గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు | Killer Goa blaze a man made tragedy FIR spells it out | Sakshi
Sakshi News home page

గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు

Dec 7 2025 7:07 PM | Updated on Dec 7 2025 7:25 PM

Killer Goa blaze a man made tragedy FIR spells it out

గోవా: ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు.

పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్‌లు అందుబాటులో నిందితులు ప్రదర్శనను నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. 

 


ఎఫ్‌ఐఆర్ లోని వివరాలు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెల్లడించాయి. రెస్టారెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు  డెక్‌లో అత్యవసర నిష్క్రమణ తలుపు లేకపోవడం ఎఫ్‌ఐఆర్‌లో గమనించదగిన అంశం.

v

 

అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్/క్లబ్‌కు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని తేలింది. 


 


నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)సెక్షన్లు 105 (నేరపూరిత నరహత్య), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్య), 125 (ఎ), 125 (బి),  287 (అగ్ని లేదా మండే పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం)తో పాటు సెక్షన్ 3 (5) (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనను మానవ తప్పిదంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్‌ వీడియో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement