తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌ | Suryakumar Yadav and Devisha Shetty waiting to welcome their first child | Sakshi
Sakshi News home page

తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌

Mar 15 2026 12:00 PM | Updated on Mar 15 2026 3:35 PM

Suryakumar Yadav and Devisha Shetty waiting to welcome their first child

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో శనివారం దేవిశా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో సూర్య- దేవిశా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికి 2010లో ముంబైలోని ఆర్‌.ఎ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఈ జంట 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. దేవిషా వృత్తిరీత్యా భరతనాట్యం కోచ్. ఆమె సూర్య కెరీర్ ఆరంభం నుంచి అతడికి అండగా ఉంటూ వస్తోంది. ఎన్నో సందర్బాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. కాగా సూర్య ఇటీవల కెప్టెన్‌గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే.


చదవండి: సన్‌రైజర్స్‌కు పాక్‌ ప్లేయర్‌ ఆడడం కష్టమే?

 

Advertisement
 
Advertisement
Advertisement