breaking news
sir
-
బెంగాల్లో 58 లక్షల ఓటర్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ మూడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొలిక్కి వచ్చింది. వాటికి సంబంధించిన ఓటర్ జాబితా ముసాయిదాలు సిద్ధమయ్యాయి. అయితే ఆ ఐదు చోట్లా కలిపి ఏకంగా కోటి మందికి పైగా పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతవడం విశేషం. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లోనే 58 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయి! వారంతా ఓటర్ నమోదు ఫారాలు నింపి తిరిగివ్వని వారేనని ఈసీ అధికారులు చెప్పారు.వారి పేర్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, మృతులు/డూప్లికేట్ ఓటర్లు (ఏఎస్డీ) జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపారు. ‘ఆ పేర్లను మేం ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదు. దానిపై ఆయా నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులే నిర్ణయం తీసుకుంటారు‘ అని వివరించారు. ‘నిజమైన ఓటర్ల పేర్లు తొలగింపుకు గురైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తమ పేరు పునరుద్ధరించాలంటూ జనవరి 15 దాకా ఫారం 16 సమర్పించవచ్చు‘ అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే రాజస్తాన్ లో 44 లక్షలు, గోవాలో 1.01 లక్షలు, పుదుచ్చేరిలో 1.03 లక్షలు, లక్షదీ్వప్ లో 1,616 మంది పే ఓటర్ల జాబితా నుంచి ఏఎస్డీ జాబితాలోకి చేరాయి. బిహార్ లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపిన ఎస్ఐఆర్ లో ఏకంగా 68 లక్షల ఓట్లు తొలగింపుకు గురవడం తెలిసిందే.3 రాష్ట్రాలు, 2 యూటీల్లో కోటికి పైగా ∙అక్కడ ఎస్ఐఆర్ కొలిక్కి -
Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 58,20,898 మంది ఓటర్ల పేర్లను తొలగింపు కోసం గుర్తించారు. ఇవి ఓటర్ల గణన దశ ముగింపును సూచిస్తాయి. దీని తర్వాత అభ్యంతరాలు, విచారణలతో కూడిన క్లిష్టమైన దశ ప్రారంభమవుతుంది. మూడు దశల ‘సర్’ ప్రక్రియలో రెండవ దశ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా 2026, ఫిబ్రవరి 14న ప్రచురితమవుతుంది.తొలగింపు కోసం గుర్తించిన 58 లక్షలకు పైగా పేర్ల వివరాలను ఈసీఐ విడుదల చేసింది. వీరిలో అత్యధికంగా 24,16,852 మంది మృతి చెందినట్లు గుర్తించిన ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శాశ్వతంగా వేరే చోటికి మారిన లేదా వలస వెళ్లిన 19,88,076 మంది ఓటర్లు ఉన్నారు. 12,20,038 మంది ఓటర్లు గల్లంతైనట్లుగా గుర్తించగా, 1,38,328 పేర్లను నకిలీ, తప్పుడు లేదా బోగస్ ఎంట్రీలుగా గుర్తించారు. మిగిలిన 57,604 పేర్లను ఇతర కారణాల వల్ల తొలగించాలని ప్రతిపాదించారు. అయితే జాబితా నుండి మినహాయించినవారు సంబంధిత పత్రాలతో పాటు ఫారం 6లో తమ ఫిర్యాదులను సమర్పించుకునే అవకాశం ఉంది.కాగా ఈ ‘సర్’ ప్రక్రియ రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ‘సర్’ సమయంలో దాదాపు 40 మంది ఎన్నికల అధికారులు మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర పన్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ బయటకు పంపడానికి అనుమతించబోదని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ..మమతా బెనర్జీ ఆగ్రహం అక్రమ వలసదారులతో కూడిన తన ఓటు బ్యాంకును రక్షించుకోవడానికేనని ఆరోపించింది. కాగా బెంగాల్‌తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ‘సర్’ప్రక్రియ నిర్వహిస్తున్నారు.ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్.. సోనియా, రాహుల్‌కు ఊరట -
ఎస్.ఐ.ఆర్‌పై ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఉత్తరప్రదేశ్,కేరళలో ఓటర్ల జాబితా సవరణ గడువు వారం రోజులకు పొడిగించింది. తమిళనాడు,గుజరాత్ (డిసెంబర్ 14), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ అండమాన్ నికోబార్ దీవులు (డిసెంబర్ 18), ఉత్తర ప్రదేశ్ (డిసెంబర్ 26)కు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాగా, గోవా, లక్షద్వీప్, రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈరోజు ముగిసింది. -
ఎస్ఐఆర్పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్‌ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్‌సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్‌సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్‌సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్‌సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
పార్లమెంట్ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు
Parliament winter session 2025 Updates..రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదుఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీదీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలుఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలుమూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలువాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడావిపక్షాల ధర్నా..పార్లమెంట్లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నాధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణలేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని నినాదాలు#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH— ANI (@ANI) December 3, 2025కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వండిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చచర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చచర్చకు 10 గంటల సమయం కేటాయింపుడిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చవందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025 Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025 -
రెండోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేపై పార్లమెంట్లో చర్చకు విపక్షపార్టీల సభ్యులు పట్టుబట్టడంతో శీతాకాల సమావేశాల రెండోరోజు సభాకాలంసైతం నిరుపయోగంగా ముగిసింది. ఎస్ఐఆర్పై చర్చకు తామేమీ విముఖత చూపట్లేమని, కాలావధిపై పట్టుబట్టడం సరైన పద్ధతికాదంటూ కేంద్రప్రభుత్వం వ్యాఖ్యానాలతో విపక్షాలు ఏమాత్రం సంతృప్తిచెందలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జార్జియా ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ గ్యాలరీలోకి ఆహా్వనించి సభాకార్యక్రమాలు మొదలెట్టారు.ప్రశ్నోత్తరాల సమయం ఆరంభంకాగానే విపక్షసభ్యులు తమతమ స్థానాల నుంచి లేచినిలబడి ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనల నడుమే పలువురు మంత్రులు తమను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయినా విపక్షసభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ సభలో కొందరు సభ్యుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదనీయంగా లేదు. సభ గౌరవాన్ని కాపాడండి. ప్రతి ఒక్క సభ్యునికి మాట్లాడే అవకాశమిస్తా. అప్పటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత పార్లమెంట్‌గా సభ అత్యున్నత ప్రమాణాలను పాటించండి’’ అని హితవు పలికారు.అయినా నినాదాలు సద్దుమణగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైన కేవలం 10 నిమిషాలకే నినాదాలు రెట్టించడంతో సభను వెంటనే 2 గంటలకు వాయిదావేశారు. లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ మొదలైనా విపక్షసభ్యుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం సైతం సమాయత్తమవుతోందని, సభ సజావుగా సాగేలా సంయమనం పాటించాలని విపక్ష సభ్యులకు సభాధ్యక్షుడి స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా విజ్ఞప్తిచేశారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల ధర్నాఎస్ఐఆర్తోపాటు ఎన్నికల సంస్కరణలపై ఉభయసభల్లో చర్చకు ప్రభుత్వం సమ్మతి తెలపకపోవడంతో నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. నిరసనలోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. ‘‘ఎస్ఐఆర్ను అంతం చేద్దాం. ఓట్ల చోరీకి ముగింపు పలుకుదాం’, ‘ఎస్ఐఆర్ అంటేనే ఓట్ల చోరీ’, ‘వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల ఓట్లను తొలగించారు’’ అనే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రాసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ పార్లమెంట్ దేశ ప్రజలదని మోదీ పదేపదే అంటారు. తీరా ప్రజాసమస్యలపై చర్చిద్దామంటే జడుసుకుంటారు. చర్చించకుండా పారిపోతున్నారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటింగ్ హక్కుల కంటే పెద్ద సమస్య మరోటి ఉంటుందా?’’అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ చేశారు. డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్ బాలు, సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు సైతం పార్లమెంట్ మకరద్వారం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు -
ఎస్ఐఆర్పై ఆగని రగడ.. లోక్‌సభ వాయిదా
Parliament Winter Session Updates..లోక్‌సభ వాయిదా.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై రగడలోక్సభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా.. Lok Sabha adjourned to meet again at 12:00 Noon, after Opposition MPs entered the well of the House demanding a discussion on SIR pic.twitter.com/K2S4Pcu8FX— ANI (@ANI) December 2, 2025పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.రెండో రోజు సందర్భంగా ఎస్ఐఆర్ ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. #WATCH | Delhi | Opposition leaders, including Congress MP Sonia Gandhi, LoP Lok Sabha Rahul Gandhi and LoP Rajya Sabha, Mallikarjun Kharge, hold a protest against SIR in Parliament premises, on the second day of the winter session pic.twitter.com/wJDWl8tk5t— ANI (@ANI) December 2, 2025ఉభయ సభల్లో నిరసనలు.. ఎస్ఐఆర్పై చర్చించాలని రాజ్యసభలో విపక్షాల పట్టు.సభలో విపక్ష నేతల నినాదాలు.ఓట్ చోరీ ప్రభుత్వం అంటూ లోక్‌సభలో విమర్శలు. పార్లమెంట్ లోపల, వెలుపల సభ్యుల నినాదాలు.నిరసనల్లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ప్రతిపక్ష నేతలు. అయితే, ఎన్నికల సంస్కరణలపై సిద్ధమన్న కేంద్రం. #WATCH | Opposition MPs raise slogans of "Vote chor, gaddi chhor", raising the issue of SIR and demanding a discussion on it in Lok Sabha, as the House proceedings begin on the second day of the winter session of the Parliament(Video source: Sansad TV/ YouTube) pic.twitter.com/SCr37YmlXh— ANI (@ANI) December 2, 2025 -
సభకు సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 36 రాజకీయ పార్టీలకు చెందిన 50 మంది సభ్యులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్‌తోపాటు కాంగ్రెస్ తరఫున జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, వైఎస్సార్సీపీ తరఫున పి.మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్జేడీ తరఫున మనోజ్ ఝా, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంగోపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్, జాతీయ భద్రత, వాయు కాలుష్యం, ఢిల్లీ బాంబు పేలుళ్లు వంటి అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన వ్యవహారాలు, విశాఖ సీŠట్ల్ ప్లాంట్, ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వంటి అంశాలపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ అంశానికి అన్నింటికంటే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రత్యేకంగా చర్చించాలని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎలాంటి అలజడి లేకుండా నిర్మాణాత్మక చర్చలు జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం వెల్లడించింది. అంతరాయం కలిగించవద్దు: కిరణ్ రిజిజు పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించకూడదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సభ సక్రమంగా జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం అందరి సహకారాన్ని అర్థిస్తున్నామని తెలిపారు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చిస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు బదులిచ్చారు. ప్రతిపక్షాలు చక్కటి సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు. విపక్షాలు లెవనెత్తే అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలు: గౌరవ్ గొగోయ్ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. పార్లమెంటరీ సంప్రదాయాలను అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో చర్చించకుండా దాటవేలయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు. శీతాకాల సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించాల్సిందేనని, లేకపోతే సభను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సమావేశాలు 15 రోజులేనా?: జైరాం రమేశ్ శీతాకాల సమావేశాలను కేవలం 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తక్కువ సమయంలో ముఖ్యమైన అంశాలపై, బిల్లులపై చర్చించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీన్నిబట్టి మోదీ సర్కార్ ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. -
Bihar: బీఎల్ఓల మరణాలకు‘సర్’ కారణమా?
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అంతకుముందు జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ వివాదాలు మరో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం సన్నద్ధమవుతున్న తరుణంలో ఇవి ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ‘రివిజన్’ప్రక్రయ సమయంలో బిహార్ వ్యాప్తంగా 16 మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) వరుస మరణాలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.గతంలో రాష్ట్రంలో జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ సమయంలో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగానే పలువురు బీఎల్ఓలు మరణించారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషాద ఘటనలు అట్టడుగు స్థాయిలో పనిచేసే పోల్ సిబ్బంది భద్రత, పని పరిస్థితులపై తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో పలువురు ఎన్నికల కమిషన్, పాలక యంత్రాంగాల జవాబుదారీతనంపై ప్రశ్నలను లేవదీస్తున్నారు.ఈ మరణాలపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ, ఇవి వ్యవస్థాగత వైఫల్యానికి చిహ్నాలుగా అభివర్ణించాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), పాలక యంత్రాంగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని ఆరోపించాయి. కాంగ్రెస్ నేతలు ఇందుకు బాధ్యులైనవారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశం న్యాయవ్యవస్థకు కూడా చేరింది. హైకోర్టు ఈ సమస్యపై స్పందిస్తూ ఇది పరిపాలనా అధికార పరిధికి సంబంధించినదని పేర్కొంటూ దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఈ ఉదంతం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. కాగా ఎన్నికల సందర్భంలో బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం. అర్హత కలిగిన ప్రతి గ్రామస్థుడిని లెక్కించేలా ఓటరు నమోదు, ఓటర్ల జాబితాల తయారీకి వారు వెన్నెముకగా నిలుస్తారు. ఈ నేపధ్యంలో వారి మరణాలు పోల్ సిబ్బందిలో నైతికత తగ్గుతుందనే భయాలను రేకెత్తిస్తున్నాయి. అట్టడుగు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పంచాయతీ ఎన్నికలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపనుందనే మాట వినిపిస్తోంది.ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పందించింది. బీఎల్ఓ మరణాలను పని ఒత్తిడితో ముడిపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, దీనిపై పూర్తి వివరాలు కోరుతూ అన్ని రాష్ట్రాలలోని ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈఓ) నుండి నివేదికలను అత్యవసరంగా కోరింది. బిహార్‌లో ‘సర్’ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తయినప్పటికీ, పని ఒత్తిడిపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ వివాదంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఈసీ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! -
ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ఎస్ఐఆర్)ను ఉద్దేశ పూర్వక కుట్రగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేస్తు న్నారని మండిపడ్డారు. బీఎల్వోల మరణాలపై ఆదివారం ఎక్స్‌లో వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీని ఫలితంగా మూడు వారాల్లో 16 మంది బీఎల్వోలు ప్రాణాలు తీసుకున్నారు. గుండెపోటు, ఒత్తిడి, ఆత్మహత్యలకు దారి తీశాయి. ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, ఇది మోపబడిన నేరం. మన దేశం ప్రపంచం కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కాగితపు అడవిని సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఎస్ఐఆర్ ఉద్దేశపూర్వక కుట్ర. పౌరులు ఇక్కడ వేధింపులకు గురవుతున్నారు. అనవసరమైన ఒత్తిడి కారణంగా బీఎల్వోల మరణాలను అనుకోకుండా జరిగిన నష్టంగా భావించి విస్మరిస్తున్నారు. ఇది వైఫల్యం కాదు, కుట్ర. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని బలి చేస్తున్నారు’అని రాహుల్ ఈసీ, కేంద్రంపై విరుచుకుపడ్డారు.బీఎల్వోల పాలిట మృత్యుపాశం: ఖర్గేవివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ బీఎల్వోల పాలిట మృత్యుపాశంగా మారుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పని భారం తట్టుకోలేక బీఎల్వోలు ప్రాణాలు తీసుకుంటుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడంపై ఆయన నిప్పులు చెరిగారు. గతంలో నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ నిర్ణయాలను ప్రజల మీద ఎలాగైతే రుద్దారో.. ఇప్పుడు ‘ఎస్ఐఆర్’ను కూడా అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా అమలు చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేవలం 19 రోజుల్లోనే 16 మంది బీఎల్వోలు పని ఒత్తిడి కారణంగా మరణించారని, ఇవి ఇంకా కొనసాగుతున్నాయని ఖర్గే ‘ఎక్స్’వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కానీ ఈ కుటుంబాలకు న్యాయం చేసేదెవరు? బీజేపీ ఓట్ల చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. అధికార దాహంతో రాజ్యాంగ సంస్థల అధికారులను ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు’అని విమర్శించారు. -
ఎస్ఐఆర్ దెబ్బకు బంగ్లాదేశీయుల ఇంటిబాట
హకీంపూర్: భారత్–బంగ్లాదేశ్ మధ్య పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా హకీంపూర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ బోర్డర్ పోస్టు ఇప్పుడు రద్దీగా మారిపోయింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో ఏళ్లుగా హాయిగా గడిపారు. స్థానిక అధికారులు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేపట్టడంతో అనధికారికంగా హకీంపూర్ పోస్టు మీదుగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంచుల్లో లగేజీలతో, చిన్నారుల చేతుల్లో వాటర్ బాటిళ్లతో కుటుంబాలకు కుటుంబాలు బంగ్లా బాట పడుతున్నాయి. మమ్మల్ని మాయింటికి వెళ్లనివ్వండి అంటూ వారు జవాన్లను వేడుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందని భద్రతా సిబ్బందితోపాటు స్థానికులు కూడా అంటున్నారు. ఎస్ఐఆర్ వల్లే అసాధారణస్థాయిలో వ్యతిరేక వలసలు మొదలయ్యాయంటున్నారు. వీళ్లలో చాలా మంది దళారుల సాయంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకుని ఇక్కడే తిష్ట వేశారు. అయితే, ఎస్ఐఆర్ సిబ్బంది పాత ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చి రిస్కు తీసుకోవడం, జైలుకు వెళ్లడం కంటే సొంతదేశం తిరిగివెళ్లి కొంతకాలం అక్కడే ఉండటమే ఉత్తమమని వీరంతా భావిస్తున్నారు. హౌరా పారిశ్రామిక ప్రాంతంలోని ధులగోరి, బిరాటి, న్యూ టౌన్, ఘుసురి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బంగ్లా దేశీయులు బోర్డర్ పాయింట్ వద్ద క్యూలు కడుతున్నారు. రోజుకు కనీసం 200 మందిని సరైన పత్రాలు లేవనే కారణంతో వెనక్కి పంపించి, నిర్బంధంలోకి తీసుకుంటున్నామని బీఎస్ఎఫ్ జవాన్లు తెలిపారు. ఇలాంటిది తామసలు ఊహించలేదంటున్నారు. ‘వెనక్కి వెళ్లేవారు చూపే పత్రాలను పరిశీలించడం తప్పనిసరి. వాటిని జిల్లా అధికారులతోపాటు రాష్ట్ర పోలీసులకు పంపించాల్సి ఉంటుంది. అందుకు రెండు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. దీంతో వారంతా అక్కడే మకాం వేస్తున్నారు’అని ఓ అధికారి చెప్పారు. వారికి ఆహారం అందజేస్తున్నామన్నారు. అయితే, బంగ్లాదేశీయుల రివర్స్ మైగ్రేషన్‌తో బెంగాల్ పోలీసులు సతమతమవుతున్నారు. సరైన పత్రాలు లేవనే కారణంతో నిర్బంధించిన వారిని జైళ్లలో పెట్టేందుకు సరైన వసతులు లేవు. అందుకే వారిని వదిలేస్తున్నామంటున్నారు. -
బెంగాల్లో బీఎల్వో ఆత్మహత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని నడియా జిల్లాలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్వో)గా వ్యవహరిస్తున్న రింకూ తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం ఆమె తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన ఒత్తిడుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. బీఎల్వో రింకు సూసైడ్ నోట్‌ను సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. కృష్ణనగర్ జిల్లా చప్రాలోని వివేకానంద్ విద్యామందిర్‌లో పారా టీచర్‌గా పనిచేస్తున్న రింకు (52) తన నివాసంలో ఉరి వేసుకున్నారని ఆమె తెలిపారు. ఎస్ఐఆర్ కోసం ఇంకెందరు చనిపోవాలని ఈసీని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషన్(ఈసీ) ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు 30మందికిపైగా బీఎల్వోలు తనువు చాలించినట్లు అధికార టీఎంసీ పేర్కొంది. ఈ మరణాలకు ఈసీయే బాధ్యత వహించాలంది. ఎస్ఐఆర్ను తక్షణమే ఆపేయాలంటూ సీఎం మమత గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. సీఎం మమత ఆరోపణలను బీజేపీ ఖండించింది. అది ఫేక్ సూసైడ్ నోట్ అని తెలిపింది. చేతనైతే ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించి, నిగ్గు తేల్చాలంది. రింకు తరఫ్దార్ టీఎంసీ ఒత్తిడుల వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని ఈసీ ఆదేశించింది. -
నా గొంతు కోసినా సరే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఓటరు జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ను ఓట్బందీగా అభివర్ణించారు. తన గొంతు కోసినా సరే, వాస్తవ ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకుని తీరుతానన్నారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతి నిజమైన ఓటరు తుది జాబితాలో స్థానం పొందే విధంగా ఈ ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేస్తే తప్ప, బిహార్‌లో జరిగినంత సులభంగా బెంగాల్లో దీని అమలు సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ‘ఈసీ ప్రజల కోసమే తప్ప, ప్రభుత్వం కోసం కాదు’అని చెప్పారంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న వారు మాత్రం ఎస్ సర్ అని విధేయతతో ఉండటం చూసి విచారం కలుగుతోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎస్ఐఆర్ చేపట్టి, తప్పించుకోగలిగారు, బెంగాల్లో మాత్రం అలా తప్పించుకోనివ్వం, మీ ప్రతి చర్యను ప్రశ్నిస్తాం’అంటూ హెచ్చరించారు. ప్రజలకు బదులుగా మీ యజమానిని సంతృప్తి పరచాలని మాత్రమే చూస్తున్నారంటూ ఈసీపై పరోక్షంగా ఆమె మండిపడ్డారు. సిలిగురి జిల్లా ఉత్తర్కన్య పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మాతో ఆటలాడు కోవాలని అనుకోవద్దు. అది అంత సులువు కాదు. ప్రతి నిజమైన ఓటరు పేరును జాబితాలో చేర్చేలా మేం అత్యంత అప్రమత్తంగా ఉంటాం. బీజేపీ ఆదేశాలను అమలు చేయాలని ఈసీ ప్రయత్నించరాదు. ఇలా అంటున్నందుకు నన్ను శిక్షించాలనుకుంటున్నారా? ఏం చేయగలరు మీరు? నా ఓటు హక్కును లాగేసుకుంటారా? జైలుకు పంపుతారా? అరెస్ట్ చేయిస్తారా? నా గొంతు కోసినా సరే, ప్రజలను ఏమీ అనొద్దు, వారి ఓటు హక్కును లాక్కోవద్దు’అని ఆమె కోరారు. నోట్ల రద్దు నోట్‌బందీ అయినట్లే, ఎస్ఐఆర్ ఓట్బందీగా తయారైందని ఆమె వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ను ఈసీ ఇంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరం లేనే లేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
రెండో దశ ఎస్ఐఆర్ ఆరంభం
న్యూఢిల్లీ/కోల్‌కతా: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే మంగళవారం ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ)లు విధులు నిర్వర్తిస్తున్నారని, ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేశారు. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారు.మొత్తం 321 జిల్లాల్లో 1,843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్ఐఆర్కు ఈసీ శ్రీకారం చుట్టింది. దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల అర్హతను నిగ్గుతేల్చబోతున్నారు. ఈ క్రతువులో 5.3 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో), 10,448 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులు, 321 మంది జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొంటున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 7.64 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్ఏ) బీఎల్వోలకు సహకరిస్తారు. తొలి దశలో భాగంగా బిహార్‌లో ఎస్ఐఆర్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే.రెండో దశలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎస్ఐఆర్ను ప్రారంభించినట్లు ఈసీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాంలో ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అస్సాంలో ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అక్కడ ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారు. కేరళలో నేడు అఖిలపక్ష భేటీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. ఓట్లు మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చర్చించడానికి బుధవారం అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. కేరళలో బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రాజ్యాంగబద్ధత లేదని తమిళనాడులో అధికార డీఎంకే తేల్చిచెప్పింది. ఎస్ఐఆర్ విషయంలో అక్టోబర్ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఎస్ఐఆర్ను స్వాగతించింది. ఉత్తరప్రదేశ్‌లో ‘శుద్ధ్ నిర్వాచక్ నామావళి–మజ్బూత్ లోక్తంత్ర’ థీమ్‌తో ఎస్ఐఆర్ ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో రగడ ఎస్ఐఆర్ పట్ల పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట నిశ్శబ్దంగా ఓట్ల రిగ్గింగ్ జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. కోల్‌కతాలో జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఆపాలంటూ నినదించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఐఆర్ ప్రారంభించారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఒక్క ఓటరుకు అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదన్నారు. -
తమిళనాట ఎస్ఐఆర్పై సుప్రీంకు డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు. తమిళ నాడులో ఎస్ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్ఐఆర్తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్‌పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది. -
12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ రెండో దశను ప్రారంభిస్తాం: జ్ఞానేశ్ కుమార్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్) ఫేజ్వన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. సోమవారం(సెప్టెంబర్ 27) కేంద్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఎస్ఐఆర్ మాట్లాడారు. 1951నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారు. 21ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. బిహార్‌లో 7.5కోట్ల మంది ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయ్యింది. బిహార్‌లో ఎస్ఐఆర్పై ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. త్వరలో రెండో దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తాం. ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఓటర్ల జాబితా లాక్ చేస్తాం. ప్రతి ఇంటికి మూడుసార్లు బిఎల్ఓ విజిట్ చేస్తారు. బీఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫాంలో వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి. 2003లో ఎవరితో ఉన్నామని లింక్ వివరాలు నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫామ్‌లో మ్యాచింగ్ , లింకింగ్ ప్రధానం.ఎన్యుమరేషన్ ఫాం రిటర్న్ చేసిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంలు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చు. అన్ని ఎన్యుమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తాం’అని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్. డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల. డిసెంబర్ 9 నుంచి 8 జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్ ,వెరిఫికేషన్ ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు. #SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz— Election Commission of India (@ECISVEEP) October 27, 2025 🚨 BREAKING | DelhiChief Election Commissioner Gyanesh Kumar says:“There has been considerable discussion about the necessity of SIR. But the Election Commission reiterates that under electoral law, revision of electoral rolls is mandatory before every election and can be… pic.twitter.com/GVjRZJkPxY— Jan Ki Baat (@jankibaat1) October 27, 2025 -
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం
ఢిల్లీ: ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
తొలి దశలో 10–15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రి య చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తొలుత ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉంది. తొలి దశ ఎస్ఐఆర్కు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే వారమే ప్రకటించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బ ంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు. ఎస్ఐఆర్ విధుల్లో వారు పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి తదుపరి దశలోనే ఈ ప్రక్రియ చేపడతారు. బిహార్‌లో ఇటీవల ఎస్ఐఆర్ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. సమగ్ర సవరణ తర్వాత 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. అనర్హులైన 3.66 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. ఓటర్లు మరణించడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ ఎంట్రీ తదితర కారణాలతో ఈ పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, పశి్చమ బెంగాల్లో నవంబర్ 1 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. -
ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష.. తెలంగాణలో SIR
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై సన్నాహాలను ముఖ్య ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు (EROs)*తో సమీక్షించారు.ఈ సందర్భంగా సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్ వ్యాయామం వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన , లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.తదుపరి సమీక్షా సమావేశం నవంబర్ 1, 2025న వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించబడనుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇటీవల సుధర్శన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల మరియు ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.సీఈఓ సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
ఎస్ఐఆర్ 2002లో మీ పేరుందా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమాన్ని త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు కోసం ఓటరు తనతోపాటు తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులేనని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ సృష్టించడంతో ఈ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. నిర్దేశిత 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా సమర్పించాలని బిహార్ ఓటర్లను ఈసీ కోరింది. బిహార్‌లో చివరిసారి 2003లో ఎస్ఐఆర్ నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో చోటు పొందిన 4.96 కోట్ల మంది ఓటర్లకు మాత్రం ఈ ధ్రువపత్రాల నుంచి మినహాయింపు కల్పించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ ద్వారా రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో వచ్చే ఏడాది ఎస్ఐఆర్ను నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్సైట్ (https:// ceotelangana.nic.in/)లో పొందుపరిచింది. ఎస్ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు. ఎస్ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమరి్పస్తే కొత్త ఎస్ఐఆర్లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు కావాలి.. పుట్టిన తేదీ ఆధారంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పౌరసత్వ రుజువు కోసం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించి బిహార్‌లో దరఖాస్తులను ఈసీ స్వీకరించింది. 1987 జూలై 1కి ముందు భారతదేశంలో పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీతోపాటు పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిండ్రులిద్దరికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన పౌరులైతే సంబంధిత దేశంలోని భారత దౌత్య కార్యాయలం జారీ చేసిన బర్త్ రిజిస్ట్రేషన్‌ను సమర్పించాలి. ఒకవేళ భారత పౌరసత్వం స్వీకరించి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. ఇతర ఏ దేశ పౌరసత్వం స్వీకరించలేదని స్వీయ ధ్రువీకరణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 పత్రాలతో పాటుగా ఆధార్ కార్డును సైతం రుజువుగా ఎన్నికల సంఘం బిహార్‌లో స్వీకరించింది. ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాలు ఇవే.. – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా గుర్తింపు కార్డు. – 1987 జూలై 1కి ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థ/బ్యాంకు/పోస్టు ఆఫీసు/ఎల్ఐసీ/ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/ధ్రువీకరణ పత్రం/డాక్యుమెంట్. – జనన ధ్రువీకరణ పత్రం – పాస్‌పోర్టు – గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదోతరగతి/విద్యార్హత పత్రాలు – రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా కుల ధ్రువీకరణ పత్రం – నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెక్స్ – రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు రూపొందించిన ఫ్యామిలీ రిజస్టర్ – ప్రభుత్వం భూమి/ఇళ్లు కేటాయిస్తూ జారీ చేసిన పత్రం -
దశలవారీగా ఎస్ఐఆర్: ఈసీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దశలవారీగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ)తెలిపింది. ముందుగా వచ్చే ఏడాదిలో ఎన్ని కలు జరిగే రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేసమయంలో, స్థానిక ఎన్నిక లు జరిగే రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టబోమని కూడా స్పష్టం చేసింది. 2026లో అసోం, తమిళ నాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి దశలో భాగంగా ఎస్ఐఆర్ చేపట్టనున్నామని పేర్కొంది. తేదీలను కూడా త్వరలోనే నిర్ణయి స్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమా ర్ చెప్పారు. విదేశీ అక్రమ వలసదారులను వారి పుట్టిన ప్రాంతం ఆధారంగా గుర్తించి, దేశం నుంచి పంపేయడమే ఎస్ఐఆర్ ప్రాథమిక ఉద్దేశమని ఈసీ అంటోంది. ఆయా రాష్ట్రాల్లో చిట్టచివరి ఎస్ఐఆర్ చేపట్టిన నాటి ఓటరు జాబి తాలను ఆన్లైన్లో ఉంచాల్సిందిగా ఈసీ ఇప్పటికే రాష్ట్లాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించింది. -
‘సర్’ ఎఫెక్ట్: 47 లక్షల పేర్లుతొలగింపు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళవారం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాలో 7.89 కోట్ల మంది ఓటర్లుండగా, తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. అంటే, ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగిశాక 47 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ఎస్ఐఆర్లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఇందులో పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన అనంతరం తుది ఓటరు జాబితాను 30.09.2025న విడుదల చేసినట్లు బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. voters. eci. gov. in అనే లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు జాబితాలో తమ పేర్లను చూసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన విడుదల చేసిన రాష్ట్ర జాబితాలో 7.90 కోట్ల ఓటర్లున్నారు. పేర్కొన్న చిరునామాలో లేకపోవడం, వేరే చోటుకు వెళ్లిపోవడం, మృతి చెందడం వంటి కారణాలతో 65 లక్షల మందిని తొలగించాక ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదాలో 7.24 కోట్లకు తగ్గాయి. తుది జాబితాలో 21.53 లక్షల ఓటర్ల పేర్లను కొత్తగా చేర్చి, 3.66 లక్షల పేర్లను తొలగించారు. దీంతో, సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఫైనల్ లిస్టులో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది. అయితే, తమ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితాతో పోలిస్తే 1.63 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని, మొత్తం ఓటర్ల సంఖ్య 48.15 లక్షలకు చేరుకుందని పట్నా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. పట్నా జిల్లాలో 22.75 లక్షల మంది మహిళా ఓటర్లున్నట్లు వివరించింది. అత్యధికంగా దిఘా నియోజకవర్గంలో 4.56 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది.వివాదాస్పదంగా ఎస్ఐఆర్బిహార్లో దాదాపు 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెల్సిందే. ఓటరు జాబితాను అధికార ఎన్డీయేకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈసీతో కలిసి బీజేపీ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాయి. ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్రను సైతం చేపట్టారు. అధికార పక్షం, ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి.4న పట్నాకు ఈసీఓటరు జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్త మవుతోంది. ఇందులో భాగంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు ఎస్ ఎస్ సంధు, వినీత్ జోషిలతో కలిసి అక్టోబర్ 4, 5వ తేదీల్లోపట్నా వెళ్లి ఎన్నికల సన్న ద్ధతను సమీక్షించనున్నారు. పౌరసంఘాలు, రాజకీ య పార్టీల నేతలు, అధికారులతో సమావే శమవనున్నారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులతో 3న సమావేశం ఏర్పా టు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ను 6, 7వ తేదీల్లో ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదీ చదవండి: తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తు -
Bihar: మూడు లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు
పట్నా: బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మరో మలుపు తీసుకుంది. తాజాగా భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) బీహార్‌లో ఉంటున్న మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా అనుమానిస్తూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓ)నోటీసులను పంపారు.రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఓటరు సవరణల కోసం సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలు కనిపించిన దరిమిలా వారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తం మూడు లక్షలమంది ఈ తరహా నోటీసులు అందుకున్నారు. వారి పత్రాలలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించేందుకు వారికి ఈసీఐ ఏడు రోజులు గడువు ఇచ్చింది. ‘మూడు లక్షల మంది ఎస్ఐఆర్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే వారి పత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిగాయి. ఫలితంగా వీరు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా నేపాల్ నుండి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు నెలకొన్నాయని అని ఒక అధికారి మీడియాకు తెలిపారు.ఈసీ నోటీసులు పంపి, వివరణ కోరిన ఓటర్లలో అత్యధికులు తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, మధుబని, కిషన్‌గంజ్, పూర్ణియా, కతిహార్, అరారియా సుపాల్ జిల్లాలకు చెందినవారున్నారు. ఈసీఐ భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసిన దరిమిలా, బీజేపీ దీనిపై స్పందిస్తూ, ఈ ప్రాంతం బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలకు కేంద్రంగా ఉందని ఆరోపించింది. కాగా ఎన్నికల జాబితాపై కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. -
ఒక్క తెలంగాణలోనే ఎస్ఐఆర్ ఎందుకు?
బీహార్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైందే. రాజధాని హైదరాబాద్‌లోనే మూడు నుంచి నాలుగు లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, సవరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన అంగీకరించినట్లయింది. బీహారులో ఎస్.ఐ.ఆర్ పేరుతో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లను మాయం చేశారన్నది విపక్షం ఆరోపణ. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తూంటే... ఇతరదేశాల వారు అక్రమంగా ఓటర్ల జాబితాలోకి చేరి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, మిత్రపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా అది ప్రజాస్వామ్య బలహీనతలకు ఉదాహరణలవుతాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓట్చోరీపై మీడియా సమావేశంలో వెల్లడించింది మొదలు దేశంలో రాజకీయంగా వేడి పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపే లక్ష్యంతో రాహుల్ బీహార్‌లో ఓట్ అధికార్ యాత్ర కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపు కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్ని బోగస్ ఓట్లని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోఇన మహదేవపుర అసెంబ్లీ నియోజజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన అక్కడ ఏ రకంగా లక్షకుపైగా ఓట్లను చేర్చింది సోదాహరణంగా వివరించారు. ఈ బోగస్ ఓట్లతోనే బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ, కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగిందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైమ్‌లో బీహారులో తొలగించిన ఓట్లపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్‌ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయా రాజకీయ పక్షాల వారు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారని చెబుతున్నారో వారితో మళ్లీ దరఖాస్తు చేయించుకోవాలని సలహ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దీనిని వ్యతిరేకించవచ్చు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాతబస్తీలో పలు చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. అందులో కొంత నిజం ఉండవచ్చు కూడా. పాతబస్తీలో అధికారులు ఏ మార్పు తీసుకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు గతంలో అక్కడ విద్యుత్ బిల్లులు చెల్లించని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ప్రయత్నిస్తే పెద్ద ఆందోళన వచ్చింది. స్థానికులు కొందరు అధికారులపై తిరగబడ్డారు. ఓట్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యాల వంటివారు, పాకిస్తాన్ చెందినవారు కూడా పాతబస్తీలో అధికంగా ఉన్నారని, వారికి కూడా ఓట్లు ఉన్నాయని,వాటిని తొలగించాలని బీజేపీ చెబుతుంటుంది. నిజంగానే ఇతర దేశాలకు చెందినవారు కాని, అనర్హులైనవారు కాని ఓటర్ల జాబితాలో ఉంటే ఆ పేర్లను తొలగించడం తప్పు కాదు. కానీ ఆ ముసుగులో బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్న అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తే తప్పు అవుతుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్చవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలను చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కనుక, కింది స్థాయి అధికారులు వారి అదీనంలో ఉంటారు కనుక అలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో, చేర్చడమో జరుగుతుంటే పట్టుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనకూలంగా ఉండే విధంగా మార్చే ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలలో, ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అనుమానాలు తీర్చాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. రాజకీయంగా కూడా ఫిర్యాదు చేసిన ఒక మాజీమంత్రిని దానిపై మరింత గొడవ చేయకుండా మేనేజ్ చేశారన్న అభియోగమూ లేకపోలేదు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పించింది. కౌంటింగ్ నాడు అసంబధ్దంగా పెరిగిన 12.5 శాతం ఓట్ల ప్రభావం 88 నియోజకవర్గాలపై ఉందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి కాని ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలపై స్పందించాలి. అందులో నిజం లేదని బహిరంగంగా రుజువు చేయాలి. ఈవీఎంలపై నిర్దిష్ట అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జ్‌లో అనుమానాలు రావడం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు రావడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగ ఓట్లు చేర్చడం అన్నది కొత్త కాదు. లక్షల మంది హైదరాబాద్‌లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. వారికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. ఎన్నికల రోజున వందల బస్సుల్లో, వేల కార్లలో హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అనేక జిల్లాలు, రాష్ట్రాలలో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం వెతక్కుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయడం, కావల్సిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటివాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు చేయాలని తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా? లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్‌ను వాడుతారా? ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లా దేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా, లేదా అసలైన ఓటర్లను తొలగించకుండా ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలి. ఆధార్ కార్డును విదేశీయులకు జారీ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం చేస్తోంది. అంటే మన దేశంలో ఒక వ్యవస్థకు, మరో వ్యవస్థకు సమన్వయం కొరవడుతోందన్నమాట. అమెరికా వంటి దేశాలలో కాన్పు జరిగి పుట్టిన రోజునే గుర్తింపు కార్డు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పద్దతి వస్తే మంచిది. పుట్టిన రోజు సర్టిఫికెట్ ఆధారంగా వారికి నిర్ణీత ఏజ్ వచ్చాక ఆటోమాటిక్‌గా ఓటింగ్ హక్కు ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ సిద్ధం చేసుకోవడం వంటివి చేయవచ్చేమో పరిశీలించాలి. ఓటర్ల జాబితాలలో అక్రమాలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే.వీటన్నిటిని అరికట్టడానికి ఒక స్పష్టమైన విదానాన్ని రూపొందించనంత కాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో!::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫిర్యాదులకు ‘ఆధార’మే
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్‌ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్‌లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది. ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్‌లో తాము చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది. ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్ఐఆర్ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్‌లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది. బూత్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?బిహార్‌లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది. -
సమగ్ర సవరణ సబబే
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల విమర్శలు, అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్)) సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్మాల్య బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఓటర్ల జాబితా ఎప్పు డూ స్థిర సంఖ్యతో కొనసాగడం సహే తుకం అనిపించుకోదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటరుగా నిరూపించుకోవడానికి ఏడు రకాల ధ్రువీక రణ పత్రాలను ఈసీ అనుమతించేది. ఇప్పు డు ఏకంగా 11 రకాల ధ్రువీకరణ పత్రా లను అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ ధ్రువపత్రాలను అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు’’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎస్ఐఆర్ తప్పులతడకగా ఉందని, దీన్ని వెంటనే ఆపాలంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన వేల సుప్రీంకోర్టు ఈసీ అనుకూ ల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవస రమై నప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది. చట్టానికి వ్యతిరే కంగా ఎస్ఐఆర్ చేపడుతు న్నారని, దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసి పుచ్చింది. బిహార్‌లో ఎస్ఐఆర్ను వ్యతి రేకిస్తూ రాష్ట్రీయలోక్‌దళ్, కాంగ్రెస్ నేత లు సహా రాజకీయ సంస్కరణ సంస ్థ(ఏడీ ఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.సవరణ లేకుండా ఎలా?‘‘బిహార్‌లో మొదలెట్టిన ఎస్ఐఆర్ను దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలి. ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు. అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు. దీంతో కోర్టు స్పందించింది. ‘‘ మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్ట కూడదు. మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు. మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలు జరపకుండా అలాగే కొనసాగించడం సబబు కాదు. ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే. సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదెలా? వేరే రాష్ట్రానికి వలసవెళ్లిన ఓటర్లు, మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పర్చు కున్న వారి పేర్లను పాత నియోజక వర్గంలో తొలగించొద్దా?’’ అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది. ‘‘ దృవపత్రంగా ఆధార్‌ను అంగీకరించట్లేదని మాకు అర్థమవుతోంది. కానీ ఏకంగా 11 ఇతర రకాల దృవపత్రాలను అంగీకరిస్తు న్నారుగా?’’ అని పిటిషనర్ల తరఫున హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనితో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ‘‘ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి పూర్తిస్తాయిలో ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. ధ్రువపత్రాల్లో ఒకటైన పాస్‌పోర్టు విషయానికే వస్తే రాష్ట్రంలో కేవలం ఒకటి, రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి’’అని వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘‘ రాష్ట్రంలో 36,00,000 మందికి పాస్‌పోర్టు ఉంది. ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోంది’’ అని కోర్టు గుర్తుచేసింది. వాటి మధ్య యుద్ధంలా తయారైంది‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పుడు సవరణలు అవసరమని ఈసీ భావిస్తే అప్పుడు వెంటనే ప్రత్యేక సవరణ మొదలెట్టే సర్వాధికారం ఈసీకి దఖలుపడింది. వాస్తవానికి ఈ అంశం రాజ్యాంగబద్ధ హక్కుకు, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారానికి మధ్య పోరాటంలా తయారైంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అభిప్రాయంతో లాయర్ శంకరనారాయణన్ విబేధించారు. చట్టప్రకారం రాష్ట్రంలో ఏదైనా కేవలం ఒక నియోజకవర్గంలో లేదంటే ఒక నియోజకవర్గంలోని కొంత భాగంలో మాత్రమే జాబితా సవరణ చేపట్టాలి. అంతేగానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేపట్టకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి మళ్లీ స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి సవరణ అధికారాలు దఖలుపడ్డాయి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. వెతికే అవకాశం లేకుండా చేశారు‘‘ముసాయిదా జాబితాలో సెర్చ్ ఆప్షన్‌ను ఈసీ దురుద్దేశంతో తొలగించింది. దీంతో గత జాబితాతో పోలిస్తే ముసాయిదా లిస్ట్‌లో ఎవరి పేర్లను తొలగించారో తెలియకుండా పోయింది. తొలగించిన, మరణించిన, వలసవెళ్లిన వాళ్ల జాబితా తెలీకుండా దాచిపెట్టేందుకే ఈసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో లక్ష నకిలీ ఓట్లను గుర్తించామని రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సెర్చ్ ఆప్షన్ తీసేశారు’’ అని ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
సభలో కొనసాగిన సవరణ సమరం
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం మరోమారు పార్లమెంట్‌ను కుదిపేసింది. కొన్ని బిల్లులకు మోక్షం లభించడం మినమా సభలో కీలక అంశాలేవీ చర్చలకు నోచుకోలేదు. ఎస్ఐఆ ర్‌పై చర్చ జరపాలన్న డిమాండ్ నుంచి విపక్ష సభ్యులు మొండిపట్టు పట్టడంతో పలు మార్లు వాయిదాల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా పడ్డాయి. స్వాతంత్రదినోత్స వేడుకలను పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయసభల్లో సభా కార్యక్రమాలకు ఆగస్ట్ 13 నుంచి 17వ తేదీదాకా తాత్కాలిక విరామం ఇచ్చారు.లోక్‌సభ మంగళవారం ఉదయం ప్రారంభంకాగానే విపక్షసభ్యులు ఎస్ఐఆర్ అనుకూల నినాదా లిస్తూ సభ సజావుగా సాగకుండా అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో తర్వాత ఇదే పునరా వృతమైంది. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటలకు వాయి దావేశారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లులకు పార్ల మెంట్ ఆమోదం ఆరు దశా బ్దాలనాటి పాత ఇన్క మ్‌ట్యాక్స్ చట్టం,1961కు బదులుగా తీసుకొచ్చిన నూతన ఆదాయపన్ను చట్టా నికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.కొత్త పన్ను రేట్లు మోపడంలేదని, కేవలం కఠిన పదాలను తొలగించి సరళమైన పదాలతో బిల్లును తీసు కొచ్చామని రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961నాటి చ ట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటి ని 536కు కుదించాం. పదేపదే ప్రస్తావిస్తూ ఉన్న పదాలతో పాటు కఠిన పదాలను తొలగించాం. దీంతో బిల్లులోని 5.12 లక్షల పదాలకు ఏకంగా 2.6 లక్షల పదాలకు తగ్గాయి. 39 కొత్త టేబుళ్లను, 40 కొత్త ఫార్ములా లను జతచేశాం’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ట్యాక్సేషన్ ట్టాలు (సవరణ) బిల్లు, 2025సహా మొత్తంగా ఆరు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. పేపర్లు చింపి.. అంతకముందు లోక్‌సభలో కొంత అనూహ్యఘటన చోటుచేసుకుంది. ఎస్ఐఆర్ సంబంధ నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి కొన్ని పేపర్లు చింపేసి అధ్యక్ష పీఠం వైపు చిందరవందరగా విసిరారు. దీనిపై ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మింతా దేవి ఫొటో టీ–షర్ట్లు ధరించి నిరసన35 ఏళ్ల బిహార్ మహిళా ఓటరు వయసును 124 ఏళ్లుగా ఎస్ఐఆర్లో పేర్కొనడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు వినూత్న నిరసనకు దిగారు. మింతా దేవి ఫొటో ముద్రించిన తెలుపురంగు టీ–షర్ట్‌లను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ సహాపలువురు ఎంపీలు ధరించి ఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. 124 నాట్అవుట్ అని ఆ టీ–షర్ట్‌పై రాసి ఉంది.మన ఓటు, మన హక్కు, మన పోరాటం అనే బ్యానర్‌తో ముందుకు కదిలారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్సోనియాగాంధీ, టీఎంసీ నేత డిరేక్ ఓబ్రియాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎన్సీపీ(ఎస్పీ) సుప్రియాసూలే తదితర ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్దకు చేరుకుని ఎస్ఐఆర్ను తక్షణం నిలిపివేయాలని నినాదాలిచ్చారు. ఎస్ఐఆర్ అంశాన్ని విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించడం ఇది 15వ రోజు. -
ఎస్ఐఆర్పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్‌సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నినాదాల హోరు లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.ఎస్ఐఆర్పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్‌ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు. మేము ఉగ్రవాదులమా?: ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్‌లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్‌కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్‌కు రాసిన లేఖపై ప్రెస్‌నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్‌కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. -
West Bengal: ‘బీహార్‌లా బెంగాల్..’ : సువేందు సంచలన డిమాండ్
హౌరా (పశ్చిమ బెంగాల్): బీహార్‌లో అమలు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో కోటి మందికిపైగా రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు అక్రమంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. హౌరాలో జరిగిన కన్యా సురక్ష యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య సువేందు అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు, నకిలీ ఎంట్రీలు, నకిలీ ఓటర్లు, రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితా విశ్వసనీయతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం అక్రమ ఓటర్ల పేర్లను తొలగించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు.కాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. తుది ముసాయిదాలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. పోల్ బాడీ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24, 2025 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే దానికి భిన్నంగా 7.24 కోట్ల గణన ఫారమ్‌లు (ఈ ఎఫ్)లు రావడం విశేషం. బీజేపీ ఆదేశాల మేరకే ఈ కసరత్తు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం వివాదాస్సదంగా మారింది. బీహార్ అసెంబ్లీ, పార్లమెంటులో దీనిపై తీవ్ర నిరసనలు జరిగాయి. కాగా బెంగాల్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ సువేందు రాష్ట్రంలో కన్యా సురక్ష యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. -
'సార్ మేడమ్' మూవీ రివ్యూ.. అందరికీ కనెక్ట్ అవుతుందా..?
టైటిల్: సార్ మేడమ్నటీనటులు: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్, యోగిబాబు, రోషిని హరిప్రియన్, దీప శంకర్, మైనా నందిని, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్ తదితరులునిర్మాణ సంస్థలు: సత్య జ్యోతి ఫిలిమ్స్నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్దర్శకత్వం: పాండిరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్విడుదల తేది: ఆగస్టు1, 2025సరికొత్త కథలను ప్రేక్షకుల దగ్గరచేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ జోడీ నటించిన కొత్త చిత్రం 'సార్ మేడమ్'.. భార్యాభర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు పాండిరాజ్ చూపించారు. తమిళ్లో జులై 25న 'తలైవన్ తలైవి' పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఆగష్టు 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేటంటే..ఏడడుగుల బంధం ఎలా ఉంటుందో 'సార్ మేడమ్' చిత్రంలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) సొంత గ్రామంలోనే పరోటా మాస్టర్‌గా ఒక హోటల్ నడుపుతుంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్‌గా ఆయనకు పేరు ఉంటుంది. తనుకు పెళ్లి చెయ్యాలని రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఇరుకుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైన తమ కుమారుడికి పెళ్లి చేయాలని పదో తరగతి మాత్రమే చదవిన వీరయ్య డబుల్ MA చేశాడని ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెబుతారు. అయితే, వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి నిజం తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దనుకుంటారు. కానీ, పెళ్లి చూపుల్లోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్ద వాళ్లను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి మూడు నెలలు అత్తమామలు, ఆడపడుచుతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే, ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలౌతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. దీంతో తరుచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒకరోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య, రాణి ఇద్దరూ విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఆ జంట విడిపోయేందుకు కారణాలు ఏంటి..? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం అయ్యారు..? రాణి అన్నయ్యతో వీరయ్యకు ఉన్న గొడవ ఏంటి..? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గిరాజేసింది ఎవరు..? అనేది అసలు కథ.ఎలా ఉందంటే.. భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి.. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనుకాడకూడదు. 'సార్ మేడమ్' సినిమా కూడా ఇలాంటి మెసేజ్‌నే ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాట్లు కష్టంగానే ఉన్నా చూసే వారికి అందంగానే ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికే పెళ్లైన, పెళ్లి చేసుకోవాలనకునే వారందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్‌నెస్ ఉంటుంది. కానీ, దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపచేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. భార్యభర్తల మధ్య తరుచూ కనిపించే గిల్లికజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి.భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతరు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ ఆరంభం అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెబుతూ.. మొదట వీరయ్య, రాణిల పెళ్లి ఎలా అయింది..? పెళ్లి తర్వాత రాణిపై అత్త, ఆడపడుచు ఆధిపత్యం చేయడం. కోడలిపై మామగారికి ఉన్న అభిమానం. భార్యపై భర్తకు ఉన్న ప్రేమ.. ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో మనకు కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబుల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా రెండు పాత్రల చుట్టూ తిరగడం కాస్త మైనస్, పదేపదే గొడవ పడటం వంటి అంశాలు రిపీటెడ్‌గా అనిపిస్తాయి. అంతే తప్పా ఇందులో మైనస్‌లు పెద్దగా లేవు. కొన్ని సీన్లు ఎక్కువగా సాగదీశారనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రల్లో నిత్యా మేనన్ ఫుల్ ఎనర్జిటిక్‌గా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సినిమాలో అప్పుడప్పుడు కనిపించే యోగిబాబు తన పంచ్‌లతో నవ్విస్తాడు. సరైన సమయంలో తన పాత్ర ఎంట్రీ ఇస్తుండటంతో బాగా అనిపిస్తుంది. ఆపై విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టేశాడు. అటు తల్లికి... ఇటు భార్యకు నచ్చచెబుతూ తను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతుంటాడు. ఒక సామాన్యుడి జీవితానికి వీరయ్య పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఆపై అత్తింటి వాళ్లతో పాటు భర్తతో గొడవపడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మేనన్ దుమ్మురేపింది. అదే సమయంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని తాకుతుంది. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవల్లోకి కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్‌లో అర్థం అయ్యేలా దర్శకుడు బాగా చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా పూర్తి అయిన తర్వాత ఈ కథకు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు నవ్వుతూనే ఆలోచిస్తారు. జీవితం అంటే ఇదే కదా అంటూ బయటకు వచ్చేస్తారు. -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్‌లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
స్కూల్ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్‌కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు. ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్‌లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్‌తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు. గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు. ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
ధనుష్ " సార్ మూవీ రివ్యూ "
-
'సార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్! అని పిలవకూడదు!
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్, మేడమ్ వంటి పదాలతో సంభోదించకూడదట. కేవలం "టీచర్" అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో "టీచర్" అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంత చేయాలని కోరుతూ..ఒక వ్యక్తి దాఖలు చేసిని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి) -
మాస్టారు... నా మనసును గెలిచారు
‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్‌ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం. -
టీజర్: గట్టిగా క్లాసులు పీకిన ధనుష్ 'సార్'
స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజ్ కానుంది. ఈరోజు ధనుష్ బర్త్‌డే కావడంతో సార్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్.. అన్న డైలాగ్‌తో టీజర్ మొదలువుతుంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక టీజర్లో ధనుష్ పాత్రను రివీల్ చేశారు. అతడి పేరు బాలగంగాధర్ తిలక్ అని, జూనియర్ లెక్చరర్‌గా నటించాడని హీరోనే స్వయంగా వెల్లడించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్.. పంచండి, ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే విద్యావ్యవస్థలో ఉన్న లోపాను ఎత్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్‌కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్ ఫిలిం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చదవండి: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ 'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ -
అన్నదమ్ములకు సోకిన కరోనా.. సినిమా షూటింగ్‌కు బ్రేక్
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 'సార్' సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ధనుష్‌కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్‌లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
ధనుష్ తొలి తెలుగు సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
కోలివుడ్ స్టార్ ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్’అని నామకరణం చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో ‘వాతి’అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా, ధనుష్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. -
యజమాని, పని మనిషి ప్రేమ కథ
సినిమా : సార్ నటీనటులు : తిలోత్తమా శోమె, వివేక్ గోంబర్ దర్శకత్వం : రొహెనా గెర నిర్మాతలు : రొహెనా గెర, బ్రిస్ పోసన్ సంగీతం : పిర్రె ఏవియట్ కథ : న్యూయార్క్‌లో ఉద్యోగం చేసుకుంటున్న అశ్విన్( వివేక్ గోంబర్) సోదరుడి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ముంబై వస్తాడు. అతడు చనిపోవటంతో కుటుంబానికి అండగా ఉండటానికి ముంబైలోనే ఉండిపోతాడు. ప్రియురాలితో కలిసి అక్కడే ఓ అపార్ట్మెంట్ ఉంటాడు. రత్న(తిలోత్తమ శోమె) వారింట్లో పని మనిషిగా చేరుతుంది. కొద్ది కాలానికి అశ్విన్‌కు అతడి ప్రియురాలికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. దీంతో ఇద్దరూ విడిపోతారు. మానసికంగా కుంగుబాటులో ఉన్న అతడి మనసుకు రత్న ద్వారా సాంత్వన లభిస్తుంది. ఆమె చేష్టలు, తన పట్ల కేరింగ్ అశ్విన్‌ను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. ఆమె పని మనిషి అన్న ఆలోచన లేకుండా ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెబుతాడు. తమ మధ్య ఉండాల్సింది యజమాని, పని మనిషి బంధమేనని ఇంకేమీ ఉండొద్దని ఆమె తేల్చి చెబుతుంది. తమ ప్రేమను సమాజం హర్షించదని హితవు పలుకుతుంది. అయినా పట్టు వదలకుండా ఆమె ప్రేమకోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు అశ్విన్. అయితే చివరకు అశ్విన్.. రత్న ప్రేమను గెలుచుకోగలిగాడా? పని మనిషి సంకెళ్లను తెంపుకుని ఆమె అతడితో ఒక్కటవుతుందా? లేదా? అన్నదే మిగితా కథ. సినిమా ఎలా ఉందంటే లాక్డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో విడుదలయిన మొదటి సినిమా ఇది. 2020, మార్చి నెలలో సినిమాను విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. 2018లోనే ఈ సినిమా అమెరికాలో విడుదలై మంచి ఫలితాలను రాబట్టింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. బోల్డ్ స్టోరీ లైన్‌తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కథ కొత్తదేమీ కాకపోయినప్పటికి ఇతర బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లాగా కాకుండా విభిన్నంగా తీశాడు. రెండు భిన్న ధ్రువాల మధ్య ప్రేమ చిగురించటానికి యజమాని, పని మనిషికి బంధం అడ్డుకాదని చెప్పే కథాంశం. మన ప్రతీ చర్య ఎదుటి వ్యక్తిపై ఎంతలా ప్రభావం చూపుతుందో రత్న పాత్ర మనకు తెలియజేస్తుంది. ఇద్దరి మధ్యా చోటు చేసుకునే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి సరికొత్త అర్థానిచ్చే ప్రేమ జంటగా నిలుస్తారు అశ్విన్, రత్న. ఓ వ్యక్తిని ప్రేమించటం అంటే వారి కలల్ని గౌరవించటం కూడా అని చెప్పే సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. -
కారణజన్ముడు కాటన్
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పలువురికి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేత రాజమహేంద్రవరం రూరల్ : ఒక ఆంగ్లేయుడు భారతీయుల యోగక్షేమాలు కోసం పరితపించడం మామూలు విషయం కాదని, సర్ ఆర్ధర్ కాటన్ నిజంగా కారణజన్ముడని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ, తెలుగు యూనివర్సిటీ సంయుక్తంగా కాటన్ 214వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉండవల్లి మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీర«ధుడు కాటన్ అని కొనియడారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజయోనా స్వాగతం పలుకగా, ఇండియన్ నర్సరీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ కాటన్ మహిమాన్వితుడని కొనియడారు. అందుకే ఆయన కీర్తి భారతదేశ నదీజలాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అంతర్లీనమై కలకాలం నిలిచే ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి వెంకట రామారావు, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్, బొమ్మూరు మాజీ సర్పంచి మత్సేటి ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు ఎం.శ్రీరామ్మూర్తి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కొల్లివెలసి హారిక, డాక్టర్ పి.హేమలత మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన 21 మంది ప్రముఖులకు సర్ ఆర్ధర్ కాటన్ జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. పురస్కార గ్రహీతలు వీరే పల్ల వెంకన్న (కడియం), ఆచార్య ఎండ్లూరి సుధాకర్, దూలం రాజ్‌కుమార్(పొట్టిలంక), సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి, దుళ్ల), తుమ్మిడి అరుణ్‌కుమార్(రాజమహేంద్రవరం), డాక్టర్ గుబ్బల రాంబాబు (స్వర్ణాంధ్ర సేవా సంస్థ), బొంతు శ్రీహరి (సఖినేటిపల్లి), డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ (కాకినాడ), కర్రా వెంకటలక్ష్మి (ఎంపీపీ, వై.రామవరం), ఇసుకపట్ల ఇమ్మానియేలుకుమార్ (అన్నా మినిస్ట్రీస్, రావులపాలెం), అలమండ ప్రసాద్(కూచిపూడి నృత్య కళాకారుడు, సామర్లకోట), రహీమున్నీసాబేగం(విశాఖ), తురగా సూర్యారావు (కాకినాడ), కొచ్చెర్ల చక్రధారి(సూక్ష్మకళాకారుడు, సామర్లకోట), డాక్టర్ బీఎస్ఎస్ఏ జగదీష్(టీచర్, సామర్లకోట), శివకోటి విజయప్రసాద్ (మ్యుజీషియన్, కాకినాడ), పొట్నూరి రజనీకాంత్ (ఏలూరు), ప్రత్తి రామలక్ష్మణమూర్తి (టీచర్, పిఠాపురం), పి.కీర్తిప్రియ (కూచిపూడి నర్తకి, శ్రీకాకుళం), గరికిపర్తి నమశ్శివాయ (కాకినాడ), ముష్ఠి శ్రీదేవి (వెదురుపాక)లను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పతకాలతో ఘనంగా సత్కరించారు. -
సార్ లేని లోటు పూడ్చలేనిది
–కులాలు, మతాలకు అతీతంగా పనిచే సిన మహోన్నత వ్యక్తి –సమైక్య పాలకుల అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు –జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన త్యాగధనుడు –ఆచార్య జయశంకర్ జయంతి సభలో ఎంపీ కవిత, మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంర్ అని, సార్ లేని లోటు పూడ్చలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాలుకు అతీతంగా రాష్ట్ర సాధనే ద్యేయంగా పని చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ప్రతికూల పరిస్థితిల్లోనూ తెలంగాణ నడిపించారని పేర్కొనామ్నరు. యువత జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమైక్య పాలకులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి తనకుంటూ ఒక చర్రిత సృష్టించుకుందన్నారు. అంతకుముందు కవిత స్థానిక మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇం చార్జి దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నోముల నర్సిహ్మాయ్య, కాసోజు శంకరమ్మ, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొ న్నారు. వర్షంతో నిలిచిన సభ రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన సభ 8.30 గంటలకు ముగిసింది. దేశపతి శ్రీనివాస్, మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తుండగా భారీ వర్షం రావడంతో సభను అర్ధాంతంగా ఆపేశారు. -
సార్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ సిటీ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని జయశంకర్‌సార్ కోరుకున్నారని అన్నారు. దాని సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో సార్ ముందుంటారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ స్ఫూర్తినిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, ఎడ్ల సుగుణాకర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, జి.రఘువీర్‌సింగ్, దూలం సంపత్ పాల్గొన్నారు.


