న్యూ లుక్‌లో విరాట్‌ కోహ్లి.. వీడియో వైరల్‌ | Virat Kohli dazzles in stylish haircut ahead of IPL 2026 for RCB, | Sakshi
Sakshi News home page

IPL 2026: న్యూ లుక్‌లో విరాట్‌ కోహ్లి.. వీడియో వైరల్‌

Mar 15 2026 12:39 PM | Updated on Mar 15 2026 1:42 PM

Virat Kohli dazzles in stylish haircut ahead of IPL 2026 for RCB,

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు టీమిండియా స్టార్‌, రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దిగ్గ‌జం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఈ కొత్త లుక్‌ను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడి​యోను జార్డన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. కోహ్లి దాదాపు ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లోనూ కొత్త లుక్‌తో బరిలోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన న్యూ లుక్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కాగా విరాట్‌ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నాడు.  కోహ్లి త్వరలోనే ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు.

ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌ 19వ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

తొలిసారి ఛాంపియన్స్‌
కాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ గతేడాది తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్‌ కోహ్లిది కీలక పాత్ర. గత సీజన్‌లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఈ ఏడాది సీజన్‌లో కొనసాగించాలని చేజ్‌ మాస్టర్‌ ఉవ్విళ్ళూరుతున్నాడు. తను చివరిగా ఆడిన న్యూజిలాండ్‌ సిరీస్‌లోనూ కోహ్లి దుమ్మలేపాడు.
చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement