
బాపట్ల: జిల్లాలోని చీరాల మండలం వాడరేవు చూడటానికి వచ్చిన విహారయాత్ర కాస్తా విషాదం మిగిల్చింది. సముద్రస్నానానికి వెళ్లిన పలువురు యువకులు గల్లంతయ్యారు. వాడరేవులో సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాసి అలలకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దర్ని పోలీసులు రక్షించారు.
ఈ విహార యాత్రకు ఏడుగురు యువకులు బృందంగా వచ్చినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో మణిదీప్(19), సాత్విక్(19), సాకేత్ (19) మరియు సూర్యాపేటకు చెందిన సోమేష్‌లుగా గుర్తించారు.