breaking news
Delhi Premier League
-
అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్‌పై సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్‌కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్‌ను రాజ్‌కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లేVIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025 -
జాక్‌పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్‌ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రన్నరప్‌గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్‌హామ్‌లో జైహింద్ -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్‌తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్‌లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్‌లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
సెహ్వాగ్ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు..
దేశవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) కూడా తెరమీదకు వచ్చింది. గతేడాది ఆరంభమైన ఈ లీగ్ ద్వారా.. ఐపీఎల్-2025 నయా సంచలనాలు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya), దిగ్వేశ్ సింగ్ రాఠి (Digvesh Singh Rathee) వెలుగులోకి వచ్చారు.డీపీఎల్ ప్రస్తుతం రెండో సీజన్‌కు సిద్ధమైంది. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. ఈసారి మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి ఓ స్పిన్ బౌలర్ డీపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ?కోహ్లికి కొడుకు వరసయ్యే ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దగ్గర అతడు మెళకువలు నేర్చుకుంటున్నాడు అంతేకాదు.. భారత విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా డీపీఎల్ వేలంలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పేర్లు షార్ట్‌లిస్ట్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే ఢిల్లీ అండర్ 19 జట్టుకు ఆడుతుండగా.. 15 ఏళ్ల వేదాంత్ ఆఫ్ స్పిన్నర్. ఇతడు అండర్-16 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ డీపీఎల్ వేలంలో ‘బి’ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిగ్గజాల వారసుల ఆట చూసేందుకు అభిమానులు డీపీఎల్‌పై ఓ లుక్కేయడం ఖాయం.సత్తా చాటిన ప్రియాన్ష్, దిగ్వేశ్కాగా జూలై 5న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఇక గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ఆడిన ప్రియాన్ష్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పది మ్యాచ్‌లలో కలిపి 608 పరుగులు చేసి లీగ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో రూ. 3.80 కోట్ల ధరతో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌లో చేరిన ప్రియాన్ష్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సౌత్ ఢిల్లీకే ఆడిన దిగ్వేశ్ సింగ్ రాఠీ సైతం డీపీఎల్‌లో సత్తాచాటి ఐపీఎల్లో ప్రవేశించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్‌లో కలిపి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇక డీపీఎల్‌లో ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ 6 పేరిట ఆరుజట్లు తలపడ్డాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ టైటిల్ గెలవగా.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రన్నరప్‌గా నిలిచింది. ఇక తొలి సీజన్‌కు వీరేందర్ సెహ్వాగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
ప్రియాన్ష్.. నీ కోసం ఐపీఎల్ ఎదురుచూస్తోంది
ప్రియాంష్ ఆర్య.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక యువ సంచలనం. ఈ లీగ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాన్ష్ ఆర్య తన అద్బుత ప్రదర్శనలతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత వారంలో . నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన ఈ యువ సంచలనం.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడి హిట్టింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే.ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు తన సిక్సర్లతో భారత దిగ్గజం యువరాజ్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన ప్రియాన్ష్.. 576 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ లీగ్‌లో దుమ్ములేపుతున్న ఆర్య తన మనసులోని మాటను బయట పెట్టాడు.ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలన్న తన కోరికను 23 ఏళ్ల ఆర్య వ్యక్తం చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా ఆర్య వెల్లడించాడు. కోహ్లి తనకు రోల్‌మోడల్ అని, అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలనకుంటున్నాని ప్రియాన్ష్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ఎదురుచూస్తోంది..ఇక ఈ ఏడాది ఆఖరిలో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో ప్రియాంష్ ఆర్యపై కాసుల వర్షం కురిసే అవకాశముంది. ఇటువంటి యువ సంచలనాల కోసమే ఫ్రాంఛైజీలు వేయికళ్లుతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్యపై ఓ కన్నేసి ఉంటాయి.నా దృష్టి అంతా ఆ టోర్నీపైనే..ఐపీఎల్ గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ టోర్నీ. ఈ లీగ్ కోసం ఆలోచించడం, ఒత్తడిని ఎదుర్కొవడం రెండూ ఒకటే. వేలం కూడా నా ఆలోచన లేదు. ఆడే అవకాశం వస్తే అది నా శ్రమకు దక్కిన ఫలితంగా భావిస్తాను. అయితే నా దృష్టింతా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే ఉంది. నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇది గొప్ప అవకాశం. అక్కడ అద్భుతప్రదర్శన జట్టును గెలిపించడమే నా లక్ష్యమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య పేర్కొన్నాడు. -
విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! సన్‌రైజర్స్ రికార్డు బద్దలు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సిక్సర్ల మోత మోత మోగింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ బ్యాటర్లు ఆయుష్ బదోని, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి అరుణ్ జైట్లీ స్టేడియం దద్దరిల్లిపోయింది.ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేయగా.. ప్రియాన్ష్ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి సంచలన ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీస్కోరు చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో జట్టుగా సౌత్ ఢిల్లీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. తాజా మ్యాచ్‌లో 308 పరుగులు చేసిన సౌత్ ఢిల్లీ.. సన్‌రైజర్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ జాబితాలో నేపాల్ అగ్రస్ధానంలో ఉంది. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. 6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024 -
19 సిక్సర్లు.. సెంచరీ... ఎవరీ అరివీర భయంకర బ్యాట్స్‌మెన్?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు.దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.అంతా గంభీర్ వల్లే..ఆయుష్ బదోని సక్సెస్ వెనక టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్ ఎదుగుదలలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బదోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.2022 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి బదోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే. ఐపీఎల్లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్‌గా కొనసాగిన గంభీర్.. బదోనికి ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్ సైతం ధ్రువీకరించాడు. గంభీర్‌కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. -
ఢిల్లీ ఆటగాడి తుపాన్ ఇన్నింగ్స్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు! వీడియో
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. ఈ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ప్రియంష్ ఈ ఘనత సాధించాడు. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్‌లో ప్రియంష్ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్లో తొలి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా సిక్స్ బాదిన ప్రియాంష్.. రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులను కూడా ఆర్య సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును ప్రియంష్ ఆర్య తన పేరిట లిఖించుకున్నాడు. ఓకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో భారత క్రికెటర్‌గా ప్రియాంష్ నిలిచాడు. అంతకుముందు రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు.ఇక ఈ మ్యాచ్‌లో ప్రియాంష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరో ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఆటగాడు ఆయూష్ బదోనీ కూడా భారీ సెంచరీతో మెరిశాడు. కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్‌లతో 165 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20) -
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్‌కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
టీమిండియాకు మరో బౌలర్.. స్పిన్నర్‌గా మారిన పంత్(వీడియో)
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్పిన్నర్‌గా సరికొత్త అవతరమెత్తాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పురాణి డిల్లీ 6 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్చపరిచాడు. ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో పంత్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే మొదటి బంతికే ఢిల్లీ సూపర్‌స్టార్జ్ విజయం సాధించడంతో పంత్‌కు తన ఓవర్‌ను పూర్తి చేసే అవకాశం లభించలేదు.కేవలం ఒక్క బాల్ మాత్రమే రిషబ్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భారత క్రికెట్‌కు మరో బౌలర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లగా మారారు. రాబోయే మ్యాచ్‌ల్లో పంత్ కూడా బౌలింగ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురాణి డిల్లీపై 3 వికెట్ల తేడాతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పురాణి డిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పురాణి ఢిల్లీ బ్యాటర్లలో అర్పిత్ రాణా(59) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్స్ బేడి(47), పంత్(35), లలిత్ యాదవ్(34) పరుగులతో రాణించారు.అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ ఢిల్లీ బ్యాటర్లలో పియూన్ష్ ఆర్య(57), ఆయూష్ బదోని(57) హాఫ్ సెంచరీలతో మెరిశారు.Rishabh pant bowling 😸🔥pic.twitter.com/QvM7tFZLcu— 𝓱 ¹⁷ 🇮🇳 (@twitfrenzy_) August 17, 2024 -
పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్‌లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ భాగం కానున్నాడు. ఈ లీగ్‌లో పురాణి ఢిల్లీ 6 ఫ్రాంచైజీ తరపున పంత్ ఆడనున్నాడు. అతడితో పాటు భారత వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా పురాణి ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ ఢిల్లీ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆయుష్ బడోనీ, అనుజ్ రావత్, యశ్దయాల్లు కూడా డీపీఎల్‌లో ఆడనున్నారు. తాజాగా డీపీఎల్‌లో పాల్గోనే ఆటగాళ్ల డ్రాఫ్ట్ జాబితాను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. అయితే ఈ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ టోర్నీకి మయాంక్ దూరంగా ఉండనున్నాడు. మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక ఈ డీపీఎల్ తొట్ట తొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఫ్రాంచైజీలు రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్: ఆయుష్ బదోని, కులదీప్ యాదవ్, ప్రియాంష్ ఆర్య, సుమిత్ మాథుర్, దివిజ్ మెహ్రా, కున్వర్ బిధురి, దిగ్వేష్ రాఠీ, తేజస్వి దహియా, రాఘవ్ సింగ్, సౌరభ్ దేస్వాల్, సార్థక్ రే, లక్షయ్ సెహ్రావత్, తరుణ్ బిష్త్, శుభ్ పన్బే, శుభమ్ పన్బే, శుభమ్ పన్. సింగ్, మయాంక్ గుప్తా, అన్షుమాన్ హుడా, అనిందో నహరాయ్, దీపాంశు గులియాతూర్పు ఢిల్లీ రైడర్స్: అనుజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, వైభవ్ శర్మ, మయాంక్ రావత్, సమర్థ్ సేథ్, ప్రణవ్ పంత్, సుజల్ సింగ్, హార్దిక్ శర్మ, రౌనక్ వాఘేలా, అగ్రిమ్ శర్మ, శంతను సింగ్, భగవాన్, భగవాన్, భగవాన్ చౌదరి, సాగర్ ఖత్రి, శివమ్ కుమార్ త్రిపాఠి, రిషబ్ రాణా, లక్షయ సాంగ్వాన్సెంట్రల్ ఢిల్లీ కింగ్స్: యశ్ ధుల్, ప్రిన్స్ చౌదరి, హితేన్ దలాల్, జాంటీ సిద్ధు, లక్షయ్ థరేజా, యోగేష్ శర్మ, మనీ గ్రేవార్, కేశవ్ దాబాస్, శౌర్య మాలిక్, సౌరవ్ దాగర్, ఆర్యన్ రాణా, సిద్ధాంత్ బన్సల్, రజనీష్ దాదర్, సుమిత్ కుమార్, కౌశల్ సుమన్, దీప్ బల్యాన్, విశాంత్ భాటి, ధ్రువ్ కౌశిక్, అజయ్ గులియానార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్: హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ప్రన్షు విజయరన్, వైభవ్ కంద్పాల్, క్షితిజ్ శర్మ, వైభవ్ రావల్, యష్ దాబాస్, ప్రణవ్ రాజ్‌వంశీ, మనన్ భరద్వాజ్, యశ్ భాటియా, యతీష్ సింగ్, అమన్ భారతి, యజాస్ శర్మ, సార్థక్ చోరంద్, అనిరుధ్ రంజన్, అనిరుద్ , యథార్త్ సింగ్, సిద్ధార్థ సోలంకి, ధ్రువ్ చౌహాన్, యువరాజ్ రాఠీవెస్ట్ ఢిల్లీ లయన్స్: హృతిక్ షోకీన్, నవదీప్ సైనీ, దేవ్ లక్రా, దీపక్ పునియా, శివంక్ వశిష్త్, అఖిల్ చౌదరి, ఆయుష్ దోసెజా, క్రిష్ యాదవ్, అన్మోల్ శర్మ, యుగల్ సైనీ, అంకిత్ రాజేష్ కుమార్, వివేక్ యాదవ్, ఆర్యన్ దలాల్, మసాబ్ ఆలం, ఏకాంష్ దోబల్, శివం గుప్తా, యోగేష్ కుమార్, సూర్యకాంత్ చౌహాన్, తిషాంత్ దబ్లా, అబ్రహీం అహ్మద్ మసూదిపురాణి డిల్లీ 6: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా, శివం శర్మ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, మయాంక్ గుసేన్, సనత్ సాంగ్వాన్, అంకిత్ భదానా, యుగ్ గుప్తా, కేశవ్ దలాల్, ఆయుష్ సింగ్, కుష్ నాగ్‌పాల్, సుమిత్ ఛికారా, అర్నవ్ బుగ్గారా బేడీ, మంజీత్, యష్ భరదవాజ్, సంభవ్ శర్మ, లక్ష్మణ్