సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మాంసం, బీఫ్ దుకాణాలను, కబేళాలను మూసివేయాలని, జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. అలాగే.. మద్యం షాపులను కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు.


