'6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్‌లో జెన్-జెడ్‌, జెన్-ఆల్ఫా శ‌కం! | Medhavi Bidhuri-6-7 Celebration Vial-Women Delhi Premier League 2026 | Sakshi
Sakshi News home page

'6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్‌లో జెన్-జెడ్‌, జెన్-ఆల్ఫా శ‌కం!

Aug 22 2026 12:50 PM | Updated on Aug 22 2026 1:08 PM

Medhavi Bidhuri-6-7 Celebration Vial-Women Delhi Premier League 2026

Photo Credit: Twitter

మ‌హిళ‌ల ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. లీగ్ ప్రారంభ‌మైన తొలి రోజునే సెంట్ర‌ల్ ఢిల్లీ క్వీన్స్ ప్లేయ‌ర్ మేధావి బిధురి త‌న చ‌ర్య‌తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యంలోకి వెళితే ఆగ‌స్టు 20న టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ సెంట్ర‌ల్ ఢిల్లీ క్వీన్స్‌, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ మ‌ధ్య జ‌రిగింది. 

మ్యాచ్‌లో మేధావి బిధురి రెండు వికెట్ల‌తో మెరిసింది. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో నిషిక సింగ్‌ను అవుట్ చేసిన‌ తర్వాత మేధావి బిధురి జెన్‌-జీ త‌రంలో ట్రెండింగ్‌లో ఉన్న '6-7' సెల‌బ్రేష‌న్‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.

ఏమిటీ 6-7 సెల‌బ్రేష‌న్‌?
జెన్‌-జీ 6-7 సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా "ఆరు-ఏడు" అని చెబుతూ, చేతులు (See Saw) పైకి కిందకీ ఊపుతారు. ఈ సంజ్ఞకు ఒక నిర్దిష్టమైన అర్థం లేనప్పటికీ, ఇది జెన్ జెడ్ (2000-2012), జెన్ ఆల్ఫా (2013 నుంచి ప్ర‌స్తుతం) వర్గాల్లో ఒక ప్రధాన ఇంటర్నెట్ మీమ్‌గా మారిపోయింది. ఇప్పుడీ ఈ ట్రెండ్ క్రీడల్లోకి కూడా ప్రవేశించింది.

ఇప్ప‌టికే మాజీ క్రికెటర్లు కెవిన్‌ పీటర్సన్, డేవిడ్ వార్నర్ కాసెమిరో వంటి స్టార్ ఆట‌గాళ్లు ఈ 6-7 సెల‌బ్రేష‌న్స్‌తో మెరిశారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే, మేధావి బిధురి ధ‌రించిన జెర్సీ నెంబ‌ర్ కూడా 67 కావ‌డం సెల‌బ్రేష‌న్స్‌కు మ‌రో కార‌ణం.

ఎవ‌రీ మేధావి బిధురి?
ఢిల్లీకి చెందిన మేధావి బిధురి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్న‌ర్‌. ఢిల్లీ క్రికెట్‌తో పాటు ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ లిస్ట్ క్రికెట్‌లో పాల్గొంది. 2024 మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) వేలంలోనూ మేధావి బిధురి త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకుంది. 2025 ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్ ఎడిష‌న్‌లో మేధావి బిధురి ఆ సీజ‌న్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో మూడు వికెట్ల‌తో స‌త్తా చాటింది. 2026 సీజ‌న్‌కు ముందే ఆమె సెంట్ర‌ల్ ఢిల్లీ క్వీన్స్‌కు మారింది.

 

Read: గిల్‌, జైస్వాల్ ఫామ్‌పై న‌జ‌ర్‌.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement