కొత్త వాళ్లతో కొత్త సినిమా.. రిలీజ్‌కు రెడీ | tollywood Movie Kotha cinema event in Hyderabad | Sakshi
Sakshi News home page

Kotha Cinema: రిలీజ్‌కు కొత్త సినిమా రెడీ

Aug 25 2026 9:23 PM | Updated on Aug 25 2026 9:23 PM

tollywood Movie Kotha cinema event in Hyderabad

సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న మూవీ కొత్త సినిమా. ఈ చిత్రానికి అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో 'వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' అనే ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పలువురు దర్శక నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నటుడు రాకేశ్ మాట్లాడుతూ..' నేను మా సినిమా కోసం లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా మేనేజర్, ఇతర ఆఫీసర్స్ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి'అని అన్నారు.

నటుడు సురేశ్ మాట్లాడుతూ ..'ఒక సినిమాలో నేను మెయిన్ రోల్ చేశానని చెప్పుకునే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అజర్ నాకు అలాంటి అవకాశం కల్పించారు. సినిమా తీయడం ఈజీ అని అనుకోవద్దు. అది చేసే వారికే తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు అజర్. మీలాంటి పెద్ద వాళ్లు అండగా నిలబడితే మాలాంటి కొత్త వాళ్లం గుర్తింపు తెచ్చుకుంటాం' అని అన్నారు.

డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ..'కొత్త వాళ్లం ఎవరూ సపోర్ట్ చేయరు అనుకున్నాం. కానీ మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ రోజు మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం మొదలుపెట్టా. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement