డొమినికన్‌ రిపబ్లిక్‌లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి

Dominican Republic Plane Crash Tragedy  - Sakshi

శాంటా డొమింగో: కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో  విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కొల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, శాంటో డొమింగోలో.. ఒక ప్రైవేటు విమానం లా ఇసబెల్లా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ప్రముఖ ప్యూర్టోరికన్‌ సంగీత నిర్మాత జోస్‌ ఏంజెల్‌ హెర్నాండెజ్‌ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆయన ‘ఫ్లోలా మూవీ, టె బోటే’వంటి హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్‌ 38 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.  మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన ఆరుగురు, డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి ఇద్దరు, వెనిజులాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top