Nandyala
-
బౌండరీలు దాటిన క్రీడోత్సాహం!
● కర్నూలు, నంద్యాల పోలీసు అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ● ఇరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన ఎస్పీలు కర్నూలు: విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న పోలీసు అధికారులు ఆటవిడుపుగా కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇరు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌కు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బందిని ఉత్సాహపరుస్తూ సాగిన ఈ మ్యాచ్‌లో నంద్యాల జిల్లా పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచుతాయన్నారు. నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల పోలీసుల మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు. క్రీడలు శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాసులుతో పాటు సీఐ, ఆర్ఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో మూత‘బడి’
మూతపడిన బ్రాహ్మణపల్లె ఎంపీపీ పాఠశాలనిరుపయోగంగా ఉన్న సంస్కృతోన్నత పాఠశాల నంద్యాల(అర్బన్): పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల విద్య ప్రశ్నార్థకంగా మారింది. బడిఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ నియోజకవర్గమైన నంద్యాల మండలంలో జెడ్పీహెచ్ఎస్ 9, 3 ఎంపీయూపీ, 39 ఎంపీపీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సంస్కృతోన్నత పాఠశాలలు ఉండగా అందులో నంద్యాల మండలం కానాల గ్రామ మజరా హైస్కూల్ కొట్టాల గ్రామంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిందంటూ పాఠశాలను మూసివేశారు. సంస్కృతం చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అయోమయాలకు గురయ్యారు. మామూలు విద్య అయితే ఏదో ఒక పాఠశాలలో చదివేవారు. కాని సంస్కృత పాఠశాల కావడంతో విద్యార్థులు కొంత మంది బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా బ్రాహ్మణపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో మూతవేశారు. అక్కడ విద్యాభాస్యం చేసే చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక బాల కార్మికులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. పాండురంగాపురం మజరా సుబ్బారెడ్డి పాలెం ఎంపీపీ పాఠశాల కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మూత దశకు చేరుకుంది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నంద్యాల మండలంలోని పాఠశాలలు మూతపడి విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్నా మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకొని మూత పడిన పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుతున్నారు. విద్యార్థులు లేక మూడు ప్రభుత్వ పాఠశాలల మూత సుదూర ప్రాంతాలకు వెళ్లలేని పేద విద్యార్థులు బాల కార్మికులుగా మారుతున్న చిన్నారులు -
వేరుశనగ ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మండలాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఎల్‌నినో భయపెడుతోంది.. మరో వైపు ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది.. రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచే ఆర్బీకేల వారీగా విత్తన పంపిణీ జరిగేది. వర్షాలు పడిన వెంటనే రైతులు విత్తుకునే అవకాశాన్ని లభించేది. చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విత్తన పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ కంపెనీలపై ఆధారం సబ్సిడీపై వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తారు. వేరుశనగ సరఫరాకు టెండర్లు నిర్వహించినా ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు అన్ని రకాల విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్) సరఫరా చేస్తోంది. విత్తనోత్పత్తికి ఏపీ సీడ్స్ స్వస్తి పలికి వివిధ ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. ప్రస్తుతం విత్తనాలు లేక కర్నూలులోని ఏపీ సీడ్స్ గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే రైతులు పచ్చిరొట్ట విత్తనాలతో పాటు కంది, వేరుశనగ విత్తుకుంటారు. అవి లేకపోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రూ.350 కోట్ల వరకు బకాయిలు రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్‌కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రం కేవలం ఒక కంపెనీ మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ కంపెనీలో కూడా వేరుశనగ అరకొరగా ఉంది. ఖరీఫ్ సీజన్లో 2024–25, 2025–26 సంవత్సరాల్లో సరఫరా చేసిన వేరుశనగ, ఇతర విత్తనాలకు సంబంధించి కంపెనీలకు ఏపీ సీడ్స్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీసీడ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో వేరుశనగ ఇవ్వలేమని విత్తన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ భీష్మించుకూర్చున్నాయి. దొరకని పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంది. ఫలితంగా పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి ఎక్కువగా సాగు చేస్తారు. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడటానికి జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఫలితంగా భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట విత్తనాలు ఉమ్మడి జిల్లాకు కనీసం 9,232 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ దగ్గర ఒక్క క్వింటం కూడా విత్తనాలు లేవు. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు జిల్లా: ఆలూరు, పత్తికొండ, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, పెద్దకడుబూరు, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, ఓర్వకల్లు, ఆదోని, కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల నంద్యాల జిల్లా: డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
కర్నూలు సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నగర శివారులోని దుపాడు దగ్గర ఉన్న ఐయాన్ డిజిటల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయ ంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 973 మంది విద్యార్థులు హాజరయ్యారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 1న రిజిస్ట్రేషన్ చేసుకుంటే, 4వ తేదీన పరీక్ష నిర్వహించి, 7వ తేదీ తుది ఫలితాలు ప్రకటించనున్నారు. అడ్వాన్డ్స్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ 21న వెబ్సైట్లో ఉంచి 25వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 1వ తేది ఉదయం 10 గంటలకు తుదికీ ఫలితాలను విడుదల చేయనున్నారు. పేపర్–1, పేపర్–2 రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మాత్రమే విడుదల చేయనున్నారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ ఆథారిటీ–జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జాతీయ పోటీలకు ‘ౖసైసెరా’ కర్నూలు కల్చరల్: తిరుపతి అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటక పోటీలకు ‘ౖసైసెరా నరసింహారెడ్డి’ నాటకం ఎంపికై ంది. ఈ మేరకు అభినయ ఆర్ట్స్ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి ప్రకటించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను నాటక రూపంలో పత్తి ఓబులయ్య దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నాటకం నంది నాటక పోటీలలో పాల్గొని వెండి నందితో పాటు ఇతర నందులను కై వసం చేసుకుంది. గత నెలలో మిర్యాలగూడలో నిర్వహించిన జాతీయస్థాయి పద్య నాటక పోటీల్లో ద్వితీయ బహుమతిని పొందిందని పత్తి ఓబులయ్య తెలిపారు. ప్రస్తుతం అభినయ ఆర్ట్స్ పోటీలకు ఎంపిక కావడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
ఇదీ దుస్థితి..
● ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు 50 వేలకు పైగా హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. ● మొత్తం 30 వేల క్వింటాళ్ల విత్తనం కాయలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ● ప్రభుత్వం కర్నూలు జిల్లాకు 10,723, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ● బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన క్వింటా వేరుశనగ ధర రూ.7,500 ఉంది. ● ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే క్వింటా వేరుశనగ ధరను రూ.10,200గా నిర్ణయించింది. ● కిలో ధర రూ.102 ఉండగా అందులో రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ● బకాయిలు చెల్లిస్తేనే వేరుశనగతో సహా పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తామని కంపెనీలు చెబుతున్నాయి. -
అధికారులు కావలెను!
కొలిమిగుండ్ల: మండల స్థాయిలో కీలకమైన తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమైన పోస్టుల్లో అధికారులు లేక సేవలు జాప్యమవుతున్నాయి. గ్రామాల నుంచి ఏదో ఒక పని మీద కార్యాలయానికి చేరుకున్నా అధికారులు లేక సకాలంలో పనులు కాక నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోంది. రెగ్యులర్ తహసీల్దార్ లేక డీటీ విశ్వతేజకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెండు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూముల రీసర్వే కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడున్న ఇద్దరు అటెండర్లను సైతం డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఒక్కరు మాత్రమే అటెండర్ మిగిలారు. అధికారులకు ఫైల్స్ కావాలంటే వాళ్లే స్వయంగా వెతికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం కార్యాలయంలో ఇన్చార్జ్ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రైతులు పలు రకాల సమస్యల పరిష్కారం కార్యాలయానికి వస్తుంటారు. జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు ముందుగానే సర్టిఫికెట్లు సిద్ధం చేసుకునేందుకు కార్యాలయానికి వెళ్తారు. ఈ సమయంలో అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతుంది. ఆ వీఆర్వో పోస్టు మాకొద్దు తహసీల్దార్ కార్యాలయంలో పలు పోస్టులు ఖాళీ కారణంగా మండల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో వైపు పలు గ్రామాలకు వీఆర్వోలు లేక సకాలంలో పనులు కాక సతమతమవుతున్నారు. ప్రధానంగా మండల కేంద్రానికి పక్కనే ఉన్న ఇటిక్యాలకు వీఆర్వో పోస్టు దాదాపుగా రెండేళ్ల నుంచి ఖాళీగా ఉంటుంది. గతంలో ఇక్కడి విధులు నిర్వహించే వీఆర్వో కొంత మంది వ్యక్తులతో చేతులు కలపడంతో వాళ్లకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాల కోసం ఎన్ఓసీలను ఇష్టానుసారంగా మంజూరు చేయడంతో ముఠా సభ్యులు సెంట్ల ప్రకారం లక్ష లాది రూపాయలకు విక్రయించేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టి సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తు తం ఇక్కడికి వీఆర్వోగా వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న వీఆర్వోలు సైతం ఇటిక్యాలకు ఇన్చార్జ్గా వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయ డం లేదు. ఇటిక్యాలతో పాటు మీర్జాపురం, తిమ్మనాయినపేట గ్రామాలకు ఖాళీగా ఉండటంతో ఇతరులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి సకాలంలో సేవలు అందేలా చూడాలని మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
ఇస్తారో..లేదో?
మేం ప్రతి ఏటా వేరుశనగ సాగు చేస్తాం. ఈ సారి కూడా రెండు ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో భూములను సిద్ధం చేసుకున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే 15 నుంచే వేరుశనగతో సహా అన్ని రకాల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరస్థితులు లేవు. ఈ సారి సబ్సిడీపై విత్తనాలు ఇస్తారో..లేదో? మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులో ఉంచకపోతే బ్లాక్‌లో కొనాల్సి వస్తుంది. – బీమా నాయక్, మీటేతండా, తుగ్గలి మండలం మాకు నీటి వసతి ఉంది. బోరు కింద మూడు ఎకరాల్లో వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాం. ఈ నెల 20వ తేదీలోపు నీటి వసతి కింద వేరుశనగ వేసుకుంటే బాగా కలసి వస్తుంది. సకాలంలో సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆలస్యం అయితే బ్లాక్‌లో కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వేరుశనగతో పాటు ముందస్తుగా కంది కూడా సాగు చేస్తాం. వేరుశనగతో పాటు కందులు, ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయాలి. – నరసింహులు, బైన్‌దొడ్డి గ్రామం, కోడుమూరు మండలం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సబ్సిడీపై వేరుశనగ పంపిణీకి చర్యలు చేపట్టాం. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల వారీగా వేరుశనగతో పాటు పచ్చి రొట్ట, ఇతర విత్తనాల అలాట్‌మెంటు కూడా ఇచ్చింది. వేరుశనగ ధర, సబ్సిడీలు కూడా ఖరారయ్యాయి. వేరుశనగను సిద్ధం చేయాలని ఇప్పటికే ఏపీసీడ్స్‌కు ఆదేశాలు ఇచ్చాం. మరో పది రోజుల్లో వేరుశనగను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. చిన్న సమస్యలు ఉంటే అన్ని మూడు రోజుల్లో సర్దుకుంటాయి. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం డోన్ టౌన్: ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి పోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం యాడికికి బయలుదేరింది. మార్గమధ్యంలో గోసానిపల్లె గ్రామ సమీపంలో స్టీరింగ్ రాడ్ విరిగి పోయింది. దీంతో బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లగా డ్రైవరు చాకచక్యంగా వ్యహరించి ప్రమాదాన్ని తప్పించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డోన్ డిపోలో ఎక్కువగా పాత బస్సులు ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని కార్మికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ పరిస్థితిని సమీక్షించి ప్రయాణికులను అదే రూట్లో వెళ్లే రాచర్ల బస్సులో తరలించారు. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ
కల్లూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు చేపట్టనున్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పెంచి పేదలపై భారం మోపడాన్ని నిరసిస్తూ కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసం నుంచి కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేస్తారు. పాణ్యం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 18వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నా రు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా తాలీం–ఏ–హునర్ పరీక్ష నంద్యాల(అర్బన్): పట్టణంలోని నేషనల్ డిగ్రీ కళాశాల, బైర్మన్ వీధిలోని మున్సిపల్ హైస్కూల్లో ఆదివారం జరిగిన తాలీం–ఏ–హునర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 671 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 611 మంది హాజరయ్యారు. కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీ డియెట్, ఐఐటీ, జేఈఈ, నీట్ శిక్షణ కోసం పేద ముస్లిం విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను డీఆర్ఓ రామునాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబిహాపర్వీన్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెస్టులో ఎంపికై న వారికి కార్పొరేట్ కళాశాలల్లో వంద శాతం ఉచిత ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆళ్లగడ్డలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యలవాడల్లో 42.5, చాగలమర్రిలో 42.4, పగిడ్యాల, జూపాడుబంగ్లా, సంజామలల్లో 42.3, మహనందిలో 42.2. కౌతాళంలో 41.5, చిప్పగిరి, గూడూరు, మద్దికెరల్లో 41.4, కర్నూలులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నందికొట్కూరు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి లలిత వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం డీసీహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులతో మర్యాదగా మెలగాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రెండేళ్లు అయినా లోకేష్ హామీకి దిక్కేలేదు నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని యువగళం సభలో లోకేష్ ఇచ్చిన హామీకి రెండేళ్లు అయినా దిక్కు లేదని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారానికి 53వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘం నాయకుడు జయన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూటమి నేతలు నమ్మించి వంచించారన్నారు. నీటిముంపు నిరుద్యోగులను చంద్రబాబు పట్టించుకోకపోవడం మోసం చేయడేమనన్నారు. దీక్షలో నాగేంద్రుడు, రాజారావు, నారాయణ, రవి, మహమ్మద్ రఫి, తదితరులు కూర్చున్నారు. -
చింతకుంటలో భారీ చోరీ
● 30 తులాల బంగారు, కేజీ వెండి అపహరణ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటలో భారీ చోరి జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చింతకుంట గ్రామానికి చెందిన వలి కుటుంబీకులు శనివారం రాత్రి ఇంటి తలుపులు వేసుకుని ఇంటి ముందు నిద్ర పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండటం గమనించారు. ఇంటి వెనుక తలుపులు తీసి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగలు, కేజీ వెండి ఆభరణాలతో పాటు రూ. లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. ఇటీవల వలి రెండో కూతురు వివాహం జరిగింది. పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతురుతో పాటు పెద్ద కూతురుకు సంబంధించిన బంగారు ఆభరణాలు అన్నీ బీరువాలోనే ఉంచారు. బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆళ్లగడ్డ: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం (50) మృతి చెందాడు. మృతుడిని చిత్తూరు జిల్లా సుగంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో జై భారత్ ట్రావెల్స్ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీ కొట్టింది. -
రూ.కోటి విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత
కర్నూలు: నిషేధిత కూల్ లిప్ అనే గుట్కా నిల్వలపై నాలుగో పట్ట ణ పోలీసులు దాడులు చేసి రూ.కోటి విలువ చేసే నిల్వలను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చి స్థానిక హనుమాన్ కాటా వెనుక ఓ గో డౌన్లో నిల్వ చేసి కర్నూలు నగరంతో పాటు చుట్టుముట్టు పల్లెలకు గుట్కా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో శనివారం గోదాముపై దాడులు నిర్వహించారు. ఒక్కొక్క సంచిలో రూ.50 విలువ చేసే 193 బ్యాగులలో గుట్కా నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటితో పాటు గోడౌన్‌ను సీజ్ చేశారు. ఇవి చూయింగ్ గమ్ తరహాలో ఉంటాయి. వ్యాపారి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. తన వ్యాపారం సక్రమమే అని వెంకటేశ్వర్లు తెలపడంతో అందుకు సంబంధించిన రికార్డులను తెప్పించి పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా కిరాణం అంగళ్లు, బీడీ బంకులకు సరఫరా చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. -
పిల్లలకు మంచిచెడులను వివరించండి
పాములపాడు: పిల్లలకు మంచిచెడుల గురించి తల్లిదండ్రులు వివరించాలని డీసీపీఓ స్వప్న అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలకు కిశోర వికాసం, వేసవి సెలవులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులని, పిల్లల స్వభావం గురించి తెలుసుకొని అందుకు తగ్గట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కమిటీలు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో చిన్న పిల్లలపై జరిగిన అఘాయిత్యాలు, అబ్బాయిలు చిన్న వయస్సులో చేసిన తప్పులను పలు ఉదాహరణలతో వివరించారు. విద్య కెరీర్, మార్గదర్శకత్వం, స్మార్ట్ ఫోన్ వినియోగం, పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండటం, పిల్లలకు గ్రామ సభ, చట్టల పై అవగాహన, ప్రాముఖ్యతల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ సులోచన, ఎస్ఐ తిరుపాలు, హెల్త్ ఎడ్యుకేటర్ మల్లికార్జున, ఐసీడీఎస్ సూపర్వైజర్ లలిత ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాల పెంపునకు చర్యలు
శిరివెళ్ల: చెరువులు, కుంటలలో భూగర్భ జలాల పెంపునకు జలధార– జలహారతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. శనివారం యర్రగుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన జలఽధార– జలహారతి, స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి నిధులతో జిల్లాలో 2,216 చెరువులు, కుంటలలో జలాల పెంపునకు పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చిందన్నారు. అందులో 2001 చెరువులు, కుంటలలో పనులు మొదలయ్యాయన్నారు. అలాగే జిల్లాలో 82 వేల మంది వ్యవసాయ కూలీలు పనులకు వస్తున్నారన్నారు. రోజుకు రూ. 288 వేతనం పడుతుందన్నారు. జూన్ వరకు పాత విధానం అమలవుతుందన్నారు. జూలై నుంచి కొత్త ఉపాధి చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాడకం వలన పర్యావరణం దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఈఓఆర్డీ శ్రీనివాసశర్మ, మాజీ సర్పంచు కమతం పుల్లారెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు కమతం లక్ష్మీరెడ్డి, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు బండిఆత్మకూరు: ఎరువులు, యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఆయన మండలం కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, రశీదులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల సాగు లేని సమయంలో డీలర్లు యూరియా, డీఏపీ విక్రయాలు చేపట్టకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియాను అధికంగా విక్రయించిన మూడు దుకాణాల లైసెన్సులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. స్థానిక ఓంకారేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో సుమారు రూ.11 లక్షల విలువైన 65 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ ఉంచాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఓ పవన్‌కుమార్, వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఆళ్లగడ్డ: అహోబిలంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. బండిఆత్మకూరు మండలం కడుమకాలువ గ్రామానికి చెందిన శంకర్ (54) కొంత కాలంగా అహోబిలం గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు పగలంతా ఏదో ఓ పనిచేసుకుని రాత్రికి శివ ఇంట్లోనే ఉంటూ మద్యం సేవించే వారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరు మద్యం సేవిస్తూ ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్న క్రమంలో శివ ఆవేశంతో రోకలి బండ తీసుకుని శంకర్ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పకుండా శివ మద్యం మత్తులో తిరుగుతూ ఉండేవాడు. ఇరుగుపొరుగు వారు శివ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో వెళ్లి చూసే సరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన విద్యార్థులకు మాత్రమే నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. మొదటి, రెండు విడతల్లో మెయిన్స్‌లో అర్హత పొందిన జిల్లాకు చెందిన 1,080 మంది విద్యార్థులు అడ్వాన్డ్న్ పరీక్షకు హాజరుకానున్నారు. కర్నూలు నగర శివారులోని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి సమీపంలో ఉన్న ఐయాన్ డిజిటల్లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2, రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. -
రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత
● కట్టడాల కూల్చివేత చేపట్టిన కాంట్రాక్టర్ ● అడ్డుకున్న ప్రజలు ● తాత్కాలికంగా నిలిపివేత కోవెలకుంట్ల: గుళ్లదూర్తిలో ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనుల్లో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. కోవెలకుంట్ల– జమ్మలమడుగు ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రామం నుంచి వివిధ కాలనీల మీదుగా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి మరో ఆర్అండ్బీ రహదారి ఉంది. ఈ రహదారి విస్తరణ పనులకు ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయించింది. రోడ్డుకు ఇరువైపులా ఆయా కాలనీలకు చెందిన పలువురు ఇళ్లు, గుడిసెలు, ఇతర కట్టడాలు ఏర్పాటు చేసుకుని కొన్ని ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. రోడ్డు నిర్మాణాల్లో వాటిని తొలగించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ ఇచ్చి ఇళ్లు, ఇతర కట్టడాలను కూల్చివేసేందుకు ప్రొక్లెయిన్‌తో పనులు చేపట్టారు. ఇట్టె బాల చెన్నయ్య ఇంటిని పూర్తిగా కూల్చివేసి ఇతర కట్టడాలను పడగొట్టే క్రమంలో ప్రజలు అక్కడికి చేరుకుని నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని అధికారుల సమక్షంలో వాటిని పరిశీలించిన తర్వాత కూల్చివేత పనులు చేపట్టాలని అడ్డుకున్నారు. ఒకానొక దశలో కాంట్రాక్టర్, ప్రజల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్ కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆయా కాలనీల ప్రజలు కోవెలకుంట్ల తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు చేరుకుని కూల్చివేత సంఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
పావన క్షేత్రంలో తలనీలాలు చోరీ
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిల లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అఽధికార టీడీపీ అండ ఉన్న కొందరు సిబ్బంది యథేచ్ఛగా అవినీతికి పాల్పడి దేవుడి సొమ్ము దోచుకుంటున్నారు. తాజాగా శనివారం పావన క్షేత్రంలో సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 10 కిలోల మేరకు తలనీలాల చోరీకి గురికావడం పలు విమర్శలకు తావిస్తోంది. నవనారసింహ క్షేత్రంలో ప్రధానమైన పావన నరసింహస్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తుల రద్దీ ఉంటుంది. మొత్తం 9 క్షేత్రాల్లో ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారో.. పావన క్షేత్రంలోనే అంత మంది తలనీలాలు సమర్పిస్తారు. అటువంటి ఈ క్షేత్రంలో శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలు కల్యాణ కట్టలో భద్రపరిచారు. మధ్యాహ్న సమయంలో కల్యాణ కట్టను శుభ్రం చేస్తున్న సమయంలో అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చూడగా అప్పటి వరకు అక్కడ ఉన్న తలనీలాల మూటలు కనిపించ లేదు. ఈ విషయం అక్కడ ఉన్న సిబ్బంది నాయీ బ్రాహ్మణులను అడిగితే ‘ఇక్కడే ఉంచాం మాకేమి తెలియదు’ అని చెప్పడంతో తలనీలాలు మాయమైన విషయం బయటకు పొక్కింది. విషయం తెలిసిన వెంటనే దిగువ అహోబిలం కార్యాలయం నుంచి అక్కడికి వెళ్లిన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినా ఎటువంటి ఫలితం లేదు. అంతవరకు వందలాది మంది భక్తు లు, పదుల సంఖ్యలో సిబ్బంది, 20 మంది నాయీబ్రాహ్మణులు ఉండగానే తలనీలాలు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ విధుల్లో ఉన్న వారందరినీ అధికారులు పిలిచి విచారించగా నాయీ బ్రాహ్మణులు, సిబ్బంది తమకు తెలియదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పావన క్షేత్రంలో తలనీలాలు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే పూర్తి స్థాయిలో విచారణకు కమిటీ వేశాం. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన సిబ్బందికి మెమోలు జారీ చేశాం. నేరం రుజువైతే శాఖాపరమైన చర్యలతో పాటు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. – పార్థసారథి, ముఖ్య పరిపాలానాధికారి, అహోబిలం దేవస్థానం -
మోసం కేసులో నిందితుడి అరెస్ట్
నందికొట్కూరు: అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన నిందితుడు లొద్దిపల్లి శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు మిడుతూరు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. మండలంలో ప్రజల నుంచి దాదాపు రూ.15.50 లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మిడుతూరు గ్రామ శివారులోని బ్రహ్మంగారి మఠం వద్ద ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బైక్, రూ.2.90 లక్షల నగదు సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. వ్యక్తి ఆత్మహత్య బేతంచెర్ల: కొలుములపల్లె గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రా మానికి చెందిన పెద్ద కొక్కల్ల నాగేంద్ర బాబు(37).. భార్య సావిత్రి సొంత గ్రామమైన కొలుములపల్లెలో మూడు నెలలుగా ఉంటున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న నాగేంద్రబాబుకు ఎక్కడ చూపించినా నయం కాలేదు. మనసాప్తం చెందిన అతను శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మద్దిలేటయ్య క్షేత్రం కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించుకున్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
● పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం ● ప్రేమ వ్యవహారమే కారణం మధ్యాహ్నం వరకు ఎండలు.. సాయంత్రానికి వానలు కర్నూలు(అగ్రికల్చర్): ఉదయం నుంచి మధ్యా హ్నం 4 గంటల వరకు బానుడి భగభగలు కొనసాగాయి.. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలులో దాదా పు ఒక సెంటీమీటరు వర్షం కురిసింది. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. గాలుల తీవ్రతకు మామిడి పంటకు అపార నష్టం వాటిళ్లింది. శనివారం చిప్పగిరిలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కౌతాళలో 42.8, మంత్రాలయంలో 42.5, బండిత్మకూరులో 42.5, పెద్దకడుబూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లాల్లో 42.3 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముగ్గురు ఏడీఏలకు పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ముగ్గురు ఏడీఏలకు పదోన్నతులు లభించా యి.ఈ మేరకు డీపీసీ ఖరారు అయింది. రాష్ట్రం మొత్తం మీద 64 మంది ఏడీఏలకు పదోన్నతులు లభించగా.. ఇందులో కర్నూలు జిల్లాలో ముగ్గురు ఏడీఏలు ఉన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, భూ సంరక్షణ విభాగం ఆదోని ఏడీఏగా పనిచేస్తున్న సంధ్యారాణి, పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్ లకు డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ నెల చివరిలోగా పదోన్నతి పొందిన ఏడీఏలకు పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ● చానళ్లు రావడం లేదని నిరసన ఆదోని అర్బన్: ఏపీ ఫైబర్‌లో ఇంటర్నెట్ మాత్రమే వస్తుందని, చానళ్లు రావడం లేదని శనివారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి ఏపీ కేబుల్ ఆపరేటర్ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, గోపాల్, యువరాజ్, మధు, ప్రకాష్, మల్లికార్జున, బాబా వినతి పత్రం అందించారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఏపీ ఫైబర్‌లో ఇంటర్నెట్ మాత్రమే వస్తుందని, చానళ్లు రాకపోవడంతో ఫైబర్ కేబుల్ వినియోగదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈరోజు, రేపు అని వినియోగదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని, ఇప్పటికై నా ప్రభుత్వం ఫైబర్‌లో చానళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిడుగుపాటుతో మహిళ మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరి ధిలోని పి.రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహి ళ శనివారం సాయంత్రం పిడుగుపాటు కు గురై మృతిచెందారు. మాబు ఉన్నిసా(48) అనే మహి ళ తన ముగ్గురు పిల్లలతో కలసి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులు, వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడింది. ఘటనలో మాబు ఉన్నిసా అక్కడికక్కడే మృతిచె ందారు. మిగిలినవారికి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆసుప త్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉయ్యాలవాడ: తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి మాయలూరు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. తుడుమలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో ఇమ్రాన్‌కు ప్రేమ వ్యవహారం వుండేది. వీరిద్దరూ తరచుగా ఫోన్లలో మాట్లాడుకునే వారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువతి తండ్రితో పాటు మరో ఐదుగురు కలిసి తుడుమలదిన్నె గ్రామంలోనే ఇమ్రాన్‌పై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడానికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని మాయలూరు వైపు పరుగులు తీశాడు. రైల్వే ట్రాక్ సమీపంలోకి రాగానే వెంబడిస్తున్న యువతి కుటుంబసభ్యులకు పట్టుబడ్డాడు. వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అతడిపై పోసి నిప్పంటించారు. శరీరంపై మంటలకు తాళలేక రోడ్డు పక్కన సమీపంలో ఉన్న నీటిగుంతలోకి ఇమ్రాన్ దూకాడు. కేకలు వేస్తుండడంతో అటుగా వెళ్తున్న వారు గమనించి పైకి తీసుకొచ్చి 108లో కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. విష యం తెలిసిన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ ఆసుపత్రికి చేరుకుని బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని సీఐ ఆదేశించారు. -
స్వచ్ఛ జిల్లాలో భాగస్వాములుకండి
నంద్యాల (న్యూటౌన్): స్వచ్ఛ జిల్లాలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ మార్కెట్ బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు. వ్యాపారులు రాత్రివేళల్లో దుకాణాల చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల కాలువలు మూసుకుపోయి డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ పరిస్థితులను నివారించేందుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి, ట్రాఫిక్, సివిల్ పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు మున్సిపల్ కార్యాలయం, జీజీహెచ్ ఆసుపత్రి, గాంధీచౌక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ‘వేస్ట్ ప్లాస్టిక్ మార్పిడి’ కేంద్రాల్లో ప్రజలు కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేస్తే కిలో చక్కెర లేదా కిలో సేమియా లేదా ఆరు కోడి గుడ్లను ప్రోత్సాహకంగా ఇస్తారన్నారు. దుకాణాదారులు, వ్యాపారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టిగా ముందుకు వస్తే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నంద్యాలను నిర్మించగలమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న బ్లాక్ స్పాట్లు
● ఆయా ప్రాంతాలను పరిశీలించిన జిల్లాస్థాయి భద్రత కమిటీ ● పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ కర్నూలు : జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ ఆయా ప్రాంతాలను పరిశీలించింది. ప్రధానంగా శనివారం పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్రను కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు. పంచలింగాల టోల్గేట్ నుంచి వెల్దుర్తి వరకు కలెక్టర్, ఎస్పీ, పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలసి బస్సులో ప్రయాణించి బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 44వ జాతీయ రహదారిలో 9, 40వ నంబర్ జాతీయ రహదారిపై 2 బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 19 బ్లాక్ స్పాట్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు జిల్లాస్థాయి భద్రత కమిటీ నిర్ధారించింది. ప్రమాదకర మలుపులు, సరైన సూచిక బోర్డులు, తగిన కాంతి లేకపోవడం, గుంతలు, రోడ్ల ఆకృతిలో లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ శాఖలు సమన్వయంగా వ్యవహరిస్తేనే వాహనదారులకు రక్షణ ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం... గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్స్, లైటింగ్, నో పార్కింగ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్, సర్వీస్ రోడ్ల వద్ద రైలింగ్ ఏర్పాట్లు వంటి షార్ట్ టర్మ్‌లో చేయదగిన పనులను నెల లోపు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. సంతోష్ నగర్ వద్ద పారిశుద్ధ్య లోపం... సంతోష్ నగర్ వద్ద రహదారిపై పారిశుద్ధ్యం లోపించిందని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నగరపాలక కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. కృష్ణానగర్ హంద్రీ బ్రిడ్జి, ఐటీసీ బ్రిడ్జి ప్రాంతాల్లో సోలార్ వీధి లైట్లు ఏర్పాటుకు నిర్ణయించారు. బళ్లారి చౌరస్తా సమీపంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ సూచించారు. ఉల్లంఘనలపై తనిఖీలు విస్తృతం చేసేందుకు ప్రణాళిక కర్నూలు నగరంలో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఉల్లంఘనల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు రోడ్డు భద్రత కమిటీ నిర్ణయానికి వచ్చింది. దీర్గకాలం విరామం లేకుండా వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. జిల్లా ప్రవేశ ప్రాంతాల్లో వాహనదారులను ఆపి ముఖాన్ని నీటితో కడిగించి టీ, నీరు తాగించే చర్యల ద్వారా ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో అవగాహన పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఇన్చార్జి ఆర్డీఓ అనురాధ, రవాణా శాఖ ఉప కమిషనర్ శాంతకుమారి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, నేషనల్ హైవేస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, రవాణా శాఖ మోటర్ వాహన తనిఖీ అధికారులు పాల్గొన్నారు. నగర పరిధిలో 8 బ్లాక్స్పాట్లు... కర్నూలు నగర పరిధిలో 8 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికతో అక్కడున్న లోపాలను సరిచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పోలీసు శాఖ అధికారులతో కలసి సంయుక్తంగా పరిశీలన నిర్వహించి తక్షణ ప్రమాద నివారణ చర్యలతో పాటు వంతెనలు, ఫ్లై ఓవర్ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులపై ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రివేళల్లోనే నగర ప్రజలను బ్లాక్ స్పాట్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా గుర్తించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగించకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం, నిద్రమత్తులో డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అభిప్రాయపడ్డారు. బ్లాక్ స్పాట్లు అంటే... తరచూ ఒకే చోట ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తారు. వీటి సంఖ్య తగ్గించడాని కి ప్రధానంగా ఎన్‌హెచ్, ఆర్అండ్బీ, రవాణా, పో లీసు, ట్రాఫిక్, స్థానిక సంస్థలు సంయుక్తంగా పనిచేయాలని అధికారులు నిర్ధారించారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీలో వీటిపై సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకుని అమలు చేసేలా ప్రణాళిక రూ పొందించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. -
గ్యాస్ కష్టాలు తీరేదెన్నడూ!
బనగానపల్లె: పట్టణంలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులు సిలిండర్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. శనివారం పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ల పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు నాలుగు రోజుల క్రితం ఆందోళన చేశారు. ఈ మేరకు గురువారం డీఎస్వో రవిబాబు, ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి ఏజెన్సీ కార్యాలయం, గోడౌన్ తనిఖీ చేశారు. గోడౌన్లో 499 సిలిండర్లు ఉండాల్సి ఉండగా 11 ఉన్నట్లు నిర్ధారించారు. గ్యాస్ గోడౌన్ వద్దనే వినియోగదారులు సిలిండర్ల తీసుకెళ్లడం చూసి అవాక్కయ్యారు. బుకింగ్ చేసిన తరువాత 40 – 60 రోజుల వరకు కూడా సిలిండర్ల ఇవ్వడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అయితే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల పంపిణీలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కేవలం జరిమానాతో సరిపెట్టే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని గ్యాస్ వినియోగదారులకు నిబంధనల మేరకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆపరేషన్ ● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రేడియోథెరపీ ● కోలుకున్న ముగ్గురు చిన్నారులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూడు నుంచి 9 ఏళ్ల వయస్సున్న ముగ్గురు చిన్నారులకు రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యులు సంక్లిష్టమైన, అత్యాధునిక రాపిడ్ ఆర్క్ థెరపి ద్వారా వైద్యం చేసి ప్రాణాలు పోశారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... అత్యాధునిక పరికరాల సాయంతో.. ‘దేవనకొండ మండలానికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి, ఆదోనికి చెందిన మూడేళ్ల పాపకు, కర్నూలు శివారులోని ఓ గ్రామానికి చెందిన బాలికకు బ్రెయిన్ స్టెమ్, మెడుల్లా అబ్లాంగేట, సెరిబెల్లం అనే చిన్న మెదడుకు సంబంధించిన భాగాల్లో క్యాన్సర్ ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టే స్థోమత లేక వీరు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు వీరి పరిస్థితి దృష్ట్యా సాధ్యమైనంత వరకు తలలో ఏర్పడిన కణితులను తొలగించి, మిగిలిన కణితులను తొలగించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యులు ప్రపంచ స్థాయి అత్యాధునిక పరికరాల సాయంతో చిన్నారులకు ప్రెసిషన్ రేడియోథెరపీ, రాపిడ్ ఆర్క్ థెరపీ ద్వారా చికిత్స అందించారు. వీరందరూ సాధారణంగా తమ తోటి వయస్సు పిల్లలు చేసే పనులు చేయగలుగుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో వ్యాధిని నియంత్రించడమే గాకుండా జీవనశైలిలో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చెయ్యడం ఇప్పుడు ఉన్న అత్యాధునిక పరికరాలతో, నిష్ణాతులైన వైద్యలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉండటం వల్ల సాధ్యమైంది. లక్షల రూపాయల ఖర్చు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టనవసరం లేకుండా, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడే మంచి వైద్యసేవలను పొందే అవకాశం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉంది’ అని ఆయన వివరించారు. చికిత్స అందించిన వారిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూరోసర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రాంబాలాజీ నాయక్, డాక్టర్ పుండరీకాక్షయ్య, డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ అచ్యుత్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ జి.ఆశాలత, డాక్టర్ కె.సంధ్యారాణి, డాక్టర్ ఏంజిలీనా షైని, డాక్టర్ శ్వేత, డాక్టర్ మోహన్‌కృష్ణ, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శివశంకర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల తలలో క్యాన్సర్ -
గడువులోగా జన గణన పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో చేపట్టిన జన గణన (ఎన్యూమరేషన్) ప్రక్రియను వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జన గణన పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన జన గణన ప్రక్రియను ఈనెల 19వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా జాప్యం లేదా లోపాలు కనిపిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హెచ్ఎల్బీ (హౌస్ లిస్టింగ్ బ్లాక్) పనుల అమలులో బేతంచెర్ల, డోన్ అర్బన్, రూరల్, బనగానపల్లె మండలాలు, అలాగే బేతంచెర్ల నగర పంచాయతీ ప్రాంతాలు పనితీరులో వెనుకబడి ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా పరోక్ష సేవలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో మల్లన్న స్పర్శదర్శనం, పలు ఆర్జిత సేవలతో పాటు, పరోక్షసేవలను సైతం మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్ ద్వారా భక్తులు పొందవచ్చునని శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఈఓ మాట్లాడుతూ దర్శనాలతో పాటు మొత్తం 18 ఆర్జిత సేవా టికెట్లు, విరాళాలు కూడా మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్‌పై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్త్రతంగా ఫ్లెక్సీ బోర్డులతో పాటు అవగాహన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లతో పాటు ఆర్జిత గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేరం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 18 రకాల ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వైఎస్సార్సీపీలో జిల్లా నేతలకు రాష్ట్ర పదవులు
నంద్యాల: జిల్లాకు చెందిన పలువురు నేతలను వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామకాల ప్రకటన వెలువడింది. నంద్యాలకు చెందిన బిలావత్ శంకర్‌నాయక్‌ను రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా, పాణ్యంకు చెందిన ఎరుకల రాజును రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీగా, బనగానపల్లెకు చెందిన కాతా నిరంజన్ చంద్రమౌళీరెడ్డిని రాష్ట్ర వలంటరీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించింది. తిరుపతి క్రైం: తిరుపతి నగరంలోని గరుడ వారధి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కరకంబాడి వైపు నుంచి లీలామహల్ సర్కిల్ దిశగా వస్తున్న ఫ్లై ఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ఆదిలక్ష్మి (24) కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చింది. ఆమె, తన అన్నతో కలిసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం అనూహ్యంగా గరుడ వారధిపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. జూపాడుబంగ్లా: కర్నూలు – గుంటూరు పాత రహదారి విస్తరణ సర్వే మొదలైంది. జాతీయ రహదారి 340సీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కేజీ రోడ్డును కూడా డబుల్‌రోడ్డుగా విస్తరించాలని ముందుగానే నిర్ణయించారు. ఇప్పటికే బ్రాహ్మణకొట్కూరులో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా అన్ని మిగిలిన గ్రామాల్లో వారంలోగా పనులు ప్రారంభించనున్నారు. శుక్రవారం తంగడంచ గ్రామంలో రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్సీ కంపెనీ ఇంజినీర్లు సర్వే చేపట్టారు. కేజీ రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి కుడి, ఎడమ వైపు 11 మీటర్ల మేర స్థలం సేకరించి రోడ్డును విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపుల రహదారి వెంబడి డ్రైనేజీ కాల్వను నిర్మించనున్నారు. హైవే రోడ్డు నిర్మాణం పూర్తయి ఇప్పటికే రెండేళ్లు కావొస్తుంది. ఇప్పటికే గ్రామాల్లోని కేజీ రోడ్డు విస్తరణ నిమిత్తం పీఎన్సీ కంపెనీ సిబ్బంది రెండు పర్యాయాలు సర్వేచేయగా ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. మూడో సారి సర్వే చేస్తుండగా త్వరగా పనులు ప్రారంభించి రోడ్డు విస్తరిస్తారా లేదా అనే ప్రశ్న గ్రామస్తులను వేధిస్తోంది. ఆత్మకూరులో మోస్తరు వర్షం ఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి ఆత్మ కూరు పట్టణంతో పాటు నల్లమల అటవీ పరిధిలోని సమీప గ్రామాల్లో గాలులతో కూడిన వర్షం పడింది. ఎండతో అల్లాడిపోయిన ప్రజల కు ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. -
లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
● న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. కల్లూరు ముజఫర్ నగర్ సచివాలయంలో పోక్సో యాక్ట్‌పై శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాగృతి పథకం 2025 కింద సురక్షిత బచ్చన్ – సురక్షిత భవిష్యపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పోక్సో చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కిశోర వికాసం కింద బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద వివరించారు. అనంతరం బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞను పిల్లలతో చేయించారు. -
రెండేళ్లుగా చైర్మన్ లేని మార్కెట్ యార్డు..
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల నుంచి ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డుకు పాలక మండలి కమిటీ నియమించ లేదు. గత సంవత్సరం జనసేన పార్టీకి చెందిన మైలేరు సురేఖను మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు తెలియకుండా చైర్మన్‌ను ఎలా నియమిస్తారు ? జీఓ తెచ్చుకోవడం కాదు? ఎలా బాధ్యతలు స్వీకరిస్తారో చూస్తా .. అని బెదిరించడంతో సురేఖ కనీసం మార్కెట్‌యార్డు వైపు కన్నెత్తిచూసే సాహసం కూడా చేయలేదు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి పోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం గడువు ముగిసేలోగైనా పాలక మండలి కొలువుదీరేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాలకమండలి ఏర్పడితే రైతుల కష్టాలు కాస్త అయినా తీరుతాయని ఆశిస్తున్నారు. ఆళ్లగడ్డ: వ్యవసాయోత్పత్తుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానం. నియోజకవర్గానికి తూర్పు దిక్కున తెలుగుగంగ, పడమర దిక్కున కేసీ కాల్వ ప్రవహిస్తుండటంతో రైతులు ప్రధానంగా వరి, మొక్క జొన్న, జొన్న, శనగ, మినుము సాగు చేస్తారు. ఈ పంటలపైనే రైతుల ఆర్థిక స్థితిగతులు కూడా ఆధారపడి ఉంటాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో మార్కెట్‌యార్డు సేవలు నిలిచిపోవడంతో రైతులకు శాపంగా మారింది. దీంతో రైతులు దళారులబారిన పడి నష్టపోతున్నారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, మినము, వరి, జొన్న పంట కోతలు పూర్తి కావస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అదిగో ఇదిగో అంటూనే సీజన్ ముగుస్తున్నా జాడ లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. నియోజవర్గానికి పక్కనున్న నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరులో కాస్త ఆలస్యంగా అయినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆళ్లగడ్డలో మాత్రం ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రకటిస్తే మార్కెట్లో 1,600 మాత్రమే లభిస్తోంది. ప్రతి రైతు ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున నష్టపోతున్నారు. అలాగే కేంద్రం ఇటీవల ధాన్యానికి ఏ – గ్రేడు క్వింటా రూ. 2,461, సాధారణ రకం రూ.2,441 మద్దతు ధర ప్రకటించింది. రైతుల అవసరాన్ని, అవకాశాన్ని బట్టి దళారులు రూ.1,800 నుంచి రూ.1,900 మించి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ తీరుతో వరి రైతులు క్వింటాకు రూ. 600, మొక్కజొన్న రూ. 700, కందులు రూ. 500, మినుములు రూ. 1300 వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించడం లేదు. -
హోటళ్లకు గ్యాస్ స్ట్రోక్
ఉద్యోగ రీత్యా, చదువుల కోసం బయట ఉండే బ్యాచ్లర్స్, హోటళ్లలో తినే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ భారం పడుతుంది. టీ, కాఫీ నుంచి బిర్యానీ వరకు అన్ని ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఇప్పటికే పెంచేశారు. హోటల్‌కు వెళ్లి తినాలంటేనే భయమేస్తుంది. – కమాల్‌బీ, గృహిణి, నంద్యాల కమర్షియల్ గ్యాస్‌పైన ఒకేసారి రూ.1000 పెంచితే మా లాంటి చిరు వ్యాపారులు ఎలా బతకాలి. కస్టమర్లు రేట్లు పెంచితే రారు. పెంచకపోతే మాకు పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి. తప్పని పరిస్థితిలో ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నాం. – రమణ, టిఫెన్ సెంటర్ నిర్వాహకులు, నంద్యాల నంద్యాల: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో హోటల్ రంగం కుదేలవుతోంది. ఈ క్రమంలోనే మధ్య, సామాన్య ప్రజలపై కూడా భారం పడుతోంది. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.993 పెంచేసింది. దీంతో గత నెలలో రూ.2,322 ఉన్న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.3,315కు చేరడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గతంలో ఎన్నడూ లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నెల రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడినప్పటికీ క్షేత్రస్థాయిలో కొరత లేదంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే అకస్మాత్తు గా చమురు ధరలు ఇప్పుడిప్పుడే పెరిగిపోయాయని, కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచారు. శుక్రవారం పెట్రోల్, డీజల్ ధరలు పెంచడంతో డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుతో చిన్న, మధ్యతరహా హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదు సార్లు ధరలు పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో ఇప్పటికే వ్యాపారులు వారి ఉత్పత్తుల ధరలు పెంచేశారు. ఈ ప్రభావం పరోక్షంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టిఫిన్లు, టీ, కాఫీలతో పాటు భోజనాలు సైతం 15 నుంచి 25 శాతం పెంచేశారు. బ్లాకుల్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు కొందరు అల్పాహారం ధరలను విపరీతంగా పెంచేశారు. వ్యాపారుల ఇబ్బందులు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో దాని ప్రభావం గొలుసు కట్టు చర్యలా అన్ని రంగాలపై పడింది. ధరల పెంపు వల్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ● గ్యాస్ ధర పెరగడంతో హోటళ్లలో టీ, కాఫీ నుంచిటిఫెన్లు, భోజనం ధరల వరకు అన్ని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ● ఒకే సారి రూ.993 పెరగడం వల్ల ధరలు పెంచితే కస్టమర్లు రారని, పెంచకపోతే పెట్టుబడి కూడా రాదని హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ● అద్దె, కరెంట్ బిల్లులు, కూరగాయల ధరలతో పాటు ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా తోడవడటంలో చిన్నపాటి మెస్‌లు, టిఫెన్ సెంటర్లు నడపలేక చాలా మంది వ్యాపారాన్ని మూసివేసే పరిస్థితి నెలకొంది. ● రేట్లు పెంచితే కస్టమర్లు రారనే భయంతో కొందరు వ్యాపారులు ధరలు పెంచకుండా దోసె, వడ తదితర పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం వంటివి చేస్తున్నారు. ● ఖర్చు తగ్గించుకోవడానికి కొందరు నాణ్యత లేని నూనెలు, తక్కువ ధరలకు దొరికే ముడి పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ● గ్యాస్ భారం భరించలేక మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిల వైపు వెళ్లాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. దీపం 1,56,945 పీఎంయూ 13,589 సీఎస్కే 4313 జనరల్ 3,14,320 కమర్షియల్ 24,300 నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేట్ సమీపంలోని ప్రధాన హోటళ్లలో మొన్నటి వరకు భోజనం రూ.120 ఉండేది. అదే హోటల్లో నేడు భోజనం రూ.140 నుంచి రూ.160 ధరలు పెంచారు. సంప్రదాయ భోజనం పేరుతో వెలసిన హోటల్లో భోజనం రూ.120 నుంచి రూ.160కి పెంచేశారు. అవే హోటళ్లలో ఇడ్లీ, దోశ, చపాతీ ధరలకు కూడా 25 శాతం పెంచేశారు. సామాన్యులు తినే మెస్‌ల్లో భోజనం రూ.80 ఉండేది. ఈ హోటళ్లలో భోజనం రూ.130కి పెంచేశారు. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే ప్లేట్ ఇడ్లీ మొన్నటి వరకు రూ.30 నుంచి రూ.40 ఉండేది. ఇప్పుడు అదే ప్లేట్ ఇడ్లీ రూ.50కి విక్రయిస్తున్నారు. దోశ, పూరి ప్లేటు రూ.10 నుంచి రూ.15కి పెంచేశారు. ఒకేసారి రూ.993 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,315కు చేరిన 19 కేజీల సిలిండర్ ధర ఆహార పదార్థాల ధరలు పెంచిన హోటళ్ల నిర్వాహకులు చిన్న చిన్న హోటళ్లు మూత -
రెప్పపాటులో విషాదం!
● రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసులు ముగ్గురు మృతి ● 8 మందికి తీవ్ర గాయాలు ● ప్రమాదానికి నిద్రమత్తే కారణంకర్నూలు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారి చవటపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన కృష్ణ (68), కోడళ్లు రమ్యశ్రీ (35), హేమలత (31) మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై జిల్లా అరుణాచలం శివపార్వతి స్వామివార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్తుండగా చవటపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు వెళ్తున్న జైలో కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలో కృష్ణ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. గురువారం సాయంత్రం కర్నూలు నుంచి అరుణాచలానికి చేరుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన కృష్ణ కుమారుడు మనోజ్ కుమార్ విశ్రాంతి లేకుండా వాహనం నడుపుతుండటంతో చవటపల్లి సమీపంలో నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొట్టడంతో జైలో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్, విజయలక్ష్మి, హేమంత్, చిన్నారులు లోహిత్ చార్మి, కళ్యాణ్, సుహస్రలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారిని 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యూరియా క్రయవిక్రయాలపై నిఘా
కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే యూరియా క్రయవిక్రయాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈనెల 14న ‘సాక్షి’లో ‘లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసా య శాఖ కమిషనరేట్ స్పందించింది. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి యూరియాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెప్పించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతానికి యూరియాకు ఎలాంటి సమస్య లేదని, డిమాండ్‌కు తగ్గ నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. -
అదనపు తూకం.. ఆగని మోసం
వరి ధాన్యం బస్తా 75 కిలోలు, మొక్కజొన్న, మినుము, జొన్న అయితే 100 కిలోలు లెక్కన తూకం వేస్తారు. అయితే తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరగు కింద 2 కిలోలు, తేమ శాతం కింద మరో 2 కిలోలు లెక్కన దోచుకోవడం ఒక ఎత్తైతే ఎలక్ట్రానిక్ కాటాలో టెక్నిక్‌గా 4 నుంచి 5 కిలోలు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బస్తాకు 6 నుంచి 10 కిలలో వరకు అదనంగా లాగుతున్న విషయం బహిరంగగానే సాగుతోంది. రవాణా చార్జీలు, హమాలీ కూలీల ఖర్చు నిమిత్తం బస్తాకి మరో రూ. 60 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు. వీటన్నింటి మూలంగా రైతన్నకు ఈ ఏడాది రమారమి బస్తాకు రూ.350 నుంచి రూ.550 వరకు కోల్పోవాల్సి వస్తోంది. పొలాల్లోనే ధాన్యం నిల్వ చేసుకున్న దృశ్యం పంట మద్దతు ధర దళారుల ధర క్వింటాకు నష్టం వరి 2,461 1,900 560 మొక్కజొన్న 2,400 1,600 800 కందులు 8,450 7,900 550 మినుములు 8,200 6,900 1,300 కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు అన్నదాతలకు లభించని కనీస మద్దతు ధర పాలకవర్గం లేని ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డు పట్టించుకోని పాలకులు, అధికారులు దళారుల బారిన పడుతున్న రైతులు -
కర్నూలులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
● కలెక్టరేట్ వద్ద మూడు గంటల పాటు ధర్నా ● చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● పోలీస్ స్టేషన్ల వద్ద టీడీపీ నాయకులు అంగడి పెట్టారని విమర్శ ● పోలీసుల పేరుతో కలెక్షన్లు ఎక్కువయ్యాయని ఆరోపణ ● ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నేతలు -
వైభవంగా నందీశ్వర ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందీశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వర స్వామికి బహుళ త్రయోదశి, మహా ప్రదోషం సందర్భంగా గురువారం ప్రదోషకాలంలో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ రవి శంకర్ అవధాని, ఆలయ అర్చకులు మూల స్థానం సుబ్బయ్య శర్మ, హనుమంతు శర్మ ముందుగా గణపతి పూజ, పీఠార్చన, ద్రవ్య పూజలు చేశారు. నందీశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతంతో పాటూ జలాభిషేకం, పాలాభిషేకం పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వర అభిషేకం తిలకించి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఆళ్లగడ్డలో పీజీఆర్ఎస్ నంద్యాల: ప్రజా వినతులను నేరుగా స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీన ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పబ్లిక్ గ్రీవెన్స్ వినతుల పరిష్కారానికి పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు నేరుగా అధికారులను కలిసి తమ అర్జీలు అందజేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారు లు, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు బాలల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికార అధికారిణి లీలావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, దైర సాహసాలు, క్రీడలు, కలల సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, పెయింటింగ్ తదితర అంశాల్లో ప్రతిభ చూపిన వారు జూలై 31వ తేదీలోపు వెబ్సైట్ https://awards.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏడాది డిసెంబర్ 26వ బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకుంటారన్నారు. ట్రాఫిక్ సీఐపై చర్యలు తీసుకోవాలి నంద్యాల(న్యూటౌన్): ఆటో కార్మికులను వేధిస్తున్న పట్టణ ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నంద్యాల పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ధనంజయుడు, శ్రీనివాసులు కోరారు. సీఐ తీరును నిరసిస్తూ గురువారం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐ చాంద్‌బాషా ఆటో కార్మికులపై దాడులకు పాల్పడుతూ, అధిక మొత్తంలో చలానాలు వేస్తున్నారన్నారు. సీఐను సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రోడ్డు సైడు ఉండే చిరు వ్యాపారులను బెదిరిస్తున్నారన్నారు. ఆందోళనలో ఏఐటీయూసీ నంద్యాల పట్టణ డిప్యూటీ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆటో యూనియన్ నాయకులు బండి శ్రీను, నాగార్జున, రహీమ్, ఏడుకొండలు, రమణారెడ్డి, శ్రీనివాసులు, మధు, నాగేంద్ర పాల్గొన్నారు. వంద పడకల ప్రభుత్వాసుపత్రి తనిఖీ డోన్ రూరల్: స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో గురువారం వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుజాత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను తనిఖీ చేసి వసతులు, వైద్య సౌకర్యాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని వారు సూచించారు. ఆమె వెంట, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనీఫ్, డాక్టర్ గౌస్, డాక్టర్ శిల్ప, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
అధైర్యపడకండి నేనున్నాను..
● సున్నిపెంట ప్రజలకు శిల్పా చక్రపాణి అభయం ● అఖిలపక్షాలతో ఈనెల 20న సమావేశం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలంప్రాజెక్ట్ (సున్నిపెంట)లో ప్రభుత్వ గృహాల్లో నివశిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్న నోటీసులు చెల్లవని, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, అండగా తానుంటానని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిలా చక్రపాణిరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. సున్నిపెంటలో నివాసితులకు గతంలో ఇంటి పట్టాలు ఇచ్చింది రెవెన్యూ అధికారులని, అలాట్మెంట్ చేసింది జలవనరుల శాఖ అధికారులు అని, అప్పుట్లో జారీ చేసిన ఉత్తర్వులు కాదని వారే ఇప్పుడు ప్రజలు ఆక్రమణలకు పాల్పడ్డారని నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గుడ్డిగా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఏమీ తెలియని వాడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 30వేలపైనే జనాభా కలిగిన సున్నిపెంట ప్రజలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20వ తేదీ ఉదయం 9లకు సున్నిపెంటలోని రెడ్ల కళ్యాణమండపంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు శిల్పా తెలిపారు. సమావేశంలో అందరి అభిప్రాయాలతో సున్నిపెంట ప్రజలు నివాస గృహాలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నివశించే హక్కును కలిగి ఉన్నారన్నారన్నారు. -
పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
మంత్రి టీజీ భరత్ అనుచరులు ప్రతి డిపార్టుమెంట్లో కలెక్షన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపాల్టీలో, మద్యం, బియ్యం, తదితర వాటిల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కర్నూలు అభివృద్ధిని మంత్రి పూర్తిగా విస్మరించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ పాలనలో ఏమీ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశాం. పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. – హఫీజ్‌ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే -
తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజాభిప్రాయ సర్వేలు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నీటి వనరులు, ఓవర్ హెడ్ ట్యాంకు లు, బోర్‌వెల్స్, పైప్లైన్ల పరిస్థితిని స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. నీటి వనరుల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. యాగంటి, మహానంది, ఓంకారం, శ్రీశైలం, నందవరం, అహోబిలం, ఆత్మకూరు వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీడీఎస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను స్వచ్ఛ రథాలుగా వినియోగిస్తూ గ్రామాల్లో చెత్త సేక రణ చేపడుతున్నామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద జిల్లాలో దాదాపు 36 వేల ఇళ్లు పూర్తయినా, అందులో సుమారు 4,500 ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో చోరీలకు అడ్డుకట్ట
బొమ్మలసత్రం: లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)పై ప్రజలకు అవగాహన కల్పిస్తే చోరీల కు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ జావలి ఆల్ఫోన్స్ అన్నారు. గురువారం స్థాని క కార్యాలయంలో సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇళ్లలో ఎవరూ లేనప్పుడు ఎక్కువగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లు వదిలి వెళ్లే యజమానులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీసు యాప్‌ను ఎలా వినియోగించాలో పోలీసులు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ యాప్ ద్వారా ఇల్లు వదలి బయటకు వెళ్లేప్పుడు రిక్వెస్ట్ పంపితే కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బందికి చేరడంతో ఇంటి వద్దకు వచ్చి అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కెమెరాలకు మోషన్ డిటెక్షన్ సెన్సార్లు ఉండటంతో ఇంటి వద్ద ఏ చిన్న అలజడి వచ్చినా పోలీసు కంట్రోల్ రూంలకు అలర్ట్ మెసేజ్ వెళ్తుందన్నారు. సమావేశంలో సీఐలు సుధాకర్‌రెడ్డి, గోపాలకృష్ణ, అస్రార్‌బాషా, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెమిడియల్ క్లాస్‌ను సద్వినియోగం చేసుకోండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెమడియల్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గుర్సాలపేటలో ఉన్న కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ రెమిడియల్ క్లాసులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతి, సబ్జెక్టుల వారీగా ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ్యంగా తెలుగు, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణ అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3,375 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదన్నారు. ఈ విద్యార్థులంతా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి, ఇంటి పనులు చెప్పకుండా చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. -
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న పంచాయతీలు: 490
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన రైతు గజ్జల శేఖర్‌రెడ్డి. గతేడాది జాతీయ ఉపాఽధి హామీ పథకం కింద 72 కొబ్బరి మొక్కలు నాటాడు. ఇప్పటి వరకు సుమారు రూ. 40 వేల వరకు ఖర్చు అయ్యింది. అయితే మొక్కలు నాటిన వెంటనే మొక్కల కొనుగోలు, రవాణా, నాటేందుకు గుంతలు తవ్వడం వంటి ఖర్చులతో పాటు మెయింటెనెన్స్ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు ఏడాదికి రూ. 25 చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. రైతు నాలుగు ఎకరాల పొలం చుట్టూ టెంకాయ మొక్కలు నాటాడు. అయితే ఇంతవరకు రూపాయి కూడా అందలేదు. బిల్లుల కోసం 6 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిమ్మ చెట్టుకు బిందెతో నీళ్లు పోస్తున్న ఈ రైతు మర్రిపల్లె గ్రామానికి చెందిన పత్తి శివరాముడు. ఇతను గత సంవత్సరం క్రితం 2 ఎకరాల్లో 130 నిమ్మ మొక్కలు నాటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చెట్లను బతికుంచుకున్నాడు. అయితే ఇప్పటి వరకు గుంతల, ఎరువులు, మొయింటినెన్స్ తదితరాల ఖర్చులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎండ లకు మొక్కలు ఎండి పోతుండటంతో రోజు బిందెలతో నీళ్లుపోస్తూ బతికుంచుకుంటున్నాడు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా.. ఇదిగో అదిగో అంటూనే ఏడాది దాటిపోయింది. బిల్లులు వచ్చే వరకై నా మొక్కలు బతికించుకునేందుకు కష్టాలు పడుతున్నాడు.ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోతున్న వారిలో రైతులు ముందుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం కరువై ఉద్యాన రైతులు మొక్క దశలోనే అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నారు. పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన తోడ్పాటు అందజేస్తామని అధికారులు రైతులు వెంటపడ్డారు. పండ్ల మొక్కలు నాటుకుంటే మొక్కల ధర, రవాణా, గుంతలు తీసి నాటే కూలీలతో పాటు వాటి సంరక్షణకు ప్రతి నెల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ఉపన్యాసాలు ఇచ్చారు. పాలకులు, అధికారుల మాటలు నమ్మిన రైతులు విరివిగా నిమ్మ, చీనీ, మామిడి, సపోట, జామ, దానిమ్మ వంటి పలు రకాల పండ్ల మొక్కలతో పాటు కొబ్బరి, మునగ, ఆయిల్ పామ్ వంటి మొక్కలు నాటుకున్నారు. మొక్కలు నాటుకునేంత వరకు ఒత్తిడి చేసిన అధికారులు ప్రతి నెలా ఇస్తామన్న ప్రోత్సాహ నగదు పైసా ఇవ్వలేదు. ఏడాదికి పైగా రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఈ వారం, వచ్చే వారం అంటూ అధికారులు సమాధానం చెబుతూ ముఖం చాటేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీరుగారిపోతోంది. బిల్లులు దూరమై.. సంరక్షణ భారమై పండ్ల మొక్కలు సాగు చేస్తే.. మొక్క ఎంపిక నుంచి నాటుకుని పంట చేతికొచ్చే వరకు (3 ఏళ్లు ) అయ్యే ఖర్చు పూర్తిగా (వంద శాతం) ప్రభుత్వమే ఏ నెలకు ఆ నెలలోనే ఇస్తుందని అధికారులు చెప్పారు. దీంతో అన్నదాతలు రూ.లక్షలు ఖర్చు చేసి పండ్ల మొక్కలు నాటుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల పరిధిలో 1,472 మంది రైతులు 2.65 లక్షల పండ్ల మొక్కలను సాగు చేశారు. మొక్కలు కొనుగోలు చేయడం, రవాణా, నాటించడం, నీరందించడం, ఎరువులు, మందుల పిచికారీ చేయడం, సంరక్షణకు అన్నింటికీ రైతులే ఖర్చు భరించారు. బిల్లుల గురించి అడుగుతుంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేక పోతుండటంతో గంపెడాశతో పండ్ల మొక్కలు నాటుకున్న రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఏవైనా వంద మొక్కలు నాటుకుంటే వాటి సంరక్షణకు ప్రతి నెల ఒక్కో మొక్కకు మెయింటెనెన్స్‌కు రూ. 18, నీళ్లకు రూ. 16, ఎరువులకు రూ. 25 లు చొప్పున రైతులకు అందించాలి. ఏడాదిగా ఈ బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో 1,472 మంది రైతులకు సుమారు రూ. 54 కోట్లకు పైగానే రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. అప్పులు చేయలేక.. సాధారణంగా ఏ పండ్ల తోటలు సాగు చేసినా ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. నెలనెలా ఉపాధి పథకం బిల్లులు అందుతాయని రైతులే సొంతంగా పెట్టుబడులు పెట్టుకున్నారు. అనేక మంది అప్పులు చేసి మొక్కలు నాటుకున్నారు. నెలనెలా వస్తుందనుకున్న బిల్లు ఏడాది దాటినా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు నీటి తడులకు పక్కనున్న బోర్లపై ఆధారపడాల్సి ఉంది. వీరు నీళ్ల బాడుగ చెల్లించక పోవడంతో నీళ్లు వదలడం లేదు. దీంతో అనేక మంది బిందెళతో నీళ్లు పోసుకుంటూ మొక్కలను పెంచుకుంటుండటంతో తేమ సరిపోక మొక్కలు ఎండిపోతున్నాయి. ఖర్చులు భరించలేకుంటున్నామని, మరి కొద్ది రోజులు చూసి పంటలను తొలగించుకోవడం జరుగుతుందని అధికారులతో వాపోతున్నారు. ఉద్యాన పంటలు సాగుచేసిన రైతులకు అందని బిల్లులు ఏడాదిగా చెల్లించని మెటీరియల్ బకాయిలు అప్పులు చేసి సంరక్షిస్తున్న రైతులు జిల్లాలో రూ. 54 కోట్లు పెండింగ్ -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం చింతకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయుడు హనుమంతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం డీఈఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవడం అభినందనీయమన్నారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవనాల శ్రీనివాసులు, పిట్టల శ్రీనివాసులు, కల్లె మద్దిలేటి, గని శ్రీనివాసులు, చక్రధర్, జనార్ధన్న్, కుంపటి రమణయ్య, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్
కోవెలకుంట్ల: అధికారపార్టీ రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ లింగాల గ్రామంలో రెండో సారి విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో సోమేశ్వర, రామాలయం, చెన్నకేశవ స్వామి ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో రూ. 1.14 కోట్లు వెచ్చించి ఆలయాలను పునర్నిర్మించి 2024 ఫిబ్రవరి 19వ తేదీన విగ్రహాలను పునఃప్రతిష్టించారు. ఆలయాల జీర్ణోద్ధరణ గావించి రెండు సంవత్సరాలు దాటింది. అయితే సోమేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలు కదిలాయని వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పునఃప్రతిష్టాంచాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పట్టుబట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర గ్రామ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు. వీరి మాటలు లెక్కచేయకుండా టీడీపీ నాయకులు విగ్రహాలను తొలగించి పునఃప్రతిష్టకు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాల్లో ఎలాంటి పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్ట వద్దని కోర్టు దేవాదాయశాఖకు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదే రోజు రాత్రి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఈఓ మోహన్ పోలీసుల సహకారంతో గ్రామాన్ని చేరుకుని కోర్టు ఉత్తర్వుల మేరకు ఎలాంటి పునఃప్రతిష్ట చేయవద్దని కోర్టు ఇచ్చిన ఉత్తర్వు నోటీసులను ఆలయం వద్ద అంటించారు. దీంతో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చేసేదిలేక దేవదాయ శాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి బుధవారం సాయంత్రం ఆలయ తలుపులు తెరిచి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేయడంతో గ్రామ పెద్దలు తిరిగి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లతో రెండోసారి విగ్రహాల పునఃప్రతిష్టకు ఏర్పాట్లు -
లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో యూరియా కొరత వెక్కిరిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ఇప్పటికే రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక యూరియా కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటల సాగు, డిమాండ్, సప్లై ప్లాన్ ప్రకారం ఎరువులు సరఫరా చేయకపోవడం, అంతంతమాత్రం వచ్చిన యూరియా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో సాధారణ రైతులకు దిక్కులు చూడాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ఎరువుల విక్రయాలన్నీ బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంది. అయితే ప్రయివేటు డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆన్లైన్ లెక్కల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎరువులు దొరకని పరిస్థితి. ముందస్తు పత్తి సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ఆదిలోనే యూరియాకు కటకట నీటి వసతి కింద మే నెల మొదటి నుంచే రైతులు సాగుకు సిద్ధమవుతారు. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద పత్తి ఇప్పటికే 1,000 హెక్టార్లలో సాగయింది. కూరగాయల పంటల సాగు కూడా చేపట్టారు. ప్రధానంగా యూరియా అవసరం ఎంతో ఉంది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. డీసీఎంఎస్ బ్రాంచీలు 18 ఉండగా.. రైతుసేవా కేంద్రాలు 689. వీటిల్లో ఎక్కడా ఒక్క బస్తా యూరియా లేకపోవడం గమనార్హం. మామూలుగా వ్యవసాయానికి మే నెల అన్ సీజన్. ఇప్పుడు ఎరువులు అందుబాటులో ఉండాలి. జిల్లాలో నీటి వసతి కింద పత్తి సాగు చురుగ్గా సాగుతున్నా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం బస్తా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడంలో చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్ యూరియా ఎక్కువగా వాడితే అనర్థాలు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే ప్రచారానికి తెగబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువుల ధరకు రెక్కలు ఇప్పటికే అన్ని రకాల రసాయన ఎరువుల ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి రైతులు ఒక బస్తా ఎరువు కూడా కొనలేని పరిస్థితి. ఇక చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల భారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. 28–28–0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.2,300లకు చేరిందంటే ఎలా కొనాలనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20–20–0–13, 14–35–14, 19–19–19, 10–26–26 తదితర కాంప్లెక్స్ ఎరువుల ధరతో పాటు పొటాష్ ఎరువు ధర అడ్డగోలుగా పెరిగాయి. 2026–27లో ఖరీఫ్ ప్రారంభానికి ముందే యూరియా కొరత ఏర్పడటం గమనార్హం. ఎరువులు కర్నూలు నంద్యాల యూరియా 58,872 54,458 డీఏపీ 15,408 30,023 ఎంవోపీ 2,516 3,617 ఎస్ఎస్పీ 2,220 3,176 కాంప్లెక్స్ 1,28,029 81,841గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొరత మాటే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్బీకేల వారీగా ఏఏ పంటలు సాగు చేస్తున్నారు. ఎరువుల డిమాండ్ ఎంత అనే వివరాలు పక్కాగా సేకరించింది. ఇందుకు అనుగుణంగా ఆర్బీకేల్లో యూరియూ, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచింది. ఎరువుల పంపిణీలో పక్కా ప్లాన్ ఉండటంతో ఐదేళ్లు కొరత మాటే వినిపించలేదు. నీటి వసతి కింద ముందస్తుగా ముమ్మర పత్తి సాగు ఉమ్మడి జిల్లాలో ఒక్క బస్తా యూరియా లభించని పరిస్థితి లెక్కల్లో మాత్రం 37,496 మెట్రిక్ టన్నుల యూరియా అన్ సీజన్ అయినప్పటికీ రైతులకు చుక్కలు ఇప్పటికే అడ్డగోలుగా పెరిగిన ఎరువుల ధర 37,496 మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడ? వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కనిపించని పరిస్థితి. 2026 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 3,72,946 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకారం కర్నూలు జిల్లాకు 2,07,029 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా.. యూరియా 58,872 టన్నులు అవసరం. నంద్యాల జిల్లాలో 2,52,444 హెక్టార్లలో వివిధ పంటల సాగుకు అవకాశం ఉండగా 54,458 టన్నుల ఎరువులు సిద్ధం చేయాల్సి ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 62వేల టన్నుల ఎరువులు ఉండగా.. ఇందులో యూరియా 14,400 టన్నులు ఉన్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో బస్తా కూడా లభించని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల సిఫారసు ఉంటేనే యూరియా సహా ఇతర ఎరువులు లభిస్తుండటం గమనార్హం. -
ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ
● అదుపులో మరో వ్యక్తి ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఓ నరసింహులు, కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్‌ను ఏసీబీ అధికారులు రెడ్ వ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఈడిగ రంగన్న గౌడ్ అంబేద్కర్ సర్కిల్ మహలక్ష్మీ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. షాప్ లైసెన్సు కు రెన్యూవల్‌తో పాటు ఇదే షాప్‌లో ఫెస్టిసైడ్స్ విక్రయించేందుకు కొత్తగా లైసెన్స్ కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని ఏఈఓ నరసింహులు.. డీలర్ రంగన్నగౌడ్కు చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్లాన్‌తో బుధవారం సాయంత్రం ఏఈఓకు రూ. 30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఓతో పాటు కార్యాలయంలో పనిచేసే అనధికార వ్యక్తి మోహన్ దగ్గర రూ. 73,600ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఏ కార్యాలయంలోనైనా పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదింవచ్చునని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడుతోపాటు సిబ్బంది ఉన్నారు. అయితే ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఏడీఏ, ఏవో కార్యాలయాల్లో లేకపోవటం గమనార్హం. -
ఇళ్లు తనఖా పెట్టించి ఘరానా మోసం
వెల్దుర్తి: పలు ప్రైవేట్ బ్యాంకులలో గ్రామస్తుల ఇళ్లు తనఖా పెట్టించి లోన్ మంజూరు చేయించాడు. అందులో సగం తీసుకుని, మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ జూపి మొత్తం కాజేశాడు. లోన్‌కు సంబంధించి పూర్తి ఈఎంఐ తానే కట్టేస్తానని నమ్మబలికి చివరకు పత్తా లేకుండా పోయాడు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు వారు ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై బాధితులు పాండు, మల్లయ్య, గిడ్డయ్య, ఎల్లయ్య, రాజు, రామాంజనేయులు, మాదన్న, మనోహర్, రామలింగం తదితరులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెపల్లె గ్రామానికి చెందిన ఏజెంట్ బురకల శాంతకుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి డోన్‌కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకులో, మరిన్ని బ్యాంకులలో ఇళ్లు తనఖా పెట్టి లోన్ ఇప్పిస్తానని, అందులో సగం తాను తీసుకుని, లోన్ మొత్తం కంతుల వారీగా బ్యాంకుకు చెల్లిస్తానని ఆశ చూపాడు. దీంతో మల్లెపల్లెలోని దాదాపు 70 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లు, ఇతర ఆస్తి పత్రాలు శాంతకుమార్‌కు అప్పగించారు. వాటిని ప్రైవేట్ బ్యాంకులలో తనఖా పెట్టించి (మార్టిగేజ్ చేయించి) దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ మంజూరు చేయించాడు. సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ కాగానే ఒప్పందం ప్రకారం సగం తీసుకున్నాడు. మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి మొత్తం కాజేశాడు. మొదట్లో లోన్ ఈఎంఐ సక్రమంగా కడుతూ ఇతరుల నమ్మకం పెంచుకున్నాడు. నమ్మకం మరింత పెరిగేలా ఇళ్లు తనఖా పెట్టిన వారికి బాండ్ సైతం రాసిచ్చాడు. దీంతో వందల సంఖ్యలో మల్లెపల్లెతో పాటు మండల పరిధిలోని చెరుకులపాడు, రామళ్లకోట, కలుగొట్ల, పుల్లగుమ్మి, బుక్కాపురం ఇలా పలు గ్రామాల వాసులు ఇతని ద్వారా హోమ్‌లోన్ తీసుకుని నగదు సమర్పించుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం ధ్రువపత్రాలను చూసి లోన్ మంజూరు చేయడంపై ఈ స్కామ్‌లో బ్యాంకు వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పత్రాలు లేకపోయినా ఏజెంట్ శాంతకుమార్ అధికారుల వద్దకు తిరిగి మరీ ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో ఈ తరహాలో రూ.కోట్లలో స్కామ్ జరిగినట్లు చెప్పారు. ఈ స్థితిలో శాంతకుమార్ పత్తా లేకుండా పోవడంతో గత వారం నుంచి తమకు బ్యాంకుల నుంచి ఈఎంఐ కట్టాలంటూ ఒత్తిడి ఎక్కువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబంలో ఒకరు పేడ రంగు తాగి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ పరిస్థితీ అదేనని, అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వందల మందికి రూ.కోట్లలో కుచ్చుటోపీ పరారీలో ఏజెంట్ ఈఎంఐ కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి -
లేబర్ కోడ్ల రద్దుకు పోరాటాలు
కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్ల రద్దుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం నేషనల్ డిమాండ్స్ డేలో భాగంగా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునెప్ప, జిల్లా కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, ఏఐయూటీయూసీ జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ.. సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కార్పొరేటర్లకు అనువుగా తీసుకొచ్చారని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. వామపక్ష, కార్మిక సంఘాల నాయకులు ఎన్.కృష్ణయ్య, పీఎస్ రాధాకృష్ణ, నరసింహులు, నగేష్, టి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నాటి దానం నేటికీ పదిలం
● అహోబిలం ఆలయ కుడ్యంపై 500 ఏళ్ల క్రితం నాడు కురుకుంద వాసి దానంపై శాసనంఆత్మకూరురూరల్: కృష్ణా తీరం వెంట ఉన్న ప్రాంతాలను వేల సంవత్సరాలుగా బాదామి చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు పాలించినట్లు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ధనవంతులు ధర్మవితరణ చేసేవారనే సత్యం ఇటీవల బయల్పడిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దిగువ అహోబిలం ఆలయ గోపురం కుడివైపు గోడపై ఉన్న శాసనాలను స్పష్టంగా చదవడం కోసం రసాయనాలతో శుద్ధీకరణ జరిపారు. అందులో ఒక శాసనంలో ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ ప్రసక్తి ఉండడమే ఈ వార్తాంశం అయ్యింది. కన్నడ భాష లిపి ఉన్న ఈ శాసనం క్రీ.శ 1553 జులై 2న శనివారం వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహా అరసు పుణ్యం కోసం అహోబిల నరసింహుడికి ప్రతిరోజు సహస్త్రనామ పూజ నిర్వహించేందుకు 12 వరమా – గద్వాణాలను దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. దీన్ని భారత పురావస్తు శాక సర్వేక్షణ శాఖ డైరెక్టర్ (ఎఫిగ్రఫి) పరిష్కరించారు. కురుకుంద గ్రామంలో 500 ఏళ్ల నాటి గురుతులు ఏవీ ఇప్పుడు కనిపించక పోయినా ఈ గ్రామంలోనూ, పరిసరాల్లో ఉన్న రెండు చెరువులకు మాచా వీరప్ప చెరువులుగా పేరుండటం అవి ఎప్పటివో ఎవరు చెప్పలేకపోవడం, ఇప్పటికీ ఇవి వందల ఎకరాలకు జీవనాధారంగా ఉండడం వంటివి గ్రామ ప్రాచీనతను చాటుతున్నాయి. -
కొండలు పిండి.. సంపద కొల్లగొట్టి
చిన్న మల్కాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న దృశ్యంకొచ్చేర్వు, కన్నపకుంట గ్రామల మధ్య అక్రమ మైనింగ్ డోన్ రూరల్: నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పచ్చని కొండల్ని అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఇమిడి ఉన్న విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి నయాపైసా రాయాల్టీ, వే బిల్లుల రూపంలో చెల్లించకుండానే యాథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మండలంలోని కన్నపకుంట, కొచ్చెర్వు, మల్కాపురం, పరదేశిబావి, పెద్ద మల్కాపురం, డోన్ శివారులోని వెంకటనాయునిపల్లె, గుడితిప్ప ప్రాంతాల్లోని అ టవీ, రెవెన్వూ భూముల్లో ప్రభుత్వం నుంచి ఎలా ంటి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు సా గిస్తూ విలువైన ఖనిజాలను కొల్లగొడుతున్నారు. కళ్లు మూసుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) సర్టిఫికెట్ పొందకుండా, ఏడీఎంజీకి రాయల్టీ బిల్లులు చెల్లించకుండా, సేల్ ట్యాక్స్ నుంచి వే బిల్లులు లేకుండానే ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొచ్చెర్వు, కన్నపకుంట అటవీ భుముల నుంచి డోలమైట్, వైట్ సెల్, లైమ్ స్టోన్లతో పాటు వివిధ రంగుల రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పలు ప్రాంతాల్లో లైసెన్స్‌లు పొందకుండానే గనుల్లో బ్లాస్టింగ్ (పేల్లుళ్లు)కు పాల్పడుతున్నారు. అటవీ, రెవెన్యూ, ఎడీఎంజీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మారడంతో అధికార పార్టీ నేతల అక్రమార్జనకు అంతులేకుండా పోతోంది. ఈ విషయంపై నోరు మెదిపేందుకు కుడా సంబంధిత అధికారులు ఇష్టపడటం లేదు. ఖనిజాల అక్రమ తవ్వకం ద్వారా కోట్లు గడిస్తున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మొద్దు నిద్రలో ఏడీఎంజీ, అటవీ, రెవెన్యూ అధికారులు -
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ కీలకం
కర్నూలు(హాస్పిటల్): నేర పరిశోధనల్లో ఫోరెన్సిక్ విభాగం వైద్యులు ఇచ్చే నివేదికే కీలకమని కేఎంసీ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ చెప్పారు. జాతీయ ఫోరెన్సిక్ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం పోస్టుమార్టం చేయడంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేసేలా సేవలందించాలని, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే పోస్టుమార్టం చేయాలని జూనియర్ వైద్యులకు సూచించారు. ఫోరెన్సిక్ వైద్యులు సాహిల్, హరీష్, సురేఖ, పీజీలు పాల్గొన్నారు. -
ఏపీవీఏ ఫోర్త్ ఉపాధ్యక్షుడిగా రవిబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ (ఏపీవీఏ) ఫోర్త్–4 ఉపాధ్యక్షుడిగా సహాయ సంచాలకులు గుండంపాటి రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామానికి చెందిన వారు. కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌గా, సహాయ సంచాలకులుగా దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫోర్త్–4 (రాయలసీమ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ స్థాయిలో పశువైద్యులు ఎదుర్కొంటున్న వివిద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
సెక్యూరిటీ గార్డు నిజాయితీ
శ్రీశైలం: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ప్రైవేటు భద్రతా విభాగంలో పనిచేస్తున్న రామ్ లాల్ తనకు దొరికిన బంగారు పుస్తెల హారాన్ని తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు గంజి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం దాదాపు రెండు తులాల బంగారు పుస్తెలతాడు సెక్యూరిటీ గార్డుకు దొరకడంతో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అప్పగించారు. దేవస్థానం మైకుల ద్వారా బంగారు చైన్ పోగొట్టుకున్న వారు ఆధారాలతో వచ్చి తీసుకోవచ్చని ప్రకటించగా హైదరాబాద్‌లోని సైదాబాద్ సరస్వతి నగర్ కాలనీకి చెందిన కే.ధాత్రి రెడ్డి అక్కడికి వచ్చి హారం గురించి పూర్తి వివరాలు తెలపడంతో పుస్తెల హారాన్ని తిరిగిచ్చినట్లు చెప్పారు. పోగొట్టుకున్న హారం తిరిగి దక్కడంతో సదరు మహిళ దేవస్థానం పర్యవేక్షకులు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటో బోల్తా – వృద్ధురాలి దుర్మరణం బనగానపల్లెరూరల్: మండలంలోని యాగంటి క్షేత్రం సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో జ్ఞానేశ్వరమ్మ (74) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బనగానపల్లె టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు మంగళవారం యాగంటి క్షేత్రానికి వచ్చారు. యాగంటి స్వామి దర్శనం అనంతరం జ్ఞానేశ్వరమ్మతో పాటు మరో ఐదుగురు బనగానపల్లెకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. క్షేత్రం సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటో ఆదుపుతప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న జ్ఞానేశ్వరమ్మ అక్కడిక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పి.వి.ఎస్.నాయుడు నిర్వహించారు. జిల్లాలోని సంక్షేమ అధికారులకు సహాయ సంక్షేమ అధికారులుగా పనిచేయాలని, అలాగే జిల్లా కలెక్టర్ పరిధిలో కూడా విధులు నిర్వర్తించాలని పీఓ సూచించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల 10వ తరగతి ఉత్తీర్ణత, సంప్లిమెంటరీ విద్యార్థుల కోచింగ్‌పై దృష్టి సారించాలన్నారు. ఆర్టికల్ 275, పీఎంజేయూజీఏ పథకాల ద్వారా వచ్చిన నిధులను పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి, వేసవి సెలవుల్లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. చెంచులకు సంబంధించిన ప్రజా విజ్ఞప్తులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల డీటీడబ్ల్యూఓలు, ఎడ్యుకేషన్ ఏపీఓ రామాంజనేయులు, ఆఫీస్ మేనేజర్ సీమోను తదితరులు పాల్గొన్నారు. కోనేరులో జారిపడి వ్యక్తి మృతి బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్ కడప పట్టణంలోని అంగన్ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాడు ఘన కీర్తి.. నేడు మూతబడి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు నిర్వీర్యమైంది. పంటల సాగులో రైతులకు విత్తనాలు,ఎరువుల నాణ్యత పరీక్షలు, పాడి రైతులకు అన్ని రకాల పరీక్షలు అందించి ఘనకీర్తి గడించిన వైఎస్సార్ అగ్రిల్యాబ్ నేడు మూతపడింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి ఒక సమగ్ర వ్యవసాయ పరీక్ష కేంద్రం మంజూరు చేశారు. ఇందులో భాగంగానే ఆలూరులోని ఎల్లార్తి రోడ్డులోనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.57 లక్షల వ్యయంతో 2021 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. గతంలో రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి విత్తనాలు,ఎరువుల పరీక్షలు, పశువుల రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన అగ్రిల్యాబ్ ప్రభుత్వ మార్పు తర్వాత ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారి మూత పడింది. దీంతో రైతులకు ఆయా పరీక్షలు అందడం లేదు. – ఆలూరు రూరల్ -
పండ్ల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగిస్తున్న దుకాణాలపై మంగళవారం ఆహార భద్రత విభాగం (ఫుడ్ సేఫ్టీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మండిబజార్‌లో ఉన్న గౌస్ ఫ్రూట్స్ కంపెనీ, షమీవుల్లా ఫ్రూట్ మర్చంట్ దుకాణాల్లో తనిఖీలు చేసి అరటి, మామిడి పండ్లు మాగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇథలిన్ గ్యాస్‌ను గదిలోకి పంపి పండ్లను మాగించకుండా ఇథలిన్ పౌడర్‌ను నీళ్లలో కలిపి అందులో పండ్లను మాగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా మాగించిన పండ్లను తినడం వల్ల వ్యాధులు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ చెప్పారు. ఈ మేరకు అరటి, మామిడి పండ్లను శాంపిల్ తీసి ల్యాబోరేరీకి పంపించారు. డిస్ట్రిక్ట్ కన్జూమర్ సెక్రటరీ శివమోహన్‌రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. -
హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం
● రూ.15లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి వెలసిన ప్రాంతాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదామని మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. డీజీవీ అతిథి గృహం వద్ద హైవే రోడ్డులో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు మంగళవారం పీఠాధిపతులు శ్రీకారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు మఠం అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్ గార్డెన్, సుశమీంద్రతీర్థుల పార్క్, గురునివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత పీవీ బద్రినాథ్ రావు తీసుకున్నారు. ఈ పనులకు రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆయనను పీఠాధిపతి శాలువ, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,78,19,526 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు సంబంధించి 20 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 2,69,28,176, నాణేలా రూపంలో రూ.8,91,350 వచ్చిందన్నారు. అలాగే 15 గ్రాముల బంగారం, 751గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్‌కోనాపూర్ పాల్గొన్నారు. కొత్తిమీర ధరకు రెక్కలు ● ఒక మడి ధర రూ.1600 గోనెగండ్ల: కొత్తిమీర ధరకు రెక్కలు వచ్చాయి. ఒక మడి ధర రూ. 1500 నుంచి రూ.1600 వరకు పలుకుతోంది. ఎండలు ఎక్కువకావడం, బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో ప్రస్తుతం బోర్లు, బావుల కింద 100 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఒక ఎకరా సాగుకు రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల నుంచి కొత్తిమీరకు ధర పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై కేసు వెల్దుర్తి: మల్లెపల్లె వైఎస్సార్సీపీ కార్యకర్త వీరేశ్ ఆచారిపై సోమవారం దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామదుర్గనాయుడు, అయ్యన్న, చంద్రారెడ్డి, మాధవ్‌పై కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ నరేశ్ మంగళవారం తెలిపారు. హైవే 44 పక్కన మల్లెపల్లె స్టేజ్ సమీపంలో వీరేశ్ ఆచారి, భార్య గాయత్రి, ఇద్దరు పసిపిల్లలతో కలిసి బైక్‌పై వస్తుండగా నిందితులు దారికాచి బైక్‌ను అటకాయించి వీరేశ్ ఆచారిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. జరిగిన సంఘటనపై గాయత్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
జిల్లాలోకి తెలంగాణ, కర్ణాటక విత్తనాలు
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్ల బీటీ–2 పత్తి విత్తనాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా.. వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాకు 11 లక్షల ప్యాకెట్లు, నంద్యాల జిల్లాకు 50 వేల ప్యాకెట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖను కోరారు. దీంతో జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు తెలంగాణ, కర్ణాటక నుంచి అనధికార బీటీ–2 విత్తనాలను జిల్లాలోకి డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, క్రిష్ణగిరి మండలాల్లోకి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున డంప్ అయినట్లు సమాచారం. వందల కంపెనీలు, అనేక రకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు
● 2025 ఖరీఫ్‌లో 2,86,622 హెక్టార్లలో పత్తి సాగు ● ఈ సారి సాగు మరింత పెరిగే అవకాశం ● కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా పత్తి విత్తన ప్యాకెట్లు డంప్ ● గుట్టుచప్పుడు కాకుండా హెచ్‌టీ పత్తి సాగు ● సొంత ధృవీకరణతోనే మార్కెట్లోకి బీటీ పత్తిన ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): 2025 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో పత్తి 2,86,622 హెక్టార్లలో సాగయింది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీటి వసతి కింద ముందస్తు ఖరీఫ్‌లో పత్తి సాగు చేయడం విశేషం. 2026లో కర్నూలు జిల్లాలో 3 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా అధికం. బీటీ–2 పత్తి విత్తనాల మార్కెటింగ్‌కు రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే ఉమ్మడి జిల్లాలో జరిగే మార్కెటింగ్ మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు 9 మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఇప్పటికే ప్యాకింగ్ కూడా పూర్తయింది. అయితే జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. తెలంగాణా కేంద్రంగా ఉన్న వందలాది కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాను మార్కెటింగ్‌కు కల్పతరువుగా వినియోగించుకుంటున్నాయి. గుజరాత్ కంపెనీలతో కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ లైసెన్స్ పేరుతో వందలాది కంపెనీలు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్‌లో నిమగ్నమయ్యాయి. గుజరాత్ కంపెనీలకు రాయల్టీ చెల్లిస్తూ.. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. నాణ్యత దేవుడికెరుక పత్తి విత్తన నాణ్యతతో వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధృవీకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు, నాలుగేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలతో వేలాది మంది రైతులు నష్టపోయారు. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ కంపెనీలు చేతులెత్తేశాయి. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ పెద్దలు వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. పత్తిలో కలుపు సమస్య అధికం. హెచ్‌టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలేదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పాటు తర్వాత అనుమతి లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీలు రైతులతో హెచ్‌టీ పత్తి సాగు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన హెచ్‌టీ పరీక్షల్లో గ్లైపోసేట్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2500 బీటీ–2 విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేశారు. కర్నూలులోని వివిధ కంపెనీల్లో హెచ్‌టీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పత్తిలో నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో ఆరు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. కర్నూలు, ఆదోనిల్లో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. విత్తన దుకాణాల్లో ఇంటర్నల్ స్క్వాడ్లతో తనిఖీలు చేయిస్తున్నాం. హెచ్‌టీ పత్తి సాగును నియంత్రించేందుకు 175 శాంపుల్స్ సేకరించి పరీక్షించాం. కల్లూరులో రెండు, ఆదోనిలో నాలుగు హెచ్‌టీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
కస్తూర్బా టీచర్లకు ‘వాట్సాప్’ బదిలీలు!
జూపాడుబంగ్లా: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు తొలుత జిల్లా ఉన్నతాధికారులు పత్రికా ప్రకటన ఇవ్వాలి. లేదంటే రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల్లో ఇవేమీ జరగలేదు. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నరీతిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో కాంట్రాక్టు బేసిక్ మీద విధులు నిర్వహిస్తున్న ఎస్ఓ(స్పెషల్ ఆఫీసర్)టీచర్లు, పీఈటీలకు పదేళ్ల నుంచి సాధారణ బదిలీలు చేపట్టలేదు. దీంతో వారు తమకు బదిలీలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా వాట్సాప్‌లో దరఖాస్తులు పంపించింది. వాటిని పూర్తి చేయాలని జిల్లా అధికారులు వాట్సాప్ కాల్ ద్వారా ఉపాధ్యాయులను ఆదేశించారు. ఫోన్ కాల్ చేస్తే రికార్డు చేస్తారేమోననే భయంతో వాట్సాప్ కాల్ చేశారని విమర్శలు వచ్చాయి. రహస్యంగా బదిలీలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 కస్తూర్బాగాంధీ పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో ఎస్ఓలతో కలిపి తొమ్మిది మంది చొప్పున 477 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఈనెల 2, 3 తేదీల్లో కర్నూల్లోని సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో రహస్యంగా బదిలీలు నిర్వహించారు. వాట్సాప్‌లో వచ్చిన దరఖాస్తులు పూరించి ఈ బదిలీల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రక్రియ జరిగి పదిరోజులు గడిచినా ఇప్పటిదాకా బదిలీపై వెళ్లిన వారికి ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు మంజూరు చేయలేదు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు జిల్లా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి.. ఎలాంటి పత్రికా ప్రకటన, నోటిఫికేషన్, గైడ్లెన్స్ లేకుండా బదిలీలు చేపట్టి తమకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన కస్తూర్భాగాంధీ పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు చేపట్టిన బదిలీలపై స్టే మంజూరయ్యే అవకాశాలున్నాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇదేమాదిరిగా బదిలీలు చేపట్టడంతో ఆగ్రహించిన ఆ జిల్లా కస్తూర్బా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలపై స్టేను విధించినట్లు సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కస్తూర్భా పాఠశాలల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌కాల్స్ చేసి విషయం తెలిపిన వైనం వాట్సాప్‌లో చేరిన దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలోని 53 కస్తూర్బా పాఠశాలల్లో బదిలీలు ఇప్పటిదాకా అందని ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీలు కోర్టుకు వెళ్లిన ఎస్ఓలు, ఉపాధ్యాయులు -
కఠిన చర్యలు తీసుకోవాలి
కష్టపడిన చదివిన విద్యార్థుల ఆశల్లో ఎన్టీఏ నీళ్లు పోసింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించకుండా పేపర్ లీకేజీ అంటూ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల్లో ఆందోళన పుట్టించింది. కేవలం నీట్ పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఈ పేపర్ లీక్‌ల వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత కోల్పోతే ప్రతిభా వంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. – రాజు నాయుడు, ఆర్వీఎఫ్ అధ్యక్షుడు, నంద్యాల -
మళ్లీ ‘నీట్’గా రాస్తామో.. లేదో!
నంద్యాల: రాత్రింబవళ్లు కష్టపడి చదివి డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకునేందుకు నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) రాసిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఫలితాల కోసం వేచి చూస్తున్న వేళ నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం జిల్లాలో వేలాది మంది విద్యార్థులపై పిడుగులా పడింది. పేపర్ లీక్ పాపం ఎక్కడో జరిగితే దానికి తామెందుకు శిక్ష అనుభవించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి తమ పిల్లలను డాక్టర్‌గా చూడాలని ఆశపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. నిన్నటి వరకు ఆనందంగా ఉన్న విద్యార్థుల ఇళ్లలో ఇప్పుడు నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. దిక్కుతోచని స్థితి నంద్యాల జిల్లాలో ఈ ఏడాది మే 3న నీట్ నిర్వహించారు. నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, పీఎస్సీ, కెవీఎస్సీ డిగ్రీ కాలేజ్, ఎస్వైవిసీపీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బస్టాండ్ సమీపంలోని గవర్నమెంట్ హైస్కూల్లలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 1,434 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన పది రోజుల తర్వాత రాజస్థాన్, మరికొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యిందన్న సమాచారంతో నీట్‌ను ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ పెడతామని, తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దరఖాస్తు కూడా కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పరీక్ష రాసిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు సంవత్సరాల పాటు కష్టపడి రాసిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితి ఉన్నారు. పరీక్ష బాగా రాశామని సంతోషపడే లోపే రద్దు వార్త వినాల్సి రావడం బాధాకరమని విద్యార్థులు వాపోతున్నారు. నీట్ పరీక్ష రాసి మానసికంగా రిలాక్స్ అయ్యాం. ఇప్పుడు మళ్లీ పరీక్ష అంటే ఆ ప్రశ్నపత్రం స్థాయి ఎలా ఉంటుందో? ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో? ఒక వేళ ఇప్పుడు రాసిన పరీక్షకంటే కఠినంగా వస్తే మా ర్యాంకులు దెబ్బతినే అవకాశం ఉంది. –మౌనిక, నీట్ విద్యార్థిని, నంద్యాల పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్టీఏ స్పష్టత ఇవ్వలేదు. రీ ఎగ్జామ్, ఫలితాలు, కౌన్సెలింగ్ ఇవన్నీ జరిగే సరికి విద్యా సంవత్సరం సగం గడిచిపోతుందేమోనని భయంగా ఉంది. ప్రభుత్వం వెంటనే కొత్త షెడ్యూల్ ప్రకటించి విద్యాసంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి. పరీక్ష రద్దు చేయడం నిజాయితీగా చదివిన మాకు అన్యాయం జరిగింది. –కె.భరత్, నీట్ విద్యార్థి, నంద్యాల నీట్ రద్దుపై విద్యార్థుల్లో ఆందోళన జిల్లాలో పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,434 మంది -
నాణ్యతగా ఉన్న జొన్నలనే కొనుగోలు చేస్తాం
పాములపాడు: నాణ్యతగా ఉన్న జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై డీఎం అశ్వర్ధ నారాయణ నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆయన రైతులతో మాట్లాడారు. మహేంద్ర జొన్నలు మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు. పలువురు రైతులు తెచ్చిన జొన్నలను పరిశీలించారు. క్వింటా రూ.6,699 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. కొన్ని కారణాల చేత కొనుగోలు ఆలస్యమైందన్నారు. వెంటనే రైతుల నుంచి జొన్నలు సేకరించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి మహేశ్వరరెడ్డి, ఏపీఎం ఉమామహేశ్వరమ్మ ఉన్నారు. 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం తన చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 10,115, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,928 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షల నిర్వహణకు 43 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెఆప్పరు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్స్ మూసి ఉంచేలా చూడాలన్నారు. వీరహనుమాన్ శోభాయాత్ర నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో వీరహనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. తొలుత ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా వీరాంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర టెక్కె మార్కెట్‌యార్డు నుంచి బైర్మల్ వీధి గుండా ప్రశాంతంగా సాగింది. శోభాయాత్రలో కోలాటాలు, చెక్కభజనలు అలరించాయి. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కాకుండా మరో రహదారి గుండా వాహనాలు తరలించారు. శోభాయాత్ర బైటిపేటలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకుంది. విశ్వహిందూ పరిషత్ నాయకులు రావినూతల శశిధర్, ఆచార అభినవ శంకరానందస్వామి, బుగ్గన చంద్రహౌలీశ్వరరెడ్డి, ఎర్రం విష్ణువర్ధన్‌రెడ్డి, పోలేపల్లి సందీప్, చిలుకూరి శ్రీనివాస్, తులసిరెడ్డి, రామచంద్రారెడ్డి, మేడా మురళీధర్, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి పాములపాడు: వడదెబ్బతో కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. విజయానందం సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. అనంతరం మొక్కజొన్న మిషన్ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో త్వరగా ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
నిర్లక్ష్యం రోగానికి మందులు బూడిద
పాములపాడు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన మందులు, సూదులు బూడిదపాలయ్యాయి. మద్దూరు గ్రామంలోని సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది సోమవారం గుట్టుగా విలువైన మందులకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వేల రూపాయల ప్రజా ధనం బూడిదపాలైంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు స్టాక్ లేవు.. బయటకొనుక్కోండి.. అని సలహాలు ఇచ్చే సిబ్బంది విలువైన మందులను ఆసుపత్రి వెనుక కుప్పగా పోసి తగలబెట్టారు. ఆ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాల్సి ఉండగా, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టాక్ ఉన్నప్పుడే రోగులకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవి గడువు ముగిసే వరకు ఎందుకు నిల్వ చేశారు? అనే ప్రశ్నలకు సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
జిల్లా కలెక్టర్‌కు గజమాలతో సన్మానం
పాణ్యం: జిల్లా కలెక్టర్ రాజకుమారిని భూపనపాడు గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు సోమవారం గజమాలతో ఘనంగా సత్కరించారు. మహిళలు పసుపు, కుంకుమ, చీర అందజేసి కృతజ్ఞలు తెలిపారు. నంద్యాలలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ముందు మోకాల్లోతులో మురుగునీరు నిల్వ ఉండి రోగాల బారిన పడేవారమన్నారు. జిల్లా కలెక్టర్‌కు విషయాన్ని తెలపగా గ్రామానికి వచ్చి అన్ని శాఖల అధికారులను కాలనీకి రప్పించి అక్కడే సమస్యకు పరిష్కారం చూపారన్నారు. కాలనీలో డ్రైనేజీ వెళ్లేందుకు రెండు వైపులా కాల్వలు తీసి కొత్త సీసీ రోడ్డు వేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి రూ.65లక్షల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారన్నారు. అధికారులూ.. పనితీరు మెరుగుపర్చుకోవాలి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి శాఖలో నెలకు కనీసం 1.5 శాతం చొప్పున ప్రగతి కనిపించాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఈపీటీఎస్ (ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ ట్రాకింగ్ సిస్టమ్) డాక్యుమెంట్ల అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 20న మెడికల్ షాపుల బంద్ నంద్యాల(వ్యవసాయం): మెడికల్ షాపులను ఈ నెల 20న బంద్ చేయనున్నట్లు నంద్యాల జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి బైసాని రమేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్‌ను, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను ఒక్కరోజు బందుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ముందుగానే తమకు అవసరమైన మందులను కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్టపరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులకు పంపించామన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించామన్నారు. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి (మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా లో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క ని మిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్ కన్వీనర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. -
‘పీడీ’స్తున్న సమస్య!
నంద్యాల(న్యూటౌన్): జూనియర్ కాలేజీల్లో క్రీడా శిక్షణకు సరైన వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన విద్యార్థులు కళాశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మొత్తం 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది కళాశాలలకు పీడీ పోస్టులను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జారీ చేశారు. వీటిల్లో ప్రస్తుతం ఒక్క కళాశాలకు మాత్రమే పీడీ పోస్టు ఉంది. దీంతో వేలాది మంది విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. జీతాల ఖర్చును తగ్గించుకునేందుకే! జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కళాశాలలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. నంద్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పీడీ గత నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. దీంతో ఆ పోస్టుకు మంగళం పలికారు. విశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పటికీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉన్న పోస్టులను పక్కదారి మళ్లించి జీతాల ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది. వ్యాయామ విద్య అందని ద్రాక్ష ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డిగ్రీ కళాశాలల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడా మైదానాలు ఉన్న జూనియర్ కళాశాలల్లోనే పీడీ పోస్టులు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్ష మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోంది. జూనియర్ కళాశాలల్లో వ్యాయామ విద్యా అధ్యాపకుల పోస్టులకు ఇతర సబ్జెక్టులను మార్పు చేయడం తగదు. ఎంపీఈడీ అర్హతతో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ఉద్యోగ పదోన్నతి ద్వారా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. జూనియర్ కళాశాలలో పీడీలను నియమించకపోతే ఆందోళనలు చేస్తాం. – ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే!
● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలో ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని అందులో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సున్నిపెంట ప్రభుత్వ గృహాల ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 కింద 2,163 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. జలవనరులశాఖ, గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి తహసీల్దార్ ఇంటింటికి వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. నివాసితులు అందుబాటులో లేనిపక్షంలో గృహాలకు నోటీసులు అంటిస్తున్నారు. ఈనెల 17వ తేదీలోగా తహసీల్దార్ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. సంజాయిషీ సంతిృప్తకరంగా లేకుంటే చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నోటీసులో సూచించారు. అధికారులు జరిపిన సర్వేల ఆధారంగా రికార్డుల్లో 2,260 ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. వీటిలో 82 మంది జలవనరులశాఖ ఉద్యోగులు నివాసం ఉంటుండగా 247 గృహాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ గృహాలు, నివాస యూనిట్టు 428కి పట్టాలు మంజూరు చేయగా వాటిలో నాలుగు పట్టాలు సక్రమమైనవి కావని అధికారులు తేల్చారు. 277 మంది ప్రభుత్వ గృహాలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. -
కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం
పాణ్యం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి కర్నూలు పట్టణానికి చెందిన యశ్వంత్, తేజస్విని దంపతులు రూ. 2.64 లక్షలు విరాళంగా అందజేశారు. స్వామివారికి కేజీ వెండి విలువైన డబ్బులను ఏపీజీపీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఈఓ రామకృష్డుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్‌శర్మ, పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
స్వాభిమానం.. సహస్ర కలశాభిషేకం
● శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ● కలశయాత్రలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు శ్రీశైలంటెంపుల్: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని సోమవారం శ్రీశైల దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో సహస్ర కలశారాధన చేశారు. భక్తులందరూ కలశాలను తలపై ధరించి ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం, నందిగుడి, మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామికి విశేషపూజాదికాలను జరిపి వెయ్యి మంది భక్తులు ఆలయానికి వెళ్లి వృద్ధమల్లికార్జున స్వామివారికి కలశాభిషేకం చేశారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జున స్వామివారికి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం అందించిన పుస్తకాలు, పెన్నులతో శివపంచాక్షరీ నామ లేఖ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే గంగాధర మండపం వద్ద సాయంత్రం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వనపర్తికి చెందిన సత్యంస్వామి, బృందం వారిచే శివభజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్‌శర్మ వారిచే ఓంకారం ప్రాశస్త్యంపై ప్రవచనం నిర్వహించారు. విజయనగరానికి చెందిన సుప్రియ బృందం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
ఓర్వకల్లు: జాతీయ రహదారిపై కాల్వబుగ్గ వద్ద సోమవారం రాత్రి హైవే పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కాల్వబుగ్గలో భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయయ్యాడు. సోమవారం సాయంత్రం వ్యక్తితో ఆమె గొడవ పడింది. అతను దాడి చేయగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రోడ్డు దాటుతుండగా హైవే పెట్రోలింగ్‌కు చెందిన బొలెరో వాహనం మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతిచెందిన మహిళ, ప్రమాదానికి కారణమైన హైవాహనం -
ఉచిత ఇసుక పేరుతో నిల్వ కేంద్రంలో అక్రమాలు
ఆళ్లగడ్డ: ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతూ ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్రమాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక నిల్వ కేంద్రం నుంచి ప్రజలకు ఇసుమంత కూడా ఇవ్వలేదన్నారు. ఒక ధర నిర్ణయించి అమ్ముకుంటూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్‌లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యాన్ని మద్దతు ధరతో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. తాను గెలిస్తే ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చి రెండేళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని నిలదీశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ కర్నూలు: జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీగా ఉన్న రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
వ్యవసాయానికి గడ్డుకాలం
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి మే నెలలో గాలుల తీవ్రత ఉన్నా.. చినుకు జాడ కరువైంది. ఎల్‌నినో ప్రభావం మొదలు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2026–27 సంవత్సరంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి తొలకరి మొదలవుతుంది. నైరుతి రుతుపవనాలు మే నెల చివరికే విస్తరించాల్సి ఉంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా చురుగ్గా ఉండే అవకాశం లేదు. ఎల్‌నినోపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే నీటి వసతి కింద ఉల్లి, పత్తి, వరి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, మిర్చి, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ప్రధాన పంటలు. ఎల్‌నినో కారణంగా వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొడి వాతావరణం, అధిక వేడి వల్ల కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సోకి పంటలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగు పడిపోయే ప్రమాదం 2025 ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 4,49,858 హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 2,78,204 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సీజన్లోనూ ఇదే స్థాయిలో పంటలు సాగవుతాయి. నంద్యాల జిల్లాలో నీటి ఆధారం పంటలే ఎక్కువ. ఎల్‌నినో ప్రమాదం వల్ల నంద్యాల జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థకమవుతోంది. ఈసారి సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు పడుతాయా లేదోన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంటలు జూలై చివరి వరకు, మరికొన్ని ప ంటలు ఆగస్టు చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం మేరకు ఆగ స్టు వరకు ఎల్‌నినో ప్రమాదం ఉండటం వల్ల వివిధ పంటల సాగుకు అవకాశమే లేనట్లు తెలుస్తోంది. నీటి వసతి పంటలు కూడా కష్టమే.. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులు నిండాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. ఎల్‌నినో ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైనా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నీటి ఆధారిత పంటలు వద్దు.. తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. అంటే ఈ ఖరీఫ్‌లో నీటి ఆధారం కింద వరి, ఇతర పంటలకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకే రోజు కనీసం 40 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడే పత్తి, ఇతర పంటలు సాగు చేసుకోవాలి. జిల్లాలో ప్రధాన పంట పత్తి అయినందున ఈ పంటలో జొన్న, సజ్జ, ఆముదం వంటి అంతర పంటలు సాగు చేయాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దని రైతులకు చెబుతున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది సాగు చేస్తుంటా. ఈసారి వర్షాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు లేదు. ఉచిత పంటల బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వల్పకాలిక పంటల సాగుకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలి. – ఎంబాయి రామాంజనేయులు, అమీనాబాద్, తుగ్గలి మండలంముంచుకొస్తున్న ఎల్‌నినో కర్నూలు జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) పత్తి 280086 కంది 68854 ఉల్లి 24810 మిర్చి 17998 వేరుశనగ 44541 నంద్యాల జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) వరి 95031 మొక్కజొన్న 98171 కంది 47691 మినుము 11134 నందికొట్కూరు సమీపంలో పొలంలో పంట వ్యర్థాలను తొలగిస్తున్న కూలీలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల బీమా, ఉచిత పంటల బీమాకు మంగళం పలకడంతో కరువు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎల్‌నినో ప్రమాదం పొంచి ఉండటం రైతులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మామూలుగా ఈ సమయానికి రైతులు పత్తి, ఉల్లి తదితర విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పత్తి విత్తనాలు కొంటున్నారు తప్ప వర్షాధారం కింద సాగు చేసే రైతులు విత్తన సేకరణకు ఆసక్తి చూపని పరిస్థితి. ఎల్‌నినో సమయంలో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రత నేలలోని తేమను త్వరగా ఆవిరి చేస్తుందనే ఆందోళన నెలకొంది. -
అకాల వర్షం .. రైతులకు నష్టం!
బనగానపల్లె రూరల్/కొలిమిగుండ్ల/వెల్దుర్తి: మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం 6 గంటల సమయంలో బనగానపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాలు మోస్తరు వర్షం కురిసింది. గాలీవానకు వరి పైర్లు నేలవాలాయి. ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. అవుకు ప్రాంతంలో వరి పంట కాలం పూర్తి కావడంతో చాలా మంది రైతులు కోత కోసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఈదురు గాలులు, వర్షంతో రైతులు నష్టపోయారు. వెల్దుర్తి మండలంలో ఆదివారం రాత్రి గాలీవాన భీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈదురుగాలులతో పట్టణానికి తాగునీరందించే పథకం రామళ్లకోట రోడ్డులోని పార్వతయ్య బావి వద్ద ఉన్న సంప్పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా సంప్ నుంచి పట్టణానికి సరఫరా చేసే పైప్లైన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్, విద్యుత్ ఏఈఈ వెంకటేశ్వర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి సరఫరాను సోమవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద, మరోచోట రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈదురుగాలులకు గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, ఎల్ నగరం, లక్షుంపల్లె, చెర్లకొత్తూరు, బోగోలు, తదితర ప్రాంతాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి రైతులు నష్టపోయారు. -
ప్రయాణికుల కోసం..
● రూ. 10 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తోలు బొమ్మలాట ప్రదర్శన గడివేముల: ప్రజలకు ఉపయోగపడేలా.. పది కాలా ల పాటు గ్రామంలో గుర్తుండేలా ఓ వ్యక్తి బస్షెల్ట ర్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గని గ్రామంలో రిటైర్ ఉపాధ్యాయుడు వెంకటరమణ, భార్య కళ్యా ణి రూ.10 లక్షలతో వెచ్చించి గ్రామస్తుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సు బ్బమ్మ, చిన్న మల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్‌ను మంగళవారం ప్రారంభిచనున్నారు. కాగా అంతరించి పోతున్న ప్రాచీన కళను ప్రోత్సహించేందుకు తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన ప్రాచీన జానపద కళారూపం. రాత్రి వేళల్లో, తెర వెనుక నుంచి దీపాల వెలుగులో బొమ్మలను ఆడిస్తూ, రామా యణ, మహాభారత వంటి పురాణ కథలను కళాకారులు వినోదాత్మకంగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా ఉన్న ఈ కళారూపం, నేడు సాంకేతికత పెరగడంతో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కొంతమంది కళాకారులు మాత్రమే ఈ కళను బతికించుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం సత్య సాయి జిల్లా లేపాక్షి చెందిన సిండే రామ్మూర్తి గ్రూపు వారు రామాయణం తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై వీక్షించాలని వెంకటరమణ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
నందికొట్కూరు: ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం సామేలు(71) పట్టణంలోని వేలాంగిణి మాత తిరునాలకు వచ్చాడు. రాత్రి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఎదురుగా బైకు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున సామేలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బైకుపై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐచర్ వాహనం దగ్ధం పత్తికొండ రూరల్: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్ వాహనం సిమెంట్ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్ లోడింగ్ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఇంజన్లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది. -
ప్రారంభించారు.. వదిలేశారు!
కోసిగి: దాదాపు 45 రోజుల క్రితం ‘ఊరికి రోడేస్తున్నాం’. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఆర్భాటంగా పూజలు చేసి రోడ్డు పనులకు టెంకాయ కొట్టారు. త్వరలో పనులు పూర్తయి రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సంతోషపడ్డారు. అయితే నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు అడుగు కూడా కదలలేదు. తుంబిగనూరు గ్రామ శివారు నుంచి సాతనూరు, అగసనూరు గ్రామాల మీదుగా కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటర్లు సీసీ, బీటీ రోడ్డు పనులు చేసేందుకు రూ.5.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తుంబిగనూరు గ్రామ మధ్యలో 25/6 కిలో మీటరు నుంచి కందుకూరు శివారు 33/4 కిలో మీటరు వరకు ఆర్అండ్బీ కింద నిధులు కేటాయించారు. ఇందులో అగసనూరు, సాతనూరు గ్రామాల్లో 900 మీటర్లు సీసీ రోడ్డుకు రూ.2.5 కోట్లు, మిగిలిన 8.1 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆయా గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి గుంతలు గుంతల మయంగా తయారైంది. ఏళ్ల తరుబడి రోడ్డు వసతి లేక ప్రయాణికులు , వాహనదారులు రోడ్డు పై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి నాయకులు భూమి పూజ చేయడంతో రోడ్డు ఏర్పాటు చేస్తారని సంతోషపడ్డారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు వేస్తారా లేదా కేవలం ఆర్భాటమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్అండ్బీ ఏఈ నరేష్‌ను వివరణ కోరగా.. తుంబిగనూరు – కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటరుల రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, రోడ్డు అడుగు భాగాన వేసేందుకు గ్రావెల్ లభించడం లేదన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొరత ఉందని, తవ్వకాలకు మైనింగ్ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు. 21 మందికి కారుణ్య నియామకాలు కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. జేసీ నూరుల్ ఖమర్, ఇన్చార్జ్ డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన పాల్గొన్నారు. -
హైకోర్ట్ ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెనుమాక శివారు వద్ద సీడ్ యాక్సెస్ రోడ్లో సోమవారం స్కూటీపై వెళుతున్న హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌ను వెనుక నుంచి అతివేగంగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు (49) హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్న శ్రీనివాసరావు ఉదయం 7 గంటల సమయంలో తన స్కూటీపై సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాదం పప్పుపై బాల హనుమాన్
నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ చిత్రకారుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం సోమవారం ‘బాదం పప్పుపై బాల హనుమాన్ ‘అనే సూక్ష్మ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అష్టసిద్ధి ప్రదాత, నవ వ్యా కరణ పండితుడు అయిన శ్రీ హనుమంతుని ఆరాధన వల్ల బుద్ధి, బలం, ఆరోగ్యం, యశస్సు, ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయని చిత్రకారుడు తెలిపారు. అర్జునుడు తన రథం పైన హనుమద్ ధ్వజాన్ని స్థాపించడం వల్ల మహాభారత యుద్ధంలో తిరుగులేని విజయాన్ని సాధించారన్నారు. -
కరువు శాసనం.. కన్నీటి పయనం!
● ‘ఉపాధి’కి టీడీపీ నాయకుల అడ్డుకట్ట ● వలసబాట పట్టిన జగదుర్తి గ్రామస్తులు డోన్: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్‌ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమేనని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
దేవస్థానం అధికారిక వైబ్‌సైట్‌ను వినియోగించాలి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులను ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్‌సైట్ www.aptemples.ap.gov.in, దేవస్థానం అధికారిక వెబ్సైట్ www. srisaila devasthanam. org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. -
అల్లా మార్గంలో నడవాలి
రుద్రవరం: ముస్లింలు అల్లా మార్గంలో నడవాలని మత పెద్దలు అన్నారు. రుద్రవరంలో ఆదివారం ఇస్తెమా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఐదు మార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి రోజు నమాజ్ చేయాలని, అలాగే సంపాదనలో జకాత్ తీసి పేదలకు పంచాలని చెప్పారు. శాంతి మార్గంలో నడుస్తూ అందరితో మంచిగా మెలగాలని వివరించారు. ఇస్తెమాకు వచ్చిన వారికి స్థానిక ముస్లింలు తగిన వసతులు కల్పించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహాయంతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. గడ్డి వాము, ట్రాక్టర్ దగ్ధం బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి దగడ సురేంద్రనాథ్ రెడ్డి గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోగా , పక్కన్న ఉన్న ట్రాక్టర్ ఇంజన్‌కు సైతం మంటలు వ్యాపించి దగ్ధమైంది. సుమారు గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమై రూ.6.50 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో గడ్డివాము దగ్ధం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామ సీపీఐ నాయకులు శ్రీరాములు, సోమన్న, నాగేశ్వరరావు, చంద్రమోహన్ డిమాండు చేశారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు (టౌన్): కర్నూలు – గుంటూరు రహదారిలో నందనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆదివారం వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కుంభకోణం కాఫీ హోటల్ దగ్గరలో గార్గేయపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కంకర మిక్చర్ వాహనం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్ఓ ఖాజామియ్య కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆనవాళ్లు సేకరించారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. వివరాలు తెలిస్తే 91211 01063 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా ● ప్రాణభయంతో కిందకు దూకి మృతి చెందిన క్లీనర్ మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో అదుపు తప్పిన లారీ కొండచరియను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. ఒంగోలు నుంచి బళ్లారికి ఐరన్ షీట్లతో వెళ్తున్న లారీ పాత బొగద దొరబావి వంతెన మలుపు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండ చరియను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో డ్రైవర్‌తో పాటు ఉన్న క్లీనర్ ప్రసాద్ ప్రాణభయంతో కిందికి దూకడంతో తలకు దెబ్బలు తగిలి మృతి చెందాడు. లారీ వెనుకే వస్తున్న ఓ స్కార్పియో వాహన దారులు అప్రమత్తమై వెనుకకు వెళ్తుండగా లారీ వెనుక భాగం నుంచి ఐరన్ షీట్లు పడటంతో వాహనం ముందు భాగం దెబ్బతినింది. సుమారు మూడు గంటలకు పైగా వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రోడ్‌సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రోడ్డుపై బోల్తాపడిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. క్లీనర్ ప్రసాద్ విజయవాడ నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి, మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. -
విముక్తి కల్పించండి
నానాటికి పెరుగుతున్న పట్టణ జనాభా, వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతోంది. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో రైల్వే గేట్లు పడటంతో గంటల పాటు అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ చిక్కుముడిని శాశ్వతంగా ఎప్పుడు పరిష్కరిస్తారని వేచిచూస్తున్నాం. – బాలతిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, ధర్మవరం మూడు ప్రధాన రైల్వే గేట్ల మధ్య ఉన్న పాతపేట టీడీపీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మాజీ మంత్రి బుగ్గన చొరవతో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడినా కూటమి ప్రభుత్వంలో పనులు సాగడం లేదు. ఇది ముమ్మాటికీ టీడీపీ పాలకుల వైఫల్యమే. – ఆర్ఈ రాజవర్దన్, స్థానికుడు, పాతపేట అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన చేయడం మూలంగా ప్రజల విలువైన సమయం, డబ్బు వృథా అవుతోంది. ట్రాఫిక్‌లో ఒక్కసారి వాహనం చిక్కుకుంటే బయటపడేందుకు గంటల సమయం పడుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్యను టీడీపీ పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. అభివృద్ధిని అడ్డుకునే వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. – బాషా, ఆటోడ్రైవర్, డోన్ -
శ్రీగిరిలో వేసవి రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్రంలో వేసవి రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్ర పురవీధుల్లో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు. -
అందరిపై ఆరోగ్యమాత కరుణ
నందికొట్కూరు: ఆరోగ్యమాత కరుణ అందరిపై ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్సీఎం చర్చి మేత్రాసన బిషప్ గోరంట్ల జ్వానేష్ అన్నారు. ఆదివారం పట్టణంలో వేలంగణి మాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి, పురవీధుల వెంట మేరీమాత విగ్రహాన్ని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా మేరీమాత ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేరీమాత వద్ద జ్యోతులు వెలిగించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. జిల్లా వాసులకు నాగపట్నం తరహాలో మేరీమాతను నందికొట్కూరులో ప్రతిష్టించడం విశేషమన్నారు. ఉత్సవాల్లో ఫాదర్ కేడీ జోసెఫ్, సహాయక ఫాదర్ బాల ఏసు తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. -
మిత్రుడి మరణం తట్టుకోలేక..
ఉరేసుకుని ఆత్మహత్యబేతంచెర్ల: ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన బేతంచెర్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన యువకులు షేక్షావలి, ట్రాక్టర్ డ్రైవర్ కొడిగంటి చిన్న స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరు కలసిమెలసి ఉండేవారు. షేక్షావలి శనివారం రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మిత్రుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి చెందిన డ్రైవర్ చిన్న (25) అనురాధ థియేటర్ సమీపంలోని తన ఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య చిలకమ్మతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
మగ శిశువు లభ్యం
ఉయ్యాలవాడ: మాయలూరు గ్రామంలోని ఓ పాడుబడిన గృహంలో మగశిశువు లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెన్నపూస శంకర్‌రెడ్డికి చెందిన పాడుబడిన గృహం నుంచి నవజాతశిశువు ఏడుపు వినిపించింది. సమీపంలో నివసించే నాగేశ్వరమ్మ ఆ శబ్దం విని గృహాలు వెతుకుంటూ వెళ్లింది. పాడుబడిన గృహం లోపలికి వెళ్లి చూడగా మగ శిశువు కనిపించా డు. వెంటనే ఆ శిశువును ఎత్తుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించడంతో శిశువును తిరిగి గ్రామానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నందిరెడ్డి ఈశ్వరరెడ్డి ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఆ తల్లి పేగు బంధాన్ని తెంచుకుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
‘బండ’డు కష్టాలు
ఇండియన్ గ్యాస్‌ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆదివారం ఆస్పరిలో బస్టాండ్ దగ్గర సిలిండర్లును క్యూలో పెట్టి ఉంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గరకు గ్యాస్ సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆస్పరిలో మాత్రం జరగడం లేదని వినియోగదారులు అవేదన చెందుతున్నారు. ఆదివారం 250 మంది గ్యాస్ కోసం సిలిండర్లు క్యూలో పెట్టి వేచి ఉండగా గ్యాస్ ఏజెన్సీవారు 80 మందికి మాత్రమే ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు. –ఆస్పరి -
25 ఏళ్ల తర్వాత..!
నందవరం: దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఆ పాఠశాలలో ఆనందాలు విరబూశాయి. స్థానిక నాగలదిన్నె జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. స్థానిక పాఠశాలలో 2000–2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పాతికేళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నా రు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరునొకరు పిలుచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమంలో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన గురువులు షాజహాన్, నరసింహులు, రంగస్వామి, ఉస్సేన్ తదితర ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 11వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు బాషా ప్రాముఖ్యతను వివరించండి నంద్యాల(వ్యవసాయం): తెలుగు బాషా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని 2026 ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి అన్నారు. విద్యార్థులలో తెలుగుపై మక్కువ పెంచడం ఎల్ఙా అనే అంశంపై ఆదివారం ఓ ప్రైవేటు కళాశాలలో చర్చా గోష్టి నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, తెలుగు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో తెలుగు వాతావరణాన్ని సృష్టించాలన్నారు. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలన్నారు. సోషల్ మీడియాలో తెలుగుకు ప్రాధాన్యం ఉండాలని, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించాలని, విద్యాలయాల్లో తెలుగు పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో ప్రతినెల సాహితీ సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, రచయి మాబు బాషా, అధ్యాపకులు కొప్పుల ప్రసాదు, మురళీధరరెడ్డి, ప్రసాద్, మహామ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు. మీరాపురం వాసి ఐఎఫ్ఎస్కు ఎంపిక బనగానపల్లె రూరల్: మీరాపురం గ్రామానికి చెందిన బండి ఉమామహేశ్వరరెడ్డి, వందన దంపతుల కుమారుడు బండి జయఅశ్వర్థరెడ్డి ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. తండ్రి ఉమామహేశ్వరరెడ్డి ప్రస్తుతం విజయవాడలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. జయఅశ్వర్థరెడ్డి విద్యాభ్యాసం బనగానపల్లె, కర్నూలులో, ఇంటర్, బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) హైదరాబాద్‌లో పూర్తి చేశారన్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ గత సంవత్సరం జరిగిన యూపీఎస్సీ పరీక్ష రాశారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా జయఅశ్వర్థరెడ్డి ఇండియన్ ఫారెస్టు సర్వీస్‌కు ఎంపికై నట్లు కుటుంబీకులు తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,200 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్‌కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్‌కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు. -
ఆరోగ్యంపై రంగు పడుద్ది!
వాటిని చూడగానే నోరూరిస్తున్నాయని ఆబగా తింటున్నారా...అయితే కాస్త ఆగండి. మీరు తినే రంగులు కలిపిన ఆహార పదార్థాలలో పరిమితికి మించి, నిషేధిత సింథటిక్ కలిపి ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు జీర్ణకోశవ్యాధులు, భవిష్యత్‌లో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. లాభాపేక్ష కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ● ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రంగుల వినియోగం ● నిషేధిత రంగులూ యథేచ్ఛగా వాడుతున్న వ్యాపారులు ● హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో అధికం ● జీర్ణకోశవ్యాధులు, క్యాన్సర్‌కు అవకాశం ● దాడులు చేస్తున్నా మారని వైనం కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడ్ తోపుడు బండ్లు, టీ దుకాణాలు, మొబైల్ క్యాంటీన్లు, డాబాలు, చాట్బాండార్, నూడుల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 15 వేలకు పైగా ఉంటాయి. కర్నూలు నగరంలో మాత్రమే 4 వేల దాకా హోటల్స్, దుకాణాలు, రోడ్డుసైడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయా వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా వీటిలో జీఎస్టి చెల్లించేది కేవలం 5 శాతంలోపు వ్యాపారులే ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల, జంక్‌ఫుడ్ కేంద్రాలు, కూల్‌డ్రింక్స్ దుకాణాలలో పరిమితికి మించి ప్రాణాంతక బుష్‌పౌడర్ అనే సింథటిక్ కలర్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక కిలో ఆహార పదార్థానికి 0.001మి.గ్రా వాడాలి. అయితే వ్యాపారులు వారు విక్రయించే ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న ఉద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా ఫుడ్‌కలర్ వాడుతున్నారు. ఇలా పరిమితికి మించి వాడితే ఆ పదార్థాలను తిన్న వారికి జీర్ణకోశవ్యాధులు, కాలేయ వ్యాధులు, కడుపులో అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ రంగులను ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా, కచోరి, కట్లెట్, రెస్టారెంట్లలో బిర్యానీలు, గ్రేవీ ఐటమ్స్, పలు రకాల ఫ్రై ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, కేక్‌లు, కూల్‌డ్రింక్‌లలో ఎక్కువగా వాడుతున్నారు. లెక్కచేయని వ్యాపారులు ఆహార భద్రత అధికారులు ఇటీవల కాలంలో కల్తీ పదార్థాలు, నిషేధిత రంగులు కలిపిన పదార్థాలను విక్రయించే వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా వారు ఆహార పదార్థాల్లో నిషేధిత సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరైనా దాడులు చేస్తే వెంటనే వ్యాపారులు వారికి పరిచయం ఉన్న వారితో ప్రజాప్రతినిధులతో అధికారులకు ఫోన్ చేయించి ‘మా వాడే వదిలేయండి’ అని చెప్పిస్తున్నారు. నూటికి 70 శాతం మంది ఇలాగే చేస్తుండగా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలోని పలువురు వ్యాపారులస్తులపై దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయినా కూడా ఇతర వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది. రంగులు కలిపిన బెల్లంరంగులు కలిపిన బఠానీలురంగులు కలిపిన కివీ డ్రై ఫ్రూట్ ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీమంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్‌లో ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్డ్రింక్స్లోనూ పరిమితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నాం. – కూర్మా నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఉమ్మడి కర్నూలు జిల్లా -
మాజీ సైనికుడి భార్య ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వీరేష్ భార్య శైలజ(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అప్పుల బాధతో యువకుడు..కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుద్యాల గ్రామంలోని రాజమూరి నాగశేషులు, నాగలక్ష్మీల దంపతులకు కుమారుడు పుల్లయ్య అలియాస్ ప్రవీణ్(23)తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటర్ చదివిన పుల్లయ్య చదువు మానేసి ఐదేళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు జీతం సరిపోగా స్నేహితుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..మహానంది: గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం నాగలక్ష్మమ్మ (68) గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగలక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆదివారం గ్రామ సమీపంలో రైల్వే గేటు వద్ద గూడ్సు రైలు కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న నంద్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కోడలు లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బాలుడి అదృశ్యంపై ‘సిట్’ విచారణ
కౌతాళం: బాలుడి అదృశ్యంపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణ చేపట్టింది. ఇందుకోసం సిట్ సభ్యులు ఆదివారం బదినేహాల్ గ్రామానికి వెళ్లారు. పొలానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లి బాలుడు మాల రవీంద్ర (17) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 2024 నవంబర్ 13న కౌతాళం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన కుమారుడి మిస్సింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేదని రవీంద్ర తల్లి మాల గంగమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 13 మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు ఆదివారం బదినేహాల్‌కు వచ్చి గంగమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అలాగే తుంగభద్ర దిగువ కాలువ వద్దకు కూడా వెళ్లి విచారణ చేపట్టారు. -
వామ్మో.. వంతెన
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందరవాగుపై ఏర్పాటు చేసిన వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిటీష్‌కాలంలో 1932లో వాగుపై ఇరుకై న వంతెన ఏర్పాటు చేశారు. వంతెన నిర్మించి 94 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఏర్పాటు చేసిన కడ్డీలు ఒకవైపు వంగిపోవడంతోపాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనకు సైడ్‌వాల్స్ లేకపోవడంతో గతంలో వాహనాలు వాగులో పడి ప్రయాణికులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై ప్రయాణసమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా వాహనాలు వాగులోపడి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు దెబ్బతిన్న వంతెన స్థానంతో కొత్తగా వంతెన ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి
కర్నూలు(సెంట్రల్): అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్‌కుమార్, ఈడుపుగంటి మోహన్‌రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్‌గా శివప్రసాద్ ఎన్నికయ్యారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
పాణ్యంలో ఆరబెట్టిన మొక్కజొన్నలో నీటిని తోడుతున్న రైతులునెరవాడ మెట్ట వద్ద ధాన్యంపై పట్టలు కప్పడంతో నిలిచిన వర్షపునీరుపాణ్యం: మద్దతు ధర లేక కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షంతో నీటిపాలైంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పాణ్యం, నెరవాడ, బలపనూరు, కొండజూటూరు, భూపనపాడు, కొణిదేడు గ్రామాల్లో వర్షం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోసుకోగా అకాల వర్షం కురియడంతో మొత్తం నీట తడిసి పోయింది. వర్షం తగ్గిన తర్వాత రైతులు వర్షపునీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాణ్యంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్లలో వర్షపునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నెరవాడ మెట్ట వద్ద సర్వీసు రోడ్లపై వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకోగా దిగుబడులు మొత్తం నీట తడిసి పోయాయి. -
టీడీపీ నేత ఇసుక అక్రమ తరలింపు
● జుర్రేరు వాగు సమీపంలో అడ్డుకున్న రైతులుకోవెలకుంట్ల: కోవెలకుంట్ల మండలం బిజనవేముల– అమడాల గ్రామాల మధ్య జుర్రేరు వాగు సమీపంలో శనివారం ఇసుక అక్రమ తరలింపును రైతులు అడ్డుకున్నారు. బిజనవేములకు చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు బాడుగకు ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసుకుని ఏడు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టాడు. ఒక్కో ట్రిప్పు ఇసుకను రూ. 700 ప్రకారం విక్రయాలు జరుపుతుండగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి లేకుండా బంజరు భూమిలో ఇసుక తవ్వవాలు ఎలా చేస్తావంటూ ప్రశ్నించారు. ఇసుకను తరలించుకపోతే పక్క రైతుల భూమి కోతకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వక పనులను అడ్డుకుని పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం చేరవేయడంతో సదరు నాయకుడు పనులను ఆపి అక్కడి నుంచి ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్‌ను తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. -
తిరుచ్చిరాపల్లి వరకు తిరుపతి రైలు
బొమ్మలసత్రం: గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై తిరుచ్చిరాపల్లి నడవనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు నుంచి నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల మీదుగా తిరుపతికి వెల్లే ఎక్స్‌ప్రెస్ నెంబర్ 17261/17262 రైలు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ గారి సూచనల మేరకూ తిరుచ్చినాపల్లి వరకూ పొడిగిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై అరుణాచలం వెళ్లే భక్తులకు ఈరైలు సదుపాయంగా ఉంటుందని వివరించారు. అంతర్జాతీయ గౌరవం అభినందనీయం మంత్రాలయం: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రాఘవేంద్రకు అంతర్జాతీయ స్థాయి గౌరవం దక్కడం అభినందనీయం అని శ్రీరాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ వ్యవస్థాపాకుడు ఎం.పీ.టీ. న్యూరో డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రాఘవేంద్రకు బుక్ఆఫ్వరల్డ్ను పీఠాధిపతి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరఫీ రంగంలో విశేషసేవలకు గుర్తింపుగా అవార్డు రావడం విశేషం అన్నారు. ఈ అవార్డు డాక్టర్‌కు మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. మిడ్ కెరీర్ ట్రైనింగ్‌కు కర్నూలు డీఎఫ్ఓ కర్నూలు కల్చరల్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్స్‌కు నిర్వహించే మిడ్ కెరీర్ ట్రైనింగ్‌కు కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల వెళ్లనున్నారు. ఈనెల 11 నుంచి జూన్ 5వ తేదీ వరకు డెహ్రాడూన్ ఐజీఎన్ఎఫ్ఏలో నిర్వహించే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మేనేజ్మెంట్ మాడ్యూల్, థెమాటిక్ టూర్, లైన్ మినిస్ట్రీ మాడ్యుల్, ఫారెస్ట్రీ మాడ్యుల్లో నాలుగు వారాల శిక్షణలో పాల్గొంటారు. ఈమె ట్రైనింగ్‌కు వెళ్లనుండటంతో నంద్యాల డీఎఫ్‌వో నాగమునేశ్వరికి కర్నూలు ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు. 12 నుంచి గుంతకల్లు– మార్కాపురం రైలు ● డోన్, నంద్యాల మీదుగా పయనం మద్దికెర: గుంతకల్లు నుంచి మార్కాపురం మధ్య ప్రతిరోజు ప్రయాణించే రైలును ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు శనివారం తెలిపారు. 57407 నంబర్ రైలు గుంతకల్లు నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 5.33 గంటలకు మద్దికెరకు చేరుకుంటుందన్నారు. 6.18 గంటలకు పెండేకల్లు, 6:43 గంటలకు డోన్, నంద్యాల మీదుగా రాత్రి 11.30 గంటలకు మార్కాపురం రోడ్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అలాగే 57408 నంబర్ రైలు ఉదయం 4.30 గంటలకు మార్కాపురం రోడ్లో బయలుదేరి నంద్యాల మీదుగా డోన్‌కు 8.45కు, పెండేకల్లుకు 9.10, మద్దికెరకు 9.35, గుంతకల్లుకు 10.30కు చేరుకుంటుందన్నారు. ఈనెల 12న ప్రారంభయ్యే రైలు గుంతకల్లులో మధ్యాహ్నం 1:23కు బయలుదేరుతుందన్నారు. -
బెట్టింగ్‌ల అప్పు తీర్చడానికి చోరీ
● దొంగను అరెస్ట్ చేసిన పోలీసులుఆళ్లగడ్డ: బెట్టింగ్‌లో అప్పు చేసి వాటిని తీర్చడానికి ఒక యువకుడు చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి రాజమండ్రిలో ఉంటూ బెట్టింగ్‌లో అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక తన గ్రామంలో పక్కింట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు చవ్వరామలక్ష్మమ్మ బంగారు ఆభరణాలు అపహరించడానికి పక్క ప్రణాళిక వేసుకున్నాడు. రామలక్షమ్మ ఇంట్లో ఏప్రిల్ 29న ఒంటిరిగా ఉందని గమనించాడు. తలకు హెల్మెట్ ధరించి, చేతులకు గ్లౌవ్స్ వేసుకుని మోటార్‌సైకిల్‌పై ఇంటి ముందుకు వచ్చా డు. తాను మట్టి పరీక్షలు చేసెందుకు వచ్చిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. మట్టి పరీక్షలు చేయాలంటే కొంచెం ఐసు ముక్కలు అవసరమని అడగడటంతో వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లారు. వెనుకే ఇంట్లోకి వెళ్లిన జగన్మోహన్రెడ్డి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చైను దొంగతనం చేశారని కేసు నమోదు చేసుకున్న దొర్నిపాడు పోలీసులు పూర్తి విచారణ జరిపారు. పక్కింటి యువకుడే అని తేలడంతో శనివారం అదుపులోకి అతని దగ్గర నుంచి బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
హామీలకు సుస్తీ.. అమలుకు స్వస్తి!
డోన్: గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ డోన్ పర్యటన సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గంలోని జలదుర్గంను మండల కేంద్రంగా మారుస్తామని చెప్పి మరచిపోయారు. ఆర్హతలతో సంబంధం లేకుండా అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి నివేశన స్థలం పట్టాలను మంజూరు చేస్తామనే మాట ఇప్పటి వరకు నెరవేరలేదు. గుండాల గ్రామంలో రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామని, డోన్‌లో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. డయాలసిస్ సెంటర్ లేనట్టే! డోన్ వంద పడకల ప్రాంతీయ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టీడీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న 61 కిడ్నీ డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరో 12 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. మంత్రి ప్రకటించిన సెంటర్ల జాబితాలో డోన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పీలేరు, భీమవరం, జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వేకోడూరు, కొండిపి, కొవ్వూరు, నందిగామ, వినుకొండ, వెంకటగిరి, అద్దంకిలతో పాటు నంద్యాల జిల్లా సున్నిపెంట ఆసుపత్రుల్లో డయాలసిస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. డోన్ వందల పకడల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయి. అయినా ప్రకటన చేయకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.40 కోట్ల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో డోన్‌లో అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మించింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని విభాగాలకు ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం ఏమటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డోన్ ఏరియా ఆసుపత్రికి మంజూరు కాని కిడ్నీ డయాలసిస్ సెంటర్ హామీలను విస్మరించిన టీడీపీ ప్రభుత్వం బూటకపు వాగ్దానాలపై ప్రజాగ్రహం -
మార్చురీకి తాళం వేసిన వర్కర్లు
● జీతాలు ఇస్తేనే పనిచేస్తామని ఆందోళన ● మొదలు కాని పోస్టుమార్టం ప్రక్రియ ● మృతుల కుటుంబీకుల ఆందోళన ● ఫోరెనిక్స్ హెచ్ఓడీకి మెమో జారీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మార్చురీ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. మార్చురీలో పనిచేసే వర్కర్లు తాళం తీయకపోవడంతో ఉదయం 10.30 గంటలు దాటినా పోస్టుమార్టంకు సంబంధించి ప్రక్రియ మొదలు కాలేదు. తాళం తీయడానికి వర్కర్లు ఎవ్వరూ రాకపోవడం, తమకు జీతాలు ఇస్తేనే పనిచేస్తామని వారు భీష్మించడంతో ఆందోళన పరిస్థితి తలెత్తింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు మూకుమ్మడిగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడీని కలిసేందుకు వెళ్లారు. ఆయన ఎగ్జామినర్ డ్యూటీలో ఉండటంతో కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆమె కూడా జూమ్ మీటింగ్‌లో ఉండటంతో విధిలేక నినాదాలు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ఫోరెన్సిక్ విభాగం వైద్యులను పిలిపించి మృతులకు పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్యులు వెళ్లి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో మార్చురీ గదిని తెరిచారు. కొద్దిసేపటికి ఇద్దరు వర్కర్లు రావడంతో పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. మార్చురీ సిబ్బంది మృతుల కుటుంబీకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు తీసుకున్న వ్యక్తి, మరొకరు విధులకు గైర్హాజరు కాగా.. మరో ఇద్దరితో పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. కాగా మార్చురీలో రాబందులు శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్‌కు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మెమో జారీ చేశారు. -
బోగస్.. ప్రజెంట్ సార్!
● ఉపాధి హామీ పనుల్లో బోగస్ మస్టర్లుకొలిమిగుండ్ల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీలకే ఎక్కువగా లబ్ధి జరుగుతోంది. ఇందుకు టీడీపీ నాయకులు సహకారం అందిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను తమ అనుమాయులనే నియమించుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో 44,677 జాబ్ కార్డులు ఉండగా 60,664 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. పనులకు వెళ్లకుండా చాలా మంది జాబ్ కార్డులు పొందారు. వీరికి హాజరు వేస్తుండటంతో పనులు చేసే కూలీలకు అన్యాయం జరుగుతోంది. ఒకరి పేరిట అందరికీ హాజరు పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రతి కూలీ ముఖాన్ని ఆన్లైన్లో యాప్ ద్వారా ఎఫ్ఎర్ఎస్(ఫేస్ రిగ్నైజేషన్ సిస్టం)లో నమోదు చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడి నుంచి ట్యాగ్ చేశారో అక్కడ మాత్రమే ఎఫ్ఆర్ఎస్ అవుతుంది. చాలా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకరి ముఖాన్ని ఆన్లైన్ చేసి మిగిలిన వారికి హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో పదుల సంఖ్యలో బోగస్ కూలీలకు లబ్ధి జరుగుతోంది. ఇతర పనులు చేసేకునే వాళ్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాల్లోని ముగ్గురు, నలుగురికి మస్టర్లలో హాజరు వేసి వేతనాలు పొందుతున్నారు. ఒప్పందం కుదుర్చుకుని ఇంటి నుంచి బయట పనులకు వెళ్లని చాలా మంది మహిళలను ఉపాధి కూలీలుగా మార్చారు. పలు గ్రామాల్లో తెల్లవారు జామునే వారిని పని ప్రదేశం సమీపం వరకు తీసుకెళ్లి ఫేస్‌యాప్ తీసుకొని హాజరు వేసి ఇళ్లకు పంపిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాదికి ఒక సారి సోషల్ ఆడిట్ నిర్వహిస్తూ.. కూలీలు, పని ప్రదేశాలను తనిఖీ చేస్తారు. ఈలోగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది ఆడిట్ సిబ్బందికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. సామాజిక తనిఖీ బహిరంగ సభలో సైతం నివేదికలు చదివి వినిపించి చిన్న తప్పులు మాత్రమే జరిగాయి రికవరీ చేయండి అని అధికారులు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పనులకు వెళ్లకుండా హాజరు వేస్తున్నారనే వాటిపై దృష్టి సారిస్తాం. ఫేస్ యాప్ వచ్చాక తప్పకుండా పని ప్రదేశంలో పోటో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ వచ్చాక చాలా వరకు బోగస్ తగ్గింది. తనిఖీలు నిర్వహించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – సాంబశివరావు, ఏపీడీ -
విద్యార్థి అనుమానాస్పద మృతి
మహానంది: గోపవరం గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి తిమ్మపోగు రాజు (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహానంది పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మపోగు రాజు ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లి శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బావిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మహాలక్ష్మికి కుమారుడు, కూతురు ఉండగా ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో శోకసంద్రంలో మునిగారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మాఫియాగా మారిన కూటమి నేతలు
పేదల బియ్యాన్ని కారు చౌకగా డీలర్లు కొట్టేస్తే, వారి వద్ద నుంచి తీసుకోవడానికి కూటమి నేతలు మాఫియా అవతారం ఎత్తుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా ప్రజాప్రతినిధుల అండతో అక్రమ బియ్యం వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు రేషన్ షాపుల్లో పేదలకు బియ్యం వేస్తుండగా.. 5నుంచి 20వ తేదీ వరకు వినియోగదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని అధికారుల అండతో మాఫియా నేతలు జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే బియ్యం అక్రమ దందాలో కొందరు అధికారులకు కూడా వాటాలు ఉంటుండడంతో కిమ్మనడం లేదని తెలుస్తోంది. ఈవిధంగా ప్రతి నెలా జిల్లాలో దాదాపు రూ.50–60 కోట్ల వ్యాపారం జరుగుతోంది. -
మార్చురీలో రాబందులు
కర్నూలు(హాస్పిటల్): తమ వారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం అవినీతి జలగలు వదలడం లేదు. మృతదేహాన్ని ఇచ్చేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నంద్యాల జిల్లా కోయిలకుంట్లకు చెందిన ఓ వ్యక్తి మరణించడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అప్పగించేందుకు అక్కడి సిబ్బంది భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబసభ్యులు కొందరు బేరమాడి చివరకు రూ.2వేలు అక్కడి సిబ్బంది చేతిలో పెట్టారు. ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. మార్చురీలో ప్రతిరోజూ 6 నుంచి 10 మృతదేహాల వరకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. అనంతరం వివిధ రకాల ఖర్చుల పేరుతో అక్కడి సిబ్బంది మృతుల కుటుంబీకులు, బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా మెడికల్ కళాశాల, ఫోరెన్సిక్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మార్చురీలో పనిచేసే సిబ్బంది అందరూ అనధికారికంగా ఉన్న వారే కావడం గమనార్హం. ఇక్కడ రెండు పోస్టులున్నా ప్రభుత్వం భర్తీ చేయలేదు. కనీసం ఆసుపత్రిలో పారిశుధ్య సిబ్బంది కిందనైనా కొందరిని తీసుకుని ఇక్కడ నియమించాలని అధికారులు కోరినా పట్టించుకోని పరిస్థితి. దీంతో ఇక్కడి వైద్యులే బయటి వ్యక్తులను పిలిపించుకుని పనిచేయించుకుంటున్నారు. వీరు ప్రతిరోజూ మార్చురీని శుభ్రం చేయడం, మృతదేహాలను పోస్టుమార్టంకు రెడీ చేయడం, పోస్టుమార్టం అనంతరం కుట్లు వేసి, దానికి బట్టలు చుట్టి కుటుంబసభ్యులకు అందించే ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఈ విధులు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అధికారికంగా సిబ్బంది ఎవరూ లేకపోవడం, అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ వచ్చి పనిచేయడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘చౌక’గా నొక్కేస్తున్నారు!
కర్నూలు(సెంట్రల్): టీడీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బియ్యం కావాలంటే 5వ తేదీలోపు రావాలని, లేదంటే ఇచ్చినంత డబ్బు తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేరుగా డీలర్లే వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కారుచౌకగా కేజీ బియ్యం రూ.10లకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 5వ తేదీ తర్వాత వెళితే బియ్యం లేవని మొండికేస్తుండటంతో, కార్డుదారులు డీలర్లు ఇచ్చిన అరకొర డబ్బుతో సరిపెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 1,233 రేషన్ దుకాణాలు ఉండగా.. వీటి పరిధిలో 6,34,631 కార్డుదారులు ఉన్నారు. అయితే డీలర్లు అక్రమాలకు మరిగి ప్రతి నెలా 5వ తేదీ వరకు మాత్రమే కొందరికి సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఆ తరువాత షాపులకు వచ్చిన వారికి షాక్ ఇస్తున్నారు. బియ్యం లేవని.. కావాలంటే డబ్బులు ఇస్తామంటున్నారు. కచ్చితంగా బియ్యం కావాలంటే మరో షాపు చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. అక్కడా ఇదే పరిస్థితి ఉండటంతో, తిరి గొచ్చి డీలరు ఇచ్చిన డబ్బుతో ఇంటిముఖం ప డుతున్నారు. ఇకపోతే 5వ తేదీలోపు చాలా వరకు దు కాణాలు మూతవేసి కనిపిస్తుండటం గమనార్హం. చౌక దోపిడీ ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని అమ్మడం, కొనడం చేయరాదు. అయితే ప్రజలకు అందించాల్సిన రేషన్ సరుకులను డీలర్లే కాజేస్తున్నారు. కారు చౌకగా కేజీ బియ్యం రూ.10తో వినియోగదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని నొక్కేస్తున్నారు. వీరు దానిపై రూ.9 వరకు లాభం పెట్టుకొని సమీపంలోని వ్యాపారులకు రూ.19 ప్రకారం అమ్ముతున్నారు. వారు దానిపై రూ.5 అదనంగా లాభం వేసుకొని రూ.24లకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి మరో రూ.10 లాభంతో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అంటే జిల్లా సరిహద్దులు దాటేలోపు బియ్యం ధర రూ.34లకు చేరుకుంటోంది. రేషన్ బియ్యం డీలర్లపాలు! కచ్చితంగా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు రేషన్ షాపుల్లో బియ్యం వేయాల్సిందే. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ సరుకులను పంపిణీ చేయాలి. సరుకులకు బదులు డబ్బు ఇస్తామని డీలర్లు చెబితే 1967కు నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదంటే నేరుగా వచ్చి మాకు ఫిర్యాదు చేసినా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – ఎం.రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు -
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
కోడుమూరు రూరల్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు గాయపడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం కోడుమూరులో చోటు చేసుకుంది. స్థానిక గొల్లవీధికి చెందిన శివమ్మ రేకుల గుడిసెలో నివాసముంటోంది. శుక్రవారం పనిచేసేందుకు ఆమె బయటకు వెళ్లగా, కోడలు మాత్రంలో గుడిసెలో ఉంది. అయితే గుడిసెలోని గ్యాస్ సిలిండర్ లీకవ్వడంతో మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్లు మంటలను ఆర్పేందుకు యత్నిస్తుండగా, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రేకులగుడిసె పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు, గుడిసె పక్కనే ఉన్న చెట్లు, గడ్డివాములకు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా గుడిసెకు నిప్పంటుకున్న సమయంలో గుడిసెలోని సామాన్లను బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లిన రాముడు, చిట్టెమ్మకు మంటలు తాకి గాయాలయ్యాయి. ప్రమాదంలో శివమ్మ నివాసముంటున్న గుడిసె పూర్తి దగ్ధమవ్వడంతో పాటు, గుడిసెలోని వస్తువులు, తిండిగింజలు, నగదు కాలిపోవడంతో సుమారు రూ.3 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
చిన్న వంతెన.. పెద్ద ప్రమాదం
చిత్రంలో కనిపిస్తున్న ఈ వంతెనను చూస్తే అంత ప్రమాదకరరమేమి కాదు అనిపిస్తోంది. కానీ ఇక్కడ జరిగే ప్రమాదాలు గురించి తెలుసుకుంటే వామ్మో అనాల్సిందే. కోవెలకుంట్ల– లింగాల ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని వల్లంపాడు సమీపంలో చిన్న వంచెవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. వాగుపై ఇరుకై న లోలెవల్ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెన సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మలుపులు ఉండటంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కోవెలకుంట్ల– నంద్యాల ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతుండటంతో కల్వర్టుల నిర్మాణంలో పలుచోట్ల రోడ్డును తవ్వారు. దీంతో వాహన చోదకులు లింగాల మీదుగా నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి వేళల్లో మలుపుల వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్న వంచెవాగు కుందూనదికి అనుసంధానంగా ఉండటంతో వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత ఏడాది నెల రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు వాగు ఉధృతిని గమనించక వాగులో కొట్టుకపోయి మృత్యువాత పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వాహన చోదకులకు వంతెన కష్టాలు తీర్చి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు. – కోవెలకుంట్ల -
మాట ఇచ్చి.. అయోధ్యకు తీసుకెళ్లి!
పాములపాడు: అయోధ్యలో బాలరాముని దర్శనార్థమై శుక్రవారం పాములపాడు నుంచి 320 మంది భక్తులు బయల్దేరారు. వారందరినీ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నాగరాజు దాదాపు రూ. 15 లక్షల సొంత ఖర్చులతో తీసుకెళ్లారు. నాలుగు నెలల క్రితం గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అయోధ్యకు ఎంత మంది వచ్చినా సొంత ఖర్చులతో బాల రాముని దర్శన భాగ్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఈ మేరకు టికెట్లు బుక్ చేయించారు. అయోధ్యతో పాటు కాశీకి కూడా వెళితే బాగుంటుందని కొందరు అడుగగా సరే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 320 మంది భక్తులతో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సులో కర్నూలుకు బయలుదేరారు. అక్కడి నుంచి రైలులో వెళ్లనున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఒక రోజు అయోధ్య, మరో రోజు కాశీలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతారు. -
కేదార్‌నాథ్‌లో ఆదోనివాసి మృతి
ఆదోని అర్బన్: కేదార్నాథ్ క్షేత్ర దర్శనానికి వెళ్లిన ఆదోని పట్టణానికి చెందిన మాజీ సైనికుడు మహేష్ (60) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గౌలీపేట కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహేష్ తన భార్య లక్ష్మితో కలిసి వారం రోజుల క్రితం ఆదోని నుంచి కేదార్నాథ్యాత్రకు వెళ్లారు. కేదార్నాథ్ సమీపంలో శుక్రవారం ఉదయం మహేష్‌కు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చింది. తోటి యాత్రికులు గమనించి చికిత్స అందించేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడి అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఆదోనికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం నందవరం: మండల కేంద్రం నందవరం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ తెలుగు వీరేష్(21) శుక్రవారం మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పూలచింత చెరువు గట్టు నుంచి గరుసు (మట్టి) తరలించేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన తిప్పరాజు, ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు వీరేష్ వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో గరుసు మట్టిని లోడ్ చేసుకుని వస్తూ ఉండగా పూలచింత దిగువ కాలువ వద్ద రహదారిపై ఉన్న కల్వర్టుకు ట్రాక్టర్ ఢీకొన్ని బోల్తా పడింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వీరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కోడుమూరు గ్రామ సమీపంలో మృత్యువాత పడ్డాడు. చేతికొచ్చిన కుమారుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి గోస్పాడు: జూలేపల్లి గ్రామానికి చెందిన వడ్డే పెద్ద సుబ్బరాయుడు (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బైక్‌పై వడ్డే పెద్ద సుబ్బరాయుడు, నరసింహలు శుక్రవారం గోస్పాడు వైపు వెళ్తుండగా పసురుపాడు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వడ్డే పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. హోరాహోరీగా కబడ్డీ పోటీలు ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ రథోత్సవం సందర్భంగా యువశక్తి టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియన్ కబడ్డీ పోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. కర్ణాటక, ఆంధ్ర, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 30 టీంలు పాల్గొన్నాయని ఆర్గనైజర్ రాజు తెలిపారు. స్థానిక ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో కబడ్డీ ఆడేందుకు ప్రత్యేకంగా మ్యాట్‌ను ఏర్పాటు చేసి మ్యాచ్‌లను నిర్వహించారు. శనివారం ఫైనల్ పోటీలు ఉంటాయని మొదటి విన్నర్‌కు రూ.40 వేలు, రన్నర్‌కు రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. -
వైభవంగా పాండురంగడి చక్రస్నానం
కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, వసంతోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. లోక కల్యాణార్థం కోనేటిలో నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది. రాత్రి ధ్వజావరోహణ, కంకణ నిమజ్జనం, నాకబలి కార్యక్రమాలతో గత నెల 26న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ అర్చకులు తెలిపారు. -
మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ప్రధానార్చకులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం అర్చకులు, వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి గౌరవార్థం వస్త్రసమర్పణ చేశారు. చివరిగా పీఠాధిపతి భక్తులను అనుగ్రహణ భాషణం చేశారు. 8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు సీఈఓ జీవీ రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘాల సభ్యులు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన సమాయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు. సూర్యనందీశ్వరునికి కిరణాభిషేకం మహానంది: నందిపల్లె సమీపంలోని నవనంది పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీసూర్యనందీశ్వరస్వామి దేవస్థానంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం సూర్యోదయం వేళ సూర్యనందీశ్వరస్వామిని సూర్యకిరణాలు తాకిన దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. కాగా ప్రతి ఏటా వైశాఖమాసంలో ప్రతి నిత్యం ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుని కిరణాలు నేరుగా సూర్యనందీశ్వరస్వామికి అభిషేకిస్తాయని అర్చకులు కృష్ణ శర్మ తెలిపారు. ప్రైవేటులో ఉచిత ప్రవేశాల ఫలితాలు విడుదల నంద్యాల(న్యూటౌన్): ఆర్టీఈ చట్టం 12సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల రెండో విడత ఫలితాలు విడుదలైనట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంఽధించి రెండో విడత ఫలితాలు వచ్చాయన్నారు. అందులో 346 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. వివరాలను https:// cse. ap. gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు కుల, ఆదాయ ధ్రువీకరణ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 16వ తేదీలోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చన్నారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించాలన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు నంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్‌ల్లో చేరేందుకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ జాన్సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులో చేరేందుకు పదవ తరగతి పాస్ అయి న వారు అర్హులన్నారు. www. angrau. ac. in లో దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయం పని వేళల్లో 9989625208ను సంప్రదించాలన్నారు. -
రైతుల గోడు పట్టదా?
నంద్యాల(అర్బన్): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్ పీపీ నాగిరెడ్డి విమర్శించారు. ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులకు మద్దతు ధర వచ్చేంత వరకు పోరాటం సాగిస్తామంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక టెక్కె మార్కెట్‌యార్డు వద్ద నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులతో వారు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఇసాక్‌బాషా, పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా రైతులకు మాత్రం దక్కడం లేదన్నారు. రైతులు దళారులను నమ్మి పూర్తిగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతుల కోసం రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రైతు కంట కన్నీరు ఒలికితే ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని, ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, బసవేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, శివనాగిరెడ్డి, దేవనగర్ బాషా, గోస్పాడు ఎంపీపీ ఆర్థర్సైమాన్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, టీవీ రమణ, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
మహాయోగి లక్ష్మమ్మవ్వ
మహిమాన్వితురాలు ● భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి ● రేపు అవ్వ జాతర ● తరలిరానున్న భక్తజనం ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆదోని పట్టణంలో వెలిసిన అవ్వను భక్తులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఈనెల 9వ తేదీన శనివారం అవ్వ జాతర సందర్భంగా వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అవ్వ వారి సమాధి, మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అవ్వ విగ్రహాన్ని వెండి రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం ముందు చలువ పందిళ్లు వేశారు. ఇన్చార్జి డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 25 శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయాలు వెలిశాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి, సిరుగుప్ప తాలూకా రారావిలో కూడా అవ్వ వారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ పూజలందుకుంటున్నారు. ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళిత మంగమ్మ, బండెప్ప దంపతుల కుమార్తె లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. పెళ్లీడు రావడంతో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన మారెప్పకు ఇచ్చి వివాహం చేశారు. ఓరోజు ఆమె తన భర్తకు శక్తిస్వరూపిణిగా కనిపించడంతో అతడు భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. కొన్ని రోజుల తర్వాత సిరుగుప్ప నుంచి ఆదోనికి చేరుకుని పుర వీధుల్లో సంచరించే వారు. పట్టణ ప్రజలకు తరచూ ఆమె రకరకాల మహిమలు చూపుతుండడంతో మహాయోగిగా భావించి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందటం ప్రారంభించారు. ఆమె దుకాణాల వద్దకు వచ్చిపోతే వ్యాపారం బాగా జరుగుతుందనే నమ్మేవారు. సంతానం లేని వారికి అమ్మవారిని కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తుల నమ్మకం. రోజురోజుకూ మహిమలు చూపడం ఎక్కువ కావడంతో తిక్క లక్ష్మమ్మను మహాయోగిగా పిలిచేవారు. అమ్మవారు జీవించిన కాలంలోనే ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించే వారు. 1933లో పట్టణంలో జీవసమాధి అయ్యారని ఆలయ నిర్వాహకులు రాచోటి రామయ్య, రాచోటి సుబ్బయ్య తెలిపారు.రథోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులు అందరికీ అన్నదానం నిర్వహిస్తున్నాం. శ్రీభగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అవ్వవారి పేరుమీద ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యోగా సాధన, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నాం. – రాచోటి రామయ్య, ఆలయ ధర్మకర్త -
గుంతలున్నాయ్.. జాగ్రత్త!
అడుగడుగునా గుంతలు.. తారు లేచి కంకర తేలిన దృశ్యాలు.. ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోవాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. ఈ పరిస్థితులు ఉన్నా అధికారులు కనీసం మరమ్మతులు చేయడం లేదు. ఉయ్యాలవాడ – దొర్నిపాడు రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రయాణికులు, వాహనదారులు భయపడుతూ ప్రయాణిస్తూ ఇంటికి చేరుకుంటున్నారు. ఈ రహదారిని 2016–17లో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద 13.3 కిలో మేర అప్పట్లో రూ. 7.85 కోట్లు వ్యయం చేసి తారు రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం తారు లేచి పోయి దాదాపు 8 కిలో మీటర్ల పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారిలో రెండు మండలాల ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ రహదారిలో రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తే గమ్యస్థానాలకు చేరుకుంటామో లేదోనన్న భయం వాహనదారుల్లో నెలకొంది. వర్షాకాలం పరిస్థితి మరీ దారుణం. గుంతలు తెలియక ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా వున్నాయి. అధికారులు వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. – ఉయ్యాలవాడ -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
రాజకీయనేతల ఒత్తిళ్లకు భయపడి! కర్నూలు(సెంట్రల్): పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బడాబాబుల దరికి చేరుతోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలో నిల్వ ఉంచుతున్నారు. ఇందుకోసం నిర్జన ప్రాంతంలో గోదాము ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచే అక్రమ బియ్యం వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం–నూతనపల్లెల మధ్య జాతీయ రహ దారి 340సీ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ గోదాము కనిపిస్తుంది. ఇందులో ఐదారు లారీల బియ్యాన్ని ఏక కాలంలో నిల్వ చేయవచ్చు. మనుషు లు కూడా సరిగా సంచరించని ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారానికి అనువుగా ఉంటుందని నిర్మించారు. ఇక్కడి నుంచి చౌక ధరల దుకాణాల డీలర్లు, ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ గోదాములో కర్నూలు నగరం, కర్నూలు రూరల్ మండలం, కల్లూరు మండలం, మిడుతూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో అక్రమ మార్గాల ద్వారా సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ షాపుల డీలర్లు, ఇంటింటికీ వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు ఇక్కడకి వచ్చి విక్రయాలు చేస్తారని తెలుస్తోంది. బియ్యం అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు పదే పదే చెబుతుంటారు. రేషన్ బియ్యాన్ని అమ్మినా..కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని చెబుతుంటారు. అయితే అక్రమ బియ్యం వ్యాపారం కళ్లముందే జరుగుతున్నా రాజకీయనేతల ఒత్తిళ్లు, డబ్బుకు ఆశపడి అక్రమార్కులకే సహకరిస్తున్నారన్నది బహిరంగ సత్యం. ప్రస్తుతం అక్రమ బియ్యం డంపుపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియడంలేదు. -
దేవుడి భూమి స్వాహా!
అన్యాక్రాంతం నందవరం: రెవెన్యూ రికార్డులు కాదని కొందరు దేవుడి భూమిని సొంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ భూమిని పాతికేళ్లుగా అనుభవిస్తూ దర్జాను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన రీ సర్వేతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నందవరం మండలం నదికై రవాడి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి 23.97 ఎకరాల భూమి ఉంది. గ్రామం తూర్పు భాగంలో తుంగభద్రనదీ తీరంలో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరా ధర రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలాంటి విలువైన భూమిని కొందరు సెట్లర్స్(వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఉండేవారు) ఆక్రమణదారులతో కలిసి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపురం కొట్టాలకు చెందిన సత్యనారాయణ, కృష్ణమూర్తిలతో దేవుడికి అర్చకులని చెప్పి షణ్ముఖ, వీరభద్రప్పలు మాన్యం భూమిని అనుభవిస్తున్నారు. వీరందరూ కలిసి మాన్యాన్ని అనుభవిస్తూనే రికార్డులు మార్చేశారు. కృష్ణమూర్తి 6 ఎకరాలు, సత్యనారాయణ 6 ఎకరాలు, వీరభద్రప్ప 5.93 ఎకరాలు, షణ్ముక 5.94 ఎకరాల చొప్పున అనుభవంలో ఉన్నట్లు చూపించుకున్నారు. సర్వేకు అడ్డంకులు దేవుడి మాన్యం ఆక్రమణ అయ్యిందని రీ సర్వేలో బయట పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ భూమిని రికార్డుల ఆధారంగా సర్వే చేసి తమకు స్వాధీన పరచాలని రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్ అధికారులు విన్నవించుకున్నారు. విన్నపం మేరకు ఈ నెల 2న (శనివారం) మండల సర్వే అధికారి అక్బర్‌బాషా, గ్రామ సర్వేయర్లతో కలిసి సర్వే చేయడానికి వెళ్లగా అనుభవదారులు అడ్డుచెప్పారు. సర్వేకు దేవదాయ శాఖ అధికారులు రాకపోవడంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అడ్డంకిగా మారాయి. దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపట్టి భూమి దేవుడికి చెందేలా చూడాలి. గ్రామంలో ఆంజనేయ స్వామికి నిత్య పూజలు కరువయ్యాయి. ఆలయానికి సంబంధించి 23.97 ఎకరాలు దేవుడికి అప్పగిస్తే బాగుంటుంది. – ఈడిగ వేణు ఆక్రమణదారుల నుంచి దేవుడి మాన్యం విడిపించేంత వరకు పోరాడతాం. దేవదాయశాఖ, రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామానికి వచ్చి సర్వే చేసి హద్దులు చూపించాలి. లేకపోతే విశ్వహిందూ పరిషత్‌తో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సర్వే చేపట్టాలి. – బోయ వెంకటేష్ -
కమనీయం.. మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: హిందూధర్మ ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడేంలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభయాత్ర అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్లకు ప్రవర పఠించి, వరపూజ నిర్వహించి బాషికాలను అలంకరించారు. తరువాత భూమండలం, శ్రీశైల క్షేత్ర వర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగళ్యధారణ జరిపి, స్వామిఅమ్మవార్లకు తలంబ్రాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల వస్త్రాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. స్వామిఅమ్మవార్లకు పునఃపూజలు జరిపి, ఆశీర్వచనం, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. -
‘ఆరు’ విధాలుగా మేలు
● 30 సెంట్లలో ఆరు రకాల ఆకుకూరల సాగు ● రోజు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఆదాయం సి.బెళగల్: అహోరాత్రులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న సమయంలో పోలకల్ గ్రామానికి చెందిన రైతు బూడిదపాడు మద్దిలేటి వినూత్నంగా ఆలోచించారు. తన ఎకరా పామాయిల్ తోటలో అంతర పంటలుగా ఆరు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి, రాబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తోటలో గతంలో అంతర పంటగా ఉల్లి పంటను సాగుచేయడంతో నష్టాలు వచ్చాయి. నష్టాల నుంచి బయటపడేందుకు తోటలో 30 సెంట్ల భూమిలో ఆరు రకాల ఆకుకూరలను పండించాలని సంకల్పించారు. తన సతీమణి అనంతమ్మతో కలసి పొలంలో పాలకూర, తోటకూర, గోంగూరు, కొత్తిమీర, మెంతికూర, చిరుకూర విత్తనాలను చల్లారు. ఆకుకూరల పంటలు త్వరగా కోతలకు రావడంతో ప్రతిరోజు పనులను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజూ కోతలు కోసుకుని సొంతంగా గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకుని అధిక లాభాలు పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1,200ల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతు మద్దిలేటి తెలిపారు. -
కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారులు!
● కంటి అద్దాలకు బయటి దుకాణాలకు రెఫర్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కంటి అద్దాలను వైద్యులు సూచించగా, వాటిని ఫలానా దుకాణంలో తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగులు చెప్పి మరీ పంపుతున్నారు. కొందరు ఉద్యోగులైతే ఒక తెల్లకాగితంపై దుకాణం పేరు కూడా రాసి ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని, దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా వైద్యులు సూచించిన మేరకు అద్దాలను జగనన్న కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా తయారు చేసి పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకంను తీసివేశారు. అప్పటి నుంచి కంటి అద్దాలను రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. ఇలా వైద్యులు సూచించిన అద్దాలను రోగులే వారికి నచ్చిన దుకాణంలో కొనుగోలు చేసుకోవాలి. కానీ ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. ప్రైవేటు ఆప్టికల్స్ షాపులకు వీరే రోగులను పంపిస్తున్నారు. కొందరు దుకాణదారులు ఆసుపత్రిలోకి వచ్చి రోగులను వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఇలా రోగులను దుకాణాలకు పంపినందుకు గాను సదరు ఉద్యోగులకు తగిన మొత్తాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. త్వరలో రోగులకు ఉచితంగా కంటి అద్దాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులను బయట దుకాణాలకు పంపే ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొప్పుల సుధాకరరెడ్డి రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మో త్సవాలకు భార్య సౌజన్య (35)తో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి దంపతులిద్దరూ స్వగ్రామానికి వెళ్లి పోయారు. నిద్ర మధ్యలో లేచి సౌజన్య ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత భర్త గమనించి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు సేకరించారు. సౌజన్య చాలా రోజుల నుంచి తల నొప్పితో బాధపడుతుందని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చెన్నపురెడ్డి సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లెవేములలో భారీ చోరీ చాగలమర్రి: మండలంలోని మల్లెవేముల గ్రా మంలో భారీ చోరీ జరిగింది. రూ.15.50 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు గోపిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తామంతా నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఇంటి వెనుక వైపున ఉన్న తలుపులను తెరుచుకొని దుండగులు ఇంట్లోకి వచ్చారన్నారు. బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ట్లు చెప్పారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ వెంకట రమణ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను ర ప్పించారు. వేలి ముద్రలను సేకరించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య కోవెలకుంట్ల: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన నరసింహుడు(85) కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుమారుడు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ నుంచి కిందపడి వ్యక్తి మృతి ఓర్వకల్లు: పొలానికి మట్టిని తరలిస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో చేసుకుంది. మీదివేముల గ్రామానికి చెందిన ఎల్లయ్య(58) తన పొలానికి నల్లమట్టిని తరలించేందుకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణకు చెందిన ట్రాక్టర్‌ను గురు వారం అద్దెకు తీసుకున్నాడు. వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో ఉయ్యాలవాడ గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట వద్ద డ్రైవర్ పక్కన కూర్చు న్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్ఐ సునీల్‌కుమార్ తెలిపారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బనగానపల్లె: భార్య హత్యకేసులో భర్త కొండగాళ్ల వెంకటస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. అతని సోదరులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్థానిక సీఐ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. బీరవోలు గ్రామానికి చెందిన వెంకటస్వామికి కొంత కాలంగా భార్య లక్ష్మీపై అనుమానం ఎక్కువైంది. గత నెల 29న కూలి పనికి వెళ్దామని భార్యను నమ్మించి తన మోటార్‌సైకిల్‌పై గ్రామ చివర ఉన్న గాలేరు నగరి కాల్వ వద్దకు వెళ్లారు. అక్కడే భార్యతో గొడవపడి హత్య చేసి మృతదేహానికి రాయి కట్టి పక్కనే ఉన్న బావిలో వేశాడు. రెండు రోజుల తరువాత అనుమానం వచ్చిన వెంకటస్వామి మళ్లీ బావి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తన సోదరులైన వెంకటరమణ, శ్రీనివాసులను బావి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి పక్కనే పూడ్చివేశారు. ఈనెల 2న మృతురాలి తల్లి నంద్యాల దేవనగర్‌కు చెందిన రాజోలి సుబ్బలక్ష్మీ తన కుమార్తె కనిపించడం లేదని, తన అల్లుడిపై అనుమానం ఉందని నందివర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటస్వామితో పాటు సోదరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ చెప్పారు. -
భక్తి చిత్రం...భుక్తి మార్గం!
● భక్తుల వాహనాలపై అధ్యాత్మిక బొమ్మలు గీస్తూ జీవనోపాధి ● ఇదంతా శ్రీశైలేశుడి చలువే అంటున్న చిత్రకారులు 12 సంవత్సరాల నుంచి వాహనాలపై బొమ్మలు వేయడాన్ని వృత్తిగా చేసుకున్నాను. మా బొమ్మలను మెచ్చి భక్తులు ఇచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పెద్దగా చదువుకోని మేము శ్రీశైలం మల్లికార్జున స్వామినే నమ్ముకుని జీవిస్తున్నాము. ఆయనే మాకు చిత్రకారుడిగా మార్చి ఉపాధి చూపుతున్నాడు. – చందు నాయక్, చిత్రకారుడు అధ్యాత్మిక బొమ్మలు గీయడానికి మేము పెద్ద ఆర్టిస్టులము కాదు. మాకు ఎవరు గురువులు లేరు. ఒకరిని చూసి మరొకరం నేర్చుకున్నాం. స్వామి దయ వలన ఆయన సన్నిధికి వచ్చే భక్తుల వాహనాలపై చిత్రాలు గీసి జీవనోపాధి పొందుతున్నాం. కొంత మంది భక్తులు మా కళను మెచ్చుకున్నప్పుడు ఎనలేని సంతోషం కలుగుతోంది. – సతీష్, చిత్రకారుడుశ్రీశైలంటెంపుల్: త్రిశూలం, శివలింగం, శివపార్వతులు ఇలాంటి మరెన్నే భక్తి బొమ్మలు.. వేప పుల్లనే కుంచెగా మలుచుకుని క్షణాల్లో కళాత్మకంగా గీస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇదేలా సాధ్యమంటే.. శ్రీశైలేశుడు ప్రసాదించిన కళ అంటారు ఆ చిత్రకారులు. ఇల కై లాసమైన శ్రీగిరిలో భక్తుల వాహనాలపై ఆధ్యాత్మిక చిత్రాలు గీస్తూ వందమందికిపైగా జీవనోపాధి పొందుతున్నారు. శ్రీశైల క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలపై అధ్యాత్మిక చిత్రాలు వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.దీంతో శ్రీశైలంలోని వివిధ ప్రదేశాల్లో వాహనాల పై భక్తి బొమ్మలు వేయడం వృత్తిగా చేసుకున్నారు. చకచకా పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల వాహనాలను శుభ్రం చేసి వాటి అద్దాలపై అధ్యాత్మిక బొమ్మలు గీస్తారు. వేపపుల్లను కుంచెగా చేసుకొని విభూది, కుంకుమ, నీలం, అకుపచ్చ నంగులను ఉపయోగిస్తూ త్రిశూలం, శివలింగం, శివపార్వతులు, పుష్పాలు, మయూరం తదితర చిత్రాలు వేస్తారు. వారి కళను మెచ్చి వాహనదారులు ఎంతోకొంత డబ్బులు ఇస్తారు. సాధారణ రోజుల్లో కంటే రద్దీ రోజులైన శని, ఆది, సోమవారాల్లో వాహనాల్లో భక్తులు అధికంగా వస్తారు. ఆ సమయంలో చిత్రకారులకు చేతినిండా పని ఉంటుంది. -
ఆవును ఢీకొని..
ఆళ్లగడ్డ: మండల పరిధిలోని బత్తలూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై అవును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన లింగప్రసాద్ (45) అనే వ్యక్తి ఆళ్లగడ్డలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మోటర్‌సైకిల్ పై బయలు దేరగా నల్లగట్ల సమీపంలోకి వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వెంటనే శిరివెళ్లకు రావాలని చెప్పారు. దీంతో నల్లగట్ల నుంచి శిరివెళ్లకు బయలు దేరగా బత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై నల్లని ఆవును గమనించకుండా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లింగప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చుని ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలి
● మంత్రాలయం రైల్వేస్టేషన్ తనిఖీలో డీఆర్ఎంమంత్రాలయం రూరల్: రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని గుంతకల్లు డివిజిన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్ర ఎస్.గుప్తా అధికారులను ఆదేశించారు. డీఓఎం శ్రవణ్‌తో కలసి బుధవారం ఆయన మంత్రాలయం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. అక్కడ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీసి మాట్లాడారు. శ్రీరాఘవేంద్రస్వామి భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక రైల్వే అధికారులకు సూచించారు. రెండు ప్లాట్‌ఫాంలకు ఎక్స్‌వేటర్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో వాటి ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఎన్ మనోజ్, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సిద్ధారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీశైల క్షేత్రంలో స్వచ్ఛత భేష్
శ్రీశైలం: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో చేపడుతున్న చర్యలు భేష్ అని ఆదానీ అనుబంధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నో ప్లాస్టిక్ – సేవ్ నేచర్ నినాదంతో ఆ సంస్థ ప్రతినిధులు నలుగురు 12 జ్యోతిర్లింగాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన వారు పారిశుధ్య పనులు, ప్లాస్టిక్ నివారణ చర్యలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తర్వాత నివేదిక తయారు చేసి ఈవో శ్రీ నివాసరావును కలిసి అందజేశారు. బృందంలో గుజరాత్‌కు చెందిన హరినాథ్ నబ్బవ, కపిల్ గోర్, మకుందనాథ్, సావన్గర్ గో స్వామి ఉన్నారు. -
ఇప్పటికే ఉన్న గోడౌన్ల పరిస్థ్థితి ఏంటి?
టీడీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో వేర్ హౌజ్ గోడౌన్లు ఉన్నాయి. చిన్న పాటి మరమ్మతులు చేస్తే పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వీటిని పట్టించుకోలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వాలు రైతుల కోసం గోడౌన్లు నిర్మించాయి. టీడీపీ కార్యాలయం కోసం ఇప్పుడు ఆ భవనాలను ధ్వంసం చేయనున్నారు. వీటి కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలను టీడీపీ నుంచి వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అవసరమేరకే ఎరువులు వాడాలి
నంద్యాల(అర్బన్): పంటలకు యూరియా, డీఏపీలను అవసరమైన మేరకే వాడాలని, మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్రయాదవ్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్ పేర్కొన్నారు. యూరియా, డీఏపీ నిల్వల పరిశీలన నిమిత్తం నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏఓ వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రిజిస్టర్ బిల్లులు, క్రయవిక్రయాల రికార్డులు, ఈ పాస్ మిషన్ల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం, గత మూడేళ్లుగా యూరియా అమ్మకాల వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎరువులు రైతులకు అవసరమైన మేరకు సమృద్ధిగా ఉన్నాయని, ఆందోళనలతో ముందస్తుగా కొనుగోలు చేయవద్దని చెప్పారు. డీలర్లు ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, యూరియా, డీఏపీలకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు పచ్చిరొట్ట ఎరువులు అయిన జీలుగ, పిల్లిపెసర, 25 నుంచి 30 రకాల విత్తనాలు కలిగిన పీఎండీఎస్ కిట్లను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయప్రకాష్‌రెడ్డి, గిరీష్, ప్రసాదరావు, పవన్, షేక్షావలి, మహేశ్వరరెడ్డి, నేతాజీ, నాగేశ్వరరెడ్డి, పీరునాయక్, కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
నంద్యాల: రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా శ్ఙ్రీవన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్శ్రీశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతి గురువారం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ఆ గ్రామాన్ని నెలలో నాలుగురోజులు అధికారులు సందర్శించాలన్నారు. ఈ బృందంలో తహసీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, పంచాయతీరాజ్ విభాగం ఏఈ, సాగునీటి శాఖ అధికారులు, అవసరమైతే అటవీ శాఖ అధికారులు పాల్గొని గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడం, పెండింగ్ ఫిర్యాదులను తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి మండలంలో ప్రతి నెల ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు విడతలుగా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. మొదటి విడతలో గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల ప్రదర్శన, సాధారణ సమస్యల పరిష్కారం చేపట్టాలన్నారు. రెండో విడతలో ఫీల్డ్ స్థాయి పరిశీలనలు నిర్వహించి వినతులపై విచారణ చేయాలని, మూడో విడతలో సమస్యల పరిష్కారం, ఆదేశాల జారీ, మ్యూటేషన్లు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగో విడతలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. భూమి హక్కుల నమోదు, వెబ్‌ల్యాండ్ సమస్యలు, సర్వే నంబర్లలో పొరపాట్లు, సరిహద్దు వివాదాలు, మార్గ హక్కుల సమస్యలు, కుటుంబ భూ వివాదాలు, ఆక్రమణలు, ఖాతా మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందిన అన్ని ఫిర్యాదులను పీజీఆర్ఎస్లో నమోదు చేసి, సమయపాలనతో పరిష్కరించాల్సిందిగా సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని, ప్రతి వారం కార్యక్రమ పురోగతిని స్వయంగా సమీక్షిస్తానన్నారు. గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందం ప్రతి గురువారం ఒక గ్రామంలో అధికారులు పర్యటించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి -
మున్సిపల్ చెత్త లారీ ఢీకొని బైకిస్ట్ దుర్మరణం
కర్నూలు : నగరంలోని బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి దగ్గర మున్సిపాల్టీకి చెందిన చెత్త సేకరణ లారీ ఢీకొని బైకిస్ట్ బంగి బద్రీనాథ్ (28) మృతిచెందాడు. ఈయన డిగ్రీ వరకు చదువుకుని ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై తండ్రి బంగి రంగస్వామిని ఎక్కించుకుని ప్రభుత్వాసుపత్రి దగ్గర దింపి తిరిగి ఇంటికి వెళ్తుండగా బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి వద్ద మున్సిపాల్టీ చెత్త లారీ ఢీకొనడంతో కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. లారీ టైర్ అతనిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికంగా ఉన్న మహిళలు మల్లీశ్వరి, సుంకులమ్మ చూసి మృతుని ఇంటి వద్దకు వెళ్లి తల్లి జయమ్మకు సమాచారం తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు.తన కుమారుడి మృతికి చెత్త లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటమే కారణమని జయమ్మ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. -
క్యాన్సర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
● వృద్ధురాలి కడుపులో నుంచి 10 కిలోల కణితి తొలగింపుకర్నూలు (టౌన్): కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. వృద్ధురాలి కడుపులో నుంచి ఏకంగా 10 కిలోల కణితి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. వెలుగోడు పట్టణానికి చెందిన 75 ఏళ్ల సుబ్బలక్ష్మమ్మ ఆరు నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంది. పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నా నొప్పి తగ్గ లేదు. దీంతో గత నెల 22 వ తేది స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో 30x25 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన భారీ అండాశయ కణితిని గుర్తించారు. ఈనెల 1 వ తేదీన విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు నొప్పి తగ్గి ఆరోగ్యం కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వారిలో వైద్యులు నరేష్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ సర్జికల్ అంకాలజిస్టు సందీప్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్టికల్ అంకాలజిస్టు భారతి, డాక్టర్లు సంధ్య, మాలిక్, కాంచనగౌరి, లక్ష్మి పాల్గొన్నారు. క్యాన్సర్‌ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
హోరాహోరీగా బేస్‌బాల్ పోటీలు
● 23 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారుల హాజరుగోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఏడో సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలకు ఏపీలోని 23 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు (బాలికలు, బాలురు) హాజరయ్యారు. బాలుర విభాగంలో నెల్లురు జిల్లా జట్టు, ప్రకాశం టీమ్‌పై 6–0 తో, నంద్యాల జట్టు తిరుపతిపై 4–2 పాయింట్ల తేడాతో, కర్నూలుజట్టు గుంటూరుపై 4–0 పాయింట్లతో, బాపట్ల జట్టు కృష్ణాపై 2–0 పాయింట్లతో విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో కృష్ణాజిల్లా జట్టు అనకాపల్లిపై 5–4 పాయింట్లతో, నెల్లూరు జట్టు బాపట్లపై 7–1 పాయింట్లతో, విశాఖపట్నం జట్టు ప్రకాశంపై 5–2 పాయింట్లతో, కర్నూలు జట్టు చిత్తూరుపై 10–1 పాయింట్లతో, నంద్యాల జట్టు సత్యసాయిపై 7–0 పాయింట్లతో, పల్నాడు జట్టు అనంతపురంపై 7–1 పాయింట్లతో, గుంటూరుజట్టు బాపట్లపై 7–6 పాయింట్లతో విజయం సాధించి క్వాటర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, బేస్‌బాల్ లీగల్ అడ్వయిజర్ మాధవరావు, టోర్నమెంట్ అడ్వయిజర్ సుబ్బయ్య, కర్నూలు జిల్లా బేస్‌బాల్ యూనియన్ అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు
● గిట్టుబాటు ధరలేక రైతుల ఇక్కట్లు ● బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిబనగానపల్లె: చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గింజను కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఇల్లూరుకొత్తపేట సమీపంలోని పంట కల్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు తమ కష్టాలను మాజీ ఎమ్మెల్యేకు చెప్పారు. తాము పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయనందుననే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోజుల తరబడి పంటను కల్లాల్లో ఉంచుకోవాల్సి వస్తోందన్నారు. యూరియా రాదు.. డీజిల్ లేదు రెండేళ్లుగా యూరియా లభించక రైతులు బస్తా రూ.500 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని కాటసాని అన్నారు. డీజిల్ కొరతతో పంట నూర్పిడిలు సక్రమంగా జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసినా పలకరించేవారు కరువయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధరలు లేవని, ఎరువుల ధరలు మాత్రం ఉహించని విధంగా పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. డబ్బులు లేవా? పంట నష్టం జరిగిన వెంటనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చిందని కాటసాని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు నష్టపరిహారం రాలేదన్నారు. డబ్బులు లేవంటూనే విజయవాడ వద్ద బుడమేరు ముంపు కింద కొన్ని కోట్ల రూపాయలు వృథా చేశారని విమర్శించారు. యోగా కోసం ఇటీవల రూ.360 కోట్లు ఖర్చు చేసి కంపచెట్ల తొలగింపు చేశారని, రైతుల వద్దకు వచ్చే సరికి డబ్బులు లేవని దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రైతులకు పంట నష్టం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాారు. పంటలకు గిట్టుబాటు అందకపోతే పార్టీలకుతీతంగా ఐక్యతతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాటసాని వెంట వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అంబటి రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు అందె శ్రీనివాసరెడ్డి, పి మనోహర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, జాన్, రామసుబ్బయ్య కృష్ణ, వెంట్రామిరెడ్డి, సురేష్,కిశోర్, సుబ్బారెడ్డి ఉన్నారు. -
చెంచుగూడెంలో మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: హిందూ ధర్మప్రచారంలో భాగంగా బుధవారం శ్రీశైలంలోని మేకలబండ చెంచుగూడెంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. ధర్మప్రచారంలో ముందుగా క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామికి విశేషపూజలు చేశారు. అనంతరం మేకలబండ చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదిక వద్ద వరకు దేవస్థానం ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు. కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించి మహాగణపతిపూజ జరిపించారు. అమ్మవారికి కంకణధారణ అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠించారు. స్వామిఅమ్మవార్లకు వరపూజ నిర్వహించి భాషికలను అలంకరించారు. భూమండలం, శ్రీశైల క్షేత్రవర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగల్యధారణ జరిపి, తలంబ్రాలను సమర్పించారు. చివరిగా స్వామిఅమ్మవార్ల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికి శేషవస్త్రాలను అందించారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, ఏపీడీ కె.పి.నాయక్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గుల్ల గంగమ్మ, కాంతివర్దిని, అధికారులు పాల్గొన్నారు. -
సంగపట్నంలో పది గడ్డివాములు దగ్ధం
అవుకు(కొలిమిగుండ్ల): మండల పరిధిలోని సంగపట్నంలో ప్రమాదవశాత్తు బుధవారం పది గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి,బత్తుల ఈశ్వరరెడ్డి,చిన్న బయపురెడ్డి,చిన్న వెంకటసుబ్బారెడ్డి, నూర్‌బాషా, మల్లు శివశంకర్‌రెడ్డి పశువుల మేత కోసం పది గడ్డివాములను నిల్వ చేసుకున్నారు. గడ్డివాములకు సమీపంలో మొక్క జొన్న కోతలు కోసి వేస్టేజ్‌ను పక్కకు పడేయంతో వాటికి నిప్పు పెట్టారు. క్రమేణా మంటలు గడ్డివాములకు అంటుకున్నాయి. అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. పూర్తిగా గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.8లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. నిలిచిపోయిన నీటి విడుదల గోనెగండ్ల: ఏపీవాట ఇండెంట్ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేశారు. దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్‌కు బుధవారం ఉదయం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. సాయంత్రానికి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ 1 నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల కొనసాగింది. హత్య కేసుగా మారిన అదృశ్యం కేసు బనగానపల్లె: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన లక్ష్మి(35) అదృశ్యం కేసు హత్య కేసుగా మారినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గొల్ల వెంకటస్వామి భార్య లక్ష్మిపై భర్త అనుమానంతో వారం రోజుల క్రితం సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు సహకారంతో గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వ వద్దకు ఆమెను తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చివేశారు. అయితే ఏమీ తెలియనట్లు ఈ నెల 2న తన భార్య కనిపించడంలేదని వెంకటస్వామి నందివర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. లక్ష్మి కొద్ది రోజులుగా అగుపించకపోవడంతో బంధువులు భర్తపై అనుమానం ఉందని, కేసు దర్యాప్తు చేయవలసిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బనగానపల్లె సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్ఐ భూపాలుడులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామ, పోస్టుమార్టం చేశారు. భర్త వెంకటస్వామితో పాటు సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడుగుకో గుంత గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల నుంచి గంజిహళ్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అడుగడుగున గుంతలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గోనెగండ్ల నుంచి గంజిహళ్లి మీదుగా బైలుప్పల, బి. అగ్రహారం తదితర గ్రామాలకు ఈ దారిలోనే వెళ్లాలి. గంజిహళ్లి చెరువు నుంచి ఇటీవల టిప్పర్లలో ఎమ్మిగనూరుకు మట్టి తరలించారు. ఈ వాహనాలు అధికలోడ్‌తో ఇష్టనుసారంగా వెళ్లాడంతోనే రోడ్డు దెబ్బతినిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారి బాగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉయ్యాలవాడలో పిడుగు ఉయ్యాలవాడ: మండలంలో బుధవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. రాత్రి 7.15 గంటల సమయంలో మండల కేంద్రం ఉయ్యాలవాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మండలకేంద్రంలో ఉన్న మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వగృహం ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు పోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగు పడిన శబ్ధానికి చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని నీటితో మంటలను అదుపు చేశారు. ఏఎస్ఐ ప్రతాప్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే భారీగా గాలులు వీచడంతో మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. -
ఆన్లైన్లో పొదుపు మహిళల వివరాలు
ప్యాపిలి: పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. స్థానిక మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం వీఓఏలు, సీసీలతో ఆయన సమావేశం నిర్వహించారు. పొదుపు మహిళలు ఎంచుకున్న జీవనోపాధి చేసుకోవడానికి హెచ్ఎల్పీ, ఎంసీపీ తయారు చేయాలని ఆదేశించారు. పొదుపు సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాల వివరాలు, సీ్త్రనిధి, ఉన్నతి ద్వారా తీసుకున్న రుణాల వివరాలను వంద శాతం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓ ముందే ఉద్యోగుల బాహాబాహీ ఆళ్లగడ్డ: ఎంపీడీఓ సమక్షంలోనే ఇద్దరు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు తీవ్రంగా కొట్టుకున్న ఘటన బుధవారం రుద్రవరంలో కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నూర్ అహమ్మద్‌కు చెందిన వ్యక్తిగత బిల్లు సమాచారం ఎంపీడీఓ లాగిన్‌కు వచ్చింది. ఈ బిల్లు పెట్టాలని జూనియర్ అసిస్టెంట్ హరికిషన్‌కు తెలిపారు. అతను సరిగ్గా స్పందించక పోవడంతో ఈ విషయంపై ఎంపీడీఓతో సీనియర్ అసిస్టెంట్ మాట్లాడుతున్నాడు. ఈ సయమంలో జూనియర్ అసిస్టెంట్ రావడంతో సీనియర్ అసిస్టెంట్ చెయ్యి చేసుకున్నాడు. ఎంపీడీఓ ముందే ఇద్దరూ బాహాబాహీకి దిగారు. గట్టిగా కేకలు వినిపించడంతో ఇతర గదుల్లో ఉన్న సిబ్బంది అక్కడకు వచ్చి ఇద్దరినీ విడిపించారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించడమే గొడవకు కారణమని తెలుస్తోంది. బాలికపై లైంగిక దాడి ● యువకుడిపై పొక్సో కేసు నమోదు నందికొట్కూరు: పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన 13 బాకలికపై అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ నెల 2న లైంగికదాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు టౌన్ సీఐ అశోక్ కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. లైంగికదాడి చేసిన యువకుడు బాలికకు సొంత మేనమామ అని తెలిసింది. రూ.60 కోట్లతో 26 రోడ్ల పనులు కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాస్కీలో భాగంగా రూ.60 కోట్లతో 26 రోడ్ల పునరుద్ధరణ పనులు(110 కిలోమీటర్ల మేర) చేపట్టనున్నట్లు పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు జి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఆర్ఆర్ఎస్పీ కింద ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని అందిస్తోందన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఒకే ప్యాకేజీ కింద ఈ పనులను చేపడతామన్నారు. క్యాజువాలిటీ ఆకస్మిక తనిఖీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ విభాగంలో బుధవారం రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని డీఏపీ, డీఏఎస్లకు మెమోలు జారీ చేశారు. చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది విధిగా విధుల్లో ఉండాలని, లేనివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ పద్మజ తదితరులు ఉన్నారు. పసుపుల గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ పంచాయతీ ఐఎస్ఓ సర్టి ఫికెట్కు ఎంపికై ంది. బుధవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి.భాస్కర్, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన 18వ గ్రామ పంచాయతీగా పసుపుల గ్రామ పంచాయతీ ఎంపికై ందన్నారు. -
ఉల్లికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి
కోడుమూరు రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులంతా భారీగా ఉల్లి పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా ఇతర కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకటగిరి, గోరంట్ల గ్రామాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిశ్రమ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా ఉల్లిపంటపై ఆధారపడకుండా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. పత్తి, వాముతో పాటు స్వల్పకాల పంటలైన కూరగాయలు వేసుకోవాలని చెప్పారు. కోడుమూరు ఉద్యాన అధికారి మధన్మోహన్ మాట్లాడుతూ పొలాల్లో నీటినిల్వ కుంటలను ఏర్పాటు చేసుకుంటే పంటల ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ బాలక్రిష్ణ, గ్రామ ఉద్యాన సహాయకులు ఇందు, ప్రియాంక, హరిప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి..
నందికొట్కూరు: మండలంలోని బిజినవేముల గ్రామంలో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని ట్యాంక్ ఏరియాకు చెందిన షేక్ మహమ్మద్ అర్షద్ (33) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బిజినవేముల గ్రామ సమీపంలోని తిరుపతయ్యకు చెందిన వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు అర్షద్ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గమనించి వెంటనే విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు బావి వద్దకు చేరుకొని గాలించగా విగతజీవిగా కనిపించాడు. నీటిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య రేష్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మహానంది: నంద్యాల నుంచి మహానంది వెళ్లే మార్గంలో ఆటో బోల్తా పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అబ్బీపురం గ్రామానికి చెందిన డమాల రవితేజ (20) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి బుక్కాపురం గ్రామానికి వెళ్లి ఒక్కడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రుద్రవరం: మండలంలోని మందలూరు గ్రామంలో సంజీవరాయుడు (43) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య పద్మావతి, కుమార్తె, కొడుకు ఉన్నారు. మృతుడి తండ్రి సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయప్ప తెలిపారు. ఎరువు దుకాణాల లైసెన్స్ రద్దు రుద్రవరం: మండలంలోని ఆలమూరు, మచినేనిపల్లె గ్రామాల్లోని మూడు రసాయన ఎరువుల దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు వ్యవసాయాధికారి సుమతి తెలిపారు. వ్యవసాయ పనులు ముగిశాక ఎరువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం ఆలమూరులోని ప్రణవి ట్రేడర్స్, మాచినేనిపల్లెలోని శ్రీ విజయలక్ష్మి, శ్రీ బిందు ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు విక్రయించినట్లు తేలడంతో వాటి లైసెన్స్‌లను పది రోజుల పాటు రద్దు చేసినట్లు ఏఓ తెలిపారు. -
హెచ్ఎం పోరాటానికి 11 నెలలు
● అమకతాడు పాఠశాల స్థలం ఆక్రమణ ● టీడీపీ నేత అండతో నలుగురు ఇళ్ల నిర్మాణం పాఠశాల గదుల తాళాలు అతని వద్దే.. స్థానిక టీడీపీ నాయకుడు వీరభద్రుడు అండదండలతో బోయ హనుహంతు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి పాఠశాలపై అజమాయిషీ చెలాయిస్తున్నాడు. పాఠశాల గదుల తాళాలు ఆయన దగ్గరే ఉంచుకొని అందులో పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్నానని నమ్మిస్తూ మందుబాబులకు అడ్డాగా మార్చేశాడు. ప్రస్తుతం హెచ్ఎం ఆఫీసు తాళాలు, స్కూలు రికార్డులకు సంబంధించిన తాళాలు కూడా అతని దగ్గరే ఉంచుకొని పాఠశాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాడని హెచ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.కర్నూలు(సెంట్రల్): సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కార అవుతాయనేది అవాస్తమని ఈ కథనం చదివితే తెలిసిపోతుంది. కృష్ణగిరి మండలం అమకతాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీని స్థానిక టీడీపీ నాయకులు కూల్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ గతేడాది జూన్ 20వ తేదీన పాఠశాల హెచ్ఎం మంత్రి లోకేష్‌తో పాటు ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, డీఈఓలతో పాటు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. 11 నెలలు గడిచినా వారిలో ఒక్కరూ కూడా కనీసం విచారణ కూడా చేయలేదు. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు సర్వే నంబరు 141లో 1.40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో పాఠశాల భవనం నిర్మాణంతో పాటు మిగిలిన స్థలాన్ని కలుపుకొని ప్రహరీని నిర్మించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరభద్రుడు ప్రోద్బలంతో అదే గ్రామానికి చెందిన బోయ సుధాకర్, తలారి మల్లికార్జున, వడ్ల ఈశ్వరయ్య, వడ్ల ఎల్లయ్య పాఠశాల ప్రవాహరీని కూల్చి స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. దీంతో 1.40 ఎకరాల్లో ప్రస్తుతం పాఠశాలకు 15 సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, వెల్దుర్తి సీఐ, డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కొందరికీ స్వయంగా ఇవ్వగా మరికొందరికీ ఈ–మెయిల్ ద్వారా హెచ్ఎం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఏడాది కావస్తున్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఈ క్రమంలో ఆక్రమణదారులు దర్జాగా పాఠశాల స్థలాన్ని అనుభవిస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు... ప్రస్తుత పాఠశాల హెచ్ఎంగా ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుల అక్రమాలను బయట పెట్టడంతో అతని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘నీవు ఎరుకులోడివి, నీకు ఇక్కడేమ పని.. నీ జీతం మా చేతల మీదుగా ఇప్పిస్తాం.. మా కింత జీతగాడిలా ఉండాలి’ అంటూ అవమాన పరుస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నాడని హెచ్ఎం వాపోతున్నాడు. -
అన్నప్రసాద నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ
● శ్రీశైల దేవస్థానం అధికారులకు ఈఓ ఆదేశంశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తయారు చేస్తున్న వంటకాల నాణ్యతపై పట్ట ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో భక్తులకు దేవస్థానం అందిస్తున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాదం, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాలు, పారిశుద్ద్య నిర్వహణ తదితర మౌలిక వసతులపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన ఉండాలన్నారు.ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ప్రతిరోజు తాజా కూరగాయలను వినియోగించాలన్నారు. వంటశాలలో శుచి, శుభ్రత పాటించాలన్నారు. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) బ్యాక్‌లా గ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27 గ్రూపు –4 పోస్టులు, 11 క్లాస్ –4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను వెబ్సైట్ www.kurnool.ap.gov.in, www. nandyal.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు కార్యాలయ నోటీసు బోర్డులో కూడా ఉంచా మన్నారు. వివరాలకు 08518 – 277864 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. అర్హులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను అందించాలన్నారు. అలాగే ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన ప్రకటనలో సవరణ చేశామన్నాన్నారు. టైపిస్టు పోస్టుకు టైపు రైటింగ్ ఇంగ్లిష్ మరియు తెలుగు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకున్నా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా అర్హులేనన్నారు. టైపిస్టు పోస్టుకు ఉద్యోగం పొందిన వారికి కంప్యూటర్ ప్రొఫెషనరీ టెస్ట్(సీపీటీ) నిర్వహిస్తామన్నారు. డ్రోన్ సిటీ పనులను త్వరగా పూర్తి చేయండి ఓర్వకల్లు: డ్రోన్ సిటీ తొలి దశ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మండలంలోని కొమరోలు, చింతలపల్లె గ్రామాల పరిధిలో చేపడుతున్న నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాలలో భాగంగా రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రోన్ల తయారీ, టెస్టింగ్, పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. మొత్తం మూడు దశల్లో నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు ఏపీఐఐసీ డీఈ సందీప్ ఇన్చార్జ్ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, మండల సర్వేయర్ శంకర్ మాణిక్యం పాల్గొన్నారు. -
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆలూరు: మహిళలు తమకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సూచించారు. స్థానిక ఎల్లార్తి రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం సైబర్ నేరాలు, లైగింకదాడులు, వేధింపులు, రక్షణ చట్టాలు వివిధ అంశాలపై మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం మహిళల రక్షణకు అనేక చట్టాలు రూపొందించిందన్నారు. వాటిపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు, బ్యాంకు ఖాతా నంబర్లు అడిగితే చెప్పరాదన్నారు. బాల్య వివాహాలు నేరమని, దీనిని ఎవ్వరూ ప్రోత్సహించరాదన్నారు. ప్రజల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పత్తికొండ డీఎస్పీ బి. వెంకటరామయ్య, ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు మమత ప్రియ, ఆలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు,ఐసీడీఎస్ సీడీపీఓ నరసమ్మ, ఆలూరు, దేవనకొండ, ఆస్పరి, సీఐలు ఐ.రవిశంకర్‌రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాసనాయక్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జిల్లా ఆర్థిక వృద్ధికి కృషి చేయాలి
నంద్యాల: జిల్లాలో ఆర్థిక వృద్ధి లకా్ష్య్లను సమర్థవంతంగా సాధించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా మానవ వనరుల కేంద్రంలో ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సుమారు రూ.20,395 కోట్ల ఆదాయం సాధించాలన్నారు. ఇందులో ఉద్యానవనం 37శాతం, పశుసంవర్ధక శాఖ 32శాతం, వ్యవసాయం 21శాతం, మత్స్యశాఖ 4శాతం, అటవీశాఖ 3 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో 2024–25లో రూ.7,894 కోట్ల ఆదాయం సాధించగా, 2025–26లో రూ.13,286 కోట్ల లక్ష్యం చేరుకోవాలన్నారు. తయారీ రంగం, నిర్మాణ రంగం, గనులు, విద్యుత్ రంగాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధి సక్రమంగా లేకపోతే జిల్లా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. సేవా రంగానికి సంబంధించి 2024–25లో రూ.17,999 కోట్ల సాధనతో 11.77శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, ఇతర రంగాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉందన్నారు. రాబోయే ఏడాదిలో కనీసం 15శాతం వృద్ధిని సాధిస్తూ రూ.20,800 కోట్ల లకా్‌ష్య్‌న్ని చేరుకోవాలన్నారు. కీలక శాఖల పనితీరు సూచికల నమోదు విషయంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన గ్రేడింగ్‌లో బి–గ్రేడ్, సి–గ్రేడ్ వచ్చిన విభాగాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంట బీమా, ఉత్పాదకత, కౌలు రైతులకు రుణాలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, పోలీసు శాఖలో కేసుల పరిష్కారం వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం -
దశ ‘తిరగక’
అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలో పనిచేయని ఫ్యాన్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. దీంతో రోగులు, వారి సహాయకులు ఉక్కపోతతో ఇబ్బంది ప డుతున్నారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే దారిలోని జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చే విభాగం వద్ద ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఆసుపత్రి అధికారులు ఈ దారిలోనే వెళ్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కర్నూలు(హాస్పిటల్) -
రెండు నెలల జీతాలు మంజూరు
నాలుగు నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉండగా కర్నూలు కార్పొరేషన్ నుంచి రూ. 93 లక్షలు రావడంతో 2వ తేదీన రెండు నెలలు జీతాలు మంజూరు చేశాం. కంటింజెంట్ బిల్ రూ. 1.05 కోట్లు వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ మౌంట్ క్రెడిట్ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ. 23 కోట్లు సెస్సు రావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులకు సెస్సు చెల్లించాలని పలుమార్లు విన్నవిస్తూనే ఉన్నాం. – కె.ప్రకాష్, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ -
చెరువును కొల్లగొడుతున్నా పట్టించుకోరా?
● అధికారులు అండతోనే మట్టి దందా ● గంజిహళ్లి చెరువులో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి ● వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును అక్రమార్కు లు కొల్లగొడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి విమర్శించారు. అనుమతులకు మించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన గంజిహళ్లి గ్రామ చెరువును పరిశీలించారు. తవ్వకాలను అడ్డుకుని అక్కడ ఉన్న టిప్పర్లు, యంత్రాలను బయటకు పంపించేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లాభాపేక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలన్నారు. ఇటుక బట్టీలకు చెరువు మట్టిని తరలించడం దారుణమన్నారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించిన తమ పార్టీ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాసామ్వానికి విరుద్ధమన్నారు. రెండు వారాల క్రితం రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి చెరువును సందర్శించి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా కాసులకు కక్కుర్తి పడి అధికార పార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై ఏఏ అధికారుల ప్రమేయం ఉందో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మట్టి దందాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బీఆర్ బసిరెడ్డి, కేవీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, గంజిహళ్లి తిరుమాలరెడ్డి, ఎస్బీ మన్సూర్, భాస్కర్ రెడ్డి, ఇమ్రాన్, చికెన్ రాజా, మహేష్ రెడ్డి, తోలు రాముడు, మాణిక్యరెడ్డి, డాక్టర్ శివరాం, కబేర్ నాయుడు, పులికొండ, గిడ్డయ్య, భరత్ రెడ్డి, అశోక్, లక్ష్మన్న తదితరులు ఉన్నారు. -
చెంచుగూడేల్లో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’
● నేటి నుంచి కార్యక్రమం ప్రారంభం శ్రీశైలం టెంపుల్: హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడేలలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పో తుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు. మంగళవా రం వారు విలేకరులతో మాట్లాడుతూ బుధవా రం శ్రీశైలంలోని మేకలబండ చెంచుగేడెంలో, 7న మార్కాపురం జిల్లా చింతలలో ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం శోభాయాత్ర, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం చేపడతామన్నారు. కార్యక్రమంలో పాల్గొనే చెంచు భక్తులందరికీ ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. పాలిసెట్‌లో 89.73 ఉత్తీర్ణత నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశానికి ఈనెల 25వ తేదీన జరిగిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలో 6,093 మంది బాల, బాలికలు పరీక్షలు రాయగా 5,467 మంది (89.73 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. యశ్వనిరెడ్డి 118 మార్కులతో 130వ ర్యాంకు, సాయి చేతన్116 మార్కులతో 286 ర్యాంకు, రవితేజస్ 115 మార్కులతో 288 ర్యాంకు సాధించారు. ముక్తార్‌బాషాకు డీఆర్ఓగా పదోన్నతి రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్‌బాషాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజిలో గత నాలుగేళ్లుగా ఆయన సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతిపై కడప డివిజన్ సిద్దవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు. పీఆర్ ఈఈ పోస్టుకు త్రిముఖ పోటీ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ కర్నూలు ఈఈ పోస్టుకు ముగ్గురు డీఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేశ్వరరెడ్డి గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో పాణ్యం పీఆర్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి ఇన్చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతు లకు సంబంధించిన డీపీసీ పూర్తయిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో డీఈఈలుగా విధులు నిర్వహిస్తూ ఈఈలుగా పదోన్నతి పొందనున్న ముగ్గురు ఇక్కడకు ఈఈగా వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడపలో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ శివసాగర్‌రెడ్డి, జమ్మలమడుగు డీఈఈ రాఘవరెడ్డి, అనంతపురం జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీరాములు తమకున్న రాజకీ య, అధికార పరిచయాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఒక డీఈఈ మాత్రం జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. జనగణన పేరుతో ఓటీపీలు అడిగితే నమ్మొద్దు కర్నూలు: జన గణన పేరుతో ఓటీపీ అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తుంచుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జన గణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు అడగరని, అలాగే వేలిముద్రలు లేదా కంటి ఐరిష్ వంటి బయోమెట్రిక్ వివరాలు కూడా తీసుకోరన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సందేహాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే డయల్ 112 లేదా 100కు కాల్ చేయాలన్నారు. నంద్యాల(అర్బన్): పట్టణంలోని పలు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు బాలాజీ కాంప్లెక్స్‌లోని 64, 131, 48 రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. 64వ రేషన్ షాపులో 8 ప్యాకెట్ల చక్కెర, 27 కేజీల గోధుమ పిండి అధికంగా ఉన్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మిగిలిన రెండు షాపుల్లో సరుకులు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆయన వెంట సీఎస్‌డీటీ శేఖర్‌రెడ్డి, వీఆర్ఓలు ఉన్నారు. విజిలెన్స్ దాడుల సమాచారం అందుకున్న కొందరు డీలర్లు దుకాణాలు మూసివేశారు. -
ఆటో బోల్తా.. మహిళ దుర్మరణం
బనగానపల్లె: మండలంలోని నిలువుగండ్ల గ్రామ శివారు ప్రాంతంలో ఆటో బోల్తాపడి ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం శివవరం గ్రామానికి చెందిన సుశీలమ్మ సోమవారం సాయంకాలం ఆటోలో స్వగ్రామం వెళ్తున్నారు. నిలువుగండ్ల గ్రామం దాటిన తరువాత ఆటో డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న సుశీలమ్మ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుశీలమ్మకు కుమారుడు, కూతురు ఉన్నారు. -
ఇంటిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
● మహిళ మృతి, మరొకరికి గాయాలు సి.బెళగల్: పోలకల్ గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం పచర్ల సురేష్ అనే వ్యక్తి వ్యవసాయ పనుల అనంతరం వీధిలో ట్రాక్టర్ నిలిపే సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కృష్ణ భార్య కౌలుట్లమ్మ (50), కుమారుడు పాండుపై ఇంటి గోడ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గోడ రాళ్లను తొలగించి గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో కౌలుట్లమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాండు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. -
ఆసుపత్రికి నిర్లక్ష్య రోగం
నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రోగుల రద్దీతో కాసేపు కూర్చుందామన్నా కుర్చీలు కనిపించవు.. దాహమేస్తే తాగేందుకు నీళ్లు ఉండవు.. వార్డుల్లో వైద్య సిబ్బంది పలకరు.. రోగులకు సహాయంగా వచ్చే కుటుంబీకుల పరిస్థితి మరీ దారుణం. వార్డులో ఉండనీయరు.. ఆసుపత్రి ఆవరణలో ఉండలేరు.. అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. ఆసుపత్రి నిండా సమస్యలే కనిపిస్తున్నాయి. – బొమ్మలసత్రం ఆసుపత్రికి ప్రతి రోజు 1500 మందికిపైగా చికిత్స కోసం వస్తుంటారు. వారి దాహం తీర్చేందుకు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు. ఆసుపత్రి బయట ఉన్న శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్‌లో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఆసుపత్రిలో దాతలు ఇచ్చిన ఆర్వో ప్లాంట్‌ను మరమ్మతు చేయించకుండా అలాగే వదిలేశారు. వేసవి కాలం ఎంతో మంది నీటి కోసం ఆసుపత్రిలో వెతకాల్సిన పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణులకు నేల పరీక్ష తప్పడం లేదు. వారితో పాటు వచ్చిన పిల్లలు, ఆశా వర్కర్లకు కూడా కష్టాలు పడుతున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండాల్సిన కుర్చీలు మూలన పడ్డాయి. వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి వస్తాయని తెలిసినా అధికారులు పట్టించుకోడం లేదు. గతంలో దాతలు ఇచ్చిన ఏసీలను సైతం ఆసుపత్రిలో కొందరు అధికారులు ఇళ్లకు తరలించినట్లు సమాచారం. రోగులకు సహాయంగా ఉండాల్సిన సిబ్బంది పలకడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులను వీల్చైర్లు, స్టెచ్చర్స్ను తొసేందుకు రోగుల కుటుంబీకులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమస్యల నేపథ్యంలో పలువురు భారమైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం మేలని చర్చించుకుంటున్నారు. రోగులతో పాటు వచ్చిన అటెండర్స్ ఉండేందుకు ఆసుపత్రిలో రెండు గదులు ఉన్నాయి. అవి చిన్నవే అయినా మహిళలు గదిలో నిద్రిస్తే పురుషులు ఆసుపత్రి ఆవరణలో పడుకునే వారు. అయితే ఆసుపత్రి సిబ్బంది కొన్ని వస్తువులు అందులో ఉంచి రెండు గదులకు తాళాలు వేశారు. దీంతో రోగుల అటెండర్స్ ఆరు బయట నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొందరు ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ స్థలాల్లో పడుకుంటున్నారు. అయితే ఆకతాయిలు మద్యం సేవించి వారిని ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాగునీటి కోసం అవస్థలు.... కాబోయే అమ్మలకు నేల పరీక్ష అటెండర్స్ గదికి తాళాలు... కుటుంబీకులే సిబ్బంది.. -
అంగన్వాడీల నిర్వహణలో అలసత్వం వద్దు
కర్నూలు(అర్బన్): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ హెచ్చరించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్లో 62 శాతం నెగిటివిటీ వచ్చిన కోడుమూరు ప్రాజెక్టు పసుపుల –2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం పసుపుల 1, 3 కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లోని రిమార్కులపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శతాధిక వృద్ధుడు మృతి
గడివేముల: మండల కేంద్రం గడివేములకు చెందిన లవంగాల మాబు సా (109) అనే శతాధిక వృద్ధుడు అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో నే కురు వృద్ధుడు అయి న ఈయన చనిపోవడానికి ముందు వరకు వ్యవసాయం పనులు చేసేవారు. ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా భార్య రమిజాబీ 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. గ్రామానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాలచెన్ని, పలువురు మాబుసా మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కర్నూలు(అర్బన్): కురువ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కురువ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2025–26లో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500లకు పైగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివి 550కు పైగా మార్కులు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో చదివి 850, ప్రైవేటు కళాశాలల్లో చదివి 900కు పైగా మార్కులు తెచ్చుకున్న వారికి పురస్కారాలు ఇస్తామన్నారు. అర్హులు తమ మార్కుల మెమో, కులం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను ఈ నెల 10వ తేదీలోగా సెల్: 94407 56199, 90327 41194 నెంబర్లకు వాట్సాప్ చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన బాలికలకు 10 మందికి ఉచిత బోధన సౌకర్యం కల్పిస్తామని శ్రీమేధ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కె. రాము తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కె. కిష్టన్న, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న తదితరులు పాల్గొన్నారు. 10న జిల్లా స్థాయి చెస్ పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఈనెల 10వ తేదీన జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఎన్ఆర్జీ చెస్ అకాడమీ గౌరవాధ్యక్షుడు రాజేష్, డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పట్టణంలోని నెరవాటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తిగలవారు 8వ తేదీ సాయంత్రంలోపు ఏపీ చెస్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెలలో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్ : 90104 51585 నంబరును సంప్రదించాలన్నారు. అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు యశవంతపుర (బెంగళూరు): బైక్‌ల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను బెంగళూరు హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్ (39), నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా (31) వివిధ ప్రాంతాల్లో స్కూటర్లు, బైకులను చోరీ చేసి వాటికి నకిలీ ఆర్సీ కార్డులను సృష్టించి అమ్ముతున్నారు. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్‌లు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దొ ంగలపై దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితు డిని పట్టుకుని విచారించగా చిత్తప్పగారి ఆనంద్, షేక్ షఫీర్ బాషా చోరీ చేసిన బైక్‌లను హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంట ర్నె ట్ సెంటర్లో డూప్లికేట్ ఆర్సీ కార్డులు రూ పొందించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిఘా వేసి ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ. 41.67 లక్షలు విలువగల 51 వాహనాలు, 501 నకిలీ ఆర్సీ కార్డులు సీజ్ చేసినట్లు మంగళవా ర ంబెంగళూరు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. సంగమేశ్వరంలో సహస్రనామ పారాయణం కొత్తపల్లి: సప్తనది తీరానా వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయంలో మంగళవారం సాయంత్రం భక్తులు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి పూలమాలలతో అలంకరణ చేసి అభిషేకాలు, అర్చనలు చేశారు. -
అస్తవ్యస్తం
అక్షర భాండాగారాలునిలువెల్లా నిర్లక్ష్యం.. ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన గ్రంథాలయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆకట్టుకోలేక పోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గ్రంథాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించక పోవడం, కొత్త పుస్తకాలు కొనుగోలుకు అనుమతులు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసేది లేక ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. మరికొందరు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో గ్రంథాలయాలకు వెళ్తే అప్డేట్ పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వారికి అవసరమైన పుస్తకాలు కనిపించడం లేదు. దీంతో పాటు బ్యాంక్ పోస్టులకు సంబంధించిన మ్యాథ్స్, రీజనింగ్, అర్థమేటిక్ పుస్తకాలు కూడా అప్డేట్ చేసినవి లేవు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. గ్రంథాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. లైబ్రేరియన్ల కొరత కారణంగా కొన్ని లైబ్రేరియన్లకు ఇన్‌చార్జిలే దిక్కుగా మారారు. మరోవైపు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లైబ్రేరియన్లకు అదనపు పనిభారంతో పాటు ఆర్థిక భారం కూడా తోడవుతోంది. గ్రేడ్–1 లైబ్రేరియన్లు 1, గ్రేడ్–2 లైబ్రేరియన్లు 10, గ్రేడ్–3 లైబ్రేరియన్లు 15, జూనియర్ అసిస్టెంట్ 1, రికార్డు అసిస్టెంట్ 5, అటెండర్లు 34, విలేజ్ లైబ్రేరియన్లు 4, పార్ట్‌టైమ్ వర్కర్స్ 23, బైండర్ 1, అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్ 1, మొత్తం 94 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు కల్చరల్: కూటమి పాలనలో అక్షర జ్ఞానాన్ని పంచే గ్రంథాయాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఓ వైపు గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవడం, మరో వైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 60 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కేంద్ర గ్రంథాలయం, ఒకటి గ్రామీణ గ్రంథాలయం, 58 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. 39 సొంత గ్రంథాలయాలు ఉండగా 8 గ్రంథాలయాలు రెంట్ ఫ్రీ, 13 గ్రంథాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, కంటింజెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కర్నూలు నగర పాలక సంస్థ నుంచి రూ. 93 లక్షలు సెస్సు రావడంతో కంటి తుడుపుగా రెండు నెలల జీతాలు ఈ నెల రెండో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలకు అవసరమయ్యే కొత్త పుస్తకాల కొనుగోలు లేక నిర్వీర్యమవుతున్నాయి. పాత సమాచారంతో ఉన్న పుస్తకాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగడనంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి సిబ్బంది కొరత తోడవడంతో గ్రంథాలయాలు మూత పడే స్థితిలోకి వెళ్లి పోయాయి. పేరుకు పోయిన బకాయిలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ. 23 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 10.67 కోట్లు, కర్నూలు కార్పొరేషన్, మున్సిపాలిటీలు రూ. 7.32 కోట్లు, గ్రామ పంచాయితీలు రూ. 3.35 కోట్లు సెస్సు రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రూ. 13.03 కోట్లు, మున్సిపాలిటీలు రూ. 11.51 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ. 1.51 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని కలెక్టర్లకు అధికారులు విన్నవిస్తూనే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ, పేపర్ బిల్లులు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగ పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రంథాలయాలకు నిధులు ఇవ్వని కూటమి సర్కారు రెండు నెలలుగా జీతాలకు, పెన్షన్లకు ఇక్కట్లు పస్తులతో గ్రంథాలయాల ఉద్యోగులు గుదిబండగా రూ.23 కోట్ల బకాయిలు -
బ్లాక్‌లో యూరియా కొన్నాం
నేను 10 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి రూ. 35 వేల పెట్టుబడి పెట్టా. యూరియా కొరతో బస్తా బ్లాక్‌లో రూ.480 కు కొన్నాను. అది కూడా సీజన్ సగం అయ్యాక దొరికింది. సకాలంలో మాకు యూరియా అందలేదు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొరత లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం యూరియా తెచ్చుకోవాలంటే రైతులకు తలకుమించిన భారమైంది. – పగిడిమాన్ శేఖర్, గోనవరం నేను నాలుగు ఎకరాల్లో వరి వేశాను. దాదాపుగా 150 బస్తాల వరకు రావొచ్చు. రబీలో సాగు చేసిన వరి ధాన్యం కొనేందుకు ఎవరూ రావడం లేదు. ధాన్యం వచ్చి 10 రోజులు అవుతుంది. అమ్ముతామని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు. రైతులకు పండించేంత వరకు ఒక దిగులు. పండించిన తర్వాత కొనేవారు లేక మరో దిగులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి. – పిడతల సుమిత్రప్రసాద్, గోనవరం పాణ్యం: ‘ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేరు. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యం వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యాపారులు రావడం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆలమూరు, గోనవరం గ్రామాల్లో పర్యటించి రబీలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం బస్తా రూ.1,900 వరకు, రబీలో రూ.1,800 వరకు తగ్గకుండా విక్రయించారు. ఎగుమతులు లేకపోయినా ధరల స్థిరీకరణతో అప్పటి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. కొనుగోలు జరిగిన నెల రోజుల వ్యవధిలోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ధాన్యం కొనండి అని రైతులు పిలుస్తున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కల్లాల్లో ధాన్యం ఆరబోసుకుని వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు కానీ.. యూరియాకు ధరలు మాత్రం పెంచేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో టీడీపీ నేతలు టీవీల ముందు కాకుండా రైతుల వద్దకు వచ్చి చెప్పండి. ఆనాడు ఆర్బీకేలను విమర్శించిన టీడీపీ నేతలు నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన విధానాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు అనుకూల మీడియాలో మాట్లాడి రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా.. రైతులకు చేసిందేమి లేదు’ అని కాటసాని విమర్శించారు. మొక్కజొన్న సంగతేంటి.. పక్క రాష్ట్రంలో మొక్క జొన్న క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.1500 పలుకుతుందని కాటసాని అన్నారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత మోతాదులో కొన్నారో ప్రజలకు చెప్పాలి. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గ్రామాల్లో సంచులు ఇవ్వడం తప్ప.. ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జొన్న, మిరప ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఉల్లి, టమాట పంటలకు ధర లేక రైతులు రోడ్లపై పారబోశారు. మామిడికి నేటికి ధర కనిపించడం లేదు’. అని చెప్పారు. ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు.. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైతులకు డీజిల్ అందక పంట కోతలు కూడా ఆలస్యమయ్యాయి. ప్రజలకు గ్యాస్ సిలిండర్లు అందక ఎన్నో కష్టాలు పడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్త పింఛన్ల రెండేళ్లు అయినా ఇవ్వలేదు. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. నేడు టన్ను ఇసుక ధర రూ. 900 టీడీపీ నాయకులే బహిరంగంగా అమ్ముతున్నారు. సామాన్యుడు వాగులో మట్టిని తరలిస్తున్నా తీసుకెళ్లి పోలీస్‌స్టేషనలో వేస్తున్నారు. కల్లాల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని, నాయకులుమద్యం డోర్ డెలివరీ కూటమి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మాత్రం వందశాతం పక్కాగా అమలు చేస్తున్నారని కాటసాని ఎద్దేవా చేశారు. ఒక్కో గ్రామానికి 4 నుంచి 8 వరకు బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్‌షాప్‌లు నిర్వహించలేదు. మద్యం అమ్మకాలను నియంత్రించాం. ప్రజలు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి’ అని కాటసాని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కాటసాని వెంట మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మల్లు జయచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ రామలక్ష్మయ్య, సుమంత్‌రెడ్డి, మధురెడ్డి చాంద్‌బాషా, ఉప్పు విజయభాస్కర్, గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనుపూరు శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణానరెడ్డి, శేషయ్య, రామచంద్రుడు, శేఖర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.


