దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దుల్కర్ సల్మాన్ను, సినిమా కథను ప్రశంసించారు.


