హైదరాబాద్: ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ భార్యను భర్త బెదిరిస్తున్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసవతారకంనగర్‌కు చెందిన ఓ టీచర్ (24).. తన భర్త నిరంతరం వేధిస్తూ, తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది.
అంతేకాకుండా తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. 2022లో తన ప్రైవేటు ఫోటోలను దుర్వినియోగం చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం మరోసారి అదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే అవకాశం ఉందంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


