పంచదార ధర సామాన్యులను బెంబేలెతిస్తోంది. ధరలు రోజు రోజుకు ఎగబాకుతుండడంతో చక్కెర వైపు చూడటానికి జనం జంకుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడదామంటే దాని ధర కూడా దడ పుట్టిస్తోంది. తీపి అంటేనే హడలిపోయేలా రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి పడిపోవడం, సరఫరాలో సమస్యల కారణంగా గత కొన్ని వారాలుగా చక్కెర, బెల్లం ధరలు బాగా పెరిగిపోయాయి.
కొద్దిరోజుల క్రితం వరకు 45 రూపాయలు ఉన్న కిలో చక్కెర ధర ఇప్పుడు దాదాపు 70 రూపాయలకు చేరుకుంది. బెల్లం కిలో రేటు దాదాపు 20 రూపాయలు పెరిగి రూ.75కు వచ్చింది. పండగ సీజన్‌తో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో బెల్లం, చక్కెరకు ఫుల్ గిరాకీ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో ధరలు చుక్కలనంటడంతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించి, తమకు ఊరట కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: భారత్‌ను ముంచెత్తిన చక్కెర సంక్షోభం!
చక్కెర ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు, మీమ్స్ పెద్ద ఎత్తున పోస్ట్ అవుతున్నాయి. గతంలో నాయకుల మాటలను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కమలం గుర్తు బటన్ నొక్కండి, కిలో చక్కెర రూ.13కే పొందండి అంటూ 2019లో స్మృతి ఇరానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకుముందు ఐఫోన్ దక్కించుకోవానికి కిడ్నీ అమ్మాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చక్కెర కోసం మూత్రపిండాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.
సోషల్ మీడియాపై చక్కెర ధరల పెరుగుదలపై షేర్ అయిన పోస్టులు మీ కోసం..
कमल का बटन दबाओ, 13 रुपए किलो में शक्कर पाओ.
- स्मृति ईरानी (2019 में)#Sugar pic.twitter.com/mOZE7VoWCH— Abdul Wahab (@AbdulWahabRs) August 23, 2026
First it was iPhone, now it's SUGAR #Sugar pic.twitter.com/SiNybQqWJp
— Indian (@MeIndian03) August 24, 2026
Dhurandhar 3 on the way #Sugar https://t.co/9F5PCKM478 pic.twitter.com/1MNOcaIcgy
— Indian (@MeIndian03) August 24, 2026
మీ సైడు 50 రూపాయల షుగర్ ఇట్లా ఎట్లా ఇస్తారూ @NaperuShivaMani pic.twitter.com/dKOw7cYpBd
— d కృష్ణ (@2029krisha) August 23, 2026
#Sugar prices may be going UP… 🍬📈
But this #Reel has sweetened the internet for free!
And entertainment value is already OFF THE CHARTS! 😂🔥#SugarPriceHikes #BandhanDay #ReelOfTheDay #CreativeContent#NeverStopPlaying pic.twitter.com/GyZlLTVw6i— Zenith Chaudhary (@ZC_zenith) August 23, 2026


