breaking news
Pavan Sadineni
-
ఆ దర్శకుడికి పాప పుట్టింది
హైదరాబాద్ : ' ప్రేమ ఇష్క్ కాదల్' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సాదినేన్ పవన్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా లో షేర్ చేశాడు. తనకు పాప పుట్టిందని, తండ్రి కావడం ఒక గొప్ప అనుభూతి అంటూ తన సంతోషాన్ని ఫేస్బుక్ లో పంచుకున్నాడు. ఈ సంవత్సరం నా జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు. ఒకటి సినిమా విడుదల, రెండు నా లిటిల్ ప్రిన్సెస్ . నా పాపను ఆశీర్వదించండి అంటూ కోరాడు. ప్రేమ ఇష్క్ కాదల్ మొహబ్బత్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాదినేని మూడేళ్ల గ్యాప్ తరువాత 'సావిత్రి' సినిమాను దర్శకత్వం వహించాడు. నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు రడీ అవుతోంది. -
మూడు రకాల ప్రేమలు
ప్రేమ ఇష్క్ కాదల్... భాషలే వేరు.. కానీ దీని భావం ఒక్కటే. ప్రేమ అనే ఆ అందమైన భావనను ప్రధానాంశంగా చేసుకుని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ తతతచిత్రంలో హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా నటించారు. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ -‘‘మూడు కథలతో రూపొందిన ఈ చిత్రంలో నాదో కథ. నేను రాక్‌స్టార్‌గా నటించాను. ఇదే టీమ్‌తో నేను చేసిన ‘ఇన్ఫినిటీ’ అనే షార్ట్‌ఫిల్మ్ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇది తనకు తొలి చిత్రం అనీ ఇందులో యువతకు కనెక్ట్ అయ్యే ప్లేబోయ్ పాత్ర చేశానని హరీష్ తెలిపారు. పల్లెటూరి నుంచి నగరానికి వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని విష్ణు చెప్పారు.