స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు! | Sandeep Reddy Vanga sensational comments on Spirit Vs Varanasi Release | Sakshi
Sakshi News home page

స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!

Aug 25 2026 11:43 PM | Updated on Aug 26 2026 12:16 AM

Sandeep Reddy Vanga sensational comments on Spirit Vs Varanasi Release

వచ్చే ఏడాది వేసవిలో నెల రోజుల గ్యాప్‌లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో ఈ గ్యాప్ సరిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతోంది.

ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పిన ఆయన.. అవసరమైతే వారణాసి చిత్రం కోసం కాస్త జరగడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య నెల రోజుల పైనే తేడా ఉండటంతో సాద్యమైనంతవరుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అయితే అదే టైమ్‌లో స్పిరిట్ మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

రెబల్‌స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం స్పిరిట్‌కు ఇంకా 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తానని సందీప్ వంగ తెలిపారు. అలాగే తన గత చిత్రాలకు వచ్చినట్టే ఈ సినిమాకు కూడా ‘A’ సర్టిఫికేట్ ఖాయమని చెప్పారు.యానిమల్‌ ఫేమ్‌ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement