సాధారణ భక్తురాలుగా కలెక్టర్
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి ఉచిత క్యూలైన్‌లో సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో భక్తులతో మమేకమై వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ఉచితంగా అందిస్తున్న లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. లడ్డూ కౌంటర్ వద్ద టోకెన్ విధానం, భక్తుల రద్దీ నియంత్రణ పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్నప్రసాద వితరణ భవనానికి వెళ్లి అక్కడి భక్తులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌తో కలిసి పరిశీలించారు.
భక్తులతో కలిసి కూర్చ్చొని భోజనం చేస్తున్న కలెక్టర్ రాజకుమారి


