ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఆపండి: పీజేఆర్‌ కూతురు పిటిషన్‌ | Khairatabad By-Election Row, Vijaya Reddy Moves Telangana High Court To Stop Poll Notification, Urgent Hearing Plea Rejected | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఆపండి: పీజేఆర్‌ కూతురు పిటిషన్‌

Oct 1 2026 12:38 PM | Updated on Oct 1 2026 1:11 PM

Congress Vijaya Reddy Filed Petition On High Court Over Khairatabad

సాక్షి, ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకురాలు, పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆమె దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో, పిటిషన్‌ తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ బరిలో నిలిచారు. ఎన్నికల్లో దానం నాగేందర్‌ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ విజయారెడ్డి 2024లోనే హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఫారం-26కు సంబంధించిన వివరాలు పూర్తిగా పేర్కొనలేదని, అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆమె ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ ఎలక్షన్‌ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని తాజాగా విజయారెడ్డి కోరారు. ఎలక్షన్‌ పిటిషన్‌ తేలకముందే ఉప ఎన్నిక నిర్వహిస్తే తదుపరి న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయంతోనే నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని ఆమె కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని చీఫ్‌ జస్టిస్‌ ఎదుట లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ కూడా విజయారెడ్డి దాఖలు చేశారు. అయితే హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. దీంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌పై విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: రేవంత్‌ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement