
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.
ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్‌పై సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్‌కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు.
"ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.
అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్‌ను రాజ్‌కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.
చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లే
VIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.
Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025