అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే? | Anirudh Ravichander And Kavya Maran Wedding, Marriage Date And Venue Reportedly Finalised, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Anirudh Kavya Maran: అనుకున్నదే జరుగుతోంది.. పెళ్లి డేట్ ఫిక్స్!

Aug 17 2026 11:21 PM | Updated on Aug 18 2026 8:45 AM

Anirudh Kavya Maran Marriage date And Venue

గత కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నట్లే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ విషయం బయటపడింది. ఇప్పుడు పెళ్లి తేదీతో పాటు వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్‌ ప్రశ్న)

తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్.. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగులోనూ దేవర, గ్యాంగ్ లీడర్, జెర్సీ తదితర సినిమాలకు పాటలిచ్చాడు. వచ్చే నెలలో రాబోతున్న 'ప్యారడైజ్'కి సంగీతమందించింది ఇతడే. మరి ఎప్పుడు ఎలా పరిచయమో గానీ సన్ పిక్చర్స్, టీవీ సంస్థల అధినేత కళానిధి మారన్ కూతురు కావ్యతో ఇతడికి చాన్నాళ్లుగా స్నేహం ఉంది. తర్వాత ప్రేమలో కూడా పడ్డారని టాక్.

గతంలో పలుమార్లు వీళ్లిద్దరి డేటింగ్‌పై రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే విదేశాలకు కలిసి ట్రిప్స్ వేశారు. ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా తొలిసారి వెళ్లిన గ్రీస్ దేశానికే కలిసి వెళ్లారు. ఇప్పుడు అదే చోట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. నవంబరు 10న పెళ్లి జరగనుంది. దీనికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ప్రస్తుతం ఇవి రూమర్సే కానీ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

కావ్య మారన్ పేరుకే బిజినెస్ ఉమెన్ అయినప్పటికీ ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు ఓనర్‌గా తెలుగు నెటిజన్లకు సుపరిచతమే. సన్ పిక్చర్స్ తీసే సినిమా ఈవెంట్స్‌లోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో జరిగే క్రికెట్ లీగుల్లోనూ ఈమెకు జట్లున్నాయి. 

(ఇదీ చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement