మైనర్‌పై ఫుట్‌బాల్‌ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ | Football Coach assaulted Minor For 3 Years Shot Videos To Blackmail Her | Sakshi
Sakshi News home page

మైనర్‌పై ఫుట్‌బాల్‌ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

Jun 13 2026 4:00 PM | Updated on Jun 13 2026 4:22 PM

Football Coach assaulted Minor For 3 Years Shot Videos To Blackmail Her

అవకాశాలిప్పిస్తానని చెప్పి గత మూడేళ్లుగా దారుణం

బాలిక ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి

పాల్ఘర్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్‌బాల్ కోచ్, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక  దాడికి పాల్పడిన  వైనం కలకలం రేపింది. అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను 36 ఏళ్ల అభిజిత్ మెండల్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం దిగ్భ్రాంతికరమైన కేసు  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వసాయిలోని తన ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు.  గత మూడేళ్లుగా, పలుమార్లు  లైంగిక దాడిచేయడంతోపాటు  కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను తీసి,  బెదిరించి, తద్వారా తన కోరికలను తీర్చుకునేవాడు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక, చివరకు తన కుటుంబం సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  ప్రాథమిక విచారణ అనంతరం మెండల్‌ను అరెస్టు చేశారు.

ఫుట్‌బాల్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రలోభపెట్టాడని బాధితురాలు వాపోయింది. వేధింపులతో విసిగి, అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. దీంతో వీడియోలు, ఫోటోలతో తనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించింది. తనకు లొంగకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననిబెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి, కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: డేంజరస్‌ స్టంట్‌ : యెమెన్‌ స్పైడర్ మ్యాన్ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement