breaking news
Nandyal District Latest News
-
ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!
● వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్ ● నిందితుడి నుంచి బంగారు నగలు, బైక్ రికవరీ సి.బెళగల్: ఐదు రోజుల క్రితం సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మండల కేంద్రం సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్నగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సి.బెళగల్ పోలీసు స్టేషన్లో కోడుమూరు సీఐ త్రబేజ్, ఎస్ఐ వేణుగోపాల్రాజుతో కలిసి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. సీఐ వివరాల మేరకు.. సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్న ఇంటి వద్ద వ్యవసాయ పనులు, జీవాలను పోషిస్తున్నాడు. ఇతను సమీపంలోని సంగాల గ్రామంలో ధ్యాన పిరమిడ్ కేంద్రానికి వెళ్లేవాడు. కాగా ధ్యాన కేంద్రం పక్కనే ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు ఇల్లూరి సంజీవమ్మ ధ్యాన పిరమిడ్‌లో నిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉండేది. ఈ క్రమంలో వృద్ధురాలిని రంగన్న పరిచయం చేసుకుని ఆమె ఇంటిపై నిఘా ఉంచాడు. రోజూ ఆమె కదలికలను గమనిస్తూ ఆమె వద్ద ఉన్న నగలను దోచుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ ఉదయం హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్‌తో చంపుతా అంటూ వృద్ధురాలిని బెదిరించి, తర్వాత దాడి చేసి బంగారు గొలుసు, రెండు బంగారు గాజులను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి.బెళగల్ పోలీసులు విచారణ చేపట్టి దొంగతనానికి పాల్పడిన రంగన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.9 తులాల బరువున్న రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు చోరీకి ఉపయోగించిన బైకు, హెల్మెట్, ఇనుపరాడ్, ఇతర వస్తువులను నిందితుడిని నుంచి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ వేణుగోపాల్‌రాజు, కానిస్టేబుల్ శ్రీనివాసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కేసు ఛేదనలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, జానకిరాముడులను సీఐ, ఎస్ఐలు రివార్డుతో అభినందించారు. -
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం
కర్నూలు(సెంట్రల్): నంద్యాలలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, జిల్లా నాయకులు టీజీ ప్రసాదు, నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అన్నారు. జర్నలిస్టుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారులు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై ఐ న్యూస్ చానెల్ చేసిన కథనంపై టీడీపీ నాయకులు, పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. మొదటగా కొందరు టీడీపీ నాయకులు వార్తా కథనాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాలని పోలీసుల ద్వారా రాయబారం నడిపారన్నారు. అయితే కథనాన్ని తొలగించే అధికారం తమ చేతిలో ఉండదని రిపోర్టర్లు చెప్పడంతో వారిపై డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఓ టీడీపీ నాయకుడితో ఫిర్యాదు తీసుకొని ముగ్గురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. అంతేగాక నంద్యాలలో ఉంటున్న ఇద్దరు రిపోర్టర్లను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యు లు భయపడేలా అరెస్టు చేశారని, మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను పూర్తిగా ఎత్తి వేయాలని కోరారు. జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలి
గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు. సోమవారం కేవీకే బనవాసి ఆధ్వర్యంలో తాడిపత్రి జేసి దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం 10 మంది విద్యార్థులతో కలసి పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాల్లో పీఆర్ఏ పద్ధతులపై గ్రామీణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి గ్రామ పటం, రిసోర్స్ మ్యాపింగ్, ప్రాబ్లమ్ ట్రీ వంటి పీఆర్ఏ పద్ధతులను వివరించారు. మిరప, పత్తి, ఉల్లి తదితర పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు పసుపు నీలం జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్తిలో 13–0–45, మెగ్నీషి యం సల్ఫెట్ పిచికారి, వీఏఎం వినియోగం ద్వారా మొక్కల ఒత్తిడి తట్టుకునే శక్తి, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఉల్లిలో తామర పురుగు, ఆకు మాడు సమస్యలకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఆధారిత జీవ నియంత్రణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారుల ప్రతిభ
కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తల్లిని కాపాడే ప్రయత్నంలో.. ● తండ్రిపై కుమారుడి దాడి ● తీవ్ర గాయాలై తండ్రి మృతి వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్‌బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్‌వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
హత్యాయత్నం కేసు ఛేదన
● మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితుల అరెస్ట్ఆదోని అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై జరిగిన హత్యాయత్నం కేసును ఆదోని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ వెంకటరమణ, టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నరసమ్మ భర్త శీను ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం మున్సిపాలిటీలో శీను ఉద్యోగం నరసమ్మకు లభించగా, అక్కడే పనిచేస్తున్న చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈరన్న స్థానిక అమరావతినగర్‌కు చెందిన శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నరసమ్మతో ఉన్న సంబంధాన్ని ఈరన్న కొనసాగించడానికి ప్రయత్నించడంతో అతని కుటుంబీకులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో నరసమ్మపై గతంలో శిరీష తన కుటుంబీకులతో కలసి దాడి చేసింది. వారిపై నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసులయ్యాయి. దీంతో పెద్దలతో పంచాయతీ జరిపిన అనంతరం ఈరన్న, శిరీష సాయిబాబానగర్‌లో ఉంటున్నారు. నరసమ్మతో దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులతో మనస్తాపానికి గురైన ఈరన్న ఈ ఏడాది జూలై 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరన్న మృతికి నరసమ్మనే కారణమని భావించిన శిరీష కక్ష పెంచుకుని హత్య చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై శిరీష, ఆమె తల్లి సుజాత, అత్తామామలు రాములమ్మ, ఈరన్న, ఆడబిడ్డ హేమ, చిన్నమ్మ అంజినమ్మలు దాడి చేశారు. కంట్లో కారం చల్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నరసమ్మ కేకలు వేయడంతో సహ ఉద్యోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 70 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కదలికలను గమనించి, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అమరావతినగర్ రోడ్డు, బసాపురం జంక్షన్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును 24 గంటల్లోపు చేధించిన టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని అభినందించామన్నారు. -
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్‌గౌడ్(26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్‌గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. వివాహానికి వెళ్తుండగా విషాదం మృతుడు హరీశ్‌గౌడ్ హైదరాబాద్‌లో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య కల్యాణితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. గత నెల 31 పాత కక్షల నేపథ్యంలో మినుగ విజయ్, అతని అనుచరులు హసన్, విక్రమ్‌లు షేక్ హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడిని చూపించాలంటూ ఆమెతో గొడవపడి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం కర్నూలు రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అనంతరం డోన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండు విధించినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పాములపాడు: కర్నూలు – ఆత్మకూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లి గ్రామా నికి చెందిన గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం పంచర్ కావడంతో రహదారిపై పక్కకు నిలిపారు. పాములపాడు వైపు నుంచి బైక్‌పై జయ కృష్ణ స్వగ్రామానికి వెళ్తుండగా కంబాలిపల్లి వద్ద అదుపుతప్పి నిలిచి వున్న ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్ఐ తిరుపాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మెట్లపై నుంచి పడి..ఆదోని అర్బన్: పెద్దతుంబలం గ్రామానికి చెందిన రజాక్(35) సోమవారం ఇంట్లో మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందరన్నారు. మృతుడి భార్య గౌసియా, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుకుందలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కౌతాళం: ఉరుకుంద గ్రామం ఈరన్నస్వామి దేవాలయ పరిసర ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం కౌతాళంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిస్తే కౌతాళం పోలీసులను ఆశ్రయించాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులో గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు ప్రమాదకరమని రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీనేజ్ గర్భంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు బాల్యవివాహాల నివారణ, టీనేజీ గర్భదారణ దుష్పరిణామాలు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలకు బలవంతం చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ నిల్వ చేసిన జంక్‌ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. టార్చ్ లైట్లతో నిరసన ఆదోని రూరల్: రాత్రి వేళ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మండలంలోని పాండవగల్లులో సోమవారం రాత్రి సీపీఎం నాయకులు టార్చ్లైట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శివర్గ సభ్యులు జె.రామాంజనేయులు మాట్లా డుతూ.. రాత్రి సమయాల్లో అధికారులు విద్యుత్ కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలు, ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాండురంగ, అనీఫ్బాషా, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంతరెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు పాల్గొన్నారు. -
పైళ్లెన నాలుగు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్‌పై బాబాయి కొడుకు ఆకాష్‌తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్‌ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం
● తుంభద్రమ్మ ఒడిలో ఓలలాలిడిన స్వామి వారు ● బ్రహ్మరథం పట్టిన భక్తులు కోసిగి/మంత్రాలయం: ఏటి గట్టున భక్తజనం వీక్షిస్తుండగా.. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈరన్న స్వామి తుంగభద్రమ్మ ఒడిలో ఓలలాడారు. నృసింహుని పుణ్యస్నానంతో ఆధ్యాత్మిక తరంగాలతో తుంగభద్రమ్మ పరవశించింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీనరసింహ స్వామి) పల్లకోత్సవం చివరి సోమవారం కడు వైభవంగా సాగింది. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామి వారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా ఉరుకుంద నుంచి కోసిగి మండలం కందుకూరు గ్రామం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్రనది చెంతకు చేరారు. ముందుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కె. వాణి ఆధ్వర్యంలో తుంగభద్రమ్మకు హారతులు పట్టి సారె సమర్పించారు. అనంతరం నరసింహా స్వామికి జై.. అంటూ .. స్వామి వారికి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నది ఒడ్డున దింపుడు కట్టపై స్వామి వారిని కొలువుంచి అభిషేకాలు గావించి మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామి వారికి నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరిగి యథావిధిగా పల్లకీలో ఊరేగింపుగా బయలు దేరారు. కందుకూరు గ్రామంలో స్వామి వారికి మేళతాళాలతో డప్పువాయిద్యాలతో గ్రామ ప్రజలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కామన్‌దొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, గ్రామాల మీదుగా ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు, రామ్మోహన్, ఉపప్రధాన అర్చకులు మహాదేవప్ప, సీనియర్ అసిస్టెంట్ వీరేష్లు ఉన్నారు. పల్లకోత్సవం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోసిగి, కౌతాళం సీఐలు మంజునాథ్, యుగంధర్, కోసిగి, ఎమ్మిగనూరు రూరల్, పెద్దకడబూరు ఎస్ఐలు రమేష్ రెడ్డి, శ్రీనివాసులు, మారుతి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరూరా జాతర ఈరన్న స్వామి పల్లకీ చేరుకున్న గ్రామాల్లో జాతరను తలపించింది. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పల్లకీ చేరుకోగా స్వామి పాదాల చెంత భక్తులు నీటితో పాదాభిషేకం చేయగా, అడుగడునా కోక పాన్పులు పరుచగా పల్లకీ ముందుకు సాగింది. భక్తులు అడుగడునా నారికేళాలు సమర్పించి పూజలు చేపట్టారు. స్వామి పల్లకీ ముందుకు సాగిన గ్రామాల్లో గాజులు, మిఠాయి అంగళ్లు, చిన్నారుల రంగుల రాట్నాలు, బొమ్మలు అంగళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. -
శాశ్వత బెంచ్ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు
కర్నూలు (టౌన్): హైకోర్టు శాశ్వత బెంచ్‌పై ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టీ.మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో కోర్టు విధులకు హాజరయ్యే సమయంలో ధరించే నల్లకోటుకు బదులుగా సివిల్ డ్రెస్‌లో కూర్చొని న్యాయవాదులు 12వ రోజు దీక్షలను కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైకోర్టు శాశ్వత బెంచ్‌పై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై న్యాయవాదులుగా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 12వ రోజు దీక్షల్లో ఈదుల బాలాజీ రెడ్డి, మురళీక్రిష్ణ, నేతన్యా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షలకు పలువురు మద్దతు సర్క్యూట్ బెంచ్ కాకుండా కర్నూలులో శాశ్వతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత 11 రోజలుగా న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలకు పలువురు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ ఆలీఖాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ నరసింహా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసీహెచ్ సమావేశానికి హాజరవ్వాలి కర్నూలు(సెంట్రల్): ఈసీహెచ్ పాలీక్లినిక్ నెల వారీ సమావేశానికి ప్రతి మాజీ సైనికుడు హాజ రై విజయవంతం చేయాలని కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసుమెన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు యు.సుధాకర్, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మలికార్జున శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులకు సంబంధించి అధునాతన వైద్యం అందించడంలో ఈసీహెచ్ ఆఫీసర్ ఇన్చార్జ్ విఫలమైన నేపథ్యంలో అందరూ హాజరై హక్కుల కోసం నిలదీయా ల్సి ఉందన్నారు. ఆసుపత్రి ఎంప్యానెల్మెంట్, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు, మందుల సరఫరా, రెఫరల్స్, వైద్య సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్న నేపథ్యంలో మాజీ సైనికులు హాజరు కావాలని కోరారు. ఇంటింటి సర్వేపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు తెలపాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గత నెల 18 నుంచి 24వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఆ మేరకు గుర్తించిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు గ్రామ సభలను నిర్వహించి తుది ఓటరు జాబితాలను రూపొందిస్తామన్నారు. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో 7వ తేదీన తుది జాబితాలను ప్రచురిస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీడీఓ ఎల్.భరత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్ పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల యాత్రకు విచ్చేసే భక్తులందరూ సంతృప్తి చెందేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలనాంశాలపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశానికి డీఈవో చంద్రశేఖర్, అన్ని యూనిట్ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఏఈలు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కూడా అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకి అనుగుణగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు శాసీ్త్రయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. -
చెంచు విద్యార్థుల చదువులకు ‘ఆధార’మై..
నిరుపేద కుటుంబంనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అతను పేద విద్యార్థులకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆత్మకూరు మండలం బాపునంతపు రం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 16 ఏళ్ల క్రితం 2010 నవంబర్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం కొట్టాలచెరువు చెంచుగూడెంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వ హిస్తున్నారు. చెంచుగిరిజన పిల్లలు చదువుకు దూరంగా ఉండడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సొంత ఖర్చులతో రంగులు వేయించారు. పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డులు అందజేశారు. వెదురుబొంగులతో అదనపు తరగతి గదిని ఏర్పాటు చేయించారు. ఆర్డీటీ సహకారంతో విద్యా వలంటరీ నియమించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ఏర్పాటు చేయించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చెంచు గిరిజన గూడెం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. – ఆత్మకూరు -
సతీష్‌కు సరిలేరెవ్వరు!
విధులు నిర్వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, అక్కడ చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి పాటుపడటంలో బనగానపల్లె పట్టణం కొండపేట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్‌కుమార్ ముందంజలో ఉన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన ఈయన 2002 అక్టోబరులో బనగానపల్లె మండలంలోని గిరిజన ప్రాంతమైన గులాం అలిబాద్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన బాలికలు చాలా మంది 6వ తరగతి చదివే అవకాశం లేక ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఆ సమస్యను సతీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి యూపీ పాఠశాల మంజూరైంది. 2009లో వెంకటాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ గణితం, ఇంగ్లిషులో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక బోధనతో విద్యార్థులను తీర్చిద్దారు. ఎన్ఆర్ఐలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2017లో టంగుటూరు ఎంపీపీఎస్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆయన విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. తన సేవలను గుర్తించిన ప్రభు త్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. – బనగానపల్లె -
అంకిత భావంతో వి‘జయం’..
అందరి ఉపాధ్యాయుల్లా ఆమె పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి తిరిగి వచ్చామా అనుకోలేదు. దాదాపు 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చూపిన అంకితభావానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. దేవనకొండ మండలం కరివేముల ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న శీలం జయమ్మ సొంతూరు వెలుగోడు మండలం వేగులగూడూరు. 1998 ఆగస్టు 21న హాలహర్వి మండలం హాలహర్వి ఆదిఆంధ్ర పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధుల్లో చేరారు. తర్వాత దేవనకొండ మండలం కరివేముల, జూపాడుబంగ్లా మండలం మండ్లెం, నందికొట్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పేట)లో విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్‌లో కరివేముల ఎంపీపీ పాఠశాలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయడం, విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంపికయ్యేలా ప్రోత్సహించడం, చదువుకు దూరంగా విద్యార్థుల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దారు. కరివేముల పాఠశాలకు హెచ్ఎంగా వచ్చినప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేశారు. అలాగే గ్రామంలో జానకి వావిలాల కృష్ణమూర్తి ట్రస్టు హాస్టల్ కూడా వచ్చింది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. – దేవనకొండ -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన ఓ వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇటిక్యాల నాగరాజుకు అనంతపురం జిల్లా సద్దలదిన్నెకు చెందిన వరలక్ష్మికి (38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. భర్త రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. వరలక్ష్మి క్రిమి సంహారక మందు తాగిందని తన బావమరిది దేవేంద్రకు ఫోన్ చేయడంతో తాడిపత్రికి తీసుకురావాలని సూచించాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఎలాంటి మందు తాగలేదని సమాధానం ఇచ్చాడు. తెల్లవారాక వరలక్ష్మి మృతి చెందిందని బావమరిదికి విషయం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, క్రిమిసంహారక మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ వెల్లడించారు. మోటార్ల చోరీ : నిందితుల అరెస్టు పాములపాడు: వ్యవసాయ బావుల వద్ద విద్యు త్ మోటార్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణరావుపేట, కోల్స్ ఆనందాపురం గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు బాధిత రైతుల నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్‌కు చెందిన చంటి, నర్సమ్మ అనే ఇద్దరి నుంచి 5 మోటార్లు రికవరి చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృతి ఓర్వకల్లు: రేకుల షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నమడకల గ్రామ శివారులోని ఓ సిలికాన్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్నమడకల గ్రామ సమీపంలో కేఈ సోదరుల స్థలంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నూతన షెడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్‌కుమార్ (27) పైపులకు వెల్డింగ్ చేస్తుండగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు షెడ్‌కు నిర్మించిన ఇనుప పైపు ఊడి కిరణ్‌కుమార్‌పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ పాండురంగస్వామి తెలిపారు. -
బోధన సృజనాత్మకం
విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. అందులో తుగ్గలి మండలం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అద్దంకి చంద్రమోహన్ ఒకరు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆయన ప్రస్తుతం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. 2008లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పలు పాఠశాలల్లో పని చేశారు. టీఎల్ఎం (టీచింగ్, లెర్నింగ్, మీటీరియల్) రూపొందించారు. స్వతహాగా చేసిన టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సాంకేతికత సాయం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్నంగా పాఠాలు బోధించడం ఆయన ప్రత్యేకత. వంద శాతం ఎన్రోల్ మెంట్, నో బ్యాగ్ డే, యోగా, క్విజ్, చిత్ర లేఖనం తదితర వాటిని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండే విధంగా సబ్జెక్టుల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. జీ.ఎర్రగుడి పాఠశాలలో పనిచేసిన సమయంలో రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం, 2024లో ఉపాధ్యాయ రత్న, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చంద్రమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని, భవిష్యత్‌లో మరింత మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. – తుగ్గలి -
చదువుల వనంలో సాహితీ సేద్యం
డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ దేవేంద్రప్ప రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఈయన 2002 డీఎస్సీలో ఎంపికై తెలుగు ఉపాధ్యాయునిగా అవుకు మండలం కునుకుంట్ల పాఠశాలలో చేరారు. ఈయన తెలుగు భాషపై పట్టు సాధించి సాహిత్యంపై అడుగులు వేశారు. విధులు నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు భాషాభివృద్ధి, బాల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడంతో పాటు నైతిక విలువలు, సృజనాత్మక, క్రమశిక్షణ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు. సాహిత్యం పట్ల మక్కువతో ఆయన ఆశావాది, ఆభ్యుదయ భావకుడు, అంబేడ్కకర్ శతకం అనే గ్రంథాలు రచించారు. అలాగే సృజనా స్రవంతి, చదువు ఎదుగు, అనిత అనే కథానికలకు సంపాదకత్వం వహించారు. రాష్ట్రంలో అనేక సాహితి సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలను పొందారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. – డోన్ రూరల్ -
ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు
తరగతి బోధనతో పాటు ఉపాధ్యాయ శిక్షణ, సైన్స్ ప్రాజెక్టులు, క్విజ్లు, డిజిటల్ బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆదోని మండలం విరుపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మైత్రి ఆదిమూర్తికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఆదోనికి చెందిన ఈయన 2003లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా గత 12 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్, ఆర్.ఎం.ఎస్.ఏ. శిక్షణలు, కాంప్లెక్స్ సమావేశాలు, పదో తరగతి ఓరియంటేషన్ తరగతులు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు. అలాగే ఇన్స్పైర్, ఎన్సీఎస్సీ, కౌశల్ క్విజ్ వంటి కార్యక్రమాల కోసం అనేక మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఆదిమూర్తి మార్గదర్శకత్వంలో 2023లో ఒక విద్యార్థి జిల్లా స్థాయి ఎన్సీఎస్సీకి ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. అలాగే పదో తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ‘మార్గదర్శి’ స్టడీ మెటీరియల్ రచయితగా కూడా ఆయన సేవలందించారు. గత నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న కౌషల్ జిల్లా స్థాయి క్విజ్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ క్విజ్ మాస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిజికల్ సైన్స్‌కు సంబంధించిన యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనా వనరులను అందిస్తున్నారు. ఆయన రూపొందించిన వీడియోలను 2.5 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించి ప్రయోజనం పొందారు. అంతే కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే పలు మూల్యాంకన పత్రాలను రూపొందించారు. – ఆదోని -
వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
● వ్రతంలో పాల్గొన్న 1,233 మంది చెంచు, 500 మంది ఇతర భక్తులుశ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శుక్రవారం ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడేలకు చెందిన 1,233 మంది చెంచు మహిళా భక్తులు, 500 మంది ఇతర మహిళా భక్తులు పాల్గొని వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాలకు కావలసిన పూజాద్య్రాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు, అమ్మవారి శేవస్త్రాలను కూడా అందజేశారు. సంప్రదాయబద్ధంగా జరిపిన వ్రతంలో మహాగణపతిపూజ, వేదికపై ఆశీనులను చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా అవాహన చేశారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరిగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. -
విలువలతో కూడిన విద్యతో గుర్తింపు
బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 2012లో జూనియర్ లెక్చరర్ల నియామకంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2021లో కర్నూలు నగరంలోని కెవిఆర్ బాలికల జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అత్యుత్తమ ఫలితాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా బోధన సాగిస్తున్నారు. కేవీఆర్ కాలేజీలో పని చేస్తున్న ఓ చిరుద్యోగి కిడ్నీలు పాడై చికిత్సకు ఇబ్బంది పడుతుండటంతో కొంత సొమ్ము వసూలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. – కర్నూలు సిటీ -
మహిళ దారుణ హత్య
● పొలంలో మృతదేహం లభ్యం ● విచారణ చేస్తున్న పోలీసులు పత్తికొండ రూరల్: పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామ పొలాల్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోతిరాళ్లకు చెందిన హరిజన శాంతమ్మ (65) ఉదయం పొలం పనులకు వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆమె కోసం వెతికారు. శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి వివాదం కారణంగా బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానంతో మృతురాలి కుమారుడు హరిజన కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో అనుమానితుల మీద విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్, ఎస్ఐ రాందాస్ గ్రామానికి వెళ్లి హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతిపై విచారణ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
నందికొట్కూరు: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్‌లో అర్హత లేకపోయినా 2025 డీఎస్సీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో బయటపడిందని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లను వైఎస్సార్సీపీ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలను బయటకు తీసేందుకు సీబీఐకు అప్పగించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి నెలకు రూ.3 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సతీష్‌రెడ్డి, శశాంక్, బన్నీ, చరణ్, మన్సూర్, రంగ, తదితరులు పాల్గొన్నారు. – డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ -
బాబు, పవన్, లోకేష్.. జాబ్‌లు మీకేనా, మాకివ్వరా?
● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల మూడు రోజుల రిలే నిరాహారదీక్షలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్‌క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
ఓటరు జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు (టౌన్): ఓటరు జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకుని ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, ఓటీపీలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పైర్లు ‘బావు’రుమంటున్నాయి !
ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా నోళ్లు తెరిచిన బీళ్లే. ఇక లాభం లేదని ఎండిపోయిన పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానవు. అప్పులు చేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇంతటితో అయిపోలేదని, ముందుంది తీవ్రమైన కరువని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లోకి తొంగి చూస్తే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వీటి కింద సాగుచేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
కలెక్టర్‌కు బంగారు పతకం
నంద్యాల(న్యూటౌన్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందు కు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రెడ్‌క్రాస్ బంగారు పతకం, ప్రశంసా పత్రం లభించింది. మంగళవారం విజ యవాడలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో 2024–25 సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెడ్‌క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్లను రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సత్కరించారు. నంద్యాల జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమం అమలు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలను సమర్థవంతంగా అమ లు చేసినందుకు కలెక్టర్ రాజకుమారికి ఈ పురస్కారం లభించింది. -
వ్యక్తి దారుణహత్య
ఆళ్లగడ్డ: పట్టణ శివారు పాలసాగరం వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆంజనేయులు (27)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు ఐదేళ్ల క్రితం రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయ్యింది. అతడు సోమవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న తోటలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి చూడగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య సుబ్బులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. మృతదేహం పడిఉన్న చోట మద్యం బాటిల్లు ఉండటంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం కారణమా? ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు -
పారే నీటిలో నీవే.. చిరునవ్వులో నీవే !
నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కరువు నేలలో జలసిరులు కృష్ణగిరి: జిల్లాలో నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీ – నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్ పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55 కోట్లతో తాగునీరు అందించారు. వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ ద్వారా ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీరు అందించారు. అలాగే పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాటుచేశారు. దీంతోపాటు లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరో 5,100 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందింది కూడా వైఎస్సార్ పాలనలోనే అనేది జగమేరిగిన సత్యం. అందుకే ఇక్కడి ప్రజలు అయనను అనుదినం స్మరించుకుంటున్నారు. రైతు బాంధవుడు తుగ్గలి: వరుస కరువులతో 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులవి. భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణమాఫీ చేయడంతో పాటు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కానీ రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితి తెచ్చారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండటం ఆయన చలువే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి, పందికోన వద్ద రిజర్వాయర్లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారు. -
వరద బాధితులకు అండగా..
నంద్యాల(అర్బన్): వరద ప్రభావంతో నంద్యాలలో సర్వం కోల్పోయి ని రాశ్రయులుగా మారిన వారికి డాక్టర్ వైఎస్సార్ అండగా నిలిచారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపునకు గురై అధికంగా నష్టపోయింది. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో జూన్ 24న వైఎస్సార్ స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శి ంచారు. ప్రజల కష్టాన్ని కళ్లారా చూసి న వైఎస్సార్ వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్యామ కాలువ, కుందూ నది,మద్దిలేరును వెడల్పు చేసి వరద ముప్పు తప్పించడానికి రూ.92 కోట్లను మంజూరు చేశారు. వైఎస్ నగర్, పీవీ నగర్లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రె యిన్లకు రూ.3.62 కోట్లను మంజూరు చేశారు. ఆయ న హయాంలో నంద్యాల నియోజకవర్గంలో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. -
సీమ కల్పతరువు అవుకు రిజర్వాయర్
కోవెలకుంట్ల: మహానేత జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు ఆయా జిల్లాల రైతాంగానికి ఊపిరిలూదా యి. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు.దీని ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్‌కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30 వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మే ర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల వరదజలాలను రిజర్వాయర్‌లో నింపు తున్నారు. వైఎస్సార్ కలల సాకారమైన అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. -
మాజీ ఎమ్మెల్యే గంగుల గృహ నిర్బంధం
ఆళ్లగడ్డ: మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను మంగళవారం ఉదయం పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని బయటకు వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ సందర్శనకు వెళ్తే కూడా ప్రభుత్వం ఎందుకు బెంబేలెత్తుందో అర్థం కావడం లేదన్నారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ప్రశ్నిస్తే పోలీసులతో గృహ నిర్భంధం చేయడం సమంజసం కాదన్నారు. పోలీసుల అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.41కోట్లు కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం మూడవ గురు, సోమవారాలకు సంబంధించి ఆరు రోజుల హుండీని మంగళవారం లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదు రూపంలో రూ.1,41,05,560 రాగా.. వెండి 25 కేజీల 300 గ్రాములు, బంగా రం 16 గ్రాముల 980 మిల్లీగ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే యుఎస్ఏ డాలర్లు 8 వచ్చాయన్నారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణాధికారి కమలాకర్, దేవాలయ సిబ్బ ందితో పాటు ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్యఅర్చకులు, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పీఆర్ ఎస్ఈగా కేజేఎస్ చంద్రారెడ్డి బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరుగా కేజేఎస్ చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్క డ ఎస్ఈగా విధులు నిర్వహించిన జి.ప్రభాకర్‌రెడ్డి గత ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న కేజేఎస్ చంద్రారెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నూతన ఎస్ఈని ఇంజినీర్లు కలిసి పూలబొకేలతో అభినందనలు తెలిపారు. ముగిసిన బీమా గడువు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3,48,390 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద వేరుశనగ, పత్తి.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, మిర్చి, కొర్ర, సజ్జ, ఉల్లి నోటిఫై అయ్యాయి. వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు జూలై చివరితో పూర్తి కాగా.. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 31తో ముగిసింది. నోటిఫై చేసిన పంటలు 3,40,842 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో 3,30,482.74 హెక్టార్లకు ప్రీమియం చెల్లించినట్లు స్పష్టమవుతోంది. మొత్తం 2,86,322 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. నంద్యాల జిల్లాలో వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,00,094 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. ఈ జిల్లాలో 1,48,546 మంది రైతులు పంటల బీమా చేసుకోగా.. ఇందులో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులు 6,725 మంది ఉండగా.. నాన్ లోని ఫార్మర్స్ 1,41,821 మంది ఉండటం గమనార్హం. క్వింటా ఉల్లి రూ.4,139 కర్నూలు(అగ్రికల్చర్): ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గిపోవడంతో కొరత ఏర్పడుతోంది. కర్నూలు జిల్లాలో 19,241 హెక్టార్ల సాధారణ సాగు ఉండగా కేవలం 4,988 హెక్టార్లలో సాగయింది. మార్కెట్‌కు ఉల్లి తక్కువగా వస్తోంది. కేవలం 686 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు మార్కెట్‌కు రాగా కనిష్టంగా రూ. 2,393, గరిష్టంగా రూ.4,139 ధర లభించగా.. సగటు ధర రూ.3,839 నమోదైంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగ ధర క్వింటాకు గరిష్ట ధర రూ.9,329, ఆదోని మార్కెట్లో రూ.8,999 ప్రకారం ధర లభించింది. ఆదోని మార్కెట్‌కు పత్తి 1,064 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,469, సగటు ధర రూ.9,769 పలికింది. -
రాజన్నకు పుష్పాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు. వైద్యులా.. భూత వైద్యులా? ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్‌గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు. క్లినిక్ ఎదుట నల్లటి కవర్ క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్‌ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్‌కు గురయ్యారు. పోలీసుస్టేషన్‌కు చేరిన వివాదం తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్‌పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం. దేవతతో రాజకీయం దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది. గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా జూన్ 5న కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు.కమిటీలో చైర్మన్ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల ఏళ్ల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మ వారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువు తాండవిస్తోందని, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
నేడు వైఎస్సార్ వర్ధంతి
కర్నూలు(టౌన్): ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 2004 సంవత్సరం మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణ యుగాన్ని తలపించింది. 2009 సంవత్సరం ఏప్రిల్‌లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఆయన పాలనలో రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందించడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మహానేత మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ చిరునవ్వు మదిమదిలో సజీవంగా ఉండటం విశేషం. ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజలు తమకు చేకూరిన లబ్ధిని గుర్తు చేసుకొని మనసులోనే నివాళులర్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో పాటు కర్నూలు నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని స్టేట్ బ్యాంకు వద్దనున్న వైఎస్సార్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అలాగే జిల్లాలో గురురాఘవేంద్ర, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, అవుకు రిజర్వాయర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఆయనకే సొంతం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి బుధవారం వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్
● బస్సు టైర్ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి పత్తికొండ: గమ్యస్థానాలకు చేరకుండా మార్గం మధ్యలోనే మరమ్మతులకు గురై ఆగిపోతూ ఆర్టీసీ బస్సులు హడలెత్తిస్తున్న సంఘటనలతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి ఆదోనికి బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఏపీ 39 యూఎస్ 5609 నంబరు గల బస్సు దేవనబండ–ఆటికెలగుండు గ్రామాల మధ్య టైర్ పేలడంతో ఆగిపోయింది. పేలుడు తీవ్రతకు టైర్ ఉన్న చోట సీట్లో కూర్చున్న హోసూరు, పత్తికొండ, ఆదోనికి చెందిన వెంకటేష్, కార్తీక్, గిరి అనే ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఉన్నఫళంగా పెద్ద శబ్దంతో టైరు పేలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనం సిబ్బంది గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఘటన జరగడంతో ముప్పు తప్పిందని, రక్షణ గోడలు లేని వంతెన వద్ద టైరు పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. డిపో మేనేజర్‌పై మండిపాటు ఆదోని, పత్తికొండ రెండు డిపోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రెహమాన్‌పై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పత్తికొండ డిపోలో కాలం చెల్లిన బస్సులలో ప్రతిరోజు ప్రయాణం నరకప్రాయంగా మారింది. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా అనునిత్యం మార్గం మధ్యలో నిలిచిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనికితోడు పత్తికొండ బస్టాండ్‌కు వచ్చే ఇతర డిపోల సిబ్బంది ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా నడపడం వల్ల అందుబాటులో ఉన్న బస్సులపై రద్దీ తీవ్రత పడుతుంది. దీంతో బస్సులో ప్రయాణం చేసేవారు అవస్థల నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. అదే విదంగా రద్దీ వల్ల సోమవారం సాయంత్రం పత్తికొండ బస్డాండ్‌లో గుంతకల్‌కు చెందిన హసీనా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వైద్య చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయింది. పత్తికొండ డిపో మేనేజర్‌గా ఉన్న రెహమాన్ సంక్రమంగా విధులకు రాకపోవడం పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది విధులపై కూడా సంక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే సమస్యలపై నేరుగా గతంలో చాలా మంది రీజనల్ మేనేజర్ శ్రీనువాసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తోపులాటలో అస్వస్థతకు గురైన మహిళ మృతి కర్నూలు నుంచి గుంతకల్‌కు బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్‌కు చెందిన హసీనా (55) అనే మహిళ సోమవారం సాయంత్రం పత్తికొండ బస్టాండ్‌లో వాష్‌రూమ్‌కు దిగింది. తిరిగి బస్సు ఎక్కే క్రమంలో రద్దీ వల్ల జరిగిన తోపులాటలో ఊపిరి అందక స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి మణిదీప్ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. బస్సులో రద్దీ వల్లనే తన అమ్మ అకారణంగా చనిపోయిందని కుమారుడు దాదాపీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. -
సబ్సిడీ వేరుశనగ స్వాహా!
డోన్ టౌన్ (ప్యాపిలి)/డోన్: తమది రైతు ప్రభుత్వం అంటూ టీడీపీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి పొంతన లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మరువకముందే సబ్సిడీ వేరుశనగను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29న డోన్ నియోజకవర్గంలోని ఎనుగుమర్రి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి మంజూరైన విత్తనాలను అర్హులైన రైతులకు అందించకుండా గ్రామ టీడీపీ నాయకుల సిఫార్సుతో కొద్దిమంది ఆ పార్టీ వారికి అందించి మిగతా విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సచివాలయంలో ఉంచిన స్టాకును అదే గ్రామానికి చెందిన వ్యాపారికి విక్రయించగా సదరు వ్యక్తి వాటిని రెండు వాహనాల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
కేజీబీవీ సీటు ఇప్పించండి మేడం
నందవరం: ‘చదువుకోవాలని ఉంది. కేజీబీవీలో సీటు ఇప్పించండి.. మేడం’ అంటూ పెద్దకడబూరు మండలం, కమ్మలదిన్నెకు చెందిన కురవ కావేరి జిల్లా కలెక్టర్ ఏ.సిరిని వేడుకుంది. మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌కు కేజీబీవీలో సీటు కేటాయించాలని కోరుతూ కావేరి వినతి పత్రం అందజే సింది. 7వ తరగతి వరకు చదివానని, తర్వాత తల్లిదండ్రులు చదివించలేకపోవడంతో మధ్యలోనే వదిలేశానని తెలిపింది. కేజీబీవీలో దరఖాస్తు చేసుకు న్నా సీటు రాకపోవడంతో చదువుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నందవరం మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటున్నానని, తనకు కస్తూర్బాలో సీటు ఇప్పి ంచి చదివించాలని జిల్లా కలెక్టర్‌ను ఆ బాలిక వేడుకుంది. కలెక్టర్ స్పందిస్తూ కేజీబీవీలో సీటు కేటాయి స్తామని హామీ ఇవ్వడంతో కావేరి సంతోషం వ్యక్తం చేసింది. -
అశ్వవాహనంపై విశ్వమోహనుడు
● వైభవంగా 6వ రోజు ఆరాధన వేడుకలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం: మంగళకర వాయిద్య నాదాలు.. భక్తజనుల జయజయ పఠనాలు.. పండితుల వేద ఘోషల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కొలువుదీరారు. పండితుల ఉయ్యాల జంపాలతో ఉత్సవమూర్తి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రహ్లాదరాయలకు అశ్వవాహన సేవ గావించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి చతుర్వేద పారాయణం గావిస్తూ ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ప్రాంగణ వీధుల్లో అశ్వ వాహనంపై కనుల పండువగా ఊరేగింపు సాగింది. ఆనవాయితీలో భాగంగా చెక్క, వెండి, అంభారి, స్వర్ణ, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. 6వ రోజు వేడుకల్లో రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ చేపట్టారు. ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు ఆరాధన ఆఖరిరోజు సందర్భంగా సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఉత్సవం సందర్భంగా ఏకకాలంలో పంచవాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. -
దిశ, వన్‌స్టాప్ సెంటర్ తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని దిశ, వన్‌స్టాప్ సెంటర్‌ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించారు. వన్‌స్టాప్ సెంటర్లో చేరే వారి వివరాలను, వారి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సంబంధిత సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు విక్టిమ్ కాంపెన్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ యాక్ట్ – 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని తెలిపారు. వారి భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
నంద్యాల(న్యూటౌన్): మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో నేషనల్ ఎంటర్ పెన్యూర్ డే క్యాంపెయిన్, పీఎంఎఫ్ఎంఈ గ్రాడ్యుయేషన్‌డే పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి బ్యాంక్ లింకేజీ రుణం కింద రూ.1,342 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.573 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే సీ్త్రనిధి ద్వారా ఈ ఏడాదికి రూ.378 కోట్ల రుణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.127.74 కోట్లు ఇచ్చామన్నారు. మండలాల వారీగా సాధించాల్సిన లక్ష్యాలు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ మహిళలు డీపీఎంఎస్, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, యూనియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలతో ఎగుమతులు సాధ్యమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే సాగులో తగిన జాగ్రత్తలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త విజయ్ అవినాష్ లింగం సూచించారు. కర్నూలులోని ఉద్యాన భవన్లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచ విజయం దిశగా సాధికారత సాధించడం, ఎగుమతుల సన్నాహకాలపై సమగ్ర శిక్షణలో భాగంగా జిల్లాలోని ఎఫ్పీఓల ప్రతినిధులకు ఎగుమతులపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై అవగాహన కల్పించారు. ఏఏ పంటలకు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర తదితర వాటిని వివరించారు. కర్నూలు జిల్లా ఉద్యాన పంటల సాగుకు నిలయంగా మారుతోందని, ఎగుమతులకు అవకాశం ఉన్నప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ, నాబార్డు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బాగా పని చేస్తున్నాయని, ఎగుమతులకు అవకాశం కల్పించడం ద్వారా సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎగుమతులకు నాబార్డు, ఎపిడా సంపూర్ణంగా సహకరిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆప్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నబిరసుల్, నాబార్డు డీడీఏం సుబ్బారెడ్డి, ఎపిడా మేనేజర్ పెద్దస్వామి, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్‌యూలో విద్యార్థి సంఘం నేత హల్చల్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అనుచరుడు బుధవారం రాత్రి వర్సిటీలో వీరంగం సృష్టించాడు. వీసీని కలవడానికి అనుమతివ్వలేదనే కారణంతో వీసీ పీఏతో మొదలైన దూషణల పర్వం, వీసీ డ్రైవర్, ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అసభ్య పదజాలంతో విరుచుపడ్డాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.విజయ్‌కుమార్ నాయుడు ఎదుటే దూషణల పర్వం కొనసాగింది. రిజిస్ట్రార్‌ను ఉద్దేశించి ‘‘కడపలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. వీసీకి, రిజిస్ట్రార్‌కు నేను ఎంత సపోర్ట్ చేశానో తెలుసా’’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మా ఆడబిడ్డపై దాడి చేస్తారా.. మా గవర్నమెంట్ ఇది, ఎవరు నన్ను ఆపేది, అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ అందరి జాతకాలు తెలుసు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు, రూ.లక్ష తీసుకొని డ్రామాలు చేస్తారా’’ అంటూ వీరంగం సృష్టించాడు. బైరెడ్డి శబరి అక్కకు ఒక్క ఫోన్ చేస్తే.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయనతో పాటు మాట్లాడటానికి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వెళ్లాడు. విద్యార్థులు గొడవ పడితేనే సస్పెండ్, వర్సిటీని బహిష్కరించే వర్సిటీ అధికారులు, మరి వర్సిటీ పరిపాలనాధికారి ఎదుటే, పరిపాలనా భవనంలోనే ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డ విద్యార్థి సంఘం నాయకునిపై ఏమి చర్యలు తీసుకుంటారోననే చర్చ వర్సిటీలో సాగుతోంది. -
బాక్సింగ్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించినట్లు డాక్టర్ మధుసూదనరావు, అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలిపారు. వారు గురువారం మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి క్రీడా పోటీల్లో బాక్సింగ్‌లో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు పతకం, నాలుగు రజత పతకాలు సాధించి తృతీయ స్థాయిలో నిలవడం గర్వకారణమన్నారు. నంద్యాల జిల్లాల్లో బాక్సింగ్ శిబిరాలు, రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. క్రీడాకారులు నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బాక్సింగ్ కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని, వివిధ వెయిట్ కేటగిరీల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నాయకులు ఫయాజ్, నూర్‌బాషా, చంద్రశేఖర్, నాగేంద్ర, ఆనంద్, ఉపేంద్ర, గణేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డోన్ రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జింకా శ్రీకాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగకేశాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా అనోటేటర్ అసిస్టెంట్ (3) ఓసీ, డేటా క్యూరెటర్ అసిస్టెంట్ (3) ఓసీ–1, బీసీ–1, ఎస్సీ–1, పోస్టులు డోన్ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఎంపికకు సంబంధించి 22 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల్లోపు వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఐటీఐ ప్రధానాధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. నియామక ప్రకియ డిప్యూటీ డైరెక్టర్ రీజినల్ ఆఫీస్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్, పద్మావతిపురం, తిరుచానూర్ రోడ్డు, తిరుపతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య డోన్ టౌన్: మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కుమ్మరి వెంకటస్వామి (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 28న తండ్రి మందలించడంతో వెంకటస్వామి ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామ సమీపంలో గోసానిపల్లె నుంచి ధర్మారం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుండా పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామికి నాలుగు సంవత్సరాల క్రితం హరిప్రియ అనే యువతితో వివాహం జరిగింది. ఉడుములపాడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అతని కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో గురువారం అటు వైపు పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఇ.తాండ్రపాడు గ్రామంలో ఆటో ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. అదే గ్రామంలోని టీజీ నగర్‌కు చెందిన ఎం.రాజేంద్ర బాబు (56) బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాత్రి షాప్‌కు మూత వేసి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇ.తాండ్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో రాజేంద్రబాబుకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆటోడ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య ఎన్.శంకరమ్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏఎస్ఐ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత బొమ్మలసత్రం: కారు ప్రమాదంలో మృతిచెందిన ఆళ్లగడ్డ ఏఎస్ఐ సురేష్‌రెడ్డి కుటుంబానికి రూ. 20.80 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ గురువారం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏఎస్ఐ సురేష్‌రెడ్డి ఈఏడాది 7వ నెలలో కారు ప్రమాదంలో మృతిచెందాడన్నారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, కార్యాలయ అధికారులు వీరన్న, కవిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామినాయక్ ఉన్నారు. హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యా యవాదులు స్పష్టం చేశారు. వారి రిలే నిరాహార దీక్షలు 11వ రోజు గురువారం కొనసాగాయి. న్యాయవాదులు నిస్సీ, గౌతమ్ శేఖర్, తులసి ఈ శ్వర్ రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. -
అంతా శివయ్యే చూసుకోవాలి!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగం అత్యంత కీలకం. ఈ విభాగం ద్వారా క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీగిరిలో త్వరలో సుమారు రూ.800 కోట్లతో మూడు విడతలుగా మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించాలని ట్రస్ట్‌బోర్డు ఆశిస్తోంది. అయితే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) రిటైర్ కావడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీఈఈ హోదాలో ఇద్దరు ఏఈఈలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రంలో ఇంజినీర్ల కొరతతో అభివృద్ధి పనులకు అటంకం కలగనుంది. దేవస్థానంలో ఇంజినీర్ల కొరత రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ఈఈలు ఇద్దరు ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సఫ్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఈఈలు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్–ఒకరు, డ్రాఫ్ట్స్‌మెన్–ఇద్దరు ఉండాలి. ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేగాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. దేవస్థానంలోని ఇద్దరు ఈఈల్లో ఒకరు జూన్‌లో, మరొకరు ఆగస్టులో రిటైర్ అయ్యారు. దీంతో రెండు ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు డీఈఈలకు గాను ఎవరు లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరికొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్‌మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. అంతేగాకుండా ఇద్దరు ఏఈఈలు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అనుభవం ఉన్న అధికారి అయితే.. సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో చేపట్టనున్న మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే గతంలో దేవస్థానంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని ఈఈగా నియమించాలనే వాదన వినిపిస్తోంది. రూ.800కోట్ల అభివృద్ధి పనులు ఎటువంటి అంతరాయం లేకుండా వేగంగా, క్షేత్రంలో మౌలిక వసతులు, దేవస్థాన ఇంజినీరింగ్ పనులపై అవగాహన ఉండి గతంలో క్షేత్రంలో పనిచేసిన ఈఈను శ్రీశైలానికి డెప్యూటేషన్ లేదా బదిలీపై నియమించాలని కొన్ని నెలల క్రితం ఈఓ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ సైతం రాశారు. అయితే టీడీపీ ముఖ్యనేత అనుచరుడు ఆర్అండ్బీ శాఖలో ఈఈగా ఉన్న ఓ అధికారిని దేవస్థాన ఈఈగా డెప్యూటేషన్‌పై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించి అనుభవం, అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, మాస్టర్‌ప్లాన్ పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమిస్తారో లేక టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడి సూచించిన ఆర్అండ్బీ శాఖ ఈఈని డెప్యూటేషన్‌పై నియమిస్తారో చూడాలి. శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధి పనులకు ఇంజినీర్లు కరువు దేవస్థానంలోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రిటైర్డ్ శ్రీగిరిలో త్వరలో మూడు విడతల్లో రూ.800 కోట్లతో మాస్టర్‌ప్లాన్ పనులు రూ.800 కోట్ల మాస్టర్‌ప్లాన్‌కు ఆటంకం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రీశైల దేవస్థానంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా క్యూకాంప్లెక్స్, పబ్లిక్ ఎనిమిటీస్, టాయిలెట్స్, సాలు మండపాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దేవస్థానంలో ఈఈలు లేకపోవడంతో మాస్టర్‌ప్లాన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మాస్టర్‌ప్లాన్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, నాణ్యతతో నిర్మాణ పనులు, పర్యవేక్షణ చేపట్టేందుకు దేవస్థానంలో ఈఈలు లేరు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ అమలుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. -
ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె
మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బండారు శేఖర్ (45) ఎండుతున్న పొలాన్ని చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై గురువారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన శేఖర్ తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.50 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల వర్షాలు లేక వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందాడు. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి పొలం ఎండిపోతోందని కుటుంబ సభ్యులతో చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. పొలం ఎండిపోతే పోయింది.. అప్పులు ఎలాగైనా తీర్చుకుందామని కుటుంబ సభ్యులు ఓదార్చుతూ వచ్చారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన శేఖర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కరువు ఉరుముతోంది
● రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలు ● దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరో ● ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ● కర్నూలు జిల్లాలో 43 శాతం, నంద్యాల జిల్లాలో 43.1 శాతం లోటు వర్షపాతం ● ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే.. పాణ్యం మండలం కొణిదేడులో నీరు లేక నెర్రలిచ్చిన వరి పొలంకర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. హెక్టారుకు రూ.50 వేల ప్రకారం రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. కేవలం పెట్టుబడి రూపంలోనే రూ.773 కోట్లు మట్టిపాలయింది. -
రూ.3.20 లక్షల పెట్టుబడి నష్టం
16 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అంతరపంటగా కంది వేసుకున్నా. రెండున్నర నెలలుగా చినుకు జాడ లేదు. పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నా యి. ఎకరాకు సగటున రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా రూ.3.20 లక్షల వరకు పెట్టుబడిని కోల్పోయాం. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. – శ్రీనివాసరెడ్డి, రైతు, వెల్దుర్తి సొంత పొలం ఆరు ఎకరాలు ఉంటే, 34 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటి వరకు మిర్చి 10 ఎకరాలు, కంది 15 ఎకరాలు, సద్దలు 8 ఎకరాల ప్రకారం 33 ఎకరాల్లో పంటలు వేశాం. వర్షాలు లేకపోవడం వల్ల ఏడు ఎకరాలు ఖాళీగా ఉంది. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.15వేల ప్రకారం రూ.4.95 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. పంటలు పండకపోయినప్పటి కౌలు మాత్రం రూ.3.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.8.35 లక్షలు నష్టం వాటిళ్లుతోంది. కరువు మా జీవితాన్ని పూర్తిగా కాటేసింది. – లింగరాజు, రైతు, మద్దికెర -
ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే..
ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 28వేల హెక్టార్లలో... నంద్యాల జిల్లాలో 30వేల హెక్టార్లలో పంటలను దున్నేశారు. ప్రత్యామ్నాయంగా జొన్న, కొర్ర, స్వల్పకాలిక రకాలైన కంది, పెసర, అలసంద, ఉలువలు, వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా వర్షాల అవసరం ఉంది. కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వర్షాలే లేకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్‌నినో తీవ్రతను పరిశీలిస్తే ఈ సారి రబీ సీజన్‌పైనా ఆశలు వదులు కోవాల్సిందేనని తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 1,55,648 హెక్టార్లలో పంటలు వేశారు. దాదాపు అన్ని పంటలు నెల నుంచి 90 రోజుల దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పత్తి 2,32,671 హెక్టార్లలో సాగయింది. మామూలుగా పత్తిలో ఈ పాటికి ఒకసారి పత్తి తీస్తారు. మొదటి సారి పత్తి తీయడంలోనే ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అలాంటిది పత్తి వేసి 90 రోజులు గడుస్తున్నా కిలో దిగుబడి కూడా తీయలేని పరిస్థితి. పత్తి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు పెరగాలి. ఈ సారి ఏర్పడిన అనావృష్టి వల్ల ఒక్క అడుగు ఎత్తు కూడా పెరగకపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క పత్తిలోనే కాదు.. వేరుశనగ, కంది, ఆముదం తదితర అన్ని పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, కంది, మినుము, వరి, పత్తి ప్రధాన పంటలు. ఒక్క డోన్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం ఉంది. కానీ మొదటిసారి నీటిపారుదల స్తంభించింది. సాగైన పంటల్లో దిగుబడులు దాదాపు జీరో కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. దెబ్బతీసిన ఎల్‌నినో.. వరుసగా 21 రోజులు వర్షం లేకపోతే ఒక డ్రై స్పెల్‌గా పరిగణిస్తారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో జూన్ 14న ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా ఎక్కడా భారీ వర్షం లేదు. అంటే దాదాపు రెండున్నర నెలలుగా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో మూడు డ్రై స్పెల్‌లు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 428.3 మి.మీ ఉండగా.. 243.8 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి ఆగస్టు వరకు 286.4 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా.. 164.5 మి.మీకే పరిమితమైంది. గత 50 ఏళ్లలో అనేక సార్లు ఎల్‌నినో ప్రభావం ఏర్పడింది. అయితే వర్షాలు కాస్త మెరుగ్గానే కురిశాయి. ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్‌నినోను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు. -
శ్రీశైలంలో 145 టీఎంసీలు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో గురువారం సాయంత్రానికి 144.8036 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటి మట్టం 870.70 అడుగులకు చేరుకుంది. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో కంటే దిగువ ప్రాజెక్ట్‌లకు విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండడం వలన జలాశయ నీటిమట్టం రోజురోజుకు పడిపోతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి కేవలం 8,328 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకు విడుదలవుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం (సున్నిపెంట) ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు www. itiadmissions.ap.gov.in వెబ్సైట్లో ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవ తరగతిలో మెరిట్ ప్రకారం 7వ తేదీ మధ్యాహ్నం 2.30లకు శ్రీశైలం ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 9493252324, 9441181072ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫలించిన శిల్పా పోరాటం ● కేసీ, కుందూకు నీటి విడుదల బండి ఆత్మకూరు: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి చేపట్టిన సమర శంఖారావం కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. వెలుగోడు రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. దీంతో రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల ఒకటవ తేదీన శిల్పా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు పిలుపునకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంటనే వీబీఆర్ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అధికారులు హామీ ఇచ్చిన మేరకు గురువారం కుందూ, కేసీ కెనాల్‌కు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘బండారం’ బయటపడేదెన్నడు!
మంత్రాలయం: శ్రీమఠం బ్రాండ్‌తో భక్తులను మోసగిస్తున్నా అడిగే వారు లేరు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చర్యలు చేపట్టరు. దోపిడీపై భక్తులు మొత్తుకుంటున్నా వినేవారు కరువయ్యారు. ఎవరి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు.. అనుమతులు ఎవరిచ్చారో బయటకు చెప్పరు.. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠంలోపల ఓ వ్యాపారి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణాల్లో ఎటువంటి వ్యాపార దుకాణాలు ఉండరాదు. బయట వ్యక్తుల ఆధీనంలో ఎలాంటి వ్యాపారాలు చేపట్టరాదు. ఒకవేళ ఉంటే ఆలయ ఆధీనంలో రసీదులతో కూడిన లావాదేవీలు చేపట్టాలి. అంతేగాక దేవాదాయ శాఖ నియమం ప్రకారం అందులో అర్చన కుంకుమ, పరిమళ విభూతి, నియమ నిబంధన పూజా పదార్థాలు మాత్రమే విక్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులు ఆలయ ప్రాంగణాల్లో వ్యాపారాలకు తావు ఉండదు. మఠంలో ఓ ప్రైవేటు వ్యక్తి దోపిడీకి అనుమతి ఎవరిచ్చారో అంతు చిక్కడం లేదు. ప్రాంగణంలోని గ్రామ దేవత మంచాలమ్మ గర్భాలయానికి వెనుక భాగంలో రాఘవేంద్రుల గర్భమఠానికి ఈశాన్య దిక్కున పెద్ద దుకాణం కేటాయించి ‘న్యూ శ్రీ రాఘవేంద్రస్వామి పూజా బండార్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కర్ణాటకలోని ఉడిపీ ప్రాంతానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం శ్రీమఠం ప్రధాన ముఖద్వారం కుడివైపు చిన్న క్యాసెట్ల అంగడి పెట్టుకున్నాడు. భక్తి గేయాల క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు అమ్ముకుంటూ కాలం వెల్లదీశాడు. ఇప్పటికీ ఆయనను స్థానికులు క్యాసెట్ల పరమేష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కొన్నేళ్ల తర్వాత శ్రీమఠంలోనే దుకాణం తెరిచాడు. చేతి దారాలు మొదలు తపంబు పీఠాల వరకు వ్యాపారం నడుస్తోంది. అక్కడ ఏ వస్తువు కొన్నా బయట దుకాణాల్లో ధరల కంటే ఐదోవంతు ఎక్కువ. ఉదాహరణకు రాగి చెంబు బయట దుకాణంలో రూ.200కు లభిస్తే అదే చెంబు ఇక్కడ మాత్రం రూ.1000కి అంటగడతారు. ఇలా ప్రతి వస్తువుపై అంతే. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే ఇదీ శ్రీమఠం బ్రాండ్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీమఠంలో ప్రైవేటు పూజా బండార్ లేనప్పుడు క్షేత్రంలో 20 దాకా పూజా సామగ్రి దుకాణాలు ఉండేవి. కొందరు బండ్లపైనే పెట్టుకుని జీవనం సాగించే వారు. అయితే మఠంలో బండార్ పెట్టడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడి వ్యాపారాలు వదులుకున్నారు. భక్తులను దోచుకుంటున్న వ్యాపారిపై శ్రీమఠం అధికారులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదు. అది దేహ రహస్యంగానే మిగిలింది. -
భక్తుల మొర ఆలకించేదెవరు?
● గతంలో ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు ఉపయోగంలేని ఫిర్యాదుల బాక్స్‌లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురైన కష్టాలను చెప్పుకునేందుకు దేవస్థానం అవకాశం ఇవ్వడం లేదు. శ్రీశైల క్షేత్రంలో కొలువైన భ్రమరాంబా సమేతా మల్లికార్జున స్వామి కటాక్షం పొందేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శన సౌకర్యాలు, పలు ఆర్జితసేవలు, లడ్డూప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, వైద్యసౌకర్యాలు, వసతి, టికెట్ల కౌంటర్లు, డోనేషన్ కౌంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యానవనాల నిర్వహణ, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి, ఆర్జితసేవల నిర్వహణ ఎలా ఉంది, స్వామిఅమ్మవార్ల అలంకార దర్శన సౌకర్యాలు, స్పర్శదర్శనం, దర్శన సమయ వేళలు, ఇంకా పలు విషయాలపై భక్తుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, క్షేత్రాభివృద్ధికి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడం, భక్తుల అసౌకర్యాలపై ఫిర్యాదులు స్వీకరించడం వాటిని పరిష్కరించడం, తదుపరి పునరావృతం కాకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ తరహాలో ఏర్పాటు చేశారు. మోగని ‘డయల్ యువర్ ఈఓ’ ఫోన్ భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర దేవదాయశాఖకమిషనర్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న అట్టహాసంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 08524–287111నెంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల అధికారులతో, సిబ్బందితో ఈఓ సమీక్షించి భక్తుల నుంచి వచ్చిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారానికి ఒకరోజు కాకుండా నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ముఖ్య పర్వదినాలు, ముఖ్యమైన రోజులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాల నిర్వహణ సాకుతో కార్యక్రమానికి మొత్తానికి ఎగనామం పెట్టారు. దేవస్థానం డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలన భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద తదితర ప్రదదేశాలలో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల బాక్స్‌లపై అవగాహన లేని భక్తులు వాటిని వినియోగించడం లేదు. అసలు ఫిర్యాదు బాక్స్‌లు ఉన్నాయో లేదో భక్తులకు అవగాహన లేదు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆ కార్యక్రమం ద్వారా భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించి క్షేత్రాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. -
సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం
● జూపాడుబంగ్లా వద్ద కేసీ కాల్వలో దిగి రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన జూపాడుబంగ్లా: వెంటనే కర్నూలు–కడప కాల్వకు సాగునీటినిచ్చి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అన్నారు. జూపాడుబంగ్లా సమీపంలోని కేసీ కాల్వ క్రాస్‌రెగ్యులేటర్ వద్ద కాల్వలోకి దిగి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ‘రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి నశించాలి..నశించాలి, కేసీ కాల్వకు సాగునీటి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మౌనం వీడాలి’ అని నినాదాలు చేశారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన రైతులకు సాగునీరివ్వకుండా కాలక్షేపం చేయటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. శ్రీశైలం డ్యాంలో 872 అడుగుల నీటిమట్టం ఉన్నా కేసీ కాల్వకు సాగునీరివ్వకపోవటంతో ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలను దున్నేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న కళ్లెదుట ఎండిపోతుండటంతో చూడలేక దున్నేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయం నీటిని హంద్రీ–నీవా కాల్వ ద్వారా అనంతపురానికి తరలిస్తుండగా కేసీ కాల్వ రైతులకు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేసీ కాల్వకు సాగునీటి సరఫరా విషయమై ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య మౌనం వీడాలన్నారు. జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఎకరాకు రూ.50 వేల పంటనష్టపరిహారం ప్రకటించాలన్నారు. రబీసీజన్‌కు అవసరమైన విత్తనాలను ఉచితంగా రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వై.వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక తిరుమలేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి, తరుణ్‌కుమార్‌రెడ్డి, చిన్నమల్లయ్య, జంగాలసుంకన్న, లక్ష్మన్నగౌడు, నరసింహయాదవ్, రామకృష్ణ, సురేష్, హరికృష్ణ, ఆనంద్, హుసేన్, గోపాల్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, వెంకటరమణ, లింగన్న, రంగస్వామిగౌడు, పబ్బతివెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని స్మరించుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ● వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకాలు చేసిన వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు
సంక్షేమ ప్రదాత.. రైతు బాంధవుడు..పేదల దేవుడు.. ఆర్యోగ‘సిరి’ కల్పించిన మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు గడిచినా రాజన్నా..నిన్ను మరువలేం అంటూ బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. మహానేత విగ్రహాలకు వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జలాభిషేకాలు చేసి అప్పటి పాలనను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలను హోరెత్తించారు. పేదలకు దుస్తులు అందించి, అన్నదానం చేసి, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి, రక్తదానం నిర్వహించి అభిమానం చాటుకున్నారు. ● కర్నూలులో మహానేత విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో అభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య పాల్గొన్నారు. ● కల్లూరు శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి జలాభిషేకం చేశారు. రాయలసీమకు కృష్ణాజలాలు తీసుకొచ్చిన మహానేతను రైతులు ఎప్పటికీ మరువబోరన్నారు. ● ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ● వెల్దుర్తిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బనగానపల్లిలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వారి పురోగతికి వైఎస్సార్ దోహదపడ్డారన్నారు. ● ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. నల్లకాల్వ వద్ద ఉన్న స్పృతివనంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. –కర్నూలు (టౌన్)/ బొమ్మలసత్రం -
శోభాయమానం.. సర్వసమర్పణోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు సర్వ సమర్పణోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తిని పంచవాహనాలపై ఊరేగించారు. గజ, అశ్వ, సింహ, మయూరం వాహనాలపై కొలువుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు వాహ నోత్సవానికి శ్రీకారం పలికారు. అశేష భక్తజన వాహిని మధ్య రాయరు ఎంతో రమణీయంగా ఊరేగారు. అనంతరం ఊంజల మంటపంలో రాయరుకు ఉయ్యాల, ఛామర్ల సేవ కానిచ్చారు. యోగీంద్ర మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మంత్రాలయం మండలంలో అనుమంత్రాలయంగా పేరుగాంచిన తుంగభద్రలో ఆఖరి రోజు ఉత్సవాలు నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామాన్ని చేరుకుని మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం పండితులు, భక్తులు వసంతోత్సవం జరుపుకుని మంగళహారతులు పట్టారు. వేడుకలో భక్తులకు రాఘవేంద్రుల వైభవాన్ని ప్రవచించారు. -
నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనో హరి దంపతుల కుమారుడు జనక్దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలు దేరి 11.40 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాలలో ఏర్పా టు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధువరూలను ఆశీర్వదించి 20 నిముషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. కాగా రిసెప్షన్‌కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. మెగా డీఎస్సీ టీచర్ విద్యార్హతలపై విచారణ కర్నూలు(సిటీ): మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ టీచర్ విద్యార్హతలపై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీ టీచర్‌గా ఈడిగ ప్రభాకర్ పనిచేస్తున్నారు. ఈయన మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈయన విద్యార్హతలపై అనేక ఆరోపణలు విస్తృత ప్రచారం కావడంతో డీఈఓ ఎల్.సుధాకర్ విచారణ చేపట్టారు. కర్నూలు డిప్యుటీ డీఈఓ శ్రీధర్ బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజకుమారి ప్రభాకర్ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ సందర్భంగా ఈడిగ ప్రభాకర్ టెట్ అర్హత పొందలేదని అంగీకరించారు. విచారణ నివేదికను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు పంపించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా శ్రీనివాసరెడ్డి నంద్యాల(అర్బన్): ఏపీఎస్పీడీసీఎల్ నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా(సూపరింటెండెంట్ ఇంజనీర్) శ్రీనివాసరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక కార్యాలయంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి పదోన్నతిపై ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కుమార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా తిరుపతికి పదోన్నతిపై వెళ్లారు. ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డిని ఏపీపవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీ రామయ్య, ప్రెసిడెంట్ జ్ఞానసూర్యుడు, డీ–1 ఏఈ నాగరాజు, చంద్రశేఖర్, తదితరులు కలిసి అభినందనలు తెలిపారు -
అవమానభారంతో ఆత్మహత్య
గోస్పాడు: జిల్లెల్ల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరాముడు (56) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సూసైడ్ లేఖలో పేర్కొన్న వివరాల మేరకు.. గ్రామంలోని గంగమ్మ గుడికి సంబంధించిన లెక్కలు చూస్తుండేవాడు. అయితే గుడికి సంబంధించిన డబ్బులు వెంకట రాముడు వాడుకుంటున్నాడని ఆరోపణలు రావడంతో కుల పంచాయితీలో లెక్కలు చూపించి మొత్తం తన కుల సంఘానికి అప్పగించాడు. అయినా కూడా తప్పుడు లెక్కలు రాసి డబ్బులు దోచుకున్నాడని కొంతమంది అవమానించడంతో మనస్తాపం చెందాడు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెంకట రాముడు కేసీ కెనాల్ సమీపంలో కానుగ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. తన చావుకు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, శేఖర్‌రెడ్డి, పుల్లయ్య, టోపీ రాజు, చిన్న ఓబులేసు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. మృతుని కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతిదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మూడు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తల, 52 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు అభ్యర్థినులు 01–07–2026 నాటికి 21 సంవత్సరాలు వయస్సు నిండి 35ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. వివాహితులై స్థానిక నివాసితురాలై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాల వయస్సు నిండిన వారు లేకపోతే 18 ఏళ్లలోపు వారిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థినులు తప్పని సరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు. ఆయా పోస్టుకు పదో తరగతి పాస్ అయి 01–07–2026 నాటికి 21 సంవత్సరాలు నిండి 35ఏళ్లలోపు వారై ఉండాలన్నారు. పుట్టిన తేదీ, కులధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, నివాస స్థల ధ్రువీకరణ పత్రం, వితంతువు అయినచో భర్త మరణ పత్రం, దివ్యాంగురాలు అయితే వికలత్వ సర్టిఫికెట్, వితంతువు అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్‌తో జతపరిచి ఈనెల 5 నుంచి 18లోగా సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన నలుగురికి జైలు డోన్ టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జడ్జి నూరుల్లా జైలు శిక్ష లు విధించినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. పట్టణంలోని కొండపేటకు చెందిన చాక లి తిరుమలేసుకు నాలుగు రోజులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్‌కు చెందిన నీలకంఠ, కొండపేటకు చెందిన ఈడిగ వెంకటేశ్వర్లు, డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన దస్తగిరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన ట్లు సీఐ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ చిప్పగిరి: ఖాజీపురం కొట్టాల శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సీవీ నరసిహులు తెలిపిన వివరాల మేరకు.. గుట్టుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ బుధవారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పేకాట రాయుళ్లలో ఆరుగురు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 32,250 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బోర్లు ఎండి.. కన్నీరు ఉబికి !
వరుణుడి జాడ లేదు. వాగులు, వంకలు ఎండిపోయాయి. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటకు అందిస్తున్నారు. ఆవులదొడ్డి గ్రామంలో సుధాకర్ అనే రైతు 3 ఎకరాల్లో ఉల్లి సాగుకు ఇప్పటి వరకు సుమారు రూ.7 లక్షలు వెచ్చించాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరు అందక రోజుకు రూ.12 వేల చొప్పున ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నాడు. మరో 30 రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటే అదనంగా రూ.3 లక్షలు ఖర్చవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇలానే ఉందని, పెట్టిన పెట్టుబడులు పోతాయన్న భయంతో అప్పులు చేసి మరీ నీటిని కొనుగోలు చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వ తక్షణమే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలని ఆవులదొడ్డి గ్రామ మాజీ స్పరంచ్ మద్దిలేటి డిమాండ్ చేశారు. – డోన్ రూరల్ -
లోకేషూ.. మీరిచ్చిన బ్యాగుల నాణ్యత ఇదిగో!
వెల్దుర్తి: ‘మీ ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్‌లు ఎంతటి నాణ్యతగా ఉన్నాయో చూడండి. రెండు నెలలకే మొత్తం చినిగిపోయి తిరిగి కుట్టించుకునేందుకు కూడా వీలులేకుండా పోయాయి. ఇదేనా మీ పథకాల నాణ్యత’ అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆమె వెల్దుర్తి మండలంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాతబస్టాండులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి నాణ్యతలేని పథకాలు అమలు చేస్తోందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇదే సందర్భంలో సమావేశం జరుగుతున్న ప్రాంతంలో తిరుగాడుతున్న కృష్ణగిరి మండలం ఎరుకులచెరువుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని కె.రాణి, ఆమె తల్లి స్కూల్ బ్యాగుల ప్రస్తావన విని సమావేశం వద్దకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం విద్యార్థిని తన స్కూల్ బ్యాగ్ రెన్నెల్లకే చినిగిపోయిందని మాజీ ఎమ్మెల్యేకు చూపుతూ, కొత్తది కొనివ్వమని నాన్నను అడిగితే తిడుతున్నాడని.. అమ్మ కొనిస్తా, లేకపోతే కుట్టిస్తా పద అంటూ వెల్దుర్తికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న విద్యా కానుక బ్యాగులు ఇప్పటికీ నాణ్యతతో చెక్కుచెదరలేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇచ్చిన బ్యాగులు నాణ్యత ఎలా ఉన్నాయో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, చివరికి టీడీపీ నాయకులకే తెలుసన్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
రాయలసీమపై చంద్రబాబు వివక్ష
కర్నూలు: రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వివక్ష చూపుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల,కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాట సాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూ లు పార్లమెంటు ఇన్చార్జి బుట్టా రేణుక, మాజీ మేయర్ బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైసీపీ నేతలు బుధవారం సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కర్నూలు న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటుకు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి ప్రకటన చేస్తే సుప్రీం కోర్టులో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైసీపీ కురువ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం రామకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సువర్ణా రెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. హామీని నెరవేర్చాలని కోరుతూ.. రాయలసీమ ప్రాంతం కోసం ఏపీ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ జిల్లా కోర్టు బయట 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు బుధవారం రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది వై.జయరాజు వారికి పూలమాలలు అందించి అభినందించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాది నాగలక్ష్మి దేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
లోకేష్ వచ్చేదెప్పుడు.. ఆశలు ఎగిరేదెప్పుడు!
కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ విమనాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మైసూరుకు చెందిన ఓరియంట్స్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు విమానాశ్రయంలో 1.2 ఎకరాలు కేటాయించగా.. శిక్షణనిచ్చేందుకు అధునాత హ్యాంగర్ భవనాన్ని సిద్ధం చేశారు. గత ఆగస్టు 22న ప్రారంభోత్సవానికి ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఆగస్టు 18న ఓర్వకల్ డ్రోన్ సిటీలో కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్నాయుడు పర్యటించారు. ఆ సమయంలో విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంత్రి లోకేష్‌తో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆయన మెప్పు పొందవచ్చనే ఉద్దేశంతో అనధికార ఆదేశాలిచ్చి కార్యక్రమాన్ని వాయిదా వేయించినట్లుగా చర్చ జరుగుతోంది. శిక్షణ విమానాల ట్రయల్ రన్ విజయవంతం చైన్నెలోని హిందుస్తాన్ గ్రూపు ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఉంది. ఈ సంస్థ మైసూరులో 12 ఏళ్లుగా పైలట్ శిక్షణనిస్తోంది. రెండో కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థ వద్ద సెస్నా, టెక్నామ్ బ్రాండ్ల సింగిల్ ఇంజిన్, మల్టీ ఇంజిన్ శిక్షణ విమానాలు ఉన్నాయి. మైసూరులో ఉన్న శిక్షణ కేంద్రంలో మూడింటిని ఇకపై కర్నూలు విమానాశ్రయంలో ఉంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చి ఉంచారు. అంతేకాక కర్నూలులో పైలట్ శిక్షణకు సంబంధించి తరగతి గది బోధనకే పరిమితమైన పైలట్లకు శిక్షణ ఇచ్చి ట్రయల్ రన్ విజయవంతం చేసింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రమాణాల ప్రకారం సుమారు వంద కోట్లతో అకాడమీ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ప్రారంభానికి ఆగస్టు 22వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఇంతలోనే ఇలా... కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసేందుకు మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌గుప్తా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ మేరకు ఆహ్వాన పత్రికలు ముద్రించడం, నాయకులకు ఆహ్వానాలు పలకడం పూర్తయింది. అయితే కేంద్ర మంత్రి ఆదేశాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మంత్రి నారా లోకేష్ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో.. ఆయన వచ్చే వరకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో అకాడమీ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు పైలట్ శిక్షణ పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వీరి శిక్షణ తరగతి గదికే పరిమితమైంది. పైలట్ శిక్షణకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం. అలాంటిది విద్యార్థుల ఆశలను ఎగరనివ్వకుండా రాజకీయ స్వార్థంలో ఓ నేత శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఏవియేషన్ పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభం వాయిదా -
మొక్కజొన్న పంటపై పందుల దాడి
గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా నంద్యాల(అర్బన్): తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 9న ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా తయారీకి చర్యలు చేపడుతున్నామన్నారు.‘సర్’లో భాగంగా ఈనెల 10 వరకు అభ్యంతరాలు,దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం చూపిన తర్వాత ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు వివరాలు తెలుసుకునేందు కు వెబ్సైట్, మొబైల్ ద్వారా 1950 నంబరుకు ఈసీఐ స్పేస్ ఓటరు ఐడీ కార్డు నంబరుతో మెసేజ్ చేస్తే ఓట రు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కొత్తగా ఓటరు నమో దుకు వెబ్‌సైట్‌కు ఈసీఐనెట్ మొబైల్ అప్లికేషన్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, బీఎల్ఓలను సంప్రదించి దరఖాస్తును సమర్పించుకోవాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని పోవచ్చన్నారు. పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల బాలికపై ఆరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలు గు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 1న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు వెలుగోడు పట్టణానికి చెందిన వృద్ధుడు చిన్న బయన్న మాయమాటలు చెప్పాడు. ఊరి బయట ఉన్న శివాలయం వెను క చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మహానంది: మహానంది దేవస్థానం పరిధిలోని దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దేవస్థానం పరిధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తూ భక్తుల సొమ్మును దోచుకుంటున్నారని కొందరు భక్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది బాషా, తదితరులు దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న వారికి రూ. 2 వేల వరకు జరిమానాలు విధించారు. పట్టించుకోని దేవస్థానం అధికారులు.. మహానంది దేవస్థానం పరిధిలో తోపుడు బండ్లతో పాటు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకుని సుమారు వంద మందికిపైగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఈ విషయంపై దేవస్థానం అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు మండిపడుతున్నారు. గతంలో దుకాణాల వద్ద టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్, తదితర వస్తువుల ధరలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశా రు. కానీ వ్యాపారులు మాత్రం వాటిని రెండు మూడు రోజులు మాత్రమే ఉంచి మూలన పడేశారు. వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని ఎమ్మార్పీకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
మొసళ్ల కలకలం
కౌతాళం: తుంగభద్ర నది పరివా హకంలో వేర్వేరు చోట్ల రెండు భా రీ మొసళ్లను స్థా నికులు బంధించారు. కౌతాళం మండలం మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక భాగంలో గుంతలో ఉన్న భారీ మొసలి ఉండటంతో గ్రామస్తులు కొన్ని రోజులుగా భయాందోళన చెందుతున్నారు. కాగా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం గుంతలో ఉన్న మొసలిని పెద్ద పెద్ద తాళ్లతో బంధించారు. ఈ విషయాన్ని అదోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ తేజశ్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక వాహనంలో మొసలిని తీసుకెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వదిలేస్తామని చెప్పారు. నాగలదిన్నె బ్రిడ్జి వద్ద.. నందవరం: నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద గుంతలో ఉన్న మొసలిని బుధవారం రైతులు బంధించారు. నదిలో నీరు లేకపోవడంతో మోటర్ ద్వారా గుంతలోని నీటి పంపు చేయడానికి వెళ్లారు. వరదల్లో కోట్టుపోయిన పాత బ్రిడ్జి పిల్లర్ వద్ద గుంతలో నీటి తోడేందుకు రైతులు విద్యుత్ మోటర్ వేశారు. నీటి తోడే సమయంలో గుంతలో మొసలి బయటపడింది. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి తెలంగాణపైపు తుంగభద్ర నది గుంతల్లో వదిలేశారు. -
ఇంద్రభవనం వీడేదెన్నడు!
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రాభివృద్ధిని పర్యవేక్షిస్తూ.. భక్తుల మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ.. దేవస్థానం సొమ్మును కాపాడుతూ ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన ఓ ఉన్నతాధికారే దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలతో క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేవస్థాన ఉన్నతాధికారి నివాసం ఉండి పరిపాలన సాగించేందుకు గతంలో ప్రత్యేక గృహం లేకపోవడంతో దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగించుకుంటూ పాలన సాగించేవారు. దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగిస్తే ఆ దాతకు, భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి, దేవస్థానానికి రోజువారి అద్దె రూపంలో వచ్చే ఆదాయం కూడా దేవస్థానం కోల్పోతుందని భావించి సుమారు రూ.కోటికి పైగా భక్తుల సొమ్మును వెచ్చించి ఉన్నతాధికారి కోసం భవనం నిర్మించారు. భవనం పూర్తయినప్పటికీ ఇంతవరకు ఆ భవనంలోకి వెళ్లేందుకు ఉన్నతాధికారికి మనసు రావడం లేదు. దీంతో ఇటు కాటేజీ రోజు వారి అద్దె దేవస్థానం కోల్పోవడం, నూతన భవనానికి వెచ్చించి ధనం వృథాగా మారుతుంది. ప్రస్తుతం ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీ రోజు వారి అద్దె రూ.10 వేలు. నెలకు రూ.3లక్షలు ఇలా సంవత్సరానికి రూ.36 లక్షలు, రెండేళ్లకు రూ.72 లక్షలు. ఉన్నతాధికారి వ్యవహారశైలితో రెండేళ్లలో దేవస్థానం రూ.72 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా నూతన భవనానికి ఖర్చు చేసిన రూ.కోటికి పైగా సొమ్ము సైతం వృథా అవుతుంది. దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్.. కొన్ని నెలల క్రితం ఉన్నతాధికారిగా వచ్చిన ఈయన దేవస్థానం పరిధిలో ఓ దాత భక్తుల సౌకర్యార్థం అధునాతన హంగులతో ఇంద్రభవనం లాంటి కాటేజీని నివాసంగా మార్చుకున్నారు. అ భవనం విశాలవంతం, సౌకర్యవంతంగా ఉండి ‘ఇంద్ర’భవనాన్ని తలపిస్తుండడంతో ఆ భవనాన్ని వదలేక పోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారి తీరుపై దేవస్థానం ఆదాయానికి గండి పడుతున్న విషయం కొన్ని నెలల క్రితం దేవదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే కాటేజీని ఖాళీ చేసి నూతన భవనంలోకి వెళ్లాలని దేవదాయ శాఖ ఆదేశించినా బేఖాతర్ చేశారు. నూతన భవనంలో చిన్నపాటి మరమ్మతులు ఉన్నాయని త్వరలోనే వెళ్తానంటూ వాయిదాలు వేస్తూ ఇంద్ర భవనాన్ని వదలడం లేదని విమర్శలు ఉన్నాయి. అయ్యగారి సేవలో ఏడుగురు ఉద్యోగులు ఉన్నతాధికారికి సేవలందించేందుకు దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు ఉన్నారు. అయ్యగారి నివాసం వద్ద ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తారు. సీసీ, అటెండర్, డ్రైవర్, వంట మనిషి, స్వీపర్, గోవు సంరక్షణకు గోశాల నుంచి ఒక ఉద్యోగి ఇలా ఏడుగురు సిబ్బంది రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారు. ‘భక్తుల సొమ్ము వృథా అవుతే నా కేంటి’ అన్నట్లు వ్యవహరించడంతో ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఆదర్శం మరచిన అధికారి శ్రీశైల దేవస్థానంలో పనిచేసే అధికారులకు, కింది స్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారి ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. అయితే ప్రస్తుతం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి తీరు ఆ విధంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధునాతన హంగులతో, అన్ని సౌకర్యాలతో, దేవాలయానికి కూతవేటు దూరంలో రూ.కోటిగా నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలోకి ఉన్నతాధికారి మాత్రం వెళ్లరు. సమయానికి రవాణా, భద్రత, అంతర్గత రహదారులు, డ్రైనేజ్, తాగునీటి సౌకర్యాలు లేని ఎక్కడో దేవస్థానానికి 8కి.మీ దూరంలోని సున్నిపెంటలో నిర్మించిన దేవస్థాన ఉద్యోగుల వసతి గృహానికి మాత్రం ఉద్యోగులు వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువస్తారని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీని ఖాళీ చేయించి, ఉన్నతాధికారి కోసం నిర్మించిన నూతన భవనంలోకి మకాం మార్చి కాటేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. దాత కట్టించిన కాటేజీలో ఉన్నతాధికారి నివాసం దేవస్థానం నిర్మించిన నూతన భవనం నిరుపయోగం రెండేళ్లలో దేవస్థానం ఆదాయానికి రూ. 72 లక్షల గండి శ్రీశైలంలో చర్చనీయాంశంగా ఉన్నతాధికారి వైఖరి -
రైతుల కోసం ఎందాకై నా పోరాటం
నంద్యాల: రైతుల సాగు నీటి హక్కు కోసం వైఎస్సార్సీపీ ఎందాకై నా పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. రైతులు, ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి విజయవంతమైంది. సోమవారం పట్టణంలోని నూనెపల్లె నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ రామలింగారెడ్డి, సాయినాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణం నినాదాలతో దద్దరిల్లింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తాగు, సాగునీరు అందించకుండా నిద్రపోతున్న టీడీపీ ప్రభుత్వం మేల్కొనాలని, ప్రజలకు అత్యవసరమైన నీరు అందించలేని సీఎం రాజీనామా చేయాలని, శ్రీశైలంలో నీరు ఉన్నా చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు ఎందుకు నింపడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు, రైతులు రోడ్డుపై గంట పాటు బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కలెక్టర్ బయటకు వచ్చి రైతులు, ప్రజల సమస్యలు విని నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని భీష్మించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారిని కలిసి రైతులు, ప్రజల సమస్యలను వైఎస్సార్సీపీ నాయకులు వివరించారు. తాగునీటికి రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు. ఆందోళనలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళా రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్‌బాషా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయ శేఖర్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిషా, నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు, నంద్యాల, గోస్పాడు మండలాల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అధికారులూ.. రైతుల గోడు వినండి– శిల్పా రవి శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ ఉన్నా.. సాగునీటికి నీరు విడుదల చేయడం లేదు. కనీసం తాగునీటికై నా నీరు ఎందుకు విడుదల చేయలేదో టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెరువులు, కుంటలు ఎండిపోయి, పంటలు బీళ్లువారుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పాలకులపై నమ్మకం పోయింది. అధికారులు రైతుల కష్టాలు, కన్నీళ్లు చూసి నీటిని విడుదల చేయండి. జగన్ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా భరోసాగా నిలిచాం. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే పోరాటం మరింత ఉద్ధృతం చేస్తాం. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించడంతో రైతు లు, యువత, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పంటలు సాగు చేయాలి. రైతులకు అవసరమైన వాటిని అందించలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తోంది’ నీటి విడుదలలో జాప్యమెందుకు? కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చిన రైతులు రెండు మూడు రోజుల్లో నీటి విడుదలకు కలెక్టర్ హామీ -
‘సీజనల్’ నిధులు స్వాహా చేశారు!
● జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన యువజన నాయకులుకర్నూలు(సెంట్రల్): దొంగ బిల్లులతో సీజనల్ హాస్టళ్ల నిధులను స్వాహా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి యూఎస్ఎఫ్ఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య నాయకులు అర్జీ ఇచ్చారు. వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి మండల్లాలోని 30 సీజనల్ హాస్టళ్లను ప్రభుత్వం పొదుపు మహిళలకు ఇస్తే వాటిని పత్తికొండ ఎమ్మెల్యే బంధువులు తీసుకున్నారని అర్జీలో పేర్కొన్నారు. వాటిని వారే నిర్వహణ చేసి దొంగ బిల్లులతో నిధులను కాజేశారని ఉదహరించారు. కర్నూలు బీక్యాంపు గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాలకు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యుడు గుడిపల్లి సురేందర్ వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు రూరల్ మండలం బి.తాండ్రపాడు, పసుపల, సూదిరెడ్డిపల్లె, నూతనపల్లె గ్రామాలకు తాగు, సాగునీటిని అందజేయాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోయ హనుమంతు అర్జీ ఇచ్చారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు చూపించాలని, రీఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు పూర్తిగా తగ్గిపోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బయ్య పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 98 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 98 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరు గా మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నామన్నా రు. క్రిమినల్ కేసులకు సంబంధించి నేరుగా స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్ అధికారుల వద్దకు పంపి ఇరు పక్షాల వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 2,09,732 మంది పింఛన్ దారులకు రూ.90.87 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు ఉదయం 6గంటలకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాలన్నారు. పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తప్పవన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అంగవైకల్యం కల వారు పింఛన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హక్కులు సాధించే వరకు ఉద్యమం నంద్యాల(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను సాధించే వరకు ఏపీ జేఏసీ అమరావతి పోరాటాలు సాగిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి నంద్యాల జిల్లా చైర్మన్ రామచంద్రారావు తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీని అమలు చేసి డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధ్దీకరణ, తదితర డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాజకుమారికి ఉద్యమ కార్యాచరణ నో టీసును అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగుల హక్కులు సాధించేంత వరు కు ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ చైర్మన్ విజయకుమార్, అన్నమ్మ, మాధవిరెడ్డి, సరస్వతిబాయి, విజయశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్ సీజ్
సి.బెళగల్: ప్రభుత్వ గుర్తింపు లేని జీనియస్ గ్లోబల్ స్కూల్‌ను ఎంఈఓ జ్యోతి సీజ్ చేశారు. సోమవారం ఎంఈఓ తన కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి మండల కేంద్రమైన సి.బెళగల్‌లోని ప్రైవేట్ పాఠశాలకు చేరుకుని ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల నిర్వహణకు అనుమతులు, గుర్తింపు లేని విషయమై గతంలో యాజమాన్యానికికి మూడు గడువు నోటీస్‌లు ఇచ్చామన్నారు. గడువులోగా గుర్తింపును పొందలేదని, అదేవిధంగా పాఠశాలను నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల సభ్యులు ఫిర్యాదుల మేరకు విచారించామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండ చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఆమె వెంట ఎంఐఎస్ రాజారావు, సీఆర్పీ నాగేష్, హెడ్‌కానిస్టేబుల్ క్రిష్ణ గౌడ్, కానిస్టేబుల్ సత్యరాజు తదితరులు ఉన్నారు. అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ● ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి బేతంచెర్ల: హెచ్ కొట్టాల గ్రామ సమీపాన జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నంద్యాల మండలం పుసులూరుకు చెందిన ఎర్రగొండ నాగయ్య, ఆటో డ్రైవర్‌తో పాటు 8 మంది మండలంలోని ఆర్ కొత్తపల్లె గ్రామంలో ఆదివారం పాముకాటుతో మృతి చెందిన గురు మోహన్ అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ పక్కన్న కూర్చున్న ఎర్రగొండ నాగయ్యపై ఆటో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతుని సోదరుడు రామ సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వన్‌స్టాప్ సెంటర్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ● ఐసీడీఎస్ పీడీ పీ విజయ కర్నూలు(అర్బన్): కర్నూలు, ఆదోనిలోని వన్‌స్టాప్ సెంటర్లలో పలు రకాల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పీ విజయ తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. కర్నూలు, ఆదోనిలో నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి నోటిఫికేషన్, ఇతర వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయం, www. kurnool.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. కర్నూలులో కేసు వర్కర్ (ఎస్సీగ్రూపు– 2 మహిళలకు), ఆదోనిలో కేసు వర్కర్ (ఎస్టీ మహిళ), పారా మెడికల్ సర్సనల్ (ఎస్టీ మహిళ), సైకో సోషియల్ కౌన్సిలర్ (ఓసీ మహిళలకు) పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 1 నుంచి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నంద్యాల(వ్యవసాయం): పట్టణంలో గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరాది మఠంలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నగర గౌరవాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ సోమవారం పండుగతో ప్రారంభమై 18వ తేదీ నిమజ్జనం కార్యక్రమంతో పూర్తవుతుందన్నారు. 5 రోజుల చవితి వేడుకులను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఎత్తైన విగ్రహాలు కాకుండా చిన్నవి ప్రతిష్టించి పూజించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కృష్ణమాచార్యులు, సత్యనారాయణ, డమాంశంకర్, చంద్రమోహన్, గాజుల హరిబాబు, పుల్లయ్య, ఈరన్న స్వామి, మురళీధర్‌రెడ్డి, రామారావు వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ సుహాసిని, తదితరులు పాల్గొన్నారు. -
వేదమూర్తి.. దివ్యదీప్తి
● అంగరంగ వైభవంగా రాఘవేంద్రుల మహారథోత్సవం ● హెలికాప్టర్‌తో మహారథంపై పుష్పవృష్టి మంత్రాలయం: నింగిన పుష్పవృష్టి.. భువిన భక్తజన సాగరం.. పండితులు వేద ఘోషలు.. కళాకారుల సంప్రదాయ ప్రదర్శనల మధ్య వేదమూర్తి శ్రీరాఘవేంద్ర స్వామి రథోత్సవం సోమవారం కనులపండువగా సాగింది. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఉత్సవమూర్తి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను గురుసార్వభౌమ వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పాఠశాల విద్యార్థులు వేద పఠనం కానిస్తూ విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామిజీ ఉత్సవమూర్తి బుగ్గలకు గంధం పూసి వసంతోత్స వానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. మంగళవాయిద్యాలు, ఉత్సవ పతాకాలతో ఉత్సవమూర్తితో మహారథం చెంతకు చేరుకున్నారు. మహారథం చుట్టూ ప్రదక్షిణలు ఉత్సవమూర్తి మహారథం చేరుకోగా పీఠాధిపతి రథచక్రాలకు నారీకేళాలు సమర్పించి అర్చనలు చేశారు. ఉత్సవమూర్తితో మహారథం చుట్టూ ప్రదక్షిణలు చేశారుస. మహారథంపై కొలువుదీరిన తరుణాన భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ స్మరణ చేసుకున్నారు. రథంపై ఆశీనులైన స్వామిజీ ప్రవచనం ముగియగానే రథయాత్రకు అంకురార్పణ పలికారు. వంద అడుగుల దూరం చేరుకోగా స్వామిజీ హెలికాప్టర్‌పై నుంచి పుష్ప వృష్టి కురిపించారు. మంత్రాలయం పురవీధుల్లో గంటన్నర పాటు రథయాత్ర సాగింది. తిరిగి శ్రీమఠానికి చేరుకుని పూజా మందిరంలో స్వామిజీ మూల, జయ, దిగ్వజయ సంస్థాన పూజ గావించారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి పాల్గొన్నారు.వర్షాలు కురిసి సుఖసంతోషాలు ప్రసాదించాలి శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ప్రజానీకం అల్లాడిపోతున్నారని, రాఘవేంద్రుల అనుగ్రహంతో వర్షాలు కురిసి సుఖసంతోషాలు ప్రసాదించాలన్నారు. భక్తుల సహకారంతో శ్రీమఠంలో భక్తులకు వసతి కల్పనకు బాటలు వేస్తున్నామన్నారు. శ్రీమఠం వైభవానికి మరింతగా శ్రమిస్తామని పేర్కొన్నారు. నేపాల్‌లో వరద విపత్తుపై స్వామిజీ విచారం వ్యక్తం చేశారు. బాధిత దేశానికి శ్రీమఠం సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా అవుతోందని తెలిపారు. -
ఇవేమి వేధింపులు!
● వైఎస్సార్సీపీ నేతలను నాలుగు గంటలు స్టేషన్లో ఉంచిన సీఐడోన్: ఓ కేసులో కండీషన్ బెయిల్ పొంది పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను సీఐ దాదాపు నాలుగు గంటల పాటు స్టేషన్లోనే నిరీక్షించి, నీరసించేలా చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఈనెల 23వ తేదీన డోన్ పట్టణంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. కాగా వారు కండీషన్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కండీషన్ బెయిల్లో భాగంగా సోమవారం పోలీస్ స్టేషన్లో సంతకం చేసేందుకు ఎంపీపీ రేగటి రాజ్‌శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్‌లతో పాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు పోస్టు ప్రసాద్, రామచంద్రుడు తదితరులు ఉదయం చేరుకున్నారు. సంతకం చేసి వెళ్తుండగా.. సీఐ ఇంతియాజ్ బాషా బయటకు వెళ్తూ ‘తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండి’ అంటూ వెళ్లిపోయారు. దా దాపు నాలుగు గంటలు గడిచినా సీఐ తిరిగి రాలేదు. చివరకు నాయకుల్లో కొందరికి షుగర్ ఉందని, మధ్యాహ్నం భోజనం చేయాలని ఎస్ఐ శరత్కుమార్రెడ్డికి చెప్పడంతో ఆయన పంపించేశారు. అయితే కూటమి నేతల ఒత్తిడి మేరకు సీఐ అలా వ్యవహించారనే విమర్శలు ఉన్నాయి. సీఐ బయటకు వెళ్లిన సమయంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా లేవని, కూటమి నేతల వేధింపుల్లో భాగంగానే తమను నాలుగు గంటల పాటు స్టేషన్లో ఉంచారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. -
చేటు తెచ్చిన బస్సు ప్రయాణం
● రద్దీ తోపులాటలో అపస్మారక స్థితిలోకి మహిళపత్తికొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్‌కు చెందిన హసీనా తన కుమారుడు దాదా పీరాతో కలిసి ఉదయం వైద్య పరీక్షల కోసం కర్నూలుకు వెళ్లింది. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. అనంతరం కర్నూలు నుంచి ఏపీ 39యుఎల్ 1662 బస్సులో గుంతకల్‌కు బయలుదేరింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. అయితే సాయంత్రం సమయంలో బస్సు పత్తికొండ బస్టాండ్‌కు రాగానే వాష్‌రూమ్ కోసం కిందకు దిగింది. ఆ సమయంలో గుంతకల్ వైపు బస్సులు తక్కువగా ఉంటాయి. దీనికితోడు దాదాపు 3గంటలు పాటు గుంతకల్ వైపు వెళ్లే బస్సులు రాలేదు. దాదాపు 200 మంది ప్రయాణికులు గుంతకల్ వైపు వెళ్లడానికి బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. దీంతో వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు చుట్టుముట్టారు. ఈక్రమంలో వాష్‌రూమ్ ముగించుకొని బస్సు ఎక్కుతున్న సమయంలో రద్దీ వల్ల ప్రయాణికులు ఒకరికొకరు విపరీతంగా తోసుకున్నారు. తోపులాటలో హసీనా అక్కడే సృహతప్పి పడిపోయింది. బస్సులో ఉన్న కుమారుడు దాదా పీరా గమనించి కిందికి దిగివచ్చి కాసేపు సపర్యలు చేశాడు. విషయం తెలుసుకుని పక్కనే ఉన్న లాడ్జీలో పని చేస్తున్న హనుమాన్, నాగేష్ అనే యువకులు అక్కడికి చేరుకొని కుమారుడు సహాయంతో ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు సృహలో లేనందున ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బస్సులో రద్దీ వల్ల జరిగిన తోపులాట మా అమ్మ ప్రాణాలకు ముప్పు తెచ్చిందని కుమారుడు దాదా పీరా బోరున విలపించాడు. ఇంతటి దారుణమైన ఘటన చోటు చేసుకున్నా ఆర్టీసీ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్లు ఆమెను కిందకు దింపి వెళ్లిపోవడం గమనార్హం. -
కూటమి నేతలు ‘నీళ్లు’ నములుతున్నారు
● రైతులు ఆందోళనలు చేస్తున్నా కన్నెత్తి చూడని వైనం ఆత్మకూరు: శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నా జిల్లాలోని సాగునీటి కాల్వలు వెలవెలబోతున్నాయి. రైతులు ఒక్క పంటకై నా సాగునీటిని అందించి ఆదుకోండని ఆందోళనలు చేస్తున్నా పాలకుల్లో చలనం కలగడం లేదు. ఓ వైపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటి కోసం పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారం నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కలెక్టరేట్ ముట్టడి విజయవంతమైంది. మంగళవారం వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగునీరు విడుదల చేయాలంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాగా అధికారంలో ఉన్న కూటమి నేతలు మాత్రం సాగునీటి విడుదల విషయంలో మౌనం దాల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, సిద్ధాపురం చెరువును నింపడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జయసూర్య, భూమా అఖిలప్రియ, గౌరు చరిత, మంత్రులు ఫరూక్, జనార్ధన్‌రెడ్డి సాగునీరు విడుదలపై నోరు మెదపకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జల కళ సంతరించుకున్న వీబీఆర్కల్లూరు: రైతుల కళ్లు ఆకాశం వైపు చూస్తుండగా.. వారి కళ్లలో నీళ్లు ఎండుతున్న పంటలను చూస్తున్నాయి. వర్షం కోసం రైతులు పూజలు, ప్రార్థనలు చేశారు. అయినా వరుణుడు కరుణించలేదు. రైతుల మొర ఆలకించిన కృష్ణమ్మ ఎగువ నుంచి భూములను తడిపేందుకు పరుగున వచ్చి చేరింది. అయినా ఆయకట్టు కనుచూపు మేర బీళ్లుగా కనిపిస్తోంది. సాగునీటి కాల్వలు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ రైతు పక్షాన పోరాటం ఉద్ధృతం చేసింది. సాగునీటిని విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. పార్టీ నాయకులు రైతులతో కలసి పోరుబాట పట్టారు. మంగళవారం వీబీఆర్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతు శంఖారావం పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు తరలి రావాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కల్లూరులోని కాటసాని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాతల కోసం ‘రైతు శంఖారావం’ కార్యక్రమం తలపెట్టగా గత నాలుగు రోజులుగా ప్రభుత్వం నోటీసులు ఇస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులు, ట్రాక్టర్ల యజమానులు, వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారన్నారు. జెండాలు, అజెండాలను పక్కన పెట్టి రైతాంగం తరఫున పోరాటం చేయా ల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీబీఆర్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నామన్నారు. గురుశిశ్యుల ఒప్పందంతో సీమలో కరువు.. అడ్డగోలుగా తెలంగాణ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు ఏ మాత్రం చలించడం లేదని కాటసాని, శిల్పా విమర్శించారు. గురుశిశ్యుల ఒప్పందంతో రాయలసీమలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన జలాలను సక్రమంగా వినియోగించుకుంటే కనీసం ఒక పంటైనా పండించుకునే వాళ్లమన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై టీడీపీ నాయకులకు అవగాహన లేదన్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏం చేశారో ప్రజలకు వివరించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌పై గత చరిత్ర తెలుకుని టీడీపీ నాయకులు మాట్లా డాలన్నారు. సమావేశంలో మాజీ మేయర్ బీవై రామ య్య పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకా ష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు అక్కిమి హనుమంతురెడ్డి, శివారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు యాద వ్, రమణారెడ్డి, గోపాల్‌రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు, దండు లక్ష్మీకాంతరెడ్డి, విక్రమసింహరెడ్డి, ఎరుకల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరుతోనే కరువు చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలి తెలంగాణ జలదోపిడీని అడ్డుకోవాలి వీబీఆర్ ముట్టడిని అడ్డుకోలేరు పోలీసు నోటీసులకు ఎవరూ భయపడరు రైతు శంఖారావానికి తరలిరండి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
దేవదేవుడికి తేళ్లే నైవేద్యం
కోడుమూరు రూరల్: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. కోడుమూరు కొండపైన వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లనే నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎవరికై నా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే కోడుమూరు కొండపైన మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటి కింద ఉండే తేళ్లను ఎలాంటి బెరుకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడుకు సమర్పించడం ఇక్కడ విశేషం. ఒక వేళ తేలును పట్టుకునే క్రమంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే తగ్గిపోతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వేలాదిమంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి తేళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరాయుడు ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. నాలుకపై, చేతులపై తేళ్లను ఉంచుకున్న యువకులు -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
కర్నూలు(అర్బన్): దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల మెరిట్, తిరస్కరణ జాబితాలను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలను తమ కార్యాలయ నోటీసుబోర్డు, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ https://kurnool.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ –2 (వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ ( వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (హెచ్‌హెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (ఓహెచ్ జనరల్ ), జూనియర్ ఆడిటర్ (ఓహెచ్ జనరల్), టైపిస్టు ( వీహెచ్ జనరల్), టైపిస్టు ( హెచ్‌హెచ్ జనరల్ ), ఎల్డీ కంప్యూటర్ ( హెచ్‌హెచ్ జనరల్), ఏఎన్ఎం గ్రేడ్ –3, (హెచ్‌హెచ్ జనరల్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫైనల్ మెరిట్ జాబితా, తిరస్కరణ జాబితాలను చూసుకోవాలని ఆమె కోరారు. మేళిగనూరు ప్రజలకు మొసలి భయం కౌతాళం: మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక నీళ్లలో మొసలి తిరుగుతుండటంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు అటువైపు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల హోస్పెట్ డ్యాం నుంచి స్పల్పంగా వదిలిన నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలో మొసలి వచ్చిందా లేదంటే గతంలో ఉన్నదేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. మొసలి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. యోగా పోటీల్లో ఆదోని విద్యార్థిని ప్రతిభ ఆదోని అర్బన్: విశాఖపట్నం వేదికగా నిర్వహించిన 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన నిథాలి డి.జైన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 29న జరిగిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులతో పోటీపడి నిథాలి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈనెల 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆమె ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పోటీలకు అధికారికంగా ఎంపికయ్యారు. స్థానిక లీలాస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిథాలి పట్టణంలోని మహావీర్ డిజిటల్స్ అధినేత దినేష్భరత్షా కుమార్తె. చిన్న వయసులోనే యోగాలో కఠినమైన ఆసనాలను చక్కగా ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష నంద్యాల(వ్యవసాయం)/బేతంచెర్ల: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి నిందితులకు జైలు శిక్ష పడింది. నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్జీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు శ్రీనివాస నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా.. షేక్ ఫయాజ్ పట్టుపడ్డాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరచగా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే బేతంచెర్లలో పట్టుబడిన రామాంజనేయులుకు జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా రెండు రోజుల శిక్ష విధించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఏ మొహం పెట్టుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు!
డోన్: అభివృద్ధి పనులకు నయా పైసా తెచ్చే యోగ్యత లేని వ్యక్తి ఏ మొహం పెట్టుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం డోన్‌లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే కోట్ల తన స్థాయిని దిగజార్చుకొని విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి రాష్ట్ర కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి అని, ఆ విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీయమన్నారు. జెడ్పీ, ఎంపీపీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎంపీపీ భవనాన్ని ప్రారంభించేందుకు అనేక మార్లు తేదీలు ఇచ్చినా ఎమ్మెల్యే ఎందుకు వాయిదాలు వేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రారంభించేందుకు తేదీలు ఖరారు చేసిన ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కోట్ల బెదిరింపులకు భయపడి జెడ్పీ చైర్మన్‌తో పాటు ప్రజాప్రతినిధులపై ఎలా కేసులు పెడతారన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓను త్వరలో కోర్టుకు లాగుతామని బుగ్గన హెచ్చరించారు. విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు విరూపాక్షి, బాలనాగిరెడ్డిల ప్రమేయం లేకుండా ప్రారంభోత్సవాలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. బేతంచెర్ల నగరపాలక సంస్థకు పైసా కూడా తేకుండా, చైర్మన్ చలంరెడ్డిని పిలవకుండానే భూమి పూజలు, ప్రారంభోత్సవాలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసినా భయపడేది లేదని బుగ్గన అన్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలే కానీ.. నీచ రాజకీయాలకు పాల్పడం సరికాదన్నారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో టీడీపీకి చెందిన అల్లరి మూకలైన సుదీష్ అనుచరులు ఎంపీడీఓ కార్యాలయం గేటు తాళం పోలీసుల సమక్షంలో పట్టపగలే పగులగొట్టినా కేసు ఎందుకు నమోదు చేయలేదని బుగ్గన ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ రేషన్, మద్యం వ్యాపారాలు చేస్తున్నదెవరని, ఇసుక, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారాలు కొన సాగిస్తున్నది ఎవరో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలన్నారు. చేతనైతే అభివృద్ధి పనులు పూర్తి చేయి.. అర్ధరహిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టడం కాకుండా గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే కోట్లకు మాజీ మంత్రి బుగ్గన సవాల్ చేశారు. వాటర్ గ్రిడ్, హంద్రీ నీవా కాలువ నీటి ద్వారా చెరువులను నింపే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వెటర్నటీ, బేతంచెర్ల పాలిటెక్నిక్, ఐటీఐ, ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనాల టెండర్లను ఎందుకు రద్దు చేశారో స్పష్టం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఐటీడీఆర్ వెంటనే పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని మదిలేట్టి స్వామి, గుండాల చెన్నకేశవ స్వామి, కంభగిరిస్వామి, పాలుట్ల రంగస్వామి, ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు రూ.1.50 కోట్లను కార్బస్ ఫండ్‌గా తన సొంత డబ్బును చెల్లించిన విషయాన్ని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, మార్కె ట్ యార్ట్ మాజీ చైర్మెన్ రామచంద్రుడు, వలంటీర్ సంఘం జిల్లా అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, పార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్, సుధాకర్ యాదవ్, మదిలేట్టి, అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ కూడా తెలియదా? దిగజారుడు వ్యాఖ్యలు మానుకో ఎంపీడీఓను కోర్టుకు లాగుతాం డోన్ ఎమ్మెల్యే కోట్లపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం -
శ్మశాన దారి కబ్జా..
గతంలో డి. కొట్టాల గ్రామంలో శ్మశానం లేక పోవడంతో ఎవరు మృతి చెందినా రోడ్ల వెంట దహన సంస్కారాలు చేసుకునేవారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులందరూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రామస్తులు, రెవెన్యూ అధికారులతో చర్చించి గ్రామానికి చెందిన శరభారెడ్డిని ఒప్పించి 126 సర్వే నంబర్లో 12 సెంట్లస్థలం శ్మశానికి రిజిస్టర్ చేయించారు. అంతేకాకుండా శ్మశానానికి చేరుకునేందుకు వీలుగా డి.కొట్టాల, శ్రీరంగాపురం ప్రధాన రహదారి నుంచి ఉపాధి హామీ పథకం కింద రహదారిని కూడా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ నేతలు శ్మశానానికి వెళ్లే రహదారిని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ స్థలాన్ని ట్రాక్టర్లతో దున్నించి, చదును చేసి ఏకంగా వ్యవసాయ పొలంలో కలుపుకుని వరినాట్లు వేయడంతో మూడు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో శ్మశాన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రోడ్డు పక్కనే శవాలకు అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. -
తుంగాతీరం.. జయ జన ధ్వానం
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 355వ ఆరాధన వేళ.. భక్తజన సంద్రంతో వేదభూమి పులకించింది. తుంగభద్రమ్మ పరవశించింది. ఆదివారం సప్తరాత్రోత్సవాల్లో భాగంగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన మహా మంగళకరంగా సాగింది. రాఘవేంద్రస్వామి బృందావనం ప్రవేశం రోజు కావడంతో స్వామి మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం గావించారు. వేదపఠనం గావిస్తూ జల, పుష్ప, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు 2 లక్షలకుపైగా భక్తులు హాజరైనట్లు అంచనా. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు శ్రీమఠం క్షేత్ర పరిధిలో నాలుగు చోట్ల ఎల్ఈడీ డిస్ప్లేతో ద్వారా భక్తులకు వీక్షణ సదుపాయం కల్పించింది. మధ్యారాధన సందర్భంగా మధ్యా హ్నం రాఘవేంద్రులను బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు, కర్ణాటక డోలు వాయిద్యాల సుస్వరాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి. గజవాహనంపై గురుసార్వభౌమ.. ద్వైత వేదాంత మూర్తి గురుసార్వభౌముడు రజత గజవాహనంపై కడు వైభవంగా ఊరేగారు. ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి రుగ్వేద, యజుర్వేద, సామవేద పారాయణం పఠిస్తూ పీఠాధిపతి చామర్ల సేవ గావించారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో డప్పు దరువులతో ఎంతో రమణీయంగా ఉత్సవమూర్తి గజవాహనంపై ఊరేగారు. రాత్రి రెండు గంటల వరకు, అంబారీ, స్వర్ణ, నవరత్న రథోత్సవం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది. అంతకు ముందు పరిమళ తీర్థ పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే యోగీంద్ర మంటపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. బెంగళూరుకు చెందిన భువనేశ్వరి వీణా వాదం, రాయచూరు శేషగిరి దాసు, దాసవాణి, ఉడిపికి చెందిన భార్గవ నృత్య తండా బృందం నృత్య రూపక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, వేద పాఠశాల మాజీ ప్రిన్స్‌పాల్ వాదిరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.నేడు మహా రథోత్సవంమంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉదయం 9.30 గంటలకు మహా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో ఉదయం నిత్యపూజలు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రథోత్సవం శ్రీ మఠం కారిడార్ మహాద్వారం నుంచి ప్రధాన రహదారి, పురవీధుల మీదుగా రాఘవేంద్ర సర్కిల్ చుట్టూ చేరుకుని తిరిగి శ్రీమఠం చేరుకుంటుంది. దేశం నలుమూల నుంచి భక్తులు భారీ ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. అదే మహా రథోత్సవ సమయంలో హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు. వైభవంగా శ్రీరాఘవేంద్రుల మధ్యారాధన స్వర్ణ రథంపై రాఘవేంద్రుల ఊరేగింపు ఆకట్టుకున్న మహా పంచామృతాభిషేకం భక్తుల రద్దీతో శ్రీమఠం కిటకిట -
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, శివయ్య అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణపై కరపత్రాలు విడుదల చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు మంగళగిరిలోని విద్యా భవన్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి, జిల్లా సబ్ కమిటీ సభ్యులు హరినాథ్ గౌడ్, పుల్లయ్య, చంద్రహాసరెడ్డి, నూరుల్లా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న పంట జీవాలకు మేత నందికొట్కూరు: పక్కనే హంద్రీ నీవా కాల్వల్లో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎక్కడో దూరాన ఉన్న అనంతపురం, కుప్పానికి నీళ్లు తరలిస్తున్న ప్రభుత్వం ఇక్కడి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాలు లేక, కాల్వలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. దామగట్ల గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న పొలం నిండు కుండలా ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువ సమీపంలో ఉంది. మొక్క జొన్న పంట సాగు చేయగా వర్షాలు లేకపోవడంతో పంట గిడసబారిపోయింది. చివరకు పంటను జీవాలకు మేతగా వదిలేశాడు. క్వింటా వేరుశనగ రూ.9,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్ట ధర రూ.9,290 లభించింది. మార్కెట్‌కు 1,056 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.4,390, మధ్యస్థంగా రూ.7,700 ప్రకారం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. -
రైతుల గుండెలు బీటలు బారుతున్నాయి
● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిబొమ్మలసత్రం: చంద్రబాబు పాలనలో రైతుల గుండెలు బీటలు బారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నంద్యాల మండలం కానాల గ్రామ శివారులోని చెరువును ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం శిల్పా రవి మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 873 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ సీమ ప్రాంతానికి తాగు, సాగునీరును ఎందుకు విడుదల చేయడం లేదో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయవద్దని ముందే చెబుతున్నారు తప్ప.. ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలో రైతులకు వివరించడం లేదన్నారు. రైతుకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదని వారికి సాగు నీరు ఇవ్వకపోతే ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల దుస్థితి దారుణంగా మారిందని వాపోయారు. పంటల బీమా, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు లేక ఆర్ధికంగా చితికి పోతున్నారన్నారు. కౌలు రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేరన్నారు. టీడీపీ నేతలు మట్టి దందా చేస్తూ చెరువులను కొల్లగొడుతున్నారే కానీ.. రైతుల కోసం చెరువులను నీటితో నింపాలనే ఆలోచన చేయడం లేదన్నారు. శిల్పా వెంట కానాల నాయకులు విజయశేఖర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ రంగారావు, ఉసేన్, శ,కర్, ఖాసీం, మరియదాస్, కరీమ్, ఫకృధీన్, జమాల్, ఫరూక్, నాగఉసేని, రైతులు ఉన్నారు.పేదల స్థలాలు టీడీపీ నేతల ఆక్రమణ.. కానాల గ్రామంలో గత ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు కేటాయించిన ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు కబ్జా చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యేశిల్పారవి విమర్శించారు. పేదలకు ఇచ్చిన పట్టాలు కూటమి నేతలు తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. గత ఎన్నికలకు ముందు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు ప్రస్తుతం గతంలో ఇచ్చిన పట్టాలను ఆక్రమించడం సబబు కాదన్నారు. -
ఆంక్షలతో పోరాటాన్ని అడ్డుకోలేరు!
ఆత్మకూరు: సాగునీటి కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని ఆంక్షలతో అడ్డుకోలేరని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు తరలి రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం తగద న్నారు. పోలీసుల ఆంక్షలు సరైనవి కావన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం తగదన్నారు. ట్రాక్టర్లు సీజ్ చేస్తాం, కేసులు నమోదు చేస్తామని వైఎస్సార్సీపీకి సంబంధించిన ట్రాక్టర్ యజమానులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. ట్రాక్టర్లను అడ్డుకుంటే ఆటోలో వస్తాం, ఆటోలను అడ్డుకుంటే బైకులపై వస్తాం, బైకులను అడ్డుకుంటే పాదయాత్రగా చేరకుంటామే కానీ.. కార్యక్రమాన్ని విరమించుకునే ప్రసక్తే లేదని శిల్పా స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే రాత్రింబవళ్లు అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తామన్నారు. పోరాటాలకు సిద్ధపడిన తమను కేసులతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నా సాగునీటి కాల్వలకు నీరు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా నీళ్లను తోడేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేక పోవడం వెనుక చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. నీటి కోసం రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఎక్కడా కనబడటం లేదన్నారు. ట్రాక్టర్లను అడ్డుకుంటే పాదయాత్రగా వీబీఆర్ చేరుకుంటాం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
ప్రశాంతంగా నీట్ పరీక్ష
బొమ్మలసత్రం/పాణ్యం: వైద్యవిద్యలో స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్–పీజీ ప్రవేశ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఏవీఆర్ ఎస్వీఆర్, రామకృష్ణ, ఆర్జీఎం, శాంతిరామ్ కళాశాలల్లో నిర్వహించిన పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో 295 మందికి గాను 275 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరయ్యారు. శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలో 250 మందికి గాను 236 మంది మాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. ఎస్పీ సునీల్ షోరాణ్, అడిషినల్ ఎస్పీ ఖాదర్‌బాషా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో భద్రతా ఏర్పా ట్లు కట్టదిట్టంగా అమలు చేశామని, హాల్ టికెట్లు తనిఖీలు వంటి విధానాలు సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. డ్రోన్ పెట్రోలింగ్‌తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షించామన్నారు. -
ట్రాక్టర్ యజమానులకు పోలీసుల నోటీసులు
వెలుగోడు: సెప్టెంబర్ 1న వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు రైతులు, ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వెలుగోడు పట్టణంలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది ట్రాక్టర్ యజమానులకు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లొద్దంటూ నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్లను సీజ్ చేస్తామని, కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రైతులతో కలిసి వెలుగోడు రిజర్వాయర్‌ను సందర్శించేందుకు అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
కుంటను చదును చేసి.. నిర్మాణాలు చేపట్టి
డి.కొట్టాల, శ్రీరంగాపురం, ఎల్లావత్తులతో పాటు చుట్ట పక్కల గ్రామాల ప్రజల తాగు నీటి అవసరాల కోసం, పశువుల దాహం తీర్చడానికి పూర్వం సుబ్బ య్య అనే దాత డి. కొట్టాల సమీపంలో 226/1, 226/2, 226/3 సర్వే నంబర్ల పరిధిలోని కుంట నిర్మాణానికి 7.54 ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చారు. చుట్టూ పెద్ద కట్టలు పోయించి కుంటగా తయారు చేయించినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం దాత నిర్మించిన కుంట నేడు ఆక్రమణకు గురైంది. కుంటలో నీరు నిల్వ ఉంటే చుట్టు పక్కల వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని భావించిన కొంద రు గ్రామస్తులు స్వచ్ఛందంగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసి కూడా అధికార పార్టీ నేతలు భారీ నిర్మాణాలు చేపట్టడం తీ వ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు సైతం కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసి కూడా అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారు. -
కూటమి నేతలకు కరువు కనిపించదా!
నంద్యాల: జిల్లాలో కరువు అలుముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూటమి నేతలకు కనిపించడం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. పట్టణంలోని శిల్పా స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులతో శిల్పా రవి సమావేశం నిర్వహించారు. తాగు, సాగు నీరు అందక ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యవసాయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాంలో నీరున్నా రిజర్వాయర్లు, చెరువులు ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంతోనే శ్రీశైలం డ్యాంలో ఉన్న నీటిని తెలంగాణకు వదులుతున్నారన్నారు. ప్రజలు సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. సాగునీరు అందించడంలో, పండించిన పంటకు సరైన ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడుకోవడానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్నదాతలకు అండగా నిలబడేందుకు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులు, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సాగునీటి సాధన కోసం వచ్చే నెల 1వ తేదీన వెలుగోడు రిజర్వాయర్ వద్ద రైతులతో కలసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నామని, ఈ నిరసన కార్యక్రమానికి రైతులు, రైతు సంఘం నేతలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. రాయలసీమ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు అరికట్ల శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నంద్యాల నియోజకవర్గానికి చెందిన పలువురు రైతు నాయకులు, వైఎస్సార్సీపీ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైలంలో నీరున్నా రిజర్వాయర్లు ఎందుకు నింపరు? 1న వీబీఆర్ ముట్టడికి తరలిరండి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి -
సింహ వాహనంపై సిద్ధగురుడు
మంత్రాలయం: మంగళ వాయిద్యాల సుస్వర నాదాలు, కర్ణాటక డప్పు దరువులు, పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజనం కోలాహలం మధ్య శ్రీ ప్రహ్లాదరాయుడు సింహవాహనంపై కొలువుదీరాడు. జయజయ ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటీ సేవలు జరిపారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. విశేషంగా పూర్వారాధన శాస్త్రోక్తంగా సాగిన పూర్వారాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామిజీ ఆశీస్సులతో రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకంతో పాటు పుష్పాలంకరణ చేశారు. రాయరు, మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలో స్వామిజీ తరించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మంటపంలో చేపట్టిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన కడబ శ్రీనివాస్ సంగీత విభావరి, బెంగళూరు అనురాగ కళా గురుకుల బృందాం భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
జిల్లాలో న్యాయవిజ్ఞాన క్లబ్‌లు
కర్నూలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు జిల్లాలో న్యాయవిజ్ఞాన క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ క్యాంప్, వీఆర్ కాలనీలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం న్యాయ విజ్ఞాన క్లబ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ క్లబ్‌లను ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాథమిక న్యాయ హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 15100 ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. ముగిసిన శిక్షణా కార్యక్రమం... జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మధ్యవర్తులకు 40 గంటల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ సందర్భంగా మధ్యవర్తులకు ధృవపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు అవసరమైన వారికి నాణ్యమైన న్యాయ సేవలందించేలా కృషి చేయాలని కబర్ధి సూచించారు. న్యాయాధికారులతో వర్చువల్ సమావేశం... సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించాలని లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లాలోని కర్నూలు మినహా ఇతర న్యాయస్థానాల న్యాయాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. -
వైఎస్సార్సీపీ పోరాటంతో ఎస్సార్బీసీకి నీరు
పాణ్యం: వైఎస్సార్సీపీ చేసిన పోరాటానికి కూటమి ప్రభుత్వం దిగి రావడంతో తాగునీటి అవసరాల నిమిత్తం గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి 500 క్యూసెక్కుల నీటిని అధికారులు శనివారం విడుదల చేశారు. ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయాలని ఈనెల 18వ తేదీన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గోరుకల్లు జలాశయ సందర్శనకు రైతులతో కలసి వెళ్లారు. అయితే గోరుకల్లు జలాశయాన్ని చూసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అవుకు జలాశయం, రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనపై టాస్క్‌ఫోర్స్ బృందం ద్వారా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ చేసిన పోరాటానికి ఎస్సార్బీసీ పరిధిలో ఉన్న గ్రామాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయడంతో పాణ్యం, బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, తదితర మండలాలకు తాగునీటి సమస్య తీరనుంది. కాగా నీటి విడుదలను మరింత పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ నాయకులు సమాయత్తమవుతున్నారు. -
రంగనాథుడి పట్టువస్త్రాల సమర్పణ
పూర్వారాధన వేడుక సందర్భంగా తమిళనాడు శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక మహా ముఖద్వారం నుంచి రంగనాథుడి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా శ్రీమఠం చేరుకున్నారు. స్వామిజీ పట్టువస్త్రాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వీకరించారు. రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకుని పట్టు వస్త్రాలకు విశేష పూజలు నిర్వహించారు. ఊంజల మంటపంలో రంగనాథుడి ఆలయ పండితులను సన్మానించారు. పట్టువస్త్రాల సమర్పణ వెనుక దాగిన చరిత్రను స్వామిజీ భక్తులకు ప్రవచించారు. -
ఉమ్మడి జిల్లాలో 976 పింఛన్ల తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెప్టెంబరు నెల 976 పింఛన్లపై వేటు పడింది. పింఛన్‌దారులు మరణించారనే కారణంలో తొలగించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ.102.48 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.90.87 కోట్లు బ్యాంకులకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఆగస్టు నెలలో 2,33,918 పింఛన్లు ఉండగా సెప్టెంబరు నెలలో 2,33,431 ఉన్నాయి. అంటే 487 పింఛన్లపై కోత పడింది. నంద్యాల జిల్లాలో అగస్టు నెలలో 2,10,221 పింఛన్లు ఉండగా సెప్టెంబరు నెలలో 2,09,732 ఉన్నాయి. అంటే 489 పింఛన్లపై వేటు పడింది. ఈ నెల 31న బ్యాంకులకు పింఛన్లకు సంబంధించిన నిధులు విడుదల అవుతాయి. అదే రోజున గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రాచేసి సెప్టెంబరు 1న పంపిణీ చేస్తారు. నమో.. లక్ష్మీనారసింహా ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన అహోబిల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారమైన శనివారం కావడంతో పాటు శ్రావణమాసం ముగింపుకొచ్చిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులుదీరారు. దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీశైలంకు స్వల్పంగా వరద శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి శనివారం సాయంత్రం నుంచి స్వల్పంగా వరద ప్రవాహం మొదలయ్యింది. జూరాల ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పాదన చేస్తుండడంతో 9,722 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, హంద్రీనీవా సుజలస్రవంతికి 44,910 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 15.488 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 152.1568 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.50 అడుగులకు చేరుకుంది. ప్రత్యామ్నాయ సాగుకు సబ్సిడీ విత్తనాలు కర్నూలు(అగ్రికల్చర్): కరువు నేపథ్యంలో 11,995 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయతలపెట్టింది. కొర్రలు, జొన్న, సజ్జ, ఆముదం, కంది, మినుము, ఉలువలు, పెసలు 1119 క్వింటాళ్లు కేటాయించింది. కొర్రలు కిలో పూర్తి ధర రూ.60 ఉండగా సబ్సిడీ పోను రైతులు రూ.12 చెల్లించాల్సి ఉంది. కందులు ఎల్‌ఆర్‌జీ–52, పీఆర్జీ 176, ఐసీపీఎల్ 8749 రకాల కిలో పూర్తి ధర రూ.120.50 ఉండగా రూ.24.10 చెల్లించాల్సి ఉంది. ఆంజనేయ స్వామికి 3.5 కేజీల వెండి గద సమర్పణ ఆదోని రూరల్: జాలిమంచి గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధాపురం ఆంజనేయస్వామి ఆలయానికి 3.5 కేజీల వెండితో తయారు చేయించిన గదను మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి సమర్పించారు. ఆలయంలో శనివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కప్పట్రాళ్ల శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల్లో ప్రతి రోజూ పీజీఆర్ఎస్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించాలని జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన కార్యాలయంలో మండల/అర్బన్ సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధులు ముగించుకొని తప్పనిసరిగా పీజీఆర్ఎస్కు హాజరు కావాలన్నారు. -
ఇదీ నిజం
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షలకు పైగా వ్యాపారులు ఉన్నారు. ● తోపుడు బండ్లు, రోడ్డుసైడ్ వ్యాపారులు 1.28 లక్షల మంది ఉన్నారు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న తోడు కింద 1.18 లక్షల మందికి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చింది. ● చిన్న వ్యాపారులకు రూ.148.87 కోట్ల రుణాలు అందించింది. ● చంద్రబాబు ప్రభుత్వంలో చిరు వ్యాపారులకు ప్రోత్సాహకాలు లేవు. ● జగనన్న తోడు కింద రుణాలు పొందిన వారిలో పది శాతం మంది ప్రస్తుతం వ్యాపారాలు బంద్ చేశారు. ● ప్రజల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): పట్టణాల్లో, నగరాల్లో రోడ్ల పక్కన చిరు వ్యాపారుల దీన చూపులు కనిపిస్తున్నాయి. కాలువల పక్కన తడికెలతో ఏర్పాటు చేసుకున్న దుకాణాలు మూతపడుతున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను సైతం ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. హుందాగా తిరిగేందుకు మంచి దుస్తులు ధరించడానికి కూడా చాలా మంది వద్ద డబ్బులు ఉండటం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేదరికం పెరిగిపోయిందని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. జీవనోపాధులను పెంచే సంక్షేమ పథకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా నిలిచింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 26 నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు లేదు. ప్రజల్లో నగదు సర్క్యులేషన్ లేకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. ఫలితంగా వ్యాపారాలు పడిపోయాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో అనేక మంది వ్యాపారులు అప్పులపాలయ్యారు. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం మున్సిపాలిటీల్లో, మేజర్ గ్రామ పంచాయతీల్లో చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునే వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో లక్ష మంది వరకు వీధుల్లో బండ్లపై చిరు వ్యాపారాలు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న తోడు కింద ఉమ్మడి జిల్లాలో చిన్న వ్యాపారులకు పావలా వడ్డీతో రుణ సదుపాయం కల్పించింది. రికార్డు స్థాయిలో 1.18 లక్షల మంది చిన్న వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.148.87 కోట్లు పావలా వడ్డీపై రుణ సదుపాయం కల్పించింది. నిర్ద్ధిష్ట గడువులో చెల్లించి మళ్లీ తీసుకుని వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చిన్న వ్యాపారులకు పావలా వడ్డీకే రుణాలు పంపిణీ చేసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలా మంది దిక్కులు చూడాల్సి వస్తోంది. కొంత మంది ఆర్థికంగా నష్టపోయి వ్యాపారం మానుకున్నారు. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దెబ్బతిన్న జీవనోపాధి గత వైఎస్సార్పీ ప్రభుత్వం ఐదేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, కాపు నేస్తం, విద్యాదీవన, వసతి దీవెన, కళ్యాణమస్తు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేసింది. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం కింద సంబంధిత వర్గాల ఖాతాల్లోకి నగదు వెళ్లడంతో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల రూపంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు రూ.12,500 కోట్ల వరకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ఊసే కరువైంది. వ్యవసాయం కలసిరాక గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వర్షాలు లేక ఇప్పటి వరకు పంటలు వేయలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినింది. వ్యాపారాలు లేక కిరాణం షాపులు, ఎలక్ట్రానిక్, వస్త్ర దుకాణాలు చాలా వరకు మూతపడ్డాయి. చిన్న వ్యాపారాల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ‘మద్దతు’ కరువు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేది. రైతులు పండించిన పంటలకు ధరలు లేనప్పుడు ఆర్బీకేల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరలతో కొనుగోలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి ఆర్థిక వెసలుబాటు దొరకలేదు. రైతుల పండించిన పంటలకు మద్దతు ధర లభించలేదు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా మార్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఉచిత పంటల బీమా అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. డబ్బులు లేక వ్యవసాయం ఆధారంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయని దుస్థితిలో ఉన్నారు. కర్నూలులోని స్ట్రీట్ మార్కెట్లో మాకు షాపు ఉంది. ఇందులో అన్ని రకాల పండ్లను అమ్ముతున్నాం. రెండేళ్ల క్రితం వరకు వ్యాపారాలు బాగా ఉండేవి. ఇప్పుడు అమ్మకాలు లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు షాపులోనే ఖాళీగా ఉంటున్నాం. – సావిత్రమ్మ, కర్నూలు రెండేళ్లుగా కిరాణ వ్యాపారం పడిపోయింది. వస్తువులు కొనేవారు లేరు. 2023తో పోలిస్తే ఇప్పుడు వ్యాపారాలు 30 శాతం వరకు పడిపోయాయి. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. – రమేష్ గుప్తా, కర్నూలు మేం వ్యవసాయానికి సంబంధించిన పరికరాలతో వ్యాపారం చేస్తుంటాం. రెండేళ్ల క్రితం వ్యాపారం బాగుండేది. ఇప్పుడు వ్యవసాయం కలసి రాక రైతులు పరికరాలు కొనగోలు చేయడం లేదు. మాదే కాదు 50 శాతం పైగా వ్యాపారాలు పడిపోయాయి. వ్యాపారుల మనుగడ దెబ్బతినింది. – మహమ్మద్ రఫీ, కర్నూలు వీధిన పడ్డారు!కర్నూలుతో పాటు వివిధ పట్టణాల్లో స్ట్రీట్ మా ర్కెట్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నూలులోని వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్ పక్కన స్ట్రీట్ మార్కెట్ రెండేళ్ల క్రితం కళకళలాడుతూ ఉండేది. అలాగే ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఫుట్‌పాత్‌పై ఏర్పా టు చేసిన స్ట్రీట్ మార్కెట్లో కొనుగోళ్లు బాగా జరిగేవి. కృష్ణానగర్‌లోని ఐటీసీ దగ్గర, గుత్తి పెట్రోల్ బంక్ ప్లైఓవర్ కింద చిన్న హోటళ్లు ఉండటంతో అనేకమందికి అవకాశం లభించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రోత్సాహాలు లేక స్ట్రీట్ మార్కెట్లు అస్తవ్యస్తం అయ్యాయి. ఆర్థికంగా నష్టపోయి చిన్న వ్యాపారులు దుకాణాలను మూత వేసి వీధిన పడ్డారు.అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య కర్నూలు: వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులు తీర్చలేక కర్నూలు పాతబస్తీలోని వడ్డెగేరిలో నివాసముంటున్న అగ్నూరు నరేష్ (36) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు రూ.15 లక్షల దాకా అప్పు చేసి కొంతకాలంగా మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని, భార్య తెలుగు రేణుకకు చెప్పి బాధ పడ్డాడు. భోజనం చేసి అందరూ పడుకున్న తర్వాత బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గడియ పెట్టుకుని ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య రేణుక తలుపులు తట్టినప్పటికీ తీయకపోవడంతో కుటుంబ సభ్యులను పిలిచి తలుపులు తెరిచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం మూడవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో శివసేవకులు 600 మంది, ఇతర భక్తులు 300 మంది పాల్గొన్నారు. వ్రతానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నింటిని దేవస్థానం సమకూర్చింది. వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం నిర్వహించారు. అర్చకులు వ్రతకథను పఠించి, వ్రత మహిమా విశేషాలను భక్తులకు వివరించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్ష సంపదగా తులసిమొక్క, శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. -
అహోబిలంలో పౌర్ణమి పూజలు
ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉద యం మూలమూర్తులకు నిత్యపూజలు నిర్వహిచిన అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలు వుంచి పంచామృతాలతో అభిషేకించి దూపదీపాలతో మహామంగళహారతి అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. తిరిగి దేవాలయం చేరుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యాక్రమాన్ని ముగించారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ డోన్ టౌన్: జిల్లాలో ఐటీఐలో మిగిలి పోయిన సీట్ల భర్తీ కోసం నాల్గవ విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్‌పాల్ నాగకేశాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ ఉదయం 11.30 గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని సమీప ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని 31వ తేదీ జరిగే కౌన్సిలింగ్ హాజరుకావాలన్నా రు. మరిన్ని వివరాలకు సమీప ప్రభుత్వ ఐటీఐల్లో సంప్రదించాలన్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు కొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కాలనీకి చెందిన ఓ బాలికకు పెళ్లి నిశ్చయమైంది. మరొ కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న తహసీల్దార్ షఫీ, సీఐ రమేష్‌బాబు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు కాలనీకి చేరుకున్నారు. మేజర్ కాక ముందే పెళ్లి చేయరాదని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే జరిగే అనర్థాల గురించి వివరించారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘాల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల చైర్పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నిలిచిన ఇన్‌ఫ్లో శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి వచ్చి చేరే వరద ప్రవాహం శుక్రవారం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడం, నీటిమట్టం కూడా తగ్గుతుండడంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తెలంగాణ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌లో కొంత భాగం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. గురువారం నుంచి శుక్రవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 11.929 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 24,226 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గ్రామాల్లో చిన్నారులకు విషజ్వరాలు వెల్దుర్తి: గ్రామాల్లో చిన్నారులు విషజ్వరాల బారిన పడుతున్నారని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, ఏఎమ్ఓ విజయ్‌కుమార్ గుర్తించారు. వెల్దుర్తి సీహెచ్‌సీకి శుక్రవారం వచ్చి అక్కడ నమోదవుతున్న కేసుల వివరాలు సేకరించారు. అనంతరం ఆయా గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయించారు. రామళ్లకోట, గోవర్ధనగిరి పీహెచ్‌సీల వైద్యాధికారులు భువనతేజ, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
బానకచెర్ల సందర్శన
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరును జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనూంజయ, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం, సాగు నీటి పరిస్థితులు, రైతులకు అందుతున్న నీటి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని, జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ కాల్వలకు 4 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్‌రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం రెడ్డి, డీఈ నగేష్, జేఈ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
దొర్నిపాడు: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ4 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సూచించా రు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జీరో పావర్టీపై గ్రామైక్య సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, నిరుపేదలను ఎలా గుర్తించాలో వివరిస్తూ 16 సూచికలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామైక్య సంఘాలు దీని దృష్టిసారించాలన్నారు. అందరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం బాబు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతల నీరు వృథా
కొత్తపల్లి: ఎత్తిపోతల అధికారులు, కమిటీ సభ్యుల నిర్వహణ లోపంతో ఎత్తిపోతల నీరు వృథాగా పారుతుంది. మండలంలోని సింగరాజుపల్లె గ్రామ పొలిమేరలోని వ్యవసాయ పొలాల్లో శుక్రవారం సంగమేశ్వరం – శివపురం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ ఎయిర్ వాల్ బ్లాస్ట్ అయింది. ఉవ్వెత్తున పైప్‌లైన్ నుంచి నీరు ఎగసి పడుతోంది. దీంతో సాగునీరు పక్కన ఉన్న మొక్కజొన్న, వరి పొలాలను ముంచెత్తోంది. నీటి వృథా అరికట్టేందుకు రైతులు శ్రమించిన ఫలితం లేకపోయింది. పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలో పంటచేతికి వచ్చే సమయంలో నీరు ముంచెత్తడంతో నష్టపోతున్నామని మహిళా ప్రేమిలమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తెలుగుగంగకు నీరెప్పుడిస్తారు!
ఆత్మకూరు: తెలుగుగంగ ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరిస్తారు.. రైతులు పంటలు ఎలా సాగు చేయాలి.. అని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. గతంలో వీబీఆర్‌లో 3 టీఎంసీల నీరున్నా.. విడుదల చేశామని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం 10 టీఎంసీల నీరున్నా ఎందుకు విడుదల చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీశైలం జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తున్నా కూటమి నేత లు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుగంగ, కేసీకెనాల్, సిద్ధాపురం చెరువులకు సాగునీటిని విడుదల చేసి రాయలసీమ రైతులను ఆదుకోవాలన్నారు. తెలుగుగంగ ఆయకట్టు కింద తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కనీసం ఒక పంటకైనా సాగునీరు విడుదల చేయకపోతే రైతుల పరిస్థితి ఘోరంగా మారుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో వరినాట్లు చేసి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని కాపాడుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల, పట్టణాధ్యక్షులు సయ్యద్‌మీర్, రాజమోహన్‌రెడ్డి, బైరాపురం మహబూబ్‌బాషా, స్వామి, రవీంద్ర, లక్ష్మిరెడ్డి, రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేష్, పార్వతి, అబ్దుల్ కలాం, వెంకటస్వామిగౌడ్, అల్లీషేర్, లాలు, తిమ్మ య్య, షఫీవున్, శేషిరెడ్డి, లక్ష్మన్నయాదవ్, కోట్ల నాగేశ్వరరెడ్డి, యల్లప్ప, ప్రభుదాస్‌తో పాటు వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీబీఆర్ ముట్టడికి తరలిరండి వెలుగోడు: తెలుగుగంగ ఆయకట్టు రైతుల సాగునీటి విడుదల కోసం సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్) ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, రైతులతో శిల్పా చక్రపాణిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో నీరు ఉన్నా ఆయకట్టుకు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టిన వీబీఆర్ ముట్టడి కార్యక్రమానికి 500 ట్రాక్టర్లతో రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దేశం తిరుపంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇలియాస్‌ఖాన్, మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్, రైతు విభాగం నాయకుడు వంగాల నాగేశ్వరరెడ్డి, గోవిందు, షంషీర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. 10 టీఎంసీల నీరు ఉన్నా ఎందుకివ్వరు? ఎమ్మెల్యే బుడ్డా.. నోరు మెదపరెందుకు రైతులతో 1న వీబీఆర్ ముట్టడి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
50 కిలోల పంచలోహ విగ్రహం విరాళం
జూపాడుబంగ్లా: తాటిపాడు గ్రామ ంలోని వీరభద్రస్వామి ఆలయానికి గురువారం 50 కిలోల పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, సరోజినీదేవి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాసరావు, వెంకటరమణరావు, కుమా ర్తె ధనలక్ష్మి రూ.1.45 లక్షల విలువైన 50 కిలోల పంచలోహ లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని అందజేశారు. తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పెద్దలు హరీష్‌రెడ్డి, అంబిరెడ్డి, అర్చకులు రాజేష్, మురళీమోహన్ అందుకున్నారు. -
అతిథుల కోసమే ప్రత్యేక వంటలు
శ్రీశైల క్షేత్ర సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే అతిథులను గౌరవించడం కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తాం. వంటకాలలో నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగించే ప్రసక్తే లేదు. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే జిల్లా అధికారుల బృందానికి, సిబ్బందికి ప్రత్యేకంగా వంట మనుషులను, ప్రత్యేక పొయ్యి ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తాం. భక్తులకు సిద్ధం చేసే అన్నప్రసాదం పవిత్రంగా తయారు చేస్తాం. త్వరలో అతిథుల కోసం దేవస్థాన అన్నప్రసాద భవనం కాకుండా ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసి, చెఫ్, వడ్డనకు మనుషులను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
పోలీసుల కోసమే క్యాంటీన్
బొమ్మలసత్రం: మార్కెట్ కంటే అతి తక్కువ ధరకు పోలీసులకు నిత్యావసరాలు అందించాలనే లక్ష్యంతో పోలీస్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే వారు హోదాతో సంబంధం లేకుండా ఇక్కడ కొనుగోలు చేయవచ్చన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కుడిగట్టు కేంద్రంలో నిలిచిన విద్యుదుత్పాదన శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గత 20వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పాదన నిలిపేశారు. వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఆశాజనకంగా లేదు. శ్రీశైలం జలాలపై ఆధారపడిన రైతాంగం తమ పొలాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నిర్విరామంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. ఇక కుడిగట్టు కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పాదన జరిపితే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోయే అవకాశం ఉండటంతో ఉత్పాదనను నిలిపివేశారు. ప్రభుత్వ, లోడ్ డిశ్పాచ్ ఆదేశాలు రాగానే కుడిగట్టులో తిరిగి ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. చెంచులకు ఉచిత స్పర్శదర్శనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడేంతో పాటు మార్కాపురం జిల్లాల నుంచి 40 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. తప్పెట వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ స్పర్శ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు వీరికి ఆహ్వానం పలికారు. అనంతరం మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనములో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. నంద్యాలలో ఐదు రోజుల గణేశ్ ఉత్సవాలు నంద్యాల(వ్యవసాయం): జిల్లా కేంద్రమైన నంద్యాలలో సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను నిర్వహించనున్నట్లు గణేశ్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గణేశ్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరపత్రాలను, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో మూడు రోజుల పాటు నంద్యాలలో ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, దండు వెంకటేశ్వర్లు, నాగదీప్ పాల్గొన్నారు. -
ఘనంగా మిలాద్–ఉన్–నబీ
నంద్యాల(వ్యవసాయం): మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన బుధవారం మిలాద్–ఉన్–నబీ వేడుకను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రవక్త వాడిన వస్తువులను ప్రదర్శించారు. చాంద్‌బాడా వీధిలోని సాహెబ్ మసీదులో ఆసారెముబారక్ నిర్వహించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త వారి తలవెంట్రుకలు, ప్రవక్త వాడిన కంబలి, పవిత్ర మక్కా కిస్వా శారీను ప్రదర్శించారు. వాటిని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని సర్వ మానవాళి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మంజుబాషా దర్గా నిర్వాహకుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మతపెద్దలు మాట్లాడుతూ.. మానవాళి శాంతి కోసం అల్లాహ్ పంపిన దూతగా మహమ్మద్ ప్రవక్త ఈ భూప్రపంచలోనికి వచ్చారన్నారు. మతగురువులు సయ్యద్ షర్బుద్దీన్, హుసేనీ, అసదుల్లా, సయ్యద్ కరీముల్లా, మొయిద్దీన్ హుసేనీ, సయ్యద్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి చూపు లేకుండా అంత్యక్రియలు
● సున్నిపెంట శ్మశానంలో ఐదు మృతదేహలకు ఖననం ● చివరి చూపునకు నోచుకోని బంధువులు, స్నేహితులు ● పది మంది కుటుంబ సభ్యుల హాజరు శ్రీశైలంటెంపుల్: సొంత ఊరు, బంధువులు, స్నేహితులు ఉన్నా..అత్యంత దయనీయంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండడంతో సొంత ఊరికి కూడా తీసుకెళ్లలేక సున్నిపెంట శ్మశానంలో ఖననం చేశారు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న బంధువులు మినీవ్యాన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అప్పటికే ఆత్మహత్య చేసుకుని మూడు రోజులు కావడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో మృతదేహాలకు సున్నిపెంట గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు సుధాకర్ పెద్దనాన్న కుమారులు, సుధాకర్ పెద్ద అక్క ఆదిలక్ష్మీ భర్త గోగుల రాముడు, ఇతర కుటుంబ సభ్యులు సుమారు పది మంది కన్నీటి రోదనల నడుమ అత్యంత దయనీయంగా దహనసంస్కారాలు నిర్వహించారు. సొంత గ్రామం, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉన్నా చివరి చూపుకు సైతం నోచుకోలేదు. ఆరోగ్యం బాగాలేదని, చూపించుకుని వస్తామని చెప్పి అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘నేను వస్తానన్నా వద్దని, మేమే వస్తాం అని చెప్పి కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శివయ్య చెంతకు వెళ్లింది’ అని ఆదిలక్ష్మీ భర్త రోదిస్తుంటే అక్కడ ఉన్నవారి కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవస్థానం, పోలీసు శాఖ నిర్లక్ష్యం వీడేనా? శ్రీశైలంలో ఉన్న పలు సత్రాలను, వసతి గదులను దేవదాయ ధర్మదాయ నిబంధనల మేరకు నిర్వర్తిస్తున్నారా, అతిక్రమిస్తున్నారా అనే విషయాలపై తరచూ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. సత్రాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి తగు జాగ్రత్తలు, సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనల మేరకు వసతి గదులు కేటాయిస్తున్నారా అని దేవస్థానం, పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అరికట్టే అవకాశం ఉంటుందని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. -
జగదుర్తిలో టీడీపీ నాయకుల రౌడీయిజం
● వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి ● ఐదుగురుకి గాయాలు సాక్షి టాస్క్‌ఫోర్స్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు తిరగకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు రౌడీయిజం చేశారు. డోన్ మండలం జగదుర్తిలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాజేశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కోదండరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరి కొంత మంది పట్టుడు కర్రలతో దాడి చేసినట్లు గాయపడిన వారు తెలిపారు. వైఎస్‌స్రా్‌సీపీ నాయకులు మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ఉప్పరి వెంకటేశ్వర్లు, బోయ సుంకన్న, బోయ సురేష్ ఇళ్లకు వెళ్లి దాడి చేసినట్లు బాధిత కుటుం సభ్యులు తెలిపారు. దాడిలో మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి తలలకు బలమైన తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వీరిని గ్రామస్తులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థతిని సమీక్షించారు. -
శ్రీశైలం హుండీ ఆదాయం రూ.5.88కోట్లు
శ్రీశైలంటెంపుల్: భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.5,88,89,846 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని అలంకార మండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో గత 35రోజులల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. బంగారం 87గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 4కేజీల 250 గ్రాములు లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే యుఎస్ఏ డాలర్లు 540, యుఏఇ దిర్హమ్స్ 1610, సింగపూర్ డాలర్లు 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 140, మలేషియా రింగిట్స్ 21, సౌదీరియాల్స్ 10, బహ్రైన్దినార్ 109, ఓమన్బైసా 100, ఓమన్ రియాల్స్ 5 లభించినట్లు ఈఓ తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్ధిని, ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు. -
శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని రాయలసీమ జేఏసీ నాయకులు ప్రతాపరెడ్డి, జీవీఎన్ ప్రసాద్, పెద్ది శ్రీనివాసులు అన్నారు. మంగళవారం న్యాయవాదులు కోర్టు ఆవరణం నుంచి ర్యాలీగా వెళ్లి టెక్కె రోడ్డుపై మానవహారంగా నిలిచి శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. 90 రోజుల్లో బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సర్క్యూట్ బెంచ్ ప్రచారంపై న్యాయవాదులు మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమకు న్యాయ సేవలను త్వరగా అందించాలంటూ, కర్నూలులో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్యక్రమంలో న్యా యవాదులు వివేకానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మద్దిలేటి, షేక్ రియాజ్, శ్రీదేవి, కృపావతి, సుబ్బరాయుడు, ఆలంఖాద్రి, సుదాంశమౌళిరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓబులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తాం
నందికొట్కూరు: వృద్ధులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. న్యూ మాడ్యూల్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద ఆశ్రమంలో వృద్ధులతో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి కబర్ది మాట్లాడుతూ.. 2016 కింద అందుబాటు లో ఉన్న న్యాయ సేవలు, వృద్ధులకు హక్కులు, రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లల నుంచి ఆదరణ కరువై, సంరక్షణకు దూరమైన వారు ఆర్డీఓను సంప్రందించి తమ ఫిర్యాదులకు పరిష్కారం పొందవచ్చన్నారు. న్యాయ సేవల హెల్ప్‌లైన్ నంబరు 15100ను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జీలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.శ్రీశైలం డ్యాం నీటి మట్టం 875 అడుగులు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.20 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 164.7532 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఎగువ జూరా ల ప్రాజెక్ట్ నుంచి 11,500 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరుతుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 44,814 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 15.410 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 31,364 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఓపెన్ యూనివర్సిటీలోప్రవేశాలకు దరఖాస్తులుశ్రీశైలంప్రాజెక్ట్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, గ్రూప్‌ల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.హుస్సేన్‌బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశలో 2026–27 విద్యా సంవత్సరంలో మొట్టమొదటి సారిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, 10+2లో పాసైన విద్యార్ధులు ప్రవేశాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు శ్రీశైలం కో–ఆర్డినేటర్ ఎస్.మహేశ్వరరెడ్డి (9492942337)ని సంద్రించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. నేత్రదానంతో పునర్జన్మ బొమ్మలసత్రం: మరణిస్తూ నేత్రదానం చేయటమంటే తిరిగి పునర్జన్మ పొందినట్లేనని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లాలో నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం సందర్భంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చేపట్టిన ర్యాలీలో డీఎంహెచ్ఓ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేత్రదానం వల్ల కలిగే ప్రజయోజనాలనపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆరోగ్యవంతులతో పాటు బీపీ, షుగర్, కంటి అద్దాలు వినియోగించే వారు కూడా నేత్రదానానికి అర్హులన్నారు. హెచ్ఐవీ, క్యాన్సర్, హైపటైటీస్ బీ ఉన్న వారు నేత్రదానం చేయకూడదన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నాగమణి, శ్రీనివాసులు, యశోదర, పామన్న పాల్గొన్నారు. టీటీడీలో అప్రెంటీస్‌షిప్ అవకాశాలు డోన్ టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐటీఐ పాసైన విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, డోన్ ప్రిన్స్‌పాల్ నాగకేశాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాఫ్ట్‌మన్ సివిల్‌లో 98, ఫిట్టర్ 16, టర్నర్ 4, మిషినిస్టు 4, రేడియో, టీవీ 4, ఎలక్ట్రీషీయన్ 23, వైర్‌మెన్ 21, సీఓపీఏ 20 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ లోపల సమీప ప్రభుత్వ ఐటీఐల్లో 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబిత, తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో సంప్రదించాలన్నారు. -
స్పెషల్ టెట్‌తో ప్రయోజనం లేదు
నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్‌తో ప్రత్యేక ప్రయోజనం లేదని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామపక్కీర్రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణా అర్హతలు, నియామక పక్రియ ద్వారా అర్హత సాధించి నిరంతర బోధన సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను కొత్త నియామకానికి పోటీ పడే అభ్యర్థులతో సమానంగా టెట్ అర్హత ప్రమాణాలతో పరీక్షించే విషయం పునః పరిశీలించాలన్నారు. టెట్‌లో జనరల్ కేటగిరికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరిలకు 40 శాతం అర్హత మార్కులు ఉంటాయన్నారు. 40 శాతానికి పరిమితం చేయాలి... ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయుల అనుభవాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వయస్సు, దీర్ఘకాలిక సేవ, పాఠశాలలో ఉన్న బోధన, బాధ్యతలను పరిగణలోకి తీసుకోకుండా సీబీటీ పరీక్ష విధానాన్ని అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు వెంకటరామిరెడ్డి, గోపాలకృష్ణ, నాగేంద్రకుమార్, ఎల్లా సుబ్బయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్, నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు. -
బత్తలపల్లిలో విషాదం
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకోవడంతో వారి సొంతూరులో విషాదం అలుముకుంది. సుధాకర్‌కు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. పెద్ద అక్క ఆదిలక్ష్మిని తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన రాముడుకు ఇచ్చి వివాహం చేశారు. రెండో అక్క మల్లీశ్వరిని ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన వేమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. సుధాకర్‌కు ఉన్న రెండు ఐచర్ వాహనాలు సక్రమంగా నడవక పోవడంతో వాటిని తీసేశాడు. ఆ తర్వాత పది ఆటోలు అద్దెకు ఇచ్చి నడిపేవాడు. బత్తలపల్లిలో ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గానూ ఎన్నికయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది తెలిసిన వారు, బంధువులు, బ్యాంకుల్లోనూ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఉండొచ్చని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. అప్పు ఇచ్చిన వారికి కూడా ఐపీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఆటోలు కూడా ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికితోడు భారంగా నడుస్తున్న కుటుంబంలోకి భర్తలను వదిలేసి ఇద్దరు అక్కలు వచ్చి చేరారు. వారిలో ఒకరికి పక్షవాతం. మల్లేశ్వరి కుమారుడు మణికంఠ మానసిక స్థితి సరిగా లేకపోవడం సమస్యలు వేధించాయి. దీంతో ఈ కుటుంబాన్ని పోషించే భారం సుధాకర్ పై పడింది. దీంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. వారు కాల నీలో ఎవరితోనూ సరిగా మాట్లాడేవారు కాదని, ప్రవర్తనలోనూ మార్పు ఉండేదని చెప్పుకుంటున్నారు. అందరూ బంధువులైనా ఎవరితోనూ సరిగా కలివిడిగా ఉండేవారు కాదని అంటున్నారు. శ్రీశైలానికి తరలివెళ్లిన బంధువులు.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందగానే సుధాకర్ రక్త సంబంధీకులు, కాలనీవాసులు శ్రీశైలానికి బయల్దేరివెళ్లారు. ఆర్థిక కష్టాలతో అవస్థలు పడిన నేపథ్యంలో వారి మృతదేహాలను బత్తలపల్లికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయగా, మృతదేహాలు దుర్వాసన వస్తుండడంతో అక్కడే ఖననం చేసినట్లు తెలిపారు. వారు శ్రీశైలం వెళ్లేందుకు గాను స్థానికులు కొందరు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిసింది. దీంతో బస్సు తీసుకొని శ్రీశైలానికి వెళ్లారు. నేను అప్పుడప్పుడు వారితో మాట్లాడుతుంటా. మా చిన్న మరదలు శ్రీదేవికి బాగాలేకపోతే తిరుపతి వద్దనున్న విరూపాక్షపురానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వారంతా శ్రీశైలానికి వెళ్లినట్లు చెప్పారు. నేను వస్తా అంటే సుధాకరే వద్దన్నాడు. నాలుగు రోజుల క్రితం ఫోన్ చేస్తే భార్య మాట్లాడింది. అప్పులేమో చాలా చేశారు. ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా బాగానే మాట్లాడింది. నేను రావాలా అంటే.. వద్దు లే.. నీకు ముందే బీపీ, షుగర్ ఉన్నాయి. మాకే బరువు అవుతుంది. నీవు పడిపోతే నీకు ఎవరు చేసేది అంది. తినడానికి ఖర్చులకు వెంపర్లాడుతు న్నామని చెప్పింది. అక్కడికి వరకూ వెళ్లి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో.. దేవుడేకి తెలియాలి. – గోగుల రాముడు, ఆదిలక్ష్మీ భర్త, బత్తలపల్లి -
సూసైడ్ స్పాట్స్‌గా మారిన పుణ్యక్షేత్రాలు
గతంలో బావులు, చెరువుల్లో దూకడం, ఆ తర్వాత ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకి చనిపోవడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. ఇలాంటి వాటిని ట్రెండ్ అంటారు. కాలానుగుణంగా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు సూసైడ్ స్పాట్స్‌గా మారుతుంటాయి. ఇప్పుడు పుణ్యక్షేత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడో ఎవరో కొందరు పుణ్యక్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్నారన్న మీడియా, సోషల్ మీడియాలో చూసి ఉంటారు. వీరికేదైనా ఆత్మహత్య చేసుకోవాలన్న బలమైన తలంపు వచ్చినప్పుడు వారు కూడా అలాంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. – డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, సైకియాట్రి హెచ్ఓడీ, కర్నూలు జీజీహెచ్ శ్రీశైలంలో చోటుచేసుకున్న ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం. బత్తలపల్లి పోలీసులతో కూడా మాట్లాడాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. సత్రం నిర్వాహకులతో కూడా మాట్లాడాం, సత్రం రిజిస్టర్, రికార్డులు, సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నాం. – రామాంజినాయక్, ఆత్మకూరు డీఎస్పీ -
అర్హుల ఓటుపదిలంగా ఉండాలి
మహానంది: సర్ 2026 ప్రక్రియలో ప్రతి ఓటరు వివరాలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి ఓటు పదిలంగా ఉండేలా చూడాలని జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ రమాదేవిలతో కలిసి మంగళవారం గ్రామంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి పురోగతి, పెండింగ్ అంశాలు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు: మహానందీశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి మంగళవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ అధికారి వై.మధు, వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె శ్రీకామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. -
ప్రైవేట్ సత్రాల ఇష్టారాజ్యం
● తరచూ ప్రైవేట్ సత్రాల్లో ఆత్మహత్య ఘటనలుశ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రైవేట్ సత్రాలపై దేవస్థాన అధికారులు పర్యవేక్షణ విస్మరించడంతో ప్రైవేట్ సత్రాలు దేవదాయ శాఖ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో పలు ప్రైవేట్ సత్రాల్లో దేవదాయ చట్టానికి విరుద్ధంగా కార్యక్రమాలతో పాటు తరచూ ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే క్షేత్రంలో పోలీసుల నిఘా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం పరిధిలో ప్రస్తుతం సుమారు 70 సత్రాల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఆయా సత్రాలు దేవదాయ ధర్మదాయ శాఖ నిబంధనలు అనుసరించి సత్రానికి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రతి నెల దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సత్రం ఆడిట్‌ను, నెల వారీ రిజిస్టర్ సైతం దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ సత్రాలపై అజమాయిషీ క్రమక్రమంగా కోల్పోతూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్ల సంవత్సర వేడుకలు, కేక్ కటింగ్‌లు, బర్త్‌డే వేడుకలు, సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేయడం తదితర కార్యక్రమాలు సత్రాల్లో చోటు చేసుకున్నా చర్యలు తీసుకోవడం లేదు. పోలీసుల నిఘా శూన్యం.. శ్రీశైల క్షేత్రంలో ప్రైవేట్ సత్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, భక్తులకు వసతి గదులు కేటాయించేటప్పుడు నిబంధనలు, ఆధార్, రేషన్‌కార్డు, పూర్తి వివరాల సేకరణ, గదులు ఒకరోజు మాత్రమే కేటాయింపు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిప్రమాదం జరిగితే బయటికి వెళ్లేందుకు మార్గం, పార్కింగ్, అనుమానిత వ్యక్తులపై నిఘా తదితర నిబంధనలను ప్రైవేట్ సత్ర నిర్వాహకులు పాటిస్తున్నారా.. లేదా అనే విషయాలను తరచూ పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుండాలి. ఆ దిశగా పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనిసిస్తుంది. 48 గంటల కంటే ఎక్కువ రోజులు వసతి గది కేటాయించకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా వడ్డెర సత్రం నిర్వాహకు లు వసతి గది కేటాయించడం వెనుక దేవస్థాన అధికారులు, పోలీసు శాఖ నిర్లక్ష్యం ఉందని తెలుస్తుంది. తరచూ క్షేత్రంలోని పలు సత్రాలపై కార్డెన్‌సెర్చ్ లాంటి తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు. -
పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం పరమేశ్వరుడుకి ప్రీతికరమైన రోజు కావడంతో దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
మల్లన్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు నేడు విడుదల
శ్రీశైలం టెంపుల్: సెప్టెంబర్ మాసానికి సంబంధించి స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, ఆర్జితసేవాటికెట్లను మంగళవారం విడుదల చేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఈఓ మాట్లాడుతూ భక్తులు సులభంగా ఆయా టికెట్లు పొందేందుకు వీలుగా 90శాతం టికెట్ల ను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామన్నారు. మిగిలిన 10 శాతం టికెట్లను ఏపిటిఎస్ వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చన్నారు. స్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 14 రకాల ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా దర్శనం, ఆర్జితసేవా టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 27న విద్యార్థులతో పీఎం ముఖాముఖి నంద్యాల (న్యూటౌన్): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ‘మై భారత్ యువ కనెక్ట్ ప్రొగ్రామ్’లో భాగంగా ఈనెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శిశకళ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారన్నారు. పీజీఆర్ఎస్కు 113 వినతులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 113 వినతులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్షొరాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల్లో అధికంగా ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, అత్తింటి వేధింపులు లాంటి కేసులు వస్తున్నాయన్నారు. ఇందులో క్రిమినల్ కేసులుగా పరిగణించే ఫిర్యాదులకు సత్వరమే స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడామన్నారు. పీజీఆర్ఎస్ నుంచి స్టేషన్‌కు వెళ్లిన ఫిర్యాదును పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలంలో అపచారం ● గర్భగుడిలోకి చెప్పులతో ప్రవేశించిన మహిళ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో భద్రతా వైఫల్యంతో అపచారం చోటుచేసుకుంది. దేవస్థాన అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ చెప్పులు ధరించి గర్భగుడిలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో శ్రావణ శుక్రవారం రోజున ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి ఓ మహిళ చెప్పులు ధరించి ఆలయంలోకి ప్రవేశించింది. ఎస్కేడీ గేటు వద్ద నుంచి ధ్వజస్తంభం మీదుగా స్వామివారి దర్శనానికి ఆ మహిళ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచిన తరువాత కంటితుడుపు చర్యగా ఉచిత క్యూలైన్ వద్ద ఆ రోజు విధులు నిర్వర్తించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై వేటు వేశారు. వీరి విధులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం నంద్యాల (వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని రాయలసీమ జేఏసీ నాయకులు సీనియర్ న్యాయవాదులు ప్రతాపరెడ్డి, ఓబుల్ రెడ్డి, చేపురి మద్దిలేటి అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కర్నూలులో కూటమి ప్రభుత్వం శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకుండా సర్క్యూట్ బెంచ్, మొబైల్ బెంచ్ అంటూ ప్రచారం చేయడం తగదన్నారు. శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు సోమవారం నుంచి శనివారం వరకు విధులకు దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో న్యాయవాదులు రామచంద్రారావు, వివేకానంద రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, సాయిరాం, నూర్ ఆలం ఖాద్రి, కృపావతి, రఘుప్రకాష్, శ్రీనివాసులు, ప్రసాద్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను ప్రారంభించే తీరిక లేని కోట్ల
● బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్: రూ.3కోట్ల వ్యయంతో గత ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మించిన నూత న ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని రెండేళ్లు గడిచినా ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డిని నిలదీశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడు తూ ఆదివారం ఎంిపీడీఓ కార్యాలయాన్ని క్యాబినెట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ప్రారంభిస్తే ఆయనతో పాటు డోన్ ఎంపీపీ రేటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, పార్టీ వలంటీర్ విభాగం జిల్లా అధక్షులు పోస్టు ప్రసాద్ తది తరులపై అక్రమ కేసులు బనాయించి వేధించడం టీడీపీ దుర్మార్గపు రాజకీయానికి నిదర్శనమన్నారు. 2020–23 మే నెల 26న రూ.1.5 కోట్లతో ఎంపీడీఓ భవనాన్ని నిర్మించేందుకు ఆర్థిక మంత్రిగా తాను భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే తలమానికంగా భవనాన్ని తీర్చిదిద్దేందుకు జెడ్పీ చైర్మన్ అదనంగా మరో రూ.1.5 కోట్లు జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు జరుగకుండా అడ్డుకోవడ మే కాకుండా నిర్మించిన అనేక భవనాలను రాజకీయ దురుద్ధేశంతో ప్రారంభించకుండా శిథిలావస్థ కు చేరుకునేలా ప్రవర్తిస్తుండాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకి తీరిక లేదా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలేజ్ క్లీనిక్, రైతు భరోసా, గ్రామ సచివాలయ, అంగన్వాడీ, పాఠశాలల అదనపు గదులు, క్లబ్ హౌస్, రిజిస్టర్ కార్యాలయ భవనాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వీటితో పాటు వెంకటాపురం తుమ్మల చెరువు, వెంగలాంపల్లె చెరువులో టూరిజం స్పాట్లను ప్రారంభించే తీరిక కూడా డోన్ ప్రజా ప్రతినిధికి లేక పోవడం దురదృష్టకరమన్నారు. డోన్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించా లని పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలతో కలిసి ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి అనేక సార్లు స్వయ ంగా కలిసి కోరినా ఎమ్మెల్యే కోట్ల వాయిదాలు వేస్తూ అవమానించారన్నారు. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం అయిపోయిన తరువా త భవనాన్ని ప్రారంభించాలనుకోవడం చూస్తే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు సకాలంలో సత్వరంగా అందేటట్లు ఎమ్మెల్యే కోట్ల కృషి చేయాలని మాజీ మంత్రి బుగ్గన హితవు పలికారు. జెడ్పీ చైర్మన్‌తో సహ 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు యాక్ట్ 30 అమలులో ఉన్న సమయంలో డోన్‌లో ఎంపీడీఓ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం చట్టరీత్యా నేరమని, ఈ మేరకు జెడ్పీ చైర్మన్‌తో సహ 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం నేరంగా పరిగణిస్తున్నామన్నా రు. శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో కుట్ర పూరితంగా వ్యవహరించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, వైస్సార్సీపీ సీనియర్ నేతలు పోస్టు ప్రసాద్, సోమేష్‌యాదవ్, మల్లెంపల్లె రామచంద్రుడు, మల్లికార్జునరెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఓబులాపురం సుధాకర్‌యాదవ్, తాడూరు ఎర్రిస్వామి, రామేశ్వరరెడ్డి, పూజారి వంశీకృష్ణ, జాకీర్ హుస్సేన్, లక్ష్ముంపల్లె ఓబులేసు, సయ్యద్ మన్సూర్‌తో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా పోలీసులు వీరిని మెజిస్ట్ట్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండ్ కోరగా పోలీసుల వాదనను తోసిపుచ్చారు. -
మిన్నంటిన నినాదాలు..
పోలీసులు, ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో రోడ్లపై తిరగాడేందుకు, శాంతియుతంగా ప్రాజెక్టులను చూసేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా సీఎం చంద్రబాబునాయు డు పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘మేము ఏమైనా నక్సల్స్మా.. టెర్రరిస్టులమా.. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అటకాయించటం సమంజసం కాదు’ అంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. రైతులపై పోలీసు జులం నశించాలంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగునీరివ్వని చంద్రబాబునాయుడు డౌన్ డౌన్.. రైతులకు సాగునీరివ్వకపోవటం సిగ్గు..సిగ్గు.. సాగునీరిచ్చేవరకు పోరాడతాం.. రైతుల ఐక్యత వర్దిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. చివరికి బారికేడ్లు తీసుకొని నడుచుకుంటూ పోతులపాడు వైపు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు నిలువరించారు. ‘పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం, పోలీసులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంది.. అన్ని రోజులు ఒకేలా ఉండవని పోలీసులు గుర్తుంచుకోవాలి’ అంటూ శైలజానాథ్, కాటసాని, శిల్పా హెచ్చరించారు. విలేకరుల సమావేశం అనంతరం వారు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అనుమతితో రావాలని నేతలకు డీఎప్పీ సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 1.10 గంటలకు వెనుదిరిగారు. -
రైతులతో కలసి ఉద్యమిస్తాం
రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా విడుదల చేయకపోతే రైతులతో కలసి ఉ ద్యమిస్తాం. పోతిరెడ్డిపాడు వద్ద పరిస్థితి చూసి వాస్తవాలను తెలుసుకోవడానికి వస్తే పోలీసులు సహకరించాల్సిందిపోయే అడ్డుకుంటే ఎలా?. గోరుకల్లు చూడటానికి వెళ్లితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సార్బీసీ నుంచి 19 టీఎంసీల నీటిని రావాల్సిన పరిస్థితి ఉంది. మన హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఎన్ని ఉన్నాయని తెలుసుకునే హక్కు వైఎస్సార్సీపీ నాయకులకు లేదా..? రాయలసీమ రైతులకు న్యాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. హంద్రీనీవా కాలువ వెంట మోటార్లు వేసుకొని పంటలు పండించుకుంటే పోలీసులు మోటార్లు ఎత్తుకుపోవడం దారుణం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు 85 శాతం పూర్తయితే మోటార్లు కూడా బిగించుకోలేకపోతే ఎలా. శ్రీశైలం డ్యాం నీళ్లు తెలంగాణకు తరలిస్తే చూస్తూ ఊరకోం. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు -
పోలీసు దిగ్బంధంలో పోతిరెడ్డిపాడు..
వైఎస్సార్సీపీ నాయకులు ఎట్టిపరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లకూడదనే కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్ అధ్వర్యంలో పోలీసులు పోతిరెడ్డిపాడుకు వెళ్లే దారుల్లో బారికేడ్లతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకున్నారు. పాములపాడు మీదుగా ఎస్సారెమ్సీ కాల్వ ఎడమగట్టు వెంట పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు చేరుకునేందుకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వారి వాహనాల్లో కాల్వ 0.6 కిలో మీటరు వద్దకు చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రైతులతో కాసేపు మాట్లాడి, సమస్యలను తెలుసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కడప జిల్లా ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, నాయకులు మాసీమబాబు, గుండం సూర్య ప్రకాశ్‌రెడ్డి, సూర్య నారాయణరెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ సాయినాథ్‌రెడ్డి, షేక్ బాబులాల్, సంయుక్త కార్యదర్శులు గంధం రాఘవరెడ్డి, జెడ్పీటీసీలు పోచా జగదీశ్వరరెడ్డి, పర్వత యుగంధర్‌రెడ్డి, మండలాల కన్వీనర్లు పుల్యాల నాగిరెడ్డి, లోకేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, స్థానిక నాయకులు నాగార్జునరెడ్డి, నరేష్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తిరుమల్లేష్రెడ్డి, మద్దిలేటిరెడ్డి, వెంకటరమణ, చిన్నమల్లయ్య, సుంకన్న, మల్లారెడ్డి, అశోక్‌రెడ్డి, సురేష్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్ట్‌లు సీఎం శిష్యుడికి తాకట్టు
రాయలసీమ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ను తెలంగాణకు అమ్మేశారు. చీకటి ఒప్పందం కారణంగానే సీమను ఏడారిగా మార్చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం రోజుకు నాలుగు టీఎంసీలు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు. రాయలసీమ కరువుతో అల్లాడిపోతుంటే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉన్నా ఎందుకు చోద్యం చూస్తున్నారు. శ్రీశైలం నిండా నీళ్లున్నా ప్రాజెక్ట్‌లను నింపకపోవడం వెనుక కుట్ర దాగి ఉంది. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు చులకన. నికర జాలాలతో సీమ ప్రాజెక్టులను నింపండి. తుంగభద్రలో రావాల్సిన వాటా కాలువలకు విడుదల చేయాలి. వరి, వేరు శనగకాయలు వేసుకోవద్దు అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పందంగా ఉంది. నీళ్లులేకుండా పండించే పంటలు ఏవైనా ఉంటే రైతులకు చెప్పాలి. – సాకే శైలజనాథ్, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి -
దుర్మార్గపు పాలనను అంతమొందిద్దాం
మహానంది: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందిద్దామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. బాబు రెండేళ్ల పాలన అంతా దగానే అని, ఏ ఒక్క ఎన్నికల హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. మహానందిలోని శాలివాహన అన్నసత్రం ప్రాంగణంలో ఆదివారం మహానంది మండల రైతులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని, రైతుల కంట కన్నీరు వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా పంట పొలాలకు నీళ్లిచ్చామని, ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవ్వకపోడం దారుణమన్నారు. వారం రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు కులమే మన కులమని, రైతుల కోసం ఎంతటి పోరాటానికై నా వెనుకాడనని అన్నారు. జగన్ మోహన్‌రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే చంద్రబాబునాయుడు తెలంగాణ వాళ్లకు సమాచారం ఇచ్చి వారి ద్వారా నేషనల్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ వాళ్లు అన్యాయంగా ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందుకే చంద్రబాబు అక్కడి నుంచి వచ్చారన్నారు. ఎమ్మెల్యే బుడ్డాకు రైతుల కష్టాలు పట్టవా? రైతుల కష్టాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడకపోవడం బాధాకరమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మీ గ్రామాలకు వస్తే సాగునీటి విడుదలపై నిలదీయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టుల తరహాలో పోరాడాలని, త్వరలో ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా రైతులు, ప్రజలు సంఘటితమై చలో వెలుగోడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి.. అధికారం కోసం చంద్రబాబునాయుడు మాయమాటలతో పాటు అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని శిల్పా అన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇలాంటి అనేక హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బాబుకు ఓటుతో సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో మహానంది మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మా మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా మధుసూదన్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి ఏవీ కృష్ణారెడ్డి, రైతు విభాగం నాయకులు బాల వెంకటరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, సాగేశ్వరరెడ్డి, జయనారపురెడ్డి, రఘురామిరెడ్డి, గోపాల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి శివయ్య పాల్గొన్నారు. కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు మహానందిలో మనం చేసిన పనులకే మళ్లీమళ్లీ ప్రారంభ పూజలు వారం రోజుల్లో రైతులకు నీళ్లు ఇవ్వకపోతే యుద్ధమే ఎమ్మెల్యే బుడ్డా అసెంబ్లీలో మాట్లాడకపోవడం బాధాకరం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
వరి నాట్లకు నీళ్లు లేవు
మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం. నాలుగు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరాలో మిర్చి సాగు చేశాం. ఒక ఎకరాలో వరి సాగు చేయడానికి 45 రోజుల క్రితం నారుపోశాం. బోరులో నీరు లేకపోవడంతో వరి నాట్లకు అవకాశం లేకుండా పోయింది. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ ఆరిపోవడంతో పత్తి ఎండిపోతోంది. పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. కోసిగి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి. – పి.బషీర్, కామన్‌దొడ్డి, కోసిగి మండలం -
టీడీపీ కార్యకర్తల వీరంగం
డోన్: రౌడీషీటర్లు, మట్కాబీటర్లను వెంట వేసుకొని టీడీపీ కార్యకర్తలు ఆదివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన ఎంపీడీఓ భవనం వద్ద బీభత్సం సృష్టించారు. పట్టణానికి తలమానికంగా రూ.2 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించిన కొద్ది గంటలలోపే టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. పాతపేటకు చెందిన 4వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ సుధీష్‌తో పాటు కటిక రమణ(మట్కాబీటర్), గొల్ల రవి అనే పాత నేరస్తునితో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు పెద్ద బండరాళ్లతో గేటు తాళాన్ని బద్దలు కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా సర్దిచెప్పి పంపించేశారు. కాగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరెడ్డి ఆదివారం రాత్రి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 24వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు. ఘాటెక్కిన ఉల్లిధర నంద్యాల(న్యూటౌన్): ఉల్లిధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కనీళ్లు తెప్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కిలో ఉల్లిపై రూ.20 నుంచి రూ. 25 ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతుంది. పెరుగుతున్న ధరను చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉల్లి వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తి లేదు. దీంతో ఇంతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఉల్లి ధరలు కూడా పెరుగుతుండటంతో నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు కర్నూలు(సెంట్రల్): ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు అన్నారు. ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా గౌరవాధ్యక్షులు యస్.ఇస్మాయిల్, పూజారి లక్ష్మయ్య, ఐ.మరియానందం మాట్లాడారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలన్నారు. జీతాలకు – ఐ గాట్ కర్మ యోగి యాప్ లకు ముడిపెట్టరాదని సూచించారు. -
డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంది. కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 6 నుంచి మొదలైంది. ఈ నెల 27వ తేది రాత్రితో ఈ గడువు ముగియనుంది. మొదటి విడతలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే వివిధ కళాశాలలకు ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకునేందుకు చివరి అవకాశం ఈ నెల 28వ తేదీ వరకు ఉంది. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ) అమల్లో భాగంగా డిగ్రీ కోర్సులను సమూల మార్పులతో తీర్చిదిద్దిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ అడ్మిషనన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. వాటిని హెల్ప్ లైన్ కేంద్రాల్లో ఆన్లైన్లోనే పరిశీలన చేస్తున్నారు. తదుపరి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. గత ప్రభుత్వ సంస్కరణల బాటలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం విద్యారంగంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ గత రెండేళ్లుగా ఇదే విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు 88 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 2న కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 3న తరగతులు ప్రారంభమవుతాయి. 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మార్చుకునేందుకు 28 వరకు తుది అవకాశం సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు వచ్చేనెల 3నుంచి తరగతులు ప్రారంభం -
భక్తులతో పోటెత్తిన ఉరుకుంద
కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రంలో రెండో, మూడో సోమవారం సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలే ఉన్నాయి. రెండో సోమవారం స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది ఆదివారమే వచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆధికారులు ప్రత్యేక, శీఘ్ర, అతిశీఘ్ర, ఉచిత, వీఐపీ దర్శన అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. రాత్రంతా దర్శనాలు ఉంటాయని, రాత్రి 12 గంటల అనంతరం పూజల కోసం అరగంట పాటు దర్శనాలు ఉండబోవని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. చాలా మంది భక్తులు ఆలయంలో ఆరుబయటే సేదతీరుతూ కనిపించారు. -
డోన్ ఎంపీడీఓ నూతన భవనం ప్రారంభం
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిని అభినందించిన ఎంపీపీడోన్: నూతన డోన్ మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ భవనంలో ఆధునిక వసతులు కల్పించేందుకు రూ.50 లక్షల జిల్లా పరిషత్ నిధులను కేటాయించినందుకు జెడ్పీ చైర్మన్‌కు ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్ కృతజ్ఞత తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1.5 కోట్లు వెచ్చించి అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. టీడీపీ నేతలతో గత రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామిల సమక్షంలో ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి తన సీటులో ఆశీనులయ్యారు. ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ యాదవ్, సుమిత్రమ్మ, రామలక్ష్మమ్మ, సునీత, జానకిరాముడు, రామలక్ష్మి, ఓబులేసు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ నాయకులు సోమేష్‌యాదవ్, మల్లికార్జునరెడ్డి, చిరంజీవి, పోస్టు ప్రసాద్, వేమారెడ్డి, మద్దిలేటి, రాజ్‌కుమార్, రాజు, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఆర్ఈ రాజవర్ధన్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
కూటమి నిర్లక్ష్యంతోనే కరువు
బండిఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని బూచిగా చూపుతూ సాగునీరు విడుదల చేయకుండా కరువును తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయిలో నిండినా రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేయక పోవడం వెనుక ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. శనివా రం ఆయన ఈర్నపాడు, లింగాపురం, పార్నపల్లి గ్రామాల్లో పర్యటించి సాగునీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించారు. నష్టపోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈర్న పాడు గ్రామ శివారులో బీటలు వారిన వరి పంటను పరిశీలించి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన పార్నపల్లి గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో రైతులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపుతున్న వివక్షను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం జలాశయం నిండినా తెలంగాణకు నీళ్లు.. రాయలసీమకు కన్నీళ్లే అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో దాదాపు 170 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎల్‌నినోతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎల్‌నినో.. ఎల్‌నినో అని విపరీత ప్రచారం చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రతిరోజూ నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తుంటే కూటమి ప్రభుత్వ కళ్లు మూసుకుందని విమర్శించారు. మండలంలో దాదాపుగా 6 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారని, రైతులు ఇప్పటికే ఎకరాకు రూ. 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారన్నా రు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగునీరు ఇవ్వకపోతే రైతులకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని, ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెలాఖరులో 500 ట్రాక్టర్ల్లతో రైతులను తరలించి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారు.. రైతు కష్టాలను విస్మరిస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చరిత్రలో రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో గొడవపడి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటారేమో అని ఎదు రు చూస్తే నిరాశే మిగిల్చారన్నారు. శిల్పా వెంట ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట రామిరెడ్డి, రామ సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ రమణ, నాయకులు గోపాల్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, బూరుగయ్య, గోపిరెడ్డి వెంకట రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, విష్ణు, జగన్ మోహన్ రెడ్డి, శివ లింగం పాల్గొన్నారు. శ్రీశైలం డ్యామ్‌లో నీరున్నా ఎందుకు విడుదల చేయరు రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
నంద్యాల(అర్బన్): వచ్చే నెలలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ సునీల్షోరణ్, డీఆర్ఓ రాము నాయక్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్ నుంచి 2,500 మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి సారించాల ని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే పండుగలు, కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో కలిసి కాలుష్యరహిత వినాయక చవితి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీబీఆర్‌లో 4.753 టీఎంసీలు వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో నీటి నిల్వ 4.753 టీఎంసీలకు చేరింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటిమట్టం 255.32 మీటర్లు (837.66 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం టీజీపీ లింక్ కాలువ ద్వారా వీబీఆర్‌కు 2,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి ఎలాంటి ప్రవాహం లేదని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ నుంచి సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉండగా.. వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. మల్యాల నుంచి కేసీకి నీటి పంపింగ్ నిలిపివేత జూపాడుబంగ్లా: మల్యాల ఎత్తిపోతల నుంచి కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిపివేశామని కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్యాల ఎత్తిపోతల పథకం ఓ పంపు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం వారం రోజులపాటు కేసీకాల్వకు పంపింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో మల్యాల నుంచి కేసీ కాల్వకు 0.2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ నీటిని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను నింపినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులమని లంచం అడిగితే ఫోన్ చేయండికర్నూలు: ఏసీబీ అధికారులమని బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కి కానీ, 9440446178 సెల్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు తెలిపారు. శనివారం ఎ.క్యాంప్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయన్నారు. కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడని, ఇదే తరహాలో అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించి రూ.2 లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించుకున్న ఘటనపై ఫిర్యాదు వచ్చిందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాపారులు, ఉద్యోగులు ఇలాంటి బెదిరింపు కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇవ్వకపోతే రైడ్ చేసి జైలుకు పంపుతామని బెదిరిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్, శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
● 24న పోతిరెడ్డిపాడు సందర్శన ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కల్లూరు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడు దల చేయకుండా రైతులను మోసం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడు తూ.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేస్తే పాణ్యం, బనగానపల్లె మండలాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భూగర్భ జలాలు సైతం పెరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం జీఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తుండటంతో జిల్లా ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. హంద్రీనీవా నీటితో జిల్లాలోని చెరువులను ముందుగా నింపాలని డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీకి నీరు విడుదల చేయించాలి.. ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వెంటనే గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయించాలని కాటసాని కోరారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు – నగరికి ఏ విధంగా నీటిని అందిస్తున్నారో అదే విధంగా ఎస్సార్బీసీకి కూడా నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ మోటార్ల ద్వారా తరలించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సాగునీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం మాజీ మంత్రి శైలజానాథ్‌తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులంతా కలిసి వెళ్తున్నామన్నారు. -
రాజీ అయ్యే కేసులను గుర్తించాలి
నంద్యాల (వ్యవసాయం): వివిధ పోలీస్ స్టేషన్లలో రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ అమ్మనరాజ, ఏఎస్పీ సుస్మిత పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు ఆవరణలో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్లలో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలకు సంబంధించిన కేసు లు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి రాజీ అయ్యేలా కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాజీ పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు. మెగా లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడం మాత్రమే లక్ష్యం కాదని, ప్రతి కేసు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన న్యాయం జరగడం ప్రధానమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో పాటు, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. -
తాగునీటికే ప్రాధాన్యత
కర్నూలు సిటీ: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతానికి తాగునీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుబాటులోని నీటిలో కనీసం ఆరుతడి పంటలకు ఏ మేరకు నీరిచ్చేందుకు సాధ్యమవుతుందో పరిశీలిస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కర్నూలు జిల్లా సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, జల వనరుల శాఖ ఎస్ఈ శైలేశ్వర్, ఎల్ఎల్సీ ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, డీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని.. 22 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. ముందస్తు అవగాహన కార్యక్రమాలతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగుతో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు నీటి లభ్యత అంచనా ప్రకారం 11.955 టీఎంసీల నీటి వాటా వచ్చిందని, ఇందులో ఇప్పటికే 1.5 టీఎంసీల నీరు వినియోగించుకోగా, ఇంకా 10.455 టీఎంసీ కోటా ఉందన్నారు. ఇందులో 4.5 టీఎంసీలు తాగునీటికి, 6 టీఎంసీలు సాగునీటికి, ఇది కూడా సాగులోని ఆరుతడి పంటలకు అందించేందుకు ఇన్చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్‌తో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఆరు అంశాలపై తీర్మానం చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా నీటి విషయంలో మొదటి నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. లద్దగిరి సమీపంలోని స్లూయిస్ నుంచి 150 క్యూసెక్కుల నీరు హంద్రీనదిలోకి విడుదల చేయాలన్నారు. నదిలో నీరు లేక తీర గ్రామాల్లోని బోర్లు ఎండి పోయి తాగునీటికి కోడుమూరు, కల్లూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతేడాది 52 టీఎంసీలకుపైగా నీరిచ్చామని చెబుతున్నా ఉలిందకొండ చెరువుకు, తడకనపల్లె చెరువుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. టీబీ డ్యాం గేట్ల మార్పుతో గతేడాది ఎల్ఎల్సీ ఆయకట్టుదారులు రబీ సాగు కోల్పోయారని.. ఈ ఏడాది ఎల్ఎల్సీ కా ల్వ నీటిపై ఆశతో సాగు చేసిన ఆరుతడి పంటలకైనా నీళ్లివ్వాలని ఎల్ఎల్సీ ప్రాజెక్టు చైర్మెన్ కోరారు. ఐఏబీకి గైర్హాజరైన మంత్రి, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు సాగునీటి సలహా మండలి అధికారిక సమావేశంలో టీడీపీకి చెందిన ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతిని స్టేజిపై కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. స్టేజీపై ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తిని ఓ వైపు చివరలో కూర్చోబెట్టి.. టీడీపీ మినహా ఏ అఽధికారిక హోదా లేని వైకుంఠం జ్యోతికి పెద్దపీట వేయడం చూస్తే అధికారులు ఏ స్థాయిలో అధికార పార్టీకి తలొగ్గి పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇకపోతే ఇంతటి కీలక సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చూస్తే జిల్లా రైతాంగంపై వారికున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. తుంగభద్ర డ్యాంలోకి ఇప్పటి వరకు 100 టీఎంసీల నీరు రాగా.. ప్రస్తుతం 94.742 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిలో తాగునీటికి పోగా, మిగిలిన నీటితో ఖరీఫ్‌లో సాగు చేసిన చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందే. హంద్రీనీవా కాలువ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన స్లూయిజ్‌ను పెంచాలి. హంద్రీనదిపై అనుకూలమైన చోట్ల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించేందుకు తీర్మానం చేయాలి. నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో ఈ రిజర్వాయర్లను హంద్రీనీవా నీటితో నింపుకునేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టును చేపట్టేందుకు ఐఏబీలో తీర్మానం చేయాలి. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆరుతడి పంటలకు సాగునీటి విడుదలపై పరిశీలన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ నూరల్ ఖమర్ -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.96 లక్షలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ గురువారం భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.96,53,938 వచ్చినట్లు ఆలయ డప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 13 కేజీల 450 గ్రాములు, బంగారం 6 గ్రాముల 300 మిల్లీగ్రాములు వచ్చినట్లు చెప్పారు. లోన్స్ పేరుతో సైబర్ మోసాలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): లోన్లు మంజూరు చేస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్న సైబర నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మరిన్ని డబ్బులు చెల్లించాలని కోరడం, లేదంటే ఫోన్ స్విచ్చాఫ్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే లోన్ ఆఫర్లు నమ్మవద్దన్నారు. ఓటీపీ, ఏటీఎం పీన్, సీవీవీ, బ్యాంకు వివరాలు ఎవరకీ చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలన్నారు. శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. ఎడమగట్టు కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జున సాగర్‌కు 40,751 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి 34,803 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 167.8764 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 875.90 అడుగులకు చేరుకుంది. బేతంచెర్లలో బాలుడిపై కుక్కల దాడి బేతంచెర్ల: కుక్కలు దాడిచేయడంతో బేతంచెర్లలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సయ్యద్ మహీర్ తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలకు శుక్రవారం సెలవు కావడంతో ఇంటి సమీపాన ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. బాలుడి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో కుక్కలు పారిపోయాయి. శరీర భాగాలతో పాటు చేతి సంకలో తీవ్రంగా గాయపడిన బాలుడిని శేషారెడ్డి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు 108లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఏడాది మే 2వ తేదీన ఇదే కాలనీలో నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ వీధి కుక్కలు దాడి చేయడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. -
మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు!
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలు పేకాట స్థావరాలుగా వెలుగొందుతున్నాయి. 2024లో సంజామల మండలంలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 80 మందిని అరెస్ట్ చేసి రూ.83,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 10 కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేసి రూ.63,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసులకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసి రూ.15,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొలిమిగుండ్ల మండలంలో రెండేళ్లలో 11 కేసులు నమోదయ్యాయి. కనకాద్రిపల్లి, కల్వటాలలో టీడీపీ నేతలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు.● ఆదోని ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు చెందిన జిన్నింగ్‌మిల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ్రామగ్రామాన పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. పేకాట నిర్వాహకులు టీడీపీ నేతలతోపాటు పోలీసులకు వారం వారం మూమూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం.● మార్చి 15వ తేదీన ఆస్పరి మండలం చిన్నహోతూరు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కర్నూలు స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.5.30 లక్షల నగదు, 17 సెల్ఫోన్లు, 8 బైక్‌లు స్వాధీనం చేసుకొని 18 మందిపై కేసు నమోదు చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 16 మందిపై కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు కొన్ని.. కోసిగిలో 2025 సంవత్సరంలో 12 పేకాట కేసుల్లో 48 మందిని అరెస్టు చేసి రూ.62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆరు పేకాట కేసులు నమోదు చేసి 18 మంది అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.24,800 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 19 మందిపై కేసులు నమోదు చేసి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసుల్లో 32 మందిని అరెస్టు రూ.1,73,950 స్వాధీనం చేసుకొని ఆరు బైక్‌లను సీజ్ చేశారు. 2026లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు రూ.26,700 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో మందిని అరెస్టు చేసి రూ.28,860 నగదును స్వాఽధీనం చేసుకోగా.. 2026లో మరో 8 మందిపై కేసులు నమోదు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి మండలంలో 2025 సంవత్సరంలో మూడు కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి రూ.34,630 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 16 కేసుల్లో 87 మందిపై కేసు నమోదు చేసి రూ.1,93,935 నగదును స్వాధీనం చేసుకున్నారు. 2026లో ఏడుగురిపై కేసు నమోదు చేసి రూ.17,230 స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు కర్నూలు నగరంలోని అద్దె భవనాల్లో నిర్వహణ చర్చనీయాంశంగా ఓ మొబైల్ వాహనం అడ్డాగా మారిన మంత్రి బీసీ నియోజకవర్గం ఆటగాళ్లకు ఆహ్వానం పలుకుతున్న కుందూతీరం ప్రత్యేక వాహనాల్లో కర్ణాటకలోని రాయచూరుకు.. పచ్చ నేతల అండతో మితిమీరిన జూదం -
దిగువ కాల్వకు నీరివ్వాల్సిందే
ఎమ్మిగనూరుటౌన్: తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఎల్లెల్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ నియోజవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బీఆర్ బసిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణం నుంచి ఎల్లెల్సీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వరినారుతో బైఠాయించి సాగునీరు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఈ మణికంఠకు అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రబీ సీజన్లో తుంగభద్ర గేట్ల మరమ్మతుల పేరుతో నీరివ్వకుండా అడ్డుకోవడంతో పంటలను కోల్పోయామన్నారు. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. చాలా మంది రైతులు నారుమళ్లు పోసి నీటి విడుదల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయకట్టు ఎండుతున్నా పట్టించుకోరా? రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి రైతులతో కలసి ఎల్లెల్సీ కార్యాలయం ముట్టడి డ్యామ్‌లో నీరున్నా ఎందుకు ఇవ్వడం లేదు.. తుంగభద్ర డ్యామ్‌లో నీటి కోటా ఉన్నా ఖరీఫ్ సాగుకు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఎల్లెల్సీ రైతుల బాధలు పట్టవా అని ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ కేశన్న, సోగనూరు భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, బుట్టారంగయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మల్లికార్జున రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూర్, మాచాని వెంకటేష్, కోటేకల్ లక్ష్మన్న, రంగస్వామి, సునీల్ కుమార్, సావిత్రమ్మ, భాస్కర్, రాముడు నియోజకవర్గంలోని రైతులు పాల్గొన్నారు. -
నీ ఇల్లు బంగారం కానూ..
పిట్ట కొంచెం.. కూత ఘనం. కూతనే కాదు.. దాని నైపుణ్యం ముందు ఇంజినీర్లు సైతం చిన్నబోవాల్సిందే. గిజిగాడు తన గూడు పని తనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గడ్డి పరకలు, పుల్లలు సేకరించి, ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అళ్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లనే మించిపోతాయి. అలాంటి ఒక్క గూడును చూస్తేనే ఆహా అని మురిసిపోతుంటాం. అలాంటివి పదుల సంఖ్యలో ఒకే చోట కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. క్రిష్టిపాడు సమీపంలో కుందూనది ఒడ్డున చెట్లకు గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తికి సిద్ధం అవుతున్నాయి. – దొర్నిపాడు -
ఉద్యోగంలో చేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుమతి దంపతులకు ముగ్గురు కుమారు లు. చివరి కుమారుడు ఎం. అశ్విత్(26) ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఉండగా, రెండో కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కాకినాడకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అశ్విత్‌కు ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు అన్న బైక్ తీసుకుని గురువారం రాత్రి సొంతూరుకు బయలుదేరాడు. మార్గమధ్య లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద రాజస్థాన్ డాబా వద్ద ప్రమాదవశాత్తు హైవే రైలింగ్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించగా కోలుకోలేక అశ్విత్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు నమోదు చేశామన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసిన యువకుడు తీరా ఉద్యోగంలో చేరే సమయంలో మృతి చెందడం విషాదం. -
నిర్లక్ష్యం ‘పెచ్చు’ మీరి.. పైకప్పు భయపెట్టి!
శ్రద్ధగా చదువుకోవాల్సిన విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 6 గదులు ఉండగా 5 గదులను వినియోగిస్తున్నారు. వరండాలో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. అక్కడే భయం గుప్పిట్లో విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు వెంటనే వరండా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మంత్రాలయం రూరల్ -
‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’పై ఇంటెలిజెన్స్ ఆరా
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో టీడీపీ ముఖ్య నేత అనుచరుడి దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’ కథనంపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది. టీడీపీ ముఖ్య నేత అనుచరుడి పేరు, పార్టీలో తనకు ఉన్న పదవి, ముఖ్య నేత అప్పగించిన బాధ్యతలు ఏంటి.. అని ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన దేవస్థానంలో అధికారులను బెదిరించి తన కార్యకర్తలకు ఇప్పించిన ఉద్యోగాలు, ఏజెన్సీలు, ఇంజినీరింగ్ టెండర్లు, తలనీలాలు టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై తన కార్యకర్తలతో చేయించిన దాడి గురించిన పలు విషయాలను ఇంటలిజెనన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తలనీలాల కాంట్రాక్టర్లను రింగ్ చేసి కమిషన్ దండుకున్న విషయాలను సైతం రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నేత అనుచరుడు దేవస్థానంలో చేస్తున్న దందాపై ఇంటెలిజెన్స్ అధికారులు ఒక నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు పార్టీ అధిష్టానానికి సైతం పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆస్పరి: ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రానికి వెళ్లే మలుపు దగ్గర శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆస్పరి సీఐ శ్రీనివాస్‌నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామతీర్థం క్షేత్రంలో వెలసిన గాయత్రీ మాత ఆలయంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజకు పత్తికొండ మండలం దేవనబండ గ్రామానికి చెందిన దామోదరమ్మ (75) వచ్చింది. పూజ ముగిసిన తరువాత స్వగ్రామానికి వెళ్లేందుకు మలుపు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం
ఆశలు ఎండిపోయి..వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలను చివరకు జీవాలకు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది 38 వేల హెక్టార్లలో పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. 20 వేల హెక్టార్లలో అత్యధికంగా పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టి రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు చేసి కంది పంట సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా వర్షాలు రాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. – ఆలూరు రూరల్కురుకుంద గ్రామంలో పత్తిపంటను గొర్రెలను వదిలేసిన దృశ్యం బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అభిషేకం, మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేపట్టారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. శ్రీమఠంలో.. మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర వరలక్ష్మీ పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో పూజలు చేపట్టారు. పూజా మందిరంలో లక్ష్మి పూజ, మూల, జయ, దిగ్విజయ రాముల పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే గ్రామ దేవత మంచాలమ్మకు విశేషాలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు కానిచ్చారు. -
విద్యుత్ తీగల దొంగ అరెస్ట్
సి.బెళగల్: పొలాల్లో వ్యవసాయ విద్యుత్ బోరు మోటార్లు, తీగలను అపహరిస్తున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో దొంగను అరెస్ చూపుతూ, కేసు వివరాలను వెల్లడించారు. సి.బెళగల్, గూడూరు మండలాల్లో రైతుల వ్యవసాయ విద్యుత్ బోరు మోటర్లు, తీగలు చోరీకి గురైనట్లు పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు చేపట్టగా.. గుండ్రేవుల గ్రామానికి చెందిన పాలాక్షి రెడ్డి నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సి.బెళగల్ మోడల్ స్కూల్ దగ్గర అరెస్ట్ చేసి, రిమాండ్ పంపారు. నిందితుడి నుంచి దాదాపు రూ.1.30 లక్షల విలువ చేసే 600 మీటర్ల కాపర్ వైరు, మూడు విద్యుత్ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుళ్లు ప్రసాద్, తిమ్మప్ప, క్రిష్ణగౌడ్, కానిస్టేబుళ్లు సత్యరాజు, శ్రీని వాసులు, సుధాకర్, జానకిరాముడును ఎస్ఐ అభినందించారు. గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ ● 82 గొర్రెలు మృత్యువాత తుగ్గలి: గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 82 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గిరిగెట్ల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గిరిగెట్ల గ్రామానికి చెందిన గొర్ల పక్కీరప్ప గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పక్కీరప్ప కుమారులు గొర్రెలు మేపుకుంటూ సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక డాబా వద్ద ఆదోని నుంచి గుత్తికి పశువులు తీసుకెళుతున్న ఆల్విన్ లారీ బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదవ శాత్తూ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 166 గొర్రెల్లో 82 మృత్యువాత పడగా..మరో 25కు పైగా తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధిత కాపరి వాపోయాడు. ప్రమాదస్థలాన్ని తుగ్గలి, జొన్నగిరి ఎస్ఐలు నరేష్, మల్లికార్జున పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్ఐ తెలిపారు. వాల్మీకి నగర్లో పోలీసుల సోదాలు ఆదోని: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్ ప్రాంతంలో డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆదోని వన్ టౌన్ సీఐ వెంకటరమణ, టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డితో పాటు టూ టౌన్, త్రీ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల ఎస్ఐలు, 25 మంది పోలీసులు వాల్మీకి నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని రౌడీషీటర్లు, అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో 10 లీటర్ల నాటు సారా లభించడంతో పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. శేఖర్‌పై ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే విధంగా వాల్మీకి నగర్ ప్రాంతంలో సుమారు 25 మోటార్ సైకిళ్లకు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేని వాటిపై జరిమానాలు విధించారు. కురువళ్లి చెరువు నిండేదెన్నడూ! ఆలూరు రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఒట్టిపోయాయి. నిండుకుండల్లా ఉండాల్సిన చెరువులు నేడు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. ఆలూరు మండలంలోని కురువళ్లి గ్రామ చెరువు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3 వందల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ చెరువు కింద రైతులు వరి, పత్తి తదితరులు పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులో చుక్కనీరు చేరలేదు. దీంతో బోర్ల ఎండిపోయాయని, చెరువు కింద పంట సాగు చేయకుండా పొలాలను బీడుగా వదిలేశామని రైతులు వాపోతున్నారు. -
తెలంగాణ సీఎంతో చంద్రబాబు చీకటి ఒప్పందం!
నంద్యాల: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందం చేసుకున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీరును తెలంగాణ రాష్ట్రానికి మళ్లిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, సాగునీటి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని రిజర్వాయర్లు, కాల్వలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ఇప్పటికి 4 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నాయన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ 12.5 టీఎంసీల సామర్థ్యం కాగా 6 టీఎంసీల నీరే ఉందన్నారు. అవుకు రిజర్వాయర్ 4.5 టీఎంసీల సామర్థ్యం కాగా ఒక టీఎంసీ మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను జైళ్లకు పంపారు! ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఆన్‌న్‌లైన్ అప్లికేషన్లు పెట్టించడం, పంపిణీలో రాజకీయ రంగులు పులమడం సిగ్గుచేటన్నారు. మద్దతు ధర అడిగిన రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు వంటి అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రంగంలో ఉంటారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏ స్థానం ఏకగ్రీవం కానివ్వమని, ప్రతి స్థానానికి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ మార్కె ట్ యార్డు చైర్మన్ పురుషోత్త్తం రెడ్డి, వైఎస్సార్సీపీ డోన్ నియోజకవర్గం పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సాగు, తాగునీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమను కరువు నుంచి మహానేత కాపాడారని గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి ఈ ప్రాంతానికి తీవ్రద్రోహం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తోడుకుంటున్నా, ఏపీ ప్రభుత్వంవాటా నీటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందన్నారు. నంద్యాల మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉందని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణ తాగునీటి అవసరాలు, మిట్నాల చెరువు నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయకపోతే, రైతులను సమీకరించి స్వయంగా వెళ్లి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. -
వారానికే ఒట్టిపాయె!
నీరు లేక ఒట్టిపోయిన హంద్రీ నదిగోరంట్ల గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఇరిగేషన్ అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 4 రోజుల పాటు హంద్రీనదికి నీటిని విడుదల చేశారు. అయితే హంద్రీనదికి నీటిని వదిలి వారం రోజులు కూడా గడవకముందే నీటి విడుదల నిలిపేశారు. దీంతో గ్రామంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. నీటి సమస్య పరిష్కరించాలంటూ రెండు నెలల పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే హంద్రీనదికి తూతూ మంత్రంగా నాలుగు రోజులు వదిలి బంద్ చేయడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని రోజులు హంద్రీనదికి నీటి విడుదల కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – కోడుమూరు రూరల్ -
శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులుశ్రీశైలం టెంపుల్: వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉచిత సామూహికవ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వీరికి కావలసిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. ప్రతి ఒక్కరికి వేర్వేరుగా కలశాలను నెలకొల్పారు. తొలుత మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై ఆశీనులను చేయించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా ఆవాహన చేశారు. శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమావిశేషాలను భక్తులకు తెలిపారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వక్షప్రసాదంగా తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీనును కూడా ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ స్థల పరిశీలన
కర్నూలు: ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆ శాఖ డీజీ వెంకట రమణ పరిశీలించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఆయన కర్నూలు చేరుకోని జిల్లా అధికారులతో కలిసి ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న 60 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతం ఇండిస్ట్రియల్ హబ్‌గా మారుతున్నందున అందుబాటులో ఫైర్ స్టేషన్ ఉండేందుకు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డీజీ వెంకట రమణ జిల్లా అధికారులకు సూచించారు. ఆయన వెంట రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ బాలరాజు, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ బజారి, నంద్యాల జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్ ప్రసాద్, తదితరులు ఉన్నారు. విధుల నుంచి సీఎస్ఓ తొలగింపు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం సీఐ, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధ్య ఫోన్ సంభాషణ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సంభాషణ వివాదంపై ఈఓ అంతర్గత విచారణ చేయించారు. దేవస్థాన నిబంధనలు అతిక్రమించి ఫోన్ ఆడియో లీక్ చేసి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించారనే కారణంతో సీఎస్ఓ బి. శ్రీనివాసరావుపై దేవస్థాన ఈఓ వేటు వేశారు. ఇంచార్జీ సీఎస్ఓగా పర్యవేక్షకులు మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించారు. పెట్టుబడి మట్టిపాలు నందికొట్కూరు: ఎల్‌నినో దెబ్బకు తొమ్మిది ఎకరాల మినుము పంటను రైతు ఆండ్రడ్డి వెంకటరెడ్డి శుక్రవారం దున్నేశారు. జూలై నెల మొదటి వారంలో మినుము పంటను రైతు సాగు చేశారు. మూడు ఎకరాలు సొంత భూమి, ఆరు ఎకరాలు భూమిని రూ. 20 వేల చొప్పున కౌలుకు తీసుకొని రైతు సా గు చేశారు. ఒక ఎకరాకు రూ. 26 వేలు ఖర్చు వచ్చిందని, తొమ్మిది ఎకరాలకు వెచ్చించిన పెట్టుబడి రూ.2.34 లక్షలు మట్టిపాలు అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. -
వేగంగా మారెమ్మ ఆలయ నిర్మాణం
● పుట్లూరులో రూ. 5 కోట్లతో కోవెల నిర్మాణంకృష్ణగిరి: రాజుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో శిల్పాలు మహా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిని పోలిన విధంగా మండలంలోని పుట్లూరు గ్రామంలో మారెమ్మ అమ్మవారికి నూతన దేవాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. రెండేళ్లుగా దాదాపు రూ.5 కోట్లతో ఆలయాన్ని అతి సుందరంగా నిర్మిస్తున్నారు. అమ్మవారికి వచ్చిన కానుకలతోపాటు, గ్రామస్తుల చందాలు, దాతల సహాయంతో వేగంగా పనులు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా భాద్రపద శుక్ల చతుర్ధశి మొదలు బహుళ చవితి వరకూ అమ్మవారికి బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలను తిలకించేందుకు రాయలసీమ జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. దేవాలయాన్ని మరో 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి నుంచి రాయిని తీసుకొచ్చి అక్కడే శిల్పులు సుందరంగా చెక్కి నిర్మిస్తున్నారని చెప్పారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. వి.గిరికుమార్‌రెడ్డి ప్యానల్ మాత్రమే పోటీకి దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్ష, కార్యదర్శులుగా వి.గిరికుమార్‌రెడ్డి, ఎం.వెంకటరాజులు ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా ట్రెజరర్ పునీత్, అబ్జర్వర్‌గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్ వ్యవహరించారు. వి.గిరికుమార్‌రెడ్డి ప్యానల్ అన్ని స్థానాలకు పోటీకి దిగింది. అయితే జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి మాత్రమే జిల్లా అధ్యక్ష స్ధానానికి పోటీ చేశారు. ఆయన తిరిగి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
సీఎం చీకటి ఒప్పందంతోనే నీటి కష్టాలు
● కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి ● శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల రైతులతో కలిసి నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పా సమీక్ష నిర్వహించారు. తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై రైతుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 857 అడుగుల మేర నీటి నిల్వలు ఉండి, 110 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, పశువుల తాగునీటి అవసరాలు తీర్చడానికై నా ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ఎడమ గట్టు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను దిగువ రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు నీటి సమస్య పొంచి ఉందని, ఈ పరిస్థితిలోనైనా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వెంటనే దృష్టి సారించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, సుజాతమ్మ, మహేశ్వరరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, సంజీవరెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం రైతు నాయకులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయాలి
బనగానపల్లె రూరల్: అవుకు రిజర్వాయర్‌కు జీఎన్ఎస్ఎస్ ద్వారా కాకుండా ఎస్సార్బీసీ ద్వారా నీటిని విడుదల చేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్వగృహంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీ కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటి విడుదల చేస్తే చిన్నచిన్న చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటాయన్నారు. అలాగే పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్‌ను నీటితో నింపడంతో ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. అవుకు రిజర్వాయర్‌ను నింపి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు విక్రయించేందుకే అని విమర్శించారు. హంద్రీనీవా, మల్యాల కాల్వలకు నీరు విడుదల చేస్తున్న అధికారులు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు అడ్డుకోవడం దారుణమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 35,315 క్యూసెక్కులు, ఏపీ 18,792 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారే కానీ.. రైతులకు సాగునీరు అందించలేకపోతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు స్పందించరు? ఎస్సార్బీసీకి నీటి విడుదలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేద ని మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా వారి లో చలనం కలగడం లేదన్నారు. రెండేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఒక్కొక్క ఎరువు బస్తాపై సుమారు రూ.1,500 వరకు ధర పెంచడం రైతులపై భారం మోపడమేనన్నారు. ధరలను నియంత్రించి, రైతులకు కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే పంపిణీ చేయాలని కాటసాని కోరారు. రైతుల పక్షాన పోరాటం.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీరు విడుదల చేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల నీటిని రైతుల అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలకు విక్రయించి లబ్ధిపొందాలనుకోవడం మంచిదికాదన్నారు. ఈ నీటిని దుర్వినియోగం చేస్తే రైతులతో కలిసి అవుకు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం కూడా చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం బాషా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు మళ్లించేందుకే జీఎన్ఎస్ఎస్ ద్వారా తరలింపు ప్రభుత్వం స్పందించకపోతే అవుకు ప్రాజెక్టును ముట్టడిస్తాం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురం
గోస్పాడు: ఎటువంటి కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురాన్ని గుర్తించినట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం సత్యనారాయణాపురంలో సద్భావన దివస్ ప్రాధాన్యత, మధ్యవర్తిత్వం 3.0 జాతీయ లోక్ అదాలత్‌పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రజలకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, వివాదాల నివారణ, వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, పరస్పర చర్చలు, రాజీ ద్వారా పరిష్కరించుకోవడం, అవసరమైనప్పుడు న్యాయ సేవలు పొందడం వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాన్ని కేసులు లేని గ్రామంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా వివాదాలకు దూరంగా, శాంతియుతంగా ఉండేలా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలచే సద్భావ ప్రతిజ్ఞను కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసాలను పక్కనబెట్టి హింసాత్మక మార్గాలను నిరాకరిస్తూ రాజ్యాంగ బద్ధమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, షహనా, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో 1,500 మంది ముత్తైదువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మూడవ శుక్రవారం ప్రత్యేకంగా శివసేవకులకు, నాల్గవ శుక్రవారం 750 మంది చెంచు ముత్తైదువులకు, 750 మంది సాధారణ ముత్తైదువులకు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మ వారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, లడ్డూప్రసాదం, శ్రీశైలప్రభ, తులసి, ఉసిరి మొదలైన దేవతావృక్షాలను, కై లాస కంకణాలను అందజేస్తామని అన్నారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించి, ధార్మిక చింతనను పెంపొందించుటకు వ్రతాలు నిర్వహిస్తున్నామన్నారు. వీబీఆర్‌కు నిలిచిన ఇన్‌ఫ్లో వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)కు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి 4.624 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి ఎలాంటి నీటి ప్రవాహం లేదని తెలుగు గంగ అధికారులు తెలిపారు. టీజీపీ లింక్ కాలువ నుంచి కూడా ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్‌వే ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు. లోకో ఫైలెట్ సమయస్ఫూర్తి ● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు డోన్ రూరల్: డెమో రైలు లోకో ఫైలెట్ సమయస్ఫూర్తితో ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. గురువారం సాయంత్రం డోన్ నుంచి కర్నూలుకు గుంతకల్ డెమో రైలు బయలుదేరింది. అయితే స్థానిక రాముల దేవాలయం సమీపంలో రైలు పట్టాలపై మతిస్థిమితం లేని మహిళ (70) పడుకుని ఉండటంతో లోకో ఫైలెట్ దూరం నుంచి గమనించి రైలు నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో ఆమెను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. తన వివరాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేని స్థితిలో ఉంది. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన డెమో లోకో ఫైలెట్‌ను పలువురు అభినందించారు. స్వల్ప కాలిక పంటలు సాగు చేసుకోవాలి నంద్యాల(అర్బన్): వరి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా స్వల్ప కాలిక పంటలైన ఉలువలు, మినుములు, కొర్ర వంటి పంటలు సాగు చేసుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ కవిత, డీడీఏ గంగాధర్‌రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం శిక్షణ, సందర్శన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో సాగు అవుతున్న పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే రైతులు లాభాలను గడించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ ఖాద్రి, పీరానాయక్, తదితరులు పాల్గొన్నారు. క్వింటా ఉల్లి రూ.3,749 కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర జోరుమీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలు కేవలం రెండు లాట్లు మాత్రమే వచ్చాయి. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక లాట్‌కు రూ.3,569, మరో లాట్‌కు రూ.3,749 ధర లభించడం విశేషం. -
ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించాలి
నంద్యాల: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నెల తనిఖీల్లో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్ గోడౌన్లో గురువారం కలెక్టర్ రాజకుమారి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సీలింగ్, ఫైర్ సేఫ్టీ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథన్, ఎలక్షన్ డీటీ మనోహర్, నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి అక్రమ రవాణా
● విజిలెన్స్ దాడుల్లో మూడు ఇసుక, రెండు మట్టి టిప్పర్ల పట్టివేతమంత్రాలయం: ఇసుకాసురులు హద్దులు దాటుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇసుక దందాను దర్జాగా నడుపుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 5 టిప్పర్లు పట్టుబడ్డాయి. వివరాలివి.. కౌతాళం మండలం గుడికంబాళి, నదిచాగిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఇసుకను తెచ్చుకుంటారు. అయితే కొందరు స్వార్థపరులు రీచ్‌లపై పడ్డారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుకను గుట్టుగా తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి మైనింగ్ విజిలెన్స్ అధికారులు అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడికంబాళి నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లకు (ఏపీ 39 డబ్ల్యూక్యూ 6839, ఏపీ 39 డబ్ల్యూపీ 8439, ఏపీ 39 డబ్ల్యూఏ 8752) అనుమతులు లేవని గుర్తించి మాధవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అలాగే మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు మట్టి టిప్పర్లు పట్టేశారు. నందవరం మండలం గంగవరం నుంచి మట్టిని స్థానిక బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మిగనూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టి మాఫియా సాగిస్తున్నారు. పట్టుబడిన రెండు టిప్పర్లు (కేఏ 36 సీ 9316, ఏపీ 39 యూఎం 1187)ను మంత్రాలయం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
బొలెరో బోల్తా.. ఒకరి మృతి
● 13 మందికి గాయాలు శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం దిగువ భాగంలోని మలుపు వద్ద బుధవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సోముల నాయక్ (60) చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. 60 ఏళ్ల వయసున్న బిక్యా నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అచ్చంపేట తాలూకా బుడ్డా తండాకు చెందిన 14 మంది మత్స్యకారులు కూలి పనులకు దోర్నాల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అచ్చంపేటకు వెళుతుండగా డ్యాం వద్ద ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం డ్యాం సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేశారు. జీవాలకు మేతగా మొక్కజొన్న పంట చాగలమర్రి: ఎన్నో ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేయగా సరిగా మొలవకపోడం, పైరు ఎదుగుదల లేక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కౌలు రైతు బాధను దిగమింగుకొని జీవాలకు మేతగా వదిలేశాడు. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన దాదనగాళ్ల చాంద్ బాషా రూ.40 వేలు చెల్లించి రెండెకరాల పొలంను కౌలుకు తీసుకొని రూ.70 వేలు ఖర్చు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే వాతావరణ మార్పుల వల్లనో, నకిలీ విత్తనాల వల్లనో పంట సరిగ్గా మొలవలేదు. అలాగే పైరు ఎదుగుదల లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధను దిగమింగుకొని బుధవారం పంటను తొలగించే క్రమంలో మొక్కజొన్న పైరులో జీవాలను మేపడానికి వదిలేశాడు. నష్టాన్ని పూడ్చుకోవటానికి రెండెకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కౌలు రైతు చాంద్‌బాషా తెలిపారు. పంట నష్టపోయిన తనను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ● విద్యార్థికి తీవ్ర గాయాలుగుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్ అనే ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల పట్టణంలోని శ్యాం నగర్‌కు చెందిన మనోజ్ (26) గుత్తి మండలం సేవాఘడ్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత ఆరో తరగతి విద్యార్థి రిషిద్తో కలిసి బైక్‌లో గుత్తికి బయలుదేరారు. మార్గం మధ్యలో చెరువు కట్ట వద్ద గుంతకల్లు డిపో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన పీడీ మనోజ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి రిషిద్ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మనో జ్ పీడీగా ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ శోకసంద్రంలో నెట్టింది. ఘటనపై సీఐ రామారావు విచారణ చేపట్టారు. ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి బనగానపల్లె రూరల్: పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి హైదర్ సాహెబ్‌గారి ఆరీఫ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెరువుపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద అబ్బాస్ కుమారుడు ఆరీఫ్ గ్రామ సమీపంలోని తమ సొంత పొలంలో పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాడు. దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న ఆరీఫ్ కిందపడిపోగా.. ట్రాక్టర్ అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


