టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడంటూ సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హైదరాబాద్ పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్.. ఆ తర్వాత ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లకు కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒకతార’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.


