ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత | Tollywood actress Sobhita Dhulipala Revealed her Marriage life secrets | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: 'నా పెళ్లి ఇలా.. కలలో కూడా ఊహించలేదు'

Aug 25 2026 9:08 PM | Updated on Aug 25 2026 9:27 PM

Tollywood actress Sobhita Dhulipala Revealed her Marriage life secrets

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల కోలీవుడ్‌ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ఏడాది చీకటిలో అనే వెబ్ సిరీస్‌లో మెప్పించిన శోభిత.. వెట్టువం అనే తమిళ మూవీలో కనిపించనున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తన వైవాహిక జీవితానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

పెళ్లయిన ఏడాదిలో కెరీర్‌లో చైతూతో పాటు తాను కూడా ఫుల్ బిజీ ‍పోయానని శోభిత వెల్లడించింది. పెళ్లైన కొన్ని వారాలకే షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. నేను అక్కడే దాదాపు 150 రోజులకు పైగా ఉన్నానని.. కేవలం నెలకొకసారి మాత్రమే చైతూను కలిసేదాన్ని అని శోభిత వివరించింది. ఇద్దరం సినిమా ఫీల్డ్ కావడంతో వర్క్‌లైఫ్‌, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేయడం సవాల్‌గా అనిపించిందని పంచుకుంది. 

అయితే కొన్ని నెలల తర్వాత మా కొత్త జీవితానికి  అలవాటు పడ్డామని శోభిత చెప్పుకొచ్చింది. మా వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చామని తెలిపింది. మొదటి నుంచి నా పెళ్లి వేడుక పూర్తిగా సంప్రదాయ పద్ధతిలోనే జరగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని అని వెల్లడించింది. కానీ నా రాష్ట్రానికి చెందిన వ్యక్తినే పెళ్లాడతానని.. అందులో ఓ హీరోకు భార్య అవుతానని మాత్రం తానెప్పుడు ఊహించలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ నా కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది శోభిత దూళిపాళ్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement