అఖిల్ రాజ్, నాగదుర్గ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న కొత్త సినిమా ‘శనార్తి’ .
రాజ్ గణేష్ ఉప్పునూటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సంపత్ నంది టీమ్‌వర్క్స్, ఎస్‌డీఎల్‌పీ (శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘శనార్తి’ (Tale of Culture) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రం ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతోంది. ఆగస్టు 14న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.


