59 ఏళ్ల వయసులో మళ్లీ టెన్త్‌ పరీక్షకు.. | 59 year old Meghalaya man to sit for Class 10 exam 37 years after dropping out | Sakshi
Sakshi News home page

59 ఏళ్ల వయసులో మళ్లీ టెన్త్‌ పరీక్షకు..

Oct 1 2026 11:11 AM | Updated on Oct 1 2026 11:21 AM

59 year old Meghalaya man to sit for Class 10 exam 37 years after dropping out

షిల్లాంగ్‌: పాఠశాల విద్యాభ్యాసానికి దూరమైన 37 ఏళ్ల తర్వాత మళ్లీ పదో తరగతి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు మేఘాలయకు చెందిన 59 ఏళ్ల సిల్వెస్టర్‌ షాదాప్‌. రి భోయ్‌ జిల్లాకు చెందిన షాదాప్‌ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలతో 1989లో చదువు మధ్యలోనే ఆపేశారు. 

అయితే మళ్లీ చదువుపై దృష్టి సారించిన ఆయన మేఘాలయ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెకండ్‌ ఛాన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,767 మంది డ్రాపౌట్లు నమోదు చేసుకోగా, వారిలో షాదాప్‌ అత్యంత పెద్ద వయస్కుడు. ఈ డిసెంబర్‌లో జరగబోయే పదో తరగతి పరీక్షలకు ఆయన హాజరుకానున్నారు. పదో తరగతిని పూర్తి చేయడంతోపాటు చదువును మధ్యలో ఆపేసిన ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నారు. 

‘ఆర్థిక ఇబ్బందుల వల్ల నా చదువును కొనసాగించడం కష్టమైంది. ఆ సమయంలో కుటుంబాన్ని ఆదుకోవడం ముఖ్యమనుకున్నా. కానీ, ఏళ్లు గడిచినా ఏదో పని అసంపూర్తిగా మిగిలిపోయిందనే భావన నాకు ఎప్పుడూ ఉండేది. ఈ వయసులో పదో తరగతి పూర్తి చేయడానికి అవకాశం దొరుకుతుందని ఊహించలేదు. 37 ఏళ్ల విరామం తర్వాత కొత్త, పూర్తిగా భిన్నమైన సిలబస్‌. ఈ మార్పులకు అలవాటు పడటం కష్టమైంది. ఎంతకష్టపడైనా విజయం సాధించాలని నిశ్చయించుకున్నా’ అని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement