అర్హులెవ్వరినీ తొలగించం | No Eligible Voters Name to be Removed: CEC Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

అర్హులెవ్వరినీ తొలగించం

Mar 11 2026 5:07 AM | Updated on Mar 16 2026 5:20 PM

No Eligible Voters Name to be Removed: CEC Gyanesh Kumar

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కమిషన్‌(ఈసీ) ప్రధాన ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు, ఉన్నతాధికా రులతో ఈసీ వరుస సమీక్షా సమావేశాలు నిర్వ హించిన అనంతరం మంగళవారం కోల్‌కతాలో ఈసీలోని ఇతర సభ్యులతో కలిసి జ్ఞానేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ వెళ్లాక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామ న్నారు. బెంగాల్‌లో సర్‌ అమలు పలు వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీయడంపై ఆయన స్పందిస్తూ.. అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడమే కాదు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేల మందికి పైగా శతాధిక వృద్ధులతోపాటు కొత్తగా నమోదైన 18–19 ఏళ్ల గ్రూపులోని 5.23 లక్షల మంది యువజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement