చిన్న మల్కాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న దృశ్యం
కొచ్చేర్వు, కన్నపకుంట గ్రామల మధ్య అక్రమ మైనింగ్
డోన్ రూరల్: నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పచ్చని కొండల్ని అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఇమిడి ఉన్న విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి నయాపైసా రాయాల్టీ, వే బిల్లుల రూపంలో చెల్లించకుండానే యాథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మండలంలోని కన్నపకుంట, కొచ్చెర్వు, మల్కాపురం, పరదేశిబావి, పెద్ద మల్కాపురం, డోన్ శివారులోని వెంకటనాయునిపల్లె, గుడితిప్ప ప్రాంతాల్లోని అ టవీ, రెవెన్వూ భూముల్లో ప్రభుత్వం నుంచి ఎలా ంటి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు సా గిస్తూ విలువైన ఖనిజాలను కొల్లగొడుతున్నారు.
కళ్లు మూసుకున్న అటవీ,
రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్) సర్టిఫికెట్ పొందకుండా, ఏడీఎంజీకి రాయల్టీ బిల్లులు చెల్లించకుండా, సేల్ ట్యాక్స్ నుంచి వే బిల్లులు లేకుండానే ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొచ్చెర్వు, కన్నపకుంట అటవీ భుముల నుంచి డోలమైట్, వైట్ సెల్, లైమ్ స్టోన్‌లతో పాటు వివిధ రంగుల రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పలు ప్రాంతాల్లో లైసెన్స్‌లు పొందకుండానే గనుల్లో బ్లాస్టింగ్ (పేల్లుళ్లు)కు పాల్పడుతున్నారు. అటవీ, రెవెన్యూ, ఎడీఎంజీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మారడంతో అధికార పార్టీ నేతల అక్రమార్జనకు అంతులేకుండా పోతోంది. ఈ విషయంపై నోరు మెదిపేందుకు కుడా సంబంధిత అధికారులు ఇష్టపడటం లేదు.
ఖనిజాల అక్రమ తవ్వకం ద్వారా
కోట్లు గడిస్తున్న టీడీపీ నాయకులు
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి
మొద్దు నిద్రలో ఏడీఎంజీ,
అటవీ, రెవెన్యూ అధికారులు


