ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు | INDIA Bloc Leaders Write to CJI Over Election Commission's SIR Process | Sakshi
Sakshi News home page

ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు

Jun 30 2026 11:06 AM | Updated on Jun 30 2026 11:19 AM

INDIA Bloc Leaders Write to CJI Over Election Commission's SIR Process
  • ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై  ఆందోళన
  • లేఖపై ఇండియా కూటమిలోని 23 రాజకీయ పార్టీల సంతకాలు
  • విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (సర్‌) ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ఒక ఉమ్మడి లేఖను పంపారు. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ద్వారా వెల్లడించారు.
 

ఈ ఉమ్మడి లేఖపై మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగం కానప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలు కూడా ఈ లేఖకు మద్దతు తెలిపి, సంతకాలు చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్  తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్‌కు అందజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

మరోవైపు దేశంలో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్’, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్షల వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. తామంతా కలిసికట్టుగా ఈ సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతామని ఖర్గే స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement