రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్‌పై దాడి | Raju Weds Ramabi Hero Akhil Raj attack on food Delivery Boy | Sakshi
Sakshi News home page

Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్‌పై దాడి

Jun 29 2026 9:48 PM | Updated on Jun 29 2026 10:02 PM

Raju Weds Ramabi Hero Akhil Raj attack on food Delivery Boy

రాజు వెడ్స్ రాంబాయి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ‍దురుసుగా ప్రవర్తించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో అఖిల్ రాజ్ తీరుపై నెటిజన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హీరో అఖిల్ రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పై దాడి చేశాడు. అతని పేరేంట్స్ వద్దంటున్నా వినకుండా అఖిల్ రాజ్‌  భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా.. అఖిల్ రాజ్ హీరోగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతోనే అఖిల్ రాజ్ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క సినిమాకే ఇంత ఓవరాక్షన్‌ ఏంటని పలువురు నెటిజన్స్‌ అఖిల్‌ రాజ్‌ను విమర్శిస్తున్నారు. పొరపాటు జరిగిందని డెలివరీ బాయ్ చెప్పినా కూడా వినకుండా అతనిపై దాడి చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement