస్తున్న మేనకా బర్మన్ (59) అనే మహిళతో పాటు, వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న అర్మాన్ హుస్సేన్ (20) అనే యువకుడు పిడుగుపాటుకు బలయ్యారు. పురూలియా జిల్లాలో కూడా వేర్వేరు చోట్ల కేశబ్ మహతో (48), ప్రతిమా మహతో (54) అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.ఫోన్ మాట్లాడుతుండగా పోయిన ప్రాణంఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని కాంచ్రాపారాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద సర్కార్ (38) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని మైదానంలో నిలబడి మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతనిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక -
గుండెల్ని పిండేసే దారుణ ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో గుండెల్ని పిండేసే ఓ దారుణమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న కోపం, అనుమానంతో తన కుమార్తెను ఉరి తీసి చంపాడో కిరాతకుడు. వివరాల్లోకెళ్తే.. నేపాల్‌కు చెందిన లక్ష్మణన్ ప్రసాద్ చెన్నైలోని చింతాద్రిపేటలో ప్రభుత్వ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గీత 4వ తరగతి, చిన్న కుమార్తె 1వ తరగతి చదువుతున్నారు. భార్యపై అనుమానంతో లక్ష్మణన్ తరచూ గొడవ పడడంతో మనస్తాపం చెందిన భార్య తన చిన్న కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె గీతను తన వద్దే ఉంచుకున్నాడు.సోమవారం రాత్రి సమయంలో తన భార్యకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. భార్య, చిన్న కూతురు చూస్తుండగానే.. పెద్ద కుమార్తె గీత మెడకు తాడు బిగించి ఉరితీసి హత్య చేశాడు. వెంటనే తానూ అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తాడు తెగిపోవడంతో కిందపడి తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం ఉదయం మరణించాడు. -
బంగీ జంపింగ్ లో విషాదం.. తాడు కట్టకుండానే తోసేసిన..
-
డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.من المواقف الذي تحبس الانفاس لحظة محاول العثور على جثة القعقاع رحمة الله عليه هل الذين كانوا يشجعوه يتحملوا المسؤلية؟ pic.twitter.com/y1ow1fWIPo— نوادر ومواقف (@Nawader_X) June 12, 2026 అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.అన్తార్ అకాల మరణంపై యెమెన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా చెక్కులను తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి, టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఉన్నతాధికారుల బృందం సౌదీ అరేబియాకు వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు.బాధితుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భారత కాన్సులేట్, సౌదీ అధికారులతో సమన్వయం చేసి అంత్యక్రియలతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విషాదం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. -
గుమ్మం దాటిన అడుగు.. తిరిగి రాలేదు
అతడికి ఆ రోజు మామూలే అనిపించింది. టిఫిన్ తిన్నాడు. చొక్కా వేసుకున్నాడు. చేతిలో లంచ్‌బాక్స్ పట్టుకున్నాడు. గుమ్మం దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు..భార్య అక్కడే నిలబడి సాగనంపింది. అది తన చివరి చూపు అవుతుందని అతనికి తెలియదు. లోపలున్న ఆమెకూ తెలియదు. ఆ సాయంత్రం తిరిగి రాని ఆ చూపు, ఇప్పుడు ఆ ఇంటిలో శాశ్వత నిశ్శబ్దమైపోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మెల్టింగ్ షాప్ అంటే సాధారణ పని స్థలం కాదు. అది 1,600 డిగ్రీల సెల్సియస్ వేడి రాజ్యం. రాయి కరిగి నీరయ్యే వేడి. ఉక్కు లావాలా ప్రవహించే వేడి. ఆ నిప్పుల కొలిమి పైన వేలాడుతున్న లాడెల్ క్రేన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా తెగిపడింది. కరిగిన ఉక్కు వెల్లువలా ముంచెత్తింది. మిగతా కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. కానీ ఆ ఎనిమిది మంది మాత్రం తప్పించుకోలేకపోయారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా ముద్దలైపోయాయి.ఆ రాత్రి, ఆ ఎనిమిది ఇళ్లలో దీపాలు వెలిగాయి..కానీ వెలుతురు రాలేదు.గుమ్మం వైపే చూస్తూ నిద్రపోయిన పిల్లలుఒక ఇంట్లో పిల్లలు అమ్మను అడిగారు..‘నాన్న ఎప్పుడొస్తారు?’‘రాత్రికి వస్తారు’ అని ఆమె చెప్పింది. గుమ్మం వైపు చూస్తూ చూస్తూ వాళ్లు నిద్రపోయారు. తెల్లవారింది. నాన్న రాలేదు. ఆ పిల్లలకు ఇంకా అర్థం కాలేదు..నాన్న ఇక ఎప్పటికీ రారని.మరో ఇంట్లో ముసలి తల్లి కొడుకు కోసం అన్నం వడ్డించి కూర్చుంది. అన్నం చల్లారిపోయింది. ఆమె ఆశలూ ఆవిరైపోయాయి.వీళ్లేం సరిహద్దుల్లో తుపాకులు పట్టలేదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడలేదు. కేవలం పొట్టకూటి కోసం పనికి వెళ్లారు. కానీ వారు నమ్ముకున్న పని స్థలం వారికి రక్షణ ఇవ్వలేకపోయింది.అరిగిపోయిన క్రేన్లు. కాలం చెల్లిన సాంకేతికత. లాభాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలు. ఎందుకంటే ప్లాంట్ ఆపితే ప్రొడక్షన్ ఆగుతుంది, లాభాలు తగ్గుతాయి, పై అధికారులు ప్రశ్నిస్తారు. ఆ కార్పొరేట్ భయాల మధ్య ఎనిమిది మంది నిరపరాధుల ప్రాణాలు బూడిదయ్యాయి.మూడేళ్లుగా పోరాడుతూనే నడిపిన ప్లాంట్విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటి నుంచి కార్మికులు దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు. వేతన కోతలు, వీఆర్ఎస్ పేరుతో సిబ్బంది తగ్గింపు, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా..‘కన్నతల్లిలాంటి’ ఈ ప్లాంట్‌ను గుండెల్లో పెట్టుకుని నడిపించారు. అదే ప్లాంట్‌లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయంగా ఉందని కార్మికులే చెప్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం తర్వాత మంగళవారం ప్లాంట్‌లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆవేదన గాలిలో తేలింది.ఒకే దశాబ్దంలో మూడు విషాదాలువిశాఖను ఒకే దశాబ్దంలో మూడు పెద్ద విషాదాలు వెంటాడాయి. ఎల్జీ పాలిమర్స్, హెచ్‌పీసీఎల్, ఇప్పుడు స్టీల్‌ప్లాంట్. ప్రతిసారీ ఒకే డ్రామా పునరావృతమవుతుంది. ప్రమాదం జరుగుతుంది, విచారణ కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, కేసులు పెడతారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోతారు. కానీ సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలు ఎలా మర్చిపోతాయి?అంకెలుగా మిగిలిపోకూడదురేపు వీరి పేర్లు పేపర్లలో వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో కేవలం అంకెలుగా మిగిలిపోతారు. న్యాయం అంటే కొన్ని లక్షల పరిహారం విసిరేయడం కాదు. వ్యవస్థ మారాలి. పరిశ్రమల్లో లాభాల కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పని కోసం ఇల్లు దాటిన ప్రతి మనిషి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడం వారి హక్కు. ఆ హక్కును కాపాడడం వ్యవస్థ బాధ్యత. రేపు మరో తల్లి కన్నీరు కార్చకుండా ఉండటమే.. వీరికి ఇచ్చే నిజమైన నివాళి.– సాక్షి, విశాఖపట్నం -
ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్‌లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్‌లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానేఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్‌కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. -
సహారా ఎడారిలో తీవ్ర విషాదం.. నీళ్లు దొరక్క 49 మంది మృతి..
-
నీటి చుక్క దొరక్క 49 మంది మృతి
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోగా.. రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..అల్జీరియా-మాలీ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాలీ నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్-అధా(బక్రీద్)ను జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు. అయితే ట్రక్కు అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో.. సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో నిలిచిపోయింది. ట్రక్కు చెడిపోవడంతో డ్రైవర్, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు.. నీటి వనరు లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు.సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి. తర్వాత ఆహారం కూడా ముగిసింది. చివరకు దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు.అయితే అందరూ చనిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకుపైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. అక్కడి నుంచి అస్సామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్కు కింద, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.రక్షక బృందాలకు మరో షాక్ఈ ఘటనలో మృతదేహాలను వెలికితీసి.. ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది మూడు రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు.సహారా ఎందుకు ఇంత ప్రమాదకరం?సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్‌లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. వందల కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను "సైలెంట్ కిల్లర్"గా అభివర్ణిస్తుంటారు. అలా.. కుటుంబాలతో ఈద్ చేసుకునేందుకు బయల్దేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం... చివరకు ఇసుకల్లోనే ముగిసింది. సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది.ఇది మొదటిసారి కాదుసహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి దాహంతో మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 2017లో మరో ఘోర ఘటన జరిగింది. ఎడారిలో చిక్కుకున్న వలసదారుల్లో 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అంతర్జాతీయ వలస సంస్థ (IOM) అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7 వేల మందికిపైగా మరణించినట్లు.. మరికొందరు అదృశ్యమైనట్లు నమోదైంది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎడారిలో కనిపించకుండా పోయిన వారిలో చాలామంది గురించి ఎప్పటికీ సమాచారం బయటకు రాదు. -
తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు. పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విషాదం.. నదిలో కాలు జారి ముగ్గురు మృతి
సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి శివారులో మంజీరా నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.మృతులు పిట్లం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన పావని (15),లింపేట్ మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన అనిత (40), శివాని (13) తల్లి కూతురని తెలుస్తోంది. భాను ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.పండరి అనే వ్యక్తి మంజీరా నది వద్ద ఎల్లమ్మ పండగ నిర్వహించడంతో బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిలోకి దిగిన ఓ యువతి, ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో కొట్టుకుపోయారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు నీటిలో మునిగి మృతి చెందారు. -
కల్లలైన కుటుంబం కల
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్‌లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్‌కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్‌పోర్ట్‌లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్‌కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు. నేడు భారత్‌కు మన్జూర్ పార్థివదేహం విమానంలో కువైట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు. -
చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రకాశంలో విషాదంప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
‘వాడి జ్ఙాపకాలే ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకర విమాన ప్రమాదానికి ఏడాది నిండింది. 2025, జూన్ 12న టేకాఫ్‌తో మొదలైన ఆ ప్రయాణం క్షణాల్లో విషాదాంతమైంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ లండన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయం సమీపంలోని మెడికల్ హాస్టల్‌ను ఆ విమానం ఢీకొట్టిన దృశ్యం ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.కాలం గడిచినా చెరగని గాయంఈ ప్రమాదంలో జావేద్ అలీ, తన భార్య , ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడింది కేవలం ఒక్కరు మాత్రమే. జావేద్ తల్లి ఫరీదా బానో ఇప్పుడు అనాథలా మిగిలిపోయారు. ఒక తల్లికి తన బిడ్డను పోగొట్టుకోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదంటారు. ఆ ఘటన దరిమిలా ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. A year of grief and waiting: What remains when a plane falls from the sky - A year after the Air India crash, a mother still speaks about her dead son in the present tense and a brother waits for answers. Via @BBC:https://t.co/gjZTBusaFA— 🌊💙 Viking Resistance 💙🌊 (@BlueCrewViking) June 1, 2026‘వాడు నన్ను విడిచి వెళ్లడు’ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నా, తన కొడుకు జావేద్‌ను తలుచుకుంటూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ‘నా కొడుకు ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ఉండేవాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్లినా, ఏ గదిలో ఉన్నా వాడు నా వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. వాడు నన్ను విడిచి వెళ్లలేదు. వాడి జ్ఞాపకాలే నా ప్రాణంగా బతుకుతున్నాను’ అని ఫరీదా బానో చెప్పిన మాటలు ఎంతటివారినైనా కదిలింపజేస్తాయి.తీరని లోటు - మిగిలిన శూన్యంఈ ప్రమాదం కేవలం 260 మంది ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు. ఎన్నో కుటుంబాల ఆశలను బూడిద చేసింది. 241 మంది ప్రయాణికులు, 19 మంది స్థానికులు ఒకే ఒక్క క్షణంలో కాలగర్భంలో కలిసిపోయారు. భౌతికంగా వారు దూరమైనా, వారి కుటుంబ సభ్యుల గుండెల్లో ద్రవిస్తునన్న వేదన మాత్రం అలానే ఉంది. ఇది కూడా చదవండి: అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్ -
విషాదం: తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదంనెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు తెప్ప బోటులో నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
Odisha: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ.. ఆరుగురు మృతి
కలహండి: ఒడిశాలోని కలహండి జిల్లాలో మంగళవారం జరిగిన ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మదన్‌పూర్-రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరియాఖుంట గ్రామంలో చోటుచేసుకుంది.మృత్యువుకు చిరునామాగా..నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు, నిర్మాణ సంబంధిత పనుల కోసం మంగళవారం ఆరుగురు వ్యక్తులు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల కారణంగా వారందరికీ ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబాకు మళ్లీ పెరోల్.. 16వ సారి బయటకు.. -
Uttar Pradesh: బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిల్లీ నుంచి బీహార్ వైపు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు వేగంగా వెళ్తుండగా..ఈ ప్రమాదం ఉన్నావ్ పరిధిలోని అరస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, ఎక్స్‌ప్రెస్‌వేపై 262వ కిలోమీటర్ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.బాధితుల్లో పోలీసు అధికారి, ఖైదీఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక సబ్ఇన్స్పెక్టర్, ఒక ఖైదీ ఉన్నట్లు అరస్ ఎస్.ఓ సంజీవ్ కుశ్వాహా తెలిపారు. మృతుడైన సబ్-ఇన్స్పెక్టర్ను రామచంద్రగా గుర్తించారు. ఆయన తన విధి నిర్వహణలో భాగంగా ఖైదీ ఛత్రపాల్‌ను సివాన్ నుంచి డిల్లీకి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. కాగా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. -
ప్రెస్మీట్లో పగలబడి నవ్విన పోలీస్ అధికారిని ఎవరంటే?
సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. Am told that CM has taken action over the insensitive video of police officers laughing before briefing the media on such a serious case.But it turns out no action has been taken yet.I deleted my earlier tweet in which I thanked the CM.Didn’t expect CM Vijay to stay silent… pic.twitter.com/vmLURRYV5Z— Lala (@FabulasGuy) May 25, 2026 ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్మీట్లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. கடுங்குற்றச் செயல்களில் ஈடுபடுவோர் மீது உடனடியாக வழக்குப் பதிவு செய்து, விரைவாக விசாரணை நடத்தி, சட்டத்தின் கீழ் கடுமையான தண்டனை பெற்றுத்தர வேண்டும் என தமிழ்நாடு முதலமைச்சர் விஜய் அவர்கள் உத்தரவிட்டுள்ளார்#TVKVijayHQ #CMJosephVijay pic.twitter.com/zryLbTeHjc— CM Joseph Vijay (@CMJosephVijayHq) May 25, 2026 -
మృత్యు గుహలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
సముద్రపు అడుగున ఉన్న ఓ చీకటి గుహ.. ఒక్కసారి లోపలికి వెళ్తే దారి తప్పించే ప్రమాదకర సొరంగాలు.. చుట్టూ మట్టి, సిల్ట్‌తో నిండిన మార్గాలు.. బయటకు రావడానికి క్షణక్షణం ప్రాణపోరాటం. వెరసి.. ఘోర డైవింగ్ ప్రమాదానికి సంబంధించిన తాజా ఫొటోలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.మాల్దీవుల్లో “షార్క్ కేవ్”గా పిలిచే ఆ అండర్‌వాటర్ గుహలో చిక్కుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. సముద్రపు అడుగున ఉన్న ప్రమాదకర గుహలో చిక్కుకుని ఐదుగురు ఇటాలియన్ డైవర్లు, వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ మాల్దీవుల సైనిక డైవర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. డైవింగ్ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా మారిందది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన గుహ ఫొటోలు చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది.మే 14న మాల్దీవుల వావూ అటోల్ సమీపంలోని అలిమథా దీవి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటలీకి చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన డైవర్లు “షార్క్ కేవ్”గా పిలిచే సముద్ర గుహలోకి అన్వేషణ కోసం వెళ్లారు. ఈ బృందంలో సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు మోనికా మోంటోఫాల్కోనే, ఆమె కుమార్తె జార్జియా సొమ్మక్యాల్, సముద్ర జీవశాస్త్రవేత్త ఫెడెరికో గువాల్టిరి, పరిశోధకురాలు మ్యూరియల్ ఒడ్డెనినో, డైవింగ్ ఇన్స్ట్రక్టర్ గియాన్లుకా బెనెడెట్టీ ఉన్నారు. వాళ్లు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అధికారుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని గంటల తర్వాత గియాన్లుకా బెనెడెట్టీ మృతదేహం గుహ ప్రవేశం దగ్గర లభించింది. మిగిలిన నలుగురి కోసం సహాయక చర్యలు ప్రారంభించగా.. తీవ్ర లోతు, సముద్రపు బలమైన ప్రవాహాలు, చీకటి పరిస్థితులు పెద్ద సవాల్‌గా మారాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మాల్దీవుల సైనిక డైవర్ ముహమ్మద్ మహుద్దీ కూడా డీకంప్రెషన్ సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించినట్లైంది.చేసేదిలేక.. ఫిన్లాండ్కు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఆధునిక పరికరాలతో గుహలోకి వెళ్లి మిగిలిన మృతదేహాలను వెలికితీసింది. అధికారుల చెబుతోంది ఏంటంటే.. వీరు సాధారణంగా అనుమతించే లోతుకంటే చాలా ఎక్కువగా సముద్రంలోకి దిగి ఉంటారేమోనని. దాదాపు 50 నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న గుహల్లోకి వెళ్లిన తర్వాత దారి తప్పినట్లు భావిస్తున్నారు. గుహలోని సన్నని మార్గాలు, మట్టి లాంటి సిల్ట్ నీటిలో కలవడంతో పూర్తిగా కనిపించకుండా పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై మాల్దీవుల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో రికార్డ్ అయిన గోప్రో వీడియోలు, డైవింగ్ పరికరాల డేటాను పరిశీలిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.ఆ పేరెలా వచ్చిందంటే..వావూ అటోల్‌లోని అలిమథా దీవి సమీపంలో ఉన్న “షార్క్ గుహ” మాల్దీవులలో అత్యంత ప్రమాదకరమైన సముద్ర గుహలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ పేరు ఈ గుహలో తరచుగా కనిపించే షార్క్‌ల వల్ల వచ్చింది. ఇక్కడి గుహల్లో రీఫ్ షార్క్‌లు, ఇతర చిన్న షార్క్ జాతులు తరచుగా కనిపిస్తాయి. అందువల్ల స్థానికులు దీనిని “షార్క్ గుహ” అని పిలుస్తారు. స్థానికంగా దీనిని దేవన కందు అని పిలుస్తారు. మాలే రాజధాని నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న ఈ గుహ, తన లోతు, నిర్మాణం, ప్రవాహాల వల్ల డైవర్లకు ఒక సవాలుగా మారింది.ఈ గుహలో మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి రెండు భాగాలు తక్కువ లోతులో ఉండగా, మూడవ భాగం 50–60 మీటర్ల లోతులో ఉంది. ఈ భాగంలోనే ఇప్పుడు ఇటాలియన్ డైవర్లు చిక్కుకుని ప్రాణాలు పొగొట్టుకున్నారు. గుహలోని మార్గాలు చాలా ఇరుకుగా ఉండి.. మట్టి నీటిలో కలిసిపోవడం వల్ల దారి కనిపించని పరిస్థితులు తాజా ఫొటోలతో బయటకు వచ్చాయి. అలాగే బలమైన సముద్ర ప్రవాహాలు తోడవ్వడంతో డైవర్లకు ఇవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. అలా ఏర్పడ్డాయి.. ఈ గుహల నిర్మాణం లక్షల ఏళ్ల భూగర్భ ప్రక్రియల ఫలితం. 55 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతాలపై పగడపు దిబ్బలు పెరిగి.. తర్వాత సున్నపు రాళ్ల పొరలు ఏర్పడ్డాయి. గ్లేషియల్ కాలాల్లో సముద్ర మట్టం తగ్గి, సున్నపు రాళ్లు బయటకు వచ్చి వర్షపు నీటితో కరిగి గుహలు ఏర్పడ్డాయి. ఇంటర్గ్లేషియల్ కాలాల్లో మంచు కరిగి సముద్ర మట్టం పెరగడంతో ఆ గుహలు మళ్లీ నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రక్రియ 2.6 మిలియన్ ఏళ్లుగా పునరావృతమవుతూ క్రమంగా గుహలు ఏర్పడ్డాయి.“షార్క్ గుహ” ఇప్పటివరకు పూర్తిగా మ్యాప్ చేయబడలేదు. అందుకే అనుభవజ్ఞులైన డైవర్లకు కూడా అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ గుహలోకి 30 మీటర్ల లోతు వరకు మాత్రమే డైవింగ్ అనుమతిస్తారు. ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు తీసిన గుహ లోపలి భాగంలో ఎలా ఉందో తీసిన పాత వీడియో కింద చూసేయండి.. -
చైనా గనిలో భారీ పేలుడు90 మంది మృతి
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాంగ్జి ప్రావిన్స్‌లోని క్విన్యువాన్ కౌంటీలో ఉన్న లియుòÙన్యు బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగానే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గనిలో 247 మంది వరకు కార్మీకులున్నారన్నారు. ఇప్పటి వరకు 201 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు జిన్ పింగ్ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ, సహాయక చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా, చైనాలో తవ్వే బొగ్గులో మూడో వంతు షాంగ్జి ప్రావిన్స్‌లోని గనుల నుంచే లభిస్తుంది. భారీ ప్రమాదాల చరిత్ర చైనాలోని గనుల్లో భారీ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 2023లో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఓ గని కుప్పకూలి 53 మంది సజీవ సమాధి అయ్యారు. 2009లో హెయిలొంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లో గ్యాస్ పేలుడుతో 108 గని కార్మీకులు మృతి చెందారు. 2005లో ఇదే ప్రావిన్స్‌లోని మరో గనిలో పేలుడుతో 171 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లోనే లియావోనింగ్ ప్రావిన్స్‌లోని సుంజియావన్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా 214 మంది అసువులు బాశారు. 2004లో షాంగ్జి ప్రావిన్స్‌లోని చెంజియాషన్ గనిలో పేలుడుతో 166 మంది, హెనాన్ ప్రావిన్స్‌లోని డాపింగ్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా మరో 148 మంది చనిపోయారు.2000లో గుయిఝౌ ప్రావిన్స్ లోని ముచోంగౌ గనిలో పేలుడుతో 162 మంది కార్మీకులు మృతి చెందారు. -
షూటింగ్ సెట్లో విషాదం.. జైలర్-2 సిబ్బంది మృతి
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్‌గా గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్‌ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్‌లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్‌కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు. -
జబల్పూర్ ఘోర విషాదం.. వెలుగులోకి మరో కొత్త వీడియో
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి చివరి క్షణాలను చూపే కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాథమిక భద్రతా వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో కళ్లకు కట్టిస్తోంది. ఆ వీడియోలో, పర్యాటకులు క్రూయిజ్ లోపల కూర్చుని ఉండగా.. అకస్మాత్తుగా నీరు లోపలికి రావడం వీడియోలో కనిపిస్తోంది. క్షణాల్లోనే పర్యాటకుల ఆనందం.. భయంగా మారింది.. తుపాను గాలుల తాకిడికి పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో నీరు లోపలికి దూసుకొచ్చింది.పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే.. సిబ్బంది కట్టలు కట్టి ఉన్న లైఫ్ జాకెట్లను విప్పడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ప్రాణ భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. చాలా మందికి లైఫ్ జాకెట్లు అందలేదు. సీలు చేసిన స్టోరేజ్ బాక్సుల నుంచి వాటిని తీసుకోవడానికి వారు తీవ్రంగా శ్రమించారు. నిబంధనలు పాటించలేదని.. తుపాను సమయంలో ప్రయాణికులను గాలికి వదిలేశారని బాధితులు చేసిన ఆరోపణలకు ఈ వీడియో ఇప్పుడు సాక్ష్యంగా నిలుస్తోంది.నిబంధనలు ప్రకారం.. ప్రయాణం ప్రారంభించే ముందే ప్రతి ప్రయాణికుడికి లైఫ్ జాకెట్ అందించాలి. పర్యాటకులు కచ్చితంగా ధరించాలి. కానీ.. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం 29 మందికి మాత్రమే టిక్కెట్లు జారీ చేసినప్పటికీ.. క్రూయిజ్‌లో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించినప్పటికీ కూడా.. ఈ రద్దీగా ఉన్న పడవను బర్గి డ్యామ్ నీటిలోకి అనుమతించడం గమనార్హం. 🚨 Jabalpur Cruise Last Video: People fighting for lifeThe video was captured just 15 minutes before the cruise sank in the river. You can see the sheer panic people desperately fighting for their lives as the water began to rise and engulf the boat.This shocking footage has… pic.twitter.com/z2pNogMNC9— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 1, 2026 ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు చిన్నారులతో సహా నలుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి ప్రారంభించారు. 72 ఏళ్ల రియాజ్ హుస్సేన్.. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు గంటల పాటు నీటిలోనే ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. బాధిత ప్రయాణికుడు ప్రదీప్ మాస్సే మాట్లాడుతూ.. క్రూయిజ్ నిర్వాహకులు మమ్మల్ని కదలకుండా కూర్చోమని చెప్పారు.. మాకు కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు. నా భార్య మరీనా మాస్సే, నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్ మృతదేహాలు దొరికాయి. నేను ఒక ట్యూబ్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను, స్థానికులు తాడు వేసి నన్ను ఒడ్డుకు చేర్చారు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సాయంత్రం 6:15 గంటలకు సమాచారం అందినప్పటికీ.. మొదటి రెస్క్యూ టీమ్ 6:40 గంటలకు బయలుదేరింది. ఆ వాహనం స్టార్ట్ కాకపోవడంతో సమయం వృధా అయ్యింది. ఆ తర్వాత మరో వాహనంలో పరికరాలను తరలించి, రెండో బృందం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. ఈ జాప్యం ప్రాణ నష్టానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక జాలర్లు, రైతులు ప్రాణాలకు తెగించి 15 మందికి పైగా కాపాడారు. ఆ తర్వాతే ఎన్డీఆర్ఎఫ్ వంటి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులెవరో ఈ కమిటీ తేల్చనుంది. -
నో లైఫ్ జాకెట్స్, పట్టించుకోలేదు : బోట్ విషాదంలో సంచలన ఆరోపణలు
Jabalpur boat tragedy మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియా' కథన ప్రకారం ఈ విషాదానికి కారణం కేవలం వాతావరణం మాత్రమే కాదు. వరుస వైఫల్యాలు ఉన్నాయని ప్రాణాలతో బయటపడినవారు ఆరోపించారు. వాతావరణం మారుతున్నట్లు కనిపిస్తున్నా, వెనక్కి వెళ్ళమని ప్రయాణికులు కోరినా ఆపరేటర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే సిబ్బంది లైఫ్ జాకెట్లు పంచారని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం మొదలైనప్పుడు కనీస భద్రతా చర్యలు లేవని ఆయన ఆరోపించారు.#WATCH | Madhya Pradesh | Jabalpur Cruise Boat capsize | State Minister Rakesh Singh says, "NDRF has recovered two more bodies...The situation will be clear in some time...After the rescue operation concludes, it will be clear why people could not be saved even when they were… pic.twitter.com/hpaA1AiEPN— ANI (@ANI) May 1, 2026 కాగా సిబ్బందితో సహా సుమారు 43 మంది ప్రయాణికులతో వెళుతున్న ఈ పడవ, అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫాను మధ్య జబల్పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బర్గీ డ్యామ్ వద్ద లో బోల్తా పడింది. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన అత్యంత తీవ్రమైన గాలులు, అల్లకల్లోల వాతావరణ పరిస్థితుల కారణంగానే పడవ అస్థిరపడి, అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొమ్మిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇదీ చదవండి : 4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్ -
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్‌మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు. -
‘ముండతికోడ్’ గుణపాఠం.. ఇక రోబోలకు బాణసంచా!
తిరువనంతపురం: కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొనడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, నిపుణులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించి ఫ్యాక్టరీలను సురక్షితంగా మార్చేందుకు, ప్రమాదాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కసరత్తు మొదలైంది.శబ్దాల కంటే దృశ్యాలకే ప్రాధాన్యంప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బాణసంచా ప్రదర్శనల విధానంలో భారీ మార్పులు రావాలని కేరళ దేవస్వం మంత్రి వీ.ఎన్. వాసవన్ పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలతో దద్దరిల్లేలా కాకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో మాదిరిగా కనువిందు చేసే సురక్షితమైన రంగుల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ప్రాణనష్టం లేని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.మనుషులకు బదులు రోబోలుప్రమాదకరమైన బాణసంచా తయారీ, పేల్చే విధానంలో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించాలని ‘బెటర్ కొచ్చి రెస్పాన్స్ గ్రూప్’ (BKRG) ప్రతిపాదించింది. చేతులతో నిప్పు పెట్టే విధానానికి బదులుగా ఎలక్ట్రానిక్ టైమింగ్ సిస్టమ్స్ వినియోగించాలని కోరుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ తరహాలో, తయారీ కేంద్రాల్లో ప్రమాదకరమైన పనులను రోబోలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా చేయిస్తే ప్రాణాపాయాన్ని దాదాపుగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలు జరగకుండా కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఏఐ సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలుఫైర్క్రాకర్ యూనిట్లలో భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. థర్మల్ సెన్సార్లు, కెమెరాల సాయంతో ఉష్ణోగ్రత, పొగ, తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే ఏఐ వ్యవస్థలు.. మంటలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఏఐ సాధనాలు క్షణాల్లో ప్రతిస్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సూచిస్తాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా ఈ అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తాయి.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, కిద్వాయ్ నగర్లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. ఆర్థిక ఇబ్బందులునిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.UP man kiII twin daughters, wife demands death penalty Shashi Ranjan Mishra, a resident of UP's Kanpur slit throat and kiIIed his 11-year-old twin daughters- Riddhi and Siddhi. He has a 6-year-old son who was sleeping with her mother in separate room. Domestic dispute is… pic.twitter.com/X86b4vvxSC— Piyush Rai (@Benarasiyaa) April 19, 2026ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరుసీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే 11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లి తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. ఘటన పూర్వాపరాలు కాన్పూర్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త తల్లి గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులుసీసీటీవీ నిఘా, దృశ్యాలు మరో షాకింగ్ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్‌లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.మనసెలా ఒప్పింది..ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్ కన్నుమూత -
బోరుబావిలో పడ్డ బాలుడు.. 75 అడుగుల లోతులో..
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జులారియాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబం తమ మందలతో కలిసి ఇక్కడికి వచ్చింది. వారి రెండేళ్ల కుమారుడు భగీరథ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.ఎస్పీ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బోరుబావిపై రక్షణగా ఒక రాయిని ఉంచారు. అయితే.. ఒక గొర్రె ఆ రాయిని పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత బాలుడు.. ఆ మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తూ లోపలికి జారి పడిపోయాడు. బద్నావర్ ఎస్హెచ్ఓ అశోక్ పాటిదార్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉజ్జయిని కలెక్టర్ రోషన్ సింగ్, ఎస్పీ ప్రదీప్ శర్మ స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఉజ్జయినిలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉజ్జయినిలో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. గునా బైపాస్ రోడ్డు వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టి 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక చిన్నారితో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. ఉజ్జయినిలోని ధాబా రోడ్డులో ఉన్న గేబీ హనుమాన్ ఆలయం సమీపంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ ఠాగూర్ ధృవీకరించారు. -
పల్నాడులో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్‌కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు.అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.జీజీహెచ్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. తల్లితండ్రులు ఆసుపత్రిలో ప్రాణాపాయ చికిత్స పొందుతున్నారు. నగరవ్యాప్తంగా అనేక హోటళ్లలో ఆహారం కలుషితమైన ఘటనలు పదేపదే నమోదవుతున్న నేపథ్యంలో మరో విషాదం తీవ్ర ఆందోళన రేపుతోంది.ఈ ఘటన చంద్ఖేడా ప్రాంతంలో జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. వీరు మార్కెట్ నుంచి రెడీ మేడ్ దోస పిండిని (ఖీరు) కొనుగోలు చేశారు ఆ పిండితో చేసిన దోసెలు తిన్న తర్వాత, కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహా (మూడు నెలల పసికందు), మిశ్రి(నాలుగేళ్ల బాలిక) చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు తల్లి భవనా ప్రజాపతి, తండ్రి విమన్ ప్రజాపతి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే, సాధారణంగా పసిపిల్లలకు ఘన ఆహారం ఇవ్వరు కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన తర్వాత తల్లి బిడ్డకు పాలివ్వడం వల్లనే మూడు నెలల పసికందు ప్రభావితమై ఉండవచ్చని భావిస్తున్నారు.“మా అబ్బాయి రాత్రి సుమారు 8:00 గంటలకు ఐఓసీ రోడ్డులోని ఘనశ్యామ్ డెయిరీ నుంచి పిండి తెచ్చాడు. దానితో దోసె వేసుకుని తిన్నాడు. మరుసటి రోజు ఉదయం, అతనికి వాంతులు మొదలవడంతో ఆసుపత్రిలో చేర్పించాం. ఆ తర్వాత, ఆహారం వల్ల అనారోగ్యం వచ్చిందని తెలియని అతని భార్య కూడా అదే పిండిని తిని, వారి చిన్నారికి దోసె తినిపించింది. మరుసటి రోజు నుంచి, వారికి కూడా వాంతులు మొదలయ్యాయి’’ అని విమల్ తండ్రి, గౌరీశంకర్ తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు కోడలు కేడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, చంద్ఖేడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆహార నమూనాలను సేకరించారు. మరణానికి మరణినాకి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించుకోవడానికి, పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) సహాయాన్ని కూడా కోరారు. ఫుడ్ పాయిజనింగ్ కేసు, పిండిలో కల్తీ, లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!ఈ ఘటనపై ఘనశ్యామ్ డైరీ యజమాని కేతన్ పటేల్ ఇలా అన్నారు, తాముతిరోజూ సుమారు 100 నుండి 125 కిలోల ఖీరును విక్రయిస్తాం, చాలా వినియోగదారులున్నారు, దీన్ని ఘనశ్యామ్ డైరీలోనే తయారు చేస్తాం. ఒకవేళ ఆ పిండి నిజంగానే పాడై పోయి ఉంటే, పలువురు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులొచ్చి ఉండేవి. ఈ ఒక్క ఫిర్యాదు తప్ప, మరెవరి నుండీ ఇటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. దర్యాప్తునకు తాము సహకరిస్తున్నామని చెప్పారు. ఇదీ చదవండి: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్‌లో ఇండస్ట్రీమరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆహార విభాగం అధికారి డాక్టర్ తేజస్ షా మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
పెళ్లింట తీవ్ర విషాదం : నలుగురు మృత్యువాత
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బందువుల పెళ్లికి వచ్చిన వారిని మృత్యువు కబళించింది. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా బంధువుల రోదనలతో విషాదంగా మారిపోయింది.కర్నూలు జిల్లాలోని కందుకూరు గ్రామానికి పెళ్లికి వచ్చారు కర్ణాటకకు చెందిన కొంతమంది బంధువులు. దాదాపు 15 మంది కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద స్నానానికి దిగారు. అయితే అనుకోకుండా వీరు ప్రమాదానికి గురైనారు. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను కర్ణాటకలోని కురిడి గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాసరి శివాసనంద, దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ మహేష్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు
సాక్షి,నల్లగొండ : వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అగ్నిగుండం దాటే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈసారి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదానికి దారితీసింది.భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇతర భక్తులు వెంటనే స్పందించి వారిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి కాలిన గాయాలు, మరికొందరికి తోపులాటలో గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న భక్తులు, గ్రామస్థులు కలిసి గాయపడిన వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగి, వెంటనే వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. ఉత్సవాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు. -
పండుగ వేళ విషాదం
సుభాష్‌నగర్/బోధన్/ఆర్మూర్‌టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్‌కు చెందిన అభిషేక్, శ్రీరామ్‌నగర్‌కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్‌పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్‌పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్‌లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్‌బండ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్‌తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్‌ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్‌కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్‌కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు. -
టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్
గోవాలోని అందమైన ప్రదేశాలను చూసి తరించాలని ఆశపడిన టూరిస్టు కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాలోని అస్సాగావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిభోపాల్కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు భగత్రామ్ శర్మ (65) కుటుంబంతో కలిసి హ్యుందాయ్ i20 కారులో గోవాకు బయలుదేరారు.ఉత్తర గోవాలోని 'హ్యాపీ బార్' జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఒక అద్దె మహీంద్రా థార్ (Thar) కారు, పర్యాటకులు వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు భగత్రామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదు నెలల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది.సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం, థార్‌లోని ఒక యువకుడు ఫోన్లో మాట్లాడుతూ "నాన్న, నేను ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నాను..." అని చెప్పడం వినిపించింది. కారు వెనుక సీట్లో ముగ్గురు యువతులు ఉన్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే థార్ కారులోని వ్యక్తులు సీట్లు మారడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అసలు డ్రైవర్‌ను (నిందితురాలిని) కాపాడేందుకు వారు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 19 ఏళ్ల టీనేజరే ఈ విషాదానికి కారణమని అనుమానిస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె వాహనాన్ని సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ , నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లు కేసు నమోదు చేశారు. అలాగే నిజంగా డ్రైవర్‌ను మార్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంక్షన్ వద్ద ఉన్న CCTV ఫుటేజీని, ఫోరెన్సిక్ సాక్ష్యాలను ,ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను సేకరిస్తున్నారు.Not all Thar, but Always a Thar!Thar Accident in Goa!pic.twitter.com/bmebwnUEBt— My Vadodara (@MyVadodara) February 24, 2026 t> -
భార్య ఎఫైర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..
బ్రెజిల్లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్‌ను రాశారు. చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. -
పుత్తూరు విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరులోని కృష్ణా నగర్లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు.. మృతురాలిని పద్మజగా గుర్తించారు పోలిసులు. 8 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తిని పద్మజ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
ప్లీజ్ హెల్ప్ మీ నాన్న… నాకు చావాలని లేదు. నేను నీటితో నిండిన లోయలో పడిపోయాను. నీటిలో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు, నాన్న…”ఈ మాటలు ఆ తండ్రి గుండెను ముక్కలు చేశాయి.ఒక యువకుడి కలలు, ఆశలు, భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.మంచు కమ్ముకున్న రాత్రి, రక్షణా చర్యలు లేని రహదారి, ఊహించని లోయ. ఈ మూడు కలిసి ఓ టెక్కీ జీవితాన్ని క్షణాల్లో ముగించాయి.ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్ మొహతా (27) ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని కారులో తన ఇంటికి బయలు దేరాడు. సరిగ్గా నోయిడా సెక్టార్ 150 వద్ద మంచు విపరీతంగా కురుస్తోంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రమాదం అని తెలిపే సంకేతాలు లేవు. రిటైనింగ్ వాల్ లేదు. సైన్ బోర్డులు లేవు. బారికేడ్లు లేవు. ఇతర రక్షణా చర్యలు లేవు. రిఫ్లక్షన్స్ లేవు. అయినా సరే ఇంటికి సురక్షితంగా వెళ్తున్నామనే ధీమా. సరిగ్గా అలాంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది. ఫలితంగా 70 అడుగుల లోతులో యువరాజ్ కారు పడిపోయింది. ఎదో ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నానని అర్ధం చేసుకున్న యువరాజు.. ప్లీజ్ హెల్ప్ మీ.. ప్లీజ్ సేవ్ మీ అని కేకలు వేశాడు. లాభం లేకపోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరిగిందే అర్ధం కాని పరిస్థితి. వెంటనే ఆ టెకీ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు’అని ఆందోళన వ్యక్తం చేశాడు. కొడుకు ఫోన్ కాల్‌తో హతాశుడైన రాజ్ కుమార్ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాజ్ కుమార్ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. సుమారు ఐదుగంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును అందులో చిక్కుకున్న యువరాజ్‌ను వెలికి తీశారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఊపిరాడక యువరాజ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణంపై రాజ్‌కుమార్ మెహతా ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు లేనందు వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనికి మద్దతుగా స్థానికులు సైతం ఆందోళన చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న నోయిడా సెక్టార్ 150 వద్ద వార్నింగ్ బోర్డుల పెట్టాలని,రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆందోళన మరింత ఉదృతం చేశారు. దీంతో పోలీసులు ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ఇసుకపల్లి బీచ్‌లో మరో మృతదేహం లభ్యం
నెల్లూరు: ఇసుకపల్లి బీచ్‌లో మరో మృతదేహం లభ్యమైంి నిన్న(శుక్రవారం, జనవరి 16వ తేదీ) ఇసుకపల్లి బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థలు వెళ్లగా వారిలో నలుగురు గల్లంతయ్యారు. నిన్ననే మూడు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం, జనవరి 17వ తేదీ) మరో మృతదేహం లభించింది. ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభించగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌కు ఆరుగురు యువకులు వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిషేక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. ఈరోజు మరో మృతదేహం లభించింది. -
విషాద తరంగం
అల్లూరు: కనుమ పండగ వేళ ఆ కుటుంబాలను విషాద తరంగం ముంచెత్తింది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. ఈఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన వీరు అల్లూరు మండల నార్త్‌ఆములూరు పంచాయతీ గోళ్లపాళెం చైల్డ్ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరి బంధువులు అల్లూరు యర్రపగుంటలో ఉండగా సంక్రాంతి పండగ కావడంతో ఇక్కడకు వచ్చారు.శుక్రవారం మరో నలుగురు స్నేహితులు కె.అభిషేక్(16), జి.సు«దీర్(15), ఈగ చిన్నబయ్య, ఎస్.వెంకటేష్‌తో కలిసి ఇసుకపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచి్చన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిõÙక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. అభిõÙక్, సు«దీర్ ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి బీచ్‌లో కనుమ పండుగ రోజు సరదాగా గడిపేందుకు వెళ్ళిన ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, మరో ఇద్దరు గల్లంతు కావడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
AP: బీచ్‌లో విద్యార్థుల గల్లంతుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరదాగా గడిపేందుకు ఇసుకపల్లి బీచ్‌కు వెళ్లిన విద్యార్ధులు గల్లంతవడం విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తీరానికి ఇద్దరి మృతదేహాలు కొట్టుకు రావడంతో బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం మత్స్యకారులు గాలింపు చేపట్టారు. -
ఖమ్మం జిల్లాలో పండుగ వేళ తీవ్ర విషాదం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి సాంబార్లో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రమాదవశాత్తూ చిన్నారి రమ్మశ్రీ వేడి వేడి సాంబార్లో పడటంతో తీవ్ర గాయాలపాలైంది. దాంతో చిన్నారి రమ్మశ్రీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో చిన్నారి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. -
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ.. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్‌కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా? తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్‌కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.బహిర్గతమైన అసహనం విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2026 సమరానికి నాంది 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి -
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
గోవా: ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు.పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్లు అందుబాటులో నిందితులు ప్రదర్శనను నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్ఐఆర్లో వివరించారు. The tragic loss of lives in a fire accident in Arpora, Goa, is deeply painful. My sincerest condolences to the families of those who lost their lives and prayers for the speedy recovery of the injured @goacm Goa CMO is taking the necessary actions on fire safety. pic.twitter.com/NCDe1AdkZF— INTERNATIONAL HUMAN RIGHTS - INHRF (@DirectorINHRFHC) December 7, 2025ఎఫ్ఐఆర్ లోని వివరాలు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెల్లడించాయి. రెస్టారెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు డెక్‌లో అత్యవసర నిష్క్రమణ తలుపు లేకపోవడం ఎఫ్ఐఆర్లో గమనించదగిన అంశం.vTerrifying video of the Goa accident pic.twitter.com/HrCWMPM1A3— kamal Bhardwaj (@bhardwaj_k9310) December 7, 2025 అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్/క్లబ్‌కు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని తేలింది. Deeply pained by the tragic fire in Arpora, Goa that has claimed more than 20 innocent lives. My heartfelt condolences to the bereaved families, and prayers for the speedy recovery of those injured.This is not just an unfortunate accident — it reflects a grave failure of safety… pic.twitter.com/azA2bamXQY— Durgesh Shukla (@mydurgeshshukla) December 7, 2025నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)సెక్షన్లు 105 (నేరపూరిత నరహత్య), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్య), 125 (ఎ), 125 (బి), 287 (అగ్ని లేదా మండే పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం)తో పాటు సెక్షన్ 3 (5) (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనను మానవ తప్పిదంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో -
అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..
-
Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం
-
నెల్లూరు: మైపాడు బీచ్‌లో విషాదం
సాక్షి, నెల్లూరు జిల్లా: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగిన ముగ్గురు మృతి చెందారు. మృతులను నారాయణరెడ్డి పేటకు చెందిన విద్యార్థులు మహ్మద్, ఉమయున్, సమీద్గా పోలీసులు గుర్తించారు.ఆదివారం సెలవు దినం కావడంతో ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈత కొట్టడానికి ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తూ వారు గల్లంతు కాగా.. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి వెలికి తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శవపేటికగా మారిన స్లీపర్ బస్..!
-
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్‌పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే -
Mumbai: భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ముంబై: మహానగరం ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నవీ ముంబైలోని వాషీలోగల రహేజా రెసిడెన్సీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. 10వ అంతస్తులో తెల్లవారుజామున 12.40 గంటలకు ప్రారంభమైన మంటలు 11, 12 అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ)పరిధిలోని అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే వాషి, నెరుల్, ఐరోలి, కోపర్ఖైరేన్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హోస్ లైన్లు వేసి, వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు.‘ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించాం’ అని ఎన్‌ఎంఎంసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు.10వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుండి మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మృతులంతా రహేజా రెసిడెన్సీ నివాసితులేననని జాదవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చాలా సమయం పట్టిందని, ఎవరూ లోపల చిక్కుకోకుండా అగ్నిమాపక బందాలు పర్యవేక్షించాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై వాషి అగ్నిమాపక కేంద్రంతోపాటు ఎన్‌ఎంఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత
బాపట్ల: జిల్లాలోని చీరాల మండలం వాడరేవు చూడటానికి వచ్చిన విహారయాత్ర కాస్తా విషాదం మిగిల్చింది. సముద్రస్నానానికి వెళ్లిన పలువురు యువకులు గల్లంతయ్యారు. వాడరేవులో సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాసి అలలకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దర్ని పోలీసులు రక్షించారు. ఈ విహార యాత్రకు ఏడుగురు యువకులు బృందంగా వచ్చినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో మణిదీప్(19), సాత్విక్(19), సాకేత్ (19) మరియు సూర్యాపేటకు చెందిన సోమేష్‌లుగా గుర్తించారు. -
Jaipur Hospital tragedy: తల్లిని కోల్పోయి.. సోదరుడు దూరమై.. బావ బూడిదగా మారి..
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి, ఎనిమిది మంది రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో అయినవారిని కోల్పోయిన పలువురు రోదిస్తున్న తీరు చూపరులను కంటతటి పెట్టిస్తోంది. #WATCH | SMS Hospital fire, Jaipur | "... The ICU caught fire. There was no equipment to extinguish it. There were no cylinders or even water to douse the fire. There were no facilities. My mother passed away...," says a person who lost a family member in the fire at Jaipur's… pic.twitter.com/BCV2Sa9jMT— ANI (@ANI) October 6, 2025భోజనం చేస్తున్నంతలో..ఈ ఘటనలో నరేంద్ర సింగ్ అనే వ్యక్తి తన తల్లిని కోల్పోయాడు. అతను ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రి కింది అంతస్తులో భోజనం చేస్తున్నాడు. అతని తల్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ, అగ్నికి ఆహుతైపోయింది. ‘ఐసీయూలో మంటలు చెలరేగాయన్న సంగతి నాకు వెంటనే తెలియలేదు. ఆ సమయంలో నేను భోజనం చేయడానికి కిందికి వచ్చాను. ఆస్పత్రిలో మంటలను ఆర్పడానికి ఎటువంటి పరికరాలు గానీ, సౌకర్యాలు గానీ అందుబాటులో లేవు’ అంటూ తల్లిని కోల్పోయిన నరేంద్ర సింగ్ మీడియా ముందు రోదిస్తూ చెప్పాడు.రోడ్డుపై బాధితులు విలవిలరాజస్థాన్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 11 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పక్కనే ఉన్న సెమీ ఐసీయూలో 13 మంది రోగులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది రోగులను బయటకు తరలించారు. అయితే వారు ఎటువంటి సౌకర్యాలు లేకుండా రోడ్డుపై కూర్చోవలసి వచ్చింది. రోగులను రక్షించడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్నయ్య సాహసం చేసి..‘షార్ట్ సర్క్యూట్‌ను గుర్తించిన వెంటనే సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో మంటలు మరింతగా చెలరేగాయి. మా అన్నదమ్ములిద్దరినీ ఐసీయూ లోపలికి వెళ్లి రోగులను కాపాడేందుకు సిబ్బంది అనుమతించలేదు. అయితే మా అన్నయ్య ఎలాగోలా మా అమ్మను కాపాడేందుకు లోనికి వెళ్లాడు వెళ్ళాడు’ అని జోగీందర్ సింగ్ ఎన్డీటీవీకి చెప్పాడు. ‘వైరు నుంచి ఒక స్పార్క్ వచ్చిన సమయంలో ఆ పక్కనే ఒక సిలిండర్ ఉంది. పొగ ఐసీయూ అంతటా వ్యాపించింది. దీంతో అక్కడున్న అందరూ భయంతో పారిపోయారు. కొంతమంది మాత్రం తమ వారిని కాపాడుకోగలిగారు. ఇంతలో గ్యాస్ మరింతగా వ్యాపించడంతో, సిబ్బంది ఆస్పత్రి గేట్లను మూసివేశారు’ అని జోగీందర్ తెలిపాడు.#WATCH | SMS Hospital fire, Jaipur | "... It was my aunt's son. He was 25 years old and named Pintu... When smoke came out at 11.20 pm, we had informed the doctors that the patients might have problems. Then gradually the smoke increased. As the smoke increased, the doctors and… pic.twitter.com/sR3OuQ79Ku— ANI (@ANI) October 6, 2025రెండు రోజుల్లో డిశ్చార్జ్.. ఇంతలోనే..25 ఏళ్ల ఓం ప్రకాష్ తన బంధువు(బావ) ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో అతనికి సాయంగా ఆస్పత్రిలో ఉన్నాడు. రాత్రి 11:20 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది అక్కడి రోగులను రోగులకు, వైద్యులను హెచ్చరించారని ఓం ప్రకాష్ తెలిపారు. ‘పొగ తీవ్రమవుతుండటాన్ని గమనించి అక్కడి వైద్యులు, కాంపౌండర్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే నలుగురైదుగురు రోగులను మాత్రం కొందరు బయటకు తరలించారు. నా అత్త కుమారుడు పింటూ అగ్నికి ఆహుతైపోయాడు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కావలసినవాడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడని ఓం ప్రకాష్ రోదించాడు.ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే..రంజిత్ సింగ్ రాథోడ్‌ది మరో విషాదగాథ. అతని సోదరుడు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. రంజిత్ సింగ్ రాథోడ్‌కు రాత్రి 11:30 గంటలకు ఆస్పత్రిని నుంచి ప్రమాద వివరాలు చెబుతూ కాల్ వచ్చింది. ‘నేను సాయంత్రమే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాను. ఫోన్ రాగానే ఆస్పత్రికి పరిగెత్తాను. నన్ను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. కొంత సమయం తర్వాత, నేను లోపలికి వెళ్లగలిగాను. అక్కడ నా సోదరుడు చనిపోయివుండటాన్ని చూశాను’ అని రంజిత్ సింగ్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు.‘బాధితుల వాదనల్లో నిజం లేదు’ఎస్ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్ ఇన్ చార్జ్ అనురాగ్ ధకాడ్ బాధితుల వాదనలను తోసిపుచ్చారు. ప్రమాద సమయంలో పొగ, విష వాయువులు త్వరగా వ్యాపించాయని,దీంతో ట్రామా సెంటర్లోకి ప్రవేశించి, రోగులను రక్షించడం కష్టమయ్యిందన్నారు. అగ్నిమాపక దళానికి ఫోన్ చేశామని, ప్రమాదంలో ఎనిమిది మంది ఊపిరాడక మరణించారన్నారు. అయితే పోస్ట్‌మార్టం తర్వాత మాకు మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.जयपुर के सवाई मानसिंह अस्पताल के ट्रॉमा सेंटर में आग लगने की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है।अस्पताल पहुंचकर चिकित्सकों एवं अधिकारियों से जानकारी ली और त्वरित राहत कार्य सुनिश्चित करने के निर्देश दिए। मरीजों की सुरक्षा, इलाज और प्रभावित लोगों की देखभाल के लिए हर संभव कदम उठाए जा…— Bhajanlal Sharma (@BhajanlalBjp) October 6, 2025ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సమీక్షరాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆస్పత్రిని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. తాను ఆస్పత్రికి చేరుకున్నంతనే వైద్యులు, అధికారుల నుండి సమాచారాన్ని సేకరించి, త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని సూచనలు జారీ చేశానని సీఎం తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సీఎం శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. -
తమిళనాడులో ఘోరం, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారంలో తొక్కిసలాట... 36 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమం
-
రాయ్‌పూర్: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఆరుగురు మృతి
ఛత్తీస్‌గఢ్: రాయ్‌పూర్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు.ఈ ఘటన నగర శివార్లలోని సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ ప్లాంట్‌లో జరిగింది. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మద్ సింగ్ తెలిపారు. -
నీట్లో 99.99 పర్సంటైల్.. డాక్టర్ కావాలనుకోలేదు
ఈ ఫొటోలోని కుర్రాడు పేరు అనురాగ్ అనిల్ బోర్కర్. నీట్ యూజీ 2025 పరీక్షలో 99.99 పర్సంటైల్‌తో OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ కుర్రాడు డాక్టర్ కావాలనుకోలేదు. అందుకే మెడిసిన్‌లో చేరడానికి ముందే ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు 19 ఏళ్ల అనురాగ్ ఇష్టం లేని చదువు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు.సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ ప్రాంతంలో అనురాగ్ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో అతడికి సీటు వచ్చింది. MBBS కోర్సులో చేరడానికి గోరఖ్‌పూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో అనురాగ్ అనూహ్యంగా తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.ఘటనా స్థలం నుంచి పోలీసులు అనురాగ్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు చూపించలేదు. డాక్టర్ కావడం ఇష్టం లేకనే అతడు ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవర్గావ్ పోలీసులు (Navargaon Police) దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనురాగ్ మరణంతో అతడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అనురాగ్ తెలివైన విద్యార్థి అని పొరుగువారు తెలిపారు. అతడి చెల్లి గత సంవత్సరం 12వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిందని వెల్లడించారు.ఒత్తిడి నుంచి బయటపడండిచదువుల విషయంలో చాలా మంది టీనేజర్లు ఒత్తిడికి గురవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తల్లిదండ్రుల ఇష్టాలను కాదనలేక, తమకు ఇష్టంలేని చదువు చదవలేక నలిగిపోతున్నారు. చదువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఒక భాగం మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఒత్తిడికి గురైతే తమ సమస్య గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గాలు వెతకాలి. మీకు దగ్గరలోని మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే హెల్ప్‌లైన్ నంబర్లలోనూ సంప్రదించి సహాయం పొందవచ్చు.మహారాష్ట్రలో హెల్ప్లైన్లువాండ్రేవాలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ 9999666555 లేదా help@vandrevalafoundation.comTISS iCall 022-25521111 (సోమవారం- శనివారం: ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు)BMC మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: 022-24131212 (24x7) -
ఫారో కంకణం కరిగించేశారు!
కైరో: దాదాపు 3,000 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణకంకణం చోరీ కథ చివరకు విషాదంగా ముగిసింది. ఈజిప్ట్ లోని ప్రఖ్యాత మ్యూజియంకు సంబంధించిన పునరుద్ధరణ ల్యాబ్‌లో తస్కరణకు గురైన కంకణాన్ని వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈజిప్ట్ దర్యాప్తు సంస్థ అధికారులు, పోలీసులుకు చివరకు ముద్ద బంగారమే లభించింది. సీసీకెమెరాల లేని ల్యాబ్‌లో కంకణం చోరీకి గురయ్యాక పలువురు అక్రమ పురాతన వస్తువుల డీలర్ల చేతులు మారి చివరకు స్వర్ణకారుల చేతుల్లో పడి కరిగిపోయింది. తొలుత చోరీ చేరిన దొంగ మొదలు చివరిసారిగా కొనుగోలుచేసిన వ్యక్తిదాకా ఎవరికీ దాని చారిత్రక నేపథ్యం, అమూల్యమైన అంతర్జాతీయ మార్కెట్ విలువ తెలియదు. దీంతో సాధారణ బంగారు కడియంగా భావించి దానిని కరిగించి ముడి బంగారాన్ని బయటకుతీశారు. ఇటలీలో ఒక పురాతన వస్తు ప్రదర్శన కోసం కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మ్యూజియం నుంచి ఈ కంకణాన్ని తెప్పించగా సెపె్టంబర్ 9వ తేదీన చోరీకి గురైన విషయం తెల్సిందే. క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ ఫారో రాజుకు చెందిన ఈ కంకణంను అమేనీమోప్ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్లో గతంలో కనుగొన్నారు. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణం అత్యంత అరుదైంది. చోరీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. చేతులు మారిన నగదునూ స్వా«దీనంచేసుకున్నారు.అసలేమైంది? భద్రంగా ‘సేఫ్’లో దాచిన కంకణాన్ని ల్యాబ్‌లో పునరుద్ధరణ పనులు చూసే ఒక మహిళా నిపుణురాలు దొంగలించింది. ఆమె కైరోలోని ఒక వెండి దుకాణం యజమానికి అత్యల్ప ధరకు విక్రయించింది. దీనిని ఆ వెండి దుకాణదారు మరో బంగారం దుకాణం యజమానికి కేవలం 3,800 డాలర్లకు విక్రయించాడు. దీనిని అతను 200 డాలర్ల లాభానికి అంటే 4,000 డాలర్లకు మరో బంగారం దుకాణయజమానికి అమ్మేశాడు. ఇతను కంకణాన్ని కరిగించి వచి్చన బంగారంతో తన కస్టమర్లకు కావాల్సిన స్వర్ణాభరణాలు చేసి ఇచ్చి డబ్బు సంపాదించాడు. కంకణం కోసం బయల్దేరిన పోలీసులకు కంకణానికి బదులు ఈ నలుగురు నేరస్తులు చిక్కారని ఈజిప్ట్ పర్యాటక, పురాతత్వ శాఖ మంత్రి షెరీఫ్ ఫతీ చెప్పారు. ‘‘కంకణం మాత్రమే కాదు ఈజిప్ట్ లో మరెన్నో చారిత్రక వస్తువులకు సరైన భద్రత లేదు. మ్యూజియంలలో సీసీటీవీలు సరిగా పనిచేయవు. రక్షణ ఏర్పాట్లను పటిష్టంచేయకపోతే అమూల్యసంపద ఇలాగే అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఈజిప్ట్ మహిళా పురాతత్వవేత్త మోనికా హనా ఆవేదన వ్యక్తంచేశారు. ఈమె ఈజిప్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయి అక్కడి మ్యూజియంలలో ప్రత్యక్షమైన పలు వస్తువులను తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఈమె అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో డీన్‌గా సేవలందిస్తున్నారు. -
నాలాలో మామ, అల్లుడు గల్లంతు.. 85 కి.మీ కొట్టుకుపోయిన మృతదేహం..!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షానికి హబీబ్‌నగర్ అఫ్జల్ సాగర్ నాలా పొంగి ప్రవహించడంతో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి మామా అల్లుళ్లు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. నాటి నుంచి మృతదేహాల ఆచూకీ కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చేపట్టాయి. ఐదు రోజుల తర్వాత వలిగొండ వద్ద అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఎనబై ఐదు కిలోమీటర్లు వరదనీటిలో మృతదేహం కొట్టుకుపోయింది. రాము మృతదేహం ఇంకా లభించలేదు.కాగా, అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్‌సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. కాగా, నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు.వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాిఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్‌పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. -
కన్నీళ్లకే కన్నీరొచ్చె..
ఈ ఫొటో చూడగానే అర్థమయ్యే ఉంటుంది ఇదో విషాద సందర్భమని. స్నేహితుడి లాంటి భర్తకు చివరిసారిగా భార్య కన్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘట్టమిది. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పెనిమిటి చివరి చూపు కోసం స్ట్రెచర్‌పై వచ్చింది ఆమె. మరో స్ట్రెచర్‌పై నిర్జీవంగా ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వరకు తనతో ఎంతో సంతోషంగా గడిపిన భర్త.. శాశ్వతంగా తిరిగిరాడన్న బాధతో ఆమె పడిన వేదనకు అక్కడున్నారంతా కదిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్పత్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘట్టానికి వేదికయింది. ఢిల్లీ బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్యక్రియలు మంగళవారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘటనలో ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి చిక్సిత పొందుతున్నారు. అంత్యక్రియలకు ముందు నవజ్యోత్ పార్థీవదేహాన్ని చివరి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచర్‌పై నుంచే తన చేతులతో భర్త ముఖాన్ని తడిమి కడసారిగా కన్నీటి వీడ్కోలు చెప్పింది. తన కొడులిద్దరి పుట్టినరోజు నాడే భర్తకు చివరి వీడ్కోలు చెప్పాల్సిరావడంతో ఆమె బాధ వర్ణణాతీతం.గురుద్వారా, లంచ్.. విషాదంటీచర్గా పనిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) తన భర్తతో కలిసి బైకుపై ఆదివారం బయటకు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన తర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్లో భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రతాప్ నగర్‌లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నవజ్యోత్ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అయితే దగ్గరలో కాకుండా 19 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రి తీసుకెళ్లడంతోనే తన భర్త మరణించారని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత 40 నిమిషాలు ప్రయాణించి జీటీబీ నగర్లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వీరిని తరలించారు.అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారుకొడుకు మరణంతో నవజ్యోత్ తల్లి గుర్పాల్ కౌర్ శోకసంద్రంలో ముగినిపోయారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కోడలు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆస్పత్రిలో ఉందని వాపోయారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన తండ్రి బతికివుండేవారని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. తన తల్లికి కూడా తీవ్ర గాయాలయినట్టు వైద్యులు చెప్పారని, హెల్మెట్ (Helmet) ధరించినప్పటికీ తలకు గాయమైందని బాధ పడ్డాడు.కొడుకుల పుట్టినరోజు నాడే..నవజ్యోత్ సింగ్ (52) మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికి లోటని సహోద్యోగులు అన్నారు. ఆయన ఇద్దరు కొడుకుల పుట్టినరోజు నాడే నవజ్యోత్ అంత్యక్రియలు జరపాల్సి రావడం విషాదమని ఆవేదన చెందారు. నవజ్యోత్ అంత్యక్రియలు మంగళవారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమయాత్రలో నవజ్యోత్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు పాల్గొన్నారు.కావాలని చేయలేదు..నిర్లక్ష్యంగా కారు నడిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మరణానికి కారణమైన నిందితురాలు గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో వారిద్దరి పిల్లలు కూడా కారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామని.. ప్రమాదంలో కౌర్, ఆమె భర్తకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరినట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తాను కావాలని యాక్సిడెంట్ చేయలేదని, ప్రమాదవశాత్తు జరిగిపోయిందని పోలీసులతో ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురయ్యానని, అందుకే తనకు తెలిసిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కోవిడ్ సమయంలో తన పిల్లలు అక్కడే చికిత్స పొందారని తెలిపారు.చదవండి: టికెట్ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త రిజర్వేషన్ విధానంఎఫ్ఐఆర్లో ఏముంది?ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్‌ను బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్దరు పిల్లలు, పనిమనిషి ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్ప్రీత్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని తప్పించడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు నమోదు చేశారు. -
తిరుపతిలో నాలుగు మృతదేహాల కలకలం
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలోని పాకాల మండలం పాకాలవారిపల్లిలోని నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ జంటతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను అటవీప్రాంతంలో పశువుల కాపరులు గుర్తించారు. భయాందోళనకు గురైన పశువుల కాపరులు మృతదేహాలపై పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి పంపించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో మద్యం బాటిళ్లు, మాత్రలు,దస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఘోర పడవ ప్రమాదం.. 86మంది దుర్మరణం.. వారిలో ఎక్కువ మంది విద్యార్ధులే
బాసాంకుసు, కాంగో: ఉత్తర పశ్చిమ కాంగోలోని ఎక్వాటర్ ప్రావిన్స్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని గుర్తించారు. ఈ విషాదకర ఘటన బుధవారం (సెప్టెంబర్ 10) బాసాంకుసు అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రభుత్వ మీడియా ప్రకారం..ఈ విషాదానికి ప్రధాన కారణం ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం,రాత్రి పడవ ప్రయాణానికి ప్రతీకూల వాతావరణం వల్లేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో ఎక్కువ మంది విద్యార్థులు, స్థానిక ప్రయాణికులు అని సమాచారం.బాసాంకుసు ప్రాంతం కాంగోలోని దట్టమైన అడవులతో కూడిన ప్రాంతం. ఇక్కడ రవాణా ప్రధానంగా నదుల ద్వారా జరుగుతుంది. అయితే, సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అధిక లోడింగ్, అనుభవ రాహిత్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ మీడియా కథనాలు తెలిపాయి. -
తురకపాలెం ట్రాజెడీ.. సకాలంలో స్పందించకపోవడం వల్లే మృత్యుఘోష!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో.. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో.. 45 మరణాలు సంభవించాయి. అధికారుల లెక్కలు ఎలా ఉన్నా.. ఏడాది కాలంలో 100 మంది చనిపోయారని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు గురువారం గ్రామంలో పర్యటించారు. ‘‘ఇవి సహజ మరణాలు కాదు అసహజ మరణాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంత వ్యవహారం జరుగుతున్న ఎందుకు కళ్ళు తెరవలేదు?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?. జిల్లా మంత్రి లోకేష్ ఇప్పటిదాకా ఎందుకు పర్యటించలేదు?. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు?. ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే మరణాలు ఆగిపోయేవని.. ఇంతవరకు మరణాలకు సంబంధించి కారణాలు కనుక్కోలేకపోయారని మండిపడ్డారు. ఈ మరణాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం ఇకనైనా ప్రజల ప్రాణాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో సీపీఎం నేతలు ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై వివరాలు తెలుసుకున్నారు. వరుస మరణాలతో గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. తమ ఊరికి బయటి నుంచి జనాలు కూడా రాలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వైద్యారోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. విషయం తెలిసిన తర్వాత కూడా వేగంగా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. విమర్శల నేపథ్యంలో.. మరణాలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్యకళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు, సాంకేతిక బృందం, వైద్యారోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్యశిబిరం నిర్వహించారు. మరణాలకు ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్ ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్
సోషల్ మీడియా పిచ్చి, షేర్, లైక్స్ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం విషాదకరంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల అవుతోంది. ఈ సంఘటన రీల్స్ కోసం, సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల సాగర్ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు కోరాపుట్ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇక్కడ సాగర్ వీడియో రికార్డ్ చేస్తూ ప్రవాహా ధాటికి ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారుమరోవైపు వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారుఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! -
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి
-
ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం
బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్‌కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్‌దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్ మేఘ్వాల్ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్ మేఘ్వాల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్ మేఘ్వాల్కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్ మేఘ్వాల్ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్ మేఘ్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్ మేఘ్వాల్ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్ మేఘ్వాల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్ మేఘ్వాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ -
మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్‌లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్‌లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్‌గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే. -
Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడుముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.1978, నూతన సంవత్సరం తొలిరోజున..గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్‌లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్‌కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్‌లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. -
‘మా పాప చనిపోయేంత వరకూ పోలీసులు పట్టించుకోలేదు’
అనంతపురం: ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురికావడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్9) తన్మయి తల్లి దండ్రులతో కలిసి గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పోలీసులు సరిగా పని చేయకపోవడం లేదంటూ నినాదాలు చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయాన్ని మట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల చోటు చేసుకున్నాయి. దాంతో ఎస్సీ కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. .. తమ పాప మిస్ అయ్యిందని కేసు పెట్టడానికి వెళ్లినా పోలీసులు అస్సలు పట్టించుకోలేదన్నారు. కనీసం ఏ రకంగాను పోలీసులు దర్యాప్తు చేయలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసల నిర్లక్ష్యం కనిపించిందని, ఇప్పుడు డెడ్‌బాడీ కనిపించిన తర్వాత చేసేదేంటని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అనుమానితుల గురించి చెప్పినా పట్టించకోకపోవడం వల్లే ఇంతవరకూ వచ్చిందన్నారు.గిరిజన విద్యార్థిని దారుణహత్య -
ముంబై లోకల్ ట్రైన్ లో రద్దీ.. ఐదుగురు మృతి
-
నాంపల్లి: చేప ప్రసాదం పంపిణీలో విషాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటుచేసుకుంది. క్యూలెన్లలో గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని మెదక్ జిల్లాకు చెందని సత్యనారాయణ(75)గా గుర్తించారు. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి గుండెపోటు రాగా.. ఆయన స్పృహ తప్పి పడిపోయారు.. వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు పంపిణీ మొదలు కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు చేప మందు కోసం భారీగా తరలివచ్చారు. 42 క్యూ లైన్లలో కౌంటర్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. -
తొక్కిసలాట.. విషాదాలు: మహా కుంభమేళా నుంచి బెంగళూరు వరకూ..
న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)(ఆర్సీబీ) విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయానికి గుర్తుగా నిర్వహిస్తున్న వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో దేశంలో ఆరు ప్రధాన విషాదకర తొక్కిసలాటలు జరగగా, పలువురు మృతిచెందారు. వందలాదిమంది గాయపడ్డారు.న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్(2025, ఫిబ్రవరి)ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. మహా కుంభమేళాకు చేరుకునేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు ఎక్కడానికి ప్రయాణికులు వేచివుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన 14- 15 ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే ఫుట్-ఓవర్‌బ్రిడ్జిపై జరిగింది. కొంతమంది ప్రయాణికులు దిగుతున్నప్పుడు జారిపడి భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.మహా కుంభ్(2025, జనవరి)ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. జనవరి 29న తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం కోసం గుమిగూడారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.గోవా ఆలయం(2025 మే)ఉత్తర గోవాలోని షిర్గావ్లో వార్షిక లైరాయ్ దేవి జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు. 50 మందికి పైగా జనం గాయపడ్డారు. విపరీతమైన రద్దీ, తగినంత భద్రతా నిర్వహణ లేకపోవడం వల్ల గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది.తిరుపతి( 2025, జనవరి)ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు. ఈ దుర్ఘటన జనవరి 8న విష్ణు నివాసంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం కోసం టోకెన్లు పంపిణీ చేస్తున్న సమయంలో జరిగింది.సంధ్య థియేటర్ (2024, డిసెంబర్)2024 డిసెంబర్ 4 హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో విషాదానికి దారితీసింది. హీరో అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా జనం థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మృతిచెందింది.హత్రాస్ సత్సంగ్ (2024, జూలై)ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 'భోలే బాబా' నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి 121 మంది మృతిచెందారు. సత్సంగ్ నిర్వాహకులు 80వేల మందికే అనుమతినివ్వగా, 2.5 లక్షలకు పైగా జనం సత్సంగ్‌కు తరలివచ్చారు. -
చీకటి.. ఆ కుటుంబాన్ని చిమ్మ చీకటిలోకి నెట్టేసింది..!
చీకటి.. రిలాక్స్ డ్ గా ఉండే సమయంలో చీకటిని ఒకింత ఆస్వాదిస్తాం. కానీ అదే చీకటిలో ఎక్కువ సేపు ఉండాలంటే ‘వామ్మో’ అంటాం. చాలా మంది చీకటి అంటేనే భయపడతారు. మరి అదే చీకటి కారణంగా ఓ జీవితంలో చిమ్మ చీకటి ఏర్పడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓ కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందనే చెప్పాలి. అది వారి తలరాత అనుకోవాలో.. లేక విధి ఆడిన నాటకమనుకున్నా ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో రాయల్ ఫార్మ్ విల్లా కాలనీలో చోటు చేసుకున్న విషాదానికి చీకటే కారణంగా నిలిచింది. ఒకవైపు భారీ వర్షం, ఈదురు గాలులతో కరెంట్ పోతే, అదే సమయంలో ఓ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. రాయల్ ఫార్మా అపార్ట్ మెంట్ లోని 307 ఫ్లాట్ లో ఉంటుంన్న రిషిరాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తల్చుకుని రోదిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది.కొడుకును రక్షించబోయి..సోమవారం(మే 26 వ తేదీ) రాత్రి గం. 10 లకు. భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాన్ష్ గురించి ఆరా తీశాడు. అయితే ఆ పిల్లాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో తండ్రి రిషిరాజ్ హుటాహుటీనా దేవాన్ష్ గురించి వెతకడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో ఆటోమేటిక్ గా పని చేయాల్సిన జనరేటర్ పని చేయకపోవడాన్ని గ్రహించాడు.దేవాన్ష్.. దేవాన్ష్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించాడు. అయితే పాప..పాప(నాన్న నాన్న) అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. అది తన కుమారుడుదేనని గ్రహించిన తండ్రి.. తన పిల్లాడికి ధైర్యం చెబుతూ కిందకు జనరేటర్ ఉన్న స్థలానికి పరుగు తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ చేయడం, ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి.విధి రాత అంటే ఇదేనేమో..ఆ కాలనీ ఎంతో సంతోషంగా ఉంటూ అందరి సమస్యలను పట్టించుకునే రిషిరాజ్ ఇక లేడనే వార్త స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది. చీకటి.. ఆ జీవితాన్ని చిమ్మ చీకటిలో నెట్టేసిందని, విధి రాత అంటే ఇదేనేమో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఆ కుటుంబం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రిషిరాజ్ భార్య, పిల్లల్ని ఓదార్చడం కాలనీ వాసుల వల్ల కావడం లేదు. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఇలా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులేనిదిగా మిగిలింది.సీపీఆర్ చేసి ప్రయత్నించినా..రిషిరాజ్ కుప్పకూలడంతో తొలుత సీపీఆర్ చేశారు. ఆ చీకటిలో రిషిరాజ్ కుప్పకూలిపోవడాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రాణం కోల్పోయి జీవచ్ఛవంలా పడిఉన్న రిషిరాజ్ ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.లిఫ్ట్ అంటే భయం..లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోయిన దేవాన్ష్.. ఒకప్పుడు అదే లిఫ్ట్ అంటే తీవ్రంగా భయపడిపోయేవాడట. క్రమేపీ లిఫ్ట్ భయాన్ని తండ్రి పోగొట్టినా, చివరకు అదే లిఫ్ట్ కారణంగా తన తండ్రి ఆందోళనకు లోనై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింత బాధిస్తుంది. ఇదే విషయాన్ని రిషిరాజ్ భార్య పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.లోతుగా దర్యాప్తు ..అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న మిస్రోడ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ ఆగిపోవడం, అదే సమయంలో లిఫ్ట్ ఆన్ చేయడానికి రిషిరాజ్ వెళ్లి అక్కడే పిల్లర్ కింద పడి ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సదరు పోలీస్ స్టేషన్ అధికారి మనీష్ రాజ్ భడోరియా తెలిపారు. -
కోనసీమలో విషాదం.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
తాడేపల్లి: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచి్చన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్‌కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు çఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు.గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు. -
158ని బలిగొన్న విమాన ప్రమాదం.. 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
మంగళూరు: అది 2010, మే 22.. కర్నాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Mangalore International Airport)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాదం జరిగి నేటికి (మే 22, 2025) 15 ఏళ్లు పూర్తయ్యింది.నాడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(Air India Express flight) 812లో ప్రయాణం సాగించిన 166 మంది ప్రయాణికులలో ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టగలిగారు. భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది. దర్యాప్తు దరిమిలా వెలువడిన వివరాల ప్రకారం విమాన కెప్టెన్ ల్యాండింగ్ విషయంలో చేసిన తప్పిదమే ప్రమాదానికి కారణమని వెల్లడయ్యింది. రన్‌వే ఓవర్‌షూట్ అయిన విమానం కొండవాలు నుండి పడగానే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయపు రన్‌వే మిగతావాటితో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది.నాడు ప్రమాదానికి గురైన విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చింది. ల్యాండింగ్ నుండి 2,000 అడుగుల దూరంలో ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో అది రన్‌వే 24 ప్రారంభం నుండి 5200 అడుగుల ఎత్తులో ల్యాండింగ్(Landing) ప్రారంభించింది. అది ఆపడానికి 2,800 అడుగులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అయితే అది అంతలోనే ఇసుక అరెస్టర్ బెడ్ గుండా దూసుకెళ్లింది. దాని రెక్కలు యాంటెన్నాలను ఢీకొని కొండపై పడిపోయాయి. వెంటనే మంటలు విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 158 మంది ప్రాణాలు కోల్పోయారు.నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందించారు. అలాగే అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించారు. ఇదేవిధంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించింది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ -
గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీలో గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు విచారణకు కమీషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. భవన భద్రత , విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరమైన నిబంధనలు పాటించలేదంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలపై హెచ్ఆర్సీ స్పందించింది. ఘటనలో 17 మంది దుర్మరణం కారణాలపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , అగ్నిమాపక శాఖ డీజీ , టీఎస్ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
సత్యసాయి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్ తో మరణించిన బాలుడు
-
‘ప్రభుత్వం వైఫల్యం వల్ల కొడుకు, కోడలు భవిష్యత్‌ను కోల్పోయారు’
-
బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)
-
సింహాచలం దుర్ఘటన.. ఎటు చూసినా ఆర్తనాదాలే
-
Festival: జనాల్లోకి దూసుకొచ్చిన కారు.. 9 మంది దుర్మరణం
ఒట్టవా: ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఫెస్టివల్ కాస్తా ఉన్నపళంగా విషాదంగా మారిపోయింది. కెనడాలోని వాంకోవర్ సిటిలో లపూ లపూ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కారు దూసుకొచ్చింది. ఇందులో 9 మంది దుర్మరణ పాలయ్యారు. కెనడా స్థానిక కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిలిపినో కమ్యూనిటీకి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై లపూ లపూ ఫెస్టివల్ వేడుకను చేసుకుంటుంగా ఈ దారుణం సంభవించింది. అయితే ఈ ఘటనలో 9 మంది వరకూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. భారీ సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు కెనడా పోలీసులు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన వీడియోలు ఆవేదన భరితంగా ఉన్నాయి. Initial reports of several killed and over a dozen injured, after an SUV plowed into a closed-off street filled with people celebrating the Lapu Lapu Festival in Vancouver, Canada. pic.twitter.com/cLQQPfOMCq— OSINTdefender (@sentdefender) April 27, 2025 -
SLBC: సొరంగంలో సరిగ్గా నెల కిందట..
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్‌ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు... ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారుమిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’
వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం(Saturday) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి (Heart Attack) అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటుప్పల్‌కి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.నాన్నా..పిల్లలతో వస్తున్నా..మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందినసోమారపు సారంగపాణి, పద్మకు ఇద్దరు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్ (పప్పి) కష్టపడి చదువుకుని హనుమకొండ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. భార్య కృష్ణవేణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఊరులో ఉన్న అమ్మానాన్న వద్దకు వచ్చివెళ్లేవాడు. ‘రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పిల్లలతో సహా ఇంటికి వస్తున్నాం. అర్ధగంటలో చేరుకుంటాం’ అని ప్రవీణ్‌కుమార్ శనివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అదే అర్ధగంటలో కారు కాల్వలో పడిందని సమాచారం అందడంతో ‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో... అంటూ’ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. ఇంటికి వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండే ప్రవీణ్ కుమార్ చనిపోయాడని తెలియడంతో అయ్యో.. దేవుడు మంచి మనిషిని తీసుకెళ్లాడు’ అంటూ స్నేహితులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు.నా భర్త, పిల్లలను బతికించండి..స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి తన పిల్లలను, భర్తను బతికించండని అక్కడున్న వారిని ప్రాధేయపడింది. రెండేళ్ల కుమారుడిని బయటికి తీసుకువచ్చాక ‘లే నాన్నా.. లే’ అంటూ తట్టిలేపుతున్న కృష్ణవేణిని చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా..‘నా మనుమరాలు చైత్ర ఉదయం ఫోన్లో మాట్లాడింది. హనుమకొండకు నువ్వు వస్తావా.. లేదా నన్నే రమ్మంటావా..’ అని ముద్దుగా చెప్పిందని తాత సారంగపాణి అక్కడున్న వారికి చెబుతూ రోదించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రవీణ్ అంటే దయగల గుణం అని, అందరూ తనవాళ్లేనని అంటుండేవాడని, ఆస్పత్రుల్లో బంధువులుంటే వారికి అన్నం పెట్టేవాడని, అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్న నా కొడుకుకు అప్పుడే నూరేళ్లు నిండి దేవుడి వద్దకు వెళ్లాడా. చైత్రకు నాన్న ప్రవీణ్ అంటే అమితమైన ప్రేమ అని, చివరికి తండ్రితో కలిసే పరలోకాలకు చేరింది’ అంటూ అని పద్మ గుండెలవిసేలా రోదించింది.రెయిలింగ్ లేకనే ప్రమాదాలురెయిలింగ్ లేకపోవడంతో కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీబీఎం–48 కాల్వ వద్ద తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల క్రితం కారు వేగంగా కాల్వలోకి వెళ్లి ఒక ప్రభుత్వ టీచర్, మరో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్ బోల్తాపడి మరొకరు మృత్యువాతపడ్డారు. శనివారం ఎస్సారెస్పీ కాల్వలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్వ చుట్టూ రెయిలింగ్, ప్రమాద సూచికలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
SLBC Tragedy : ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్ఎల్బీసీ కథ ఇదీ!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్ఎల్బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్లెట్తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్లెట్తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.-జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్?
ఎంతో ఆనందంగా వీడ్కోలు పార్టీకి వెళ్లిన ఆ అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. చదువు చెప్పిన గురువుల ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన ఆ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. అప్పటివరకు ఆడిపాడిన అమ్మాయి ఆస్పత్రి బెడ్‌పై నిర్జీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగినిపోయారు. అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎంఆర్ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్ఎస్ పాఠశాల/కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ (farewell party) కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్ (DJ Sound) బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల (Tanamcherla) శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. విచారణ లేకుండా సస్పెండ్ చేశారని..ములుగు/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల కేంద్రంలోని తన అద్దె గృహంలో మంగళవారం ఉదయం వెంకటాపురం అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.గతంలో ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న తతంగంపై కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం సమాన వృత్తిలో ఉన్న ములుగు సీడీపీఓ, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ చెప్పినట్లుగా వినడం తప్ప ఎదుట వ్యక్తి విషయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సెంటర్లు నడవని కేంద్రాలకు ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని, రిటైర్ అయిన ఆయాకు వేతనం ఎలా ఇస్తారని అడిగానని, వీటిని మనసులో పెట్టుకుని కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేశారన్నారు. వీటన్నింటికి కారణం డీడబ్ల్యూఓ శిరీష అని పునరుద్ఘాటించారు.చదవండి: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్.. తర్వాత ఎవరంటే?కాగా, సీడీపీఓ ధనలక్ష్మి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వెంకటాపురం(కె) ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ ధనలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. ఇది జరిగిన అరగంటలోనే సీడీపీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆమె ఆందోళన చెందారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ విషయమై డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా తాను ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు. -
Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన గురించి బాగ్పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
-
కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం విషాదాంతం
-
‘నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ ‘అతి’ 14 మంది ప్రాణాలు తీసింది’
ముంబై : నేవి చెందిన బోటు నడిపే డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ముంబై సముద్ర తీరంలో జరిగిన పెను విషాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ముంబై సముద్ర తీరంలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ‘నీల్కమల్’ అనే ఫెర్రీ (పడవ) దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పాయారు.వారిలో తన అత్త ప్రాణాలు కోల్పోయిందని గౌరవ్ గుప్తా అనే యువకుడు విచారం వ్యక్తం చేశారు. ఫెర్రీ ప్రమాదం ఘటనలో సురక్షితంగా బయటపడ్డ గౌరవ్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇండియన్ నేవీ చెప్పినట్లుగా నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగలేదని, నేవీ బోటు డ్రైవర్ అత్యుత్సాహం వల్లే భారీ ప్రాణ నష్టం సంభవించిందని వాపోయాడు. ‘‘నేను పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాకు కూరగాయాల వ్యాపారం చేస్తున్నా. గత వారం నా వివాహానానికి ముంబై నుంచి మా అత్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. వారికి ఎలిఫెంటా గుహలు చూపించేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి పడవలో బయలుదేరాము. మా అత్తతో పాటు, ఇతర ప్రయాణికులకు అదే చివరి రోజవుతుందని అనుకోలేదు. ఎలిఫెంటా ద్వీపం వైపు వెళుతుండగా నేవీకి చెందిన స్పీడ్ బోట్ 5 నుండి 6 మంది సిబ్బందితో మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా పక్కకు వచ్చింది. ఆ సమయంలో నేవీ బోటు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు అత్యుత్సాహం ప్రదర్శించారు. బోటును అటూ ఇటూ తిప్పుతూ ఫోజులు కొట్టారు. నేవీ డ్రైవర్ చేస్తున్న విన్యాసాల్ని తోటి ప్రయాణికులు వీడియోలు కూడా తీశారు. చివరికి మా బోటును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ ఆ బోటును మా బోటుకు వైపుకు వేగంగా దూసుకొచ్చాడు. ఓవర్ టేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ స్పీడ్ బోటు.. మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో 100 మంది ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు మమ్మల్ని రక్షించాయి’’అని అన్నారు.#MumbaiBoatAccident - Live video "Today afternoon, an #IndianNavy craft lost control while undertaking engine trials in #Mumbai Harbour due to engine malfunction. As a result, the boat collided with a passenger #ferry which subsequently capsized (#BoatCapsized ).""13… pic.twitter.com/9ifLLurccP— Surya Reddy (@jsuryareddy) December 18, 2024 నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం తలెత్తిందనే వాదనను గుప్తా ఖండించారు. ఫెర్రీని ఢీకొట్టడానికి ముందు నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ సంతోషంగా ఉన్నారు. తాము ప్రయాణిస్తున్న బోటు ఎదురుగా వచ్చే మా ముందు విన్యాసాలు చేశారు. నేవీ బోటులో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తితే.. అలా ప్రయాణం చేయరు కదా? అంత వేగంగా స్పీడు బోటును ఎలా నడిపారు అని ప్రశ్నించారు. కాగా, ఫెర్రీ బోటు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొని 101 మందిని కాపాడాయి. -
‘పుష్ప 2’ ప్రీమియర్ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు సీపీఆర్ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
HYD: లంగర్‌హౌజ్‌లో ‘హిట్ అండ్ రన్’.. దంపతులు మృతి
సాక్షి,హైదరాబాద్:లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్‌హౌస్ నుంచి బంజారాహిల్స్‌కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కర్వా చౌత్ ట్రాజెడీ : ఆవేశంతో భార్య, ఆమె చీరతో భర్త
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.జైపూర్‌లోని హర్మారా ప్రాంతంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్హెచ్ఓ ఉదయ్ భన్ తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా... -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 44వేలమంది యువతుల అదృశ్యమనేది పూర్తిగా అబద్ధం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వయనాడ్ లో మరణ మృదంగం
-
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోగల ఓ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి చేరిన వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ సంఘటన అనంతరం విద్యార్థులు అటు కోచింగ్ సెంటర్‌పైన, ఇటు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్మెంట్లో ముగ్గురు మాత్రమే కాదు ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు మృతిచెంది ఉంటారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు. ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్నారు. అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతుందన్నారు. దీంతో అప్పుడప్పుడు విపత్తులు జరుగుతుంటాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల వాస్తవ సంఖ్యను వెంటనే వెల్లడించాలని ఆ విద్యార్థి కోరాడు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: "MCD says it is a disaster but I would say that this is complete negligence. Knee-deep water gets logged in half an hour of rain. Disaster is something that happens sometimes. My landlord said that he had been asking the councillor… pic.twitter.com/W4fhem3lE6— ANI (@ANI) July 28, 2024 ఓల్డ్ రాజేంద్ర నగర్లో జరిగిన ఘటనపై ట్విట్టర్లో సమాచారాన్ని పంచుకున్న ఢిల్లీ పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థి అమన్ శుక్లా మాట్లాడుతూ ముందుగా బేస్మెంట్లలో అక్రమంగా నిర్మించిన లైబ్రరీని మూసివేయాలన్నారు. #WATCH | Old Rajender Nagar Incident | "Three people have died. Why will we hide anything? We assure you that we will do whatever is legally possible. The investigation is on...," says Additional DCP Sachin Sharma to protesting students3 students lost their lives after the… pic.twitter.com/V82Xq21mQ7— ANI (@ANI) July 28, 2024 -
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
‘హోర్డింగ్’ అనుమతులపై విచారిస్తున్నాం
దాదర్: ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన 14 మంది మృతిచెందిన దుర్ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపరిచింది. మృతులు, గాయపడ్డవారి బంధువుల ఆందోళన నేపథ్యంలో అసలు ఈ భారీ హోర్డింగ్‌కు ఎవరు? ఎలా అనుమతిచ్చారన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఈదురు గాలులు, దుమ్ము, ధూళితో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల పలు హోర్డింగులు, చెట్లు నేలకూలాయి.ఇదే క్రమంలో ఘాట్కోపర్లోని ఓ పెట్రోల్ బంకు షెడ్డుపై 120/120 అడుగుల భారీ హోర్డింగ్ కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆకస్మాత్తుగా కురిసిన భారీవర్షం, ఈదురు గాలుల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో అగి్నమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సంఘటన స్ధలానికి చేరుకొనేందుకు తీవ్ర ఆలస్యమైంది దీంతో అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సహాయ చర్యలు కొనసాగాయి. ఐతే వీరిలో తీవ్ర గాయాలపాలైన కొందరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని, దీంతో మృతుల సంఖ్య 14కు చేరిందని చడ్డానగర్ పోలీసులు తెలిపారు. హోర్డింగ్‌పై బీఎంసీకి మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య లేఖ నేల కూలిన భారీ హోర్డింగ్ పునాదులు, వెల్డింగ్ చేసిన ఇనుప పట్టీలు చిలుము పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తొలగించాలని స్ధానిక మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య బీఎంసీకి గతంలో లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన బీఎంసీ కమిషనర్ (అడ్మిన్) భూషన్ గగ్రానీ రెండు రోజుల కిందటే హోర్డింగ్ యజమానికి నోటీసు జారీ చేశారు. ఈలోగానే సోమవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఈ భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు షెడ్డుపై కూలింది. ఘటన జరిగిన సమయంలో బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కోసం పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు, టెంపోలు, ఇతర వాహనాలు క్యూలో ఉన్నా యి.వీరే కాకుండా ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో అనేక మంది ద్విచక్ర వాహన చోదకులు తల దాచుకునేందుకు బంకు షెడ్డు కిందకు చేరుకున్నారు. అలాగే భారత్ పెట్రోలియం బంకు సైన్ ప్రాంతం తర్వాత చడ్డానగర్లోనే ఉంది. ఆ తరువాత ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వేపై థానే వరకు భారత్ పెట్రోలియం బంకులు లేవు. దీంతో చడ్డానగర్లో హైవేకు ఆనుకుని ఉన్న ఈ పెట్రోల్ బంకు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.సోమవారం సాయంత్రం కూడా బంకులో ఇదే పరిస్థితి ఉండటం, అదే సమయంలో భారీ హోర్డింగ్, బంకు పైకప్పు కూలడంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, అగి్నమాపక అధికారులు తీవ్రంగా శ్రమించారు. కార్లపై హోర్డింగ్, పెట్రోల్ బంకు పైకప్పు కూలడంతో కార్ల డోర్లు జామ్ అయ్యాయి. వాహనాలకు సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టం ఉండడంవల్ల ఇంజన్ (ఆన్‌లో ఉంటేనే) పని చేస్తేనే డోర్లు తెరుచుకుంటాయి. దీంతో పలువురు కార్లలోనే ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణమైందని, క్షతగాత్రులను 40 అంబులెన్స్‌ల ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.గాలి తీవ్రత వల్లే.. ప్రమాదంఘాట్కోపర్ పరిసరాల్లో నాలుగు భారీ హోర్డింగులున్నాయి. సోమవారం నేల కూలిన హోర్డింగ్ రైల్వే పోలీసు క్వార్టర్స్ పరిధిలో ఉంది. మహరాష్ట్ర స్టేట్ పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఉన్న ఈ స్థలంలో ప్రమాదానికి గురైన హోర్డింగ్‌కు రైల్వే మాజీ కమిషనర్ కేసర్ ఖాలీద్ హయాంలో అంటే 2021లో 10–20 ఏళ్ల కాలవ్యవధి కోసం అనుమతిచి్చనట్లు తెలుస్తోంది. బీఎంసీ నిబంధనల ప్రకారం ఒక్కో హోర్డింగు 40/40 అడుగుల ఆకారంలో ఉండాలి. కానీ ఈ హోర్డింగులు ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 120/120 అడుగుల ఆకారంలో ఉండడంవల్ల గాలి వేగాన్ని తట్టుకోలేక కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.హోర్డింగ్ యజమాని, ఈగో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సంచాలకుడు భావేష్ భిడేపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడనే అభియోగం మోపుతూ స్ధానిక పంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ అనుమతులకు సంబంధించి కేసర్ ఖాలీద్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని, అనంతరం కేసు దర్యాప్తును పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర శిసావే వెల్లడించారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
పటాన్చెరు టౌన్: న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద జరిగిన ఈవెంట్‌కి హాజరై తిరిగి హాస్టల్‌కు వెళ్తుండగా స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పటాన్చెరు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు... సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్లో పర్మిషన్ తీసుకుని ఆదివారం సాయంత్రం మూడు బైక్‌లపై దుర్గం చెరువు ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పటాన్చెరు శివారు వాల్యూమాట్ సమీపంలోకి రాగానే భరత్ చందర్ (19) నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భరత్ చందర్‌తో పాటు వెనుక కూర్చున్న స్నేహితుడు నితి న్ (18) అక్కడికక్కడే మృతి చెంద గా, మరో స్నేహితుడు వర్షిత్ (19) కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భరత్ చందర్ స్వస్థ లం జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామం. నితిన్ ది అదే జిల్లా బచ్చన్నపేట మండ లంలోని అలింపురం. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నవ్వుల రాజా.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ స్టాండ్‌అప్ కమెడియన్ నీల్ నందా(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నీల్ నందా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా రచయిత కూడా. నీల్ నందా ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శించారు. అతను కామెడీ సెంట్రల్, ఎంటీవీ, వైస్ల్యాండ్, హులు అనేక కామెడీ షోస్‌లో కూడా కనిపించాడు. అంతేకాకుండా వెస్ట్‌సైడ్ కామెడీ థియేటర్లో ప్రదర్శించిన అన్నెససరీ ఈవిల్ షో లాస్ఎంజిల్స్ వీక్లీ టాప్ -10లో చోటు దక్కించుకుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నీల్ నందా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు. 2013లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మీ కిమ్మెల్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్సైడ్ జోక్, హులు కమింగ్ టు ది స్టేజ్‌లో కూడా కనిపించాడు. నీల్ నందా మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన హాస్యనటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. RIP Neel Nanda. Just at a total loss for words here. One of the nice and hardest working ones we had 💔 pic.twitter.com/unFtmN2xoU — Eli Olsberg (@EliOlsberg) December 23, 2023 RIP Neel Nanda 😔 you were one of the nicest, hardest working comedians I’ve ever called a friend and i hope you can be at peace brother ❤️🩹 — Matt Rife (@mattrife) December 23, 2023 -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
టైటాన్ విషాదం: వాళ్ళ చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్. గంటలు గడిచే కొద్దీ.. పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా.. ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు వెళ్లినట్లు చెప్పారు. చివరికి.. వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. Christine Dawood wanted to talk to the BBC and pay tribute to the son and husband she lost. #Titan Longer interview running on @BBCWorld on-air and online 🎥 @robtaylortv @EloiseAlanna pic.twitter.com/q1LW946xpn — Nomia Iqbal (@NomiaIqbal) June 25, 2023 ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ.. -
Odisha Train Tragedy:ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..
ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతా అల్లకల్లోలం.. దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని చెప్పారు. కళ్లలో మెదులుతున్నాయి.. 'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతం గుండానే..వందే భారత్ రైలు..
ఒడిశా రైలు ప్రమాదం ఎంతటీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత ఆ ప్రాంతం గుండా తొలిసారిగా వందే భారత్ హైస్పీడ్ ప్యాసింజర్ హౌరా పూరీ రైలు వెళ్లింది. ఆ ప్రమాదం తర్వాత... పట్టాలు పునరుద్ధరణ పనులు పూర్తవ్వడంతో.. ఈ ఉదయమే బాలాసోర్ గుండా వందే భారత్ రైలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు . ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు బహనాగ బజార్ స్టేషన్‌ను దాటినట్లు తెలిపారు. అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాద స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ వందే భారత్ రైలు వెళ్లినప్పుడూ.. అందులోని డ్రైవర్లకు వైష్ణవ్ చేయి చూపినట్లు అధికారులు తెలిపారు. ఆ పట్టా పునురుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తయినట్లు వైష్ణవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్ పోర్టు నుంచి బొగ్గుతో కూడిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ రైలు ఆ ట్రాక్‌పై పరుగులు పెట్టినట్లు తెలిపారు అధికారులు. కాగా ఆ మూడు రైళ్ల ప్రమాదం విషయమై ఇది మానవ తప్పిదమా? ..సిగ్నల్ వైఫల్యమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత..
సరిగ్గా 14 ఏళ్ల తర్వాత... కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. 14 ఏళ్ల క్రితం కూడా ఇదే ఓడిశాలోని జాజ్ పూర్ వద్ద ఈ రైలు మొదటిసారి పట్టాలు తప్పింది. ఆసక్తికరమైన మరో సంగతేంటంటే ఆరోజు కూడా శుక్రవారమే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోనే, శుక్రవారం రోజునే ప్రమాదానికి గురికావడం యాదృచ్చికం. 2009, ఫిబ్రవరి 13, శుక్రవారం రోజున... ఒడిశాలోని జాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అత్యంత వేగంగా వెళ్తోన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరోజు ఆ ప్రమాదంలో స్లీపర్ క్లాస్ కు చెందిన 13 భోగీలు పట్టాలు తప్పగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు, 161 మంది గాయపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత అదే శుక్రవారం రోజున కోరమండల్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ ప్రమాదానికి గురికావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. కానీ ఇప్పుడు బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రమాదం అంతకంటే తీవ్రమైనది. రైలు ప్రమాదం తదనంతర పరిణామాలు మరింత విషాదకరంగా ఉన్నాయి.సంఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాల వద్ద రోదిస్తున్న బాధితులతో హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ సంఘటన కూడా ఒకటిగా మిగిలిపోతుంది. మృతుల సంఖ్య ఇప్పటికింకా ఒక కొలిక్కి రాలేదు. గాయపడినవారి సంఖ్య తగ్గుతుంటే.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అందరూ పాల్గొనండి -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
కేరళ బోటు విషాదం..
-
కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi — PMO India (@PMOIndia) May 7, 2023 సీఎం విచారం.. ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు. Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends. — Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023 చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత -
పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు. 'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు. అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ -
150 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గడ్ జిల్లా ఖోపాలి వద్ద బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణె-రాయ్‌గడ్ సరిహద్దులో ఈ ప్రమాదం జరింది. బస్సు పుణెలోని పంపిల్ గురవ్ నుంచి గొరెగావ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిలుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దిగి బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి -
శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం
-
ఫంక్షన్ నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బలోదా బజార్ జిల్లా ఖమారియా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల సిఫార్సు మేరకు క్షతగాత్రుల్లో కొందరిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పికప్ వాహనంలో ఉన్నవారంతా ఓ పంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అసరమైన సాయం అందించాలని సూచించారు. రెండు వారాల క్రితం కంకేర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరొక చిన్నారితో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు. చదవండి: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు -
నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..
కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW — Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023 విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y — Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023 ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. #NepalPlaneCrash Prayers! pic.twitter.com/pn7ECs1Gyk — Rukhsar (@Rukhsar987) January 15, 2023 काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2 — Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023 చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే! -
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
పేదరికం పేగు తెంచుకొని పుట్టినందుకు పూటకుపూట అన్నం కోసం దేవులాడుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ ప్రచార ఆర్భాట గాలానికి గుచ్చిన రూపాయి ఎరకు ఆశపడి కష్టాల కొక్కెను గొంతులో ఇరికించుకున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ మోచేతి మత్తు కోసం గుటకలు మింగే మా మొగోళ్ళు మా బాధలను గాలికొదిలేసి మీ చెప్పులతో స్నేహం చేస్తున్నారు ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా జనమంతా మీతోనే ఉన్నారని నమ్మించడానికి మీరు చల్లిన నూకలు ఆకలి గుంపును అదిమి పట్టడానికే అని తెలిసికూడా మీ మాయల ఉచ్చులోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీరు విదిలించే కానుకల కిట్లు మా ఇంట్లో కొత్త సంవత్సర శోభ తెస్తాయని ఇంటిల్లిపాది పనులు మానుకొని బారులు తీరి మీ కుతంత్రం కాళ్ళకింద పడి ఊపిరి వదిలేశాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా ఈ ప్రపంచాన్ని నోటు నడిపించినంత కాలం... ఈ నోట్లు పెద్దోళ్ళ పెరట్లో కాస్తున్నంత కాలం... మా కూలి బతుకుల్లో విచ్చుకున్న ఆకలి గాయాలు నిత్యం ఏడుస్తూనే ఉంటాయి ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా – డాక్టర్ ఎన్. ఈశ్వర రెడ్డి, ప్రొఫెసర్, యోగివేమన యూనివర్సిటీ, వైస్సార్ కడప జిల్లా (గుంటూరు తొక్కిసలాటలో కూతురును కోల్పోయిన ఒక తల్లి రోదిస్తూ... ‘మా రాత అట్టా రాసుందయ్యా’ అన్న వాక్యం విన్న బాధతో)


