ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ భర్తను అత్యంత అమానుషంగా హత్య చేసింది. పొట్టలో కత్తితో దారుణంగా పొడవడంతో పేగులు బయటకొచ్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మృతుడి కాలేయం, కిడ్నీ అదృశ్యం కావడంపై మరింత ఆందోళన రేపింది. దీనిపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యూపీలోని ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, విమలా దేవి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో భర్తను పొడిచిన తర్వాత, ఆ మహిళ అతని ప్రేగులను భవనం పైకప్పుపై ఉన్న ప్లాస్టిక్ సంచిలో కుక్కుతుండగా,ఇంటి యజమాని కంట్లోపడింది. ఇంటి యజమాని రింకు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించినప్పుడు, నిందితురాలు విమలా దేవి భవనం పైకప్పు పైనుంచి దూకేసింది. రాజేష్ పొట్టలో తీవ్రమైన గాయాలు అయ్యాయని, బయటకు వచ్చిన ప్రేగులను విమల ఒక ప్లాస్టిక్ సంచిలో పెడుతోందని రింకు పోలీసులకు తెలిపింది. మరోవైపు నిందితురాలు దేవి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.
భర్త కాలేయం, మూత్రపిండం అదృశ్యం
పోస్ట్-మార్టం నివేదిక ప్రకారం, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ గౌరవ్ కౌశిక్ వివరాల ప్రకారం భర్త రైట్ కిడ్నీ,కాలేయంలోకొంత భాగం కనిపించకుండా పోయాయి. అలాగే పొట్ట భాగంలో సుమారు 37 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాటు, ప్రేగులు బయటకు వచ్చి పడి ఉన్నాయి.
ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
విమల, రాజేష్ దంపతులు సుమారు ఏడాది కాలంగా కురుక్షేత్రలో నివసిస్తుండగా, భర్త ఒక కంపెనీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే విమలాదేవి చేతబడి, దుష్టశక్తులను వదిలించే ప్రక్రియవంటి పనుల్లో నిమగ్నమై ఉండేదని, వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇంటి యజమాని తెలిపారు.
ఇదీ చదవండి: 25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్‌లో ఏం చేయాలి?
ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. విచారణకు సహకరించేంతగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను విచారిస్తామని ఆదర్శ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సురేందర్ సంధు వెల్లడించారు. ఈ అవయవాలు అదృశ్యం కావడానికి, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్


