మూడు రకాల ప్రేమలు | Prema Ishq Kaadhal movie release scheduled on 6th december | Sakshi
Sakshi News home page

మూడు రకాల ప్రేమలు

Nov 29 2013 1:37 AM | Updated on Sep 2 2017 1:04 AM

మూడు రకాల ప్రేమలు

మూడు రకాల ప్రేమలు

ప్రేమ ఇష్క్ కాదల్... భాషలే వేరు.. కానీ దీని భావం ఒక్కటే. ప్రేమ అనే ఆ అందమైన భావనను ప్రధానాంశంగా చేసుకుని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’.

ప్రేమ ఇష్క్ కాదల్... భాషలే వేరు.. కానీ దీని భావం ఒక్కటే. ప్రేమ అనే ఆ అందమైన భావనను ప్రధానాంశంగా చేసుకుని బెక్కెం వేణుగోపాల్ (గోపి)  నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ తతతచిత్రంలో హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి  హీరో హీరోయిన్లుగా నటించారు.
 
  వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ -‘‘మూడు కథలతో రూపొందిన ఈ చిత్రంలో నాదో కథ. నేను రాక్‌స్టార్‌గా నటించాను. ఇదే టీమ్‌తో నేను చేసిన ‘ఇన్ఫినిటీ’ అనే షార్ట్‌ఫిల్మ్ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇది తనకు తొలి చిత్రం అనీ ఇందులో యువతకు కనెక్ట్ అయ్యే ప్లేబోయ్ పాత్ర చేశానని హరీష్ తెలిపారు. పల్లెటూరి నుంచి నగరానికి వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని విష్ణు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement