breaking news
Akhil Raj
-
అమ్మతోడు జరిగింది ఇదే! డెలివరీ బాయ్ దాడిపై హీరో అఖిల్ రాజు క్లారిటీ
-
డెలీవరీ బాయ్ vs హీరో.. కారుపై దాడి
గతేడాది థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరోగా నటించి, పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్‌ని కొట్టడం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. అయితే తొలుత అందరూ హీరోని విమర్శించారు. కానీ తర్వాత అఖిల్ తన వెర్షన్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన తల్లిని తిట్టడం వల్లే డెలివరీ బాయ్‌ని కొట్టానని అన్నాడు. ఇది వివాదంగా మారడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.(ఇదీ చదవండి: నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్)ఇక అఖిల్ రాజ్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పలువురు డెలివరీ బాయ్స్ కూడా అక్కడికి చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం అఖిల్.. తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా కొండాపూర్‌లో డెలివరీ బాయ్ రమేశ్, తన అనుచరులతో కలిసి కారుని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. పోలీసులు అక్కడికి చేరుకుని డెలివరీ బాయ్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు.. మరో 80 రోజులు మాత్రమే)నాపై దాడికి యత్నించారు.. హీరో అఖిల్‌రాజ్ ఫిర్యాదు..డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారడంతో, సినీనటుడు అఖిల్‌రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కొండాపూర్‌లో కొంతమంది తన కారును అడ్డగించి దాడికి ప్రయత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, డెలివరీ బాయ్‌పై… pic.twitter.com/00VvsuWPPv— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2026 -
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్‌లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నాకు కోపం వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతే కానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు. అతన్ని కొడితే నా కెరీర్‌కు ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. ఇలా అడ్రస్ పొరపాటుగా ఇప్పటికీ దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్‌గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెేనైతే అతనిపై కావాలని కొప్పడలేదని అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే తనకు కోపం వచ్చిందన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్‌ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్‌ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు. -
డెలివరీ బాయ్‌తో హీరోకు ఘర్షణ... వీడియో వైరల్!
-
రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్‌పై దాడి
రాజు వెడ్స్ రాంబాయి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో అఖిల్ రాజ్ తీరుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. అతని పేరేంట్స్ వద్దంటున్నా వినకుండా అఖిల్ రాజ్ భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాగా.. అఖిల్ రాజ్ హీరోగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతోనే అఖిల్ రాజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క సినిమాకే ఇంత ఓవరాక్షన్ ఏంటని పలువురు నెటిజన్స్ అఖిల్ రాజ్‌ను విమర్శిస్తున్నారు. పొరపాటు జరిగిందని డెలివరీ బాయ్ చెప్పినా కూడా వినకుండా అతనిపై దాడి చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. #RajuWedsRambai Hero Akhil Raj Attacks A Delivery Boy#AkhilRaj pic.twitter.com/KJg5S0j38d— Indian Clicks (@IndianClicks) June 29, 2026 -
హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈషా ప్రేక్షకులను వెంటాడుతుంది
‘‘హారర్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి సినిమాలు మిగిల్చే అనుభూతి చాలా రోజులు గుర్తుండిపోతుంది. ‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు ప్రేక్షకులను వెంటాడుతుంది. మంచి ట్విస్టులతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు నేడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన శ్రీవిష్ణు బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా ‘ఈషా’ టిక్కెట్ ధరలు అందరికీ అందు బాటులో (రూ. 99) ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులు అంగీకార పత్రంపై సైన్ చేశాకే ‘ఈషా’ చూడాల్సి ఉంటుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘హారర్ సినిమా లవర్స్ మా ‘ఈషా’ని ఎంజాయ్ చేస్తారు’’ అని బన్నీ వాసు చెప్పారు. ‘‘ఈషా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శ్రీనివాస్ మన్నె, అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, నిర్మాత వెంకట్ పేర్కొన్నారు. -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈషా కథ విని షాక్ అయ్యాను: అఖిల్ రాజ్
‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్‌గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది. ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్‌గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్ ఎంతంటే?
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం .. తొలిరోజే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. -
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్‌గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. . -
తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)
-
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ
టైటిల్: రాజు వెడ్స్ రాంబాయినటీనటులు: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులునిర్మాణ సంస్థ: డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌నిర్మాతలు:వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిదర్శకత్వం: సాయిలు కంపాటిసంగీతం: సురేశ్ బొబ్బిలిసినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్విడుదల తేది: నవంబర్ 21, 2025‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే..’ అనే పాటతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ పాట హిట్ అవ్వడం..ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’పై అంచనాలు పెరిగాయి. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా’ అని చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి చాలెంజ్ చేయడం..ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? లేదా? రివ్యూ(Raju Weds Rambai Review)లో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా..2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్-ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊళ్లో రాజు(అఖిల్ రాజు) బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికి అయినా..చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. నాన్న(శివాజీ రాజా) వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా.. వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి(తేజస్విని రావ్). ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించినా..కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది. రాంబాయి తండ్రి వెంకన్న(చైతన్య జొన్నలగడ్డ)కి మాత్రం..తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెళ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు-రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరకు రాజు-రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే. అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణాల్లోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు. కానీ అణగారిన వర్గాల్లోనూ పరువు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించడం రాజు వెడ్స్ రాంబాయి ప్రత్యేకత. ఇది కల్పిత కథ కాదు.. నిజంగా జరిగిన సంఘటన. 2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. దానికి కారణం ఇంతరవకు ఏ జంటకు ఎదురు కానీ ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి. అయితే అది క్లైమాక్స్ మాత్రమే. మిగతా కథంతా రెగ్యులర్ లవ్‌స్టోరీనే గుర్తు చేస్తుంది. 2010 నాటి స్టోరీ కావడంతో..అప్పటి యువత చేసే అల్లరి పనులు..ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతీయువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది..90స్ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇదంతా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్‌లో కథను సాగదీశారు. ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావుడి సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు వీరిద్దరి లవ్‌స్టోరీ.. మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. రాజు-రాంబాయి లవ్‌స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు.. రాజు-రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గా ఉంటాయి. పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్ షాకివ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనే భయం ఒకవైపు.. ఇప్పటికీ రాజు-రాంబాయి లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా? అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్‌ని పండించారు. తెలంగాణ యాసని చక్కగా పలికారు. కొన్ని సీన్లలో తేజస్వీరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలెట్. చాలా బాగా నటించాడు. అయితే రైటింగ్ లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్‌గా నటించినవారంతా బాగా చేశారు. ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. శివాజీరాజాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


