నాన్‌స్టాప్‌గా 24 గంటలు | Ram Pothineni completes a gruelling 24-hour shoot for RaPo23 | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌గా 24 గంటలు

Aug 18 2026 12:20 AM | Updated on Aug 18 2026 12:20 AM

Ram Pothineni completes a gruelling 24-hour shoot for RaPo23

రామ్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌ఏపీఓ 23’   (వర్కింగ్‌ టైటిల్‌). రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌ కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్‌ నాన్‌స్టాప్‌గా 24 గంటలు పనిచేశారట. ఈ విషయాన్ని తెలుపుతూ రామ్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘రామ్‌ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఏపీఓ 23’. డార్క్, సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూ పొందుతోంది.

ఈ మూవీ కోసం పుదుచ్చేరిలో భారీ సెట్‌ వేశాం. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు రామ్‌. అందులో భాగంగా రామ్‌ 24 గంటల పాటు నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొన్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది.     ఈ చిత్రానికి కెమెరా: తిరునవుక్కరసు, సంగీతం: సామ్‌ సీఎస్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement