సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌ | Big Twist In Sushmitha Incident | Sakshi
Sakshi News home page

సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌

Nov 16 2026 8:49 AM | Updated on Nov 16 2026 8:53 AM

Big Twist In Sushmitha Incident

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రేమ పేరుతో మోసం, పెళ్లికి నిరాకరణ, వేధింపుల కారణంగా సుస్మిత అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆరుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు ఆదివారం తెలిపారు. మహబూబాబాద్‌ రూరల్‌ పీఎస్‌ పరిధిలోని నడివాడ గ్రామానికి చెందిన మునిగె సుస్మిత ఆత్మహత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు.

కేసులో ప్రధాన నిందితుడు సామకూరి అనిల్, అతని తల్లిదండ్రులు శ్రీనివాస్, శాంత, తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు తీగల నవీన్, అక్క కొంపల్లి విజయను అరెస్ట్‌ చేశామని తెలిపారు. మిగతా నిందితులుగా పేర్కొనబడిన వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని, ఈ కేసులో మరికొంతమంది సాక్షులను విచారించడంతోపాటు, కాల్‌ డేటా రికార్డులు సేకరించి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా కేసు దర్యాప్తు పారదర్శకంగా చేపడుతున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.

సుస్మిత మృతిపై విచారణ చేయిస్తాం 
మహబూబాబాద్‌ రూరల్‌ : సుస్మిత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు నూనావత్‌ రాధ పేర్కొన్నారు. నడివాడకు చెందిన మునిగె సుస్మిత ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని రాధ ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పి సుస్మిత మృతికి దారితీసిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుస్మిత మృతి అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

 కార్యక్రమంలో మున్సిపల్‌ 2వ వార్డు కౌన్సిలర్‌ అంబాల శివకుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జిన్నారెడ్డి పద్మజ, నాయకులు కత్తి స్వామి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, చీరిక వేణురెడ్డి, మైదం ప్రసాద్, , అనంతుల రాజమ్మ  తదితరులు పాల్గొన్నారు.  కాగా సుస్మిత మృతికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అంబేడ్కర్‌ విగ్రహం నుంచి నెహ్రూ సెంటర్‌ వరకు మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి, కుల, ప్రజాసంఘాల బాధ్యులు ర్యాలీ చేపట్టి సుస్మితకు నివాళులరి్పంచారు.    
                               
సుస్మిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి 
ప్రేమ పేరుతో మోసం చేసి, కులం పేరుతో అవమానించడంతో సుస్మిత ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ పుష్పితలయ డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ మండలంలోని నడివాడలో బాధిత కుటుంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించి మాట్లాడారు. సుస్మిత మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement