
అండర్సన్-సచిన్ డెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ టెస్టులో గెలవాల్సిన మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఓడిపోవడంతో సిరీస్‌లో వెనకబడింది.
ఈ క్రమంలో మాంచెస్టర్‌లో ఎలాగైనా గెలిచి మూడో టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారత పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కుంబ్లే సూచించాడు.
కాగా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని జట్టు సెలక్షన్ సమయంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగానే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండు మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ స్పీడ్ స్టార్ తిరిగి లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆడాడు. ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టులో కూడా బుమ్రా ఆడాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
"ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్‌లో నేను భాగమై ఉంటే బుమ్రాను కచ్చితంగా మాంచెస్టర్ టెస్టులో ఆడిస్తాను. ఎందుకంటే భారత జట్టుకు ఆ మ్యాచ్ చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే సిరీస్ కథ ముగిసినట్లే. బుమ్రా నాలుగో టెస్టులోనూ కాదు ఆఖరి మ్యాచ్‌లో కూడా ఆడాలి.
ముందే మూడు మ్యాచ్‌లు ఆడుతానని బుమ్రా చెప్పొండచ్చు. కానీ ఈ సిరీస్ తర్వాత అతడికి చాలా విశ్రాంతి లభిస్తోంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా బుమ్రా కచ్చితంగా ఆడాలి. అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటే, స్వదేశంలో జరిగే సిరీస్‌లకు పక్కనపెట్టండి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: వామ్మో మాంచెస్టర్.. భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు