తొలి అడుగుల నుంచి.. ఫస్ట్‌ ఫ్లైట్‌ జర్నీ వరకు..! | Woman shares emotional moment as parents take first-ever flight viral | Sakshi
Sakshi News home page

తొలి అడుగుల నుంచి.. ఫస్ట్‌ ఫ్లైట్‌ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్‌

Aug 25 2026 10:42 AM | Updated on Aug 25 2026 10:54 AM

Woman shares emotional moment as parents take first-ever flight viral

చేతులు పట్టుకుని నడిపించిన ఆ తల్లిదండ్రులనే మనం పెద్దయ్యాక వాళ్లను మనం దగ్గరుండి చూసుకుంటుంటే కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఒకప్పడు వాళ్లను గట్టిగా పట్టుకుని నడిచిన మనం ఇవాళ చిన్నపిల్లలుగా మారి మన ఆసరాతో వెళ్తుంటే వాళ్లకళ్లల్లో కనిపించే దృశ్యానికి మాటల్లేవ్‌ అంతే. అలాంటి భావోద్వేగ దృశ్యమే నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ పోస్ట్‌ని నాన్సీ గుప్తా అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె తన తల్లిదండ్రలును తొలిసారిగా విమానంలో తీసుకువెళ్తోంది. ఆ అనుభూతులని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. తొలిసారి తన పేరెంట్స్‌ విమానం ఎక్కడంతో వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోష దృశ్యాలను కెమెరాలో బంధించింది. విమానం కిటికి కుండా దుప్పటిలా పరుచుకుని తేలుతూ కనిపిస్తున్న మేఘాలను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ తిలకిస్తూ..సంబరపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. 

ముఖ్యంగా ఆమె తల్లి కిటికీలోంచి చూస్తూ సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం మనసుని తాకుతుంది. చిన్నప్పుడు నడక నేర్పించిన తల్లిదండ్రలను ఇవాళ ఆకాశంలోకి విహరించేలా చేస్తే కలిగే అనుభూతికి మించింది ఏం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని తానుపొందుతున్నా అన్నట్లుగా చివర్లో నవ్వుతూ తన సెల్పీని తీసుకుంటూ కనిపిస్తుంది నాన్సీ గుప్తా. ఈ వీడియోకి "మొదటి అడుగుల నుంచి మొదటి విమాన ప్రయాణం" వరకు అని క్యాప్షన్‌ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. 

ఏళ్లు గడిచే కొద్దీ..తల్లిదండ్రులు, పిల్లల మధ్య మారుతున్న పాత్రల గురించి ఈ క్షణం ఎలా చెబుతోందో చెప్పారు. ఆవేళ తనను చేయిపట్టుకుని నడిపించారు, ఇవాళ వాళ్లను తొలిసారిగా విమానంలో తీసుకువచ్చా. ఇదంతా చూస్తుంటే జీవితం ఒక వలయంలా పూర్తి అవుతోందనిపిస్తోంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చిందామె. నెటిజన్లు కూడా ఇది ఒక అందమైన పరిపూర్ణమైన క్షణం అని, చాలా భావోద్వేగ భరితంగా ఉంది అంటూ పోస్ట్‌లు పెట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement